ఢిల్లీ: జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలు విడుదల అయ్యాయి. శనివారం ఉదయం ఫలితాల్ని రిలీజ్ చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) తన అఫీషియల్ వెబ్‌సైట్‌లో ప్రకటించింది.
ఏప్రిల్ 6 నుంచి 15 వరకు జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక జేఈఈ మెయిన్ ఫలితల కోసం రీవాల్యూయేషన్, రీ చెకింగ్ లాంటివి ఉండవని, కాబట్టి అభ్యర్థులు సంప్రదించేందుకు ప్రయత్నించకూడదని సూచించింది ఎన్‌టీఏ.
రిజల్ట్ చెక్ చేసుకునేందుకు.. స్కోర్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకునేందుకు.. https://jeemain.nta.nic.in/ వీక్షించొచ్చు.
జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్ష జనవరిలో జరిగింది. ఏప్రిల్ 6 నుంచి 15 రెండో విడత జరిగాయి. మొదటి విడత పరీక్షకు 8.24 లక్షల మంది, రెండో విడత పరీక్షకు దాదాపు 9 లక్షల మంది హాజరయ్యారు.
ఈ రెండుసార్లు పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన అభ్యర్థుల ఉత్తమ స్కోర్ ఆధారంగానే ఎన్‌టీఏ ర్యాంకులు ప్రకటించింది. జేఈఈ మెయిన్స్‌లో కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులు నిర్ణయించి.. మొత్తం 2.50 లక్షల మందిని అడ్వాన్స్‌డ్ రాయడానికి అర్హత కల్పిస్తారు.
ఈ నెల 30వ తేదీ నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు రిజిస్ట్రేషన్లు మొదలవుతాయి. మే 7వ తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. అప్లికేషన్ ఫీజును మే 8వ తేదీ వరకు చెల్లించవచ్చు. మే 29 నుంచి జూన్ 4వ తేదీ వరకు అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష జూన్ 4వ తేదీన ఉంటుంది. ఉదయం 9-12గం. పేపర్ 1, మధ్యాహ్నం 2.30-5.30 మధ్య రెండో పేపర్ ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment