
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్‌ఐటీ, తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్ సెకండ్ సెషన్ పరీక్షలు గురువారం (నేడు) ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 9.4 లక్షల మంది హాజరయ్యే అవకాశముంది. ఏపీ నుంచి 1.5 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
దేశంలోని 330 పట్టణాలు, విదేశాల్లోని 15 పట్టణాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏపీలోని 25 పట్టణాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. ఇవి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు. ఈ పరీక్షలు గురువారంతో పాటు 8, 10, 11, 12, 13, 15 తేదీల్లో జరుగుతాయి. ఇంతకు ముందు షెడ్యూల్‌లో 6 వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నప్పటికీ, అభ్యర్థుల సంఖ్య పెరగడంతో 13, 15 తేదీల్లో కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పరీక్ష నిర్వహిస్తోంది.
రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు బ్యాచ్‌లుగా పరీక్ష జరుగుతుంది. జేఈఈ మెయిన్ తొలి సెషన్‌కు 8.2 లక్షల మంది హాజరు కాగా, ఈసారి ఈ సంఖ్య పెరుగుతోంది, అభ్యర్ధులు పరీక్ష కేంద్రానికి అడ్మిట్ కార్డు కాపీలతో పాటు చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డును కూడా తీసుకురావాలని ఎన్‌టీఏ సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment