మాజీ గవర్నర్‌ తమిళిసై తండ్రి కన్నుమూత | Tamilisai Soundararajan Father Kumari Ananthan Passes Away | Sakshi
Sakshi News home page

Kumari Ananthan: మాజీ గవర్నర్‌ తమిళిసై తండ్రి కన్నుమూత

Published Wed, Apr 9 2025 11:46 AM | Last Updated on Wed, Apr 9 2025 12:10 PM

Tamilisai Soundararajan Father Kumari Ananthan Passes Away

చెన్నై: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ ఇంట విషాద ఘటన చోటుచేసుకుంది. తమిళిసై తండ్రి, తమిళనాడు కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడు కుమారి అనంతన్(93) తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యల కారణంగా ఆరోగ్యం విషమించడంతో అనంతన్‌ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.

వివరాల ప్రకారం.. మాజీ గవర్నర్‌ తమిళిసై తండ్రి కుమారి అనంతన్(93) అపోలో  ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ క్రమంలో అనంతన్ మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం చెన్నైలోని సాలిగ్రామంలో ఉన్న ఆమె కుమార్తె తమిళిసై సౌందరరాజన్ నివాసంలో ఉంచారు. తన తండ్రి మృతి నేపథ్యంలో తమిళిసై కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ క్రమంలో తమిళిసైని వారు బంధువులు, పలువురు రాజకీయ నేతలు పరామర్శిస్తున్నారు.

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడిగా.. 
ఇక, కుమారి అనంతన్ మార్చి 19, 1933న కన్యాకుమారి జిల్లా అగతీశ్వరంలో జన్మించారు. స్వాతంత్ర్య సమరయోధుడు హరికృష్ణన్, తంగమ్మాళ్ దంపతులకు జన్మించిన ఆయన అసలు పేరు అనంతకృష్ణన్. ఆయన తమిళంలో బ్యాచిలర్ మరియు మాస్టర్స్ డిగ్రీలను సంపాదించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన 1977 పార్లమెంటరీ ఎన్నికల్లో నాగర్‌కోయిల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచారు.   ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 2024లో తమిళనాడు ప్రభుత్వం అనంతన్‌కు థకైసల్ అవార్డును ప్రదానం చేసింది. రాజకీయాల్లో ఎన్నో ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నప్పటికీ, పట్టు వదలకుండా ప్రజాసేవలో కొనసాగించారు. అనంతన్ మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.  

ఇక, తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌.. తమిళిసై నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అనంతన్‌ పార్థీవదేహానికి నివాళులు అర్పించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement