
సాక్షి, అమరావతి: జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2021 మార్చి సెషన్ ప్రాథమిక ‘కీ’ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) శనివారం రాత్రి విడుదల చేసింది. మార్చి 16 నుంచి 18వ తేదీ వరకు ఈ పరీక్షలను కంప్యూటర్ ఆధారితంగా (సీబీటీ) నిర్వహించారు. ఈ పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రం, ప్రాథమిక ‘కీ’, అభ్యర్థుల రికార్డెడ్ రెస్పాన్స్ షీట్‌లను జేఈఈ మెయిన్ వెబ్‌సైట్లో పొందుపరిచినట్లు ఎన్‌టీఏ ఒక ప్రకటనలో వివరించింది.
ప్రాథమిక ‘కీ’పై అభ్యర్థులు 22వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు అభ్యంతరాలను సమర్పించవచ్చు. అయితే అభ్యర్థులు ఛాలెంజ్ చేసే ప్రతి ప్రశ్నకు రూ.200 చొప్పున రుసుము చెల్లించాలి. ఇది నాన్ రిఫండబుల్ రుసుము. అభ్యర్థులు తమ రుసుమును డెబిట్, క్రెడిట్, నెట్ బ్యాంకింగ్, పేటీఎంల ద్వారా 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు చెల్లించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment