
పట్నా: బీహార్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు(Assembly elections) జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని వివిద పార్టీలకు చెందిన రాజకీయ నేతలు, కార్యకర్తలు ఉత్పాహంతో కార్యరంగంలోకి దూకుతున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మూడు నెలల్లో మూడవసారి రాష్ట్రాన్ని సందర్శించడం పలు చర్చలకు దారితీస్తోంది.
बिहार के युवा साथियों, मैं 7 अप्रैल को बेगूसराय आ रहा हूं, पलायन रोको, नौकरी दो यात्रा में आपके साथ कंधे से कंधा मिलाकर चलने।
लक्ष्य है कि पूरी दुनिया को बिहार के युवाओं की भावना दिखे, उनका संघर्ष दिखे, उनका कष्ट दिखे।
आप भी White T-Shirt पहन कर आइए, सवाल पूछिए, आवाज़ उठाइए -… pic.twitter.com/LhVUROFCOW— Rahul Gandhi (@RahulGandhi) April 6, 2025
ఎన్డీఏ నేతృత్వంలోని బీహార్ సర్కారు(Bihar Government)ను అధికారం నుంచి దించే దిశగా రాహుల్ గాంధీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. తాజాగా బీహార్ యువతకు మద్దతుగా బెగుసరాయ్ జిల్లాలో కాంగ్రెస్ నిర్వహించిన ‘పలాయన్ రోకో, నౌకరీ దో’ పాదయాత్రలో రాహుల్ భాగస్వామ్యం వహించారు. ఇది కూడా ఆయన వ్యూహంలో భాగమేననే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ పాదయాత్రకు ఎన్ఎస్‌యూఐ జాతీయ ఇన్‌చార్జ్ కన్హయ్య కుమార్ నేతృత్వం వహించారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఒక వీడియో సందేశంలో ‘బీహార్‌లోని యువ స్నేహితులారా, నేను ఏప్రిల్ 7న బెగుసరాయ్‌కు వస్తున్నాను. ‘పలాయన్ రోకో, నౌకరీ దో’ యాత్రలో మీతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నాను’ అని పేర్కొన్నారు. గతంలో బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుసరించిన వ్యూహం పలు విమర్శలను ఎదుర్కొంది. నాడు కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీ(RJD)తో కలిసి 70 సీట్లలో పోటీ చేసినప్పటికీ, కేవలం 19 సీట్లు మాత్రమే దక్కించుకోగలిగింది. తాజాగా కాంగ్రెస్.. రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ)తో కలిసి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. దీనిని చూస్తుంటే బీహార్‌లో మరిన్ని సీట్లను సాధించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. మరోవైపు పార్టీ నేతలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ‘ఏ’ టీమ్‌గా పోటీ చేస్తుందని, ‘బి’ టీమ్ కాదని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Waqf (Amendment) Bill: నినాదాలతో దద్దరిల్లిన అసెంబ్లీ.. ఎన్‌సీ ఎమ్మెల్యేల రభస