జిల్లాలో ఓ ఉన్నతాధికారి పుణ్యమాని... ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల పంట పండుతోంది. దొడ్డిదోవన కాంట్రాక్టు దక్కించుకుంటున్న ఏజెన్సీలు.. ఉద్యోగాలు పొందిన వారి నుంచి భారీ మొత్తంలో దండుకుంటున్నాయి.. సొమ్ములు చెల్లించిన వారికే కొలువులు ఖరారు చేస్తున్నాయి.. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఏజెన్సీల ఖరారు.. పోస్టుల భర్తీపై వివాదం చెలరేగుతోంది..!!
సాక్షిప్రతినిధి, నల్లగొండ: అడ్డదారుల్లో సంపాదించుకునాలనుకునే వారికి ఆ అధికారి ఓ కల్పతరువు. ఆయన శరణుజొచ్చి ‘ఫలమో.. పత్రమో ’ సమర్పించుకుంటే ఇట్టే కోరికలు నెరవేరుతున్నాయి. ప్రధానంగా ఆయా ప్రభుత్వ సంస్థల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిన జరిగే సిబ్బంది నియామకాల్లో నిబంధనలకు పాతరేస్తున్నారు.
గుట్టుచప్పుడు కాకుండా ఏజెన్సీలను ఖరారు చే స్తుంటే.. ఆ ఏజెన్సీలు నిరుద్యోగులతో చెలగాటమాడుతున్నాయి. ఇక, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి కార్యాలయం మ్రాతం ప్రేక్షకపాత్ర పోషిస్తోంది. ప్రభుత్వం 2008-09 విద్యా సంవత్సరంలో ఆలేరు, చండూరు, 2009-10 లో నకిరేకల్‌కు డిగ్రీ కాలేజీలను
ఔట్ సోర్సింగ్..మాయాజాలం!
Published Wed, Sep 11 2013 5:05 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement