నీట్‌ 2020 అడ్మిట్‌ కార్డ్‌ విడుదల | NTA Releases NEET 2020 Admit Cards | Sakshi
Sakshi News home page

నీట్‌ 2020 అడ్మిట్‌ కార్డ్‌ విడుదల

Published Wed, Aug 26 2020 1:08 PM | Last Updated on Wed, Aug 26 2020 2:51 PM

NTA Releases NEET 2020 Admit Cards - Sakshi

సాక్షి, ఢిల్లీ : సెప్టెంబర్‌ 13న నిర్వహించనున్న నేషనల్‌ ఎలిజిబిలిటి కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(నీట్‌ 2020)కి సంబంధించి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ బుధవారం మధ్యాహ్నం అడ్మిట్‌ కార్డ్స్‌ విడుదల చేసింది. ఇప్పటికే జేఈఈ మెయిన్స్‌ 2020 కి సంబంధించిన అడ్మిట్‌కార్డులను కూడా ఎన్‌టీఏ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ముందుగా ప్రకటించినట్లుగానే జేఈఈ (మెయిన్స్) 2020 పరీక్షలు సెప్టెంబరు 1 నుంచి 6 వరకు, నీట్ 2020 పరీక్ష‌ సెప్టెంబరు 13న నిర్వహించనుంది. మరోవైపు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జేఈఈ మెయిన్స్‌, నీట్‌ పరీక్షలను వాయిదా వేయాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు, పలు పార్టీలు, విద్యార్థుల తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు పలువురు కీలక నేతలు పరీక్షలు రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు. దేశవ్యాప్తంగా నెలకొన్న వ్యతిరేకత మధ్యనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) జేఈఈ, నీట్‌ పరీక్షల షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేసింది. పరీక్ష సందర్భంగా విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్‌టీఏ మార్గదర్శకాలను విడుదల చేసింది. (చదవండి : షెడ్యూల్‌ ప్రకారమే నీట్, జేఈఈ)

ఎన్‌టీఏ జారీ చేసిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి...
►విద్యార్థుల్లో అధిక శాతం మందికి వారు ఎంపిక చేసుకున్న మొదటి సెంటర్‌నే కేటాయించాలి.
►పరీక్ష సెంటర్‌కి వచ్చే విద్యార్థులు కచ్చితంగా ముఖానికి మాస్క్‌లు, చేతికి గ్లౌజ్‌లు ధరించాల్సి ఉంటుంది.
►వాటర్ బాటిల్‌, శానిటైజర్ కూడా వెంట తీసుకురావాలి.
►భౌతిక దూరం పాటించాలి.
►ఎగ్జామ్‌ సెంటర్‌లోకి కేవలం అడ్మిట్ కార్డుని మాత్రమే తీసుకురావాలి.
►కేటాయించిన స్లాట్ల ప్రకారం పరీక్ష కేంద్రం వద్దకు చేరుకోవాలి. గుంపులుగా ఉండకూడదు.
►శరీర ఉష్ణోగ్రత 99.4 ఫారిన్‌హీట్‌ డిగ్రీల కంటే ఎక్కువ ఉన్న విద్యార్థులకు ఐసోలేషన్‌ గదుల్లో పరీక్ష.
►ఐసోలేషన్‌ గదుల్లోనే డాక్యుమెంట్‌ వెరిఫికేషన్ చేయనున్నారు. ఇందుకోసం 15-20 నిమిషాల సమయం పట్టనుంది. ఆ లోపు వారి ఉష్ణోగ్రత తగ్గకపోతే.. ప్రత్యేక రూమ్‌లో వారికి పరీక్ష నిర్వహించనున్నారు.
►పరీక్ష హాల్‌లోకి వెళ్లేముందు ప్రతి ఒక్కరు చేతులను శుభ్రపరచుకోవాలి.
►పరీక్ష తరువాత ఒక్కొక్కరుగా బయటికి వెళ్లాలి.
►పరీక్ష ముగిసిన వెంటనే మాస్క్‌, గ్లోవ్స్‌ని పరీక్ష సెంటర్ బయట ఉన్న చెత్తబుట్టలో పడేయాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement