సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్‌ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థలలో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ–మెయిన్) 2021 4వ సెషన్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. మే లో జరగాల్సిన ఈ పరీక్షలు కోవిడ్ కారణంగా వాయిదా పడ్డాయి. కంప్యూటరాధారితంగా జరిగే ఈ పరీక్షలు సెప్టెంబర్ 2 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు 7 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు.
తొలిరోజు పేపర్–2 అయిన బీ.ఆర్క్, బీ.ప్లానింగ్ పరీక్షలు జరగనున్నాయి. బీటెక్ కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్షలు ఆ తరువాత వరుసగా నాలుగు రోజుల పాటు ఆగస్టు 27, 31, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో ఉదయం, సాయంత్రం రెండు బ్యాచ్‌లుగా జరుగుతాయి. జేఈఈ మెయిన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఈ సంవత్సరం నుంచి నాలుగు సెషన్లలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నాలుగో సెషన్ పూర్తి అయిన తరువాత సెప్టెంబర్ మూడో వారంలో తుది విడత ఫలితాలను అభ్యర్థుల ర్యాంకులతో సహా ఎన్‌టీఏ ప్రకటించనుంది.
నేటి నుంచి జేఈఈ 4వ విడత
Published Thu, Aug 26 2021 5:41 AM | Last Updated on Thu, Aug 26 2021 5:41 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment