అంగారకుడి దిశగా మార్స్ అర్బిటర్: ఇస్రో
అంగారకుడి దిశగా మార్స్ అర్బిటర్: ఇస్రో
Published Mon, Sep 15 2014 11:12 PM | Last Updated on Sat, Sep 2 2017 1:25 PM
బెంగళూరు: అంతరిక్ష ప్రయోగంలో కీలక ఘట్టానికి ఇస్రో తెర తీయడానికి సిద్దమవుతోంది. అంతరిక్షంలో ప్రవేశపెట్టిన మార్స్ ఆర్బిటర్ అంగారకుడి దిశగా ప్రయాణిస్తోందని శాస్త్రజ్ఞులు వెల్లడించారు. మార్స్ ఆర్బిటర్ 98శాతం యాత్ర పూర్తి చేసుకుందని, 300 రోజుల పాటు ప్రయాణం సాగించిందని, ఈ ప్రయోగంలో లిక్విడ్ ఇంజన్10నెలల తర్వాత పనిచేయనున్నదని ఇస్రో వెల్లడించింది. అంగారక కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించేందుకు ఇస్రో కమాండ్స్ ఇవ్వనుందన్నారు.
సెప్టెంబర్ 24 ఉదయం 7.30 ని.లకు మార్స్‌ఆర్బిటర్ అంగారక కక్ష్యలోకి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. భూమికి 22.4 కోట్ల కిలోమీటర్ల దూరంలో మార్స్ ఆర్బిటర్ ఉందని శాస్త్రజ్ఞులు వెల్లడించారు. ఆర్బిటర్‌లోని అన్ని పరికరాలు సజావుగా పనిచేస్తున్నాయని, బెంగళూరు, అమెరికాలోని గోల్డ్‌స్టోన్, స్పెయిన్‌లోని మాడ్రిడ్, ఆస్ట్రేలియాలోని కాన్ బెర్రా నుంచి ఆర్బినేటర్‌కు సంకేతాలు అందయాని ఇస్రో ఓ ప్రకటనలో వెల్లడించింది.
Advertisement