Indian Space Research Organisation
-
భారత ‘సూపర్ ఫోర్’
తిరువనంతపురం: భారత అంతరిక్ష చరిత్రలో మరో సువర్ణాధ్యాయానికి తెర లేచింది. మన అంతరిక్ష సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. మిషన్‌లో పాల్గొని రోదసిలోకి వెళ్లున్న నలుగురు భారత వ్యోమగాములను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జాతికి పరిచయం చేశారు. ఇందుకోసం ఎంపికైన గ్రూప్ కెపె్టన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ సుభాన్షు శుక్లా పేర్లను ఆయన స్వయంగా ప్రకటించారు. వీరు నలుగురూ భారత వాయుసేనకు చెందిన ఫైటర్ పైలట్లే. కేరళలోని తుంబలో ఉన్న విక్రమ్ సారాబాయ్ అంతరిక్ష కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో వారికి ప్రతిష్టాత్మకమైన ‘ఆస్ట్రోనాట్ వింగ్స్’ను మోదీ ప్రదానం చేశారు. అనంతరం భావోద్వేగపూరితంగా ప్రసంగించారు. దేశ అమృత తరానికి వారు అత్యుత్తమ ప్రతినిధులంటూ ప్రశంసించారు. ‘‘ఈ నలుగురు వ్యోమగాముల పేర్లు భారత విజయగాథలో శాశ్వతంగా నిలిచిపోతాయి. నాలుగు దశాబ్దాలుగా దేశం కంటున్న కలను వారు నిజం చేయనున్నారు’’ అంటూ కొనియాడారు. ‘‘వీళ్లు కేవలం నలుగురు వ్యక్తులో, నాలుగు పేర్లో కాదు. 140 కోట్ల మంది భారతీయుల కలలకు, ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలవనున్న నాలుగు ప్రబల శక్తులు!’’ అన్నారు. గగన్‌యాన్ మిషన్ పూర్తిగా దేశీయంగా రూపుదిద్దుకుని మేకిన్ ఇండియాకు తార్కాణంగా నిలిచిందంటూ హర్షం వెలిబుచ్చారు. ఏ విధంగా చూసినా ఇది చరిత్రాత్మక మిషన్ అని చెప్పారు. ‘‘గతంలో భారతీయ వ్యోమగామి వేరే దేశం నుంచి విదేశీ రాకెట్లో రోదసీలోకి వెళ్లొచ్చారు. మళ్లీ నాలుగు దశాబ్దాల తర్వాత భారత్ అంతరిక్షంలో అడుగు పెట్టబోతోంది. ఈసారి టైమింగ్, కౌంట్‌డౌన్, రాకెట్‌తో సహా అన్నీ మనం స్వయంగా రూపొందించుకున్నవే. గగన్‌యాన్ మిషన్‌లో వినియోగిస్తున్న ఉపకరణాల్లో అత్యధికం భారత్‌లో తయారైనవే. అంతరిక్ష రంగంలో భారత్ సాధిస్తున్న స్వావలంబనకు తార్కాణమిది’’ అన్నారు. ఈ అమృత కాలంలో భారత వ్యోమగామి దేశీయ రాకెట్లో చంద్రునిపై దిగడం ఖాయమని జోస్యం చెప్పారు. అంతరిక్ష శక్తిగా భారత్ భారత అంతరిక్ష రంగం సాధిస్తున్న ప్రగతి యువతలో శాస్త్రీయ జిజ్ఞాసను ఎంతగానో పెంపొందిస్తోందని, 21వ శతాబ్దిలో మనం ప్రపంచశక్తిగా ఎదిగేందుకు బాటలు పరుస్తోందని మోదీ హర్షం వెలిబుచ్చారు. ఇస్రో సాధించిన పలు ఘన విజయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘‘తొలి ప్రయత్నంలోనే అరుణగ్రహం చేరి అతి కొద్ది దేశాలకే పరిమితమైన అరుదైన ఘనత సాధించాం. ఒకే మిషన్‌లో 100కు పైగా ఉపగ్రహాలనూ రోదసిలోకి పంపాం. చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా రికార్డు సృష్టించాం. ఆదిత్య ఎల్1ను భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టాం. ఇలాంటి విజయాలతో భావి అవకాశాలకు ఇస్రో సైంటిస్టుల బృందం నూతన ద్వారాలు తెరుస్తోంది. ఫలితంగా అంతరిక్ష రంగంలో భారత్ ప్రపంచ వాణిజ్య హబ్‌గా మారనుంది. మన అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ రానున్న పదేళ్లలో ఐదింతలు పెరిగి 44 బిలియన్ డాలర్లకు చేరనుంది’’ అని చెప్పారు. ఇస్రో అంతరిక్ష మిషన్లలో మహిళా సైంటిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని మోదీ అన్నారు. చంద్రయాన్ మొదలు గగన్‌యాన్ దాకా ఏ ప్రాజెక్టునూ మహిళా శక్తి లేకుండా ఊహించుకోలేని పరిస్థితి ఉందన్నారు. 500 మందికి పైగా మహిళలు ఇస్రోలో నాయకత్వ స్థానాల్లో ఉన్నారంటూ హర్షం వెలిబుచ్చారు. కార్యక్రమంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్‌ఖాన్, సీఎం పినరాయి విజయన్, కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్, ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్, సైంటిస్టులు తదితరులు పాల్గొన్నారు. వారిది మొక్కవోని దీక్ష గగన్‌యాన్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో నలుగురు వ్యోమగాములూ అత్యంత కఠోరమైన శ్రమకోర్చారంటూ మోదీ ప్రశంసించారు. ‘‘అత్యంత కఠినమైన శారీరక, మానసిక పరిశ్రమతో పాటు యోగాభ్యాసం కూడా చేశారు. ఆ క్రమంలో ఎదురైన ఎన్నో సవాళ్లను మొక్కవోని పట్టుదలతో అధిగమించారు. రోదసి మిషన్ కోసం తమను తాము పరిపూర్ణంగా సన్నద్ధం చేసుకున్నారు’’ అన్నారు. వారు దేశంలోని పలు ప్రాంతాలతో పాటు 13 నెలలు రష్యాలోనూ శిక్షణ పొందారు. మానవసహిత గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా 2025లో ముగ్గురు వ్యోమగాములను రోదసిలో ని 400 కిలోమీటర్ల ఎత్తులోని భూ దిగువ కక్ష్యలోకి పంపి 3 రోజుల తర్వాత సురక్షితంగా వెనక్కు తీసుకురావాలన్నది ఇస్రో లక్ష్యం. ఇది విజయవంతమైతే అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలవనుంది. గగన్‌యాన్ మిషన్‌కు రూ.10 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. హాయ్ వ్యోమమిత్రా గగన్‌యాన్ మిషన్ ప్రగతిని విక్రం సారబాయి స్పేస్ సెంటర్లో మోదీ సమీక్షించారు. మిషన్‌కు సంబంధించిన పలు అంశాలను సోమనాథ్‌తో పాటు ఇస్రో సైంటిస్టులను అడిగి తెలుసుకున్నారు. మానవసహిత యాత్రకు ముందు గగన్‌యాన్‌లో భాగంగా రోదసిలోకి వెళ్లనున్న హ్యూమనాయిడ్ రోబో వ్యోమమిత్రతో సరదాగా సంభాషించారు. మహిళ ఎందుకు లేదంటే... గగనయాన్ మిషన్‌కు ఎంపికైన నలుగురిలో ఒక్క మహిళ కూడా లేకపోవడం ఆసక్తికరంగా మారింది. అంతరిక్ష యాత్రకు వ్యోమగాముల ఎంపిక ప్రక్రియే అందుకు కారణమని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి మిషన్లకు టెస్ట్ పైలట్ల పూల్ నుంచి మాత్రమే వ్యోమగాముల ఎంపిక జరుగుతుంది. అత్యున్నత వైమానిక నైపుణ్యంతో పాటు అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ నిబ్బరంగా వ్యవహరించగల సామర్థ్యం టెస్ట్ పైలట్ల సొంతం. గగన్‌యాన్ మిషన్‌కు ఎంపిక జరిపిన సమయంలో భారత టెస్ట్ పైలట్ల పూల్‌లో ఒక్క మహిళ కూడా లేరు. దాంతో గగన్‌యాన్ మిషన్‌లో మహిళా ప్రాతినిధ్యం లేకుండాపోయింది. భావి మిషన్లలో మహిళా వ్యోమగాములకు స్థానం దక్కుతుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ చెప్పారు. 3 ప్రాజెక్టులు జాతికి అంకితం సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): సమీప భవిష్యత్తులో చేపట్టనున్న భారీ రాకెట్ ప్రయోగాల నిమిత్తం సుమారు రూ.1,800 కోట్లతో నిర్మించిన మూడు ఇస్రో సెంటర్లను మోదీ తుంబా నుంచి వర్చువల్‌గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్లో పీఎస్ఎల్వీ ఇంటిగ్రేషన్ భవనం, ఇస్రో ప్రపొల్షన్ కాంప్లెక్స్‌లో సెమీ క్రయోజనిక్స్ ఇంటిగ్రేటెడ్ ఇంజన్ అండ్ స్టేజ్ టెస్ట్ ఫెసిలిటీ భవనం, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ట్రైనోసిక్ విండ్ టన్నెల్ భవనాలను అందుబాటులోకి తెచ్చారు. వీటిద్వారా ఏటా 8 నుంచి 15 పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాలతో పాటు మొదటి ప్రయోగ వేదికపై ఒకేసారి రెండు రాకెట్లను అనుసంధానం చేసుకునే వెసులుబాటు కలుగుతుంది -
‘స్పేస్’లో మన ప్రగతి గర్వకారణం!
సాక్షి, హైదరాబాద్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వంటి స్వదేశీ సంస్థల ప్రగతి భారతీయులందరూ గర్వంగా తలెత్తుకుని తిరిగేలా చేస్తోందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు. అయితే పరిశోధనల ఫలితాలు సామాన్య ప్రజలకు కూడా చేరినప్పుడే వాటికి సార్థకత అని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని భూభౌతిక పరిశోధన కేంద్రం (ఎన్జీఆర్ఐ)లో ‘రీసెంట్ ట్రెండ్స్ ఇన్ స్పేస్ సెక్టార్: న్యూ ఇండియా’ పేరిట జరిగిన ఒకరోజు సదస్సులో గవర్నర్ మాట్లాడారు. అంతరిక్ష రంగంలో ఇస్రో ఘనతలను కొనియాడారు. అంతరిక్ష రంగంలో జరిగిన పరిశోధనలు వివిధ రూపాల్లో సామాన్యుడికి ఉపయోగపడ్డాయని వివరించారు. హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌లు స్కైరూట్, ధ్రువ స్పేస్‌లు దేశంలోనే మొదటిసారి ప్రైవేటుగా రాకెట్, ఉపగ్రహాలను విజయవంతంగా పరీక్షించడాన్ని గవర్నర్ అభినందించారు. 2026 నాటికి అంగారకుడిపైకి మనిషి.. అంతరిక్ష రంగంలో వస్తున్న మార్పులను పరిగణనలోకి తీసుకుంటే.. ఇంకో మూడేళ్లలోనే మనిషి అంగారక గ్రహంపైకి అడుగుపెట్టినా ఆశ్చ ర్యం లేదని ఇస్రో మాజీ చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ చెప్పారు. ప్రపంచంలో పౌర అవసరాలు తీర్చేందుకు అంత రిక్ష ప్రయోగాలు చేపట్టిన తొలి దేశంగా భారత్‌కు రికార్డు ఉందని, స్పేస్ టెక్నాలజీని గరిష్టంగా ఉపయోగించుకున్నదీ మన మేనని తెలిపారు. ప్రస్తుతం సుమారు 50 ఉపగ్రహాలు దేశానికి సేవలు అందిస్తున్నాయని.. పెరుగుతు న్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని వీటి సంఖ్య రెండు వందలకుపైగా ఉండాలని పేర్కొన్నారు. అరగంటలో ఖండాలు దాటేయవచ్చు.. అంతరిక్ష రంగంలో రానున్న పదేళ్లు చాలా కీలకమని దేశంలో తొలి ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ లిమిటెడ్ సీఈవో పవన్‌కుమార్ చందన తెలిపారు. ప్రపంచంలోని 90కిపైగా దేశాలకు తమవైన ఉపగ్రహాలు లేవని, యాభై శాతం జనాభాకు హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో లేదని వివరించారు. మరో పది, ఇరవై ఏళ్లలో కేవలం అరగంట సమయంలోనే ఖండాలను దాటేసేందుకు రాకెట్లను ఉపయోగించే పరిస్థితి రానుందని చెప్పారు. విమానాల మాదిరిగానే రాకెట్లను కూడా మళ్లీమళ్లీ వాడుకునే దిశగా స్కైరూట్ పరిశోధన చేపట్టిందని తెలిపారు. సెమినార్లో ధ్రువస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో నెక్కంటి సంజయ్, అకాడమీ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్ చైర్మన్, సీసీఎంబీ మాజీ డైరెక్టర్ సీహెచ్ మోహనరావు, ఎన్జీఆర్ఐ డైరెక్టర్ ప్రకాశ్ కుమార్, కేంద్ర ప్రభుత్వ ఎర్త్ సైన్సెస్ విభాగం కార్యదర్శి ఎం రవిచంద్రన్ పాల్గొన్నారు. -
నంబీ నారాయణ్‌కు పద్మపురస్కారమా? షాకింగ్..!
తిరువనంతపురం: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మాజీ శాస్త్రవేత్త నంబీ నారాయణ్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించడంపై కేరళ మాజీ డీజీపీ టీపీ సేన్‌కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ అంతరిక్ష పరిశోధన రహస్యాలను విదేశాలకు అమ్మేందుకు ప్రయత్నించారంటూ 1990లో క్రయోజనిక్ నిపుణుడైన నంబీ నారాయణ్ అభియోగాలు ఎదుర్కొన్నారు. ఇస్రోను కుదిపేసిన ఈ గూఢచర్య కేసులో నంబీతోపాటు మరో శాస్త్రవేత్త అయిన డీ శశికుమార్ అరెస్టయ్యారు. మాల్దీవులకు చెందిన మహిళలతో ఉండగా వారిని 1994లో అరెస్టు చేశారు. ఈ కేసు నుంచి పూర్తిగా నంబీ నారాయణ్ బయటపడకముందే ఆయనకు పద్మ పురస్కారాన్ని ఎలా ప్రకటిస్తారని మాజీ డీజీపీ సేన్‌కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఏ ప్రాతిపదికన ఆయనకు అవార్డు ఇచ్చారో అర్థం కావడం లేదు. తేనెలో విషం కలిపిన చందంగా ఇది ఉంది. ఇస్రో గూఢచర్య కేసులో సుప్రీంకోర్టు ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ విచారణ జరుపుతున్న దశలో అతని పేరును అవార్డుకు ఎలా పరిగణనలోకి తీసుకున్నారు’ అని సేన్‌కుమార్ ప్రశ్నించారు. ఆయన పేరును ప్రతిపాదించిన వ్యక్తులు మున్ముందు దీనిపై వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. నిజాయితీపరుడైన ఐపీఎస్‌గా పేరొందిన సేన్‌కుమార్ మూడేళ్ల కిందట డీజీపీ పదవి నుంచి తనను పినరయి విజయన్ ప్రభుత్వం తొలగిస్తే.. దీనిపై సుప్రీంకోర్టులో పోరాడి పదవిని తిరిగిపొందారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘నంబీ నారాయణ్ దేశానికి చేసిన సేవలేమిటి? ఆయనో మామూలు శాస్త్రవేత్త. ఇస్రో నుంచి స్వయంగా తప్పుకున్నాడు. ఆయనకు బదులు ఓ యువ శాస్త్రవేత్తకు ఈ పురస్కారం అందజేసి ఉంటే నేను సంతోషించి ఉండేవాడిని’ అని అన్నారు. ఇస్రో గూఢచర్యం కేసును ఇప్పటికీ సరిగ్గా దర్యాప్తు చేయలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు తనకు పద్మభూషణ్ పురస్కారం దక్కడంపై నంబీ నారాయణ్ సంతోషం వ్యక్తం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు బూటకమని, తాను అమాయకుడినని చాటడానికి ఈ పురస్కారమే నిదర్శనమన్నారు. -
జూలై 10న పీఎస్ఎల్వీ సీ28 ప్రయోగం
శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జూలై 10న పీఎస్ఎల్వీ సీ28ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. షార్‌లోని మొదటి ప్రయోగవేదికపై రాకెట్ అనుసంధానం పనులు పూర్తయ్యాయి. ఉపగ్రహాల అనుసంధానం మాత్రమే మిగిలివుంది. ఈ నెల 14న కెనడాకు చెందిన డీసీఎం-3 అనే మూడు ఉపగ్రహాలు షార్కు చేరుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షార్‌లోని క్లీన్‌రూంలో ఉపగ్రహాలకు శాస్త్రవేత్తలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇవి పూర్తయిన తరువాత మంగళవారం సాయంత్రం ప్రయోగవేదిక వద్దకు చేరుస్తారు. బుధవారం ఉపగ్రహాలను రాకెట్‌కు అనుసంధానం చేసి హీట్‌షీల్డ్ క్లోజ్ చేసే పనులు చేపట్టనున్నారు. ఆ తరువాత మిషన్ సంసిద్ధతా సమావేశం నిర్వహించి ప్రయోగ తేదీని అధికారికంగా ప్రకటిస్తారు. -
ఇస్రో ‘రామబాణం’!
‘పీఎస్ఎల్వీ సీ-27’ సూపర్ సక్సెస్ ఐఆర్ఎన్ఎస్ఎస్-1డీ ఉపగ్రహాన్ని నింగికి చేర్చిన రాకెట్ శ్రీహరికోట: శ్రీరామ నవమి పర్వదినమైన శనివారం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో గ‘ఘన’ విజయం సాధించింది. ఇస్రో కదనాశ్వమైన పీఎస్ఎల్వీ రాకెట్ మరోసారి ‘రామబాణం’లా తిరుగులేని సత్తా చాటింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుంచి నిప్పులు కక్కుతూ నింగికి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ-27 రాకెట్ ఐఆర్ఎన్ఎస్ఎస్-1డీ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీంతో అమెరికా, రష్యా, చైనాల మాదిరిగా మనకూ సొంత నావిగేషన్ వ్యవస్థ(జీపీఎస్) అందుబాటులోకి వచ్చేందుకు మార్గం సుగమమైంది. ఇప్పటిదాకా అమెరికాకు చెందిన జీపీఎస్ సేవలను వాడుకుంటున్న మనం ఇకపై.. త్వరలోనే మన సొంతదైన ‘భారత ప్రాంతీయ దిక్సూచీ ఉపగ్రహ వ్యవస్థ(ఐఆర్ఎన్ఎస్ఎస్)’ సేవలను ఉపయోగించుకోవచ్చు. ప్రయోగం జరిగిందిలా... శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం.. శనివారం సాయంత్రం 5:19 గంటలు.. మిషన్ కంట్రోల్‌రూంలో శాస్త్రవేత్తలు టెన్షన్‌గా గడుపుతున్నారు. ఐఆర్ఎన్ఎస్ఎస్-1డీ ఉపగ్రహంలో సాంకేతికలోపం ఏర్పడి మళ్లీ సిద్ధం చేస్తున్న ప్రయోగం కావడంతో ఉత్కంఠ. మిషన్ కంట్రోల్ రూం నుంచి టెన్, నైన్.. అంకెలు వినిపిస్తున్నాయి. త్రీ, టూ.. జీరో. అందరి చూపులు తూర్పు దిక్కుకు మళ్లాయి. నారింజరంగు నిప్పులు కక్కుతూ పీఎస్ఎల్వీ సీ-27 నింగికి ఎగిసింది. షార్ అంతటా వెలుగులను చిమ్ముతూ శ్రీరామనవమి రోజు రామబాణంలా దూసుకెళ్లింది. రాకెట్ ఒక్కో దశను సమర్థంగా దాటుతుండటంతో శాస్త్రవేత్తల వదనాల్లో చిరునవ్వులు కనిపించాయి. సరిగ్గా 19.25 నిమిషాలకు ఐఆర్ఎన్ఎస్ఎస్-1డీని కక్షలోకి ప్రవేశపెట్టడంతో శాస్త్రవేత్తల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఒక రినొకరు కౌగిలించుకుంటూ అభినందనలు తెలుపుకొన్నారు. ఇస్రో చైర్మన్‌గా ఏఎస్ కిరణ్‌కుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన తొలి ప్రయోగం విజయవంతం కావడంతో ఆయనతో పాటు శాస్త్రవేత్తలు హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. పీఎస్ఎల్వీసిరీస్లో ఇది 29వ ప్రయోగం కాగా, 28వ విజయం. ఆరు స్ట్రాపాన్ మోటార్లతో కూడిన పీఎస్ఎల్వీ సీ-27 రాకెట్ తొలి దశలో 138.2 టన్నుల ఘన ఇంధనం, రెండో దశలో 42 టన్నుల ద్రవ ఇంధనం, మూడోదశలో 7.6 టన్నుల ఘన ఇంధనం, నాలుగోదశలో 2.5 టన్నుల ద్రవ ఇంధనం సాయంతో నాలుగు దశలనూ విజయవంంతగా పూర్తిచేసింది. తర్వాత ఐఆర్ఎన్ఎస్ఎస్-1డీ ఉపగ్రహాన్ని రాకెట్ భూస్థిర బదిలీ కక్ష్యలోకి చేర్చింది. భూమికి దగ్గరగా (పెరిజీ) 284 కి.మీ., దూరంగా (అపోజీ) 20,650 కి.మీ. గల దీర్ఘవృత్తాకార భూస్థిర కక్ష్యలోకి 19.2 డిగ్రీల వాలులో ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టారు. ఐదు దశల్లో కక్ష్య పెంపుద్వారా ఉపగ్రహాన్ని 36 వేల కి.మీ. ఎత్తులోని కక్ష్యలోకి చేర్చనున్నారు. సొంత దిక్సూచీ వ్యవస్థ...అమెరికా, రష్యా, చైనాల మాదిరిగా సొంత ఉపగ్రహ దిక్సూచీ వ్యవస్థ ఏర్పాటు కోసం ఇస్రో ‘భారత ప్రాంతీయ దిక్సూచీ ఉపగ్రహ వ్యవస్థ(ఐఆర్ఎన్ఎస్ఎస్)’ను ఏర్పాటుచేస్తోంది. ఇందుకుగాను ఏడు ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉపగ్రహాలను నింగిలో మోహరించాల్సి ఉంది. అయితే, కనీసం4 ఉపగ్రహాలు పనిచేసినా ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఇస్రో ఇదివరకే 3 ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉపగ్రహాలను కక్ష్యకు పంపింది. తాజాగా నాలుగో ఉపగ్రహమూ చేరింది. దీంతో భారత్‌కూ సొంత ఉపగ్రహ దిక్సూచీ వ్యవస్థ సేవలు పొందేందుకు మార్గం సుగమం అయింది. మిగతా ఉపగ్రహాలను కూడా ప్రయోగించి ఈ వ్యవస్థను 2015 నాటికి పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయనున్నారు. కాగా, ఐఆర్ఎన్ఎస్ఎస్ ఏర్పాటుకు రూ. 3,425 కోట్ల వ్యయం కానుంది. మొత్తం ఏడు ఉపగ్రహాలకు రూ.1,000 కోట్లు, రాకెట్లకు రూ.1,125 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్‌కు 2013లో శ్రీకారం చుట్టారు. ఈ ఉపగ్రహ వ్యవస్థకు బెంగళూరు సమీపంలో బైలాలు ప్రాంతంలో రూ.1,300 కోట్లతో గ్రౌండ్ స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టారు. మరో 18 నెలలు తర్వాత ‘సార్క్’ ప్రయోగం ‘సార్క్’ దేశాల ఉపగ్రహాన్ని 18 నెలలు తర్వాత ప్రయోగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ తెలిపారు. పీఎస్ఎల్వీ సీ27 విజయానంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో చర్చలు జరగాల్సి ఉండటంతో ఈ ఉపగ్రహాన్ని 2016 ఆఖరునాటికి లేదా 2017 ప్రథమార్ధంలో ప్రయోగిస్తామన్నారు. ఈ ఏడాది ఆఖరునాటికి పీఎస్ఎల్వీ సీ28, సీ29 రాకెట్లు ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్ -1ఈ ఉపగ్రహంతో పాటు మరో 3 దేశాలకు చెందిన చిన్న ఉపగ్రహాలు, ఆస్ట్రోశాట్‌ను ప్రయోగించనున్నామన్నారు. భారతదేశం, దానిచుట్టూ 1,500 కిలోమీటర్లు వరకు స్థితి, దిశలనునిర్దిష్టంగా తెలియజేస్తుందన్నారు. ఇస్రో చైర్మన్‌గా పదవి చేపట్టాక చేసిన తొలి ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ ప్రయోగంతో కొత్తగా నిర్మించిన మొబైల్ ల్యాంచ్‌పాడ్ అందుబాటులోకి తీసుకొచ్చామని రేంజ్ ఆపరేషన్ డెరైక్టర్ ఎస్వీ సుబ్బారావు తెలిపారు. ఉపయోగాలు ఇవీ.. భారత్‌తో పాటు చుట్టూ 1500 కి.మీ. పరిధిలో ఐఆర్ఎన్ఎస్ఎస్ సేవలు అందుబాటులోకి వస్తాయి. భూ, జల, వాయు మార్గాల్లో దిక్సూచీ సేవలు అందుతాయి. స్మార్ట్ఫోన్లలో వాడుతున్న జీపీఎస్ స్థానంలో ఐఆర్ఎన్ఎస్ఎస్ సేవలు పొందొచ్చు. విమనాలు, వాహనాలు, నౌకలకూ దిక్సూచీ సేవలు అందుతాయి. విపత్తుల సమయాల్లో సహాయక చర్యలకు ఉపయోగపడుతుంది. భూమి మీద వాహనాల రాకపోకలను గమనించవచ్చు. పొరుగుదేశాలకూ జీపీఎస్ సేవలను అందించవచ్చు. ప్రత్యేకతలు పీఎస్ఎల్వీ సీ-27 రాకెట్ పొడవు: 44.4 మీటర్లు మొత్తం బరువు: 320 టన్నులు ఖర్చు: రూ. 145 కోట్లు ఐఆర్ఎన్ఎస్ఎస్-1డీ శాటిలైట్ బరువు: 1,425 కిలోలు ఖర్చు: రూ. 250 కోట్లు జీవితకాలం: పదేళ్లు కేసీఆర్, చంద్రబాబు, జగన్ అభినందన హైదరాబాద్: పీఎస్ఎల్వీ-సీ 27 ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో శాస్త్రవేత్తలను తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఇది చారిత్రాత్మక విజయమని చంద్రబాబు అన్నారు.కఠోర శ్రమతో మన శాస్త్రవేత్తలు సాధించిన విజయం అద్భుతమని కేసీఆర్ ప్రశంసించారు. ఈ సంవత్సరపు తొలి ప్రయోగం ఫలప్రదం కావడం శుభపరిణామమని జగన్మోహన్రెడ్డి ఒక సందేశంలో హర్షం వ్యక్తం చేశారు. -
ఇస్రోకు కేర్ మాడ్యూల్
మానవ సహిత అంతరిక్ష యాత్రకు ఇస్రో ప్రయోగించిన జీఎస్ఎల్వీ మార్క్ -3లోని కేర్ మాడ్యూల్‌ను ఆదివారం చెన్నైకు చేర్చారు. ఎన్నూరు హార్బర్‌కు చేరుకున్న ఈ మాడ్యూల్‌ను ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ పరిశీలించారు. - అండమాన్ నుంచి చెన్నైకు - నౌకలో తీసుకొచ్చిన వైనం - పరిశీలించిన రాధాకృష్ణన్ సాక్షి, చెన్నై : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) గురువారం చరిత్ర సృష్టించే అద్భుతాన్ని పరిశోధించిన విషయం తెలిసిందే. మానవ సహిత అంతరిక్ష యాత్రలకు ముందడుగు వేస్తూ జీఎస్ఎల్వీ మార్క్-3ని ప్రయోగించింది. ఈ ప్రయోగం విజయవంతం అయింది. ఈ ప్రయోగంలో భాగంగా నింగిలోకి వెళ్లి కేర్ మాడ్యూల్(వ్యోమగాముల గది) మళ్లీ కిందకు దిగింది. ఇందులో అమరికల మేరకు పారాచూట్ల సాయంతో ఆ మాడ్యూల్ అండమాన్ సముద్ర తీరంలో సురక్షితంగా దిగింది. దీనిని అత్యంత జాగ్రత్తగా భారత నావికాదళం, కోస్ట్ గార్డ్లు చెన్నైకు తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక నౌకలో ఎన్నూర్ హార్బర్‌కు తీసుకొచ్చారు. నౌక నుంచి భారీ క్రేన్ సాయంతో దీనిని నిపుణులు కామరాజర్ టెర్మినల్‌కు తీసుకొచ్చారు. దీనిని ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ పరిశీలించారు. అనంతరం గట్టి భద్రత నడుమ ఈ మాడ్యూల్‌ను శ్రీహరి కోటకు తరలించారు. -
విశిష్ట ఉపగ్రహం...జీశాట్-16
భారత్ కమ్యూనికేషన్ ఉపగ్రహాల వ్యవస్థలో జీశాట్-16 రూపంలో మరో కలికితురాయి చేరింది. డిసెంబరు 7, 2014న ఏరియేన్ రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయవంతంగా ప్రయోగించింది. ఇప్పటి వరకు ఇస్రో నుంచి నింగికి చేరిన కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో జీశాట్ 16 బరువైంది. ఇంటర్నెట్, టీవీ, డీటీహెచ్ సేవలను మరింత విస్తరించడంలో ఇది దోహదపడుతుంది. దేశంలో ఉపగ్రహ సమాచార సేవలు మరింత విస్తృతం అయ్యే దిశగా మరో ముందడుగు పడింది. కొత్త సమాచార ఉపగ్రహం జీశాట్-16ను ఇస్రో విజయవంతంగా నింగికి పంపింది. ఫ్రాన్స్‌కు చెందిన ఫ్రెంచి గయానాలోని కౌరూ అంత రిక్ష కేంద్రం నుంచి డిసెంబరు 7న తెల్లవారుజామున 2.10 గంటలకు ఏరియెన్-5వీఏ -221 రాకెట్ ద్వారా జీశాట్-16ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ ప్రయోగాన్ని డిసెంబరు 6నే నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ప్రతికూల వాతావరణంతో వాయిదా పడింది. 32.20 నిమిషాల్లో ప్రయోగాన్ని పూర్తి చేసి జీశాట్-16ను భూ స్థిర బదిలీ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అనంతరం 2.41 గంటలకు బెంగళూరులోని హసన్ వద్ద గల ఇస్రో ఉపగ్రహ నియంత్రణ కేంద్రం శాస్త్రవేత్తలు ఉపగ్రహాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. ఉపగ్రహంలోని అపోజీ మోటార్లను మూడుసార్లు మండించి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూ స్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఐదురోజుల వ్యవధిలో ఉపగ్రహంలోని ట్రాన్స్పాండర్లను వినియోగంలోకి తీసుకువచ్చారు. సంకేతాలు అందుకుని, ప్రసారం చేసేవాటినే ట్రాన్స్పాండర్లు అంటారు. ఈ ఉపగ్రహం బరువు 3181 కిలోలు. ఇంతటి బరువున్న ఉపగ్రహాన్ని ప్రయోగించే సామర్థ్యం మన దగ్గర ఉన్న జీఎస్ఎల్వీ- మార్క్ - ఐ, మార్క్ - ఐఐ లకు లేకపోవడంతో ఇస్రో ఏరియెన్ రాకెట్ ద్వారా ప్రయోగించాల్సి వచ్చింది. భావి కమ్యూనికేషన్ ఉపగ్రహాలను సైతం ప్రయోగించే ఉద్దేశంతో జీఎస్ఎల్వీ మార్క్ - ఐఐఐ అనే నౌకను ఇస్రో అభివృద్ధి చేసింది. 4,500 కిలోల బరువున్న ఉపగ్రహాలను సైతం జీఎస్ఎల్వీ-మార్క్ - ఐఐఐ ప్రయోగించ గలదు. జీశాట్-16 ద్వారా ఇన్శాట్ వ్యవస్థ మరింత బలపడింది. ఇన్శాట్ చరిత్ర ఇన్శాట్ (ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్) వ్యవస్థను ఇస్రో 1983లో ప్రారంభించింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అతి పెద్ద కమ్యూనికేషన్ వ్యవస్థల్లో ఇన్శాట్ ఒకటి. అంతరిక్ష విభాగం, దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో, టె లికమ్యూనికేషన్స్‌విభాగం, భారత వాతావరణ విభాగం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఉపగ్రహ ఆధారిత రేడియో, టీవీ కార్యక్రమాల ప్రసారం, డెరైక్ట్ టు హోం (డీటీహెచ్), టెలివిజన్ సేవలు, టెలికమ్యూనికేషన్స్, వాతావరణ సమాచార సేకరణ, హెచ్చరికల జారీ, విపత్తు నిర్వహణ, వీడియో కాన్ఫరెన్సింగ్, టెలి ఎడ్యుకేషన్, టెలి మెడిసిన్, వీశాట్ మొదలైన సేవలను ఇన్శాట్ వ్యవస్థ అందిస్తుంది. ఈ వ్యవస్థలోని ఉపగ్రహాలను జియో స్టేషనరీ, జియో సింక్రనస్ కక్ష్యల్లోకి ప్రవేశపెట్టడానికి ఇస్రో జియో స్టేషనరీ లాంచ్ వెహికల్ (జీ ఎస్ఎల్వీ) నౌకను అభివృద్ధి చేసింది. దీని పేలోడ్ సామర్థ్యం తక్కువగా ఉండడంతో ఐరోపాకు చెందిన ఏరియెన్ రాకెట్ ద్వారా అత్యధిక ఇన్శాట్ ఉపగ్రహాలను ప్రయోగించారు. ఈ సమస్యను అధిగమించే లక్ష్యంతో ఇస్రో జీఎస్ఎల్వీ - మార్క్ - ఐఐఐ అనే కొత్త తరహా వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఇన్శాట్ వ్యవస్థలో భాగంగానే జీశాట్ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగిస్తుంది. ఇన్శాట్ ఉపగ్రహాలలోని ప్రధాన పరికరాలు, ట్రాన్స్పాండర్లు. ఇవి రిసీవర్, ట్రాన్స్ మీటర్, మాడ్యులేటర్‌ల కలయికగా పనిచేస్తాయి. వీటి ద్వారానే అప్‌లింక్, డౌన్‌లింక్ ఫ్రీక్వెన్సీలో కమ్యూనికేషన్స్ నిర్వహిస్తారు. జీశాట్-16 స్వరూపం -సేవలు జీశాట్ 16 బరువు 3181.6 కిలోలు. దీనిలో 440 న్యూట న్ల బలం ఉత్పత్తి చేసే లిక్విడ్ అపోజీ మోటారు (ఔఅక) ఉంది. దీనిలో మోనో మిథైల్ హైడ్రోజన్‌ను ఇంధనంగా, నత్రజని ఆక్సైడ్లను మిశ్రమంగా ఉపయోగిస్తారు. దీని జీవిత కాలం 12 ఏళ్లు. జీశాట్ 16 ఉపగ్రహంలో మొత్తం 48 కమ్యూనికేషన్ ట్రాన్స్పాండర్లు ఉన్నాయి. ఇదివరకు ఇస్రో అభివృద్ధి చేసిన కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో ఇన్ని ట్రాన్స్ పాండర్లు లేవు. జీశాట్ 16లో 12 కేయూ బ్యాండ్, 24 సీ బ్యాండ్, 12 అప్సర ఎక్స్టెండెడ్ ఎల్ బ్యాండ్ ట్రాన్స్పాండర్లు ఉన్నాయి. క్యూబ్యాండ్ ట్రాన్స్పాండర్లలో ఒక్కోదానిలో 36 మెగాహెర్ట్జ్ బ్యాండ్ విడ్త్‌లో దేశ ప్రధాన భూభాగం, అండమాన్,నికోబార్ దీవుల కవరేజీ ఉంటుంది. భారత భూభూగం, దీవుల ప్రాంతాల్లో 24 సీ బ్యాండ్ , 12 ఎక్స్టెండెడ్, ట్రాన్స్పాండర్లు తమ సేవలను అందిస్తాయి. జీశాట్ 16 ఉపగ్రహం ద్వారా టీవీ, టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలు ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో విస్తరించనున్నాయి. ఇన్శాట్-3ఈకి ప్రత్యామ్నాయంగా.. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇన్శాట్-3ఈ ఉపగ్రహం విఫలమవడంతో దాని స్థానంలో జీశాట్ 16ను ఇస్రో వేగంగా అభివృద్ధి చేసింది. ఈ ఏడాది జనవరిలో జీఎస్ఎల్వీ-డి5 ద్వారా ఇస్రో జీశాట్-14 ప్రయోగం అనంతరం జరిగిన కమ్యూనికేషన్ ప్రయోగమిదే. మునుపెన్నడూ ఇస్రో ఈ స్థాయిలో భారీ ఉపగ్రహాన్ని ప్రయోగించలేదు. ఏరియెన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీశాట్-16ను ప్రయోగించిన తర్వాత లిక్విడ్ అపోజీ మీటరు (LAM)ను డిసెంబరు 8న మండించి మొదటి కక్ష్య మార్పిడి నిర్వహించారు. డిసెంబరు 12న ఉపగ్రహాన్ని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అవసరాలెన్నో... కానీ? ఇప్పటివరకు ఇన్శాట్ వ్యవస్థలో 188 ట్రాన్స్పాండర్లు ఉన్నాయి. ఇన్శాట్ వ్యవస్థలో టెలిమెడిసిన్, టెలి ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ సేవలను ఈ ట్రాన్స్ పాండర్లు అందిస్తున్నాయి. జీశాట్-16 ప్రయోగంతో వీటి సంఖ్య 236కు చేరింది. అయినప్పటికీ, డిమాండ్‌కు తగ్గట్టుగా ఇస్రో ట్రాన్స్పాండర్లను అభివృద్ధి చేసి ప్రయోగించలేకపోతోంది. డిమాండ్‌కు తగ్గట్టుగా ప్రయోగించలేకపోవడంతో 95 ట్రాన్స్పాండర్ల వరకు ఇస్రో విదేశీ కంపెనీల నుంచి లీజుకు తీసుకొని దేశ అవసరాలకు వినియోగిస్తుంది. ముఖ్యంగా డీటీహెచ్ సేవలకు ఎక్కువగా వీటిని వినియోగిస్తున్నాం. విజయాలకు దూరంగా జీశాట్, ఇన్శాట్.. పీఎస్ఎల్వీ అందుబాటులోకి వచ్చిన తర్వాత భారత్ తన రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెడుతోంది. ఇప్పటివరకు జరిగిన 28 పీఎస్ఎల్వీ ప్రయోగాల్లో వరుసగా 27 విజయాలను పీఎస్ఎల్వీ నమోదు చేసుకుంది. విదేశీ ఉపగ్రహాలను కూడా ఇస్రో పీఎస్ఎల్వీ ద్వారా ప్రయోగిస్తుంది. ఇదే విజయం ఇన్శాట్/జీశాట్ వ్యవస్థ ఉపగ్రహాల ప్రయోగంలో నమోదు కావడం లేదు. దీనికి ప్రధాన కారణం జీఎస్ఎల్వీ వైఫల్యాలే. ఇప్పటివరకు నిర్వహించిన 8 జీఎస్ఎల్వీ ప్రయోగాల్లో మూడు విఫలమయ్యాయి. అవి: 1. GSL-V FO2, 2. GSLV-D3, 3. GSLV-FO6. జీఎస్ఎల్వీకి కావాల్సిన క్రయోజెనిక్ ఇంజన్ టెక్నాలజీ సరఫరాకు అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి రష్యా 1990లో నిరాకరించడంతో 1996లో దేశీయ క్రయోజెనిక్ ఇంజన్ నిర్మాణం మొదలైంది. దేశీయ క్రయోజెనిక్ ఇంజన్ 2010లో అభివృద్ధి చేసినప్పటికీ, అదే ఏడాది ఏప్రిల్ 15న జరిగిన జీఎస్ఎల్వీ-డి3 ప్రయోగం విఫలమైంది. ఈ ఏడాది జనవరి 5న చేపట్టిన జీఎస్ఎల్వీ-డి5 ప్రయోగంలో చివరకు దేశీయ క్రయోజెనిక్ ఇంజన్‌ను విజయవంతంగా పరీక్షించారు. విదేశీ రాకెట్లపై ఆధారం.. భారీ వ్యయం మొదటి, రెండు తరాల జీఎస్ఎల్వీ నౌకలు (జీఎస్ఎల్వీ-మార్క్ - ఐ, జీఎస్ఎల్వీ - మార్క్ - ఐఐ) పేలోడ్ సామర్థ్యం తక్కువగా ఉండటంతో భారీ ఇన్శాట్ ఉపగ్రహాల ప్రయోగానికి విదేశీ ఏరియెన్ 5 రాకెట్‌పై ఆధారపడాల్సి వస్తుంది. ఇలా విదేశీ రాకెట్‌పై ఆధారపడటం ద్వారా ఇన్శాట్ వ్యవస్థ విస్తరణ ఆలస్యం అవుతోంది. దీంతోపాటు ప్రయోగ వ్యయం కూడా బాగా పెరుగుతుంది. ఏరియెన్ ద్వారా జీశాట్-16నుప్రయోగించడానికి దాదాపు రూ. 560 కోట్ల ఖర్చయింది. మొత్తం జీశాట్ -16 ఖర్చు రూ.880 కోట్లయితే అందులో ప్రయోగఖర్చుకే రూ. 560 కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. దీనిద్వారా విదేశీ రాకెట్లపై ఆధారపడితే ఎంత భారం మోయాల్సి వస్తుందో స్పష్టమవుతోంది. జీఎస్ఎల్వీ-మార్క్3తో స్వయం సమృద్ధి ఈ ఉద్దేశంతోనే అధిక పేలోడ్ సామర్థ్యమున్న జీఎస్ఎల్వీ-మార్క్-ఐఐఐ ఉపగ్రహాన్ని ఇస్రో అభివృద్ధి చేసింది. ఈ మూడో తరం జీఎస్ఎల్వీ ద్వారా 4,500-5,000 కిలోల బరువున్న కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ప్రయోగించ డం సాధ్యమవుతుంది. ఇలాంటి స్వదేశీ రాకెట్ల ద్వారా ఇన్శాట్/జీశాట్ వ్యవస్థను మరింత వేగంగా విస్తరింపజేయవచ్చు. ఫలితంగా విదేశీ ట్రాన్స్పాండర్లపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఇప్పటికి ప్రయోగించిన ఉపగ్రహాల జీవితకాలం పూర్తవడం లేదా సాంకేతిక కారణాలతో వాటి విధులు నిలిచిపోతున్నాయి. దీంతో టాన్స్పాండర్లకు డిమాండ్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో దేశీయ అవసరాలకు మించి విదేశీ అవసరాలకు ట్రాన్స్పాండర్లను ఎగుమతి చేసే స్థాయికి ఇస్రో ఎదగాలి. ప్రస్తుతం సేవలందిస్తున్న ఇన్శాట్ ఉపగ్రహాలు ఉపగ్రహం ప్రయోగతేదీ నౌక 1 జీశాట్-16 7 -12-2014 ఏరియెన్- 5 2. జీశాట్-14 05-01-2014 జీఎస్ఎల్వీ-డీ5 3. జీశాట్-7 30-08-2014 ఏరియెన్-5 4. ఇన్శాట్-3డి 26-07-2013 ఏరియెన్-5 5. జీశాట్-10 29-09-2012 ఏరియెన్-5 6. జీశాట్-12 15-07-2011 పీఎస్ఎల్వీ-సీ17 7. జీశాట్-8 21-05-2011 ఏరియెన్-5 8. ఇన్శాట్-4సీఆర్ 02-09-2007 జీఎస్ఎల్వీ-ఎఫ్ఓ4 9. ఇన్శాట్-4బి 12-03-2007 ఏరియెన్- 5 10. ఇన్శాట్-4ఎ 22-12-2005 ఏరియెన్ 11. ఇన్శాట్-3ఏ 10-04-2003 ఏరియెన్ 12. కల్పన -1 12-09-2002 పీఎస్ఎల్వీ-సీ4 13. ఇన్శాట్-3సీ 24-01-2002 ఏరియెన్ - సి. హరికృష్ణ సివిల్స్ ఫ్యాకల్టీ, హైదరాబాద్ -
నింగిలోకి మరో సమాచార ఉపగ్రహం
ఫ్రెంచిగయానా నుంచి జీశాట్-16 ప్రయోగం ఉపగ్రహ సమాచార సేవలు ఇక మరింత విస్తృతం సూళ్లూరుపేట/బెంగళూరు: భారత్‌లో ఉపగ్రహ సమాచార సేవలు విస్తృతం కానున్నాయి. కొత్త సమాచార ఉపగ్రహం జీశాట్-16ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయవంతంగా నింగికి పంపింది. ఫ్రాన్స్‌కు చెందిన ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఆదివారం తెల్లవారుజామున 2.10 గంటలకు ‘ఏరియన్-5 వీఏ-221’ రాకెట్ ద్వారా జీశాట్-16ను విజయవంతంగా ప్రయోగించింది. ఆదివారం 32.20 నిమిషాల్లో ప్రయోగాన్ని పూర్తి చేసి జీశాట్-16ను భూస్థిర బదిలీ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. 2.41 గంటలకు బెంగళూరు హసన్‌లోని ఇస్రో ఉపగ్ర హ నియంత్రణ కేంద్రం ఉపగ్రహాన్ని అధీనంలోకి తీసుకుంది. ఉపగ్రహంలోని అపోజీ మోటార్లను మండించి 36 వేల కి.మీ ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెడతామని, తొలిదశ కక్ష్య పెంపును సోమవారం చేపడతామని ఇస్రో తెలిపింది. డీటీహెచ్ ప్రసారాల్లో నాణ్యత... దేశంలో ట్రాన్స్పాండర్ల కొరతను దృష్టిలో ఉంచుకుని జీశాట్-16లో 48 ట్రాన్స్పాండర్లను అమర్చినట్లు ఇస్రో పేర్కొంది. వీటిలో 12 కేయూ ట్రాన్స్పాండర్లు, 24 సీ బ్యాండ్, 12 ఎక్స్టెండెడ్ సీ బ్యాండ్ ట్రాన్స్పాండర్లు ఉన్నాయని, డీటీహెచ్ వీడియో ప్రసారాల్లో నాణ్యతను పెంచేందుకు ఇవి ఉపయోగపడతాయంది. ఒక జీశాట్ ఉపగ్రహంలో ఇంత పెద్ద సంఖ్యలో ట్రాన్స్పాండర్లను ఇస్రో అమర్చి పంపడం ఇదే తొలిసారి. 3,181.6 కిలోల బరువైన జీశాట్-16 ఉపగ్రహ ప్రయోగానికి రూ. 865 కోట్లు ఖర్చయింది. ఈ ఉపగ్రహం 12 ఏళ్లు సేవలు అందించనుంది. జీశాట్-16 ప్రయోగం విజయంపై ఇస్రో శాస్త్రవేత్తలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ అభినందించారు. -
మామ్ కెమెరాలో 'అరుణ' చంద్రుడు
ఇరవై రోజుల క్రితమే అంగారకుడి చెంతకు చేరిన మన ‘మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్; మంగళ్యాన్)’ ఉపగ్రహం తాజాగా అరుణగ్రహానికి సహజ ఉపగ్రహమైన ఫోబోస్‌ను త న కెమెరాలో బంధించింది. మార్స్‌కు 66,275 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు మామ్ ఈ ఫొటోలు తీసిందని పేర్కొంటూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మంగళవారం తన ఫేస్బుక్ పేజీలో చిన్న వీడియో ఫుటేజీని ఉంచిం ది. అన్నట్టూ... అంగారకుడికి రెండు చంద్రుళ్లు ఉన్నారండోయ్. వీటిలో పెద్దదైన ఫోబోస్ సగటు వ్యాసార్థం 11 కిలోమీటర్లే. మార్స్‌కు జస్ట్ 6 వేల కిలోమీటర్ల దూరం నుంచే తిరుగుతుండటం వల్ల ఇది 7:39 గంటలకే ఒకసారి అంగారకుడిని చుట్టి వస్తుంది. మన చంద్రుడు తూర్పున ఉదయించి పడమరన అస్తమిస్తాడు కదా.. ఈ అరుణ చంద్రుడు మాత్రం పశ్చిమం నుంచి తూర్పుకు ప్రయాణిస్తాడట! అంతేకాదు.. ఫోబోస్ ప్రతి వందేళ్లకు ఓ మీటరు చొప్పున మార్స్‌కు దగ్గరవుతున్నాడట. అందువల్ల మరో 5 కోట్ల ఏళ్లలో ఈ చంద్రుడు అంగారకుడిని ఢీకొట్టడం లేదా.. పేలిపోయి ఉంగరం ఆకారంగా మిగిలి పోవడం జరగవచ్చట! ఇక మార్స్‌కు రెండో ఉపగ్రహమైన డైమోస్.. ఫోబోస్ కన్నా 7 రెట్లు చిన్నది. ఇది 30 గంటలకు ఓసారి అంగారకుడిని చుట్టి వస్తోంది. -
నేడు పీఎస్ఎల్వీ సీ26 కౌంట్‌డౌన్
ఉదయం 6.32 గంటలకు ప్రారంభం గురువారం తెల్లవారుజామున 1.32 గంటలకు ప్రయోగం సూళ్లూరుపేట: భారత ప్రాంతీయ ఉపగ్రహ దిక్సూచీ వ్యవస్థ(ఐఆర్ఎన్ఎస్ఎస్) ఏర్పాటు కోసం ఐఆర్ఎన్ఎస్ఎస్-1సీ ఉపగ్ర హాన్ని పీఎస్ఎల్వీ సీ-26 రాకెట్ ద్వారా ప్రయోగించేందుకు సర్వం సిద్ధం అయింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, శ్రీహరికోటలోని సతీశ్‌ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ26 రాకెట్ ప్రయోగానికి సోమవారం ఉదయం 6.32 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) వెల్లడించిది. సుమారు 67 గంటల కౌంట్‌డౌన్ అనంతరం గురువారం తెల్లవారుజామున 1:32 గంటలకు పీఎస్ఎల్వీ సీ26ను ప్రయోగించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపింది. ఈ రాకెట్ ద్వారా 1,425 కిలోల బరువైన ఐఆర్ఎన్ఎస్ఎస్-1సీ ఉపగ్రహాన్ని నింగికి పంపనున్నారు. ఐఆర్ఎన్ఎస్ఎస్ ఏర్పాటు కోసం కనీసం నాలుగు, గరిష్టంగా ఏడు ఉపగ్రహాలను నింగికి పంపాల్సి ఉండగా.. ఇప్పటిదాకా రెండు ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. ఈ ప్రయోగాన్ని ఈ నెల 10వ తేదీనే చేపట్టాలని నిర్ణయించినా.. టెలీకమాండ్ ప్యాకేజీలో సాంకేతిక లోపం కారణంగా వాయిదా పడింది. కౌంట్‌డౌన్ వ్యవధిలో రాకెట్‌లోని రెండు, నాలుగో దశల్లో ద్రవ ఇంధనం, కొన్ని వ్యవస్థలకు హీలియం, నైట్రోజన్ తదితర వాయువులను నింపే ప్రక్రియను చేపడతారు. ప్రయోగానికి 10 గంటల ముందు రాకెట్‌లోని ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యవస్థలను అప్రమత్తం చేస్తారు. చివరి 20 నిమిషాల్లో కంప్యూటర్ వ్యవస్థలన్నింటిని అప్రమత్తం చేస్తారు. పీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్‌లో ఇది 28వ ప్రయోగం కాగా.. ఇప్పటిదాకా మొదటి ప్రయోగం తప్ప అన్నీ విజయవంతం అయ్యాయి. -
అంగారకుడిపై ధూళి తుపాను!
బెంగళూరు: అరుణగ్రహం ఉత్తరార్ధగోళంపై ఆదివారం భారీ ధూళి తుపాను చెలరేగింది. ప్రాంతీయ స్థాయిలో ఏర్పడిన ఈ తుపానును మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్) ఉపగ్రహం తన కలర్ కెమెరాలో బంధించింది. ధూళి తుపాను సంభవించినప్పుడు అంగారకుడికి 74,500 కి.మీ. ఎత్తులో ఉన్న మామ్ ఈ ఫొటోను తీసిందని పేర్కొంటూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన ఫేస్బుక్ పేజీలో వెల్లడించింది. గత బుధవారమే అంగారకుడి కక్ష్యలోకి చేరి చరిత్ర సృష్టించిన మామ్.. గురువారం మార్స్ తొలి ఫొటోను పంపిన విషయం తెలిసిందే. -
24న అంగారకుడి కక్ష్యలోకి మామ్!
బెంగళూరు: అంగారకుడి దిశగా పది నెలలుగా అంతరిక్షంలో దూసుకుపోతున్న మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్) ఉపగ్రహం 98 శాతం ప్రయాణం విజయవంతంగా పూర్తి చేసింది. మొత్తం 66.60 కోట్ల కి.మీ. దూరానికి గాను 65.30 కోట్ల కి.మీ. దూరాన్ని మామ్ పూర్తి చేసిందని, ఇంకా 1.30 కోట్ల కి.మీ. ప్రయాణిస్తే అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుందని సోమవారం బెంగళూరులో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శాస్త్రీయ కార్యదర్శి వి.కోటేశ్వరరావు వెల్లడించారు. ఉపగ్ర హం సెప్టెంబరు 24న ఉదయం 7:30 గంటలకు మార్స్ క క్ష్యలోకి ప్రవేశిస్తుందని, దీనిపై పూర్తి ధీమాతో ఉన్నామన్నారు. అరుణగ్రహ కక్ష్యలోకి ప్రవేశం కోసం ఉపగ్రహానికి ఆదేశాలు ఇవ్వడం సోమవారం నాటికి పూర్తి కానున్నట్లు తెలిపారు. లిక్విడ్ అపోజీ మోటారు (ఎల్ఏఎం) ఇంజిన్‌ను 24 నిమిషాల పాటు మండించి ఉపగ్రహ వేగాన్ని సెకనుకు 22.2 కి.మీ నుంచి 2.14 కి.మీకి తగ్గించడం ద్వారా అంగారక కక్ష్యలోకి ప్రవేశపెడతారని, అయితే తొమ్మిది నెలలుగా నిద్రాణ స్థితిలో ఇంజిన్‌ను తిరిగి పనిచేయించడమే సవాలు అని తెలిపారు. ఇంతకుముందు కొన్ని దేశాలు పంపిన ఉపగ్రహాలు ప్రారంభంలో లేదా మార్గమధ్యంలో లేదా అంగారకుడి సమీపంలోకి ప్రయాణించగలిగినా.. చేరలేకపోయాయన్నారు. మామ్ అంగారకుడి కక్ష్యలోకి చేరగలిగితే గనక.. ఈ ఘనత సాధించిన నాలుగో అంతరిక్ష సంస్థగా ఇస్రో రికార్డు సృష్టించనుందని తెలిపారు. ఈ ఆపరేషన్ కోసం బెంగళూరులోని బైలాలు వద్ద 32 మీటర్ల యాంటెన్నాతో ఉన్న ఇండియన్ డీప్‌స్పేస్ నెట్వర్క్(ఐడీఎస్ఎన్)ను, అమెరికాలోని గోల్డ్‌స్టోన్, స్పెయిన్‌లోని మాడ్రిడ్, ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలలో గల డీప్ స్పేస్ నెట్‌వర్క్‌లను ఇస్రో ఉపయోగించుకోనుందని పేర్కొన్నారు. -
అంగారకుడి దిశగా మార్స్ అర్బిటర్: ఇస్రో
బెంగళూరు: అంతరిక్ష ప్రయోగంలో కీలక ఘట్టానికి ఇస్రో తెర తీయడానికి సిద్దమవుతోంది. అంతరిక్షంలో ప్రవేశపెట్టిన మార్స్ ఆర్బిటర్ అంగారకుడి దిశగా ప్రయాణిస్తోందని శాస్త్రజ్ఞులు వెల్లడించారు. మార్స్ ఆర్బిటర్ 98శాతం యాత్ర పూర్తి చేసుకుందని, 300 రోజుల పాటు ప్రయాణం సాగించిందని, ఈ ప్రయోగంలో లిక్విడ్ ఇంజన్10నెలల తర్వాత పనిచేయనున్నదని ఇస్రో వెల్లడించింది. అంగారక కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించేందుకు ఇస్రో కమాండ్స్ ఇవ్వనుందన్నారు. సెప్టెంబర్ 24 ఉదయం 7.30 ని.లకు మార్స్ఆర్బిటర్ అంగారక కక్ష్యలోకి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. భూమికి 22.4 కోట్ల కిలోమీటర్ల దూరంలో మార్స్ ఆర్బిటర్ ఉందని శాస్త్రజ్ఞులు వెల్లడించారు. ఆర్బిటర్‌లోని అన్ని పరికరాలు సజావుగా పనిచేస్తున్నాయని, బెంగళూరు, అమెరికాలోని గోల్డ్‌స్టోన్, స్పెయిన్‌లోని మాడ్రిడ్, ఆస్ట్రేలియాలోని కాన్ బెర్రా నుంచి ఆర్బినేటర్కు సంకేతాలు అందయాని ఇస్రో ఓ ప్రకటనలో వెల్లడించింది. -
విజయవంతంగా మంగళ్ యాన్ ప్రయోగం: రాధాకృష్ణ
చెన్నై: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మంగళ్యాన్ ప్రయోగం విజయవంతంగా సాగుతోందని ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ మీడియాకు వెల్లడించారు. సెప్టెంబర్ 24 కల్లా అంగారక కక్ష్యలోకి మంగళయాన్ ప్రవేశిస్తుందని రాధాకృష్ణన్ తెలిపారు. మంగళయాన్ ప్రయోగంలో ఇంకా 14% యాత్ర మాత్రమే మిగిలి ఉందని ఆయన తెలిపారు. గత ఏడాది నవంబర్ 5న శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్ వీ బోర్డుపై నుంచి మార్స్ అర్బిటర్ ప్రయోగం ఇస్రో చేపట్టిన సంగతి తెలిసిందే. మార్స్ ఆర్బిటర్ ప్రయోగంపై మంగళవారం చెన్నైలో సమీక్ష నిర్వహించారు. -
వినీలాకాశంలో వాణిజ్య విహంగం పీఎస్ఎల్వీ-సీ23
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో ) వినీలాకాశంలో తన అప్రతిహత జైత్రయాత్రను సాగించడంలో మరోసారి సఫలమైంది. విదేశీ వాణిజ్యం నిమిత్తం ప్రయోగించిన ఐదు ఉపగ్రహాలను మోసుకుపోవడంలో ఇస్రో మానసపుత్రిక అయిన పీఎస్ఎల్వీ తన విద్యుక్తధర్మాన్ని విజయవంతం చేసింది. శాస్త్రవేత్తల నమ్మకాన్ని నిజం చేస్తూ శాస్త్రసాంకేతిక రంగంలో మరో అడుగు ముందుకు వేసేందుకు ఆత్మస్థైర్యాన్ని ప్రోదిచేసింది. 26వ వరుస విజయం: అంతరిక్ష యానంలో ఇస్రో మరో అడుగుముందుకు వేసింది. నెల్లూరులోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ్కఔగఇ23 నుంచి ఉపగ్రహాలను పంపడంలో శతశాతం విజయం సాధించింది. ఈ ప్రయోగం ద్వారా వాణిజ్య రంగంలో తనదంటూ చెరగని ముద్రవేసుకుంది. నాలుగు దేశాలకు చెందిన ఐదు ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. ఇలా పీఎస్ఎల్వీల ప్రయోగ పరంపరలో ఇది 27వది. కాగా ఇది 26వ వరుస విజయం. 49 గంటల కౌంట్‌డౌన్ తర్వాత జూన్ 30, 2014న ఇస్రో ఉదయం 9.52 గంటలకు ్కఔగఇ23 ను ప్రయోగించింది. దీని పయనానికి రోదసి లోని ఉపగ్రహ శకలాలు అడ్డుపడే సంకేతాలను గుర్తించిన శాస్త్రవేత్తలు.. 9.49 గంటలకు ప్రయోగించాల్సిన నౌకను మూడు నిమిషాల ఆలస్యంగా 9.52 గంటలకు ప్రయోగించారు. లిఫ్ట్ ఆఫ్ జరిగిన 20 నిమిషాలకు తొలుత ఫ్రాన్సకు చెందిన స్పాట్-7 ఉపగ్రహాన్ని ్కఔగఇ23 నాలుగో దశ 662.3 కి.మీ. ఎత్తులోని సూర్యానువర్తన (ఠ డఛిజిటౌఠట) కక్ష్యలోకి ప్రవేశ పెట్టింది. ఆ తర్వాత నిమిషాల్లో ఇతర నాలుగు ఉపగ్రహాలను కూడా నిర్ణీత కక్ష్యలోకి చేరాయి. స్ట్రాప్ ఆన్ మోటార్లు లేని ్కఔగ కోర్ అలోన్ రూపంలో ్కఔగఇ23 ప్రయోగం జరిగింది. ఇలాంటి ప్రయోగాల్లో ఇది పదవది.పూర్తిగా వాణిజ్యపరమైన ఈ ప్రయోగం తెలుగువాడైన షార్ డెరైక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. 50 రోజుల వ్యవధిలో అనుసంధానం జరిగింది. ఇప్పటివరకు ఇస్రో 19 దేశాలకు చెందిన 38 విదేశీ ఉపగ్రహాల ప్రయోగాలను చేపట్టగా అందులో 30 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. నాలుగు దేశాలు-ఐదు ఉపగ్రహాలు ్కఔగఇ23 ద్వారా నాలుగు దేశాలకు చెందిన ఐదు ఉపగ్రహాలను ప్రయోగించారు. వీటిలో ప్రధాన ఉపగ్రహం ఫ్రాన్సకు చెందిన స్పాట్-7. ఇది ఎర్త అబ్జర్వేషన్ ఉపగ్రహం. పీఎస్ఎల్వీ-సి21 ద్వారా ఇస్రో 2012 సెప్టెంబర్‌లో ఫ్రాన్సకు చెందిన స్పాట్-6 అనే ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. స్పాట్-6 స్పాట్-7ను పోలి ఉంటుంది. స్పాట్-7ను ఐరోపాకు చెందిన ప్రముఖ స్పేస్ టెక్నాలజీ సంస్థ అజీటఛఠట ఈ్ఛజ్ఛఛ్ఛి - ఞ్చఛ్ఛి రూపొందించింది. దీని బరువు 714 కిలోలు. దీని జీవితకాలం 10 ఏళ్లు. భూమి ఉపరితల చిత్రీకరణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. స్పాట్-7తోపాటు ఇతర విదేశీ ఉపగ్రహాలు -వాటి వివరాలు. ఎ.ఐ. శాట్: ఇది జర్మనీ దేశానికి చెందినది. దీని బరువు 14 కిలోలు. మ్యారిటాం అనువర్తనాలకు ఉద్దేశించింది. దీని సహాయంతో ప్రపంచ సముద్రయానం, నౌకల గమనాన్ని పరిశీలించవచ్చు. నౌకల నుంచి సంకేతాలను గ్రహించి సమాచారం చేరవేస్తుంది. జర్మనీ అభివృద్ధి చేసే డీఎల్ఆర్ ఉపగ్రహాల్లో మొదటి నానో ఉపగ్రహం ఇది. ఎన్ఎల్ఎస్: ఎన్ఎల్ఎస్ 7.1, ఎన్ఎల్ఎస్ 7.2 అనే ఈ రెండు ఉపగ్రహాలు కెనడావి. ఒక్కో ఉపగ్రహం బరువు 15 కిలోలు. ఇవి సిగ్నల్స్‌ను తీసుకొని ట్రాన్స్మిషన్ చేస్తాయి. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) సేవలకు ఉద్దేశించినవి. వెలాక్స్: ఈ ఉపగ్రహం సింగపూర్ దేశానికి చెందినది. దీని బరువు 6.4 కిలోలు. సింగపూర్‌కు చెందిన నాన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ దీన్ని రూపకల్పన చేసింది. కొత్తరకం ఇమేజ్ సెన్సార్ టెక్నాలజీని పరీక్షించడానికి ఇది ఉపయోగపడుతుంది. మైక్రో ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్ (ఎమ్ఈఎమ్ఎస్) ఆధారంగా పనిచేసే నియంత్రణ వ్యవస్థ, రెండు ఉపగ్రహాల మధ్య అనుసంధానానికి సంబంధించిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇది పరీక్షిస్తుంది. సంకేతాలను గ్రహించి నిల్వ చేస్తుంది. ఇది మొట్టమొదటి నానోశాటిలైట్. తొలి వాణిజ్య విజయం: ఇప్పటివరకు ఇస్రో ్కఔగ ద్వారా 40 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించింది. 1999లో తొలిసారిగా పీఎస్ఎల్వీ-సీ2 ద్వారా ఇస్రో విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించడం ప్రారంభించింది. ్కఔగఇ2 ద్వారా జర్మనీకి చెందిన డీఎల్ఆర్ -టబ్‌శాట్, కొరియాకు చెందిన కిట్‌శాట్-3ను ఇస్రో ప్రయోగించింది. ఆనాటి నుంచి విదేశీ ఉపగ్రహాల ప్రయోగ పరంపరను ఇస్రో కొనసాగిస్తూనే ఉంది. మొదట్లో విదేశీ ఉప గ్రహాలను ప్రధాన భారత ఉపగ్రహాలకు అదనంగా ప్రయోగించినప్పటికీ ్కఔగఇ8 ద్వారా 2007లో ప్రధాన పేలోడ్గా ఇటలీకు చెందిన ఎజైల్ ఉపగ్రహాన్ని అంత రిక్షంలోకి పంపింది. ఇది ఒక మంచి వాణిజ్య విజయంగా పరిగణించవచ్చు. అదే విధంగా ్కఔగఇ10 ద్వారా కేవలం విదేశీ ఉపగ్రహాన్ని మాత్రమే ఇస్రో పంపింది. 300 కిలోల బరువున్న ఇజ్రాయెల్‌కు చెందిన టెక్సర్/పోలారిస్ అనే ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది. ఇదే తరహాలో మరో అడుగు ముందుకేసి ్కఔగఇ9 ద్వారా మొత్తం పది ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. వీటిలో 8 విదేశీ ఉపగ్రహాలు ఉన్నాయి. ్కఔగఇ21 ద్వారా ఫ్రాన్సకు చెందిన స్పాట్-6, జపాన్‌కు చెందిన ప్రొయిటెరిస్ ఉపగ్రహాలను ప్రయోగించింది. ఆ తర్వాత కొన్ని విదేశీ ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నప్పటికీ మళ్లీ ్కఔగఇ23 ద్వారా దాదాపు పూర్తి స్థాయిలో విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించి ఇస్రో వాణిజ్య విజయాన్ని మరోసారి నమోదు చేసింది. రూ. కోట్లలో ఆర్జన: విదేశీ ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి పంపే సేవలను అందించడం ద్వారా ఇస్రో ఏటా కొన్ని వందల కోట్ల రూపాయలను ఆర్జిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం అత్యంత చౌక అయిన ప్రయోగ సేవలను అందిస్తున్న అంతరిక్ష సంస్థ ఇస్రోనే. భవిష్యత్తులో మరిన్ని దేశాలకు సహజవనరుల నిర్వహణ, గ్రామీణ పట్టణ ప్రాంతాల అభివృద్ధికి ఉపగ్రహాలను నిర్మించుకోనున్నాయి. అయితే రాకెట్ విజ్ఞానం కొన్ని దేశాలకు మాత్రమే పరిమితం అవడం ద్వారా భారత్ లాంటి దేశాలకు ఇది ఎంతగానో కలిసి వచ్చే అంశం. నమ్మకానికి ప్రతీక... పీఎస్ఎల్వీ: 27 ప్రయోగాల్లో మొదటిది తప్ప మిగతా 26 ప్రయోగాల్లో ్కఔగ విజయాలను నమోదు చేసుకోవడంతో దీనిపై అంతర్జాతీయ స్థాయిలో అనేక దేశాలకు నమ్మకం ఏర్పడింది. ఇన్ని దేశాలు ్కఔగ ద్వారా తమ ఉపగ్రహాలను ప్రయోగిస్తుండటంతో భారత అంతరిక్ష రంగాన్ని ప్రపంచం ఏ విధంగా గుర్తించిందో అర్థమవుతుందని, ్కఔగఇ23 ప్రయోగానికి హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. ప్రపంచ వ్యాప్తంగా భారత అంతరిక్ష కార్యక్రమం ఘనత చాటడంలో పీఎస్ఎల్వీ చాలా కీలకమైంది. పీఎస్ఎల్వీ కార్యక్రమం 1982లో ప్రారంభమైంది. అప్పటికే ఇస్రో శాటిలైట్ లాంచ్ వెహికల్-3 (SLV3). ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (అఔగ) అనే రెండు పరిశోధన నౌకలను విజయవంతంగా ప్రయోగించింది. నమూనా ్కఔగ పొడవు 44.4 మీ. బరువు 294 టన్నులు. ఇది నాలుగు అంచెల నౌక. మొదటి, మూడో దశల్లో ఘన ఇంధనాన్ని రెండు,నాలుగో దశల్లో ద్రవ ఇంధనాన్ని ఉపయోగిస్తారు. దీని మొదటి దశ చుట్టూ ఆరు స్ట్రాప్ ఆన్ మోటార్లు ఉంటాయి. ఇస్రో ఇప్పటివరకు మూడు రకాల ్కఔగలను రూపొందించి ప్రయోగించింది. మొదటి ్కఔగ జనరిక్ రూపం: దీని మొదటి దశ చుట్టూ ఆరు స్ట్రాప్ ఆన్ మోటార్లు ఉంటాయి. రెండవది ్కఔగఇఅ (కోర్ అలోన్) రూపం. దీని చుట్టూ స్ట్రాప్ ఆన్ మోటార్లు ఉండవు. తేలిక ఉపగ్రహాలను ప్రయోగించినప్పుడు రెండోరూపాన్ని వినియోగిస్తారు. భారీ ఉపగ్రహాలను ప్రయోగించడానికి స్ట్రాప్ ఆన్ మోటార్ల పరిమాణం, సామర్థ్యం పెంచితే దాన్ని ్కఔగగీఔ అంటారు. అపజయంతో అన్నీ విజయాలే: ఇప్పటివరకు ్కఔగఇ23 తో కలిపితే 27 ప్రయోగాలను పీఎస్ఎల్వీ నిర్వహించింది. వీటిలో మొదటి మూడు అభివృద్ధి ప్రయోగాలు. మిగతా 24 కార్యాచరణ ప్రయోగాలు. 1993, సెప్టెంబర్ 20న చేపట్టిన మొదటి పీఎస్ఎల్వీ అభివృద్ధి ప్రయోగం పీఎస్ఎల్వీ-డీ1 మాత్రమే విఫలమైంది. ఆ తర్వాత నిర్వహించిన 26 ప్రయోగాలు (్కఔగఇ23 తో కలిపి) వరుస విజయవంతమయ్యాయి. ప్రపంచంలోని విజయవంతమైన కొన్ని రాకెట్లలో పీఎస్ఎల్వీ ఒకటి. అనేక దేశాలు తమ ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ ద్వారా ప్రయోగించడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా విదేశీ మారకద్రవ్యం ఆర్జించడంలో ఇస్రో సఫలమైంది. ఇలాంటి అంతరిక్ష సేవలను ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించడానికి 1992లో Antrix Corporation (ఆంత్రిక్స్ కార్పొరేషన్) అనే ప్రత్యేక అంతరిక్ష వాణిజ్య విభాగాన్ని ఇస్రో ఏర్పాటు చేసింది. పీఎస్ఎల్వీ ప్రయోగాలు పీఎస్ఎల్వీ {పయోగతేదీ {పయోగించిన ఉపగ్రహాలు పీఎస్ఎల్వీ-డీ1 సెప్టెంబర్ 20, 1993 ఐఆర్ఎస్-1ఈ ప్రయోగం విఫలం పీఎస్ఎల్వీ-డీ2 అక్టోబర్ 15, 1994 ఐఆర్ఎస్-పీ2 పీఎస్ఎల్వీ-డీ3 మార్చి 21, 1996 ఐఆర్ఎస్-పీ3 పీఎస్ఎల్వీ-సీ1 సెప్టెంబర్ 29, 1997 ఐఆర్ఎస్ - 1డీ పీఎస్ఎల్వీ-సీ2 మే 26, 1999 ఐఆర్ఎస్ -పీ4 (ఓషన్ శాట్-1)+కిట్‌శాట్-3 (కొరియా) డీఎల్ఆర్-ట్యూబ్‌శాట్ (జర్మనీ) పీఎస్ఎల్వీ-సీ3 అక్టోబర్ 22, 2001 టెక్నాలజీ ఎక్స్పెరిమెంట్ శాటిలైట్, బర్డ(జర్మనీ),ప్రోబా(బెల్జియం) పీఎస్ఎల్వీ-సీ4 సెప్టెంబర్ 12, 2002 కల్పన-1 పీఎస్ఎల్వీ-సీ5 అక్టోబర్ 17, 2003 ఐఆర్ఎస్-పీ6 (రిసోర్‌సశాట్-1) పీఎస్ఎల్వీ-సీ6 మే 5, 2005 కార్టోశాట్-1, హామ్‌శాట్ (ఏ్చఝట్చ్ట) పీఎస్ఎల్వీ-సీ7 జనవరి 10, 2007 కార్టోశాట్-2, ఎస్ఆర్ఈ-1, లాపాన్ ట్యూబ్‌శాట్ (ఇండోనేసియా) పేహున్‌శాట్ (అర్జెంటీనా) పీఎస్ఎల్వీ-సీ8 ఏప్రిల్ 23, 2007 ఎజైల్ (ఇటలీ), అడ్వాన్సడ్ ఏవియోనిక్స్ మాడ్యూల్ (ఏఏఎం) పీఎస్ఎల్వీ-సీ10 జనవరి 21, 2008 టెక్సార్ (ఇజ్రాయెల్) పీఎస్ఎల్వీ-సీ9 ఏప్రిల్ 28, 2008 కార్టోశాట్-2ఎ, ఇండియన్ మినీ శాటిలైట్-1 (ఐఎంఎస్-1)+ ఎనిమిది ఇతర దేశాల ఉపగ్రహాలు పీఎస్ఎల్వీ- సీ11 అక్టోబర్ 22, 2008 చంద్రయాన్-1 పీఎస్ఎల్వీ-సీ12 ఏప్రిల్ 20, 2009 రీశాట్-2+అనుశాట్ పీఎస్ఎల్వీ-సీ14 సెప్టెంబర్ 23, 2009 ఓషన్ శాట్-2+ ఆరు విదేశీ ఉపగ్రహాలు పీఎస్ఎల్వీ-సీ15 జూలై 12, 2010 కార్టోశాట్-2బి+స్టడ్‌శాట్+అల్‌శాట్ (అల్జీరియా)+ రెండు విదేశీ నానోశాట్+ఒక పికోశాట్ పీఎస్ఎల్వీ-సీ16 ఏపిల్ ్ర20, 2011 రిసోర్స్ శాట్-2+యూత్ శాట్+ఎక్స్‌శాట్ (సింగపూర్) పీఎస్ఎల్వీ-సీ17 జూలై 15, 2011 జీశాట్12 పీఎస్ఎల్వీ-సీ18 అక్టోబర్ 12, 2011 మేఘట్రాపిక్స్+ఎస్‌ఆర్‌ఎంశాట్+జుగ్ను+వెస్సెల్‌శాట్ (లక్సెంబర్గ్) పీఎస్ఎల్వీ-సీ19 ఏప్రిల్ 26, 2012 రీశాట్-1 పీఎస్ఎల్వీ-సీ20 ఫిబ్రవరి 25, 2013 సరళ్+ఆరు ఇతర విదేశీ ఉపగ్రహాలు పీఎస్ఎల్వీ-సీ21 సెప్టెంబర్ 9, 2012 స్పాట్-6 (ఫ్రాన్స్)+ప్రొయిటెరిస్ (జపాన్) పీఎస్ఎల్వీ-సీ22 జూలై 1, 2013 ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఎ పీఎస్ఎల్వీ-సీ25 నవంబర్ 5, 2013 మంగళ్యాన్ (మార్స్ ఆర్బిటర్ మిషన్-మామ్) పీఎస్ఎల్వీ-సీ24 ఏప్రిల్ 4, 2014 ఐఆర్ఎన్ఎస్ఎస్-1బి పీఎస్ఎల్వీ-సీ23 జూన్ 30, 2014 స్పాట్-7 (ఫ్రాన్స్)+ ఎన్ఎల్ఎస్-71,ఎన్ఎల్ఎస్-72 (కెనడా)+ ఏఐ శాట్ (జర్మనీ)+ వెలాక్స్-1 (సింగపూర్) -
రేపు షార్కు ప్రధాని మోడీ
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీఎస్ఎల్వీ సీ23 ప్రయోగాన్ని వీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదివారం సాయంత్రం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్కు చేరుకోనున్నారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఇక్కడికి రానున్నారు. ఢిల్లీ నుంచి విమానంలో చెన్నైకి వచ్చే మోడీ అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సాయంత్రం 4.30 గంటలకు షార్కు వస్తారు. గవ ర్నర్, సీఎం మాత్రం ఓ గంట ముందుగానే ఇక్కడికి చేరుకుంటారు. గుంటూరు రేంజ్ ఐజీ సునీల్‌కుమార్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే సుమారు 3 వేల మంది పోలీసులు, 30 మంది ఎస్పీజీ కమాండోలు షార్కు చేరుకున్నారు. -
‘నాసా’ పరిశోధనలో విజేతగా ‘ఝాన్సీ’
తాడేపల్లి, న్యూస్‌లైన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) ‘అంతర్జాతీయ పరిశోధన’ అంశంలో గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలోని పెనుమాక వందేమాతరం హైస్కూల్ పూర్వ విద్యార్థిని కొక్కిలగడ్డ ఝాన్సీ ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం నూజివీడు ఐఐఐటీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న ఈమె ‘అంతరిక్షంలో నివాసం’ అనే అంశంపై 100 పేజీల పరిశోధన పత్రాలను సమర్పించింది. దీనికి ‘నాసా’ అంతర్జాతీయ పరిశోధనలో ప్రపంచంలోనే మొదటి స్థానం లభించిందని పాఠశాల హెచ్ఎం జ్యోతికిరణ్ సోమవారం తెలిపారు. -
ఇస్రోకి ఎంపికైన తెలుగు తేజం!
ఆత్మవిశ్వాసం ఆసరాగా నిజాయితీగా కష్టపడే వ్యక్తి ముందు కొలువులు క్యూ కడతాయనే దానికి నిలువుటద్దం ఆ కుర్రాడు.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక మంచి ఉద్యోగం చేజిక్కడమే గగనం. అలాంటిది ఇప్పటికే నాలుగైదు ఉద్యోగాలకు పిలుపొచ్చింది.. మరిన్ని ఉద్యోగాలు కూతవేటు దూరంలో కాచుకు కూర్చున్నాయి. లక్ష మందితో తలపడి, పరిశోధనలలో ప్రగతి పథాన పయనిస్తున్న ఇస్రో గ్రూప్-ఏ శాస్త్రవేత్తగా అవకాశం దక్కించుకున్నాడు ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి దూలం రవితేజ. అతని విజయ ప్రస్థానం.. ఇస్రో శాస్త్రవేత్తగా అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మాది వరంగల్ జిల్లాలోని నర్సంపేట. నాన్న రాజేంద్ర, అమ్మ జ్యోతి. ఇద్దరూ ఉపాధ్యాయులు. పదో తరగతి వరకు వరంగల్‌లో చదువుకున్నా. నేనేమీ పుస్తకాల పురుగును కాదు.. చదివినంతసేపూ ఏకాగ్రతతో చదివేవాణ్ని. ఎంసెట్‌లో మంచి ర్యాంకు రావడంతో ఓయూ క్యాంపస్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ సీటొచ్చింది. నాన్నకు ఓయూలో చదవాలనే కోరిక ఉండేది. ఆర్థిక పరిస్థితులు సహక రించక అది సాధ్యపడలేదు. నేను, అన్నయ్య నటరాజ్ ఓయూలో ఇంజనీరింగ్ చదవటం ద్వారా ఆయన కలను నిజం చేశామనిపిస్తోంది. కార్పొరేట్ ఉద్యోగం వదిలి: ఇంజనీరింగ్ చివరి సంవత్సరంలో ప్రాంగణ నియామకాలు జరిగాయి. రాతపరీక్షలో తక్కువ మార్కులు రావడంతో, ఇంటర్వ్యూ జాబితాలో నా పేరు చివర్లో ఉంది. నియామకాలు జరుపుతున్న వారు ఫ్లయిట్‌కు సమయం అవుతుండటంతో హడావిడిగా ఉన్నారు. అయితే ఇంటర్వ్యూలో నా సమాధానాలు వారిని సంతృప్తి పరచడంతో తమ ప్రముఖ విదేశీ కార్ల కంపెనీలో ప్రొడక్షన్ మేనేజర్‌గా అవకాశమిచ్చారు. ఉద్యోగం ఢిల్లీలో. వేతనం నెలకు రూ.50 వేలు. అయితే ఆ కంపెనీలో భారతీయుల తెలివితేటలను అపహేళన చేస్తూ కొందరు మాట్లాడుతుండేవారు. అలాంటప్పుడు చాలా భాదేసేది. ఉద్యోగాన్ని వదిలేసి, ఉన్నత చదువుల కోసం మళ్లీ హైదరాబాద్ వచ్చి ఓయూలో ఎంటెక్ కోర్సులో చేరా. నాన్న.. కొండంత అండగా: ఉద్యోగాన్ని విడిచిపెట్టిన సమయంలో అనవసరంగా రిస్క్ చేస్తున్నావేమో ఆలోచించుకో అని కొందరన్నారు. నాన్న మాత్రం.. నీకేది నచ్చితే అది చెయ్యంటూ కొండంత అండగా నిలిచారు. ఆ కంపెనీకి బాండ్ ప్రకారం చెల్లించాల్సిన రూ.రెండు లక్షలు ఇచ్చేందుకూ సిద్ధపడ్డారు. ఒకవైపు ఎంటెక్ చేస్తూనే బీహెచ్ఈఎల్, ఎస్ఏఐఎల్ వంటి ప్రముఖ ప్రభుత్వ సంస్థల పరీక్షలకు సిద్ధమయ్యాను. వీటి నుంచి ఇప్పటికే కొన్ని జాబ్ ఆఫర్స్ వచ్చాయి. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ (ఐఈఎస్) ఇంటర్వ్యూ బాగా చేశా. త్వరలోనే ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో ఇస్రో ఫలితాల్లో టాపర్‌గా నిలవడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఒకవేళ ఐఈఎస్‌కు ఎంపికైనా, ఇస్రోకే ప్రాధాన్యం ఇస్తా. అది కఠిన పరీక్ష: చెప్పుకోదగ్గ విజయాలతో ప్రగతి బాటలో నడుస్తున్న ఇస్రో నుంచి చాలా తక్కువ నోటిఫికేషన్లు వస్తుంటాయి. శాస్త్రవేత్తల నియామకాలకు 2013 జనవరిలో ఇస్రో నిర్వహించిన పరీక్షలకు దాదాపు లక్ష మంది హాజరయ్యారు. ప్రశ్నపత్రంలో 80 ప్రశ్నలు ఇచ్చారు. వీటికి 90 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాలి. మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు లోతుగా వచ్చాయి. రాత పరీక్ష గట్టెక్కాక ఈ ఏడాది జనవరి 28న హైదరాబాద్‌లోని బాలానగర్ ఇస్రో కార్యాలయంలో ఇంటర్వ్యూ జరిగింది. మిట్టల్ సారథ్యంలో 11 మంది సభ్యుల బోర్డు ఇంటర్వ్యూ చేసింది. దాదాపు 35 నిమిషాల పాటు ఇంటర్వ్యూ జరిగింది. మొత్తం 40 ప్రశ్నలను ఎదుర్కొన్నాను. సమాధానాలు బోర్డుపై అవసరమైన పటాలు వేసి, విశ్లేషిస్తూ ఇవ్వాల్సి వచ్చింది. కొరియాలిస్ కాంపొనెంట్ ఆఫ్ యాక్సిలిరేషన్పై మొదటి ప్రశ్న అడిగారు. ఇంజనీరింగ్‌లో ఇష్టమైన సబ్జెక్టులు ఏంటని అడిగారు. -
అరుణ గ్రహం దారిలో..
-
అరుణ గ్రహం దారిలో..
* భూ కక్ష్యను దాటి మలిదశ యాత్రను మొదలుపెట్టిన ‘మామ్’ * అంగారకుని వైపు పది నెలలు సాగనున్న ప్రయాణం చెన్నై/బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్)(మంగళ్యాన్) వ్యోమనౌక ప్రస్థానంలో మలిదశ మొదలైంది. ఈ వ్యోమనౌక ఆదివారం వేకువ జామున భూ కక్ష్యను అధిగమించి, అంగారకుని వైపుగా తన కీలకమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. అంగారకుని వైపు 68 కోట్ల కిలోమీటర్ల దూరాన్ని అధిగమించేందుకు ‘మామ్’ పది నెలల పాటు తన ప్రయాణాన్ని కొనసాగించనుంది. ఇది 2014 సెప్టెంబర్‌లో అంగారకుని కక్ష్యలోకి చేరుకోగలదు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నవంబర్ 5న ‘మామ్’ను ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు ప్రయోగించిన సంగతి తెలిసిందే. తొలిదశలో భూ కక్ష్యలో పరిభ్రమించిన ఈ వ్యోమనౌక, ఆదివారం 00.49 గంటలకు భూ కక్ష్యను అధిగమించింది. భూ కక్ష్య నుంచి బయటకు నిర్ణీత దిశలో పంపేందుకు వ్యోమనౌకలోని 440 న్యూటన్ లిక్విడ్ ఇంజన్‌ను 22 నిమిషాల సేపు మండించారు. దీంతో అంగారకుని దిశగా సెకనుకు 648 మీటర్ల వేగాన్ని పుంజుకుంది. బెంగళూరులోని ‘ఇస్రో’ ప్రధాన కార్యాలయం నుంచి శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. కాగా, ‘మామ్’ భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న కాలంలో శాస్త్రవేత్తలు ఐదుసార్లు దీని కక్ష్యను పొడిగించిన సంగతి తెలిసిందే. -
‘మామ్’ కక్ష్య పెంపు దిగ్విజయం
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్/చెన్నై: అరుణగ్రహంపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పంపిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్/మంగళ్యాన్) ఉపగ్రహాన్ని కక్ష్యలో ఎత్తుకు చేర్చే ప్రక్రియ దిగ్విజయంగా పూర్తయింది. శనివారం తెల్లవారుజామున 1:27 గంటలకు ఉపగ్రహంలోని ఇంధనాన్ని 243.5 సెకన్లపాటు మండించి కక్ష్య పెంపులో తుది దశను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో వర్గాలు వెల్లడించాయి. నవంబర్ 5న రోదసీకి చేరిన మామ్‌ను తర్వాత కక్ష్యలో ఎత్తుకు చేర్చేందుకు చేపట్టిన తొలి మూడు దశలు విజయవంతం కాగా, నాలుగోసారి మాత్రం ఇంధన సరఫరా నిలిచిపోవడం వల్ల అవాంతరం ఎదురైంది. దీంతో మరోసారి అనుబంధ పెంపు ప్రక్రియ చేపట్టి ఉపగ్రహం కక్ష్యను 1.18 లక్షల కి.మీ. అపోజీ(భూమికి దూరపు బిందువు)కి పెంచారు. శనివారంనాటి తుది పెంపుతో ఉపగ్రహం కక్ష్యలో 1,92,874 కి.మీ. అపోజీకి చేరిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ఉపగ్రహం డిసెంబర్ 1 తెల్లవారుజామున 12:42 గంటలకు అంగారకుడి దిశగా ప్రయాణం మొదలుపెట్టనుందని, 2014 సెప్టెంబర్ 24న అంగారకుడి కక్ష్యను చేరుకోనుందన్నారు. -
మరింత ఎత్తుకు ‘మామ్’
చెన్నై: అంగారకగ్రహంపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) అంతరిక్ష నౌకను శుక్రవారం భూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో మరింత ఎత్తుకు పంపించింది. భూమికి దూరంగా (అపోజీ) కక్ష్యలో 28,814 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్బిటర్‌ను 40,186 కిలోమీటర్ల ఎత్తుకు చేర్చారు. దీనికోసం ఆర్బిటర్‌లోని ఇంజన్‌ను శుక్రవారం తెల్లవారుజామున 2:18 గంటలకు 570.6 సెకన్ల పాటు మండించారు. మంగళవారం శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి రోదసిలోకి పంపిన మార్స్ ఆర్బిటర్ భూ కక్ష్య ఎత్తును గురువారం తెల్లవారుజామున మొదటిసారి పెంచిన విషయం తెలిసిందే. శుక్రవారం రెండో విడత ఎత్తు పెంపును విజయవంతంగా పూర్తిచేశారు. శనివారం మూడోసారి, 11వ తేదీన నాలుగోసారి, 16వ తేదీన ఐదోసారి ఆర్బిటర్ ఎత్తును పెంచుకుంటూ వెళతారు. ఐదో విడతలో ఆర్బిటర్ కక్ష్య ఎత్తును 1,92,000 కిలోమీటర్లకు పెంచిన తర్వాత.. డిసెంబర్ 1న తెల్లవారుజామున 12:42 గంటలకు అంగారక మార్గంలోకి ప్రవేశపెడతారు. -
భారతదేశ అంతరిక్ష విజయాలు...
ప్రతి పోటీ పరీక్షలోనూ జనరల్ అవేర్‌నెస్‌లో కీలకమైన విభాగం శాస్త్ర, సాంకేతిక అంశాలు (సైన్స్ అండ్ టెక్నాలజీ). ఈ విభాగంలో ముఖ్యంగా మనదేశం ప్రయోగించిన వివిధ ఉపగ్రహాలు, ఏ సంవత్సరంలో, ఎక్కడి నుంచి ప్రయోగించారు? ఆ ఉపగ్రహాల వల్ల ఉపయోగాలు వంటి అంశాలను అధ్యయనం చేస్తే మంచి మార్కులు సాధించొచ్చు. ఈ నేపథ్యంలో భారతదేశం ప్రయోగించిన వివిధ ఉపగ్రహాల వివరాలు.. ఎన్. విజయేందర్ రెడ్డి జనరల్ అవేర్నెస్ ఫ్యాకల్టీ, హైదరాబాద్. ముందుగా ప్రపంచ అంతరిక్ష రంగాన్ని పరిశీలిస్తే.. అమెరికా, సోవియట్ యూనియన్ (ప్రస్తుతం రష్యా) దేశాలు మొదట్లో అంతరిక్ష రంగంలో తీవ్రంగా పోటీపడ్డాయి. ప్రపంచంలో మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్-1ను 1957లో అప్పటి సోవియట్ యూనియన్ (యూఎస్ఎస్ఆర్) ప్రయోగించింది. అదే ఏడాది స్పుత్నిక్-2ను, అందులో లైకా అనే కుక్కను అంతరిక్షంలోకి పంపారు. తద్వారా రోదసీలో ప్రయాణించిన తొలి జంతువుగా లైకా పేరుగాంచింది. 1958లో అమెరికా తన తొలి ఉపగ్రహం ఎక్స్‌ప్లోరర్-1ను ప్రయోగించింది. రష్యాకు చెందిన వ్యోమగామి యూరీ గగారిన్ 1961, ఏప్రిల్ 12న వొస్తోక్-1 అనే అంతరిక్ష నౌకలో ప్రయాణించి తొలి అంతరిక్ష యాత్రికుడిగా రికార్డు సృష్టించాడు. మే, 1961లో అలెన్ షెపర్‌డకు మొదటి అమెరికా అంతరిక్ష యాత్రికుడిగా గుర్తింపు దక్కింది. అంతరిక్షయానం చేసిన మొదటి మహిళ రష్యాకు చెందిన వాలెంతినా తెరిష్కోవా. ఆమె 1963, జూన్ 16న అంతరిక్షంలోకి ప్రవేశించింది. రష్యాకు చెందిన అలెక్సీ లెనోవ్ అంతరిక్షంలో నడిచిన మొదటి మానవుడు. ఆయన 1965, మార్చి18న ఈ ఘనత సాధించాడు. 1969, జూలై 20న అమెరికాకు చెందిన నీల్ ఆర్మస్ట్రాంగ్ చంద్రుడిపై అడుగిడిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. ఆయనతోపాటు ఎడ్విన్ ఆల్డ్రిన్, మైకేల్ కొలిన్స్ కూడా అపోలో-11 నౌకలో ప్రయాణించారు. 1984లో అంతరిక్షయానం చేసిన మొదటి భారతీయుడు రాకేష్ శర్మ. నవంబర్, 1997లో కొలంబియా నౌకలో ప్రయాణించిన కల్పనా చావ్లా మొదటి భారతీయ అంతరిక్ష యాత్రికురాలు. ఆమె 2003, ఫిబ్రవరి 1న కొలంబియా నౌక కూలిపోవడంతో మరణించారు. భారతీయ అమెరికన్ మహిళ సునీతా విలియమ్స్ అంతరిక్షంలో 195 రోజులు గడిపి రికార్డు సృష్టించారు. అంతరిక్షంలో ఎక్కువసేపు నడిచిన (స్పేస్‌వాక్) మహిళ కూడా ఈమే. సునీత 50 గంటల 40 నిమిషాలపాటు అంతరిక్షంలో నడవటంతోపాటు మొత్తం ఏడుసార్లు స్పేస్‌వాక్ చేసింది. ఇస్రో: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇండియన్ స్పేస్ రీసెర్చ ఆర్గనైజేషన్-ఇస్రో)ను 1969లో ఏర్పాటు చేశారు. ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. ఇస్రో భారత ప్రభుత్వంలోని అంతరిక్ష విభాగం నియంత్రణలో పనిచేస్తోంది. ఇస్రో ప్రస్తుత చైర్మన్ కె.రాధాకృష్ణన్. అంతరిక్ష పరిశోధనల కోసం ఏర్పాటైన ఇస్రో 1975, ఏప్రిల్ 19న భారతదేశ తొలి ఉపగ్రహం ఆర్యభట్టను సోవియట్ యూనియన్ నుంచి ప్రయోగించింది. భారత అంతరిక్ష పరిశోధన పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్. ఆయన అహ్మదాబాద్‌లో ఫిజికల్ రీసెర్చ లేబొరేటరీని ఏర్పాటు చేశారు. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌ను ఆయన పేరు మీదనే నెలకొల్పారు. ఆయన ఇస్రో మొదటి చైర్మన్. ఇప్పటివరకు ఏడుగురు ఇస్రో చైర్మన్లుగా బాధ్యతలు నిర్వర్తించారు. వారు.. విక్రమ్ సారాభాయ్, ఎం.జి.కె.మీనన్, సతీశ్ ధావన్, యు.ఆర్.రావు, కె.కస్తూరిరంగన్, జి.మాధవన్ నాయర్, కె.రాధాకృష్ణన్. వీరిలో సతీశ్ ధావన్ అత్యధిక కాలం ఇస్రో చైర్మన్‌గా పనిచేశారు. ఆయన 1972 నుంచి 1984 వరకు 12 ఏళ్లు ఆ పదవిలో ఉన్నారు. 2002లో సతీశ్ ధావన్ మరణానంతరం శ్రీహరికోటలోని ఉపగ్రహ ప్రయోగ కేంద్రానికి సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రంగా నామకరణం చేశారు. భారత అంతరిక్ష రంగంలో మైలురాళ్లు 1962 - భారత జాతీయ అంతరిక్ష పరిశోధనా కమిటీ ఏర్పాటు. 1965 - తుంబాలో స్పేస్ సైన్స అండ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు. 1969 - ఆగస్ట్ 15న ఇస్రో ఏర్పాటైంది. అప్పుడు అణుశక్తి విభాగం కింద ఉండేది. 1971 - ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో షార్ కేంద్రం ఏర్పాటైంది. 1972 - డిపార్టమెంట్ ఆఫ్ స్పేస్‌ను ఏర్పాటు చేసి ఇస్రోను అంతరిక్ష విభాగం కిందకు తీసుకువచ్చారు. అహ్మదాబాద్‌లో స్పేస్ అప్లికేషన్స సెంటర్‌ను ఏర్పాటు చేశారు. 1975 - భారత తొలి ఉపగ్రహం ఆర్యభట్టను ఏప్రిల్ 19న రష్యాలోని బైకనూరు నుంచి ప్రయోగించారు. 1979 - భాస్కర -1 ఉపగ్రహాన్ని ప్రయోగించారు. 1980 - శ్రీహరికోట నుంచి శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎల్వీ-3) ద్వారా రోహిణి ఉపగ్రహాన్ని ప్రయోగించారు. 1981 - జియోస్టేషనరీ కమ్యూనికేషన్ శాటిలైట్ యాపిల్‌ను ఫ్రెంచ్ గయానా నుంచి ప్రయోగించారు. అఞఞ్ఛ అంటే ఏరియన్ ప్యాసింజర్ పేలోడ్ ఎక్స్పెరిమెంట్. 1981 - భాస్కర -2 ప్రయోగం. 1982 - అమెరికా రాకెట్ ద్వారా ఇన్శాట్-1ఏ కమ్యూనికేషన్ శాటిలైట్ ప్రయోగం. 1983 - ఇన్శాట్ -1 బీ ప్రయోగం. 1984 - రష్యా రాకెట్ సోయూజ్ టీ-11లో రాకేష్‌శర్మ అంతరిక్షయానం. 1987 - విఫలమైన మొదటి ఎస్ఎల్వీ ప్రయోగం (ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్). 1988 - రష్యా రాకెట్ ద్వారా తొలి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఐఆర్ఎస్-1ఏ ప్రయోగం. 1991 - ఐఆర్ఎస్-1బీ ప్రయోగం. 1992 - ఇన్శాట్ -2ఏ ప్రయోగం. 1993 - పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) ద్వారా ఐఆర్ఎస్-1ఈ ప్రయోగం. ఇది విఫలమైంది. 1994 - పీఎస్ఎల్వీ ద్వారా ఐఆర్ఎస్-పీ2ను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. 1995 - ఇన్శాట్ -2సీ, ఐఆర్ఎస్-1సీ ప్రయోగం. 1996 - పీఎస్ఎల్వీ -డీ3ని ఉపయోగించి ఐఆర్ఎస్-పీ3ను కక్ష్యలో ప్రవేశపెట్టారు. 1997 - ఐఆర్ఎస్-1డీ ప్రయోగం. 1999 - ఓషన్ శాట్‌తోపాటు విదేశీ శాటిలైట్లను కూడా తొలిసారి ప్రయోగించారు. కొరియా, జర్మనీలకు చెందిన శాటిలైట్లను ప్రయోగించారు. 2000 - ఇన్శాట్-3బీ ప్రయోగం. 2001- జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్(జిఎస్ఎల్వీ) రాకెట్ ద్వారా జీశాట్-1 శాటిలైట్‌ను ప్రయోగించారు. 2002 - వాతావరణ ఉపగ్రహం కల్పన-1ను ప్రయోగించారు. దీని మొదటి పేరు మెట్శాట్-1. 2003 - జీశాట్-2ను, రిసోర్‌సశాట్-1ను ప్రయోగించారు. 2004 - విద్యాసేవలకై ఎడ్యుశాట్ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. 2005 - మ్యాపింగ్ ప్రక్రియలకు ఉద్దేశించిన కార్టోశాట్-1ను, హ్యామ్ రేడియో సేవల కోసం హ్యామ్‌శాట్‌ను పీఎస్ఎల్వీ-సీ6 ద్వారా ప్రయోగించారు. 2005 - ఇన్శాట్-4ఏ ప్రయోగం. 2007 - కార్టోశాట్-2, ఇన్శాట్-4సీఆర్‌ను ప్రయోగించారు. 2008 - పీఎస్ఎల్వీ-సీ10 ద్వారా ఇజ్రాయెల్ శాటిలైట్ టెక్సార్ ప్రయోగం. పీఎస్ఎల్వీ-సీ9 ద్వారా ఒకేసారి 10 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇందులో రెండు భారత్‌వి, ఎనిమిది విదేశాలకు చెందినవి. 2008 - పీఎస్ఎల్వీ -సీ11 ద్వారా చంద్రయాన్-1ను ప్రయోగించారు. 2009 - పీఎస్ఎల్వీ- సీ12 ద్వారా రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ (రీశాట్-2), అన్నా యూనివర్సిటీకి చెందిన అనుశాట్‌ను ప్రయోగించారు. 2010-పీఎస్ఎల్వీ -సీ15 వాహక నౌక ద్వారా కార్టోశాట్-2బి, స్టడ్‌శాట్‌లతోపాటు మూడు విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించారు. 2011-పీఎస్ఎల్వీ-సీ16 ద్వారా రిసోర్‌సశాట్-2, యూత్‌శాట్, ఎక్స్‌శాట్ ప్రయోగం. ఇవికాకుండా జీశాట్-12, మేఘ ట్రాపిక్స్ ఉపగ్రహ ప్రయోగాలు. 2012-ఫ్రెంచ్ శాటిలైట్ స్పాట్-6, జపాన్ శాటిలైట్ ప్రోయిటెరస్ ప్రయోగం. వీటిని పీఎస్ఎల్వీ-సీ21 రాకెట్ ద్వారా శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. ఇది ఇస్రో 100వ అంతరిక్ష ప్రయోగం. 2013-పీఎస్ఎల్వీ-సీ20 రాకెట్ ద్వారా సరళ్ అనే భారత్-ఫ్రెంచ్ శాటిలైట్‌ను ప్రయోగించారు. ఇది సముద్రాలను అధ్యయనం చేస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 25న సరళ్‌తోపాటు ఆరు విదేశీ శాటిలైట్లను కూడా ప్రయోగించారు. అవి.. ఆస్ట్రియాకు చెందిన యూనిబ్రైట్, బ్రైట్; డెన్మార్‌కకు చెందిన అవ్‌శాట్-3, యూకేకు చెందిన స్ట్రాండ్, కెనడాకు చెందిన నియోశాట్, సాఫైర్. 2013-పీఎస్ఎల్వీ-సీ22 ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఏ అనే నావిగేషన్ శాటిలైట్‌ను ఈ ఏడాది జూలై1న ప్రయోగించారు. 2013-ఫ్రెంచ్ గయానాలోని కౌరూ నుంచి ఈ ఏడాది జూలై 26న భారత వాతావరణ ఉపగ్రహం ఇన్శాట్-3డీని విజయవంతంగా ప్రయోగించారు. 2013 - ఈ ఏడాది నవంబర్‌లో మార్స ఆర్బిటర్ మిషన్‌ను ప్రయోగిస్తారు. ఇది అంగారక గ్రహంపై పరిశోధనలు నిర్వహిస్తుంది. చంద్రయాన్: శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ నుంచి 2008, అక్టోబర్ 22న పీఎస్ఎల్వీ-సీ11 ద్వారా చంద్రయాన్-1ను ప్రయోగించారు. ఇది 312 రోజులు పనిచేసి 2009, ఆగస్టు 29న ఆగిపోయింది. చంద్రయాన్ చంద్రుడిపై నీటి ఆనవాళ్లను గుర్తించింది. త్వరలో చంద్రయాన్-2ను కూడా ప్రయోగిస్తారు. పరిశోధనా సంస్థలు - వాటి విధులు 1.ఇస్రో - బెంగళూరు 2.ఫిజికల్ రీసెర్చ లేబొరేటరీ - అహ్మదాబాద్: ఖగోళ భౌతిక శాస్త్రం, సౌరకుటుంబ భౌతిక శాస్త్రం, ప్లాస్మా భౌతిక శాస్త్రం, పురావస్తు శాస్త్రాల అధ్యయనం. 3.సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం - శ్రీహరికోట, నెల్లూరు జిల్లా: రాకెట్లు, ఉపగ్రహాలను ప్రయోగించే కేంద్రం. 4.విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ - తిరువనంతపురం: ఉపగ్రహ వాహక నౌకల తయారీ కేంద్రం. 5.తుంబా ఈక్వెటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ - తిరువనంతపురం: రాకెట్లను ప్రయోగించే ప్రదేశం. 6.నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ - హైదరాబాద్: దీనిని గతంలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ అని పిలిచేవారు. 7.మాస్టర్ కంట్రోల్ కేంద్రం - భోపాల్ (మధ్యప్రదేశ్), హసన్ (కర్ణాటక). 8.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స అండ్ టెక్నాలజీ - తిరువనంతపురం: ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో కోర్సులను నిర్వహిస్తోంది. 9.ఆంట్రిక్స్ కార్పొరేషన్-బెంగళూరు: ఇది ఇస్రో వాణిజ్య విభాగం. దీన్ని ఉపగ్రహాల సాంకేతిక పరిజ్ఞానం, సేవలను మార్కెట్ చేయడానికి ఏర్పాటు చేశారు. ఏపీపీఎస్సీ పరీక్షలలో అడిగిన కొన్ని ప్రశ్నలు 1.ఏ సంవత్సరంలో ఇండియా తన మొదటి ఉపగ్రహం ఆర్యభట్టను ప్రయోగించింది? 2.కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రయోగించిన మొదటి దేశం? 3.మానవ వ్యోమగామిని చంద్రుడిపైకి పంపిన మొదటి దేశం? 4.విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం, భారత రాకెట్ లాంచింగ్ కేంద్రం ఉన్న రాష్ర్టం? 5.సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఎక్కడ ఉంది? 6.చంద్రుడిపై మానవుడు ఎప్పుడు కాలుమోపాడు? 7.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స అండ్ టెక్నాలజీ ఏ రాష్ర్టంలో ఉంది? 8.ఇస్రో ప్రస్తుత చైర్మన్? సమాధానాలు: 1. 1975; 2. యూఎస్ఎస్ఆర్; 3. యూఎస్ఏ; 4. కేరళ; 5. శ్రీహరికోట; 6. 1969; 7. కేరళ; 8. కె.రాధాకృష్ణన్ -
30న జీశాట్-7 ప్రయోగం
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: దేశ రక్షణ వ్యవస్థకు ఉపయోగపడే అధునాతన సమాచార ఉపగ్రహం జీశాట్-7ను ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ నెల 30న ప్రయోగించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సన్నాహాలు చేస్తోంది. 2,550 కిలోల బరువైన ఈ ఉపగ్రహాన్ని ఫ్రెంచి అంతరిక్ష సంస్థకు చెందిన ఏరియన్-వీఏ215 ఉపగ్రహ వాహకనౌక ద్వారా నింగికి పంపనున్నారు. ఇస్రో ఇప్పటి దాకా 23 సమాచార ఉపగ్రహాలను ప్రయోగించగా జీశాట్-7 ఇరవైనాలుగో సమాచార ఉపగ్రహం. ఈ తరహా బరువైన సమాచార ఉపగ్రహాలను రోదసీలోకి పంపేందుకు ఇస్రో ‘జియోసింక్రోనస్ లాంచింగ్ వెహికల్ (జీఎస్ఎల్వీ)’ ఉపగ్రహ వాహకనౌకను రూపొందించింది. అయితే.. జీఎస్ఎల్వీ సాంకేతిక పరిజ్ఞానంలో కాస్త వెనుకబడి ఉండటంతో బరువైన సమాచార ఉపగ్రహాలను ఫ్రెంచి అంతరిక్ష సంస్థ సహకారంతో ప్రయోగిస్తున్నారు. దేశ రక్షణ వ్యవస్థకు విలువైన సమాచారాన్ని అందించేందుకు మల్టిపుల్ బాండ్ ఆల్ట్రా హై ఫ్రీక్వెన్సీతో కూడిన ఎస్-బాండ్, సీ-బాండ్, హై క్వాలిటీ కేయూ-బాండ్ పరికరాలను జీశాట్-7లో అమర్చారు. ఈ ఉపగ్రహాన్ని బెంగళూరులోని ఐసాక్ కేంద్రం, అహ్మదాబాద్‌లోని స్పేస్ అఫ్లికేషన్ సెంటర్ శాస్త్రవేత్తలు రూపొందించారు. కాగా, రాష్ట్రంలోని శ్రీహరికోట నుంచి ఈ నెల 19న జీఎస్ఎల్వీ డీ-5 ద్వారా జీశాట్-14ను ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేయగా.. సాంకేతికలోపంతో ప్రయోగాన్ని వాయిదా వేసిన విషయం తెలిసిందే. -
నేడు నింగికి ‘జీఎస్ఎల్వీ డీ5’
* నిర్విఘ్నంగా సాగుతున్న కౌంట్‌డౌన్ * సాయంత్రం గం. 4.50 కు ‘షార్’ నుంచి ప్రయోగం సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజనిక్ ఇంజన్ తో కూడిన జీఎస్ఎల్వీ డీ5 రాకెట్ సోమవారం నింగికి దూసుకుపోనుంది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో ఈ మేరకు ఆదివారం ఉదయం 11.50 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమై నిర్విఘ్నంగా కొనసాగుతోంది. 29 గంటల కౌంట్‌డౌన్ అనంతరం సోమవారం సాయంత్రం 4.50 గంటలకు రెండో ప్రయోగవేదిక నుంచి జీఎస్ఎల్వీ డీ5 నింగికి దూసుకుపోనుంది. ప్రయోగానికి ఆరు గంటల ముందు రాకెట్‌లోని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వ్యవస్థలను అప్రమత్తం చేస్తారు. ఈ ప్రయోగం ద్వారా జీశాట్-14 సమాచార ఉపగ్రహాన్ని 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెడతారు. జీశాట్-14లో 6 కేయూ బాండ్, 6 ఎక్సెటెండెడ్ సీబాండ్, భవిష్యత్తులో ఉపయోగించుకోవడానికి రెండు కేఏ-బాండ్ ట్రాన్స్పాండర్లు ఉన్నాయి. డీటీహెచ్ ప్రసారాలు, టెలికం రంగానికి ఈ ఉపగ్రహం 12 ఏళ్లపాటు సేవలు అందించనుంది. జీఎస్ఎల్వీ డీ5 కౌంట్‌డౌన్‌ను ఇస్రో చైర్మన్ కె.రాధాకృష్ణన్ నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ ప్రయోగంలో క్రయోజనిక్ దశ కీలకం కావడం, గతంలో ఆ దశ వైఫల్యం చెందిన నేపథ్యంలో ఆయన అప్రమత్తంగా ఉన్నారు.