ఇస్రోకు కేర్ మాడ్యూల్
మానవ సహిత అంతరిక్ష యాత్రకు ఇస్రో ప్రయోగించిన జీఎస్‌ఎల్‌వీ మార్క్ -3లోని కేర్ మాడ్యూల్‌ను ఆదివారం చెన్నైకు చేర్చారు. ఎన్నూరు హార్బర్‌కు చేరుకున్న ఈ మాడ్యూల్‌ను ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ పరిశీలించారు.
- అండమాన్ నుంచి చెన్నైకు
- నౌకలో తీసుకొచ్చిన వైనం
- పరిశీలించిన రాధాకృష్ణన్
సాక్షి, చెన్నై : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) గురువారం చరిత్ర సృష్టించే అద్భుతాన్ని పరిశోధించిన విషయం తెలిసిందే. మానవ సహిత అంతరిక్ష యాత్రలకు ముందడుగు వేస్తూ జీఎస్‌ఎల్‌వీ మార్క్-3ని ప్రయోగించింది. ఈ ప్రయోగం విజయవంతం అయింది. ఈ ప్రయోగంలో భాగంగా నింగిలోకి వెళ్లి కేర్ మాడ్యూల్(వ్యోమగాముల గది) మళ్లీ కిందకు దిగింది.
ఇందులో అమరికల మేరకు పారాచూట్ల సాయంతో ఆ మాడ్యూల్ అండమాన్ సముద్ర తీరంలో సురక్షితంగా దిగింది. దీనిని అత్యంత జాగ్రత్తగా భారత నావికాదళం, కోస్ట్ గార్డ్‌లు చెన్నైకు తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక నౌకలో ఎన్నూర్ హార్బర్‌కు తీసుకొచ్చారు. నౌక నుంచి భారీ క్రేన్ సాయంతో దీనిని నిపుణులు కామరాజర్ టెర్మినల్‌కు తీసుకొచ్చారు. దీనిని ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ పరిశీలించారు. అనంతరం గట్టి భద్రత నడుమ ఈ మాడ్యూల్‌ను శ్రీహరి కోటకు తరలించారు.