సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ మూడో విడత పరీక్షలు ఆదివారం మొదలయ్యాయి. జూలై 25 ఉదయం 9 గంటలకు ప్రారంభమైన మొదటి సెషన్ 12 వరకు ఉంటుంది. రెండో సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. ఇక మొదటి, రెండో సెషన్ అభ్యర్థులు గంటలోపు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు తెలిపారు.
అడ్మిట్ కార్డుతోపాటు ఫొటో ఐడెంటీటీ కార్డును తప్పనిరిగా తమతో పాటు తెచ్చుకోవాలని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో ప్రతి ఒక్కరూ కరోనా ప్రొటోకాల్ నిబంధనలను పాటించేలా చర్యలు చేపట్టారు. సిబ్బందితో పాటు అభ్యర్థులు విధిగా మాస్కులు ధరించాల్సి ఉంటుంది. సిబ్బందికి గ్లౌజ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్ష కేంద్రాలను శానిటైజ్ చేయిస్తున్నారు. కాగా, పరీక్షలకు హాజరయ్యే వారు తమతోపాటు పారదర్శక బాటిల్‌లో శానిటైజర్ తెచ్చుకోవడానికి అనుమతిస్తున్నారు. సెల్‌ఫోన్లు, డిజిటల్ వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు.
కాగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్) తదితర విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) మెయిన్ మూడో విడత (జూలై సెషన్) పరీక్షలు ఈ నెల(జూలై) 27 వరకు కొనసాగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment