out sourceing
-
ఎన్టీఏ ఛైర్మన్ రికార్డుపై సందేహాలు: కాంగ్రెస్
ఢిల్లీ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఒక అవుట్ సోర్సింగ్ ఏజెన్సీగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. ఎన్టీఏ అధికారిక వెబ్సైట్లో ఏజెన్సీకి సబంధించి సమాచారం చాలా తక్కవగా ఉందని టీఎంసీ ఎంపీ సాగరికా ఘోష్ ప్రశ్నించిన నేపథ్యంలో కాంగ్రెస్ ఎన్టీఏపై ఆరోపణలు చేసింది.‘‘ఎన్టీఏ ఏకైక పని అవుట్సోర్స్ చేయడం మాత్రమే. దీని ఛైర్మన్ ప్రదీప్ కుమార్ జోషీ.. మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌గా పనిచేసిన సమయంలో చాలా సందేహాస్పదమైన రికార్డును కలిగి ఉన్నారు’’ అని కాంగ్రెస్ నేత జైరాం రమేస్ ‘ఎక్స్’వేదికగా విమర్శలు చేశారు.The only job of NTA appears to be to outsource. Its Chairman has a very dubious record as Chairman of the Madhya Pradesh Public Service Commission. https://t.co/DhBa5KDSos— Jairam Ramesh (@Jairam_Ramesh) August 3, 2024ఇక.. నీట్‌తో సహా 17 ప్రధాన పరీక్షలకు బాధ్యత వహించే ఎన్టీఏ తన వెబ్సైట్లో ఏజెన్సీ గురించి చాలా తక్కువ సమాచారం అందుబాటులో ఉంచిందని.. ఇలా ఎందుకు పరిమితమైన సమాచారం ఇస్తోందని అడుగుతూ శుక్రవారం టీఎంసీ ఎంపీ సాగరికా ఘోష్ విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు లేఖ రాశారు. ‘అధికారులు ఎవరు? ఏజెన్సీ వార్షిక నివేదికలు ఎక్కడ ఉన్నాయి? భవిష్యత్ పరీక్షల కోసం ప్రజల విశ్వాసాన్ని పెంచుకోవడానికి ఎన్టీఏ తన వెబ్సైట్లో ఏజెన్సీకి సంబంధించి మరింత సమాచారాన్ని అందించాలి’ అని లేఖలో పేర్కొన్నారు. -
ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సమస్యలపై పోరాటం
మహబూబ్‌నగర్ వైద్యవిభాగం, న్యూస్‌లైన్: ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్న కాం ట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై పో రాటం చేస్తామని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్వా మిగౌడ్ తెలిపారు. తమ సమస్యలను పరి ష్కరించాలిని కోరుతూ ఆరోగ్యశ్రీ ఉద్యోగులు ఆదివారం ఎమ్మెల్సీ స్వామిగౌడ్‌ను హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో కలి సి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగులకు న్యాయం చేస్తామని వారికి ఇచ్చారు. ఉద్యోగ భద్రత కల్పించేందుకు కృషి చేస్తామని, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ చేస్తామని ఇప్పటికే చెప్పినట్లు గుర్తుచేశారు. స్వామిగౌడ్‌ను కలిసినవారిలో సంఘం జిల్లా అధ్యక్షుడు విష్ణు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, కోశాధికారి శ్రీనివాస్, విజయ్‌భాస్కర్, శ్రీనివాస్‌శెట్టి, యాదయ్య, వరప్రసాద్ తదితరులు ఉన్నారు. -
ఔట్ సోర్సింగ్..మాయాజాలం!
జిల్లాలో ఓ ఉన్నతాధికారి పుణ్యమాని... ఔట్సోర్సింగ్ ఏజెన్సీల పంట పండుతోంది. దొడ్డిదోవన కాంట్రాక్టు దక్కించుకుంటున్న ఏజెన్సీలు.. ఉద్యోగాలు పొందిన వారి నుంచి భారీ మొత్తంలో దండుకుంటున్నాయి.. సొమ్ములు చెల్లించిన వారికే కొలువులు ఖరారు చేస్తున్నాయి.. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఏజెన్సీల ఖరారు.. పోస్టుల భర్తీపై వివాదం చెలరేగుతోంది..!! సాక్షిప్రతినిధి, నల్లగొండ: అడ్డదారుల్లో సంపాదించుకునాలనుకునే వారికి ఆ అధికారి ఓ కల్పతరువు. ఆయన శరణుజొచ్చి ‘ఫలమో.. పత్రమో ’ సమర్పించుకుంటే ఇట్టే కోరికలు నెరవేరుతున్నాయి. ప్రధానంగా ఆయా ప్రభుత్వ సంస్థల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిన జరిగే సిబ్బంది నియామకాల్లో నిబంధనలకు పాతరేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ఏజెన్సీలను ఖరారు చే స్తుంటే.. ఆ ఏజెన్సీలు నిరుద్యోగులతో చెలగాటమాడుతున్నాయి. ఇక, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి కార్యాలయం మ్రాతం ప్రేక్షకపాత్ర పోషిస్తోంది. ప్రభుత్వం 2008-09 విద్యా సంవత్సరంలో ఆలేరు, చండూరు, 2009-10 లో నకిరేకల్‌కు డిగ్రీ కాలేజీలను