ఆరోజు ‘మోదీ ముక్తీ దివస్‌’.. బీజేపీకి జైరాం రమేష్‌ కౌంటర్‌ | Congress Jairam Ramesh Says June 4th As Modi-Mukti Diwas | Sakshi
Sakshi News home page

ఆరోజు ‘మోదీ ముక్తీ దివస్‌’.. బీజేపీకి జైరాం రమేష్‌ కౌంటర్‌

Published Fri, Jul 12 2024 9:19 PM | Last Updated on Sat, Jul 13 2024 9:15 AM

Congress Jairam Ramesh Says June 4th As Modi-Mukti Diwas

ఢిల్లీ: దేశంలో రాజకీయం మరోసారి హీటెక్కింది. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ 1975 జూన్ 25వ తేదీన ఎమర్జెన్సీ విధించిన రోజును సంవిధాన్‌ హత్యా దివస్‌(రాజ్యాంగ హత్యా దినం)గా కేంద్రం ప్రకటించడంతో కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ టార్గెట్‌ చేశారు.

కేంద్రం ప్రకటనపై జైరాం రమేష్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఈ క్రమంలో ఆయన..‘ఈ ఏడాది జూన్‌ 4న దేశ ప్రజలు మోదీకి నైతిక, వ్యక్తిగీత, రాజకీయ ఓటమిని కట్టబెట్టి చరిత్రలో ‘మోదీ ముక్తీ దివస్‌’ను లిఖించారు. రాజ్యాంగ విలువలు, సిద్ధాంతాలపై ఓ పద్ధతి ప్రకారం మోదీ దాడికి తెగబడ్డారు.మనుస్మృతి ఆధారంగా రాజ్యాంగాన్ని రూపొందించలేదని పేర్కొంటూ భారత రాజ్యాంగాన్ని సంఘ్‌ పరివార్‌ వ్యతిరేకించిందని గుర్తుచేశారు’ దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఇదిలా ఉండగా.. జూన్ 25ను సంవిధాన్‌ హత్యా దివస్‌గా ప్రకటిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అమిత్‌ షా ట్విట్టర్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. మరోవైపు.. ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో లక్షలాది మందిని కటకటాల్లోకి నెట్టారని బీజేపీ ఆరోపిస్తోంది. ఎమర్జెన్సీ రోజులకు నిరసనగా సంవిధాన్‌ హత్యా దివస్‌ను పాటించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించి దేశంలో చీకటి అధ్యాయానికి తెరలేపారని ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ అగ్రనేతలు వీలుచిక్కినప్పుడల్లా కాంగ్రెస్‌పై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement