జేఈఈ మెయిన్‌లో రాష్ట్ర విద్యార్థుల జయభేరి | Andhra Pradesh Students Tops In JEE Main Results | Sakshi
Sakshi News home page

జేఈఈ మెయిన్‌లో రాష్ట్ర విద్యార్థుల జయభేరి

Published Thu, Sep 16 2021 4:43 AM | Last Updated on Thu, Sep 16 2021 4:43 AM

Andhra Pradesh Students Tops In JEE Main Results - Sakshi

జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో టాప్‌–1 ర్యాంకర్లుగా నిలిచిన ఏపీ విద్యార్థులు, వెంకట ఫణీష్, కరణం లోకేష్‌

సాక్షి, అమరావతి/కదిరి అర్బన్‌/రాజంపేట రూరల్‌/ఒంగోలు మెట్రో/గుంటూరు ఎడ్యుకేషన్‌: దేశంలోనే ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్‌ విద్యా సంస్థలు.. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐ టీలు), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ ఐటీలు), తదితరాల్లో  ప్రవేశానికి నిర్వహించిన జా యింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ)–2021 మెయిన్‌ తుది ఫలితాల్లో రాష్ట్ర విద్యార్థులు సత్తా చాటారు. మంగళవారం అర్ధరాత్రి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఏన్‌టీఏ) విడుదల చేసిన తుది ఫలితాల్లో జాతీయ స్థాయి టాప్‌–1 ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిచారు.  100 పర్సంటైల్‌ స్కోర్‌ సాధించడంలో నూ ముందంజలో నిలిచారు. జాతీయ స్థాయిలో మొత్తం 44 మంది 100 పర్సంటైల్‌ స్కోర్‌ సాధించ గా.. ఇందులో 18 మంది టాప్‌–1లో చోటు దక్కించుకున్నారు. వీరిలో నలుగురు ఏపీకి చెందిన వారే కావడం విశేషం. దుగ్గినేని వెంకట ఫణీష్, కాంచనపల్లి రాహుల్‌ నాయుడు, కరణం లోకేష్, పసల వీర శివ టాప్‌–1 జాబితాలో ఉన్నారు. ఇక వరద మహంత్‌ నాయుడు, సత్తి కార్తికేయ, లక్ష్మీ సాయి లోకేష్‌ రెడ్డి జాతీయస్థాయి టాప్‌ స్కోరర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. బాలికల కేట గిరీలో చిచిలి మనస్వితరెడ్డి రాష్ట్రస్థాయిలో టాపర్‌గా నిలిచింది.  

మొత్తం 9.39 లక్షల మంది హాజరు
నాలుగు సెషన్లలో జేఈఈ మెయిన్‌  పరీక్షకు  9,39, 008 మంది హాజరయ్యారు.  నాలుగు సెషన్లలోనూ అత్యధికంగా చివరి సెషన్‌ పరీక్ష రాసినవారు 7, 67,700 మంది ఉన్నారు. 2.52 లక్షల మంది విద్యా ర్థులు 4 సెషన్లలోనూ పరీక్ష రాశారు. వీరికి ఆయా సెషన్లలో సాధించిన స్కోర్‌లో ఏది ఎక్కువగా ఉం టే దాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. మూడో సెషన్‌ ఫలితాల వరకు 100 పర్సంటైల్‌ సాధించిన వారు 36 మంది ఉండగా.. నాలుగో సెషన్‌లో మ రో 8 మందికి ఈ స్కోర్‌ లభించింది. టాప్‌–1 ర్యాంకు సాధించినవారిలో ఒకే రకమైన మార్కులు వచ్చిన వారికి వేర్వేరు టైబ్రేకింగ్‌ విధానంలో మెరి ట్‌ను నిర్ధారించారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభా గాల్లో వరుసగా అత్యధిక స్కోర్‌ సాధించినవారిని ముందు వరుసలోకి తీసుకున్నారు. ఈసారి జేఈఈని 12 ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించా రు. తెలుగులో 270 మంది మాత్రమే పరీక్ష రాశారు. అత్యధికం ఆంగ్లానికే ప్రాధాన్యమిచ్చారు.  నాలుగో సెషన్‌లో నిర్వహించిన బీఆర్క్, బీ ప్లానిం గ్‌ ఫలితాలను ఇంకా విడుదల చేయాల్సి ఉంది. 

జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు 2.5 లక్షల మంది ఎంపిక
జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో మెరిట్‌లో నిలిచిన టాప్‌ 2.5 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారు. ఇప్పటికే ఐఐటీ ఖరగ్‌పూర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు మెయిన్‌ కటాఫ్‌ 87.8992241గా ఉంది. ఈసారి కటాఫ్‌ గత ఏడాదికంటే తక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా అక్టోబర్‌ 3న అడ్వాన్స్‌డ్‌ పరీక్ష జరుగుతుంది. 

ఐఐటీ బాంబేలో సీఎస్‌ఈ చేస్తా
మాది వైఎస్సార్‌ జిల్లా రాజంపేట. నాన్న యుగంధర్‌ నాయుడు గుంతకల్లు ఏపీఎస్‌పీడీసీఎల్‌లో ఏఏవోగా పనిచేస్తున్నారు. జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 100 పర్సంటైల్‌ సాధించాను. తెలంగాణ ఎంసెట్‌లో రెండో ర్యాంక్, ఏపీఈఏపీసెట్‌లో నాలుగో ర్యాంక్‌ వచ్చాయి. ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ చదువుతా. 
    – దుగ్గినేని వెంకట ఫణీష్‌

ర్యాంకర్ల మనోగతం..
అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమవుతున్నా..
మాది గుంటూరు జిల్లా నరసరావుపేట. నాన్న కరణం కొండలరావు ప్రైవేటు స్కూల్‌ డైరెక్టర్‌ కాగా, తల్లి శివకుమారి గృహిణి. విజయవాడలో ఇంటర్‌ చదివాను. జేఈఈ మెయిన్‌లో 100 పర్సంటైల్‌ సాధించాను. ప్రస్తుతం జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సన్నద్ధమవుతున్నాను. ఏపీ ఈఏపీ సెట్‌లో 27వ ర్యాంకు, తెలంగాణ ఎంసెట్‌లో 42వ ర్యాంకు లభించాయి.     
    – కరణం లోకేష్‌

అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకే లక్ష్యం
మాది ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం పెద ఇర్లపాడు. మాతల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యా యులు. మెయిన్‌లో నాలుగు సెషన్లలోనూ నూరు శాతం పర్సంటైల్‌ సాధించాను. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు సాధించడమే నా లక్ష్యం.   
 – లక్ష్మీసాయి లోకేష్‌ రెడ్డి

ఐఐటీ–బాంబేకే నా ప్రాధాన్యం
మాది అనంతపురం జిల్లా కదిరి. మా నాన్న అనిల్‌ కుమార్‌ కొండకమర్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌. మెయిన్‌లో ఓబీసీ కేటగిరీలో నాకు రెండో ర్యాంక్‌ వచ్చింది. నేను 8వ తరగతి వరకు కదిరిలో, 9, 10 తరగతులు గుడివాడలో, ఇంటర్మీడియెట్‌ హైదరాబాద్‌లో చదివాను. ఐఐటీ– బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ చదవడమే నా లక్ష్యం.    
– పునీత్‌ కుమార్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement