తాడేపల్లి, న్యూస్‌లైన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) ‘అంతర్జాతీయ పరిశోధన’ అంశంలో గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలోని పెనుమాక వందేమాతరం హైస్కూల్ పూర్వ విద్యార్థిని కొక్కిలగడ్డ ఝాన్సీ ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం నూజివీడు ఐఐఐటీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న ఈమె ‘అంతరిక్షంలో నివాసం’ అనే అంశంపై 100 పేజీల పరిశోధన పత్రాలను సమర్పించింది. దీనికి ‘నాసా’ అంతర్జాతీయ పరిశోధనలో ప్రపంచంలోనే మొదటి స్థానం లభించిందని పాఠశాల హెచ్‌ఎం జ్యోతికిరణ్ సోమవారం తెలిపారు.