ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ సీనియర్‌నేత జైరాం రమేష్ విమర్శలు గుప్పించారు. అంతరిక్షంలో వెళ్లే ముందు ప్రధాని మోదీ మణిపూర్ వెళ్లిరావాలని అన్నారు. 2025లో భారత్ ప్రయోగించనున్న తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్ యాన్’లో ప్రధాని మోదీని పంపిస్తామని ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ తెలిపినట్లు ఓ మీడియా సంస్థ నివేదికను వెల్లడించింది.
'Before he goes into space, the non-biological PM should go to Manipur': Jairam Ramesh
Read @ANI Story | https://t.co/TSJfrNXiVO#JairamRamesh #PMModi #ManipurViolence pic.twitter.com/H8cumSd55V— ANI Digital (@ani_digital) July 4, 2024
దీనిపై జైరాం రమేష్ గురువారం ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. ‘ప్రధాని మోదీ అంతరిక్షంలోకి వెళ్లేముందు. ఆయన మణిపూర్ రాష్ట్రానికి వెళ్లిరావాలి’ అని అన్నారు.
‘ప్రధాని మోదీకి అనేక బాధ్యతలు ఉన్నప్పటికీ మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమం గగన్‌యాన్ అభివృద్ధిలో ఆయన్ను భాగస్వామిని చేయటంలో ఆసక్తిగా ఉన్నాం. ముఖ్యంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS) వ్యోమగామి శిక్షణ అందించటంలో సహకరిస్తాం. అంతరిక్షంలోకి ప్రధానిని పంపించే సత్తా సాధిస్తే.. మనందరికీ చాలా గర్వంగా ఉంటుంది’ అని సోమనాథ్ తెలిపినట్లు మీడియా నివేదికలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment