MK Stalin
-
Neet Row: డీఎంకే సర్కార్‌కు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ/చెన్నై, సాక్షి: వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్ష విషయంలో డీఎంకే ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. నీట్ పరీక్ష(NEET Exam) నుంచి తమ రాష్ట్రాన్ని మినహాయించాలని తమిళనాడు చేసిన అభ్యర్థనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. ఈ విషయాన్ని శుక్రవారం ఆ రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. తమ ప్రభుత్వం అన్ని వివరణలు ఇచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నీట్‌ను ఉప సంహరించుకోలేదన్న ఆయన.. ఈ వ్యవహారంలో తమిళనాడు చేస్తున్న పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించేందుకు ఈ నెల 9వ తేదీన పార్టీలకతీతంగా ఎమ్మెల్యేందరితోనూ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.నీట్‌కు వ్యతిరేకంగా తమిళనాడు ఎప్పటి నుంచో పోరాటం చేస్తోంది. నీట్ పరీక్ష పత్రాల లీకేజీ, పరీక్షను క్లియర్ చేయలేని స్థితిలో పలువురు అభ్యర్థులు బలవన్మరణానికి పాల్పడడంతో ఇదొక తీవ్ర అంశంగా మారిందక్కడ. కోచింగ్‌లకు వెళ్లే స్తోమత లేని విద్యార్థుల పాలిట ఇదొక శాపంగా మారిందనే అభిప్రాయం అక్కడ వ్యక్తమైంది. సామాజిక న్యాయం దక్కాలంటే నీట్ వద్దనే నినాదంతో పోరాడుతూ వస్తోంది. అందుకే నీట్ బదులు 12వ తరగతి మార్కుల ఆధారంగా వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశానికి తమిళనాడును అనుమతించాలని తమిళనాడు ప్రభుత్వం ఒక బిల్లును రూపొందించింది. అయితే.. 2021-22 నుంచే అది పెండింగ్‌లో ఉంటూ వస్తోంది. ఈ క్రమంలో.. కిందటి ఏడాది జూన్‌లో తమిళనాడు ప్రభుత్వం ఏకగ్రీవంగా నీట్‌ను రద్దు చేయాలంటూ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది కూడా. అయినప్పటికి కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదు. తాజా ఎదురు దెబ్బపై స్టాలిన్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. దక్షిణ రాష్ట్రం మరోసారి అవమానానికి గురైందని అన్నారు. ‘‘కేంద్రం తమిళనాడు అభ్యర్థనను తిరస్కరించవచ్చు. కానీ, మన పోరాటం మాత్రం ఆగదు. న్యాయ నిపుణులపై చర్చించి ఈ నిర్ణయాన్ని సవాల్ చేసే అంశం పరిశీలిస్తాం అని స్టాలిన్ ప్రకటించారు. మరోవైపు తమిళనాడుతో పాటు పశ్చిమ బెంగాల్ కూడా నీట్‌కు వ్యతిరేకంగా ఓ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఇంకోవైపు.. కాంగ్రెస్, ఆర్జేడీ లాంటి పార్టీలు కూడా నీట్‌ను మొదటి నుంచే వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. -
2026లో టీవీకే, డీఎంకే మధ్యే పోటీ
చెన్నై: తమిళనాడు అసెంబ్లీకి 2026లో జరిగే ఎన్నికలు వేరే విధంగా ఉండబోతున్నాయని సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ చీఫ్ విజయ్ వ్యాఖ్యానించారు. ఈసారి టీఎంకే, అధికార డీఎంకే మధ్యనే పోటీ ఉండనుందన్నారు. శుక్రవారం చెన్నైలో జరిగిన పార్టీ ప్రప్రథమ జనరల్ కౌన్సిల్ సమావేశంలో విజయ్ మాట్లాడారు. సీఎం ఎంకే స్టాలిన్‌ను గౌరవనీయులైన రాచరిక ముఖ్యమంత్రిగా అభివర్ణించిన విజయ్.. డీఎంకే కుటుంబ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ అంటూ పూర్తి పేరును ఘనంగా చెప్పుకుంటే సరిపోదు, అది చేతల్లో, పాలనలో కనిపించాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఫాసిస్ట్ అంటూ తిట్టిపోసే డీఎంకే కూడా అంతకంటే తక్కువేం కాదు, అదే ఫాసిస్ట్ వైఖరిని అనుసరిస్తోందని మండిపడ్డారు. ప్రజలు, కార్యకర్తలను కలుసుకోకుండా నన్ను ఆపడానికి మీరెవరు? అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా తనపై విధించిన ఆంక్షలను అనుసరించానన్నారు. సహజ వనరులు, వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం కలుగజేసే ప్రాజెక్టులను మాత్రమే తన పార్టీ వ్యతిరేకిస్తుందంటూ ఉద్యోగులు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు మద్దతుగా ఉంటామన్నారు. రాబోయే టీవీకే ప్రభుత్వంలో ప్రజలే పాలకులుగా ఉంటారని, మిత్రపక్షాలతో అధికారాన్ని పంచుకుంటామని స్పష్టం చేశారు. అదే సమయంలో విజయ్ కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు నుంచి జీఎస్టీ రూపంలో పన్నులు వసూలు చేస్తూ రాష్ట్రానికి తగు విధంగా నిధులను కేటాయించడం లేదని ఆరోపించారు. త్రిభాషా విధానాన్ని రాష్ట్రంపై రుద్ద వద్దని, పార్లమెంట్లో ప్రాతినిథ్యాన్ని తగ్గించే డీలిమిటేషన్ అమలును ఆపాలని కోరారు. జమిలి ఎన్నికల విధానం వద్దన్నారు. ముస్లింల హక్కులను లాగేసుకునేలా ఉన్న వక్ఫ్ బిల్లును వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని విజయ్ కోరారు. ఎన్నికల సంబంధ అంశాలపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని విజయ్‌కు కట్టబెడుతూ ఈ సమావేశం ఒక తీర్మానం చేసింది. అదే సమయంలో, 543 లోక్‌సభ నియోజకవర్గాలను ఎప్పటికీ కొనసాగించాలన్నదే టీవీకే విధానమని పేర్కొంది. ఈ సందర్భంగా విజయ్ను దళపతికి బదులుగా ‘వెట్రి తలైవార్’అని సంబోధించాలంటూ సీనియర్ నేత ఆధవ్ అర్జున ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆమోదం తెలిపింది. -
ద్వేషం మీద ఉపన్యాసమా? మమ్మల్ని వదిలేయండి
చెన్నై: జాతీయ విద్యా విధానంలో మూడు భాషల నిబంధనపై తమిళనాడు నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దంటూ పోరాటం కూడా చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్(Yogi Adityanath).. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin)ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. అయితే దీనికి స్టాలిన్ తాజాగా కౌంటర్ ఇచ్చారు.#TwoLanguagePolicy, #FairDelimitation కోసం తమిళనాడు న్యాయంగా పోరాడుతోంది. ఆ స్వరం దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది. అందుకే బీజేపీ ఉలిక్కిపడుతోంది.కావాలంటే ఆ పార్టీ నేతల ఇంటర్వ్యూలు చూడండి. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ద్వేషం గురించి మాకు ఉపన్యాసాలు ఇవ్వాలనుకుంటున్నారా? మమ్మల్ని వదిలేయండి. ఇదేం వ్యంగ్యం కాదు.. ఇది రాజకీయంగా ‘బ్లాక్ కామెడీ’లా అనిపిస్తోంది... తమిళనాడు ఏ భాషను వ్యతిరేకించడం లేదు. బలవంతం భాషను మాపై రుద్దడాన్ని.. భాషా దురభిమానాన్ని మాత్రమే వ్యతిరేకిస్తోంది. మాదేం ఓట్ల కోసం అల్లర్లు జరిపించే రాజకీయం కాదు. మాది న్యాయ పోరాటం.. అంతకు మించి ఆత్మ గౌరవ పోరాటం అని యోగి ఇంటర్వ్యూ ట్వీట్‌కు రీట్వీట్ చేస్తూ చురకలు అంటించారు. Tamil Nadu’s fair and firm voice on #TwoLanguagePolicy and #FairDelimitation is echoing nationwide—and the BJP is clearly rattled. Just watch their leaders’ interviews.And now Hon’ble Yogi Adityanath wants to lecture us on hate? Spare us. This isn’t irony—it’s political black… https://t.co/NzWD7ja4M8— M.K.Stalin (@mkstalin) March 27, 2025 యోగి ఏమన్నారంటే.. ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగి మాట్లాడుతూ.. కొందరు దేశాన్ని ఏకం చేయాలన్న ప్రయత్నాలు చేయకుండా.. భాష, ప్రాంతం పేరుతో విబేధాలు సృష్టించాలని చూస్తున్నారు. అలాంటి రాజకీయాలు దేశాన్ని బలహీనపరుస్తాయి. నియోజకవర్గాల పునర్విభజన మీద స్టాలిన్ చేస్తున్న ఉద్యమం కేవలం రాజకీయ ఎజెండాతోనే. ఆయన ఓటు బ్యాంకు ప్రమాదం అంచున ఉంది. అందుకే ఇలాంటి విభజన రాజకీయం తెర మీదకు తెచ్చారు. ఈ దేశం ఏ భాష, ప్రాంతం ఆధారంగా విభజించబడింది కాదు. వారణాసిలో కాశీ-తమిళ సంగమం మూడో తరం నిర్వహిస్తున్నందుకు ప్రధాని మోదీ(PM Modi)కి కృతజ్ఞతలు తెలియజేయాలి. దేశంలో తమిళం పురాతన భాష. భారత వారసత్వ సంపద ఇప్పటికీ ఆ భాషలో సజీవంగా కనిపిస్తుంటుంది. అలాంటప్పుడు అసలు హిందీని ద్వేషించాల్సిన అవసరం ఏముంది? అని యోగి ప్రశ్నించారు. -
సభలో ఆసక్తికరంగా వ్యాఖ్యలు
సాక్షి,చైన్నె : అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం కూటమి లెక్కల చర్చ జోరుగా సాగింది. డీఎంకే సభ్యులు, అన్నాడీఎంకే సీనియర్ నేత ఎస్పీ వేలుమణి మధ్య ఆసక్తికరంగా వ్యాఖ్యల తూటాలు పేలాయి. ఇక, సభలో ప్రసంగించిన సీఎం స్టాలిన్ రాష్ట్రంలో పోలీస్స్టేషన్లు, ఫైర్ స్టేషన్ల ఏర్పాటు విస్తృత లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉదయం ప్రశ్నోత్తరాలకు స్పీకర్ అప్పావు అనుమతి ఇచ్చారు. ఈసమయంలో మంత్రి ఏవీ వేలు మాట్లాడుతూ తాంబరం–కిష్కింధ మార్గం ఫోర్‌వేగా మార్చేందుకు అటవీ అనుమతులు, ఇతర కసరత్తులపై దృష్టి పెట్టామన్నారు. తిరునల్వేలి ఔటర్ రోడ్డు పనులకు రెండో విడతగా స్థలసేకరణ ముగిసిందన్నారు. అన్నాడీఎంకే సభ్యుడు విజయభాస్కర్ అడిగిన ప్రశ్నకు మంత్రి సెంథిల్‌బాలాజీ సమాధానం ఇస్తూ, 2 లక్షల విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు చర్యలు తీసుకున్నామన్నారు. ప్రైవేటు వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు అనుమతులు నిలుపుదల చేశామని ఎమ్మెల్యే కొంగు ఈశ్వరన్ అడిగిన ప్రశ్నకు మంత్రి ఎంఆర్కే పన్నీరుసెల్వం సమాధానం ఇచ్చారు. కోయంబత్తూరులో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌పై చర్యలు చేపట్టామని, ఇది అమల్లోకి రాగానే తిరుప్పూర్‌లో ఉన్న చెత్తను తొలగిస్తామని మంత్రి నెహ్రూ మరో సభ్యుడి ప్రశ్నకు వివరణ ఇచ్చారు. 20 పారిశ్రామిక వేత్తలు కలిసి ముందుకొచ్చి స్థలాన్ని కొనుగోలు చేసి ఇస్తే రూ.15 కోట్ల రాయితీతో పాటు పారిశ్రామిక వాడ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అన్బరసన్ ప్రకటించారు. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినానంతరం రూ.186 కోట్లతో 95 ఆలయాలకు రాజగోపురాల నిర్మాణాలకు చర్యలు తీసుకున్నట్టు మంత్రి శేఖర్‌బాబు ప్రకటించారు.పోలీస్స్టేషన్లు..సభలో సీఎం స్టాలిన్ ప్రసంగిస్తూ పోలీసులు, అగ్నిమాపక విభాగానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అరంతంగి నియోజకవర్గంలో 500 కంటే ఎక్కువ మంది లబ్ధి పొందే విధంగా ఉమ్మడి తాగునీటి ప్రాజెక్టును అందించామన్నారు. అరంతాంగిలోని పోలీస్‌స్టేషన్ గురించి ప్రస్తావిస్తూ నాగురి, అవుడయార్ కోవిల్, కరూర్ సహా ఐదు శాంతి భద్రత విభాగం పోలీస్ స్టేషన్లు, మహిళా పోలీసు స్టేషన్లు, ట్రాఫిక్ పోలీసు స్టేషన్ల గురించి ప్రస్తావించారు. తమకు సమాచారం , విజ్ఞప్తులు రాగానే, తక్షణం స్పందిస్తున్నామన్నారు.కూటమి లెక్కల చర్చసభలో రెండు రోజుల క్రితం అన్నాడీఎంకేను ఉద్దేశించి సీఎం స్టాలిన్ వ్యంగ్యాస్త్రం సంధించారు. మోసపోకుండా ఉంటే శుభాకాంక్షలు అని ఎద్దేవా చేశారు. బుధవారం గ్రామీణాభివృద్ధిశాఖకు నిధుల కేటాయింపునకు సంబంధించిన చర్చ సమయంలో అన్నాడీఎంకే సభ్యుడు కడంబూరు రాజు చేసిన వ్యాఖ్యలు సభలో కూటమి చర్చకు దారి తీసింది. లెక్కలు అడుగుతాం..ప్రశ్నించేందుకే ఆవిర్భవించిన పార్టీ అన్నాడీఎంకే అని కడంబూరు రాజు వ్యాఖ్యానించారు. త్వరగా లెక్కలన్నీ సమర్పించండి, ముగించండి, 2026 తర్వాత కొత్త లెక్కలు వేసుకుంటామని స్పందించారు. ఇందుకు ఆర్థికమంత్రి తంగం తెన్నరసు మాట్లాడుతూ తప్పుడు లెక్కలతో ఇరకాటంలో పడేరు అని ఎద్దేవా చేశారు. ఇందుకు అన్నాడీఎంకే సీనియర్ ఎస్పీ వేలుమణి స్పందిస్తూ, ఎంజీఆర్, జయలలిత మార్గంలో పళణిస్వామి లెక్కలు వేస్తున్నారని, ఆయన లెక్కలు తప్పే పరిస్థితి లేదని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకు మంత్రి పెరియస్వామి స్పందిస్తూ అమ్మ పాలన అంటూ గత పాలనలో సాగిన వారు లెక్కలంటూ అమ్మను మరిచారని చమత్కరించారు. అమ్మ పథకాలు అంటూ చివరకు అమ్మనే మరిచినట్టున్నారని ఎద్దేవా చేశారు. దీంతో సభలో కూటమి చర్చ మరింతగా ఆసక్తికర వ్యాఖ్యలతో ఊపందుకుంది. చివరకు స్పీకర్ అప్పావు జోక్యం చేసుకుని చర్చకు ముగింపు పలికారు. -
విభజన కుట్ర
‘స్టాలిన్ దున్నపోతు ఈనిందని అందరికీ ఆహ్వానాలు పంపితే దక్షిణాదికి చెందిన ప్రాంతీయ పార్టీల నేతలు ఆ దూడను కట్టేయడానికి చెన్నైకి పరుగులు పెట్టారు.’ లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదికి అన్యాయం జరిగిపోతోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఏర్పాటు చేసిన సమావేశం అచ్చంగా ఇలాగే జరిగింది. అన్యాయం జరిగిపోతోందని బీజేపీని గుడ్డిగా వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్న పార్టీలు ఆ సమావేశానికి వెళ్లాయి. చెన్నైలో ఓ స్టార్ హోటల్లో కోట్లు ఖర్చు పెట్టి నిర్వహించిన సమావేశంలో ఒక్కరంటే ఒక్కరైనా ఎలా అన్యాయం జరుగుతుందో చర్చించారా? జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల విభజన జరుగుతుందనీ, దక్షిణాదిలో జనాభా తగ్గి పోయారనీ, ఉత్తరాదిలో పెరిగిపోయారనీ, అందుకే దక్షిణాదికి సీట్లు తగ్గుతాయనీ వీరంతా ఓ నిర్ణయానికి వచ్చేశారు. నిజానికి ఈ ప్రక్రియలో ఇంతవరకూ ఒక్క అడుగు కూడా పడలేదు. ముందుగా జనాభా లెక్కలు పూర్తి చేయాలి. అప్పుడే ఉత్తరాదిలో ఎంత పెరిగారు, దక్షిణాదిలో పెరిగారా, తగ్గారా అన్న స్పష్టత వస్తుంది. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ఏర్పాటవుతుంది. జనాభా లెక్కల ప్రకారమే పునర్విభజన చేస్తారన్నది కూడా అపోహే! అలా అయితే ఈశాన్య రాష్ట్రాలకు 25 లోక్‌సభ సీట్లు ఉండేవా? ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని పదే పదే చెబుతున్న ప్రధాని, కేంద్ర హోంమంత్రి... ఏ రాష్ట్రానికీ ఒక్క సీటు కూడా తగ్గదని వివిధ సందర్భాల్లో స్పష్టం చేశారు. 2023లో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ డీలిమిటేషన్ ప్రక్రియను 2026 తర్వాత జనగణన డేటా ఆధారంగా చేపట్టాలని ప్రభుత్వం యోచి స్తోందని ప్రకటించారు. ప్రతి ఓటరుకూ సమాన ప్రాతి నిధ్యం లభించేలా చేస్తామన్నారు. ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడేలా డీలిమిటేషన్ ఉంటుందన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్థానిక జనాభా వైవిధ్యం, గిరిజన సముదాయాల ప్రాతినిధ్యాన్ని కాపాడేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ‘డీలిమిటేషన్ అనేది కేవలం స్థానాల సంఖ్యను పెంచడం లేదా తగ్గించడం కాదు, ప్రజాస్వామ్యంలో సమానత్వాన్ని స్థాపించే ప్రక్రియ’ అని స్పష్టం చేశారురాజకీయ అలజడి కోసమే...అయినా దక్షిణాదిలోని కొన్ని ప్రాంతీయ పార్టీలు కాకి లెక్కలను ప్రచారం చేస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు 42 లోక్‌సభ స్థానాలుంటే, పునర్విభజన తరు వాత 34 అవుతాయని చెబుతున్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు ప్రస్తుతం 129 స్థానాలుంటే వీటి సంఖ్య 103కు పడిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజ స్థాన్, బిహార్ రాష్ట్రాలలోని స్థానాల సంఖ్య 174 నుంచి 204 స్థానాలకు చేరుకుంటుందని అంటున్నారు. నిజానికి ఈ లెక్కలు ఇచ్చింది ఓ విదేశీ సంస్థ. ‘కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్’ అనే సంస్థ ‘ఇండియాస్ ఎమర్జింగ్ క్రైసిస్ ఆఫ్ రిప్రజెంటేషన్’ అనే నివేదిక సిద్ధం చేసింది. ఈ నివేదిక తప్ప, డీలిమిటేషన్ సీట్లపై మరో రిపోర్టు లేదు.కేంద్రం నుంచి అసలు లేదు. అయినా ఓ విదేశీ సంస్థ రిపోర్టును పట్టుకుని దేశంలో రాజకీయ అలజడి రేపడానికి డీఎంకే ప్రయత్నిస్తూంటే, ఆ పార్టీ ట్రాప్‌లో ఇతర పార్టీలు పడుతున్నాయి. డీలిమిటేషన్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదనీ, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసు కోలేదనీ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. లోకసభ నియోజకవర్గాల పునర్విభజన గతంలో 2002లో ప్రారంభమైంది. 2008లో అమలులోకి వచ్చింది. ఈ ప్రక్రియ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 ప్రకారం జరిగింది. 2002లో డీలిమిటేషన్ చట్టం ఆమోదించిన తర్వాత, సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌లో ఎన్నికల కమిషన్ సభ్యులు, రాష్ట్రాల నుండి ప్రతినిధులు ఉన్నారు. 2001 జనాభా లెక్కల ఆధారంగా ప్రతి రాష్ట్రంలో లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను సమన్వయం చేశారు. దీని ప్రకారం, జనాభా పెరుగుదలకు అనుగుణంగా నియోజకవర్గాల సరిహద్దులు సవరించారు. మొత్తం లోక్‌సభ స్థానాల సంఖ్య మాత్రం మారలేదు. నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ వివిధ రాష్ట్రాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలు, పౌరుల నుండి సూచనలు స్వీకరించింది. ఈ సూచనలను పరిగణనలోకి తీసుకుని, సరిహద్దులను ఖరారు చేశారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. ఇంకా విస్తృత సంప్రతింపులకు కమిటీలు వేస్తారు.పరుష వ్యాఖ్యలు ఎందుకు?ఉత్తరాదివాళ్ళు పందుల్ని కన్నట్లుగా పిల్లల్ని కంటున్నారనీ, అక్కడ బహుభర్తృత్వం ఉంటుందనీ డీఎంకేకు చెందిన మంత్రి దురై మురుగన్ వ్యాఖ్యానించారు. ఉత్తరాదివారిని కించపరిచి తమిళనాడు డీఎంకే నేతలు ఏం సాధించాలనుకుంటున్నారు? ఉత్తరాది వారిలో దక్షిణాదిపై ఏకపక్షంగా వ్యతిరేకత పెంచే కుట్రలో భాగంగానే ఇలాంటి పనులు చేస్తున్నారు. తమిళనాడు డీఎంకే పాలన నాలుగేళ్లు నిండ కుండానే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంది. అందుకే ఉత్తరాదిపై విషం చిమ్మి, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో దక్షిణాది సెంటిమెంటుతో గెలవాలనుకుంటున్నారు.హక్కుల కోసం పోరాటం చేయడం ప్రజాస్వామ్య హక్కు. కానీ ప్రాంతాల వారీగా భావోద్వేగాలు కలిగి ఉండే సమస్యల పట్ల పోరాడేటప్పుడు, విభజనవాదం చెలరేగే ప్రమాదం ఉంది. ప్రత్యేక ద్రవిడ దేశం కావాలని గతంలో కొంత మంది తమిళ నేతలు ప్రకటనలు కూడా చేశారు. ఇలాంటి విభ జనవాదుల మధ్య దేశాన్ని సమైక్యంగా ఉంచుకోవడం ఇప్పుడు అత్యంత ముఖ్యం. ప్రత్యేక దేశం అనే మాట వినిపించిందంటే, అది విభజన వాదమే! దీన్ని ఏ మాత్రం ప్రోత్సహించకుండా,దక్షిణాది తన ప్రాధాన్యాన్ని కాపాడుకునేందుకు పోరాటం చేస్తే అది మంచి ప్రజాస్వామ్య విధానం అవుతుంది.ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి వ్యాసకర్త బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు -
బీజేపీవైపు దక్షిణాది.. అందుకే డీలిమిటేషన్ డ్రామా: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: దేశంలో డీలిమిటేషన్‌పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. దక్షిణాదిలో బీజేపీ బలపడకూడదని కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. స్టాలిన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. ప్రభుత్వ వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకు ముఖ్యమంత్రి స్టాలిన్ డీలిమిటేషన్ మీటింగ్ పెట్టారని అన్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ జతకట్టిపోవడం వాళ్ల చీకటి ఒప్పందానికి నిదర్శనమని ఘాటు విమర్శలు చేశారు.కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బీజేపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ..‘డీలిమిటేషన్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్లు పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నిజస్వరూపం మరోసారి బయటపడింది. దక్షిణాదికి అన్యాయం చేసి బీజేపీ బలపడాలని అనుకోవడం లేదు. దక్షిణాదిలో బీజేపీ బలపడకూడదని కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే కుట్ర చేస్తున్నాయి. చెన్నై సమావేశానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ జతకట్టిపోవడం వాళ్ల చీకటి ఒప్పందానికి నిదర్శనం. దేశంలో లేని సమస్యను సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. లేని డీలిమిటేషన్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయం చేస్తున్నాయి.తమిళనాడులో కుటుంబ, అవినీతి పాలన నడుస్తోంది. డీలిమిటేషన్‌పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బీజేపీపై తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నాం. కుటుంబ, అవినీతి పార్టీలు మోదీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఎలాంటి వివక్ష లేకుండా అన్ని రాష్ట్రాలు అభివృద్ధి జరగాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారు. స్టాలిన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. తండ్రీకొడుకులు అక్కడ ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. భాషల పేరు మీద దక్షిణాదికి అన్యాయం చేయాలని బీజేపీ అనుకోవడం లేదు. దక్షిణాది ప్రజలు బీజేపీవైపు చూస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకు డీలిమిటేషన్ మీటింగ్ పెట్టారు. కాంగ్రెస్ కేవలం మూడు రాష్ట్రాలకే పరిమితమైంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణ, కర్ణాటకలో అధికారం బీజేపీదే. డీలిమిటేషన్ చేయాలంటే పార్లమెంట్లో చట్టం చేయాలి. ఇంకా జనాభా లెక్కల సేకరణే జరగలేదు’ అని చెప్పుకొచ్చారు. డీలిమిటేషన్ గురించి గతంలో ఉన్న చట్టాలు కాంగ్రెస్ తీసుకొచ్చినవే. ఏదో జరిగిపోతుందని కేటీఆర్, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆరు గ్యారంటీలపైన రేవంత్ దృష్టి పెడితే బాగుంటుంది. నిన్న జరిగిన సమావేశంలో ఆయా రాజకీయ పార్టీలు వారి స్వప్రయోజనం కోసం మాట్లాడుతున్నాయి. గతంలో ఇవే రాజకీయ పార్టీలు రాజ్యాంగం మారుస్తారని ప్రచారం చేశారు. ఏది జరిగినా ఏ ప్రాంతానికి అన్యాయం జరగదు. అవినీతి, కుటుంబ పార్టీలు చేస్తున్న వాటిని ప్రజలు తిప్పికొట్టాలి. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య సయోధ్యని కుదుర్చే పనిలో ఎంఐఎం ఉంది అని వ్యాఖ్యలు చేశారు. -
1971 జనాభా లెక్కలే ప్రాతిపదిక కావాలి: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: దేశంలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)కు 1971 జనాభా లెక్కలే ప్రాతిపదిక కావాలని.. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి( YS Jagan Mohan Reddy) వివరించారు. జాతీయ ప్రాధాన్యతగా జనాభా నియంత్రణను నిజాయితీగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ ప్రక్రియ శిక్షగా మారకూడదని స్పష్టంచేశారు. దామాషా ప్రకారం అన్ని రాష్ట్రాల్లో సీట్ల పెరుగుదల అంశాన్ని దృష్టిలో ఉంచుకుని డీలిమిటేషన్ కసరత్తు చేపడతామని హోం మంత్రి అమిత్‌షా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ హామీ అమలుకు అడ్డంకిగా మారిన రాజ్యాంగంలోని 81(2)(ఏ) అధికరణ(ఆర్టికల్)ను సవరిస్తూ రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. దీనివల్ల సీట్లలో ఆయా రాష్ట్రాల వాటాలు అలానే ఉంటాయని, లోక్‌సభలో ఆయా రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందన్న అంశం ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి వైఎస్ జగన్ శుక్రవారం లేఖ రాశారు. శనివారం మీడియాకు విడుదల చేశారు. కొన్ని రాష్ట్రాల ప్రాతినిధ్యంతోపాటు ఆయా రాష్ట్రాల ప్రజల మనోభావాలను డీలిమిటేషన్ ప్రక్రియ ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ఈ లేఖ రాస్తున్నానని తెలిపారు. డీలిమిటేషన్ ప్రక్రియపై వస్తున్న అభ్యంతరాలు దేశ సామాజిక, రాజకీయ సామరస్యాన్ని దెబ్బ తీసే అవకాశం ఉన్నందున, ఈ అంశం తీవ్రతను దృష్టిలో ఉంచుకోవాలని ప్రధాని మోదీని కోరారు. ఈ విషయంలో ప్రధానిగా మీ నాయకత్వం, మార్గ నిర్దేశం చాలా ముఖ్యమని.. మీరిచ్చే హామీ అనేక రాష్ట్రాలకున్న భయాలను, అపోహలను తొలగించడానికి దోహద పడుతుందని ప్రధానికి వైఎస్ జగన్ వివరించారు. లోక్‌సభలో ఇప్పుడున్న సీట్ల పరంగా ఆయా రాష్ట్రాలకు ఉన్న వాటాను కుదించకుండా పునర్విభజన (డీలిమిటేషన్) కసరత్తు చేపట్టాలని కోరారు. ఆ లేఖలో ఇంకా ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకూడదు రాజ్యాంగంలో 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2026లో డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాల్సి ఉంది. కానీ.. దీనికి ముందుగా 2021లో చేపట్టాల్సిన జనాభా లెక్కింపు ప్రక్రియ కోవిడ్ కారణంగా వాయిదా పడింది. 2026 నాటికి జనాభా లెక్కల ప్రక్రియను పూర్తి చేయడానికి ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఇది జరిగిన వెంటనే డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతుందన్న అంశం అనేక రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ముఖ్యంగా ఈ ప్రక్రియ ద్వారా తమ ప్రాతినిధ్యం తగ్గిపోతుందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జనాభా నియంత్రణను నిజాయితీగా చేయడం వల్లే.. జనాభా నియంత్రణ కోసం వివిధ రాష్ట్రాలు అనేక విధానాలు అమలు చేశాయి. అయితే వాటి ఫలితాలు ఆయా రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉన్నాయి. దీని వల్ల జనాభా పెరుగుదల వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఉంది. దేశ వ్యాప్తంగా జనాభా వృద్ధి ఒకే తరహాలో లేదు. అసమతుల్యత ఉంది. దీని వల్ల డీలిమిటేషన్ అంశం విస్తృత స్థాయిలో ఆందోళనకు దారి తీస్తోంది. 42వ.. 84వ రాజ్యాంగ సవరణల ద్వారా ఆయా రాష్ట్రాలకు సీట్ల కేటాయింపును నిలిపేశారు. కాలక్రమేణా అన్ని రాష్ట్రాలు జనాభా నియంత్రణ కసరత్తులో భాగంగా ఒకే స్థాయిలో ఫలితాలు సాధిస్తాయని భావించి ఈ సీట్ల కేటాయింపును నిలిపేశారు. దేశ జనాభాలో ఆయా రాష్ట్రాల వాటా 1971 నాటికి అనుకున్న స్థాయికి చేరుకుంటుందని భావించారు. కానీ, 2011 జనాభా లెక్కల గణాకాంలను చూస్తే.. దశాబ్దాల తరబడి జనాభా వృద్ధి, దాని అంచనాలు అన్ని రాష్ట్రాల్లో ఒకేలా లేవని తేలింది. 1971, 2011 మధ్య 40 సంవత్సరాల్లో దేశ జనాభాలో దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గింది. గత 15 సంవత్సరాల్లో జనాభా మరింత తగ్గిందని మేం నమ్ముతున్నాం. జనాభా నియంత్రణను జాతీయ ప్రాధాన్యతగా తీసుకున్నందున, దక్షిణాది రాష్ట్రాలు నిజాయితీగా తమ విధానాలను అమలు చేయడం వల్ల ఈ వాటా తగ్గింది. 1971 జనాభా లెక్కల ప్రకారం దక్షిణాది రాష్ట్రాల జనాభా వృద్ధి రేటు 24.80 శాతం అయితే, 2011 జనాభా లెక్కల ప్రకారం 20.88 శాతంగా ఉంది. అపోహలు, భయాలు తొలగించండి రాష్ట్రాల్లో ఇప్పుడున్న జనాభా లెక్కలను ఆధారంగా చేసుకుని డీలిమిటేషన్ ప్రక్రియ జరిగితే దేశ విధానాల రూపకల్పన సహా శాసన ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. దామాషా ప్రకారం అన్ని రాష్ట్రాలకు సీట్ల పెరుగుదల అంశాన్ని దృష్టిలో ఉంచుకుని డీలిమిటేషన్ కసరత్తు చేపడతామని హోం మంత్రి అమిత్‌షా హామీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అయితే ఈ హామీని అమలు చేయాలంటే రాజ్యాంగ పరంగా చేయాల్సిన సడలింపును కూడా మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 (2) (ఎ) జనాభా ప్రాతిపదికన ఆయా రాష్ట్రాలకు సీట్ల కేటాయింపు జరగాలని పేర్కొంది. దీని ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియలో ముందుకు వెళ్తే ఈ నిబంధన వల్ల హోంమంత్రి అమిత్‌షా ఇచ్చిన హామీని అమలు చేయడంలో అడ్డంకులు ఏర్పడతాయి. అందువల్ల దామాషా ప్రకారం ప్రతి రాష్ట్రానికి సీట్ల కేటాయింపుపై రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉంది. దీని వల్ల సీట్లలో ఆయా రాష్ట్రాల వాటాలు అలానే ఉంటాయి, ఆయా రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందనే అంశం ఉత్పన్నం కాదు. డీలిమిటేషన్ ప్రక్రియపై వస్తున్న అభ్యంతరాలు దేశ సామాజిక, రాజకీయ సామరస్యాన్ని దెబ్బ తీసే అవకాశం ఉన్నందున ఈ అంశం తీవ్రతను దృష్టిలో ఉంచుకోవాలని కోరుతున్నాను. ఈ విషయంలో ప్రధానిగా మీ నాయకత్వం, మార్గనిర్దేశం చాలా ముఖ్యం. మీరిచ్చే హామీ అనేక రాష్ట్రాలకున్న భయాలను, అపోహలను తొలగించడానికి దోహద పడుతుంది.డీఎంకే నాయకులకు లేఖ ప్రతి డీలిమిటేషన్ ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల అఖిలపక్ష కమిటీ సమావేశం శనివారం చెన్నైలో డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశం నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు.. ఆయన ప్రధాని మోదీకి రాసిన లేఖ ప్రతిని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి డీఎంకే నాయకులకు పంపారు. -
డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలు ఏకమయ్యాయి: రేవంత్ రెడ్డి
Delimitation JAC meeting Updates..👉కేటీఆర్ కామెంట్స్: ఇది కేవలం పార్లమెంటులో ప్రాతినిధ్యానికి సంబంధించిన అంశం మాత్రమే కాదని.. నిధులు కేంద్రీకృతం కావడంతో పాటు.. ఆర్థిక నియంతృత్వానికి దారితీస్తుందని దక్షిణాది భవిష్యత్తును కాలరాస్తుందని కేటీఆర్ వివరించారు. దేశం ప్రజాస్వామిక దేశమైనా… భిన్న అస్తిత్వాలు, సంస్కృతులు కలిగిన ఒక సమాఖ్య రాష్ట్ర అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కేసీఆర్ ఆధ్వర్యంలో 14 సంవత్సరాలపాటు తెలంగాణ ఉద్యమం నడిపించారు. తమిళనాడు ప్రజల నుంచి అనేక అంశాలు స్ఫూర్తి తీసుకుంటాము. అస్తిత్వం కోసం, హక్కుల కోసం కొట్లాడటంలో తమిళనాడు స్ఫూర్తినిచ్చింది. ద్రవిడ ఉద్యమం సమైక్య దేశంలో తమ హక్కులు సాధించుకోవడానికి రాష్ట్రాలకు ఒక దిక్సూచి లెక్క పనిచేస్తుంది...కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత డిలిమిటేషన్ వల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ వివక్షపూరిత విధానాల వలన దక్షిణాదికి అనేక నష్టాలు జరుగుతున్నాయి. దేశ అభివృద్ధి కోసం పని చేసినందువలన ఈ రోజు నష్టం జరుగుతుంది. మనమంతా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. ప్రజాస్వామ్యం మంద బలం ఆధారంగా నడవరాదు. మందబలం ఉన్నందువలన నియంతత్వం రావద్దు. దేశ అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్న రాష్ట్రాలకు నష్టం కలిగిస్తూ… దేశాన్ని వెనక్కి నెడుతున్న రాష్ట్రాలకి ఈ డిలిమిటేషన్ విధానం లాభం చేకూరుస్తుంది. పరిపాలన ఆర్థిక అభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయి కానీ దానివల్లనే తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి.👉దేశానికి 36% జిడిపిలో భాగస్వామ్యం ఉన్న దక్షిణాది రాష్ట్రాలు శిక్షింపబడుతున్నాయి. డీలిమిటేషన్ అంశం కేవలం పార్లమెంట్ ప్రాతినిధ్యం తగ్గడానికి పరిమితం కాదు. ఆర్థికపరమైన నిధుల కేటాయింపుల్లో కూడా తీవ్రమైన నష్టం జరగబోతుంది. వీటి కేటాయింపుల్లో కూడా అధికారం పూర్తిగా కేంద్రీకృతమై నియంతృత్వం వైపు దారితీసే అవకాశం ఉన్నది. ఆర్థిక వనరుల కేంద్రీకృతం జరగడం వలన భవిష్యత్తులోనూ ప్రస్తుతం ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నిధుల కేటాయింపులు అన్యాయం మరింతగా పెరుగుతుంది.👉దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ వివక్ష కొత్త కాదు. కానీ ఈ మధ్యకాలంలో ఈ వివక్ష అన్యాయం మరింత పెరిగింది. ప్రస్తుతం బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం దీన్ని మరింత పెంచేలా డీ లిమిటేషన్ అంశాన్ని ముందుకు తీసుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన బుల్లెట్ రైలు వంటి ప్రాజెక్టులన్ని ఉత్తరాదికే పరిమితం అవ్వడం ఇందుకు ఒక ఉదాహరణ. బీజేపీ సారధ్యంలోని కేంద్రం ఈ విధంగా దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపైన పుండుపైన ఉప్పురుద్దినట్టుగా వ్యవహరిస్తున్నది👉ఆదర్శవంతమైన సమైక్య రాష్ట్ర దేశంలో ఒక ప్రాంతం ఇంకో ప్రాంతం పైన ఆదిపత్యం చలాయించే విధంగా ఉండరాదన్నది ప్రజాస్వామ్యస్ఫూర్తి. ఇది కేవలం ఉత్తర దక్షిణాది రాష్ట్రాల వ్యవహారం కాదు అభివృద్ధి చెందిన రాష్ట్రాలు ప్రాంతాలకు నష్టం జరుగుతున్న అంశం. కేవలం జనాభా ఆధారంగా సీట్ల పెరుగుదల గనుక జరిగితే దేశ సమాఖ్య స్ఫూర్తికి తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఉన్నది. మనమంతరం భారతీయులం…అయితే మనందరికీ ఆయా ప్రాంతాల అస్తిత్వం ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దు. విభిన్న భాషలు సాంస్కృతిక అస్తిత్వాలతో కూడిన ఒక సమైక్య దేశం అన్న విషయాన్ని మర్చిపోకూడదు. వెనుకబడిన రాష్ట్రాలకు నిధులు ఇచ్చే అంశాన్ని మేము ఏమి వ్యతిరేకించడం లేదు కానీ… నిధుల కేటాయింపుల వివక్షను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.👉1971 తర్వాత ఉన్న పార్లమెంటు సీట్లు కేటాయింపు తర్వాత జరిగిన జనాభా నియంత్రణ వలన ఈరోజు దక్షిణాదికి నష్టం జరగడం అన్యాయం. జనాభా నియంత్రణను దేశ అభివృద్ధి కోసం దక్షిణాది రాష్ట్రాలు పాటించాయి. ఉత్తరాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో విఫలమైనందువలన వారికి ఈ రోజు డీలిమిటేషన్లో లబ్ధి జరగడం ఏ విధంగా కూడా సరైంది కాదు. ఇది దేశాన్ని వెనుక వేసిన వాళ్లకి రివార్డు ఇవ్వడం లాంటిది. దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోయే 2047 నాటికి సూపర్ పవర్ కావాలి అంటే అభివృద్ధి సాధించిన రాష్ట్రాలకు ప్రోత్సాహం లభించాలి కానీ శిక్ష కాదు. డిలిమిటేషన్ అనేది ఆర్థిక అభివృద్ధి పరిపాలన అభివృద్ధి వంటి అంశాల పైన జరగాలి కానీ కేవలం పరిపాలన పైన కాదు. ఈ అంశంలో జరుగుతున్న నష్టం పైన మాట్లాడకుంటే చరిత్ర మనల్ని క్షమించదు. భవిష్యత్తు తరాలు ఈరోజు మన మౌనాన్ని తప్పకుండా ప్రశ్నిస్తాయి.👉తమిళనాడు సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. డీలిమిటేషన్ కారణంగా పార్లమెంట్లో మన ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. మన గొంతు వినిపించే వాళ్లు తగ్గిపోతారు. మన అభిప్రాయానికి విలువ లేకుండా పోతుంది. భవిష్యత్ శ్రేయస్సుకు భంగం కలుగుతుంది. స్త్రీల హక్కులకు కూడా భంగం కలుగుతుంది. 👉తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కామెంట్స్..‘దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ అమలైంది. ఉత్తరాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ అమలుకాలేదు. ఆర్థిక అభివృద్ధి, జీడీపీ, ఉద్యోగ కల్పనలో దక్షిణాది ముందుంది. బాగా పని చేసిన మనకు శిక్ష వేస్తారా?. న్యాయబద్దం కాని డీలిమిటేషన్‌పై మనం బీజేపీని అడ్డుకోవాలి. ఇది రాజకీయ అసమానతలకు దారి తీస్తుంది. డీలిమిటేషన్ రాజకీయంగా దక్షిణాదిని పరిమితం చేస్తుంది. గతంలో వాజ్‌పేయి కూడా లోక్‌సభ సీట్లు పెంచకుండానే డీలిమిటేషన్ చేశారు. దక్షిణాది నుంచి వెళ్తుంది ఎక్కువ.. వస్తున్నది తక్కువ. పన్నుల రూపంలో తెలంగాణ నుంచి రూపాయి వెళ్తే వస్తున్నది మాత్రం 42 పైసలే. బీహార్ రూపాయి పన్ను కడితే.. ఆరు రూపాయాలు పోతున్నాయి. యూపీకి రూపాయికి రెండు రూపాయల మూడు పైసలు వెనక్కు వస్తున్నాయి. దక్షిణాది రాజకీయంగా గొంతు వినిపించే అవకాశాన్ని కోల్పోతుంది. మనం ద్వితీయ శ్రేణి పౌరులుగా మారతాం. డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలు ఏకమయ్యాయి.👉తమిళనాడు రాజధాని చెన్నై వేదికగా డీలిమిటేషన్‌పై సీఎం స్టాలిన్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరాయ్ విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేడీ ప్రతినిధి హాజరయ్యారు. ఈ భేటీకి బెంగాల్ తృణముల్ కాంగ్రెస్ దూరంగా ఉంది.👉ఇక, ఈ సమావేశంలో డీలిమిటేషన్‌పై నేతలు చర్చించనున్నారు. ఫెయిర్ డీలిమిటేషన్ నినాదంతో సమావేశం జరగనుంది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్‌ను ఆయా పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. 1971 నాటి జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. కుటుంబ నియంత్రణ కఠినంగా అమలు చేయడం వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గి, నియోజకవర్గాలు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన న్యాయంగా జరగాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. சென்னையில் நடைபெறும் கூட்டு நடவடிக்கை குழு ஆலோசனைக் கூட்டத்தில் பங்கேற்க வருகை தந்த அனைத்து தலைவர்களையும் மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் திரு @mkstalin அவர்கள் வரவேற்றார். #FairDelimitation pic.twitter.com/0Ject5TUiA— DMK (@arivalayam) March 22, 2025 👉అఖిలపక్ష సమావేశంలో పాల్గొనేందుకు ఇప్పటికే రాష్ట్రాలు ముఖ్యమంత్రులు, కీలక నేతలు చెన్నైకి చేరుకున్నారు. Honourable Chief Minister of Telangana Thiru @revanth_anumula Avl arrives in Chennai ahead of the crucial JAC meeting against unfair delimitation. Leaders from 14+ parties will unite tomorrow to discuss the pressing issue of delimitation and its impact on state rights.… pic.twitter.com/mhhpbaUH8b— DMK (@arivalayam) March 21, 2025Honourable Chief Minister of Punjab Thiru. @BhagwantMann arrives in Chennai ahead of the crucial JAC meeting against unfair delimitation. Leaders from 14+ parties will unite tomorrow to discuss the pressing issue of delimitation and its impact on state rights.… pic.twitter.com/g2uo33Tw5i— DMK (@arivalayam) March 21, 2025 -
మరి మీరు చేసిందేంటి?.. నిర్మలకు స్టాలిన్ కౌంటర్
చెన్నై: తమిళనాడులో రాజకీయం ఆసక్తికరంగా మారింది. కొద్దిరోజులు కేంద్రం వర్సెస్ స్టాలిన్ అనే విధంగా ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూపాయి సింబల్‌ను తొలగించడం మరింత చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ముఖ్యమంత్రి స్టాలిన్ కౌంటరిచ్చారు.తాజాగా ఓ కార్యక్రమంలో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ..‘గతంలో ఓ సందర్భంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా ఆంగ్ల ‘రూ’కి బదులుగా తమిళంలోని ‘రూ’ అనే అర్థం సూచించే అక్షరాన్ని వినియోగించారు. మరి ఇప్పుడు మా ప్రభుత్వం కూడా ‘రూ’ అనే అక్షరాన్ని వినియోగించడం కూడా సరైనదే కదా. ప్రస్తుతం భాషపై జరుగుతున్న వివాదంలో మా వైఖరిని మేము తెలియజేస్తున్నాం. మా మాతృ భాషను రక్షించుకుంటున్నాం. భాషపై గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించాలనుకునే వారు కేంద్రమంత్రి చర్యపైనా ఇప్పుడు మాట్లాడండి’ అని ఘాటు వ్యాఖ్యలు సంధించారు. ఇదే సమయంలో మరికొందరు మాత్రం జాతీయ చిహ్నాన్ని తక్కువ చేసి చూపించారని ఆయన మండిపడ్డారు. దీంతో, ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.ఇదిలా ఉండగా.. జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ)లో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు-కేంద్రం మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక, రూపాయి విషయంలో స్టాలిన్ నిర్ణయాలన్ని తమిళ సంఘాలు స్వాగతించాయి. మాతృభాషను కాపాడుకొనేందుకు తీసుకొన్న చర్యగా అభివర్ణించాయి. -
తగ్గేదేలే!
మతం, కులం, భూమి... ఇండియాలో ఇవి ఉద్రిక్తమైన అంశాలు. భాష కూడా ఇలాంటిదే. కేవలం రాజకీయ ప్రసంగాలకు చర్చలకు పరిమితమై ఉండి నట్లయితే, పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదు. కానీ అది స్వాతంత్య్రా నికి పూర్వం, ఆ తర్వాత కూడా ఉద్యమాలను లేవదీసింది. భౌగోళిక సరి హద్దులను మార్చేసింది. ప్రాంతీయ అధినేతల తలరాతలు మార్చేసింది. ఉదాహరణకు సి రాజగోపాలాచారిని మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రధాన మంత్రి పీఠం నుంచి పడదోసింది.భాషతో ఆడుకునే ఉన్మాదులకు తమిళనాడు పురిటిగడ్డగా మారింది. ఒకప్పుడు వేర్పాటువాదానికి ఊపిరిపోసింది. ఇప్పుడు అధికారం కాపాడుకోవడానికి సాధనంగా మార్చుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో వచ్చే ఏడాదే ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్... మోదీ ప్రభుత్వ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ–2020)ని తెర మీదకు తెచ్చారు. కేంద్రం నుంచి సమగ్ర శిక్షా స్కీము కింద వచ్చే రూ 2,152 కోట్ల నిధులను వదులుకోడానికి సిద్ధపడి మరీ ఆయన ఎన్ఈపీని తిరస్కరించారు. రాష్ట్రంలోని 14,500 మోడల్ స్కూళ్లను అప్ గ్రేడ్ చేయడం... ఈ కేంద్ర ప్రాయోజిత పథకం ఉద్దేశం. కేంద్రం ఎన్ఈపీని శిలాశాసనంలా రూపుదిద్దింది. పథకంలో గొప్పగా పొందుపరచిన ‘ఆశయాలు’ డీఎంకేకి మోసపూరితాలుగా కనబడుతున్నాయి. 1968 ఎన్ఈపీలోని త్రిభాషా సూత్రాన్నే ఎన్ఈపీ– 2020 ద్వారా తిరిగి ప్రవేశపెడుతున్నామని ఢిల్లీ పెద్దలు చెబుతున్నారు. అయితే, హిందీని రాష్ట్రాలపై రుద్దే దురుద్దేశపూర్వక ప్రయత్నంగా డీఎంకే దాన్ని పరిగణిస్తోంది. నిజానికి ఎన్ఈపీ– 2020 పాతదానితో పోల్చితే చాలా వరకు వెసులు బాటు కల్పిస్తోంది. ఏ రాష్ట్రం మీదా ఏ భాషనూ రుద్దే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. పిల్లలు నేర్చు కోవలసిన మూడు భాషలు ఏవన్నదీ ఆ యా రాష్ట్రాల, ప్రాంతాల, పిల్లల ఇష్టానికే విడిచి పెట్టింది. కాకుంటే, ఈ మూడింటిలో రెండు మాత్రం దేశంలోని ‘నేటివ్‘ భాషలు అయ్యుండాలి. అంటే రాష్ట్ర భాషకు అదనంగా మరొక భారతీయ భాషను నేర్వవలసి ఉంటుంది. అది హిందీయే కానవసరం లేదు. రాజకీయ పెనం మీద హిందీనిజానికి డీఎంకే, కేంద్రం మధ్య ఘర్షణకు మూలం ఇది కాదు. తమిళనాడు రాజకీయ పెనం మీద హిందీ ఎప్పుడూ చిటపటలాడుతూనే ఉంటుంది. అయినా, స్టాలిన్ సహజంగానే ఎన్ఈపీని తోసిపుచ్చినప్పుడు కేంద్రం ఆయనతో చర్చలు జరిపి ఉండాలి. అలా కాకుండా రెచ్చగొట్టే విధానం అవలంబించడమే ప్రస్తుత పరిస్థితికి దారి తీసింది. కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా ముందు నిలిచి కయ్యానికి కాలు దువ్వారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భాషా ప్రాతిపదికగా రాష్ట్రాల పునర్ విభజన జరగాలన్న ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఆయన స్వరాష్ట్రం ఒడిశా ముందుండి నడిపిన విషయం ఆయనకు గుర్తు లేకపోవడం నిందార్హం. ఏ రాష్ట్రం కూడా రాజ్యాంగం కంటే ఎక్కువ కాదని హెచ్చరిస్తూ, డీఎంకే ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడి నడుచుకోవాలని హితవు పలికారు. ఇది జరిగి నెల గడవక ముందే, మార్చి 11న పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమయంలో ‘నిజాయితీ లేని’, ‘మోసకారి’ పార్టీ అని డీఎంకేని నిందించారు. దీనికి స్పందనగా, మంత్రి ‘పొగరుబోతు’ అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. ప్రధాన్ ఆ తర్వాత తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకున్నారు. అయినా ఫలితం లేదు. అప్పటికే ఇరు పక్షాలూ బరిలోకి దిగాయి. తమిళనాడు ప్రతిపక్ష నేత పళనిస్వామి ఈ పోరులో డీఎంకేకు మద్దతు పలికారు. ఎప్పుడో 1937 లోనే అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రధాన మంత్రి రాజగోపాలాచారి (రాజాజీ) సెకండరీ స్కూళ్లలో హిందీని తప్పనిసరి చేయడంతో జస్టిస్ పార్టీ మండిపడింది. తలముత్తు, నటరాజన్ అనే ఇద్దరు యువ ఉద్యమకారులు పోలీసుల ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయారు. భాష కోసం ప్రాణా లొడ్డిన అమరులుగా వారు నివాళులు అందుకున్నారు. తర్వాత రాజాజీ రాజీనామా చేశారు. బ్రిటిష్ పాలకులు నాటి హిందీ నిర్బంధం ఉత్తర్వును ఉపసంహరించారు. 1965కి వద్దాం. హిందీని అధికార భాషగా అమలు చేసేందుకు కేంద్రం పెట్టిన డెడ్ లైన్ దగ్గర పడింది. మరోసారి తమిళనాడు భగ్గుమంది. రాష్ట్రం అంతటా హింస చెలరేగింది. 70 మంది అసువులు బాశారు. 1967లో అధికార భాషల (సవరణ) చట్టాన్ని, 1968లో అధికార భాషల తీర్మానాన్ని పార్లమెంటు ఆమోదించిన సందర్భంలోనూ ఉద్యమం తిరిగి ప్రాణం పోసుకుంది. హిందీకి అదనంగా ఇంగ్లీష్‌ను కూడా కమ్యూనికేషన్ భాషగా కొనసాగించేందుకు, హిందీ ఒక్కటే అధికారిక లింకు భాషగా ప్రకటించిన తొలి విధానాన్ని వాయిదా వేసేందుకు ఈ చట్టం వీలు కల్పించింది. మూడు భాషల ఫార్ములాను తిరస్కరిస్తూ అప్పటి డీఎంకే ముఖ్యమంత్రి అన్నాదురై నాయకత్వంలో 1968 జనవరి 26న రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. తమిళాన్ని, ఇతర భాషలను అధికార భాషలుగా క్లాసిఫై చేసేవరకు ఇంగ్లీషు ఒక్కటే ఏకైక అధికార భాషగా కొనసాగితీరాలని, ఆ మేరకు రాజ్యాంగ సవరణ చేయాలని నాటి రాష్ట్ర ప్రభుత్వం తెగేసి చెప్పింది. అయితే ఒక మాట. గతంలోకీ ఇప్పటికీ తమిళుల స్పందనలో మార్పు కనబడుతోంది. అప్పట్లో హిందీ–తమిళ్ జగడం తమిళ ఓటర్లను భావోద్వేగంతో కదిలించేది. నేడు మరొక కోణం తెర మీదకు వచ్చింది. అది ఆర్థికం. తమిళనాడు ఆర్థిక సంస్కరణల నుంచి పూర్తి ప్రయోజనం పొందింది. ప్రముఖ ఉత్పత్తి కేంద్రంగా ఆవిర్భవించింది. రాజకీయ పోరాటాలు స్థానికులు, వలసదారుల మద్య సామాజిక సంబంధాలను ప్రభావితం చేయలేక పోవడం ఒక సానుకూల పరిణామం. ‘మరాఠీ మనూస్’ (మరాఠీ మాట్లాడే మనుషుల) తరహా యుద్ధోన్మాదం లేదు. అయినప్పటికీ, భాష ఒక సెన్సిటివ్ ఇష్యూనే!రాధికా రామశేషన్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఓటమి భయంతోనే తమిళనాడులో కొత్త డ్రామా: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి స్టాలిన్ డీలిమిటేషన్, త్రిభాష విధానంపై రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. త్రిభాషా విధానంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు.బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని డీఎంకే వితండవాదం చేస్తోంది. డీలిమిటేషన్, జాతీయ విద్యావిధానంపై దివాలాకోరుతనంతో డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. 2026 తమిళనాడు ఎన్నికల్లో ఓటమి నుంచి తప్పించుకోవడానికి డీఎంకే తప్పుడు ప్రచారం చేస్తోంది. దీన్ని బూచిగా చూపించి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తమిళనాడులో లిక్కర్ సరఫరాలో కుంభకోణం తెరపైకి వచ్చింది. డీఎంకే నేతలు కోట్ల రూపాయలు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. లిక్కర్ స్కాం దృష్టి మళ్లించడానికే డీఎంకే.. దక్షిణాదికి అన్యాయం అనే వాదనను లేవనెత్తింది. త్రిభాషా విధానం బ్రిటిష్ కాలం నుంచే అనేక సంవత్సరాలుగా అమలు జరుగుతోంది. త్రిభాషా విధానంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ఎన్నికల ఎత్తుగడలో భాగంగా ఓటమి భయంతో స్టాలిన్ బురద జల్లుతున్నారు అని వ్యాఖ్యలు చేశారు. -
ఇళయరాజా మ్యూజికల్ జర్నీపై తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రకటన
తరాలు మారుతున్నా ఇళయరాజా సంగీతంపై అభిమానం ఏంతమాత్రం తగ్గదు. గత 50 ఏళ్లుగా కోట్లమందికి తన సంగీతంతో ఆయన దగ్గరయ్యారు. ఈ క్రమంలో ఇళయరాజా 50 ఏళ్ల మ్యూజికల్ జర్నీపై తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా ప్రస్థానాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తాజాగా తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది. ఇదే విషయాన్ని ఎక్స్ వేదికగా తమిళనాడు సీఎం స్టాలిన్ తెలిపారు.తమిళనాడు తేని జిల్లాలో మారుమూల కుగ్రామంలో రాజయ్యగా పుట్టి, రాజాగా ఆయన మారారు. అప్పటికే చిత్ర పరిశ్రమలో మన ఏ.ఎం.రాజా ఉండటం వల్ల ‘ఇళయ’ చేర్చుకుని ఇళయరాజాగా ఆయన పరిచయం అయ్యారు. అలా ‘అన్నాకిళి’ (1976)తో మొదటి చిత్రం చేశారు. ఏ ముహూర్తాన సంగీత దర్శకుడిగా జన్మించాడోగాని ఇంతకాలం తర్వాత, 1,500 సినిమాలకు 8,500 పాటలు చేశాక, 81 ఏళ్లకు చేరుకున్నాక కూడా ఆకర్షణ కోల్పోలేదు. భారతీయ సంగీత ప్రతిభను ప్రపంచానికి చాటడానికి వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్‌లో అత్యంత క్లిష్టమైన ‘సింఫనీ’ రాసి, దానికి ‘వేలియంట్’ అని నామకరణం చేసి, మార్చి 8న లండన్ లో 85 మంది సభ్యుల ప్రతిష్ఠాత్మక రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రాతో ప్రదర్శన ఇచ్చారు. ప్రపంచ దేశాల నుంచి రాజా అభిమానులు ఈ సింఫనీకి హాజరయ్యారు. 45 నిమిషాల నాలుగు అంచెల సింఫనీని విని స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఇలా వెస్ట్రన్ క్లాసికల్లో సింఫనీ రాసి, లండన్ (London)లో ప్రదర్శన ఇచ్చిన మొట్టమొదటి భారతీయుడిగా రాజా చరిత్ర సృష్టించారు. -
₹పై లొల్లి.. మరి అప్పుడేం చేశారు?
చెన్నై/న్యూఢిల్లీ: కేంద్రం-తమిళనాడు మధ్య భాషా వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా రూపాయి సింబల్(Rupee Symbol) ₹ ప్లేస్‌లో తమిళ అక్షరం చేర్చిన డీఎంకే ప్రభుత్వం తీరుపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తమిళంలోనే ఆమె కౌంటర్ ఇచ్చారు. అంత అభ్యంతరాలు ఉంటే.. గతంలోనే ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారామె. తమిళనాడు బడ్జెట్ పత్రాల్లో రూపాయి గుర్తును (₹) తొలగించి.. రూ అనే అర్థం వచ్చే అక్షరాన్ని చేర్చింది స్టాలిన్ ప్రభుత్వం. ఈ వ్యవహారంపై రాజకీయ విమర్శలు చెలరేగాయి. బీజేపీ నేత, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. ఒకవేళ ఆ గుర్తుతో ఇబ్బంది ఉంటే 2010లో దాన్ని కేంద్రం అధికారికంగా ఆమోదించిన సమయంలో ఎందుకు వ్యతిరేకించలేదని డీఎంకేను ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె ఒక పోస్ట్ చేశారు. గతంలో.. యూపీఏ ప్రభుత్వంలో డీఎంకే భాగస్వామ్యపక్షంగా ఉంది. ఆ సమయంలో ఆ గుర్తును తీసుకొచ్చారు. పైగా ‘₹’ సింబల్‌ను రూపొందించిన వ్యక్తి డీఎంకే మాజీ ఎమ్మెల్యే తనయుడే. ఇప్పుడు దీన్ని పక్కనపెట్టడం ద్వారా.. డీఎంకే ఓ జాతీయ గుర్తును తిరస్కరించడమే కాకుండా.. తమిళ యువకుడి సృజనాత్మకతను విస్మరిస్తోంది అని సీతారామన్ అన్నారు. రూపాయి చిహ్నం ‘₹’ అంతర్జాతీయంగా బాగా గుర్తింపు పొందిందని.. ప్రపంచ ఆర్థిక లావాదేవీల్లో దేశానికి గుర్తింపుగా నిలుస్తోందని అన్నారామె. అలాగే.. యూపీఐ సేవలను అంతర్జాతీయం చేసేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తుంటే.. మరోపక్క సొంత కరెన్సీ చిహ్నాన్ని మనం బలహీనపరుస్తున్నామా? అని డీఎంకేను ఉద్దేశించి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రతినిధులు.. దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను నిలబెడతామని రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేస్తారు. అలాంటిది జాతీయ చిహ్నాలను తొలగించడమంటే.. ఆ ప్రమాణానికి విరుద్ధంగా వ్యవహరించడమే అని వ్యాఖ్యానించారామె. డీఎంకే చేసిన పని జాతీయ ఐక్యత పట్ల నిబద్ధతను దెబ్బతీసే చర్యలన్న ఆమె.. ఇది భాష, ప్రాంతీయ దురభిమానానికి ఉదాహరణగా పేర్కొన్నారు.దేశ ఐక్యతను బలహీనపరిచే, ప్రాంతీయ గర్వం పేరుతో వేర్పాటువాద భావాలను ప్రోత్సహించే ప్రమాదకరమైన మనస్తత్వాన్ని సూచిస్తోందని మండిపడ్డారు. -
నేను రాలేను.. డీకేను రిక్వెస్ట్ చేశా: సీఎం సిద్ధరామయ్య
బెంగళూరు: డీలిమిటేషన్ అంశంపై చర్చించేందుకు రావాలంటూ పలు దక్షిణాది రాష్ట్రాలకు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖలు రాసిన సంగతి తెలిసిందే. ఈ నెల 22వ తేదీన డీలిమిటేషన్ అంశంపై చర్చకు రావాలంటూ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఒడిశా తదితర రాష్ట్రాలకు మెయిల్స్ ద్వారా లేఖలు పంపారు స్టాలిన్. అయితే ఈ అంశంలో చర్చించడానికి తమ రాష్ట్రం తరఫున డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వస్తారని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఈ మేరకు తమిళనాడు సీఎం స్టాలిన్ కు లేఖ రాశారు.‘ నేను కొన్ని వ్యక్తిగత పనులు వల్ల ఆ సమావేశానికి రాలేకపోతున్నాను. కానీ మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. మా ప్రభుత్వం తరఫున డీకే శివకుమార్ వస్తారు. ఈ విషయంపై డీకే శివకుమార్ తో చర్చించిన తర్వాతే మీకు లేఖ రాస్తున్నా’ అని సిద్ధరామయ్య పేర్కొన్నారు.కాగా, డీలిమిటేషన్ అంశంపై మాట్లాడేందుకు కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, పంజాబ్ సీఎం భగవత్ మాన్, ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీలకు లేఖలు రాశారు స్టాలిన్. ఇది సమాఖ్య వాదంపై స్పష్టమైన దాడిగా ఆయన అభివర్ణించారు. రాష్ట్ర పరిపాలనను శిక్షించడమేనని స్టాలిన్ పేర్కొన్నారు. దీనిపై స్పష్టమైన విముఖత వ్యక్తం చేస్తున్న స్టాలిన్.. ఏడుగురు సీఎంలకు లేఖలు రాశారు. దాంతో పాటు మాజీ సీఎంలకు ఆయన లేఖలు పంపినట్లు స్టాలిన్ పేర్కొన్నారు. -
ఆ మాజీ ఎమ్మెల్యే కుమారుడే.. ఈ రూపాయి (₹) సింబల్‌ను డిజైన్ చేసింది..
ఢిల్లీ: జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)లో భాగమైన త్రిభాష సూత్రం అమలుపై తమిళనాడు-కేంద్ర ప్రభుత్వాల మధ్య తీవ్ర వివాదం తారా స్థాయికి చేరింది. ప్రస్తుతం,తమిళనాడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే తాజాగా, ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రతుల్లో రూపాయి (₹) సింబల్‌ను (Rupee symbol row) తొలగించింది. ఆ స్థానంలో తమిళనాడులో రూ అనే అర్థం వచ్చే అక్షరాన్ని చేర్చింది. దీంతో భాషల వివాదం మరింత ముదిరినట్లైంది. ఈ క్రమంలో ఆ రూపాయి సింబల్ డిజైన్ ఎవరు తయారు చేశారు? అనే అంశంపై నెట్టింట్లో పెద్ద ఎత్తున జరుగుతోంది.రూపాయి సింబల్‌ను ఎవరు డిజైన్ చేశారు?ఇక ఆ రూపాయి డిజైన్‌ను చేసింది మరెవరోకాదు తమిళనాడు అధికార డీఎంకే మాజీ ఎమ్మెల్యే ఎన్.ధర్మలింగం కుమారుడు ఐఐటీ ప్రొఫెసర్ డీ.ఉదయ్‌కుమార్ ధర్మలింగం. తొలిసారిగా ఈ రూపాయి సింబల్ 2010లో నాటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో ప్రధాని మన్మోహన్ సింగ్ వినియోగంలోకి తెచ్చారు. రూపాయి డిజైన్ ఎలా చేశారంటే?2010 నాటి యూపీఏ ప్రభుత్వం రూపాయి డిజైన్ చేసేందుకు దేశవ్యాప్తంగా పోటీ నిర్వహించింది. అయితే, ఈ కాంటెస్ట్‌లో ఐఐటీ ముంబైలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన ఉదయ కుమార్ సైతం పాల్గొన్నారు. రూపాయి సంకేతం డిజైన్ చేయడంలో దేవనాగరి, రోమన్ భాషల్ని కలుపుతూ రూపాయి డిజైన్ చేశారు. రూపాయి సింబల్ కోసం దేవనగరి భాషలోని ‘ర’ను రోమన్‌లోని ‘ఆర్’ కలిపి రూ (₹) సింబల్‌ను తయారు చేశారు. సరిగ్గా ఐఐటీ గౌహతి డిజైన్ విభాగంలో కొత్త ఉద్యోగంలో చేరే ఒక రోజు ముందు కేంద్రం రూపాయి సింబల్ కోసం ఏర్పాటు చేసిన పోటీ విజేతల్ని ప్రకటించింది. దేశ వ్యాప్తంగా వందల కొద్ది డిజైన్లు పరిశీలించగా.. ఆ డిజైన్లు అన్నింటిల్లో ఉదయకుమార్ డిజైన్ చేసిన రూపాయి డిజైన్‌ను కేంద్రం ఎంపిక చేసింది.భారత కరెన్సీలో రూపాయి సింబల్ 2010 జూలై 15న,మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కరెన్సీ నోట్లపై ఉదయ కుమార్ డిజైన్ చేసిన రూపాయి సింబల్‌ను చేర్చింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా భారత కరెన్సీ గుర్తింపు అమాంతం పెరిగినట్లు ఆర్ధిక వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ సమయంలో తిరువణ్ణామలై సమీపంలో ఉన్న మారూరు గ్రామంలో జన్మించిన ఉదయ కుమార్ రూపాయి సింబల్‌ను ఎలా డిజైన్ చేశారో వివరించారు. ఇక, ప్రస్తుతం ఉదయ కుమార్ ఐఐటీ గౌహతి డిజైన్ విభాగం హెచ్ఓడీగా ఉన్నారు. ఐఐటీ-హైదరాబాద్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వంటి అనేక సంస్థలకు లోగోలు డిజైన్ చేశారు. -
‘స్టాలిన్.. అది నీ మూర్ఖత్వానికి నిదర్శనం’
చెన్నై: తమిళనాడు ప్రభుత్వం రూపాయి సింబల్ ను మార్చడంపై ఆ రాష్ట్ర బీజేపీ తీవ్రంగా మండిపడింది. అది మూర్ఖపు చర్య అంటూ అభివర్ణించారు తమిళనాడు బీజేపీ చీఫ్ కె. అన్నామలై. భారత మొత్తం తమ కరెన్సీలో 'Rs' అని ఉంటే 'Ru' అని తమిళనాడు ప్రభుత్వం మార్చడం అతి తెలివి తక్కువ పని అంటూ ధ్వజమెత్తారు. దీన్ని మూర్ఖపు చర్య కాకపోతే ఇంకేమనాలి అని ఆయన ప్రశ్నించారు అసలు స్టాలిన్ ఎలా సీఎం అయ్యారో అంటూ విమర్శలు గుప్పించారు.కాగా, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం 2025 - 26 బడ్జెట్లో సాధారణ రూపాయి చిహ్నానికి బదులుగా.. తమిళ చిహ్నంతో భర్తీ చేయడం వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ఇప్పటికే జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తున్న తమిళనాడు ప్రభుత్వం.. తాజాగా ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. రూపాయి సింబల్ ను మార్చడమే కాకుండా ‘రు’ అని ఆ సింబల్ పై పేర్కొనడమే వివాదాన్ని మరింత పెంచింది.The DMK Government's State Budget for 2025-26 replaces the Rupee Symbol designed by a Tamilian, which was adopted by the whole of Bharat and incorporated into our Currency. Thiru Udhay Kumar, who designed the symbol, is the son of a former DMK MLA. How stupid can you become,… pic.twitter.com/t3ZyaVmxmq— K.Annamalai (@annamalai_k) March 13, 2025తమిళనాడుపై హిందీ భాష రుద్దుతారా?తాము ఎంతో గౌరవించే తమిళభాషపై బలవంతంగా హిందీ భాషను రుద్దుతున్నారని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విమర్శించారు. తమిళనాడులో హిందీ భాషను తీసుకొస్తే తమిళనాడు ఎడ్యుకేషన్ సిస్టం అంతా సర్వనాశనం అవుతుందని మండిపడ్డారు. వారి తీసుకొచ్చే ఎడ్ముకేషన్ పాలసీ.. అది ఎడ్యుకేషన్ పాలసీ కాదు.. కుంకుమ, పసుపు పాలసీ. ఇది భారత్ ను అభివృద్ధి చేయడం కోసం తెచ్చిన పాలసీ ఎంతమాత్రం కాదు. కేవలం హిందీని అభివృద్ధి చేయడం కోసం తీసుకొచ్చిన పాలసీ.’ అని ధ్వజమెత్తారు స్టాలిన్. -
రూపాయి చిహ్నం మార్చేసిన తమిళనాడు ప్రభుత్వం
జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ)లో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు - కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం జరుగుతోంది. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం 2025 - 26 బడ్జెట్లో సాధారణ రూపాయి చిహ్నానికి బదులుగా.. తమిళ చిహ్నంతో భర్తీ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కొత్త జాతీయ విద్యా విధానం ద్వారా 'హిందీ విధించడం'పై బీజీపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంతో.. అధికార డీఎంకే పోరాటం చేస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం రూపాయి చిహ్నం మార్చేసింది. ఈ మార్పుపై ఇప్పటివరకు తమిళనాడు ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. తమిళనాడు చర్య భారతదేశంలో ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా ఉందని బీజేపీ ప్రతినిధి అన్నారు.అంతే కాకుండా తమిళంలో చదవడం, రాయడం వచ్చి ఉంటేనే.. తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని, మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది.ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్ కార్ల కథ ముగిసినట్టే?.. ఈవీ పాలసీ 2.0 గురించి తెలుసాతమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ''హిందీ, సంస్కృత ఆధిపత్యం కారణంగా ఉత్తర భారతదేశంలో 25 కంటే ఎక్కువ స్థానిక భాషలు కనుమరుగయ్యాయి. శతాబ్దాల నాటి ద్రవిడ ఉద్యమం అవగాహన, నిరసనల ద్వారా తమిళం.. దాని సంస్కృతిని రక్షించింది" అని ఆయన అన్నారు. -
దక్షిణాదిపై బీజేపీ పగబట్టింది: రేవంత్ రెడ్డి
సాక్షి, ఢిల్లీ: డీలిమిటేషన్ ప్రక్రియను ఒప్పుకునేది లేదన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇదే సమయంలో డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం చూపుతుందన్నారు. ఈ విషయంలో తెలంగాణలోని అన్ని పార్టీలపై సమావేశం నిర్వహిస్తామని రేవంత్ చెప్పుకొచ్చారు.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో డీలిమిటేషన్‌పై మార్చి 22న తమిళనాడు ప్రభుత్వ నిర్వహించే జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని డీఎంకే నేతలు, ఎంపీలు ఆహ్వానించారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ..‘డీలిమిటేషన్‌పై తమిళనాడు సీఎం స్టాలిన్ చూపించిన చొరవ అభినందనీయం. 22వ తేదీన తమిళనాడులో జరిగే జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి వెళ్లే అంశంపై ఏఐసీసీ అనుమతి తీసుకొని వెళ్తాం. డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం చూపుతుంది. డీలిమిటేషన్ లిమిట్ ఫర్ సౌత్ లాగా ఉంది.డీలిమిటేషన్ ప్రక్రియను ఒప్పుకునేదే లేదు. ఉత్తరాది రాష్ట్రాల కన్నా దక్షిణాది రాష్ట్రాలు అత్యధికంగా పన్నులు చెల్లిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో డీలిమిటేషన్‌పై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. దీనికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా రావాలని కోరుతున్నాం. డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి తన గళం కేంద్ర క్యాబినెట్లో వినిపించాలి. తెలంగాణలోని అన్ని పార్టీలపై సమావేశం నిర్వహిస్తాం’ అని చెప్పుకొచ్చారు. -
హిందీ వ్యతిరేకత ఎందుకు?
మత, భాష, ప్రాంతీయ ఉన్మాదాలు భారతదేశ సమగ్రతకు, సమైక్యతకు గొడ్డలి పెట్టు అనే విషయంలో దేశ హితాన్ని కోరే అందరి వ్యక్తుల అభిప్రాయం ఒకే విధంగా ఉంటుంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హిందీ భాషపై అవాకులు చవాకులు పేలడం దేశంలో పెద్ద చర్చనీయాంశమైంది. ‘త్రిభాషా సూత్రం’ అమలులో భాగంగా హిందీనీ విద్యాలయాల్లో బోధించ డాన్ని వ్యతిరేకించడం తమిళ రాజకీయాలలో ఒక భాగమే.దేశంలో తెలివైన విద్యార్థులకు మంచి విద్యను అందించడానికి, విద్యార్థుల్లో ‘ఈ దేశం నాది’ అనే భావనను నిర్మాణం చేయడానికి రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1986లో ‘నవోదయ’ విద్యాలయాలను ఏర్పాటు చేసింది. ఈ పాఠశాలలు తమిళనాడుకు అవసరం లేదని ద్రవిడ పార్టీల నాయకులు అడ్డు కున్నారు. ఆ పాఠశాలల్లో హిందీని ఒక భాషగా బోధించడమే ఇందుకు కారణం. ‘సర్వ శిక్షా అభియాన్’ నిధులను తమిళనాడు రాష్ట్రానికి ఇవ్వడం విషయంలో కేంద్రానికి– రాష్ట్రానికి మధ్య చోటుచేసుకున్న వివాదం కారణంగా త్రిభాషా సూత్రం తమిళనాడు రాష్ట్రంలో అమలు చేయడం వీలు కాదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ బహిరంగ ప్రకటన చేయడంతో త్రిభాషా సూత్రం అమలు విషయంపై రాద్ధాంతం మళ్లీ తెరపైకి వచ్చింది. దక్షిణ భారతంలో ఉన్న ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో ఈ విషయంపై అభ్యంతరాలు లేవు. త్రిభాషా సూత్రం అమలులో భాగంగా దక్షిణాదిలో రాష్ట్ర భాష, ఇంగ్లీషు, హిందీ బోధించేటట్లు; ఉత్తరాదిలో హిందీ, ఇంగ్లీషు, ఏదైనా దక్షిణాది రాష్ట్రాల భాష (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఏదో ఒకటి) బోధించేటట్లు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఏకాభి ప్రాయంతో నాటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అయితే తమిళులు దీన్ని వ్యతిరేకించారు. తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం ఈనాటిది కాదు. 1937లో ‘ద్రావిడార్ కళగం’ పేరుతో ఈవీ రామస్వామి తమిళ ప్రజలను రెచ్చగొట్టి, ‘ఉత్తరాది వారి భాష హిందీ మనకెందు’కంటూ, తమిళ ప్రజల్లో హిందీ భాషపై ద్వేషాన్ని నూరి పోశారు. తమిళనాడులోని జస్టిస్ పార్టీ కూడా ఈ హిందీ వ్యతిరేక ఉద్యమానికి అండగా నిలిచింది. అగ్నికి ఆజ్యం పోసింది. ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో అప్పటి రాజ గోపాలాచారి నేతృత్వంలోని మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రభుత్వం రాజీనామా చేయడంతో ఉద్యమం చల్లారింది. స్వాతంత్య్రానంతరం కేంద్ర ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఇంగ్లీషు స్థానంలో హిందీని జాతీయ భాషగా ప్రవేశపెట్టాలని ఆలోచించడంతో 1965లో ‘ద తమిళనాడు స్టూడెంట్స్ యాంటీ హిందీ యాజిటేషన్ కౌన్సిల్’ పేరుతో తమిళ నాయకులు పెద్ద ఎత్తున హింసాత్మక ఉద్యమాన్ని లేవదీశారు. ఉద్యమాన్ని అణచడానికి పారా మిలటరీ దళం రంగ ప్రవేశం చేయడంతో 500 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయబడ్డాయి. నాటి ప్రధానమంత్రి లాల్ బహుదూర్ శాస్త్రి బలవంతంగా హిందీని తమిళ ప్రజలపై రుద్దే అవకాశం లేదని ప్రకటించడంతో ఉద్యమం ఆగి పోయింది.ఈ ఉద్యమ ప్రభావంతో 1967 ఎన్నికల్లో తమిళనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకు పోయింది. ఉత్తరాది ప్రజలు ఆర్య సంస్కృతికి చెందిన వారనీ, వారి భాష హిందీ అనీ, ఆ భాషను మాట్లాడటం తమిళుల ఆత్మగౌరవానికి భంగం అనే భావనను తమిళ ప్రజల మనసులో బాగా చొప్పించారు బ్రిటిష్ పాలకులు. పాశ్చాత్య కోణంలో హిందూ సంస్కృతిని దునుమాడడమే ధ్యేయంగా పెట్టుకున్న ఈవీ రామ స్వామి బ్రిటిష్ పాలకులకు ఒక పనిముట్టుగా దొరికారు. ఆయన ప్రియ శిష్యుడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి శ్రీరామునిపై, రామాయణంపై దుర్వా్యఖ్యలు చేయడం, ఆయన మనుమడు ఉదయనిధి ఒక మంత్రి హోదాలో సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా లాంటిదని మాట్లాడటం బ్రిటిష్ వాళ్ళు నూరి పోసిన ఆర్య ద్రావిడ వాద ప్రభావమే! తమిళులే హిందీని వ్యతిరేకించడం వెనుక దాగి ఉన్న రహస్యం ఇదే!ఉల్లి బాలరంగయ్య వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు -
వైఎస్ జగన్‌ను కలిసిన తమిళనాడు మంత్రి ఈవీ వేలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని తమిళనాడు మంత్రి ఈవీ వేలు, ఎంపీ విల్సన్ బుధవారం కలిశారు. ఈ నెల 22న చెన్నైలో జరగనున్న దక్షిణ భారత అఖిలపక్ష నాయకుల సమావేశానికి వైఎస్ జగన్‌ను ఆహ్వానించారు. తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ రాసిన లేఖను వైఎస్ జగన్‌కు డీఎంకే నేతలు అందజేశారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చించేందుకు పలు రాష్ట్రాల సీఎంలు, పార్టీ అధినేతలకు సీఎం స్టాలిన్ ఆహ్వానం పంపించారు. -
ఏడుగురు రాష్ట్ర సీఎంలకు స్టాలిన్ లేఖ
చెన్నై: కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్న డీలిమిటేషన్ అంశంపై తమిళనాడు ఎంకే స్టాలిన్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది సమాఖ్య వాదంపై స్పష్టమైన దాడిగా ఆయన అభివర్ణించారు. రాష్ట్ర పరిపాలనను శిక్షించడమేనని స్టాలిన్ పేర్కొన్నారు. దీనిపై స్పష్టమైన విముఖత వ్యక్తం చేస్తున్న స్టాలిన్.. ఏడుగురు సీఎంలకు లేఖలు రాశారు. దాంతో పాటు మాజీ సీఎంలకు ఆయన లేఖలు పంపినట్లు స్టాలిన్ పేర్కొన్నారు.ఈ అంశంపై తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ ఎక్స్’ వేదికగా మండిపడ్డారు స్టాలిన్. ‘ ఇది దేశ సమాఖ్యవాదంపై దాడి. రాష్ట్రాలను శిక్షించేందుకే ఈ కార్యాచరణకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జనాభా నియంత్రణ, సుపరిపాలనపై పార్లమెంట్ లో మన గొంతు వినిపించుకుండా చేయడమే వారి లక్ష్యం. దీనికి మేం పూర్తిగా వ్యతిరేకం. ఇంత ఎంతమాత్ర సమ్మతం కాదు’ అని స్టాలిన్ పేర్కొన్నారు.ఈ డీలిమిటేషన్ అంశంపై మాట్లాడేందుకు కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, పంజాబ్ సీఎం భగవత్ మాన్, ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీలకు లేఖలు రాసినట్లు స్టాలిన్ తెలిపారు. The Union Govt's plan for #Delimitation is a blatant assault on federalism, punishing States that ensured population control & good governance by stripping away our rightful voice in Parliament. We will not allow this democratic injustice!I have written to Hon'ble Chief… pic.twitter.com/1PQ1c5sU2V— M.K.Stalin (@mkstalin) March 7, 2025 -
LKG విద్యార్థి Phd హోల్డర్‌కు ఉపన్యాసం ఇచ్చినట్టుంది: కేంద్రంపై స్టాలిన్ సెటైర్లు
సాక్షి, చెన్నై: తమిళనాడులో హిందీ(Hindi) భాష విషయమై రాజకీయం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్((MK Stalin), కేంద్రమంత్రుల మధ్య విమర్శలు చోటుచేసుకుంటున్నాయి. స్టాలిన్ వ్యాఖ్యలకు తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కౌంటరిచ్చారు. తమిళ భాషకు కేంద్రం తగిన గుర్తింపు ఇస్తుందన్నారు. తమిళం విషయంలో స్టాలిన్ రాజకీయం సరికాదన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తమిళనాడు(Tamil Nadu)లోని రాణిపేటలో పర్యటిస్తున్నారు. శుక్రవారం సీఐఎస్ఎఫ్ కార్యక్రమానికి అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్బంగా అమిత్ షా మాట్లాడుతూ..‘ఇంజనీరింగ్, మెడికల్ విభాగాల్లో ఉన్నత విద్య కోసం తమిళ భాషలోనే సిలబస్ తీసుకొస్తాం. వీలైనంత త్వరగా చర్యలు చేపడతాం. తమిళ భాష అభివృద్ధి, సంస్కృతికి కట్టుబడి ఉన్నాం. దేశంలో ప్రాంతీయ భాషలు అన్నింటినీ గౌరవిస్తాం. ఇప్పటివరకు సీఏపీఎఫ్(CAPF) నియామకంలో మాతృభాషకు స్థానం లేదు. ఈ నేపథ్యంలో యువతకు నష్టం జరుగుతోందని ప్రధాని మోదీ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు. అన్ని భాషలతో పాటు తమిళంలో కూడా సీఏపీఎఫ్ పరీక్షలు నిర్వహించాలని మోదీ నిర్ణయించారు. ఇప్పటికైనా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను సీఎం స్టాలిన్ మానుకోవాలి’ అని కామెంట్స్ చేశారు.#WATCH | Arakkonam, Tamil Nadu: Union Home Minister Amit Shah says, "... Till now, there was no place for mother tongue in the CAPF recruitment... PM Narendra Modi decided that our youth will now be able to write their CAPF exam in all languages in the eight list, including… pic.twitter.com/Q8pXv1IzZ4— ANI (@ANI) March 7, 2025అంతకుముందు, కేంద్రంపై సీఎం స్టాలిన్ విరుచుకుపడ్డారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై ఆయన విమర్శలు చేశారు. స్టాలిన్ ట్విట్టర్ వేదికగా..‘విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎప్పటికీ గెలవని యుద్ధం మొదలుపెట్టారు. చెట్టు ప్రశాంతంగా ఉండాలని అనుకున్నా.. గాలి రాకుండా మాత్రం ఉండదు కదా!. అలాగే.. భాష విషయంలో ఆయన మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. అందుకే ఆయనకు వరుసగా లేఖలు రాస్తున్నాం. ఎన్ఈపీని తిరస్కరిస్తున్న తమిళనాడు.. ఇప్పటికే విద్యావిధానంలో అనేక లక్ష్యాలను సాధించింది.త్రిభాష విషయంలో.. ఎల్కేజీ విద్యార్థి పీహెచ్డీ హోల్డర్‌కి ఉపన్యాసం ఇచ్చినట్లు ఉంది ఆయన తీరు. మేం ఢిల్లీ ఆదేశాలను తీసుకోం. త్రిభాషా విధానంపై బీజేపీ సర్కారు చేస్తున్న సంతకాల ప్రచారం హాస్యాస్పదంగా ఉంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశాన్నే ప్రధాన అజెండాగా చేసుకొని బరిలో దిగాలని సవాల్ విసురుతున్నా. పథకాల దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇచ్చే అవార్డుల వరకు అన్నింటికీ హిందీ పేర్లను పెట్టారు. దేశంలో అధికంగా ఉన్న హిందీయేతర ప్రజలను ఇది ఉక్కిరిబిక్కిరి చేస్తుంది’ అని స్టాలిన్ చెప్పుకొచ్చారు. 🎯 "The tree may prefer calm, but the wind will not subside." It was the Union Education Minister who provoked us to write this series of letters when we were simply doing our job. He forgot his place and dared to threaten an entire state to accept #HindiImposition, and now he… pic.twitter.com/pePfCnk8BS— M.K.Stalin (@mkstalin) March 7, 2025 -
దురభిమానం ఎలా ఉంటుందంటే.. విమర్శలకు స్టాలిన్ కౌంటర్
చెన్నై: కేంద్ర నూతన జాతీయ విద్యావిధానాన్ని(National Educational Policy) వ్యతిరేకిస్తూ.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరోసారి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తాము కోరుకునేది భాషా సమానత్వం మాత్రమేనని.. అంత మాత్రానికే తమను విమర్శించడం తగదని అన్నారాయన. ఈ క్రమంలో.. డీఎంకే ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు ఆయన ఓ కొటేషన్‌తో కౌంటర్ ఇచ్చారు. మేం కోరుకునేది భాషా సమానత్వం. తమిళనాడులో తమిళం భాషకు ప్రాధాన్యం కల్పించమని అడుగుతున్నాం. అంతమాత్రానికే దురభిమానం, పక్షపాతం అనే ముద్రలు మాపై వేస్తున్నారు. మీరు ప్రత్యేక హక్కులకు అలవాటుపడటంతో మేం కోరుకునే సమానత్వం కూడా అణచివేతలా కనిపిస్తుంది(కొటేషన్‌ను పోస్ట్ చేశారు). దురభిమానం ఎలా ఉంటుందంటే.. తమిళులు అర్థం చేసుకోలేని భాషలో మూడు నేర చట్టాలకు పేర్లు పెట్టడంలా ఉంటుంది. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే రాష్ట్రానికి ప్రాముఖ్యత ఇవ్వకపోవడం, ఎన్ఈపీని నిరాకరించినందుకు విద్యకు వెచ్చించాల్సిన నిధులను ఆపేయడం దాని కిందికే వస్తుంది. .. గాడ్సే భావజాలాన్ని కీర్తించే వ్యక్తులు.. చైనా దురాక్రమణ, కార్గిల్ యుద్ధం, బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిపిన యుద్ధాల్లో అత్యధిక నిధులు అందించిన డీఎంకే, ఆ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వానికి ఉన్న దేశభక్తిని ప్రశ్నిస్తున్నారు అంటూ కేంద్రంలోని బీజేపీకి పరోక్షంగా చురకలంటించారాయన. 👉🏾 "When you are accustomed to privilege, equality feels like oppression." I am reminded of this famous quote when some entitled bigots brand us chauvinists and anti-nationals for the 'crime' of demanding Tamil’s rightful place in Tamil Nadu.👉🏾 The very people who glorify… pic.twitter.com/MOzmUSEyia— M.K.Stalin (@mkstalin) March 6, 2025ఇదిలా ఉంటే.. జాతీయ విద్యావిధానంలో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతోంది. హిందీని బలవంతంగా హిందీయేత ప్రాంతాలకు రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ కేంద్రం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం మండిపడుతోంది. ఈ క్రమంలో.. రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలిపివేశారని స్టాలిన్ ప్రభుత్వం కేంద్రంపై సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణలను, డీఎంకే ప్రభుత్వ ప్రచారాలను కేంద్రం తోసిపుచ్చుతూ వస్తోంది. -
డీలిమిటేషన్ హీట్.. యూటర్న్ తీసుకున్న స్టాలిన్
చెన్నై: నియోజకవర్గ పునర్వవ్యస్థీకరణపై రాజకీయ దుమారం కొనసాగుతున్న వేళ.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కొత్తగా పెళ్లైన జంటలను ఆలస్యంగా పిల్లలను కనాలని సూచించిన ఆయన.. ఇప్పుడు స్టాండ్‌పై యూటర్న్ తీసుకున్నారు. అందుకు నియోజకవర్గాల పునర్విభజన రాజకీయం వేడెక్కడమే కారణం. సోమవారం నాగపట్నంలో డీఎంకే నేత కుటుంబ వివాహ వేడుకకు హాజరైన సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. గతంలో కొత్తగా పెళ్లైన వాళ్లను పిల్లల విషయంలో కొంత సమయం తీసుకోవాలని నేనే చెప్పాను. ఫ్యామిలీ ప్లానింగ్ విషయంలో మనం విజయవంతం అయ్యాం కూడా. కానీ, ఇప్పుడు.. నియోజకవర్గాల పునర్విభజన(Delimitation)పై కేంద్రం కొత్త పాలసీలు తీసుకొస్తున్న వేళ అలా చెప్పను. కొత్తగా పెళ్లైన జంటలు వీలైనంత త్వరగా పిల్లలను కనండి. వాళ్లకు మంచి తమిళ పేర్లు పెట్టండి అని స్టాలిన్ అన్నారు. అయితే.. జనాభా ప్రతిపాదికన కేంద్రం నియోజకవర్గాలను పునర్విభజించబోతోందని స్టాలిన్ చెప్పడం ఇదేం కొత్త కాదు. ఇంతకు ముందూ ఆయన ఇలాగే మాట్లాడారు. అలా జనాభా ప్రకారం చూసుకుంటే.. తమిళనాడుకు 8 స్థానాలు తగ్గే అవకాశం ఉందని.. ఇది మరికొన్ని రాష్ట్రాలపైనా ప్రభావం చూపెడుతుందని ఆందోళన వ్యక్తం చేశారాయన.దేశ సంక్షేమం, ఆర్థిక అభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే.. కుటుంబ నియంత్రణ ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా విజయం సాధించాయని అనుకుంటున్నాయి. రేపు ఒకవేళ జనాభా ప్రతిపాదికన గనుక కేంద్రం నియోజకవర్గాలను విభజిస్తే.. ఆ రాష్ట్రాలకే తీవ్ర నష్టం అని అంటున్నారాయన.అయితే స్టాలిన్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ(BJP) కౌంటర్ ఇచ్చింది. తమిళనాడు సీఎం వ్యాఖ్యలు నిరాశవాదంతో కూడుకున్నవని, నిజాయితీలేని రాజకీయాలకు సంకేతమని బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ చెబుతున్నారు. జనాభాకు తగ్గట్లుగా హక్కులు ఉంటాయా? అని గతంలో మీ మిత్రపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని స్టాలిన్‌ను ఉద్దేశించి కేశవన్ అన్నారు. పాలనాపరమైన వైఫల్యాల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ డ్రామాలని డీఎంకేపై మండిపడ్డారాయన. మరోవైపు.. డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగబోదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇదివరకే ఓ ప్రకటన చేశారు. -
నా ప్రియమైన స్నేహితుడా.. మీ పోరాటం అసామాన్యం
చెన్నై: తమిళనాట రాజకీయాల్లో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. నటుడు, మక్కల్ నీది మయ్యమ్(MNM) పార్టీ అధినేత కమల్ హాసన్.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin)తో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేసిన కమల్.. మూడు భాషల పాలసీకి వ్యతిరేకంగా స్టాలిన్ పోరాడటాన్ని అభినందించారు.నూతన జాతీయ విద్యా విధానం(National Education policy)లో భాగంగా.. కేంద్రం తీసుకొచ్చిన మూడు భాషల పాలసీని తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డీఎంకే-బీజేపీ మధ్య మాటల యుద్ధమే జరుగుతోంది. అయితే తమిళ భాషా పరిరక్షణకు స్టాలిన్ చేస్తున్న పోరాటం అసామాన్యమైందని కమల్ హాసన్ అంటున్నారు. ‘‘నా ప్రియమైన స్నేహితుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిశా. తమిళనాడు, తమిళ భాష, తమిళ సంప్రదాయం అన్నివైపులా ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న వేళ.. డీఎంకే దిగ్గజాల పోరాటపటిమనే స్టాలిన్ కనబరుస్తున్నారు. తమిళనాడుకు ఓ కోటగా ఆయన రక్షణ కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన్ని అభినందిస్తూ.. ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నా’’ అని కమల్ ట్వీట్ చేశారు. అంతకుముందు.. நாளை பிறந்த நாள் காணும் மாண்புமிகு தமிழ்நாடு முதல்வர், திராவிட முன்னேற்றக் கழகத்தின் தலைவர், என்னுடைய அருமை நண்பர் திரு. மு.க. ஸ்டாலின் அவர்கள் நல்ல ஆரோக்யத்துடன், நீண்ட காலம் வாழ்ந்து மக்கள் பணியாற்ற வேண்டுமென இன்று நேரில் சந்தித்து வாழ்த்தினேன். தமிழக மக்களும், தமிழ்… pic.twitter.com/jsZ6AfgsQ3— Kamal Haasan (@ikamalhaasan) February 28, 2025ఎన్‌ఈపీను కమల్ హాసన్(Kamal Haasan) సైతం బహిరంగంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. తన ఎంఎన్ఎం పార్టీ వార్షికోత్సవ సమావేశంలో ప్రసంగిస్తూ.. ‘‘భాష కోసం గతంలో తమిళులం ప్రాణాలొదిలేశాం. ఆ విషయంలో మాతో ఆటలొద్దూ’’ అంటూ కేంద్రానికి హెచ్చరిక పంపారాయన. 👉ఇదిలా ఉంటే.. 2026 నుంచి అమల్లోకి రానుంది నూతన జాతీయ విద్యా విధానం(NEP). ఈ పాలసీలో ‘త్రిభాష’ను అమలు చేయాలని ఎన్డీయే ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇది ప్రాంతీయ భాషలను అణచివేసే ప్రయత్నమని స్టాలిన్ ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. ఎన్ఈపీ అమలు చేస్తేనే రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను ఇస్తామని కేంద్రం బ్లాక్మెయిల్ చేస్తోందని.. అయినా తాము వెనక్కి తగ్గబోమని స్టాలలిన్ చెబుతున్నారు. 👉మరోవైపు ఈ ఆరోపణలను ఖండించిన కేంద్రం.. హిందీ అమలు తప్పనిసరేం కాదని చెబుతోంది. రాజకీయ లబ్ధి కోసమే తమిళనాడు ప్రభుత్వం, అక్కడి పార్టీలు ఎన్ఈపీపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడుతున్నాయి. మరోవైపు బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై.. డీఎంకే ప్రభుత్వానికి సవాళ్లు విసురుతున్నారు. అయితే త్రిభాషను వ్యతిరేకిస్తూ తమిళనాడు బీజేపీ నుంచి పలువురు రాజీనామాలు చేస్తుండడం గమనార్హం. 👉 2018, ఫిబ్రవరి 21వ తేదీన కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ పార్టీని మధురైలో స్థాపించారు. అప్పటి నుంచి ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ప్రభావం చూపెట్టలేకపోయింది. అయితే కిందటి ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమికి మద్ధతు ప్రకటించింది ఎన్ఎంఎం. కూటమి భాగస్వామి డీఎంకే తరఫున కమల్ హాసన్ ప్రచారంలో పాల్గొనగా.. అన్ని లోక్‌సభ స్థానాలను కూటమి క్లీన్ స్వీప్ చేసింది. దీంతో.. కమల్ హాసన్‌ను రాజ్యసభను పంపుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదీ చదవండి: భాషా యుద్ధం.. అనవసర భయమా? లేక.. -
బీజేపీ Vs స్టాలిన్: పోరాటానికి తమిళులు కలిసి రండి.. సీఎం పిలుపు
చెన్నై: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తమిళనాడులో సీఎం స్టాలిన్ మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. హిందీ భాష విషయంలో కేంద్రంపై స్టాలిన్ నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పటికే హిందీ కారణంగా 25 భారతీయ భాషలు కనుమరుగైపోతున్నాయని విమర్శించారు. తాజాగా మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. తమిళనాడుకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ప్రతీ పౌరుడు కదలిరావాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేశారు.తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తాజాగా వీడియోలో మాట్లాడుతూ..‘ప్రస్తుతం తమిళనాడు రెండు ముఖ్యమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. అవి త్రిభాష విధానం అమలు ఒకటి అయితే, మరొకటి నియోజకవర్గాల పునర్విభజన అంశం. త్రిభాషా విధానాన్ని వ్యతిరేకించినందుకు మనకు రావాల్సిన నిధులను కేంద్రం నిలిపివేసింది. నియోజకవర్గాల విభజన తమిళనాడు ఆత్మగౌరవాన్ని ప్రభావితం చేస్తోంది. కేంద్రం తన ఇష్టానుసారం తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకించాల్సిన సమయం వచ్చింది. వీటికి వ్యతిరేకంగా పోరాడేందుకు రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ముందుకు రావాలి. మన పోరాటాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని అందరినీ కోరుతున్నాను అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో.. ఇప్పటికే కేంద్రం నిర్ణయాలను ఇప్పటికే పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. కర్ణాటక, పంజాబ్‌తో పాటు తెలంగాణ వంటి రాష్ట్రాలు సైతం దీనికి సంఘీభావం తెలిపాయి. తమిళనాడులో పార్లమెంటు నియోజకవర్గాలను తగ్గించబోమని చెబుతూనే.. ఇతర రాష్ట్రాల్లో పెంచమని హామీ ఇవ్వలేకపోతున్నారు. మా డిమాండ్ స్పష్టంగా ఉంది. జనాభా ప్రాతిపదికన మాత్రమే నియోజకవర్గాలు నిర్ణయించవద్దు. రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరిగే వాటిని తమిళనాడు ప్రతిఘటిస్తుంది. విజయం సాధిస్తుంది’ అని చెప్పుకొచ్చారు.అంతకుముందు కూడా కేంద్రంపై స్టాలిన్ సంచలన ఆరోపణలు చేశారు. హిందీ కారణంగా దేశంలో 25 ఉత్తర భారతీయ భాషలు కనుమరుగైపోతున్నాయని విమర్శించారు. భోజ్‌పురి, మైథిలీ, బుందేలీ, గర్వాలీ, కుమావోని, మాగాహి, మార్వారీ, మాల్వీ, ఛత్తీస్గఢి, సంథాలీ, అంజికా ఇలా అనేక భాషలు మనుగడ కోసం ఎదురుచూస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్లు హిందీ రాష్ట్రాలు కావు. వాటి అసలు భాషలు గతంలో కలిసిపోయాయి. తమిళనాడుకు అలాంటి పరిస్థితి రాకూడదనే ప్రతిఘటిస్తున్నాం. జాతి, సంస్కృతిని నాశనం చేయడానికి భాషలపై దాడి చేస్తున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు. ஒரே இலக்கு!தமிழ்நாடு போராடும்!தமிழ்நாடு வெல்லும்!#FairDelimitationForTN pic.twitter.com/zQ1hMIHGzo— M.K.Stalin (@mkstalin) February 28, 2025 -
పునర్విభజన పేచీ తేల్చేదెలా?
ఎప్పటినుంచో చర్చకొస్తున్న నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ అంశంపై ఎట్టకేలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నోరువిప్పారు. ఈ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగబోదని హామీ ఇచ్చారు. దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కూడా అన్నారు. ఏ విషయమైనా వివాదాస్పదమైనప్పుడు వెంటనే వివరణనిచ్చి సందేహాలను తొలగించటం ప్రభుత్వాల బాధ్యత. 2023 సెప్టెంబర్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా డీఎంకే నాయకురాలు కనిమొళి దీన్ని ప్రస్తావించారు. జనాభా ప్రాతిపదికన పునర్విభజన ప్రక్రియ అమలు చేస్తే దక్షిణాదికి, ముఖ్యంగా తమిళనాడుకు అన్యాయం జరుగుతుందని ఆమె తెలిపారు. ఆ సమస్యే తలెత్తదని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఇప్పుడు అమిత్ షా అయినా, గతంలో మోదీ అయినా అన్యాయం జరగబోదని వాగ్దానం చేస్తున్నారు. మంచిదే. మరైతే పునర్వి భజన ఎలా ఉండబోతోంది? ఏ ప్రాతిపదికన చేస్తారు? అది చెప్పనంత కాలమూ ఈ సంశయాలు సమసిపోవు. జనాభా ప్రాతిపదికనే తీసుకుంటే అన్యాయం జరుగుతుందన్నది దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న సందేహం. అందుకు ఇతరత్రా ప్రాతిపదికలు తీసుకోబోతున్నామని తేటతెల్లం చేసినప్పుడే అందరికీ స్పష్టత వస్తుంది. దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాలు చాలా అంశాల్లో సాపేక్షంగా వెనకబడి వున్నాయి. విద్య, వైద్యం, ఆర్థికం వగైరాల్లో దక్షిణాదిదే ముందంజ. ఇదంతా జనాభాను అదుపు చేయటం వల్లనే సాధ్యమైంది. 2011 జనాభా లెక్కల ప్రకారం బిహార్‌లో జనాభా పెరుగుదల రేటు 25 శాతంగావుంటే, కేరళలో అది 5 శాతం మాత్రమే. ఎన్నికలు జరిగినప్పుడల్లా బీజేపీ ‘డబుల్ ఇంజన్ సర్కారు’ను తెరపైకి తెస్తుంది. ఆ సంగతెలా వున్నా దేశానికి ‘గ్రోత్ ఇంజన్’ దక్షిణాది అని చెప్పవచ్చు. అందుకే పునర్విభజనపై ఉన్న సందేహాలను పారదోలటం అవసరం.జనాభా లెక్కల సేకరణ జరిగి గణాంకాలు వెల్లడైనప్పుడల్లా ఆ ప్రాతిపదికన నియోజకవర్గాల హద్దులు, చట్టసభల్లో స్థానాల సంఖ్య మార్చాలని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. దానికి అనుగుణంగా 1951, 1961, 1971 సంవత్సరాల జనాభా లెక్కల ప్రాతిపదికన లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రాల అసెంబ్లీల్లోని స్థానాల సంఖ్య మారుతూ వచ్చింది. నియోజకవర్గాల పరిధులు కూడా మారాయి. కానీ 1976లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దీనికి బ్రేక్ వేశారు. ఆత్యయిక స్థితి కొనసాగుతున్న వేళ 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి 2001 వరకూ పునర్విభజన ప్రక్రియను స్తంభింపజేశారు. అధిక జనాభా ఉన్న రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసి జనాభా పెరుగుదలను అరికడితే ఏ రాష్ట్రమూ స్థానాల సంఖ్యను కోల్పోకుండా ఉంటుందని ఆమె ప్రభుత్వం భావించింది. కానీ ఎప్పటిలా దక్షిణాది రాష్ట్రాలే జనాభా అదుపులో ముందున్నాయి. 2001లో తప్పనిసరై పునర్విభజన ప్రక్రియ మొదలెట్టినా అది కేవలం నియోజకవర్గాల పరిధుల్లో మార్పులకే పరిమితమైంది. స్థానాల సంఖ్య యథాతథంగా ఉండిపోయింది. దక్షిణాది రాష్ట్రాల ఆందోళనను దృష్టిలో ఉంచుకునే ఆ పనిచేశారు.జనాభా పెరుగుదల రేటులో అసమతౌల్యం చాలా సమస్యలకు దారితీస్తోంది. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌లో ఒక ఎంపీ సగటున 30 లక్షలమంది జనాభాకు ప్రాతినిధ్యం వహించాల్సి వుంటుంది. అదే తమిళనాడులో అయితే దాదాపు 18 లక్షలమంది జనాభాకు ప్రతినిధిగా ఉంటారు. అంటే పునర్విభజన ప్రక్రియ ప్రాతిపదిక అన్ని అంశాల్లోనూ సమతుల్యతను సాధించాల్సి వుంటుంది. 1977 నాటి లోక్‌సభలో ప్రతి ఎంపీ సగటున 10.11 లక్షల జనాభాకు ప్రాతినిధ్యంవహించారు. అయితే అన్ని నియోజకవర్గాలూ ఈ చట్రంలో ఇమిడే అవకాశం ఉండదు గనుక కాస్త అటూ ఇటూగా నిర్ణయించారు. జనాభా లెక్కల సేకరణలో ఇప్పటికే మనం నాలుగేళ్లు వెనకబడి వున్నాం. కానీ కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం ప్రస్తుత జనాభా దాదాపు 143 కోట్లు. ఈ జనాభాకు 1977 నాటి ప్రాతిపదికన ఎంపీ స్థానాలు నిర్ణయించాల్సివస్తే వాటి సంఖ్య ఇంచుమించు 1,400కు చేరుతుంది. దీని ప్రకారం యూపీ స్థానాల సంఖ్య (ఉత్తరాఖండ్ కలుపు కొని) 85 నుంచి మూడురెట్లు పెరిగి 250కి చేరుతుంది. బిహార్‌కు (జార్ఖండ్ కలుపుకొని) ప్రస్తుతం ఉన్న 25 స్థానాలూ 82కు చేరుతాయి. తమిళనాడుకు దాదాపు రెట్టింపు సీట్లు పెరిగి 39 నుంచి 76 అవుతాయి. కేరళకు మాత్రం ప్రస్తుతం ఉన్న 20 కాస్తా 36 అవుతాయి. నియోజకవర్గానికి 20 లక్షల జనాభా ఉండాలనుకుంటే మొత్తం స్థానాలు 707 అవుతాయి. కానీ అలా జరిగితే తమిళనాడు స్థానాల సంఖ్య ఇప్పుడున్న మాదిరే ఉండిపోతుంది. కేరళ మాత్రం రెండు స్థానాలు కోల్పోతుంది. యూపీ మాత్రం 126కు చేరుతుంది. మన నూతన పార్లమెంటు భవనం 888 మంది ఎంపీలు ఆసీనులు కావటానికి వీలుగా నిర్మించారు. ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగకుండా, ఉన్న స్థానాలు కోల్పోకుండా పునర్విభజన ఉంటుందని అమిత్ షా చెప్పటం ఊరట కలిగిస్తుంది. కానీ జమ్మూ, కశ్మీర్లో జరిగిందేమిటి? అక్కడ అసెంబ్లీ స్థానాలు (లద్దాఖ్ మినహా) 83 నుంచి 90కి చేరు కున్నాయి. కొత్తగా పెరిగిన 7 స్థానాల్లో హిందువులు అధికంగా వున్న జమ్మూకు 6 వస్తే, ముస్లింల ప్రాబల్యంవున్న కశ్మీర్‌కు ఒక్కటి మాత్రమే పెరిగింది. అందుకే కేవలం అన్యాయం జరగదన్న హామీ మాత్రమే సరిపోదు. పునర్విభజన ప్రక్రియకు ఇక ఎంతో సమయం లేదు గనుక దానికి అనుసరించే ప్రాతిపదికలేమిటో తేటతెల్లం చేయటం అవసరం. అది చేయనంత కాలమూ సందేహాలు ఉత్పన్నమవుతూనే ఉంటాయి. వాటిని అబద్ధాలుగా కొట్టిపారేసినంత మాత్రాన సమసిపోవు. -
TN Vs Centre: భాషా యుద్ధం.. ఇది ఈనాటిదేం కాదు!
జాతీయ విద్యా విధానం(National Education Policy 2020) అమలు విషయంలో.. తమిళనాడు వర్సెస్ కేంద్ర ప్రభుత్వం వ్యవహారం మరింత ముదురుతోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తాజాగా సంచలన ఆరోపణలు చేయగా.. బీజేపీ అంతే ధీటుగా బదులిచ్చింది. బలవంతంగా హిందీ భాషను రుద్ది.. స్థానిక భాషలను కనుమరుగయ్యే స్థాయికి చేర్చారంటూ ఆరోపిస్తున్నారాయన. సోదరీసోదరీమణుల్లారా.. గత 100 సంవత్సరాల్లో ఎన్ని భాషలను హిందీ మింగేసిందో తెలుసా? భోజ్‌పురి, మైథిలీ, అవాదీ, బ్రజ్, బుంధేలీ, ఖుమావోని, మఘాహి, మార్వారీ, మాల్వీ, ఛత్తీస్‌ఘడీ, అంగిక, సంతాలి, హో, ఖారియా, ఖోర్థా, కుర్మాలీ, ముండారీ, కురుఖ్.. ఇలా పాతికకుపైగా నాశనం చేసింది. ఇంకోన్ని భాషలు తమ మనుగడ కోసం పోరాడుతున్నాయి. ఏకపక్షంగా హిందీని రాష్ట్రాలపై రుద్దేయాలన్న నిర్ణయం.. పురాతన భాషలను తుడిచి పెట్టేస్తోంది. ఉత్తర ప్రదేశ్, బీహార్లు హిందీకి గుండెకాయలు అని చెబుతుంటారు. కానీ, ఆ రాష్ట్రాల్లో అసలైన భాషలు అంతరించే స్థితికి చేరుకున్నాయి అని స్టాలిన్ పోస్ట్ చేశారు. హిందీ అమలు విషయంలో తమిళ రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శలు అర్థంలేనివని.. కేవలం 2026 ఎన్నికల్లో లాభం కోసమే పాకులాడుతున్నాయని కేంద్రం డీఎంకే ప్రభుత్వంపై మండిపడుతోంది. అయితే స్టాలిన్ ఈ విమర్శలను కూడా తిప్పికొట్టారు. తమిళనాడుకు మాత్రం ఆ నిర్ణయం(NEP) ఏవైపు దారి తీస్తుందో తెలుసని, అందుకే అమలు చేయబోమంటూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారాయన.My dear sisters and brothers from other states,Ever wondered how many Indian languages Hindi has swallowed? Bhojpuri, Maithili, Awadhi, Braj, Bundeli, Garhwali, Kumaoni, Magahi, Marwari, Malvi, Chhattisgarhi, Santhali, Angika, Ho, Kharia, Khortha, Kurmali, Kurukh, Mundari and… pic.twitter.com/VhkWtCDHV9— M.K.Stalin (@mkstalin) February 27, 2025ఇదిలా ఉంటే.. స్టాలిన్ ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. ఆయన(Stalin) వాదన అసంబద్ధంగా(Silly)గా ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. తొలుత జాతీయ విద్యావిధానం అమలు చేస్తామని తమిళనాడు కూడా అంగీకరించిందని, ఆపై రాజకీయ లబ్ధి కోసమే యూటర్న్ తీసుకుందని మండిపడ్డారాయన. ఇక.. ఎన్ఈపీ అమలుకు సన్నద్ధంగా లేకపోవడం వల్లే తమిళనాడుకు వచ్చే రూ. 2,400 కోట్ల ఫండ్‌ను కేంద్రం ఆపేసిందన్న ఆరోపణలనూ మంత్రి ధర్మేంద్ర తోసిపుచ్చారు. ఎన్ఈపీ ప్రకారం రాష్ట్రాలు తమకు నచ్చిన భాషలను అమలు చేసే అవకాశం ఉందని, కానీ తమిళనాడు ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం అనవసరమైన రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు.హిందీ భాష అమలు విషయంలో కేంద్రం గనుక తమ రాష్ట్రంపై బ్లాక్‌మెయిల్‌కు పాల్పడితే.. మరో భాషా యద్ధానికి(Language War) సిద్ధమంటూ సీఎం స్టాలిన్, ఆయన తనయుడు.. డిప్యూటీ సీఎం ఉదయ్‌నిధి స్టాలిన్ కేంద్రాన్ని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాడు ఏం జరిగిందో ఓసారి పరిశీలిస్తే..అప్పటి నుంచే అనుమానాలుభారత రాజ్యాంగం ప్రకారం 15 ఏళ్లపాటు హిందీతో పాటు ఇంగ్లీష్‌ను అధికారిక ఉత్తర్వుల కోసం వినియోగించాలని కానిస్టిట్యూట్ అసెంబ్లీ నిర్ణయించింది. దీని ప్రకారం.. జనవరి 26, 1950 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. అయితే 1965లో ఆ గడువు పూర్తి కావడంతో.. హిందీయేతర రాష్ట్రాలు ఆందోళన బాట పట్టాయి. బలవంతంగా తమ రాష్ట్రాల్లో హిందీ భాషను అమలు చేస్తారేమో అని ఉద్యమాలు మొదలుపెట్టాయి. తమిళ సంప్రదాయాలతో పాటు భాషప్రతిపాదికన మద్రాస్ గడ్డపై ద్రవిడ ఉద్యమం జరిగింది. అలాంటి చోట హిందీ భాష ప్రవేశపెట్టడంపై దశాబ్దాల నుంచే వ్యతిరేక ఉద్యమం నడుస్తోంది. 1965లో తమిళనాడులో డీఎంకే ఆధ్వర్యంలో భారీ హిందీ భాష అమలు వ్యతిరేక ఉద్యమం జరగ్గా.. అది హింసాత్మక మలుపు తీసుకుంది. హిందీ భాష అమలును వ్యతిరేకిస్తూ.. ఎంతో మంది బలిదానం చేసుకున్నారు. ఈ పరిణామం కాంగ్రెస్‌ను తమిళనాడులో అధికార పీఠం నుంచి దించేయడానికి ఓ కారణమైంది. తమిళనాడులో రెండు భాషలే..సీఎన్ అన్నాదురై నేతృత్వంలోని తొలి డీఎంకే ప్రభుత్వం.. 1968లో తమిళనాడు కోసం ఓ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టింది. అందులో ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం తమిళం, ఆంగ్లం మాత్రమే బోధించాలని ఉంది. అయితే అదే సమయంలో ఇందిరా గాంధీ హయాంలోని కేంద్ర ప్రభుత్వం కొఠారి కమిషన్(1964-66) నివేదిక ఆధారంగా తొలిసారి జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టింది. సమాన విద్యావకాశాలను ప్రొత్సహించడంతో పాటు జాతీయ సమైక్యతను ప్రతిబింబించేలా మూడు భాషల ఫార్ములాను ప్రవేశపెట్టాలని సదరు కమిషన్ సూచించింది. దీని ప్రకారం.. హిందీ, ఇంగ్లీష్‌తో పాటు స్థానిక భాషలను సూచించింది. అయితే ఆ టైంలోనూ హిందీ తప్పనిసరి కాదని కేంద్రం చెప్పినా.. ఆ విద్యావిధానాన్ని తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకించింది.👉1968లో ఇందిరా గాంధీ హయాంలో మొదటి జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టబడింది. 14 ఏళ్లలోపు వారికి తప్పనిసరి విద్య, శాస్త్ర విజ్ఞాన రంగాలపై అవగాహన ద్వారా ఆర్థిక అభివృద్ధి, సమాన విద్యావకాశాలు, టీచర్లకు శిక్షణ.. ఇతర అంశాలతో కొఠారి కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ పాలసీని అమల్లోకి తెచ్చింది. ఇందులో మూడు భాషల విధానం తీసుకొచ్చింది కేంద్రం. 👉ఇక.. 1986లో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న టైంలో మరోసారి ఎన్ఈపీ తెరపైకి వచ్చింది. ఈసారి మూడు భాషల అంశం లేకుండా.. కేవలం విద్యా ప్రమాణాలను మెరుగుపర్చడంతో పాటు అన్ని వయసుల వారికి విద్యను అందించడం మీదనే ఫోకస్ చేసింది.👉ముచ్చటగా మూడోసారి.. పీవీ నరసింహారావు హయాంలో ప్రవేశపెట్టారు. అయితే.. 1986 ఎన్ఈపీకే కొన్ని మార్పులుచేర్పులు చేశారు. సమకాలీన సవాళ్లను ప్రస్తావిస్తూ.. విద్యా వ్యవస్థను పటిష్టం చేయడంపై ఆయన దృష్టిసారించారు.ఇక.. దేశ విద్యా వ్యవస్థలో సంస్కరణలు తెచ్చే ఉద్దేశంతో.. 2020, జులై 29వ తేదీన జాతీయ విద్యా విధానాన్ని ఎన్డీయే ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా 1986 జాతీయ విద్యా విధానాన్ని(ఇప్పుడు అమల్లో ఉన్నదే) సమూలంగా మార్చేసింది. జులై 29, 2020లో అప్పటి కేబినెట్ నూతన విద్యా విధానానికి ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం 10+2గా ఉన్న బేసిక్ అకడమిక్ వ్యవస్థను.. 5+3+3+4గా మార్పు చేయడంతో పాటు పలు కీలక సంస్కరణలు తీసుకొచ్చింది. ఈ ఎన్ఈపీ ప్రకారం.. మూడు లాంగ్వేజ్ ఫార్ములా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో హిందీ కూడా ఉంది. కానీ.. ఇది బలవంతపు నిర్ణయం కాదని కేంద్రం మొదటి నుంచి చెబుతోంది. రాష్ట్రాలు, రీజియన్లు, విద్యార్థులు తమకు నచ్చి భాషలను ఎంచుకునే వీలు ఉంటుందని చెబుతూ వస్తోంది. అయితే ఇది తమ మాతృభాషకు దొడ్డిదారిన ముప్పు కలిగించే ప్రయత్నమేనని తమిళనాడు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ విధానం అమలు చేయబోమని చెబుతోంది. ఇక 2026లో ఈ విద్యావిధానం అమల్లోకి రానుంది. -
జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదికి అన్యాయం
సాక్షి, హైదరాబాద్: జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సామాజిక మాధ్యమాల్లో వ్యక్తం చేసిన ఆందోళనలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్టు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో కేటీఆర్ పేర్కొన్నారు.‘జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాల కృషిని పట్టించుకోకుండా జనాభా ఆధారంగా నియోజకవర్గాలను పునర్విభజించడం ప్రజాస్వామ్యానికి, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. దక్షిణాది రాష్ట్రాలు దేశ నిర్మాణంలో అందించిన సహకారాన్ని ఎవరూ కాదనలేరు. 1951లో దక్షిణాది రాష్ట్రాల జనాభా వాటా 26.2 శాతం ఉండగా, 2022 నాటికి అది 19.8 శాతానికి పడిపోయింది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ వంటి ఉత్తర రాష్ట్రాల జనాభా వాటా 39.1 శాతం నుంచి 43.2 శాతానికి పెరిగింది. ఈ పరిస్థితుల్లో జనాభా ఆధారంగా లోక్‌సభ సీట్లను నిర్ణయిస్తే, ఉత్తరప్రదేశ్, బిహార్‌కు 222 సీట్లు వస్తాయి. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళకు మొత్తంగా కేవలం 165 సీట్లు మాత్రమే లభిస్తాయి. దక్షిణాది రాష్ట్రాలు ఆర్థిక వృద్ధి, మానవ అభివృద్ధి సూచికలు, జనాభా నియంత్రణ వంటి అన్ని రంగాల్లో ఉత్తర రాష్ట్రాల కంటే గణనీయంగా మెరుగైన పనితీరు కనబరిచాయి. అలాంటి రాష్ట్రాలను శిక్షించి, వెనుకబడిన రాష్ట్రాలను ప్రోత్సహించడం దేశ ప్రయోజనాలకు వ్యతిరేకం’అని కేటీఆర్ పేర్కొన్నారు.అధికార యంత్రాంగంపై వేధింపులు సిగ్గుచేటు‘తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్ స్ట్రాక్ట్ (అట్లాస్) రిపోర్టుతో కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత రాష్ట్ర ప్రజల ముందు బట్టబయలు కావడం సీఎంకు మింగుడు పడటం లేదు. వెబ్సైట్ నుంచి రిపోర్టులు తొలగించి, అధికారులపై వేటు వేసినంత మాత్రాన కేసీఆర్ కృషిని చెరిపివేయలేరు’అని కేటీఆర్ అన్నారు.టెక్, ఇన్నోవేషన్ సమ్మిట్–2025కు కేటీఆర్ఫిబ్రవరి 27, 28 తేదీల్లో జరిగే టెక్, ఇన్నోవేషన్ సమ్మిట్ (టిస్)లో ముఖ్య అతిథిగా ప్రసంగించేందుకు కేటీఆర్ బుధవారం సాయంత్రం బెంగళూరుకు బయలుదేరివెళ్లారు. గురువారం జరిగే సదస్సులో ‘డ్రైవింగ్ డిజిటల్ ఇండియా– సాంకేతికంగా అభివృద్ధి చెందిన భవిష్యత్ కోసం ఆవిష్కరణలు, వ్యూహాలు’అనే అంశంపై కేటీఆర్ కీలకోపన్యాసం చేస్తారు. -
అవినీతిలో మాస్టర్స్ డిగ్రీ.. అమిత్‌షా చురకలు
చెన్నై: వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని కేంద్ర హోమంత్రి అమిత్‌షా జోస్యం చెప్పారు. ఇవాళ అమిత్ షా తమిళనాడులోని పలు జిల్లాల్లో బీజేపీ పార్టీ కార్యాలయాల్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా అమిత్ షా.. తమిళ రాజకీయాలు, అసెంబ్లీ ఎన్నికలు, డీఎంకేలో అవినీతి వంటి అంశాలపై మాట్లాడారు. తమిళనాడులో అవినీతిలో మాస్టర్స్ డిగ్రీ చేసిన అవినీతి పరులంతా ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) సభ్యత్వం తీసుకున్నారు. ఒకరు క్యాష్ ఫర్ జాబ్ స్కామ్, మనీ లాండరింగ్, ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ ఆస్తుల కేసులు నమోదయ్యాయి.నాకు కొన్ని సార్లు అనిపిస్తుంది అవినీతి పాల్పడే వారికి సభ్యత్వం ఇచ్చి డీఎంకే తన పార్టీలోకి చేర్చుకుంటుందేమోనని. తమిళనాడు డీఎంకే అధినేత, సీఎం ఎంకే స్టాలిన్, అతని కుమారుడు డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్లు రాష్ట్ర సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఆ ఇద్దరు నేతలు డీలిమిటేషన్‌పై సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ డీలిమిటేషన్‌పై ప్రధాని మోదీ స్పష్టం చేశారు.డీలిమిటేషన్ తర్వాత దక్షణాది రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానల సీట్లలో ఎలాంటి మార్పు ఉండబోదని.అన్నీ అవాస్తవాలేతమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రధాని మోదీపై ఆరోపణలు చేస్తున్నారు. కేంద్రం రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా అన్యాయం చేస్తోందని. ఆయన చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. రాష్ట్రానికి నిధుల కేటాయింపులపై యూపీఏ, ఎన్డీయేలను పోల్ల్చి చూస్తే.. ఎన్డీయే ప్రభుత్వం తమిళనాడుకు ఎక్కువ మొత్తంలో నిధుల్ని కేటాయించింది. మోదీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలలో తమిళనాడుకు రూ. 5 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది’ అని అమిత్ షా అన్నారు.కూటమిదే అధికారం..వచ్చే ఏడాది తమిళనాడులో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. కుటుంబ రాజకీయాలు, అవినీతి అంతమొందిస్తాం. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని రాష్ట్రం నుంచి పంపించేస్తాం’ అని అమిత్ షా స్పష్టం చేశారు. దేశంలో జనగణన (Census) జరపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రక్రియ అనంతరం లోక్‌సభ స్థానాల విభజన ప్రక్రియ ఉంటుందని సమాచారం. ఇప్పుడు ఇదే అంశాన్ని తమిళనాడు అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) అధినేత, సీఎం ఎంకే స్టాలిన్ వ్యతిరేకిస్తున్నారు. ఇదే అంశంపై చర్చించేందుకు మార్చి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40 పార్టీలకు ఆహ్వానించారు. జన గణన ప్రక్రియ అనంతరం లోక్‌సభ స్థానాల విభజన ప్రక్రియ ఉండనుంది. అయితే, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తీవ్రంగా నష్టపోయేది దక్షిణాది రాష్ట్రాలే అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై ఎంకే స్టాలిన్ ఆల్ పార్టీ మీటింగ్‌కు పిలుపునిచ్చారు. -
భాషా యుద్ధానికి మేం సిద్ధం: తమిళనాడు సీఎం వార్నింగ్
చెన్నై: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే త్రీ లాంగ్వేజ్ పాలసీకి తాము వ్యతిరేకమని మరోసారి స్పష్టం చేశారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. తమపై హిందీ బాషను బలవంతంగా రుద్దాలనే ప్రయత్నం జరుగుతోందని స్టాలిన్ మండిపడ్డారు. అవసరమైతే మరో భాషా యుద్ధానికి తమిళనాడు సిద్ధంగా ఉందని హెచ్చరించారు స్టాలిన్. కేంద్ర ప్రభుత్వం నూతన లాంగ్వేజ్ పాలసీపై మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా స్టాలిన్ ఘాటుగా స్పందించారు. ‘ మాపై హిందీని రుద్దాలనే యత్నం జరుగుతోంది. ఇది వద్దని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి చెబుతూనే ఉన్నాం. ఇందుకోసం మరో భాషా పోరాటానికైనా తమిళనాడు ప్రజలు సిద్ధం’ అని స్టాలిన్ పేర్కొన్నారు.మీది ద్వంద్వ వైఖరి.. కపట వైఖరి: అన్నామలైస్టాలిన్ వ్యాఖ్యలు చూస్తే ఆయనలో కపటత్వం కనబడుతోందన్నారు తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నామలై. ఆయన కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే లాంగ్వేజ్ పాలసీనే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. అక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు థర్డ్ లాంగ్వేజ్ ను నేర్చుకునే అవకాశాన్ని నిరాకరిస్తున్నారు కానీ మరి తమిళనాడులో ప్రైవేటు స్కూళ్లలో వారి సహచరులు నడిపే సీబీఎస్ఈ స్కూళ్లలో థర్డ్ లాంగ్వేజ్ లేదా అని ప్రశ్నించారు.మరి థర్డ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఎటువంటి పరిమితులు లేవని స్టాలిన్ సూచిస్తున్నారా?, మీరు థర్డ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు. మీ పిల్లల్ని మీ సహచరులు నడిపే స్కూళ్లలో చేర్చి నేర్చుకోండి. ఇక్కడ డీఎంకేది ద్వంద్వ విధానం. ధనికుల పిల్లలకు ఒక రకంగా, పేదల పిల్లలకు ఒక రకంగా వ్యవరిస్తోంది. ఇది కపట ధోరణి’ అంటూ అన్నామలై ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. -
మన ట్వీట్లలో ఎవరు గెలిచారో చూద్దామా? డీఎంకేకు బీజేపీ సవాల్
చెన్నై: అటు బీజేపీ ఇటు డీఎంకే. తమిళనాడు వేదికగా సాగుతున్న సోషల్ మీడియా రచ్చ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అనే స్థాయిలో వారి సోషల్ మీడియా వార్ సాగుతోంది. దీనింతటికీ ‘గెట్ అవుట్ మోదీ’ అంటూ సోషల్ మీడియాలో డీఎంకే చేసిన హ్యాష్ ట్యాగ్ ప్రధాన కారణంగా నిలిచింది. గత కొద్దిరోజులుగా కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య మాటల యుద్దమే సాగుతోంది. హిందీ భాషను అమలు చేయడాన్ని డీఎంకే(DMK) వ్యతిరేకిస్తోంది. ఇది కాస్తా ఇరు పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ కు దారి తీసింది. ఈ క్రమంలోనే డీఎంకే ఐటీ వింగ్ సోషల్ మీడియాలో ‘గెట్ అవుట్ మోదీ’ హ్యాష్ ట్యాగ్ ను కోడ్ చేసింది. దీనిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ సైతం ‘ గెట్ అవుట్ స్టాలిన్’ పేరుతో హ్యాష్ ట్యాగ్ ను కౌంటర్ గా సోషల్ మీడియా(Social Media)లో వదిలింది. ఇరు పార్టీల ట్వీట్లకు సంబంధించి తమిళనాడు బీజేపీ(BJP) చీఫ్ కె అన్నామలై మాట్లాడుతూ.. ఈ రెండు హ్యాష్ ట్యాగ్ లను కోడ్ చేస్తూ ‘ఎవరు గెలిచారో చూసుకుందామా’ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు డీఎంకేకు. ‘ మీరు గెట్ అవుట్ మోదీ’ హ్యాష్ ట్యాగ్ ను రాత్రి పూట్ రిలీజ్ చేశారు. ఆపై ఉదయం ఆరు గంటలకు ‘గెట్ అవుట్ స్టాలిన్’ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్‌లోకి తెచ్చాం. ఇక్కడ ఎవరు హ్యాష్ ట్యాగ్ ఎక్కువ రీచ్ అయ్యిందో చూద్దామా. ఇందుకోసం మీకున్న అన్ని వనరులను ఉపయోగించుకుండి. మన ఇద్దరి ట్వీట్లలో ఎవరిది ఎక్కవ ప్రజల్లోకి పోయిందో చూద్దాం’’ అంటూ డీఎంకే కు చాలెంజ్ విసిరారు అన్నామలై.For high handedness of one family, having a tainted cabinet, being an epicentre of corruption, turning a blind eye to lawlessness, turning TN into a haven for drugs & illicit liquor, mounting debt, dilapidated education ministry, precarious environment for women & children,… pic.twitter.com/VyD0BgPLfk— K.Annamalai (@annamalai_k) February 21, 2025 ఇదే సమయంలో తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందన్నారు అన్నామలై. ప్రధానంగా పిల్లలకు భద్రత కల్పించడంలో డీఎంకే ప్రభుత్వం పూర్తిగా చతికిలబడిందన్నారు. కేంద్రం Vs తమిళనాడు.. సీఎం స్టాలిన్‌కు కేంద్రమంత్రి కౌంటర్ -
కేంద్రం Vs తమిళనాడు.. సీఎం స్టాలిన్‌కు కేంద్రమంత్రి కౌంటర్
ఢిల్లీ: గత కొద్దిరోజులుగా కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య మాటల యుద్దమే నడుస్తోంది. హిందీ భాష అమలు చేయడంపై కూడా నేతలు వాదించుకుంటున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి ధరేంద్ర ప్రధాన్ సీఎం స్టాలిన్‌కు కౌంటరిచ్చారు. విద్యార్థులపై ఏ భాషనూ బలవంతంగా రుద్దడం లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు.జాతీయ విద్యా విధానంపై కేంద్రమంత్రి ధరేంద్ర ప్రధాన్ తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా ధర్మేంద్ర ప్రధాన్.. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020 భాషా స్వేచ్చ సూత్రాన్ని సమర్థిస్తుంది. విద్యార్థులపై బలవంతంగా ఏ భాషనూ బలవంతంగా రుద్దడం లేదు. విద్యార్థులు తమకు నచ్చిన భాషను నేర్చుకోవచ్చు. దాన్ని కొనసాగించేలా ఈ పాలసీ ఉంది. ఇదే సమయంలో విదేశీ భాషపై అతిగా ఆధారపడటం వల్ల విద్యార్థులు భాషాపరమైన మూలాలను తెలుసుకోకుండా పరిమితం చేసినట్లవుతుంది.తమిళనాడు ప్రభుత్వం కేవలం రాజకీయ కారణాల వల్లే కొత్త పాలసీని వ్యతిరేకిస్తోందన్నారు. ప్రగతిశీల సంస్కరణలను రాజకీయాలతో ముడిపెట్టవద్దని సూచించారు. అలాగే, 2022లోనే ప్రధాని మోదీ తమిళ భాష శాశ్వతం అనే వ్యాఖ్యలు చేసినట్టు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటికైనా విద్యను రాజకీయం చేయడం వంటి పనులు మానుకోవాలని పేర్కొన్నారు.ఇక, అంతకుముందు ప్రధాని మోదీకి సీఎం స్టాలిన్ లేఖ రాశారు. సమగ్రశిక్షా పథకం కింద రాష్ట్రానికి రూ.2,152 కోట్ల నిధులను వెంటనే మంజూరు చేయాలని స్టాలిన్ కోరారు. జాతీయ విద్యా విధానం-2020ని పూర్తిగా అమలు చేసి త్రిభాషా విధానాన్ని ఆమోదించే వరకు తమిళనాడుకు సమగ్ర శిక్షా పథకం కింద నిధులు మంజూరు చేయమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ఇటీవల వెల్లడించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రంలోని విద్యార్థులు, రాజకీయ పార్టీలు, ప్రజల మధ్య ఆవేదన, ఆక్రోశం కలిగించిందని తెలిపారు. తమిళనాడులో చాలాకాలంగా ద్విభాషా విధానమే ఉందన్నారు. దాన్ని ఆచరించడంలో రాష్ట్రం దృఢంగా ఉందని పేర్కొన్నారు. అధికారిక భాషా నిబంధన 1976లో పేర్కొన్న మేరకు అధికార భాషా చట్టం 1963 హెచ్ అమలు చేయడం నుంచి రాష్ట్రానికి మినహాయింపు కల్పించడాన్ని గుర్తు చేశారు.Highly inappropriate for a State to view NEP 2020 with a myopic vision and use threats to sustain political narratives. Hon’ble PM @narendramodi ji’s govt. is fully committed to promote and popularise the eternal Tamil culture and language globally. I humbly appeal to not… pic.twitter.com/aw06cVCyAP— Dharmendra Pradhan (@dpradhanbjp) February 21, 2025ఒక రాష్ట్రంలోని కాలపరిస్థితులను అనుసరించే విధానాలకు వ్యతిరేకంగా ఆ రాష్ట్రాన్ని నిర్బంధించడానికి, నిధులు అందించే వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చే ఇలాంటి ప్రయత్నం సమాఖ్య పాలనాతత్వాన్ని అతిక్రమించే చర్యగా పేర్కొన్నారు. సమగ్ర శిక్షా పథకం కింద నిధులు మంజూరు చేయకపోతే ఉపాధ్యాయులకు వేతనం, విద్యార్థులకు సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు దెబ్బతింటాయన్నారు. అందుకే నిధులు విడుదల చేయడానికి చర్యలు చేపట్టాలని కోరారు.ఇదిలాఉండగా.. ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలపై ఉదయనిధి స్టాలిన్ మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం హిందీని రుద్దడం కొనసాగిస్తే, ప్రధాని తమిళనాడు పర్యటనకు వచ్చినప్పుడు 'గో బ్యాక్ మోదీ' కి బదులుగా 'గెట్ అవుట్ మోదీ' నినాదాలు ఎదుర్కోవలసి వస్తుందని ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల కారణంగా తమిళనాడులో రాజకీయం మరింత హీటెక్కింది. బీజేపీ నేతలు డీఎంకే నేతలపై మండిపడుతున్నారు. -
నటుడు సత్యరాజ్ కుమార్తెకు కీలక పదవి
సినీ నటుడు, బాహుబలితో కట్టప్పగా ప్రపంచవ్యాప్తంగా ముద్రపడ్డ సత్యరాజ్ తనయ దివ్య సత్యరాజ్ కొద్దిరోజుల క్రితమే డీఎంకే పార్టీలో చేరారు. అయితే, తాజాగా ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఆమెకు కీలక పదవి అప్పగించారు. ఆ పార్టీ అనుబంధ ఐటీ విభాగం డిప్యూటీ కార్యదర్శిగా ఆమెను నియమించారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి దురై మురుగన్ ప్రకటించారు. సినీ నటుడు సత్యరాజ్ తనయుడు సీబీ రాజ్ తండ్రిబాటలో వెండి తెర మీద రాణిస్తున్న విషయం తెలిసిందే. ఆయన కుమార్తె దివ్య సత్యరాజ్ పోషకాహార నిపుణులుగా ఉన్నారు. గతకొంత కాలంగా రాజకీయాల్లో రావాలని ప్రయత్నాలు చేస్తూ వచ్చిన ఆయన కుమార్తె దివ్య గత నెలలో డీఎంకేలో చేరారు. సీఎం స్టాలిన్ సమక్షంలో డీఎంకే సభ్యత్వం పుచ్చుకున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం డీఎంకేలో పలు జిల్లాలకు కార్యదర్శులు, ఇన్‌చార్జ్‌లు, అనుబంధ విభాగాలకు కొత్త వారి నియామకం వేగం పుంజుకుంది. ఆ దిశగా ఆదివారం ఐటీ విభాగంలో పదవులను భర్తీ చేశారు. ఇందులో దివ్యకు ఐటీ విభాగం డిప్యూటీ కార్యదర్శి పదవి అప్పగించారు. అలాగే డీఎంకే అనుబంధ మైనారిటీ విభాగం, వర్తక తదితర విభాగాలతో పాటూ మరికొన్ని విభాగాల పదవులను భర్తీ చేస్తూ దురై మురుగన్ ప్రకటించారు. అలాగే పార్టీ ఉన్నత స్థాయి కమిటీ సభ్యుడిగా ముబారక్‌ను నియమించారు. -
రాజ్యసభకు కమల్ హాసన్?
చెన్నై, సాక్షి: సీనియర్ నటుడు కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లనున్నారనే చర్చ తమిళనాట జోరుగా నడుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమికి మద్ధతు ప్రకటించిన ఆయన.. డీఎంకే అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో మొత్తం 39 సీట్లను కూటమి కైవసరం చేసుకుంది. దీంతో ఆయన్ను పెద్దల సభకు నామినేట్ చేయాలని డీఎంకే భావిస్తోందన్నది ఆ ప్రచార సారాంశం. ఈ ఏడాది జూన్‌లో రాజ్యసభ నుంచి ఆరు సీట్లు ఖాళీ కానున్నాయి. అయితే ఎన్నికల్లో మద్దతు ప్రకటించిన కమల్‌ను రాజ్యసభకు పంపే యోచనలో డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి స్టాలిన్ ఉన్నారట. తాజాగా.. బుధవారం తమిళనాడు మంత్రి పీకే శేఖర్‌బాబు కమల్ హాసన్ నివాసానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. మరోవైపు కమల్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్(MNM) ప్రతినిధి మురళి అప్పాస్.. తమ పార్టీకి ఓ రాజ్యసభ సీటు దక్కబోతుందనే విషయాన్ని ధృవీకరించారు. అయితే అది ఎవరనేది పార్టీ అధ్యక్షుడు కమల్ హాసనే నిర్ణయిస్తారని తెలిపారాయన. శేఖర్‌బాబుతో కమల్ జరిపిన చర్చల సారాంశాన్ని ఆయన మీడియాకు వివరించేందుకు నిరాకరించారు.2018, ఫిబ్రవరి 21వ తేదీన కమల్ హాసన్ ఎన్ఎంఎం పార్టీని మధురైలో స్థాపించారు. అప్పటి నుంచి ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ప్రభావం చూపెట్టలేకపోయింది. 2019 సార్వత్రిక ఆయన పార్టీ పోటీ చేసినప్పటికీ. ఆశించిన ఫలితం సాధించలేకపోయింది. అయితే.. ఓటు షేర్ మాత్రం 3.72 శాతం దక్కించుకుంది. మరీ ముఖ్యంగా చెన్నై, కోయంబత్తూరు, మధురైలో భారీగా ఓట్లు పడ్డాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసినా.. ఒక్క సీటు గెలవలేకపోయింది. కోయంబత్తూరులో పోటీ చేసిన కమల్.. బీజేపీ అభ్యర్థి వనతిశ్రీనివాసన్ చేతిలో 1,728 ఓట్ల మెజారిటీలోఓటమి పాలయ్యారు. 2022 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసినా.. 140 స్థానాలకు ఒక్కటి కూడా గెలవలేకపోయింది. -
ఆకతాయిల వేధింపులు.. వీడియో వైరల్
చెన్నై: తమిళనాడుకు చెందిన ఓ ప్రాంతంలో జనవరి 26న సాయంత్రం సమయంలో ఓ యువతి తన స్నేహితులతో కలిసి కారులో తన ఇంటికి వెళుతోంది. సరిగ్గా యువతి కారు ఈస్ట్ కోస్ట్ రోడ్డు ముట్టుకాడు ఫ్లైఓవర్ మీదగా వెళుతోంది. ఆ సమయంలో ఓ ఎస్‌యూవీలో ప్రయాణిస్తున్న ఆకతాయులు యువతి కారును వెంబడించారు. యువతిని, ఆమె స్నేహితుల్ని వేధించేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన బాధితురాలు తన కారును వెనక్కి తిప్పించేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో ఆకతాయిలో మరో కారును అడ్డుగా యువతి కారుకు అడ్డుగా పెట్టారు. ఈ ఘటన జరిగే సమయంలో కారులో ప్రయాణిస్తున్న యువతి స్నేహితురాలు వీడియో తీసింది. ఆ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆకతాయిల నుంచి తప్పించుకొని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీడియోల్ని సైతం అందించింది. ఆకతాయిలు ప్రయాణిస్తున్న ఎస్యూవీ వాహనంపై అధికార డీఎంకే పార్టీ జెండా ఉండడం ఆగ్నికి ఆజ్యం పోసినట్లైంది. ఆ వీడియో క్లిప్‌లో డీఎంకే జెండా ఉన్న ఎస్యూవీ కారుకు మార్గానికి అడ్డుగా ఉండడం, ఓ వ్యక్తి యువతి వాహనం వైపు పరుగెత్తడం వంటి దృశ్యాల్ని మనం చూడొచ్చు. .Safety of women in TN has become a luxury many can’t afford . DMK flag is the icing on the cake . #ShameOnYouStalin pic.twitter.com/SYGC4aCMPp— karthik gopinath (@karthikgnath) January 29, 2025బాధితురాలు తన ఫిర్యాదులో.. తాను, తన స్నేహితులతో కలిసి కానత్తూరులోని తన ఇంటికి వెళుతుండగా రెండు కార్లు వెంబడించాయని, కార్లలో ఉన్న యువకులు తమతో వేధించేందుకు ప్రయత్నించడంతో పాటు గొడవపడ్డారని పేర్కొంది. ఇక ఘటన జరిగే సమయంలో తీసిన వీడియోపై ప్రతిపక్ష నేత పళనిస్వామి ప్రభుత్వంపై మండిపడ్డారు. డీఎంకే ప్రభుత్వ హయాంలో మహిళలు రాత్రిపూట తిరిగే హక్కును కోల్పోయారా? అని ప్రశ్నించారు. మహిళలపై నేరాలకు పాల్పడేందుకు అధికార పార్టీ జెండాకు లైసెన్స్ ఉందా? వెంటనే కేసు నమోదు చేయాలని కోరారు.మోటార్ సైకిళ్లతో సహా పెట్రోలింగ్ వాహనాల సంఖ్యను పెంచాలని, రాత్రి వేళల్లో గస్తీని పెంచాలని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు, కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆకతాయిల్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. -
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ నటుడి ముద్దుల కూతురు
సినీ నటుడు, బాహుబలితో కట్టప్పగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సత్యరాజ్(Sathyaraj ) కూతురు దివ్య సత్యరాజ్( Divya Sathyaraj) డీఎంకేలో చేరారు. డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం స్టాలిన్( M K Stalin) సమక్షంలో ఆ పార్టీ సభ్యత్వాన్ని ఆమె తీసుకున్నారు. మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ డీఎంకే అని, అందుకే తాను చేరినట్టు దివ్య పేర్కొన్నారు. సినీ నటుడు సత్యరాజ్ తనయుడు సీబీ రాజ్ తండ్రిబాటలో వెండి తెర మీద రాణిస్తున్న విషయం తెలిసిందే. ఆయన కుమార్తె దివ్య సత్యరాజ్ పోషకాహార నిపుణులుగా ఉన్నారు. దివ్య రాజకీయాల్లో రావాలని గత కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె 2019 డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ను కలిసిన సందర్భంలోనే ఆపార్టీలో చేరనున్నారన్న ప్రచారం జరిగింది. ఇది మర్యాద పూర్వక భేటీ అని ఆమె స్పష్టం చేయడంతో రాజకీయ ప్రచారానికి తెర పడింది. ఆ తదుపరి సామాజిక మాధ్యమాలలో వ్యక్తిగత పోస్టులు, పోషకాహారానికి సంబంధించిన అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వచ్చారు. ఫాస్ట్‌ఫుడ్ ప్రభావాల గురించి అవగాహన కల్పించే పనిలో పడ్డారు. (ఇదీ చదవండి: ఐదు వేలకు పైగా సినిమాల్లో నటించిన ప్రముఖ నటుడు మృతి)ఈక్రమంలో సోషల్ మీడియా పోస్టులు అనేకం వివాదాస్పదమవుతూ వచ్చాయి. ఈ పరిస్థితుల్లో డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్‌ను ఆమె కలిశారు. పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించి సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఈ సమయంలో డీఎంకే కోశాధికారి టీఆర్‌బాలు, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కేఎన్ నెహ్రూ, చైన్నె తూర్పు జిల్లా పార్టీ కార్యదర్శి శేఖర్‌బాబు ఆమెకు స్టాలిన్ ద్వారా సభ్యత్వాన్ని అందజేశారు. అనంతరం దివ్య మాట్లాడుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ను కలవడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. తాను పోషకాహార నిపుణురాలు అని పేర్కొంటూ, డీఎంకే ప్రభుత్వం అమలు చేస్తున్న పోషకాహార పథకం, అల్పాహార పథకం , మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేవిధంగా మరెన్నో పథకాలకు ఆకర్షిస్తురాలైనట్లు వివరించారు. అన్ని మతాలను గౌరవించే పార్టీ డీఎంకే అని, అందుకే ఈ పార్టీలో చేరానని పేర్కొన్నారు. తన తండ్రి, స్నేహితులు, అందరూ ఎల్లప్పుడు నా వెన్నంటి ఉంటారని వ్యాఖ్యానిస్తూ ఏ బాధ్యతను తనకు అప్పగించినా శ్రమిస్తానని, కష్ట పడి పనిచేసి మంచి పేరు తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేశారు. -
అభివృద్ధిని గవర్నర్ జీర్ణించుకోలేకున్నారు
చెన్నై: తమిళనాడు అభివృద్ధిని గవర్నర్ ఆర్ఎన్ రవి జీర్ణించుకోలేకపోతున్నారని సీఎం ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. గవర్నర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టాక తమిళనాడు అసెంబ్లీ కొన్ని విడ్డూరమైన ఘటనలకు వేదికగా మారిందన్నారు. శనివారం సీఎం స్టాలిన్ అసెంబ్లీలో మాట్లాడారు. జాతీయ గీతం బదులు తమిళనాడు రాష్ట్ర గీతాన్ని వినిపించినందుకు నిరసనగా గత వారం అసెంబ్లీలో ప్రసంగించకుండా గవర్నర్ వాకౌట్ చేయడాన్ని చిన్న పిల్లల చేష్టగా అభివర్ణించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 176 ప్రకారం అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగించాల్సి ఉంటుందన్నారు. అయితే, ఆయన ఉద్దేశపూర్వకంగానే నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించారు.2022లో తామిచి్చన ప్రసంగాన్ని గవర్నర్ రవి యథాతథంగా చదివారని, మూడేళ్ల నుంచి సంబంధం లేని సాకులు చూపుతూ తప్పించుకుంటున్నారని విమర్శించారు. అసెంబ్లీని, ప్రజల మనోభావాలను గౌరవించకుండా గవర్నర్ రాజకీయ ఉద్దేశాలతో వ్యవహరిస్తున్నారన్నారు. విధులను నిర్వర్తించని, తమిళ గీతాన్ని గౌరవించని గవర్నర్ తీరుపై సభ నిరసిస్తుందని తెలిపారు. సభలో ఇటువంటివి పునరావృతం కారాదని స్టాలిన్ పేర్కొన్నారు. -
అవును.. నిందితుడు మా పార్టీ మద్దతుదారుడే: సీఎం స్టాలిన్
చెన్నై: అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి ఘటన తమిళనాట రాజకీయ దుమారం రేపుతోంది. అసెంబ్లీని సైతం దద్దరిల్లిపోయేలా చేసిన ఈ ఘటనపై బుధవారం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. నిందితుడు తమ పార్టీ మద్దతుదారుడేనని ప్రకటించారాయన. అయితే..అసెంబ్లీ సమావేశాల్లో మూడో రోజు సీఎం స్టాలిన్(CM Stalin) మాట్లాడుతూ.. ‘‘అన్నా వర్సిటీ ఘటనలో నిందితుడు కేవలం డీఎంకే మద్దతుదారుడేనని, ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నట్లు పార్టీ సభ్యుడు ఎంతమాత్రం కాదు’’ స్పష్టత ఇచ్చారు. అంతేకాదు.. మహిళల భద్రతే ప్రాధాన్యంగా పని చేస్తున్న తమ ప్రభుత్వం.. నిందితుడికి రక్షణ కల్పించలేదని, భవిష్యత్తులోనూ కల్పించబోదని, పైగా అతనిపై గుండా యాక్ట్ ప్రయోగించామని ప్రకటించారు. అన్నా వర్సిటీ ఘటన.. ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరును సీఎం స్టాలిన్ తీవ్రంగా తప్పుబట్టారు.‘‘విద్యార్థినిపై లైంగిక దాడి(Sexual Assault) క్రూరమైన ఘటన. అయితే.. చట్ట సభ్యులు ఇవాళ ఈ అంశం మీద ఇక్కడ మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని విమర్శించడమే అంతా పనిగా పెట్టుకున్నారు. బాధితురాలి తరఫు నిలబడి సత్వర న్యాయం చేకూర్చాలనే మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సాధారణంగా.. ఘటన జరిగాక నిందితుడు తప్పించుకుంటేనో.. అరెస్ట్‌లో జాప్యం జరిగితేనో.. లేకుంటే నిందితుడ్ని రక్షించే ప్రయత్నాలు జరిగితేనో విమర్శలు వినిపిస్తాయి. కానీ, ఇక్కడ వీలైనంత త్వరగా అరెస్ట్ చేసినా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇది రాజకీయ ప్రయోజనాల కోసం చేసే రాద్ధాంతం కాకపోతే ఇంకేంటి?’’ అని ప్రశ్నించారాయన. అన్నా వర్సిటీ(Anna University) ఘటనకు నిరసనగా ప్రతిపక్ష అన్నాడీఎంకే సభ్యులు నల్లదుస్తులతో అసెంబ్లీకి వచ్చారు. వాళ్లను ఉద్దేశిస్తూ సీఎం స్టాలిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.గతంలో ఇదే ప్రతిపక్ష అన్నాడీఎంకే అధికారంలో ఉండగా.. పొల్లాచ్చి లైంగిక దాడి కేసు సంచలనం సృష్టించింది. ఆ టైంలో ప్రభుత్వం ఏం చేసింది?.. ఆలస్యంగా స్పందించడంతో నిందితుడు పారిపోలేదా? అని ప్రశ్నించారాయన. ప్రతిపక్షాలంతా నిందితుడు ఎవరు? మీ పార్టీ వాడు కాదా అని ప్రశ్నిస్తున్నాయి. అవును.. అతను మా పార్టీ మద్దతుదారుడే. కానీ, సభ్యుడు మాత్రం కాదు. ఈ విషయాన్ని మేం ముందు నుంచే చెబుతున్నాం. అరెస్ట్ విషయంలోనూ ఎక్కడా రాజకీయ జోక్యం జరగలేదు. ఒకవేళ.. అలా జరిగిందని ఆధారాలు ఉంటే సిట్‌కు సమర్పించండి. దర్యాప్తు అయ్యేదాకా ఎదురుచూడడండి. అంతేగానీ స్వప్రయోజనాల కోసం చిల్లర రాజకీయాలు చేయొద్దు అని ప్రతిపకక్షాలను ఉద్దేశించి హితవు పలికారాయన. ఈ తరుణంలో అసెంబ్లీ నుంచి అన్నాడీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. ఇదిలా ఉంటే.. అన్నా వర్సిటీ ఉందంతంపై దాఖలైన ఓ పిటిషన్ విషయంలోనూ మదద్రాస్ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘‘అసలు మహిళల భద్రతపై ఎవరికీ అసలు చిత్తశుద్ధి లేదు. అన్నా యూనివర్సిటీ లైంగిక దాడి కేసును అంతా రాజకీయం చేస్తున్నారు. కేవలం వాళ్ల అవసరం వాడుకుంటున్నారు’’ అని వ్యాఖ్యానించింది. డిసెంబర్ 23వ తేదీన రాత్రి 8గం. ప్రాంతంలో క్యాంపస్‌లో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని(19) తన స్నేహితుడితో మాట్లాడుతుండగా.. దాడి చేసి ఆమెను బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఆందోళనకు దిగాయి. అదే సమయంలో.. క్యాంపస్‌కు దగ్గర్లో బిర్యానీ సెంటర్ నడిపే జ్ఞానేశ్వర్‌ను నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతను డీఎంకే సభ్యుడంటూ ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. మరోవైపు.. ఈ కేసులో ఇంకొంతమంది నిందితులు ఉన్నారని.. వాళ్లను రక్షించే ప్రయత్నం జరుగుతోందంటూ డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి ప్రతిపక్షాలు.ఇదీ చదవండి: బీజేపీ నేత నోటి దురుసు! ఫలితంగా.. -
సింధు లోయ లిపిని పరిష్కరిస్తే 10 లక్షల డాలర్ల నజరానా
చెన్నై: శతాబ్ద కాలానికి పైగా అపరిష్కృతంగా మిగిలి పోయిన సింధు నదీ లోయ నాగరికత కాలం నాటి లిపిని పరిష్కరించిన వారికి 10 లక్షల డాలర్ల బహుమానం అందజేస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రకటించారు. సింధూ నాగరికతను వెలుగులో వచ్చి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటైన మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును ఆదివారం ఆయన చెన్నైలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్..ఒకప్పుడు విలసిల్లిన సింధు లోయ నాగరికతకు చెందిన లిపిని ఇప్పటి వరకు స్పష్టంగా ఎవరూ అర్థం చేసుకో లేకపోయారని పేర్కొన్నారు. లిపిని పరిష్కరించేందుకు ఇప్పటికీ పండితులు ప్రయత్ని స్తూనే ఉన్నారన్నారు. ఈ దిశగా కృషి చేసి, విజయం సాధించిన వ్యక్తులు, సంస్థలకు ప్రోత్సా హంగా 10 లక్షల డాలర్ల బహుమానం అందజేస్తామని ప్రకటించారు. -
కొరడాతో కొట్టుకున్న తమిళనాడు బీజేపీ చీఫ్
కోయంబత్తూర్/చెన్నై: తమిళనాడు బీజేపీ చీఫ్ కె.అన్నామలై వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. చెన్నైలోని ఓ కాలేజీ విద్యార్థినిపై లైంగిక దాడి కేసు విషయంలో డీఎంకే ప్రభుత్వం, రాష్ట్ర పోలీసుల వైఖరిని ఖండిస్తూ అన్నామలై కొరడాతో తనను తాను కొట్టుకున్నారు. శుక్రవారం కోయంబత్తూర్‌లోని తన నివాసం వెలుపల అన్నామలై పచ్చని ధోతీ ధరించి, చొక్కా లేకుండానే కొరడాతో పదే పదే కొట్టుకున్నారు. ఆయన చుట్టూ గుమికూడిన బీజేపీ కార్యకర్తలు లైంగిక దాడి బాధితురాలి ఎఫ్ఐఆర్ను పోలీసులు లీక్ చేయడాన్ని నిరసిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇదే అంశంపై గురువారం అన్నామలై మీడియా సమావేశంలో పాదరక్షలను వదిలేశారు. తమిళనాడులో క్షీణిస్తున్న శాంతి భద్రతలకు డీఎంకే ప్రభుత్వమే కారణమని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా కాళ్లకు చెప్పులు వేసుకోనని ప్రతిజ్ఞ చేశారు. ఎన్నికల్లో డబ్బు పంచబోమని కూడా చెప్పారు. డీఎంకే ప్రభుత్వం పాల్పడిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా 48 రోజులపాటు ఉపవాసంతో ఉండి రాష్ట్రంలోని ఆరు ప్రముఖ మురుగన్ ఆలయాలను దర్శించుకుంటానని తెలిపారు. ఉత్తరం–దక్షిణ రాజకీయాలు బూచిగా చూపుతూ వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు డీఎంకే సర్కార్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. డీఎంకే రాజకీయాలు చూసి రోత పుడుతోందని అన్నామలై చెప్పారు. అన్నామలై వర్సిటీలో 19 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన గుణశేఖరన్ పాతనేరస్తుడు. అతడు డీఎంకే వ్యక్తి కాబట్టే, పోలీసులు ఇప్పటిదాకా క్రిమినల్ కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. పోలీసులు ఎఫ్ఐఆర్ను లీక్ చేయడం బాధితురాలిని అవమానించడం, ఆమె వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనన్నారు. అయితే, అన్నామలై చర్య నవ్వు తెప్పించేలా ఉందని డీఎంకే వ్యాఖ్యానించింది. TN-BJP president @annamalai_k ji whips himself as a mark of protest against the DMK govt for their 'apathy' in handling the case of the sexual assault of an Anna University student.He has vowed to walk barefoot until the DMK govt falls.Truly a fighter...👏🏻 pic.twitter.com/FD3FGgWKIu— Mr Sinha (@MrSinha_) December 27, 2024 -
బీజేపీ, ఈసీపై సీఎం స్టాలిన్ సంచలన ఆరోపణ!
చెన్నై: కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం కారణంగా ప్రజాస్వామ్యం తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటోందన్నారు. అలాగే, రాజ్యాంగం ప్రాథమిక లక్షణాలను కేంద్రం నాశనం చేస్తోందని కామెంట్స్ చేశారు.తమిళనాడు సీఎం స్టాలిన్ ట్విట్టర్ వేదికగా కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఈ సందర్బంగా స్టాలిన్.. కేంద్రం ఎన్నికల నియమావళికి నిర్లక్ష్యపూరిత సవరణ చేసింది. ఎన్నికల పారదర్శకతను దెబ్బతీసే నిర్ణయాలు తీసుకుంటోంది. కేంద్రం నిర్ణయాలతో ప్రజాస్వామ్యం తీవ్ర ముప్పును ఎదుర్కొంటోంది. ఎన్నికల నియమావళిలోని సెక్షన్ 93(2)(ఎ) సవరణతో ఎన్నికల్లో ఆందోళన కలుగుతోందన్నారు.అలాగే, ఎన్నికల బూత్‌లోని సీసీటీవీ ఫుటేజీని సమకూర్చాలని పంజాబ్, హర్యానా హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం సీసీటీవీ ఫుటేజీతో సహా ఎన్నికల పత్రాలను బహిరంగంగా తనిఖీ చేయకుండా ఈ సవరణను తీసుకొచ్చింది. రాజ్యాంగం ప్రాథమిక లక్షణాలలో ఒక దానిని బీజేపీ నాశనం చేసింది. ఇటీవల హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఆందోళన నెలకొంది. భారత ఎన్నికల సంఘం మోదీ ప్రభుత్వ ఒత్తిడికి లొంగిపోయింది. ఎన్నికల సంఘం తీరు దిగ్భ్రాంతికరం’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.Democracy is facing its gravest threat under the BJP-led Union Government with the reckless amendment of Section 93(2)(a) of the Conduct of Election Rules, to kill the transparency in election.Consequent on the direction of the Punjab and Haryana High Court to furnish the CCTV… https://t.co/vkAaY2ynr3— M.K.Stalin (@mkstalin) December 23, 2024 -
గుకేశ్‌కు భారీ నజరానా
పిన్న వయస్సులోనే చదరంగ రారాజుగా అవతరించిన దొమ్మరాజు గుకేశ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. పద్దెనిమిదేళ్ల వయసులో ఈ కుర్రాడు సాధించిన విజయం పట్ల యావత్ భారతావని పులకరించిపోతోంది. ‘‘సరిలేరు నీకెవ్వరు’’ అంటూ ఈ ప్రపంచ చాంపియన్‌కు క్రీడాలోకం నీరాజనాలు పలుకుతోంది.ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం గుకేశ్‌కు భారీ నజరానా ప్రకటించింది. చెన్నైకి చెందిన ఈ చెస్ ప్లేయర్‌కు ఏకంగా రూ. 5 కోట్ల రివార్డు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.రూ. 5 కోట్ల నజరానా‘‘చిన్న వయసులోనే ప్రపంచ చెస్ చాంపియన్‌గా దొమ్మరాజు గుకేశ్ అవతరించిన ఈ చారిత్రక సందర్భంలో రూ. 5 కోట్ల నజరానా అందిస్తున్నట్లు ప్రకటించడం సంతోషంగా ఉంది.గుకేశ్ చారిత్రాత్మక విజయం దేశం మొత్తాన్ని గర్వపడేలా చేసింది. అతడు భవిష్యత్తులోనూ ఇలాంటి గొప్ప విజయాలెన్నో మరిన్ని సాధించాలని కోరుకుంటున్నా. ఇలాంటి యువ తారలను తీర్చిదిద్దడంలో శక్తి వంచన లేకుండా తమ మద్దతు అందిస్తున్న తమిళనాడు క్రీడా శాఖ, ఉదయనిధి స్టాలిన్‌కు అభినందనలు’’ అని స్టాలిన్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.డిఫెండింగ్ చాంపియన్‌ను ఓడించి.. రూ. 11 కోట్ల ప్రైజ్మనీసింగపూర్ సిటీ వేదికగా జరిగిన క్లాసికల్ ఫార్మాట్లో డిఫెండింగ్ చాంపియన్, చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్‌ను ఓడించి గుకేశ్ వరల్డ్ చాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. లిరెన్‌తో జరిగిన 14 గేమ్‌ల పోరులో గుకేశ్ 7.5–6.5 పాయింట్ల తేడాతో గెలుపొందాడు. 58 ఎత్తుల్లో 32 ఏళ్ల లిరెన్ ఆటకు చెక్ పెట్టి అత్యుత్తమ ప్రదర్శనతో చదరంగ రారాజుగా అవతరించాడు. తద్వారా విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఇక వరల్డ్ చాంపియన్‌గా ట్రోఫీతో పాటు గుకేశ్‌కు 13 లక్షల 50 వేల డాలర్లు (రూ.11.45 కోట్ల ప్రైజ్‌మనీ) లభించింది. అంతేకాకుండా మూడు గేమ్‌లు గెలిచినందుకు అదనంగా రూ.5.07 కోట్లు గుకేశ్‌కు అందాయి.చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ.. వెస్టిండీస్ బ్యాటర్ ప్రపంచ రికార్డు -
ఫెంగల్ తుఫాన్ బీభత్సం.. సీఎం స్టాలిన్‌కు ప్రధాని ఫోన్
చెన్నై: ఫెంగల్ తుఫాన్ తమిళనాడులో అపార నష్టాన్ని మిగిల్చింది. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి, తమిళనాడులోని విల్లుపురం, సేలం, కడలూరు, కళ్లకురిచ్చి, తిరువణ్ణామలై జిల్లాలో పెను విలయాన్ని మిగిల్చింది. కుండపోతగా వర్షంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఈ వరదలకు ఊర్లకు ఊర్లో మునిగిపోయాయి.తాజాగా వరదలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు ప్రధానమత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఫోన్ చేసి మాట్లాడారు. రాష్ట్రంలోని వర్షాలు, వరద పరిస్థితిపై ప్రధాని ఆరా తీశారు.కేంద్రం నుంచి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు.ఇక ఉత్తర తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో భారీ వర్షాల కారణంగా వరదలు పోతెత్తాయి. వంతెనలు, రోడ్లు నీట మునిగాయి. భారీ విస్తీర్ణంలో పంట పొలాలు ధ్వంసమయ్యాయి. అనేక గ్రామాలు నీట మునిగి ఉన్నాయి. సాయం కోసం గ్రామీణ జనం ఎదురుచూస్తున్నారు. మరోవైపు సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌తోపాటుగా మంతరులు బాధిత ప్రాంతాలలో పర్యటిస్తున్నారు.తిరువణ్ణామలై మహా దీపం కొండపై నుంచి మట్టి చరియలు, బండరాళ్లు కొట్టుకు వచ్చి ఆదివారం రాత్రి ఇళ్లపై పడిన విషయం తెలిసిందే. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఈ శిథిలాల కింద చిక్కుకున్నారు. వీరిని ప్రాణాలతో రక్షించేందుకు ప్రయత్నిచినా.. ఫలితం లేదు. సోమవారం రాత్రి మృతదేహాలుగా వారంతా బయట పడ్డారు.మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ పుదుచ్చేరి వద్ద బలహీనపడి వాయుగుండంగా మారిందని వాతావరణశాఖ ప్రకటించింది. మంగళవారం అరేబియన్ సముద్రంలో ప్రవేశించే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. -
అధిక జనాభా వరమా!
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఇష్టమున్నా లేకున్నా జనాభా అంశంపై చర్చ ఊపందుకుంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ మరో ఏణ్ణర్థంలో ప్రారంభం కావాల్సిన నేపథ్యంలో ఈ చర్చ ఎంతో అవసరమైనదీ, తప్పనిసరైనదీ. అయితే ఇందులో ఇమిడివున్న, దీనితో ముడిపడివున్న అనేకానేక ఇతర విషయాలను కూడా స్పృశిస్తే ఈ చర్చ అర్థవంతంగా ఉంటుంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సామూహిక వివాహాల సందర్భంగా సోమవారం కొత్త దంపతుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ‘2026లో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన పుణ్యమా అని చిన్న కుటుంబానికి బదులు ఎక్కువమంది సంతానాన్ని కనాలని ఆశీర్వదించే రోజులొచ్చేశాయి’ అని వ్యాఖ్యానించటం గమనించదగ్గది. తెలుగునాట అష్టయిశ్వర్యాలు లభించాలని దంపతులను ఆశీర్వదించినట్టే తమిళగడ్డపై కొత్త దంపతులకు 16 రకాల సంపదలు చేకూరాలని ఆకాంక్షించటం సంప్రదాయం. ఆ ఆకాంక్షను పొడిగించి ఎక్కువమంది పిల్లల్ని కనాలని ఆశీర్వదించాల్సి వస్తుందన్నది ఆయన చమత్కారం. ఆ మాటల వెనక ఆంతర్యం చిన్నదేమీ కాదు. పునర్విభజన ప్రక్రియ పూర్తయ్యాక లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న 543 స్థానాలూ అమాంతం 753కు చేరుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. అంటే ఒక్కసారిగా 210 స్థానాలు పెరుగుతాయన్న మాట! ఆ నిష్పత్తిలో శాసన సభల్లో సైతం సీట్ల పెరుగుదల ఉంటుంది. జనాభా పెరుగుదల రేటులో తీవ్ర వ్యత్యాసాలు కనబడుతున్న నేపథ్యంలో అధిక జనాభాగల ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ లోక్‌సభ స్థానాలూ... ఆ పెరుగుదల అంతగా లేని దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ సంఖ్యలో స్థానాలూ వస్తాయన్నది ఒక అంచనా. మరో మాటలో చెప్పాలంటే జనాభా నియంత్రణపైనా, విద్యపైనా, ఆర్థికాభివృద్ధిపైనా పెద్దగా దృష్టి పెట్టని రాష్ట్రాలు లాభపడబోతున్నాయన్నమాట!దేశంలో చివరిసారిగా 1976లో పునర్విభజన జరిగింది. ఈ ప్రక్రియ క్రమం తప్పకుండా చేస్తే సమస్యలకు దారి తీయొచ్చన్న కారణంతో 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి పునర్విభజన ప్రక్రియను 2000 వరకూ స్తంభింపజేశారు. అయితే 2001లో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా నియోజకవర్గాల పరిధిలోని ప్రాంతాల హేతుబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించారు. దాని ప్రకారం లోక్‌సభ స్థానాల సంఖ్య, వాటి పరిధి 2026 తర్వాత జరిగే జనగణన వరకూ మారదు. అయితే ఆ పరిధిలోని అసెంబ్లీ స్థానాలను హేతుబద్ధీకరించవచ్చు. దాని పర్యవసానంగా ఉమ్మడి ఏపీ అసెంబ్లీలోని 294 స్థానాల సంఖ్య మారకపోయినా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో జిల్లాలవారీగా సీట్ల సంఖ్య మారింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాగే జరిగింది.ప్రతి రాష్ట్రానికీ దాని జనాభా నిష్పత్తికి అనుగుణంగా లోక్‌సభలో ప్రాతినిధ్యం కల్పించాలని మన రాజ్యాంగం నిర్దేశిస్తోంది. దేశంలో ప్రతి ఒక్కరి ఓటు విలువా ఒకేవిధంగా ఉండాలన్నది దీని ఆంతర్యం. 2021లో జరగాల్సిన జనగణన కరోనా కారణంగా వాయిదా వేయక తప్పలేదని కేంద్రం ప్రకటించింది. కనుక వాస్తవ జనాభా ఎంతన్నది తెలియకపోయినా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలోని సాంకేతిక బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ సంఖ్యను 142 కోట్లుగా లెక్కేస్తున్నారు. రాష్ట్రాలవారీగా జనాభా ఎంతన్న అంచనాలు కూడా వచ్చాయి. దాన్నే పరిగణనలోకి తీసుకుంటే ఉత్తరప్రదేశ్ నుంచి ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాలు 80 కాస్తా 128కి చేరుతాయి. బిహార్‌కు ఇప్పుడు 40 స్థానాలున్నాయి. అవి 70కి ఎగబాకుతాయి. అలాగే మధ్యప్రదేశ్‌కు ఇప్పుడున్న 29 నుంచి 47కూ, రాజస్థాన్‌కు ప్రస్తుతం ఉన్న 25 కాస్తా 44కు పెరుగుతాయని అంచనా. మహారాష్ట్రకు ప్రస్తుతం 48 ఉండగా అవి 68కి వెళ్లే అవకాశం ఉందంటున్నారు. కానీ అదే సమయంలో జనాభా నియంత్రణలో విజయం సాధించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పెరిగే సీట్ల సంఖ్య స్వల్పంగా ఉంటుంది. దేశ జనాభా వేగంగా పెరుగుతున్నదనీ, ఇదే కొనసాగితే భవిష్యత్తులో అందరికీ చాలినంత ఆహారం లభ్యం కావటం అసాధ్యమన్న అభిప్రాయం ఒకప్పుడుండేది. ఎమర్జెన్సీ రోజుల్లో బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించిన ఉదంతాలకు లెక్కేలేదు. మొత్తంగా జనాభా పెరుగుతూనే ఉన్నా, ప్రపంచంలో అత్యధిక జనాభాగల దేశం మనదే అయినా గడిచిన దశాబ్దాల్లో పెరుగుదల రేటు తగ్గింది. ఈ తగ్గుదల సమంగా లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో అధికంగా, ఉత్తరాది రాష్ట్రాల్లో స్వల్పంగా నమోదవుతోంది. ఉదాహరణకు 1951లో తమిళనాడు జనాభా బిహార్ కంటే స్వల్పంగా అధికం. 6 దశాబ్దాల తర్వాత బిహార్ జనాభా తమిళనాడుకన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువ!దక్షిణాదిన జనాభా పెరుగుదల పెద్దగా లేకపోవటానికి ఆర్థికాభివృద్ధి, స్త్రీలు బాగా చదువు కోవటం, దారిద్య్రం తగ్గటం ప్రధాన కార ణాలు. దేశ జనాభాలో 18 శాతంగల దక్షిణాది రాష్ట్రాలు దేశ జీడీపీకి 35 శాతం వాటా అందిస్తున్నాయి. కుటుంబాల్లో స్త్రీల నిర్ణయాత్మక పాత్ర ఉత్తరాదితో పోలిస్తే పెరిగింది. కీలకాంశాల్లో ఉత్తరాది రాష్ట్రాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఈ వైఫల్యం వరం కావటం న్యాయమేనా? స్టాలిన్ మాటల ఆంతర్యం అదే. మరికొందరు నేతలు జనాభా పెంచమంటూ ముసిముసి నవ్వులతో సభల్లో చెబుతున్నారు. ఇది నవ్వులాట వ్యవహారం కాదు. పునరుత్పాదక హక్కు పూర్తిగా మహిళలకే ఉండటం, అంతిమ నిర్ణయం వారిదే కావటం కీలకం. అసలు పునర్విభజనకు జనాభా మాత్రమే కాక, ఇతరేతర అభివృద్ధి సూచీలనూ, దేశ ఆర్థికాభివృద్ధిలో రాష్ట్రాల పాత్రనూ పరిగణనలోకి తీసుకోవటం అవసరం. ఈ విషయంలో విఫలమైతే దక్షిణాది రాష్ట్రాల్లో అసంతృప్తి పెరగటం ఖాయమని కేంద్రం గుర్తించాలి. -
నూతన దంపతులు 16 మందిని కనాలి
చెన్నై: నూతన దంప తులు ఎక్కువ మంది పిల్లల్నికనే విష యం ఆలోచించాల ని తమిళనాడు ము ఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొ న్నారు. ‘తమిళ సంప్రదాయంలో పెద్దలు నూతన దంపతులను 16 సంపదలతో వర్ధిల్లాలని ఆశీర్వదిస్తుంటారు. కానీ, నేడు పరిస్థితి మారిపోయింది. 2026 నుంచి చేపట్టనున్న జన గణన, లోక్‌సభ నియోజ కవర్గాల పునర్విభజనతో పుణ్యమాని చిన్న కుటుంబానికి బదులు, 16 మంది సంతానంతో కళకళలాడాలని ఆశీర్వదించాల్సిన రోజులొచ్చాయి’అని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం చెన్నైలో జరిగిన సామూహిక వివాహ వేదిక కార్యక్రమంలో సీఎం స్టాలిన్ మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజన కారణంగా దేశంలో ఎన్నికల ముఖ చిత్రమే పూర్తిగా మారిపోనుందని అన్నారు. ‘లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నందున, మాకు 16 మంది పిల్లలుండాలా అని ఆశ్చర్యపోయే పరిస్థితి ఏర్పడొచ్చు. అయితే, ఈ విషయం మనం మర్చిపోకూడదు’ అని ఆయన అన్నారు. -
తమిళనాడు గవర్నర్ Vs స్టాలిన్.. ‘ద్రవిడ’ పదంపై చర్చ
చెన్నై: తమిళనాడులో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. తమిళనాడు గవర్నర్‌పై సీఎం స్టాలిన్ సంచలన విమర్శలు చేశారు. గవర్నర్ ఆర్ఎన్ రవిని వెంటనే రీకాల్ చేయాలని కేంద్రాన్ని సీఎం స్టాలిన్ డిమాండ్ చేశారు.ఇటీవల చెన్నై దూరదర్శన్ స్వర్ణోత్సవ వేడుకలో గవర్నర్ ఆర్ఎన్ రవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలపించిన తమిళ రాష్ట్ర గీతంలో గవర్నర్ ఉద్దేశపూర్వకంగా ‘ద్రవిడ’ అనే పదాన్ని పలకకుండా దాటవేశారని స్టాలిన్ ఆరోపించారు. ఇదే సమయంలో ద్రవిడియన్ అలర్జీతో గవర్నర్ బాధపడుతున్నారా?. అందుకే ఆయన తమిళ గేయం నుంచి ద్రవిడ అన్న పదాన్ని తొలగించారా? అని ప్రశ్నించారు. జాతీయ గీతంలోనూ ద్రవిడ అనే పదాన్ని దాటవేసే దమ్ము గవర్నర్‌కు ఉందా అని సవాల్ చేశారు. ఉద్దేశపూర్వకంగా తమిళుల మనోభావాలను దెబ్బతీసిన గవర్నర్‌ను కేంద్రం వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి స్టాలిన్ ఆరోపణలపై తాజాగా గవర్నర్ కార్యాలయం స్పందించింది. గవర్నర్ కేవలం ఆ కార్యక్రమానికి హాజరయ్యారని, గీతాన్ని ఆలపించిన ట్రూప్ ద్రవిడ పదాన్ని దాటవేసిందని వివరణ ఇచ్చింది. దీనిపై దూరదర్శన్ తమిళ్ క్షమాపణలు చెబుతూ గాయకుల పరధ్యానం కారణంగానే అది జరిగిందని పేర్కొంది. తమ కారణంగా గవర్నర్‌కు జరిగిన ఇబ్బంది పట్ల క్షమాపణలు కోరింది.ఈ నేపథ్యంలో రాజ్‌భవన్ స్పందనపై ముఖ్యమంత్రి స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తమిళ రాష్ట్ర గీతం వివాదం జరుగుతుంటే గవర్నర్ ఎందుకు స్పందించలేదు?. రాజ్‌భవన్‌ను రాజకీయాల కోసం ఉపయోగించడం సరికాదు. తమిళ భాషను కేంద్రం పట్టించుకోవడం లేదు. తమిళ భాష కోసం ఎంతవరకైనా పోరాడుతాం. నిర్బంధ హిందీ భాషను తీసుకువస్తే ఊరుకోం’ అంటూ హెచ్చరించారు. -
ఎయిర్ షో విషాదం.. స్పందించిన సీఎం స్టాలిన్
చెన్నై: చెన్నై మెరీనా బీచ్ ఎయిర్ షో ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు, ఆదివారం మెరీనా బీచ్‌లో వైమానిక ప్రదర్శన కోసం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కోరిన దానికి మించిని సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని సీఎం పేర్కొన్నారు. ఎయిర్ షో కారణంగా మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు.ఈ సందర్భంగా ప్రమాదంపై స్టాలిన్ మాట్లాడుతూ.. ఎయిర్ షో కోసం రాష్ట్ర అధికారులు అవసరమైన సహకారం, సౌకర్యాలను అందించారని తెలిపారు. భారత వైమానిక దళం కోరిన దాని కంటే మించిన ఏర్పాట్లను అధికారులు చేశారని చెప్పారు. ఊహించినదానికంటే ఎయిర్‌షోకు ఎక్కువ ప్రజలు వచ్చారని తెలిపారు. ప్రజలు తిరిగి వెళ్లేటప్పుడు తమ వాహనాలను చేరుకోవడానికి, ప్రజా రవాణాను చేరుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఈ అంశాలపై మరింత శ్రద్ధ చూపుతామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినప్పుడు తగిన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.కాగా చెన్నైలోని మెరీనా బీచ్‌లో ఆదివారం నిర్వహించిన ఎయిర్ షో చూసేందుకు లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో వేడి తట్టుకోలేక, ఊపిరి అందక, లోకల్ స్టేషన్ వద్ద తొక్కిసలాట వంటి కారణాల వల్ల ఐదుగురు మరణించగా వందలాది మంది అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. -
ప్రముఖ గాయని పి.సుశీలను అవార్డ్‌తో సత్కరించిన తమిళనాడు
తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించే ‘కలైజ్ఞర్ నినైవు కలైతురై విత్తగర్’ పురస్కారాలను ప్రకటించింది. 2023 సంవత్సరానికి గాను ఈ అవార్డుకు గాన కోకిల పి.సుశీల, ప్రొఫెసర్, రచయిత, కవి మహ్మద్ మెహతాలను అక్కడి ప్రభుత్వం ఎంపిక చేసింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి జయంతి సందర్భంగా ఏటా జూన్ 3న ‘కలైజ్ఞర్ నినైవు కలైతురై విత్తగర్’ పురస్కారాన్ని అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో తమిళ సినీ రంగంలో విశిష్ట సేవలు అందించినవారిని సత్కరించే క్రమంలో పి. సుశీల పేరును ప్రభుత్వం ఎంపిక చేసింది.ఇదీ చదవండి: ఆ క్రెడిట్ అంతా హీరోలకేనా.. హీరోయిన్లకు ఇవ్వరా: మాళవిక మోహన్‘కలైజ్ఞర్ నినైవు కలైతురై విత్తగర్’ (కరుణానిధి స్మారక కళారంగ మాంత్రికులు) పురస్కారాన్ని గాయని పి. సుశీలకు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రదానం చేశారు. చెన్నైలోని సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమెకు పురస్కారంతో పాటు రూ.10లక్షల బ్యాంకు చెక్, జ్ఞాపికను స్టాలిన్ అందజేశారు.ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో జన్మించిన పి. సుశీల తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో 25 వేలకు పైగా పాటలు పాడారు. దీంతో ఆమెను గౌరవించే విధంగా ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. క్వీన్ ఆఫ్ మెలోడి, గాన కోకిలగా కొనియాడుతున్న ఆమెను ఇలా సత్కరించినందుకు సంతోషంగా ఉందని అభిమానులు తెలుపుతున్నారు. -
డిప్యూటీ సీఎంగా ఉదయనిధి
చెన్నై: తమిళనాట వారసుడికి పట్టాభిషేకం జరిగింది. ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్‌కు ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి లభించింది. 2026 అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా 46 ఏళ్ల ఉదయనిధిని డిప్యూటీ సీఎం చేయాలని డీఎంకే శ్రేణులు చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. శనివారం స్టాలిన్ ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉదయనిధి డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు కూడా. పలు చిత్రాల్లో నటించడంతో పాటు సినిమాలు నిర్మించారు. మాజీ మంత్రి సెంథిల్ బాలాజీని కూడా స్టాలిన్ తిరిగి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మనీలాండరింగ్ కేసులో 471 రోజుల తర్వాత రెండ్రోజుల క్రితమే ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. బాలాజీతో పాటు గోవి చెజియన్, రాజేంద్రన్, నాజర్‌లను స్టాలిన్ కేబినెట్లోకి తీసుకున్నారు. టి.మనో తంగరాజ్, జింజీ ఎస్.మస్తాన్, కె.రామచంద్రన్‌లను మంత్రివర్గం నుంచి తొలగించారు. -
రూ.9000 కోట్ల పెట్టుబడి.. 5000 ఉద్యోగాలు: టాటా మోటార్స్
టాటా మోటార్స్ తమిళనాడులోని రాణిపేటలో సరికొత్త తయారీ కేంద్రానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సదుపాయంలో టాటా మోటార్స్, జేఎల్ఆర్ రెండింటికీ వాహనాలను తయారు చేస్తుంది. ఇక్కడ తయారయ్యే వాహనాలను దేశీయ మార్కెట్లో విక్రయించడమే కాకుండా.. విదేశాలకు ఎగుమతి చేయనున్నట్లు సమాచారం. శంకుస్థాపన కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, టాటాకు చెందిన సీనియర్ ప్రతినిధులతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.2024 మార్చిలో టాటా మోటార్స్ తమిళనాడు ప్రభుత్వంతో ఒక అవగాహనా ఒప్పందం (MOU)పై సంతకం చేసింది. కంపెనీ నిర్మించనున్న కొత్త ప్లాంట్‌లో ఐదు సంవత్సరాల వ్యవధిలో మొత్తం రూ.9,000 కోట్లను పెట్టుబడి పెట్టనుంది. నిర్మాణం పూర్తయిన తరువాత రాష్ట్రంలో సుమారు 5000 ఉద్యోగాలు లభించనున్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: అక్టోబర్‌లో బ్యాంకులు పనిచేసేది సగం రోజులే!.. ఎందుకంటే?ఈ సందర్భంగా టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్, లగ్జరీ వాహనాలతో సహా మా తర్వాతి తరం కార్లు, ఎస్‌యూవీలకు త్వరలో పూర్తికానున్న ప్లాంట్ నిలయంగా మారుతుంది. తమిళనాడు ప్రగతిశీల విధానాలతో ప్రముఖ పారిశ్రామిక రాష్ట్రంగా ఉంది. అనేక టాటా గ్రూప్ కంపెనీలు ఇక్కడ నుండి విజయవంతంగా పనిచేస్తున్నాయన్నారు. మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తూ.. వివిధ స్థాయిల్లో మహిళా ఉద్యోగులను నియమించుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లను కూడా చేయనున్నట్లు పేర్కొన్నారు.I can proudly say that Tamil Nadu leads India in both automobile production and #EV manufacturing.With a 35% share of the nation’s total automobile output and 40% of all EVs sold, we are pivotal in shaping India’s mobility future.@TataMotors, along with industry giants like… pic.twitter.com/pdZ47rcel8— M.K.Stalin (@mkstalin) September 28, 2024 -
షట్లర్ తులసిమతికి రూ. 2 కోట్ల నజరానా
పారిస్ పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన తమిళనాడు అథ్లెట్లకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ భారీ నజరానాలు అందించారు. ఇటీవల జరిగిన పారాలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్‌లో రజత పతకం గెలిచిన తులసిమతి మురుగేశన్కు (ఎస్‌యూ5) బుధవారం ముఖ్యమంత్రి రూ.2 కోట్ల చెక్ అందజేశారు. కాంస్య పతకాలు సాధించిన మనీషా రామదాస్, నిత్యశ్రీకి చెరో కోటి రూపాయాల చెక్‌లు అందించారు. పురుషుల హైజంప్‌లో కాంస్యం గెలిచిన తమిళనాడు అథ్లెట్ మరియప్పన్ తంగవేలుకు రూ. 1 కోటి చెక్ అందించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు క్రీడా శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణం గెలిచిన భారత జట్టులో సభ్యులైన తమిళనాడు గ్రాండ్‌మాస్టర్లకు మంగళవారం నగదు ప్రోత్సాహకం అందించిన స్టాలిన్... తాజాగా పారా అథ్లెట్లకు కూడా నజారానాలు అందించి తమ ప్రభుత్వం క్రీడారంగానికి అండగా ఉంటుందని మరోసారి చాటి చెప్పారు. -
డిప్యూటీ సీఎంగా పగ్గాలు.. స్పందించిన ఉదయనిధి స్టాలిన్
చెన్నై: తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ వస్తున్న ఊహాగానాలపై తాజాగా మంత్రి ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. డిప్యూటీ సీఎం పదవి కట్టబెడతారనే వార్తలు కేవలం వదంతులేనని మరోసారి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియతో మాట్లాడుతూ..ఈ నిర్ణయం పూర్తిగా ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌పై ఆధారపడి ఉంటుందని అన్నారు. ‘ఇది సీఎం వ్యక్తిగత నిర్ణయం. మీరు.(మీడియాను ఉద్ధేశిస్తూ..) నిర్ణయం తీసుకోకూడదు. మంత్రులందరూ ఆయనకు మద్దతుగా ఉన్నారు. మీరు ముఖ్యమంత్రిని అడగండి. ఇది సీఎం మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సిన నిర్ణయం’ అని ఉదయనిధి పేర్కొన్నారు.అయితే ఈ పుకార్లను ఉదయనిధి కొట్టిపారేయడం తొలిసారి కాదు. గతంలోనూ మీడియాలో వస్తున్న వార్తలు వట్టి పుకార్లేనని, ముఖ్యమంత్రి మాత్రమే దానిపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. తన వరకు యువజన విభాగం కార్యదర్శి పదవి ముఖ్యమైనదిగా పేర్కొన్నారు.చదవండి :జాబ్స్ కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్, ఇద్దరు కుమారులకు కోర్టు సమన్లుకాగా తమిళనాడు డిప్యూటీ సీఎంగా మంత్రి ఉదయనిధి స్టాలిన్ పగ్గాలు అందుకోనున్నట్లు అధికార డీఎంకేలో ఎప్పటి నుంచో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. తన తనయుడికి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టనున్నారని కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎంగా ఉదయనిధి ఖరారు అయినట్లు వార్తలు రాగా.. వాటిని ఆయన కొట్టిపారేశారు.ఇక ఉదయనిధి ప్రస్తుతం డీఎంకే కేబినెట్లో క్రీడా, యువజన సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అదేవిధంగా చెన్నై మెట్రో రైలు ఫేజ్-2 వంటి ప్రత్యేక కార్యక్రమాల అమలుకు సంబంధించిన కీలక శాఖలను కూడా నిర్వహిస్తున్నారు. -
మరికొన్ని గంటల్లో డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్!
చెన్నై: తమిళనాడు డిప్యూటీ సీఎంగా మంత్రి ఉదయనిధి స్టాలిన్ పగ్గాలు అందుకోనున్నట్లు అధికార డీఎంకేలో ఎప్పటి నుంచో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. తన తనయుడికి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టనున్నారని కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగోతంది.ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎంగా ఉదయనిధి ఖరారు అయినట్లు తెలుస్తోంది. కేవలం మరికొన్నిగంటల్లో ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. అధికారిక ప్రకటన వెలువడగానే.. ఉదయనిధి కొత్త పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై 24 గంటల్లో స్పష్టత రానుంది.చదవండి: Kolkata: వెనక్కి తగ్గని వైద్యులు.. ఆగని నిరసనలుకాగా ఉదయనిధి ప్రస్తుతం డీఎంకే కేబినెట్లో క్రీడా, యువజన సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అదేవిధంగా చెన్నై మెట్రో రైలు ఫేజ్-2 వంటి ప్రత్యేక కార్యక్రమాల అమలుకు సంబంధించిన కీలక శాఖలను కూడా నిర్వహిస్తున్నారు.మరోవైపు డిప్యూటీ వార్తలను ఉదయనిధి ఇప్పటికే కొట్టి పారేసిన విషయం తెలిసిందే. మీడియాలో వస్తున్న వార్తలు వట్టి పుకార్లేనని, ముఖ్యమంత్రి మాత్రమే దానిపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. ఇక ఈ వార్తలపై సీఎం ఎంకే స్టాలిన్ ఇటీవలే స్పందిస్తూ.. ఉదయనిధి డిప్యూటీ సీఎం అయ్యే టైమ్ ఇంకా రాలేదంటూ చెప్పుకొచ్చారు. అయితే 2026లో ఉదయనిధి స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. -
పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. గ్రాండ్‌గా రిసెప్షన్ (ఫొటోలు)
-
తమిళనాడుకు దిగ్గజ కంపెనీలు.. రూ.7618 కోట్ల పెట్టుబడులు
గత కొన్ని రోజులుగా అమెరికా పర్యటనలో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ పర్యటనలో సుమారు రూ. 7618 కోట్ల విలువైన 19 అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ) కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో 11,516 మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఆయన అన్నారు.వివిధ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం.. తమిళనాడులోని తిరుచ్చి, మధురై మొదలైన ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు ఏర్పడుతాయని.. ఫోర్డ్ కంపెనీ మళ్ళీ తన ఉత్పత్తిని రాష్ట్రంలో ప్రారంభిస్తుందని సీఎం స్టాలిన్ వెల్లడించారు.ఇదీ చదవండి: ఫోర్డ్ కంపెనీ మళ్ళీ ఇండియాకు: ఎందుకంటే? అవగాహన ఒప్పందాలు👉రూ.100 కోట్ల పెట్టుబడితో హోసూర్‌లో లేటెస్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్ తయారీ యూనిట్‌ను స్థాపించడానికి ఆర్జీబీఎస్ఐతో ఒప్పందం.👉రాక్వెల్ ఆటోమేషన్ కంపెనీ కాంచీపురంలో రూ. 666 కోట్ల పెట్టుబడితో దాని తయారీని విస్తరించనుంది. దీని ద్వారా దాదాపు 365 ఉద్యోగాలు లభిస్తాయి.👉లింకన్ ఎలక్ట్రిక్, విషయ్ ప్రెసిషన్, విస్టన్‌లతో రూ.850 కోట్ల విలువైన ఎంఓయూలు👉డెవలప్మెంట్ అండ్ గ్లోబల్ సపోర్టు సెంటర్‌ను రూపొందించడానికి ట్రిలియంట్‌తో రూ. 2000 కోట్ల అవగాహనా ఒప్పందం👉తమిళనాడులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ల్యాబ్‌లను ఏర్పాటు చేసేందుకు గూగుల్‌తో ఎంఓయూ👉రూ. 200 కోట్ల ఆర్&డీ ఇంజనీరింగ్ సెంటర్ విస్తరణ కోసం బహుళజాతి పవర్ మేనేజ్మెంట్ కంపెనీ ఈటన్‌తో ఒప్పందాలు👉చెంగల్పట్టు జిల్లాలో ఎలక్ట్రోలైజర్లు అండ్ గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడానికి ఓహ్మియంతో కొత్త ఫ్యాక్టరీ స్థాపనకు ఒప్పందం 👉రూ. 900 కోట్ల పెట్టుబడి కోసం నోకియా, పేపాల్, ఈల్డ్ ఇంజినీరింగ్ సర్వీసెస్, మైక్రోచిప్, ఇన్ఫింక్స్ హెల్త్‌కేర్ అండ్ అప్లైడ్ మెటీరియల్స్ అనే ఆరు ప్రముఖ ప్రపంచ కంపెనీలతో అవగాహన ఒప్పందాలుChennai | Tamil Nadu CM MK Stalin says "I have completed my official visit to America. This was a successful visit. 19 MoUs have been signed. I got an investment of Rs 7618 for the state. 11,516 people will get new jobs. Factories will be set up in Trichy, Madurai Coimbatore,… pic.twitter.com/KhnpxNETXz— ANI (@ANI) September 14, 2024 -
తమిళనాడుకు అమెరికన్ కంపెనీ: మూడేళ్ళ తరువాత..
అమెరికన్ కార్ల తయారీ సంస్థ 'ఫోర్డ్' భారతదేశంలో చాలారోజుల క్రితమే తన కార్యకలాపాలను నిలిపివేసింది. భారతదేశ ఉత్పత్తిని ముగించిన మూడేళ్ళ తర్వాత, గ్లోబల్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ మోటార్ కంపెనీ.. చెన్నై సమీపంలోని మరైమలై నగర్లో కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది, అక్కడ నుంచి తమ ఉత్పత్తులను ఎగుమతి చేసే అవకాశం ఉంది.రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంగళవారం మిచిగాన్‌లోని ఫోర్డ్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి, ఉత్పత్తిని పునఃప్రారంభించాలని కోరుతూ దాని ఉన్నత యాజమాన్యంతో చర్చలు జరిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడిస్తూ.. ఫోటోలు కూడా షేర్ చేసారు.ఈ సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాత్రమే కాకుండా.. ఫోర్డ్ ఐఎంజీ ప్రెసిడెంట్ కె హార్ట్, వైస్ ప్రెసిడెంట్ మాథ్యూ కొట్లోవ్స్కీ, ఫోర్డ్ ఇండియా డైరెక్టర్ శ్రీపత్, ఇతర అధికారులు పాల్గొన్నారు.ఇదీ చదవండి: భారత్‌లో ఇన్వెస్ట్ చేయొద్దు!.. చైనా ఉద్దేశ్యం ఏంటి?ఫోర్డ్ ఇండియా సెప్టెంబర్ 9, 2021న తన యూనిట్లను దశలవారీగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఆ తరువాత 2022 ఆగస్టులో చెన్నైలో ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసింది. ఆ తరువాత ఫోర్డ్ భారతదేశంలోని రెండు ప్లాంట్లలో ఒకదాన్ని 2023లో టాటా మోటార్స్‌కు విక్రయించింది. మరో ప్లాంట్‌ను మూసివేసింది.Had a very engaging discussion with the team from @Ford Motors! Explored the feasibility of renewing Ford’s three decade partnership with Tamil Nadu, to again make in Tamil Nadu for the world!@TRBRajaa @Guidance_TN @TNIndMin #InvestInTN #ThriveInTN #LeadWithTN #DravidianModel pic.twitter.com/J2SbFUs8vv— M.K.Stalin (@mkstalin) September 11, 2024 -
మొన్న గూగుల్.. నేడు విస్టన్: తమిళనాడుకు దిగ్గజ కంపెనీలు
గూగుల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న తరువాత తమిళనాడు ప్రభుత్వం.. ఇప్పుడు అమెరికాకు చెందిన లింకన్ ఎలక్ట్రిక్, విషయ్ ప్రెసిషన్, విస్టన్‌లతో రూ.850 కోట్ల విలువైన ఎంవోయూలు కుదుర్చుకున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా సీఎం తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.గురువారం రోజు కూడా స్టాలిన్ ప్రభుత్వం ట్రిలియంట్‌తో రూ. 2000 కోట్ల అవగాహనా ఒప్పందం (MOU) కుదుర్చుకుంది. ఈ కంపెనీ రాష్ట్రంలో తయారీ యూనిట్‌ను మాత్రమే కాకుండా.. డెవలప్మెంట్ అండ్ గ్లోబల్ సపోర్ట్ సెంటర్‌ను ప్రారభించనుంది. చెన్నైలో పాదరక్షల ఉత్పత్తి, విస్తరణ గురించి నైక్‌తో కూడా చర్చలు జరిపినట్లు సీఎం స్టాలిన్ పేర్కొన్నారు.In the land of opportunities, every new dawn ignites fresh hopes.We’ve secured MoUs worth ₹850 crores with Lincoln Electric, Vishay Precision, and Visteon, bringing us one step closer to realising our vision.Through relentless effort and determination, we continue to turn… pic.twitter.com/Evj0qu8IPt— M.K.Stalin (@mkstalin) September 6, 2024అంతకుముందు బుధవారం, స్టాలిన్ చెన్నైలోని రూ. 200 కోట్ల ఆర్&డీ ఇంజనీరింగ్ సెంటర్ విస్తరణ కోసం బహుళజాతి పవర్ మేనేజ్మెంట్ కంపెనీ అయిన ఈటన్‌తో కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం రాష్ట్రంలో ఉద్యోగాల సంఖ్యను పెంచుతుందని ముఖ్యమంత్రి వెల్లడించారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి: కొత్త ధరలు ఇవే..రాష్ట్ర శ్రేయస్సును పెంపొందించే లక్ష్యంతో విదేశీ పెట్టుబడులను పొందేందుకు స్టాలిన్ ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్లో అధికారిక పర్యటనలో ఉన్నట్లు సమాచారం. 2024 ఆగష్టు 31న చెంగల్పట్టు జిల్లాలో ఎలక్ట్రోలైజర్లు మరియు గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడానికి ఓహ్మియంతో కొత్త ఫ్యాక్టరీ స్థాపనకు ఒప్పందం జరిగింది. దీని ద్వారా 500 ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.Exciting developments in Chicago!Secured a ₹2000 crore MoU with Trilliant to establish a manufacturing unit as well as their Development & Global Support Centre in Tamil Nadu.Thanks to Trilliant for this valuable partnership!Had productive talks with Nike on expanding its… pic.twitter.com/KjsZ2iFkHP— M.K.Stalin (@mkstalin) September 5, 2024 -
సరదాగా కామెంట్ చేసిన రజనీకాంత్.. ఫైర్ అయిన మంత్రి
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే వ్యవస్థాపకుడు కరుణానిధిపై మంత్రి ఎవి వేలు రచించిన "కళైంజ్ఞర్ ఎనుమ్ థాయ్" పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్న సూపర్‌స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న రజనీ అక్కడ సరదాగ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అక్కడి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.కరుణానిధి మరణం తర్వాత పార్టీని చక్కగా నడిపిస్తున్నారని సీఎం స్టాలిన్‌ను ఉద్దేశించి రజనీ అన్నారు. 'పాఠశాలలో కొత్త విద్యార్థిని ఒక టీచర్‌కు సరైన దారిలోపెట్టడం చాలా సులభం. కానీ, పాత విద్యార్థులను(సీనియర్ నాయకులు) సమన్వయం చేయడం చాలా కష్టం. అందులో ఆ పాత విద్యార్థులు కూడా సాధారణమైన వారు కాదు. దురైమురుగన్ అని ఒకరున్నారు. కళాకారుడి కంట్లోనే వేలు పెట్టి ఆడించిన వ్యక్తి ఆయన. ఇలా ర్యాంకులు సాధించిన వారు పార్టీలో ఉన్నారు. దురై మురుగన్ వంటి పెద్దలున్న ఈ పార్టీని స్టాలిన్ ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో అంటూనే.. హ్యాట్సాప్ స్టాలిన్ సర్' అని రజనీకాంత్ కామెంట్ చేశారు.రజనీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యపై అక్కడి నేతలు పలురకాలుగా చర్చించుకుంటూ తమకు తోచిన విధంగా రియాక్ట్ అవుతున్నారు. రజనీకి కౌంటర్‌గా మంత్రి దురై మురుగన్ ఇలా చెప్పుకొచ్చారు. 'సినిమా రంగాన్ని చూస్తే.. పెద్ద నటులంతా వయసు మీరి, పళ్ళు పోయి, గడ్డాలు పెంచుకుని చావబోయే స్థితిలో కూడా నటిస్తూనే ఉన్నారు. దీంతో యువకులకు అవకాశాలు రావడం లేదని తిప్పికొట్టారు.' ఈ వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.అయితే, తాజాగా రజనీ కూడా మరోసారి రియాక్ట్ అయ్యారు. దురై మురుగన్ మాట్లాడిన మాటలు పెద్ద విషయమేమీ కాదు. మా ఇద్దరి స్నేహం ఎప్పటిలాగే కొనసాగుతుంది. మా చమత్కారాన్ని శత్రుత్వంగా చూపించకండి. గతంలో మాదిరే మా స్నేహం ఉంటుంది.' అని ఈ వివాదానికి రజనీ ఫుల్స్టాప్ పెట్టారు. -
కరుణానిధి స్మారక రూ.100 నాణెం విడుదల
సాక్షి, చెన్నై: డీఎంకే దివంగత నేత, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి శత జయంతి స్మారక రూ.100 నాణేన్ని ఆదివారం చెన్నైలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విడుదల చేశారు. మొదటి నాణేన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అందుకున్నారు. డీఎంకే ప్రభుత్వం ఏడాది పొడవునా కరుణానిధి శత జయంతి ఉత్సవాలను జరిపింది. ఆయన ముఖచిత్రంతో కూడిన రూ.100 నాణేన్ని కేంద్రం విడుదల చేసింది. ఆదివారం చెన్నై కలైవానర్ అరంగంలో జరిగిన వేడుకలో ఈ నాణేన్ని విడుదల చేశారు. కరుణ జీవిత ప్రస్థానంతో రూపొందించిన 7డీ టెక్నాలజీ లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. -
ఉదయనిధికి డిప్యూటీ లేనట్టేనా?
సాక్షి, చైన్నె: డీఎంకే వారసుడు ఉదయనిధి స్టాలిన్‌కు డిప్యూటీ సీఎం పదవీ ఇప్పట్లో లేనట్టే కనిపిస్తోంది. స్వయంగా సీఎం స్టాలిన్ పరోక్ష వ్యాఖ్యలతో ఈ అంశం స్పష్టమవుతోంది. వివరాలు.. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న చైన్నె కొళత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సోమవారం సీఎం స్టాలిన్ విస్తృతంగా పర్యటించారు. రూ. 8.45 కోట్లతో పూర్తి చేసిన ప్రాజెక్టులను ప్రారంభించారు. గణేష్ నగర్లో పాఠశాల పనులకు శంకుస్థాపన చేశారు. విద్యుత్ సబ్ స్టేషన్, వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్, తదితర పనులను పరిశీలించారు. పెరియార్ నగర్ రూ. 355 కోట్లతో జరుగుతున్న ప్రభుత్వ సబర్బన్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను వీక్షించారు. తమిళనాడు పవర్ జనరేషన్ అండ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ తరపున రూ.110 కోట్లతో జరుగుతున్న అతి పెద్ద విద్యుత్‌సబ్‌స్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించారు. వీనస్ నగర్లో రూ.19.56 కోట్లతో సాగుతున్న మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంట్‌ను తనిఖీ చేశారు. చైన్నె 2.0 పథకం కింద రూ.5.4 కోట్లతో ప్రాథమిక పాఠశాలకు అదనపు తరగతి నిర్మాణాలకు ఈసందర్భంగా శంకుస్థాపన చేశారు. విద్యార్థులకు విద్యా సామగ్రిని ఆయన అందజేశారు. అనంతరం ఆధునిక మార్కెట్ నిర్మాణ పనులను సందర్శించి పరిశీలించారు . జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఐనావరం, మాధవరం సర్కిల్లో రూ. 91.36 కోట్లతో సాగుతున్న కాలువ నిర్మాణ పనులు, వరద నివారణ పనులను వీక్షించి, త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో సీఎంతో పాటు మంత్రులు ఎం.సుబ్రమణి యన్, పీకే శేఖర్‌బాబు, మేయర్ ఆర్. ప్రియా, ఎంపీ కళానిధి వీరాస్వామి తదితరులు ఉన్నారు.డిప్యూటీపై పరోక్ష వ్యాఖ్యడీఎంకే యువజన నేత, క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న నినాదం పార్టీలో మిన్నంటుతున్న విషయం తెలిసిందే. సీఎం స్టాలిన్ విదేశీ పర్యటన నేపథ్యంలో ఉదయనిధికి డిప్యూటీ పదవి అప్పగించి పరిపాలనా వ్యవహారాలపై దృష్టి పెట్టించబోతున్నట్టుగా చర్చ జోరందుకుంది. అయితే ఈ పదవీ విషయంగా ఉదయనిధి స్టాలిన్ మీడియాతో మాట్లాడే సమయంలో అన్నీ ప్రచారాలే అని పేర్కొంటూ వచ్చారు. అదే సమయంలో తనకు ఏ బాధ్యత అప్పగించినా, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పదవే తనకు కీలకం అని పేర్కొంటూ వచ్చారు. ఈ పరిస్థితులలో కొళత్తూరు పర్యటన సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన సీఎం స్టాలిన్‌ను మీడియా డిప్యూటీ పదవి విషయంగా ప్రశ్నించింది. ఆయనకు ఆ పదవి అప్పగిస్తారా? మంత్రి వర్గంలో మార్పులు ఉంటాయా? అని ప్రశ్నించగా, నినాదం బలంగానే ఉన్నా.. పండు కాలేదుగా అని పేర్కొంటూ డిప్యూటీ ప్రచారంతోపాటు మంత్రి వర్గంలో మార్పులనే ప్రచారానికీ చెక్ పెట్టారు. అలాగే వర్షాల గురించి మాట్లాడుతూ, ఎంతటి భారీ వర్షం వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు. -
వయనాడ్ మృత్యు ఘోష.. 123కు చేరిన మృతుల సంఖ్య.. మరో 600 మంది గల్లంతు
తిరువనంతపురం : వయనాడ్ ఘటన.. 123కు పెరిగిన మృతుల సంఖ్య చేరినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ వయనాడ్ విషాధంపై మలప్పురం జిల్లా పోలీసు చీఫ్ ఎస్ శశిధరన్ మాట్లాడుతూ.. శిధిలాల కింద దాదాపు 50 మృతదేహాలు గుర్తించినట్లు తెలిపారు. ప్రస్తుతం మృతదేహాలకు పోస్ట్ మార్టం జరుగుతున్నట్లు తెలిపారు. రేపుకూడా పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శిధిలాల కింద సహాయక చర్యల్ని ముమ్మరం చేయనున్నట్లు తెలిపారు. #WATCH | Kerala: Malappuram district police chief S Sasidharan says, "Today we conducted an in-depth search. We could find some 50 bodies or parts of bodies. The postmortem is going on. Tomorrow also we are going to search with NDRF and other police departments... We are trying… pic.twitter.com/hIH42zutTU— ANI (@ANI) July 30, 2024 భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇప్పటికే ప్రాజెక్ట్‌లు, డ్యాంలు నిండుకుండలా మారాయి. వరదల ధాటికి వయనాడ్ మృతుల సంఖ్య 94కి చేరింది. పదుల సంఖ్యలో డెడ్‌బాడీలను 30కిలోమీటర్ల దూరంలో ఉన్న చలయార్ నదిలో గుర్తించారు. ముండకై టీస్టేట్లో పనిచేస్తున్న 600 మంది కార్మికులు గల్లంతయ్యారు.దీంతో కార్మికుల ఆచూకీ కోసం భద్రతా బలగాలు సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి. గాడ్స్ ఓన్ కంట్రీపై ప్రకృతి కన్నెర్ర చేసింది. రికార్డ్‌స్థాయిలో 24 గంటల్లో 37.7 సెంటీమీటర్ల వర్షపాతం రాష్ట్రాన్ని కుదిపేసింది. దీంతో పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. వయనాడ్ జిల్లాలో వయనాడ్ జిల్లాలో ప్రకృతి విలయ తాండవం చేసింది. అర్ధరాత్రి గ్రామాలపై కొండచరియలు విరుచుకుపడి అనేక మంది సజీవ జలసమాధి అయ్యారు. పదుల సంఖ్యలో ప్రజలు శిధిలాల కింద చిక్కుకుని సాయం కోసం ఆర్తనాధాలు చేస్తున్నారు. మట్టి, బురద కింద వందల మంది చిక్కుకున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. గంటగంటకు మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది.వయనాడ్ జిల్లా మెప్పాడీ సమీపంలోని వివిధ ప్రాంతాల్లో అర్ధరాత్రి తర్వాత భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దాదాపూ 400 ఇళ్లను మట్టిచరియలు కమ్మేశాయి. దీంతో ఇప్పటి వరకు 89మంది ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది ఆచూకీ లేకుండా పోయింది. శిధిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే భారీ వర్షాల కారణంగా తీవ్ర ఆటంకం కలుగుతోంది.Tamil Nadu CM MK Stalin had a telephone conversation with Kerala CM Pinarayi Vijayan regarding the landslide situation in Wayanad.M K Stalin offered his condolences to the deceased in landslides and assured, on behalf of the Tamil Nadu government, all possible help. CM also…— ANI (@ANI) July 30, 2024 కొండ చరియలు విరిగిపడిన ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యల్ని ముమ్మరం చేస్తున్నాయి ఆర్మీ బలగాలు. ఎన్డీఆర్ఎఫ్ సహా 250 మంది సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమయ్యారు.ఆర్మీ,నేవీ,ఐఏఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌లో భాగస్వామ్యమయ్యాయి. శిధిలాలు,బురదలో చిక్కుకున్న వారిని సహాయ సిబ్బంది వెలికి తీస్తున్నారు.స్థానికంగా ఉన్న ఆలయాలు,మసీదులు,చర్చీల్లో తాత్కాలిక ఆస్పత్రులను ఏర్పాడు చేసి బాధితులకు తక్షణ చికిత్సను అందిస్తున్నారు.వయనాడ్ విలయం నేపథ్యంలో కేరళకు బాసటగా నిలిచారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. కేరళ సీఎం సహాయ నిధికి రూ.5కోట్లు విడుదల చేశారు. 10మందితో కూడిన వైద్య బృందాన్ని ఘటనా స్థలానికి పంపించారు. #WATCH | Wayanad landslide: A survivor Mustafa Ahmed says "At around 1:40 AM, there was a loud sound and a house around 30 metres away from my room completely collapsed. Since we were not sleeping, we ran out immediately. Several people have been trapped in this incident. People… pic.twitter.com/p9pLO2vb7i— ANI (@ANI) July 30, 2024వయనాడ్ బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు కేరళ సీఎం పినరయి విజయన్. రాష్ట్రంలో రెండ్రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారాయన. -
మైక్ కట్‌చేయడం.. కోఆపరేటివ్ ఫెడరలిజమా: స్టాలిన్
చెన్నై: పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీకి తమిళనాడు సీఎం స్టాలిన్ మద్దతు పలికారు. నీతిఆయోగ్ భేటీలో మమత మైక్ కట్ చేయడం కో ఆపరేటివ్ ఫెడరలిజమా అని ప్రశ్నించారు.ఈ మేరకు ఆయన శనివారం(జులై 27) ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు. ఒక ముఖ్యమంత్రిని ఇలాగేనా గౌరవించేంది. ప్రతిపక్షాలు కూడా ప్రజాస్వామ్యంలో భాగమేనని బీజేపీ గుర్తించాలి. వారిని శత్రువులుగా చూడకూడదు. కోఆపరేటివ్ ఫెడరలిజం మనుగడ సాగించాలంటగే చర్చలకు అవకాశం ఉండాలి. భిన్నాభిప్రాయాలను గౌరవించాలని స్టాలిన్ తన పోస్టులో పేర్కొన్నారు. కాగా, నీతిఆయోగ్ మీటింగ్‌లో కేవలం 5 నిమిషాలే తనను మాట్లాడించారని, తర్వాత మైక్ కట్ చేశారని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు మాత్రం మాట్లాడటానికి 20 నిమిషాల సమయం ఇచ్చారని మండిపడ్డారు. -
ప్రధాని మోదీకి సీఎం స్టాలిన్ వార్నింగ్
చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రధాని మోదీకి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పాలనపై దృష్టి పెట్టకుండా ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంటే ఒంటరి అవుతారు అని మండిపడ్డారు. అభివృద్ధి చెందిన భారత్ లక్ష్య సాకారం దిశగా అడుగులేస్తోన్న కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్‌ను మంగళవారం (జులై23న) లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి బడ్జెట్‌ను సమర్పించారు. అయితే ఆ బడ్జెట్లో ఇండియా కూటమి పాలిత రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని, ఆయా రాష్ట్రాల సీఎంలు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు. జులై 27న ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు.నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకాబోంఈ తరుణంలో కేంద్రం బడ్జెట్‌పై ఎంకే స్టాలిన్ స్పందించారు. బడ్జెట్లో మా రాష్ట్రానికి అన్యాయం జరిగింది. అందుకు నిరసనగా నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకాబోం. పార్లమెంట్లో మా నిరసన తెలుపుతామని ఇప్పటికే సూచించారు. బుధవారం పార్లమెంట్ సమావేశాల్లో తమిళనాడుపై కేంద్రం చిన్నచూపు చూస్తోందంటూ డీఎంకే ఎంపీలు ప్లకార్డ్‌లను ప్రదర్శించారు. డీఎంకే నిరసనపై సీఎం స్టాలిన్ ట్వీట్ చేశారు. ஒன்றிய நிதிநிலை அறிக்கையில் ஒருசில மாநிலங்கள் நீங்கலாகப் பல்வேறு மாநிலங்கள் புறக்கணிக்கப்பட்டிருப்பதைக் கண்டிக்கும் வகையில் #INDIA கூட்டணி எம்.பி.க்கள் போராட்டம் நடத்தியுள்ளார்கள்.மாண்புமிகு பிரதமர் @narendramodi அவர்களே… “தேர்தல் முடிந்துவிட்டது, இனி நாட்டைப் பற்றியே… pic.twitter.com/95xXotDQDa— M.K.Stalin (@mkstalin) July 24, 2024 మీరే ఒంటరవుతారు‘ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు మనం దేశం గురించి ఆలోచించాలి. 2024 బడ్జెట్ మీ పాలనను కాపాడుతుంది.. కానీ దేశాన్ని రక్షించదు. ప్రభుత్వాన్ని నిష్పక్షపాతంగా నడపండి.. లేకపోతే మీరు ఒంటరవుతారు’ అని ట్వీట్లో పేర్కొన్నారు. ‘మిమ్మల్ని ఓడించిన వారి పట్ల ఇంకా ప్రతీకారం తీర్చుకోవద్దు.. మీ రాజకీయ ఇష్టాలు, అయిష్టాల ప్రకారం మీరు పాలించినట్లయితే మీరు ఒంటరిగా మిగిలిపోతారు’ అని ట్వీట్లో తెలిపారు. తమిళనాడుపై కేంద్రం చిన్నచూపుఇండియా కూటమిలోని తమిళనాడు డీఎంకే ప్రభుత్వంపై సీఎం చిన్నచూపు చూస్తోందని సీఎం స్టాలిన్ తెలిపారు. బడ్జెట్లో చెన్నై మెట్రో రైలు రెండవ దశ, కోయంబత్తూరులో అభివృద్ధి వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై కేంద్రం నిధుల్ని కేటాయిస్తుందని ఆశించాం. దీంతో పాటు చెన్నై,దక్షిణాది జిల్లాల్లో వరద బాధిత ప్రాంతాల పునరుద్ధరణ కోసం కేంద్రాన్ని రూ.37,000 కోట్లు నిధుల్ని కేటాయించాలని అడిగితే ఇప్పటివరకు రూ.276 కోట్లు మాత్రమే అందించిందని అన్నారు.நமது மாண்புமிகு பாரதப் பிரதமர் திரு @narendramodi அவர்கள் தலைமையிலான மத்திய அரசு, 2024-25ஆம் ஆண்டுக்கான நிதிநிலை அறிக்கையை நேற்றைய தினம் தாக்கல் செய்துள்ளது. ஏழை எளிய மக்கள், பெண்கள், இளைஞர்கள், விவசாயிகள் என அனைத்துத் தரப்பினரும் பயனடையும்படி, வெகு சிறப்பானதாக அமைந்துள்ள இந்த… pic.twitter.com/22JEwRQ0Rj— K.Annamalai (@annamalai_k) July 24, 2024బీజేపీ ఎదురుదాడిసీఎం స్టాలిన్ ట్వీట్‌పై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఎదురు దాడికి దిగారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాకూడదని తీసుకున్న ఎంకే స్టాలిన్ నిర్ణయాన్ని అన్నామలై హస్యాస్పందంగా వర్ణించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఒకటి, రెండు ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన 10 బడ్జెట్లలో ఆరింటిలో తమిళనాడు ప్రస్తావన లేదని ఎత్తి చూపుతూ ఓ ట్వీట్ చేశారు. -
ఉదయనిధి స్టాలిన్‌కు డిప్యూటీ సీఎం పదవి.. మంత్రి రియాక్షన్ ఇదే!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు, యువజన సంక్షేమ శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి పొందనున్నారనే ఊహాగానాలు వెల్లువెత్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై ఆయన శనివారం స్పందించారు. డీఎంకే ఒక కుటుంబమని.. తమ ప్రభుత్వంలోని మంత్రులంతా డిప్యూటీ సీఎంలేనని పేర్కొన్నారు. గతంలో కూడా తాను ఇదే చెప్పానని తెలిపారు.‘డీఎంకేలోని మంత్రులందరూ మా ముఖ్యమంత్రికి డిప్యూటీలు. నాకు ఏ పెద్ద పదవి లేదా బాధ్యత ఇచ్చినా.. నా మనసుకు దగ్గరయ్యేది డీఎంకే యువజన విభాగం కార్యదర్శి పదవే. నాకు ఏ పదవి వచ్చినా డీఎంకే యువజన విభాగం ఎప్పటికీ మర్చిపోలేను. నాకు డిప్యూటీ సీఎం పదవిపై అనేక వార్తలు వచ్చాయి. అది ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది’ అని పేర్కొన్నారు. -
‘తాగుబోతులేమైనా స్వాతంత్ర్య సమరయోధులా?’
చెన్నై: అరవై మందికిపైగా పొట్టనబెట్టుకుని కళ్లకురిచ్చి కల్తీ సారా ఉదంతం దేశవ్యాప్తంగా సంచలన చర్చకు దారి తీసింది. ఒకవైపు తమిళనాట రాజకీయ దుమారం కొనసాగుతుండగా.. మరోవైపు ఈ కేసుపై మద్రాస్ హైకోర్టులో తాజాగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం నమోదైంది.కళ్లకురిచ్చి కల్తీసారా ఘటనలో మృతి చెందిన వాళ్ల కుటుంబాలకు నష్టపరిహారంగా రూ.10 లక్షలు ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మహమ్మద్ గౌస్ అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టులో పిల్ వేశారు. ‘‘కల్తీసారా తాగి చనిపోయినవాళ్లు స్వాతంత్ర్య సమరయోధులేం కాదు. సామాజిక ఉద్యమకారులు అంతకన్నా కాదు. పోనీ సమాజం కోసం.. ప్రజల కోసం ప్రాణాలు వదిలారా? అంటే అదీ కాదు. కల్తీసారా తయారీ చట్టవిరుద్ధమైన చర్య అని, అలాంటప్పుడు అది తాగి చనిపోయిన వాళ్ల విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించాల్సిన అవసరమే లేదు’’ అని వ్యాజ్యంలో ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: కల్తీసారా ఘటన.. ఆ భార్యాభర్తల మృతి తర్వాతే..!తమ సరదా కోసమే కల్తీసారా తాగిన చనిపోయిన వాళ్లను బాధితులుగా ప్రభుత్వం పరిగణించడంపైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. పైగా అగ్ని, రోడ్డు ప్రమాదాలు, ప్రకృతి విపత్తుల్లో మరణించిన వాళ్లకు పరిహారం తక్కువగా ఇచ్చిన సందర్భాల్ని ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచన చేయాలని, లేకుంటే న్యాయస్థానమే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారాయన.ఈ పిల్‌ను విచారణకు స్వీకరించిన చీఫ్ జస్టిస్(తాత్కాలిక) ఆర్ మహదేవన్, జస్టిస్ మహమ్మద్ షాఫిక్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్.. రెండు వారాలకు విచారణ వాయిదా వేసింది. -
కల్తీ మద్యం కట్టడి ఎప్పుడు?!
తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా కరుణాపురంలో కల్తీ సారా తాగి 60 మందికి పైగా మృతి చెందటం, మృతుల సంఖ్య నానాటికీ పెరుగుతూ ఉండటం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. జూన్ మూడో వారంలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి సీబీసీఐడీ పోలీసులు ఇప్పటి వరకు అనేక మందిని అరెస్టు చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో నిఘా ఉంచారు. ప్రజలు, పలు రాజకీయ పార్టీలకు చెందిన వారు, సామాజిక కార్యకర్తలు కల్తీ సారా విక్రయాలను అడ్డుకోటానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ – దేశంలో తరచూ జరుగుతున్న ఇలాంటి దుర్ఘటనలకు బాధ్యులెవరు? తప్పు... కల్తీ సారా తాగిన వారిదా? లేక కల్తీ సారాను కట్టడి చేయలేకపోతున్న వారిదా?నిజం ఏమిటంటే కల్తీ సారా సేవించటం వల్ల సంభవించే మరణాలు రెట్టింపుగా విషాదకరమైనవి. అవి భయానకమైనవి మాత్రమే కాదు, పూర్తిగా నివారించగలిగినవి కూడా! మనిషి వల్ల సంభవించే ఆ మరణాలను మనిషే సంభవించకుండానూ చూడగలడు. అందుకు కావలసిందల్లా వాస్తవికతలోని పచ్చి నిజాన్ని అంగీకరించటమే! అందరు మనుషులూ మద్యం సేవించనివాళ్లు కాదు. చాలామంది తాగాలనుకుంటారు. తాగటంలో ఆనందాన్ని అనుభవిస్తారు. ముసుగు లేకుండా చెప్పాలంటే – ఏ పరిణతి చెందిన, వివేకవంతమైన, ప్రజాస్వామ్య సమాజంలోనైనా అందుకు వారికి కాదనలేని హక్కు ఉంది. ఆ హక్కును నిరాకరించటానికి, ఆమోదయోగ్యం కాని ఆంక్షలు విధించటానికి ఆ సమాజం చేసే ప్రయత్నాలు సమస్యకు కారణం అవుతాయి. మద్యం కనుక సురక్షితమైన, నాణ్యత గలిగిన, చవకైన లేదా సరసమైన ధరలో... చట్టం అంగీకరించిన, ఆమోదించిన నియమ నిబంధనలకు లోబడి వయోజనులందరికీ లభించినట్లయితే కల్తీ సారాకు ప్రాణాన్ని పణంగా పెట్టుకునేవారెవరూ ఉండరు. మద్యం సేవించేవారిలో అత్యధికులు తీవ్ర అసంతృప్తితో నిరాశకు గురై ఆత్మహత్యను ఆశ్రయించే మనఃస్థితిని కలిగి ఉన్నవారు కాదు. వారు కేవలం ఉపశమనాన్ని కోరుకునేవారు. ఒత్తిడి నుంచి, అలసట నుంచి కాస్త సేదతీరాలని, లేదా ఆహ్లాదకరమైన సాయంత్రాలను గడపాలనీ అనుకునేవారు. వారు కోరుకున్నది కొనలేకపోయినందు వల్లనే ప్రమాదకరమైన, ప్రాణం తీసే అవకాశం ఉన్న వాటిని వారు ఆశ్రయిస్తారు. అంతేతప్ప, మరణించటం ఎప్పుడూ కూడా వారి ఉద్దేశం కాదని గుర్తుంచుకోండి. అది కేవలం ఉద్దేశపూర్వకం కాని పరిణామం. పరిస్థితులు బలవంతంగా వారిపై వచ్చి పడ్డ పర్యవసానం. అసలు సమస్యంతా మద్యం చెడ్డదని, అందువల్ల మద్యపానాన్ని నిలువరించాలని, కనీసం తీవ్రస్థాయిలో అందుకు విముఖత కలిగించాలని ఉన్న మన మూల భావనలోనే ఉంది. ‘‘ఔషధాల వినియోగానికి మినహా... ఆరోగ్యానికి హాని కలిగించే మత్తుపానీయాలు, మత్తు పదార్థాల వాడకాన్ని నిషేధించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి’’ అని రాజ్యాంగంలోని 47వ అధికరణం చెబుతోంది. మితిమీరిన మద్యపానం చెడు చేస్తుందనటంలో సందేహం లేదు. బుద్ధిహీనులైన వారు మాత్రమే ఈ మాటను కాదంటారు. మితిమీరితే మద్యమేం కర్మ... పంచదార, వెన్న, మీగడ, అంతెందుకు వ్యాయామం కూడా ఆరోగ్యానికి హానికరమైనవే! మోతాదుల్లో తీసుకుంటే అది వేరే సంగతి. సరే, ఏదైనా ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. వారి సొంత తప్పుల్ని కూడా! అయితే మద్యనిషేధం అన్నది ఒక ప్రభుత్వ విధానంగా (బిహార్, గుజరాత్‌లలో మాదిరిగా) పౌర హక్కులను ఉద్దేశపూర్వకంగా నిరాకరించటం మాత్రమే కాదు, పౌర ‘శిశుపాలన’ కూడా చేస్తుంది. పౌరుల్ని పిల్లలుగా చూసే దేశానికి ఏది సరైనదో తెలియదు. అయితే ప్రజల్ని నర్సరీ పిల్లల్లా చూసే ప్రభుత్వాలు ఈ మాటను అంగీకరించవు. ఏదేమైనా ఇక్కడొక లోతైన సమస్య ఉంది. మద్యం పట్ల అది మన వైఖరిని వివరిస్తుంది. అందుకే మహాత్మా గాంధీ వంటి నాయకులు, కొన్నిసార్లు మన వంటి రాజ్యాంగాలు మానవ బలహీనతగా లేదా అనైతికమైనదిగా భావించే వాటి నుంచి ప్రజల్ని దూరంగా ఉంచాలని కోరుకోవటం జరుగుతుంది. ప్రజల్ని సద్వర్తన కలిగినవారిగా తీర్చిదిద్దాలనుకోవటం, కనీసం అలా చేయటానికి ప్రయత్నించాలనుకోవటం నా దృష్టిలో ఒక తప్పుడు అభిప్రాయపు తపన. నైతిక కోణం నుంచి చూసినప్పుడు ఆ ప్రయత్నం అర్థవంతమైనదిగా కనిపించవచ్చు. బహుశా ఆచరణాత్మక దృక్కోణం నుంచి అది కొన్ని సమస్యల్ని నివారించవచ్చు. కానీ మానవ దృక్కోణం నుండి చూసినప్పుడు అధికారంలో ఉన్న వ్యక్తి సరైనదని నిర్ణయించినదాన్ని మీరు విభేదించినప్పుడు మీరు సరికాదు అనే భావన ఏర్పడుతుంది. మహాత్మా గాంధీ; బిహార్, గుజరాత్ ప్రభుత్వాలు మద్యాన్ని ఎలా చూడటం జరిగిందన్న విషయంలో ఇది నిజం. ఫలానా సంవత్సరం తర్వాత పుట్టిన వాళ్లందరికీ ధూమపాన నిషేధం విధించాలన్న రిషీ సునాక్ మూర్ఖపు ప్రతిపాదన విషయంలో కూడా ఇది నిజం. మనుషుల్ని వారి స్వీయాకర్షణల నుంచి రక్షించగలిగితే పరివర్తన చెందుతారని వారి నమ్మకం. కానీ అది తప్పు. నిజమైన పరివర్తన మీ తప్పుల నుండి మీరు నేర్చుకోవటం వల్ల వస్తుంది. అయితే నేర్చుకోటానికి ముందుగా మీరు ఆ తప్పుల్ని చేసి ఉండాలి. పొగ తాగటం మానేసినవారికి, మానేయాలని ఎప్పుడూ అనుకోనివారికి మధ్య వ్యత్యాసం ఇదే! అదిలిస్తే కదిలిన దాని కన్నా అనుభవం నుండి నేర్చుకున్నది గట్టి పాఠం అవుతుంది. ఎప్పటికీ మనసులో ఉండిపోతుంది. మద్యానికి సంబంధించి నిజంగా విచిత్రమైన సంగతి... మన సంస్కృతిలో, ప్రాచీన సంప్రదాయాలలో అది భాగమై ఉండటం! సోమరసం దేవతలకు అమృతం. ముఖ్యంగా ఇంద్రుడికి ప్రీతికరమైనది. మరోవైపు నిషేధం అన్నది విదేశీయులది. అమెరికా 1920లలో మద్య నిషేధానికి ప్రయత్నించి విఫలం అయింది. అది మనం పరిష్కరించవలసిన మరికొన్ని సమస్యల్ని ఉత్పన్నం చేసింది. మనమెందుకు దేవతల మార్గాన్ని అనుసరించకూడదు? అలా చేయటం సంపూర్ణ స్వదేశీ అవుతుంది. అందుకు బదులుగా మనం ఎందుకని అమెరికా మార్గాన్ని అనుకరిస్తున్నాం? ఈ వ్యాసంలోని నీతి సరళమైనది, సూటిౖయెనది. చట్టం రాసి ఉంచిన ‘మందు’ చీటీని అనుసరించి ప్రజలు నిజాయితీగా, సురక్షితమైన మద్యాన్ని సేవించేలా చూడటంలో సుపరిపాలన ఉంటుంది. దుష్పరిపాలన దానిని కష్టతరం చేస్తుంది, లేదంటే అసాధ్యమైనదిగా మార్చి ప్రజల్ని తరచూ తమ ప్రాణాల్ని హరించే ప్రత్యామ్నాయాల వైపు నెట్టివేస్తుంది. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
నీట్ రద్దుపై ప్రధాని మోదీ, ఎనిమిది రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్ లేఖ
నీట్ యూజీ పరీక్షలో అవకతవకలపై వివాదం కొనసాగుతున్న వేళ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు, ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. వైద్య విద్యలో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్ష నీట్ నుంచి రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని, జాతీయ స్థాయిలో ఈ వ్యవస్థను తొలగించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.వైద్య విధ్యలో విద్యార్ధుల ఎంపిక ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా కాకుండా ప్లస్ 2(12వ తరగతి) మార్కుల ఆధారంగా మాత్రమే ఉండాలని కోరారు. ఇది విద్యార్ధులపై అనవసరమైన అదనపు ఒత్తిడిని తగ్గిస్తుందని చెప్పారు."దీనికి సంబంధించి, తమిళనాడును నీట్ నుండి మినహాయించాలని మరియు 12వ తరగతి మార్కుల ఆధారంగా మెడికల్ అడ్మిషన్లు అందించాలని మేము మా శాసనసభలో ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించాము. ఇది రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించాం. అయితే ఇంకా పెండింగ్‌లో ఉంది," అని స్టాలిన్ లేఖలో పేర్కొన్నారు.నీట్ మినహాయింపు కోసం తమిళనాడు చేస్తున్న డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కూడా లేఖ రాశారు. ఇటీవల నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై రాష్ట్రం వ్యతిరేకత వ్యక్తం చేస్తుందని సీఎం తెలిపారు. నీటి తొలగింపుపై ఇతర రాష్ట్రాలు కూడా కోరుతున్నాయని పేర్కొన్నారు.పై విషయాలను పరిగణనలోకి తీసుకుని, నీట్ నుంచి తమిళనాడును మినహాయించే బిల్లుకు కేంద్ర ప్రభుత్వం తన సమ్మతిని అందించాలని, జాతీయ స్థాయిలో వైద్య కమిషన్ చట్టాన్ని కూడా సవరించాలని కోరుతూ తమిళనాడు శాసనసభ శుక్రవారం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించిందని చెప్పారు.కాగా.. నీట్‌ను రద్దు చేయడానికి తమ తమ అసెంబ్లీలలో ఇదే విధమైన తీర్మానాన్ని ఆమోదించడాన్ని పరిశీలించాలని కోరుతూ ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌లోని సీఎంలను స్టాలిన్ లేఖల ద్వారా కోరారు. -
Tamil Nadu Assembly: కుల గణన చేపట్టండి
చెన్నై: దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ బుధవారం ఏకగ్రీవ తీర్మానం చేసింది. 2021 నుంచి వాయిదాపడుతున్న జన గణనను వెంటనే చేపట్టాలని, ఇందులో భాగంగా కుల గణన కూడా చేయాలని తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానంలో కోరారు. ‘భారత్‌లోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు, విద్య, ఉద్యోగాలు, ఆర్థికంగా సమాన అవకాశాలు అందాలంటే కుల గణన తప్పనిసరి అని శాసనసభ భావిస్తోంది’ అని తీర్మానంలో పేర్కొన్నారు. -
తమిళనాట కల్తీ మద్యం కాటు..
సాక్షి, చెన్నై: తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా కరుణపురం ప్రాంతం కల్తీ మద్యం బాధితుల రోదనలతో ప్రతిధ్వనిస్తోంది. కల్తీ మద్యం కాటుకు బలైన వారి సంఖ్య 18 నుంచి గురువారం 40కి చేరుకుంది. ఆస్పత్రుల పాలైన బాధితుల సంఖ్య 116కు పెరిగిందని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ చెప్పారు. కల్తీ మద్యం తాగి పలువురు ప్రాణాలు కోల్పోవడం, పెద్ద సంఖ్యలో బాధితులు ఆస్పత్రి పాలైన ఘటన తనకు తీవ్ర వేదన కలిగించిందని సీఎం ఎంకే స్టాలిన్ చెప్పారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, ఇప్పటి వరకు పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారని సీఎం చెప్పారు. ఎక్కువ శాతం మిథనాల్ కలిపిన సారాయి తాగడం వల్లే మరణాలు సంభవించినట్లు తేలిందన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేలు చొప్పున సాయం అందజేస్తామని ప్రకటించారు. పెద్ద సంఖ్యలో సంభవించిన మరణాలకు కారణాలను కనుగొనడంతోపాటు, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు హైకోర్టు రిటైర్డు జడ్జి జస్టిస్ బి.గోకుల్దాస్ సారథ్యంలో ఏకసభ్య కమిటీని నియమిస్తున్నట్లు చెప్పారు.16 మంది పరిస్థితి విషమంబుధవారం తమ ఆస్పత్రిలో చేరిన 19 మంది కల్తీ మద్యం బాధితుల్లో 16 మంది పరిస్థితి విషమంగా ఉంది. జిప్మర్తోపాటు సేలం, కళ్లకురిచ్చి, విల్లుపురం ఆస్పత్రుల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరిలో 34 మంది పూర్తిగా కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని అంటున్నారు. కల్లకురిచ్చి ఘటనపై సీబీసీఐడీ అధికారులు తనిఖీలు చేపట్టి ఇప్పటి వరకు 200 లీటర్ల కల్తీ మద్యం పట్టుకున్నారు. అందులో ప్రమాదకర స్థాయిలో మిథనాల్ ఉన్నట్లు తేలింది. -
సీఎం స్టాలిన్ సీరియస్...
-
అత్యంత విషాదంగా తమిళనాడు కల్తీ సారా ఘటన.. మరణాలు ఎన్నంటే?
Updates..👉మృతుల కుటుంబాలకు సీఎం స్టాలిన్ పరిహారం.. Death toll due to Kallakurichi hooch tragedy rises to 34. Tamil Nadu CM MK Stalin announces Rs 10 lakhs each for the family of deceased and Rs 50,000 each for the people under treatment. A one-man commission, comprising former judge Justice B Gokuldas, announced for probing the…— ANI (@ANI) June 20, 2024 👉తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మృతుల కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.👉కల్తీ మద్యం ఘటనపై మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి గోకుల్దాస్తో కూడిన వన్ మ్యాన్ కమిషన్ ఈ అంశంపై విచారణ జరిపి మూడు నెలల్లో నివేదికలు సమర్పించాలని ప్రకటించింది. 👉 తమిళనాడు కల్తీసారా ఘటన అత్యంత విషాదంగా మారింది. కల్లకురిచ్చి జిల్లా కరుమాపురం గ్రామంలో కల్తీ సారా తాగిన ఘటనలో మృతుల సంఖ్య 37కి చేరుకుంది. #DGNews |The #deathtoll in the Kallakurichi illicit #liquor incident has risen to 37.#tamilnadu #Kallakurichi #Resign_Stalin #DMK #DMKGovt— Saji Agniputhiran (@Sajiagniputhira) June 20, 2024 👉 కాగా, సారా తయారీలో మోతాదుకు మించిన మిథనాల్‌ను వినియోగించినట్లు తేలింది👉 నేడు తమిళనాడు అసెంబ్లీ సెషన్ ప్రారమైంది. ఈ నేపథ్యంలో కల్తీ సారా విషయంపై అధికార-విపక్షాల వాగ్వాదంతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది.👉 ఇక, ఈ కేసును సీబీసీఐడీకి అప్పగించి విచారణ చేపట్టాలని సీఎం స్టాలిన్ ఆదేశాలు జారీ.👉 ఈ కేసులో కల్తీ సారా తయారు చేసిన గోవిందరాజు సహా ఓ మహిళ, యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.👉 కల్తీ సారా ఘటనలో దాదాపు 100 మంది బాధితులు ఉన్నట్టు తెలుస్తోంది. 👉ఈ ఘటనలో మరో 35 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. 👉ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సీరియస్ అయ్యారు. సీఎం స్టాలిన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘కళ్లకురిచిలో కల్తీ మద్యం సేవించి మృతి చెందారనే వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను. ఈ ఘటనలో నేరానికి పాల్పడిన వారిని అరెస్టు చేశాం. ఈ క్రమంలో నిరక్ష్యంగా ఉన్న అధికారులపై కూడా చర్యలు తీసుకున్నాం. సమాజాన్ని నాశనం చేసే ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటాం అని కామెంట్స్ చేశారు. Tamil Nadu CM tweets, "I was shocked and saddened to hear the news of the deaths of people who had consumed adulterated liquor in Kallakurichi. Those involved in the crime have been arrested in this matter. Action has also been taken against the officials who failed to prevent…— ANI (@ANI) June 19, 2024 👉గోవిందరాజు అనే వ్యక్తి కల్తీ సారాను తయారు చేసినట్టు అధికారులు గుర్తించారు. 👉మరోవైపు.. ఘటనపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం జిల్లా ఎస్పీ సమయసింగ్ మీనాపై సస్పెన్షన్ వేటు వేసింది. అలాగే కలెక్టర్ శ్రావణ్‌కుమార్‌ను బదిలీ చేసింది. వీరి స్థానంలో కలెక్టర్‌గా ప్రశాంత్, ఎస్పీగా చతుర్వేదిని నియమించారు. 👉ఇదిలా ఉండగా.. 18 ప్రత్యేక వైద్య బృందాలను చెన్నై నుంచి కళ్లకురిచ్చి పంపించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ జిల్లాలోని ఎక్సైజ్ విభాగం ఉన్నతాధికారులందరిపై వేటు వేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. #WATCH | Tamil Nadu: At least 25 people died and several were hospitalised after reportedly consuming illicit liquor in Tamil Nadu's Kallakurichi district: District Collector MS Prasanth(Visuals from Kallakurichi Government Medical College) pic.twitter.com/WI585Cbxbk— ANI (@ANI) June 19, 2024 👉ఇక, ప్రస్తుతం కళ్లకురిచ్చి ప్రభుత్వ ఆస్పత్రిలో సారా సేవించిన వారు 40 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని జిప్మర్ ఆస్పత్రికి తరలించారు. VIDEO | #TamilNadu: Several people were reported dead, and many others hospitalised after consuming spurious liquor in #Kallakurichi district.(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/IFicB26zG0— Press Trust of India (@PTI_News) June 20, 2024 -
నీట్ ఒక కుంభకోణం: ఎంకే స్టాలిన్
చెన్నై: మెరిట్‌కు కొలమానంగా పేర్కొంటున్న నీట్ ఒక కుంభకోణం, ఈ పరీక్ష పేద విద్యార్థుల ప్రయోజనాలకు, సామాజిక న్యాయానికి విరుద్ధమని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. ఇటువంటి విధానం అమలును నిలిపివేయాలని ఆదివారం ఆయన ‘ఎక్స్’లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ‘నీట్ చుట్టూ ముసురుకున్న వివాదాలు, ఈ విధానంతో జరుగుతున్న అన్యాయాన్ని చెప్పకనే చెబుతోంది. సమాజంలో అణగారిన వర్గాల విద్యార్థుల అభ్యున్నతికి మరిన్ని దారులు తెరవడానికి బదులుగా వారికి నీట్ అవకాశాలను దూరం చేస్తోంది’అని ఆరోపించారు. ‘కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎన్టీఏను సమరి్థస్తున్నప్పటికీ వాస్తవం మరోలా ఉంది. గుజరాత్లో ఓఎంఆర్ షీట్లను ట్యాంపర్ చేసినట్లుగా వచ్చిన ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదంతా ఓ కుట్ర. నీట్ కోచింగ్ సెంటర్లు, ఫిజిక్స్ ఉపాధ్యాయుడు, ఓ స్కూల్ ప్రిన్సిపల్‌కు ఇందులో హస్తముంది. ఈ వ్యవస్థను మార్చాల్సిన అవసరముంది’అని స్టాలిన్ పేర్కొన్నారు. -
పెళ్లికి రావాలని సీఎం స్టాలిన్‌ను ఆహ్వానించిన వరలక్ష్మి శరత్ కుమార్
కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో ప్రముఖ నటిగా రాణిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతోంది. ప్రియుడు నికోలయ్ సచ్దేవ్తో ఏడడుగులు వేయబోతోంది. మార్చిలో వీరి నిశ్చితార్థం జరిగింది. జూలై 2న థాయ్‌ల్యాండ్‌లో పెళ్లి జరగనుందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తమిళనాట ఉన్న ప్రముఖలను వివాహానాకి రావాలని వరలక్ష్మి కుటుంబ సభ్యులు ఆహ్వానం అందిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.తాజాగా శరత్‌కుమార్ తన కుమార్తె వరలక్ష్మి వివాహానికి రావాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దంపతులకు ఆహ్వానం అందించారు. శరత్‌కుమార్ మొదటి భార్య ఛాయకు వరలక్ష్మి జన్మించిందనే విషయం తెలిసిందే. స్టాలిన్‌ను కలుసుకున్న వారిలో రాధిక ఆమె కుమార్తె రియాన్ కూడా ఉంది. వీరందరితో పాటు వరలక్ష్మి సోదరి పూజా కూడా ఉండటం విశేషం. ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ను కలుసుకున్న సమయంలో శరత్‌కుమార్, రాధిక, వరలక్ష్మి విడివిడిగా ఫొటోలు దిగారు. వరలక్ష్మి తన ఎక్స్ పేజీలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.Met the Hon'ble Chief Minister Thiru @mkstalin sir & Durga mam and seeked their blessings..Congratulations on your win sir...Thank you so much for meeting us..@realsarathkumar @realradikaa @rayane_mithun #poojasarathkumar pic.twitter.com/Gopld9K2dl— 𝑽𝒂𝒓𝒂𝒍𝒂𝒙𝒎𝒊 𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓 (@varusarath5) June 8, 2024 -
లోక్‌సభ పోలింగ్ : తమిళనాడులో ఓటేసిన ప్రముఖులు (ఫొటోలు)
-
సెల్ఫీ తీసుకుంటే జీఎస్టీ వేస్తారేమో?: ఎంకే స్టాలిన్
చెన్నై: ఎన్డీఏ, ఇండియా కూటమి త్వరలో జరగనున్న ఎన్నికల్లో గెలుపు సాధించడమే లక్ష్యంగా పోటీ పడుతున్నాయి. ఈ తరుణంలో డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ జీఎస్టీని పేదల 'దోపిడీ'గా అభివర్ణించి కీలక వ్యాఖ్యలు చేశారు. హోటల్ నుంచి టూ వీలర్ రిపేర్ వరకు అన్నింటిపైనా జీఎస్టీ? ఒక మధ్యతరగతి కుటుంబం ఎంజాయ్ చేయడానికి హోటల్‌కి వెళితే బిల్లులో జీఎస్టీని చూసి 'గబ్బర్ సింగ్ టాక్స్' అని బాధపడుతున్నారు. భవిష్యత్తులో సెల్ఫీ తీసుకున్నా జీఎస్టీ పడుతుందా? అని తన ఎక్స్ (ట్విటర్) వేదికగా ప్రశ్నించారు. 1.45 లక్షల కోట్ల కార్పొరేట్ పన్ను మాఫీ బీజేపీ పేదల పట్ల కరుణ చూపలేదా? మొత్తం జీఎస్టీలో 64 శాతం అట్టడుగువర్గాల నుంచి సమకూరుతోంది. 33 శాతం మధ్యతరగతి ప్రజల నుంచి, కేవలం 3 శాతం సంపన్నుల నుంచి జీఎస్టీ సమకూరుతోందని ఎంకే స్టాలిన్ అన్నారు. పేదలను దోపిడీ చేసే ఈ వ్యవస్థను మార్చాలంటే #Vote4INDIA! అంటూ ట్వీట్ చేశారు. GST: வரி அல்ல… வழிப்பறி! “தன் பிணத்தின் மீதுதான் ஜி.எஸ்.டி.யை அமல்படுத்த முடியும்” என்று முதலமைச்சராக எதிர்த்த திரு. நரேந்திர மோடி, பிரதமரானதும், “ஜி.எஸ்.டி பொருளாதாரச் சுதந்திரம்’’ என்று ‘ஒரே நாடு ஒரே வரி’ கொண்டு வந்தார். பேச நா இரண்டுடையாய் போற்றி! ஹோட்டல் முதல் டூ வீலர்… pic.twitter.com/Nnk1YTMw3q — M.K.Stalin (@mkstalin) April 15, 2024 -
డైరెక్టర్ శంకర్ కూతురి రెండో పెళ్లి.. ఆశీర్వదించిన సెలబ్రిటీలు (ఫోటోలు)
-
సీఎం జగన్‌పై దాడి.. స్పందించిన స్టాలిన్, కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాయితో దాడికి పాల్పడ్డాడు ఓ ఆగంతకుడు. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా సింగ్‌నగర్‌కు చేరుకున్న క్రమంలో సీఎం జగన్‌పై రాయితో దాడి చేశారు. బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో సీఎం జగన్‌పై దాడి జరిగింది. ఆ రాయి అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మకు తాకింది. సీఎం జగన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, సీఎం జగన్‌పై దాడి ఘటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు స్పందించారు. ట్విట్టర్ వేదికగా కేటీఆర్..‘జగన్ అన్నా జాగ్రత్తలు తీసుకోండి. మీరు సురక్షితంగా ఉన్నారు సంతోషం. సీఎం జగన్‌పై జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు. ఎన్నికల సంఘం ద్వారా కఠినమైన చర్యలు చేపట్టాలని నేను ఆశిస్తున్నాను’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. Glad you are Safe. Take care @ysjagan Anna Strongly condemn the attack on AP CM Jaganmohan Reddy Garu. Violence has no place in democracy and I hope strict preventive measures are put in place by ECI pic.twitter.com/fTBTe17I2T — KTR (@KTRBRS) April 13, 2024 మరోవైపు హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘సీఎం జగన్‌పై దాడి హేయమైన చర్య. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు’ అని పేర్కొన్నారు. ఘటనకు బాధ్యులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సైతం జగన్‌పై దాడిని ఖండించారు. రాజకీయ విభేదాలు ఎప్పుడూ హింసాత్మకంగా మారకూడదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు సభ్యత, పరస్పర గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు. I condemn the stone-throwing on Hon'ble Andhra Pradesh CM Thiru @ysjagan. Political differences should never escalate to violence. Let's uphold civility and mutual respect as we engage in the democratic process. Wishing him a quick recovery. https://t.co/YtYoOJbVy1 — M.K.Stalin (@mkstalin) April 13, 2024 -
Rahul Gandhi: సీఎం స్టాలిన్‌ను సర్ప్రైజ్ చేసిన రాహుల్
చెన్నై: దేశంలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఎక్కడ చూసినా ఎన్నికల ప్రచారమే కనిపిస్తోంది. దీంతో, నేతలు బిజీ అయిపోయారు. ఈ క్రమంలో తమిళనాడు సీఎం స్టాలిన్ కోసం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇండియా కూటమి ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ తమిళనాడుకు వచ్చారు. ఈ సందర్భంగా కోయంబత్తూరులో కూటమి మీటింగ్‌కు వెళ్లాల్సి ఉండగా.. రాహుల్ ఆశ్చర్యకంగా సింగనల్లూరులోని ఒక స్వీట్ షాప్‌లోకి వెళ్లి వారిని సర్ప్రైజ్ చేశారు. రాహుల్ ఆ షాప్‌లోకి వెళ్లడంతో అక్కడున్న వారంతా ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం.. అక్కడే స్వీట్స్ తిన్న రాహుల్ దుకాణదారుడు, అక్కడ పనిచేసే వారితో మాట్లాడి ఫొటోలు దిగారు. ఈ క్రమంలో రాహుల్ ఒక కిలో మైసూర్‌పాక్ కొనుగోలు చేశారు. #RahulGandhi = Wholesome😍🥹🫶✨#RahulGandhiHopeOfIndia #RahulGandhiVoiceOfIndia pic.twitter.com/WYIdihesuw — Kanimozhi Manoharan (@Kaniiii___) April 12, 2024 అయితే, తాను కొనుగోలు చేసిన స్వీట్స్ ప్యాకెట్ ఎవరి కోసమా అని కాంగ్రెస్ నేతలు ఆలోచన పడ్డారు. అనంతరం, కూటమి తలపెట్టిన సభ వద్దకు వెళ్లిన రాహుల్.. ఆ మైసూర్‌పాక్ స్వీట్ ప్యాకెట్‌ను తమిళనాడు సీఎం స్టాలిన్‌కు అందించారు. ఈ సందర్బంగా తన కోసం స్వీట్స్ తేవడంతో స్టాలిన్ ఒకింత ఆశ్చర్యం, ఆనందం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
ప్రధాని ఈ గ్యారంటీలు ఇవ్వగలరా? మోదీకి స్టాలిన్ సవాల్
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దేశంలో రాజకీయ వేడి రగులులోంది. ప్రచారంలో తమదైన శైలిలో అభ్యర్థులు దూసుకుపోతున్నారు. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. విమర్శలు, ప్రతివిమర్శలతో ఒకరిపైనొకరు విరుచుపడుతున్నారు. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సవాల్ విసిరారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఎలక్టోరల్ బాండ్స్ వ్యవహారంపై విచారణ చేస్తామని మోదీ గ్యారంటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చైనా ఆక్రమించిన భారత్‌లోని భూగాలను తిరిగి వెనక్కి రప్పించాలని, కులగణనతోపాటు ఇతర విషాయాల్లో మోదీ గ్యారంటీ ఇవ్వగలరా అని ప్రశ్నించారు. 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని ‘మోదీ గ్యారంటీ’ పేరుతో ఎన్నికల హామీలను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై స్టాలిన్ స్పందిస్తూ.. పలు ప్రశ్నలు సంధించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే సీఏఏకు చేసిన సవరణలను వెనక్కితీసుకోవాలని, ప్రకృతి వైపరీత్యాల నిధులను తక్షణమే విడుదల చేయాలని సవాల్ విసిరారు. గ్యారంటీ కార్డుతో వస్తున్న ప్రధాని ఈ గ్యారంటీలను ఇవ్వగలరా అని నిలదీశారు. చదవండి: తెలంగాణ ‘చిన్నమ్మ’ కుమార్తె.. బన్సూరి స్వరాజ్ కంటికి గాయం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు, ప్రతి ఏడాది రెండు కోట్ల మంది యువతకు ఉద్యోగాలపై కూడా ప్రధాని హామీ ఇవ్వాలని మోదీ గ్యారంటీల జాబితాలో పొందుపరచాలని స్టాలిన్ కోరారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గించాలని, గిట్టబాటు ధరపై స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని కూడా మోదీని డిమాండ్ చేశారు. సైన్యంలో అగ్నిపథ్ పధకాన్ని రద్దు చేయాలని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో ప్రధాని మోదీ విస్తృత పర్యటనలపై కూడా స్టాలిన్ మండిపడ్డారు. సీజన్లో వచ్చే వలస పక్షుల మాదిరిగా ఎన్నికల సమయంలో ప్రధాని తమిళనాడు చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. గ్యారంటీ కార్డుతో తిరుగుతున్న మోదీ.. పైన పేర్కొన్న గ్యాంరటీలు ఇవ్వగలరా అని ప్రశ్నించారు. ఇవ్వకుంటే ఈ వారంటీలన్నీ మేడ్ ఇన్ బీజేపీ వాషింగ్ మేషీన్ అని బట్టబయలవుతుందని డీఎంకే అధినేత తన సోషల్ మీడియా పోస్ట్‌లో విరుచుకుపడ్డారు. -
ఎన్నికల ముందు ఎందర్ని జైల్లో వేస్తారు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: తమిళనాడు సీఎం స్టాలిన్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో సత్తై దురై మురుగన్ అనే యూట్యూబర్‌కు బెయిల్‌ను సుప్రీంకోర్టు పునరుద్ధరించింది. ‘‘యూట్యూబ్‌లో ఆరోపణలు చేశారంటూ ఎన్నికల వేళ ప్రతి ఒక్కరినీ జైళ్లలో వేయడం ప్రారంభిస్తే ఎందరు కటకటాల పాలవుతారో ఊహించండి’’ అని జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. నిరసన తెలపడం, అభిప్రాయాల వ్యక్తీకరణ ద్వారా స్వేచ్ఛను దుర్వినియోగపరిచినట్లుగా భావించరాదని పేర్కొంది. స్టాలిన్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు ఆపడం లేదన్న ఫిర్యాదుపై మద్రాస్ హైకోర్టు బెయిల్ రద్దు చేయడంతో మురుగన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
తమిళనాడులో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..!
తమిళనాడులో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హామీ ఇచ్చారు. తమ పార్టీ (డీఎంకే) 2024 సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో ఈ విషయాన్ని పొందుపరుస్తున్నట్లు స్టాలిన్ వెల్లడించారు. తమిళనాడులోని కోయంబత్తూర్‌లో అత్యాధునిక హంగులతో కొత్త క్రికెట్ స్టేడియం నిర్మాణం చేపడతామని స్టాలిన్ ట్విటర్ వేదికగా ప్రకటించారు. As a sports and cricket enthusiast, I would like to add one more promise to our election manifesto for #Elections2024: 🏏🏟️ We will take efforts to establish a state-of-the-art cricket stadium in Coimbatore, with the active participation of the sports loving people of… https://t.co/B6rpHJKSBI — M.K.Stalin (@mkstalin) April 7, 2024 క్రికెట్ ఔత్సాహికుడినైన నేను #Elections2024 కోసం మా ఎన్నికల మేనిఫెస్టోలో మరో వాగ్దానాన్ని జోడించాలనుకుంటున్నాను. కోయంబత్తూరులోని క్రీడాభిమానుల చురుకైన భాగస్వామ్యంతో అత్యాధునిక క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తాను. ఈ స్టేడియాన్ని చెన్నై చిదంబరం స్టేడియం తర్వాత తమిళనాట రెండో అతి పెద్ద అంతర్జాతీయ క్రికెట్ వేదికగా తీర్చిదిద్దుతాను. క్రీడల మంత్రి ఉదయ్ స్టాలిన్ రాష్ట్రంలో ప్రతిభను పెంపొందించడానికి, క్రీడా మౌలిక సదుపాయాలు సమకూర్చడానికి కట్టుబడి ఉన్నాడంటూ స్టాలిన్ ట్వీట్ చేశారు. కాగా, తమిళనాట ఇదివరకే ఓ అంతర్జాతీయ స్టేడియం (చెన్నైలోని ఎంఎ చిదంబరం స్టేడియం) ఉందన్న విషయం తెలిసిందే. ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ ఇది సొంత మైదానం. 1916లో స్థాపించబడిన చిదంబరం స్టేడియం దేశంలో రెండో పురాతన క్రికెట్ స్టేడియం. -
మోదీ మాత్రమే ఉంటారు.. బీజేపీ కాదు: సీఎం స్టాలిన్
చెన్నై: లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చి నరేంద్ర మోదీ మరోసారి ప్రధానమంత్రి అయితే దేశం మరోసారి సార్వత్రిక ఎన్నికలను చూడబోదని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. భారత్‌లో ఉన్న ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా మార్చివేసి.. నిరంకుశత్వాన్ని తీసుకువస్తారని ప్రధాని మోదీపై ధ్వజమేత్తారు. డీఎంకే అధినేత స్టాలిన్ ఓ జాతీయా మీడియా ఇంటర్య్వూలో పాల్గొని పలు అంశాలపై మాట్లాడారు. ప్రస్తుతం జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో దేశం నిరంకుశ రాజ్యంగా మారకుండా అడ్డుకోవటమే తమ పార్టీ ప్రధానాంశమని తెలిపారు. నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలో వస్తే.. బీజేపీకి కూడా ఎంటువంటి లబ్ధి జరగదన్నారు. నెమ్మదిగా బీజేపీ పార్టీ తన ఉనికి కోల్పోతుందన్నారు. కేవలం నరేంద్ర మోదీ మాత్రమే మిగులుతారని అన్నారు. బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో చేస్తున్న ఎన్నికల ప్రచారంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఉత్తర భారతదేశంలో కూడా బీజేపీ ప్రభావం తగ్గుతోందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రజలు బీజేపీకి ఈసారి ఎన్నికల్లో కూడా ఓట్లు వేయరని స్పష్టం చేశారు. ఇండియా కూటమిలో ప్రధాన మంత్రి అభ్యర్థి ఎన్నికల ఫలితాల అనంతరమే తెరమీదకు వస్తారని తెలిపారు. గతంలో మన్మోహన్ సింగ్ మాదిరిగానే ఎన్నికల ఫలితాలు వెలువడగానే పీఎం అభ్యర్థిని కూటమి ప్రకటింస్తుందని తెలిపారు. ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థులుగా సమర్థులైన, అనుభవం గల నేతలు చాలా మంది ఉన్నారని గుర్తుచేశారు. కచ్చతీవు ద్వీపం వ్యవహారంపై మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శ్రీలంకను చాలా సార్లు సందర్శించారు. ఎందుకు ఒక్కసారి కూడా కచ్చతీవు ద్వీపం గురించి ప్రస్తావించలేదని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల వేళ కచ్చతీవు ద్వీపం వ్యవహారంపై ప్రధాని నరేంద్రమోదీ ముసలి కన్నీరు కారుస్తున్నారని సీఎం స్టాలిన్ మండిపడ్డారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే కూటమి 38 సీట్లతో పోటి చేయగా 23 స్థానాల్లో గెలుపొందింది. అందులో కాంగ్రెస్ పార్టీ 8 సిట్లలో విజయం సాధించింది. సీపీఐ రెండు స్థానాల్లో గెలుపొందింది. ఇక.. 39 స్థానాలు ఉన్న తమిళనాడులో ఒకే దశలో ఏప్రిల్ 19న పోలింగ్ జరనుంది. ఫలితాలు జూన్4న వెలువడనున్నాయి. -
గెలుపు మాదే.. పీఎం కేర్ ఫండ్స్‌పై సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,చెన్నై : పీఎం కేర్ ఫండ్స్‌పై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పీఎం కేర్ ఫండ్స్ రహస్యాల్ని బహిర్గతం చేస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా ఎంకే స్టాలిన్ మాట్లాడారు. ఎన్నికల్లో బీజేపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. కాబట్టే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారని అన్నారు. ఎలక్టోరల్ బాండ్ల మాదిరిగానే ఎలక్టోరల్ బాండ్ల మాదిరిగానే, ‘వారు (బీజేపీ, కేంద్రాన్ని ఉద్దేశిస్తూ) మరొక విధంగా నిధుల్ని సేకరించారు. దీనికి పీఎం కేర్స్ ఫండ్ అని పేరు పెట్టారు. ఈ ఏడాది జూన్‌లో ఇండియా కూటమి కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఫండ్‌కు సంబంధించిన అన్ని రహస్యాలు వెలికి తీస్తామని స్పష్టం చేశారు. ఆయుష్మాన్ భారత్ సహా ఇతర సంక్షేమ కార్యక్రమాల్లో అవక తవకలు జరిగాయని కాగ్ నివేదిక తెలిపింది. ఆ నివేదికపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించ లేదని స్టాలిన్ ప్రశ్నించారు. తమిళనాడు కోసం అమలు చేసిన ఒక ప్రత్యేక పథకాన్ని ప్రధాని మోదీ చెప్పగలరా? అని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అడిగారు. -
టోల్గేట్ల తొలగింపు.. నీట్ రద్దు, డీఎంకే మేనిఫెస్టో విడుదల
సాక్షి, చెన్నై : వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తమమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బుధవారం మేనిఫెస్టోని విడుదల చేశారు. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా, నీట్ పరీక్షలపై నిషేధం, ముఖ్యమంత్రికి గవర్నర్‌ను నియమించే అధికారం వంటి ఇతర హామీలను మేనిఫెస్టోలో పేర్కొన్నారు.మేనిఫెస్టోను రూపొందించినందుకు స్టాలిన్ తన సోదరి కనిమోళిని ప్రశంసించారు. ప్రతి జిల్లాకు సంబంధించిన పథకాలపై కనిమొళి అద్భుతమైన మేనిఫెస్టోను రూపొందించారని అన్నారు. కాగా మేనిఫెస్టోతో పాటు రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కూడా స్టాలిన్ ప్రకటించారు. అనంతరం సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు రూపొందించిన మేనిఫెస్టోలో ఏం చెప్పామో డీఎంకే అది చేస్తుంది. మా నాయకులకు అదే నేర్పాం. ద్రవిడ మోడల్లో అమలు చేసిన పథకాలు తమిళనాడు అభివృద్ధిని దేశమంతా వ్యాప్తి చేసేలా చేస్తాయని అన్నారు. డీఎంకే మెనిఫెస్టోలో ఏయే అంశాలు ఉన్నాయంటే రాష్ట్రాలకు సమాఖ్య హక్కులు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చెన్నైలో సుప్రీం కోర్టు బెంచ్ ఏర్పాటు పుదుచ్చేరికి రాష్ట్ర హోదా జాతీయ విద్యా విధానం (NEP) ఉపసంహరణ మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలు ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్ధులకు ఉదయం అల్పాహారం సదుపాయం. నీట్ బ్యాన్. రాష్ట్రంలో టోల్ గేట్ల తొలగింపు రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై నిషేధం ఎల్పీజీ గ్యాస్ -500, లీటర్ పెట్రోల్ రూ.75, డీజిల్- రూ.65 అందిస్తూ నిర్ణయం తిరుకురల్‌ను ‘నేషనల్ బుక్’ గా తీర్చిదిద్దేలా నిర్ణయం దేశానికి తిరిగి వచ్చిన శ్రీలంక తమిళులకు భారత పౌరసత్వం గవర్నర్లకు క్రిమినల్ ప్రొసీడింగ్స్ నుండి మినహాయింపునిచ్చే ఆర్టికల్ 361 సవరణ కొత్త ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్ఈ, ఐఐఏఆర్‌ఐలు ఏర్పాటుతో పాటు ఇతర హామీలు నెరవేర్చేలా మేనిఫెస్టోని సిద్ధం చేసింది డీఎంకే. లోక్‌సభ అభ్యర్ధులు వీరే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న లోక్ సభ అభ్యర్ధుల జాబితాను ఎంకే స్టాలిన్ విడుదల చేశారు. వారిలో డీఎంకే పార్టీలో కీలకనేతలైన కె కనిమొళి, ఎ రాజా తదితరులు ఉన్నారు. ఉత్తర చెన్నై - కళానిధి వీరాసామి, దక్షిణ చెన్నై - తమిళచ్చి తంగపాండియన్, సెంట్రల్ చెన్నై - దయానిధి మారన్, శ్రీపెరుంబత్తూరు - టీఆర్ బాలు, అరకోణం - జగత్రాచహన్, వెల్లూరు - కంధీర్లను బరిలోకి దించాలని పార్టీ నిర్ణయించింది. వీరితో పాటు తిరువనమలై - అన్నాదురై, ఆరణి - ధరణి, సేలం - సెల్వగపతి, ఈరోడ్ - ప్రకాష్, నీలగిరి - ఏ రాజా, కోవై - గణపతి రాజ్‌కుమార్, పెరంబలూరు - అరుణ్ నేరు, తంజావూరు - మురసోలి, తేని - తంగ తమిళ్ సెల్వం, తుత్తుకుడి - కనిమొళి, తెంకాసి - రాణి, కళ్లకురిచి - మలైయరసన్. -
తమిళులకు కేంద్రమంత్రి క్షమాపణలు
సాక్షి, చెన్నై: తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్రమంత్రి శోభా కరంద్లాజే క్షమాపణలు చెప్పారు. రామేశ్వరం కెఫెలో జరిగిన పేలుడు ఘటనలో నిందితుడి ప్రాంతం గురించి శోభా కరంద్లాజే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు వివాదం కావడంతో తమిళులుకు ఆమె క్షమాపణలు చెప్తూ ఎక్స్.కామ్‌లో పోస్ట్ చేశారు. ‘సోదరులు, సోదరీమణులకు నా క్షమాపణ. కృష్ణగిరి అడవుల్లో శిక్షణ పొంది, రామేశ్వరం కేఫ్ పేలుడుతో ముడిపడి ఉన్న నిందితుడి గురించే మాట్లాడాను. అయినప్పటికీ నా మాటలు మీకు బాధ కలిగించాయని నేను భావిస్తున్నాను. అందుకు క్షమాపణలు కోరుతున్నాను. నేను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను’ అని కరంద్లాజే ఎక్స్.కామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. To my Tamil brothers & sisters, I wish to clarify that my words were meant to shine light, not cast shadows. Yet I see that my remarks brought pain to some - and for that, I apologize. My remarks were solely directed towards those trained in the Krishnagiri forest, 1/2 — Shobha Karandlaje (Modi Ka Parivar) (@ShobhaBJP) March 19, 2024 కరంద్లాజే గతంలో ఏం వ్యాఖ్యలు చేశారంటే? రామేశ్వరం కెఫే బాంబు పేలుడులో నిందితుడు మల్నాడు వాసి అని, గతంలో తమిళనాడులోని కృష్ణగిరి అటవీ ప్రాంతంలో ఆయుదాల వినియోగంపై శిక్షణ తీసుకున్నాడంటూ విచారణలో తేలింది. దీంతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై బీజేపీ మహిళా నేత, కేంద్రమంత్రి కరంద్లాజే విమర్శలు చేశారు. సీఎం సంఘ విద్రోహ కార్యకాలపాల్ని ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. పలు సున్నితమైన అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. శోభా రెచ్చగొట్టే వ్యాఖ్యలపై సీఎం ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు ఎలాంటి అధికారం లేదు ‘శోభా మీ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం. రామేశ్వరం కెఫే బ్లాస్ట్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ చర్యలు తీసుకోవాలి. అలాంటి వాదనలు చేసేందుకు మీకు ఎలాంటి అధికారం లేదని అన్నారు. శోభాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ తరుణంలో శోభా క్షమాపణలు చెబుతూ పోస్ట్ పెట్టడంపై వివాదం సద్దు మణిగింది. -
‘నా వ్యాఖ్యలు వక్రీకరించారు.. అది డీఎంకే డీఎన్ఏ’
చెన్నై: మహిళలకు సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలను అధికార డీఎంకే పార్టీ వక్రీకరిస్తోందని బీజేపీ నేత కుష్బూ సుందర్ అన్నారు. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం ఇంట్లో కుటుంబ పెద్దగా ఉన్న మహిళలకు ప్రతినెల రూ.1000 చొప్పున ఆర్థిక సాయం అందించే పథకంపై కుష్బూ సుందర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘మహిళలకు డీఎంకే ప్రభుత్వం రూ.1000 భిక్ష ఇస్తే.. వారికి ఓటు వేస్తారా?. డీఎంకే ప్రభుత్వం రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలిస్తే.. ప్రజలు ఇలా ప్రభుత్వం ఇచ్చే రూ.1000 భిక్ష తీసుకోవాల్సిన అవసరం లేదు’ అని ఆమె సోమవారం బీజేపీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొని అన్నారు. కుష్బూ చేసిన వ్యాఖ్యలు.. మహిళలను కించపరిచేలా ఉన్నాయని డీఎంపీ పార్టీ మహిళా విభాగం తీవ్రంగా ఖండిస్తూ నిరసన తెలిపింది. తాను చేసిన వ్యాఖ్యలను డీఎంకే వక్రీకరించిందని కుష్బూ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. ‘మహిళలకు రూ. 1000 ఇచ్చే బదులు ప్రభుత్వం మద్యం షాపుల సంఖ్యను తగ్గించాలి.అలా చేయటం వల్ల మహిళలకు వేల రూపాయలు పొదుపు చేసినట్లు అవుతుంది.వారి కుటుంబాలకు సాయం చేసినట్లు అవుతుంది. వాళ్లు సంతోషంగా తల ఎత్తుకొని జీవిస్తారు. నేను మాట్లాడిన వ్యాఖ్యల వెనక ఉన్న అర్థం ఇది. నేను మహిళలను అవమానించినట్లు నా మాటలను తప్పుదోవ పట్టించారు. మహిళలపై తప్పుడు వ్యాఖ్యలు చేయటం డీఎంకే డీఎన్ఏ.. కానీ నాది కాదు’ అని కుష్బూ సుందర్ వివరణ ఇచ్చారు. ‘నేను ఎప్పుడు తప్పు చేయను. తప్పు చేసి పారిపోయే వ్యక్తిని కాదు. ధైర్యంగా మాట్లాడటం నేర్పిన వ్యక్తి కలైంజ్ఞర్ కరుణానిధి. మీరు( డీఎంకే) దానిని మర్చిపోయి ఉండవచ్చు. కానీ నేను మర్చి పోలేదు’ అని కుష్బూ అన్నారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అయిన కుష్బూను వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ చెన్నై సెంట్రల్ పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
సీఎం ఎంకే స్టాలిన్‌కు ఆ అధికారంలేదు : అన్నమలై
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో 'సీఏఏ వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడానికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌కు అధికారాలు లేవని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై అన్నారు. స్టాలిన్ రాజకీయంగా సీఏఏని వ్యతిరేకించినప్పటికీ, తమిళనాడులో కేంద్ర చట్టాన్ని అమలు చేయడానికి వ్యతిరేకంగా అతను అధికారికంగా తీసుకోలేరు. సీఏఏ సంబంధిత నిబంధనలను అమలు చేయకూడదని నిర్ణయించే రాజ్యాంగం ప్రకారం అతనికి ఎటువంటి అధికారం లేదని అన్నామలై నొక్కిచెప్పారు. కీలక వ్యాఖ్యలు పౌరసత్వ (సవరణ) చట్టం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం చట్టాన్ని అమలు చేయదని సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. ‘సిఏఏ అనవసరం. రద్దు చేయాలి. తమిళనాడులో చట్టాన్ని అమలు చేయడానికి మేము ఏ విధంగానూ అనుమతించము. భారతదేశాన్ని ప్రభావితం చేసే ఏ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం చోటు ఇవ్వదని నేను తమిళనాడు ప్రజలకు స్పష్టం చేస్తున్నాను అని తెలిపారు. -
2019 ఫార్ములా రిపీట్.. కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లంటే..
లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో డీఎంకే 2019 ఫార్ములాను మళ్ళీ పునఃప్రారంభించింది. పార్టీ తన మిత్రపక్షమైన కాంగ్రెస్‌తో సీట్ల పంపకాల ఒప్పందం ఎట్టకేలకు ఖరారు చేసుకుంది. దీంతో తమిళనాడులో 9 స్థానాలు, పుదుచ్చేరిలో ఒక్క స్థానంలో కాంగ్రెస్ పోటీ చేయనుంది. సీట్ల పంపకాల ఒప్పందం డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, టీఎన్‌సీసీ చీఫ్ కే సెల్వపెరుంతగై, ఏఐసీసీ నేతలు కేసీ వేణుగోపాల్, అజయ్ కుమార్ సమక్షంలో జరిగింది. తమిళనాడు, పుదుచ్చేరిలో డీఎంకే నేతృత్వంలోని కూటమి మొత్తం 40 సీట్లను గెలుచుకుంటుందని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. కాంగ్రెస్, డీఎంకే మధ్య బంధం పటిష్టంగా ఉందని, కలిసికట్టుగా పోరాడి రాబోయే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని అన్నారు. తమిళనాడు, పుదుచ్చేరిలో ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)తో అధికారిక పొత్తును ప్రకటించడం సంతోషంగా ఉందని, తమిళనాడులో 9 స్థానాలు మరియు పుదుచ్చేరిలో ఒక స్థానంలో కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేస్తుందని వేణుగోపాల్ అన్నారు. మిగిలిన స్థానాల్లో డీఎంకే అభ్యర్థులకు మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ (MNM) పార్టీ కూడా డీఎంకే నేతృత్వలోని కూటమిలో భాగమే. కానీ త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో వారికి స్థానం కేటాయించలేదు. ఆ తరువాత జరిగే రాజ్యసభ ఎన్నికలకు సీటు కేటాయించనున్నట్లు సమాచారం. కాగా ప్రజా సంక్షేమం కోసం మాత్రమే డీఎంకే నేతృత్వంలోని కూటమిలో చేరినట్లు కమల్ హాసన్ తెలిపారు. #WATCH | Tamil Nadu | Congress will contest elections on 9 seats in Tamil Nadu and one seat in Puducherry. On the remaining seats, we will support the candidates of DMK and alliance parties. We will win all 40 seats of Tamil Nadu, says Congress MP KC Venugopal pic.twitter.com/fcksz92VVK — ANI (@ANI) March 9, 2024 -
కొంప ముంచిన అక్షర దోషం.. డీఎంకే నేతలపై ట్రోలింగ్..
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై ప్రశంసలు తెలుపుతూ వెలసిన పోస్టర్లు ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏమైందంటే.. ఈ పోస్టర్లలో ఎంకే స్టాలిన్ చిత్రంపై ‘బ్రైడ్ ఆఫ్ తమిళనాడు’ అని రాసి ఉండటమే. ‘బ్రైడ్ ఆఫ్ తమిళనాడు’ టైమ్స్ నౌ ప్రకారం, ‘ప్రైడ్ ఆఫ్ తమిళనాడు’ అనే పదాలతో పోస్టర్‌ను ముద్రించాలని ప్లాన్ చేశారు. అయితే, అక్షర దోషంతో అది ‘బ్రైడ్ ఆఫ్ తమిళనాడు’ గా మారి సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఇంతకీ ఈ పోస్టర్‌ను ఎవరు వేశారు? ఎక్కడ పెట్టారు? అనేది తెలియరాలేదు. అయితే, ఈ పోస్టర్ ఉన్న వీడియోను తీసిన పలువురు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పటి వరకు ఆ వీడియోని 1.2లక్షల మంది వీక్షించారు. "Bride of Tamil Nadu" 🤣🤣🤣🤣🤣🤣🤣 pic.twitter.com/6HunaWC3Lw — Facts (@BefittingFacts) March 4, 2024 ఇదిలా ఉంటే తమిళనాడులోని కులశేఖ పట్టణంలో నిర్మిస్తోన్న ఇస్రో లాంచ్‌ప్యాడ్‌ను ఉద్దేశించి డీఎంకే మంత్రి అనిత ఆర్ రాధాక్రిష్ణన్ ప్రకటన ఇచ్చారు. అందులో ప్రధాని మోదీ, సీఎం స్టాలిన్ ఫోటోలతో పాటు వెనకవైపున రాకెట్‌పై చైనా జెండా ఉండటం వివాదానికి కేంద్ర బిందువయ్యారు. మాండరిన్లో శుభాకాంక్షలు మార్చి 1న బీజేపీ మాండరిన్లో ముఖ్యమంత్రి స్టాలిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. మాండరిన్ ఆయనకు నచ్చిన భాష అంటూ విష్ చేసి, విమర్శించింది. మాండరిన్.. చైనా అధికారిక భాష. దీనిపై తమిళనాడు సీఎం స్టాలిన్ వివరణ ఇచ్చారు. ప్రకటనలో తప్పిదం దొర్లింది. దాని వెనుక దురుద్దేశం లేదు. భారత్‌పై ప్రేమ ఉంది అని అన్నారు. -
స్టాలిన్‌కు చైనా భాషలో శుభాకాంక్షలు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు రాష్ట్ర బీజేపీ విభాగం శుక్రవారం చైనా భాషలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ‘బీజేపీ తమిళనాడు విభాగం గౌరవ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు ఆయనకు ఇష్టమైన భాషలో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది’అని ‘ఎక్స్’లో పేర్కొంది. అందులో ప్రధాని మోదీ, పార్టీ చీఫ్ నడ్డా, తమిళనాడు విభాగం అధ్యక్షుడు అన్నామలై చిత్రాలు, ఆపక్కనే స్టాలిన్ చిత్రం కింద చైనీస్ భాషలో ఒక సందేశం ఉంది. రాష్ట్రంలో ఇస్రో కాంప్లెక్స్ సముదాయం ప్రారంభం సందర్భంగా ఇటీవల డీఎంకే ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలో చైనా జెండా కనిపించడం వివాదం రేపింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఈ మేరకు స్పందించడం విశేషం. అయితే, ఆ ప్రకటనలో పొరపాటున చైనా జెండా అచ్చయిందే తప్ప, ఉద్దేశపూ ర్వకంగా చేసింది కాదని ఆ ప్రకటన ఇచ్చిన మంత్రి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. -
కేంద్ర ప్రభుత్వంపై సీఎం స్టాలిన్ ఫైర్
వరద విలయంలో చిక్కుకున్న తూత్తుకుడి, తిరునల్వేలి జిల్లాలను ఆదుకునేందుకు కేంద్రం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల కోసం ప్రశ్నిస్తే కేంద్ర ఆర్థిక మంత్రి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నా, బాధితులను ఆదుకునేందుకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టామని వివరించారు. సాక్షి, చైన్నె : గత ఏడాది చివర్లో తిరునల్వేలి, తూత్తుకు డి జిల్లాలను వరదలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. వరద విలయం కారణంగా ఇక్కడి ప్రజల జీవనోపాధి దెబ్బ తినడమే కాకుండా, వ్యవసాయం, పంట లు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, జనాలకు తీవ్ర నష్టం ఎదురైంది. దీంతో వరద బాధితులు 2,21,815 మందిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.423.95 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో వరద బాధితుల కు సంక్షేమ పథకాలు, పంట రుణాలు, స్వయం సహాయక బృందాలకు రుణాలు, చిరు వ్యాపారులకు రుణాలు, పశువుల కొనుగోలుకు రుణాలు, పడవల కొనుగోలుకు సాయం, దెబ్బతిన్న ఇళ్లకు నష్ట పరిహా రం పంపిణీ చేసే కార్యక్రమం ఆదివారం తూత్తుకుడి లో చేపట్టారు. ఇందులో పంట పొలాలతో పాటు తీవ్రం నష్టపోయిన రైతులకు ఉపశమనం కల్పిస్తూ 1,28,205 మంది లబ్ధిదారులకు రూ.97 కోట్ల 59 లక్ష ల 97 వేలు అందజేశారు. దెబ్బతిన్న పంటలకు గాను బాఽధితులు 41,498 మందికి రూ. 25 కోట్ల 88 లక్షల 63 వేలు అందజేశారు. వికలాంగుల సంక్షేమ శాఖ తర పున 20 మంది లబ్ధిదారులకు మోటారు సైకిళ్లను అందజేశారు. జిల్లా పారిశ్రామిక కేంద్రం తరపున 150 మంది లబ్ధిదారులకు రూ. 43.82 లక్షల రుణాలను పంపిణీ చేశారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ తరపున 3,845 మంది లబ్ధిదారులకు రూ. 50 లక్షల విలువైన సహాయకాలను అందజేశారు. తిరునల్వేలిలో ఇళ్లను కోల్పోయిన 779 మందికి కొత్త ఇళ్ల నిర్మాణం కోసం త లా రూ. 4 లక్షలు చొప్పున రూ. 17 కోట్లను అందజేశారు. వరద బాధితులందరికీ సహాయకాలు, సంక్షేమ పథకాలను సీఎం స్టాలిన్ పంపిణీ చేశారు. కేంద్రం శీతకన్ను వరద బాధితులను ఉద్దేశించి సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, తూత్తుకుడి, తిరునల్వేలి జిల్లాల్లో భారీ వరదలు, భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్ట పోయిన బాధితులకు ఉపశమనం కల్పించేందుకు ఈ సంక్షేమ సహాయకాలను అందజేశామన్నారు. ఇక్కడ వరదలు చుట్టుముట్టగానే బాధితులను ఆదుకోవడం, వారికి కావాల్సిన సహాయకాల పంపిణీలో అధికారులు, మంత్రులు, ప్రతి ఒక్కరూ రేయింబవళ్లు శ్రమించడంతో త్వరితగతిన సాధారణ పరిస్థితులు తీసుకొచ్చామన్నారు. ఏ ఒక్క బాధితుడికి అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం చేయడమే లక్ష్యంగా చర్యలు తీసుకున్నామని వివరించారు. అందుకే అందరికీ సంక్షేమ పథకాల పంపిణీకి ప్రస్తుతం ఏర్పాట్లు చేశామన్నారు. ఇది 2024 సంవత్సరంలో తొలి అతిపెద్ద సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమంగా పేర్కొన్నారు. ఒకే నెలలో ఎదురైన రెండు విపత్తులతో తమిళనాడుకు రూ. 37,000 కోట్లు నష్టం ఎదురైందని వివరించారు. తమను ఆదుకోవాలని, నిధులు కేటాయించాలని కేంద్రానికి పదే పదే విజ్ఞప్తి చేసినా ఫలితం శూన్యం అని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకునేందుకు కేంద్రం చిల్లి గవ్వైనా ఇవ్వలేదేని మండి పడ్డారు. ప్రశ్నిస్తే కేంద్ర ఆర్థిక మంత్రి ఇష్టారాజ్యంగా మాట్లాడుతుండడం శోచనీయమన్నారు. ప్రస్తుతం ఎన్నికలు వస్తున్నాయని, ఓట్ల కోసం తమిళనాడు మీద ప్రేమ ఒలక బోసేందుకు సిద్ధంగా ఉంటారంటూ కేంద్రాన్ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. ఆర్థిక కష్టాలు ప్రభుత్వాన్ని వెంటాడుతున్నా, రాష్ట్రానికి ఉన్న వనరులతోనే ప్రజలను ఆదుకునేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు. ప్రపంచ దేశాలు తమిళనాడు వైపు చూస్తున్నాయని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని గుర్తు చేశారు. దీనిని చూసి ఓర్వలేక , తమ ఎదుగుదలపై ఈర్ష్యతో కేంద్రం అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేస్తోందని ధ్వజమెత్తారు. అన్ని రంగాల్లో తమిళనాడు అగ్రస్థానంలో దూసుకెళ్తోందని, ద్రవిడ మోడల్ ప్రభుత్వ విధానాలే ఇందుకు కారణం అని అన్నారు. కేంద్రంలోని బీజేపీ పాలకులు ఎన్ని ఆంక్షలు, అడ్డంకులు సృష్టించినా, తాము వెనక్కి తగ్గబోమని క్షేత్రస్థాయిలోకి దూసుకెళ్లి ప్రజలను ఆదుకునేందుకు ఎల్లప్పుడూ డీఎంకే సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. తూత్తుకుడిలో విన్ ఫాస్ట్ తూత్తుకుడి జిల్లాలో విన్ ఫాస్ట్ ఆటో కంపెనీ రూ. 4 వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది. 3,500 మందికి ఇక్కడ ఉపాధి కల్పించే విధంగా నిర్మించనున్న పరిశ్రమ పనులకు సీఎం స్టాలిన్ శంకుస్థాపన చేశారు. చిల్లంతమ్ ఇండస్ట్రియల్ పార్క్‌లో వియత్నాంకు చెందిన విన్ ఫాస్ట్ ఆటో లిమిటెడ్ రూ. 16 వేల కోట్లను పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలి విడతగా రూ. 4 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్ వాహన ఉత్పత్తి పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధమైంది. ఒప్పందాలు జరిగిన 50 రోజుల్లో ఈ సంస్థకు అన్ని రకాల అనుమతులు, స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఆదివారం తూత్తుకుడిలో జరిగిన కార్యక్రమంలో ఈ పనులకు సీఎం స్టాలిన్ శంకుస్థాపన చేశారు. గత నెల జరిగిన పెట్టుబడుల మహానాడులో రూ.6,64,180 కోట్లకు సంబంధించిన ఒప్పందాలు జరిగినట్టు ఇందులో భాగంగా తొలి పరిశ్రమకు శంకుస్థాపన చేశామని ప్రభుత్వం ప్రకటించింది. విన్ ఫాస్ట్ ఆటో లిమిటెడ్, 7 రకాల ఎలక్ట్రిక్ వాహనాలు, 5 రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లు, రెండు రకాల ఎలక్ట్రిక్ బస్సుల తయారీకి ఇక్కడ పరిశ్రమను నెలకొల్పినట్టు వివరించారు. ఈ ప్లాంట్‌లో సంవత్సరానికి 1,50,000 వాహనాల ఉత్పత్తి సామర్థ్యమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో స్పీకర్ అప్పావు, మంత్రులు కేకేఎస్ఎస్ ఆర్. రామచంద్రన్, తంగం తెన్నరసు, గీతా జీవన్, అనిత ఆర్ రాధాకృష్ణన్, ఆర్.ఎస్. రాజకన్నప్పన్, మనో తంగరాజ్, టీఆర్పీ రాజా, తూత్తుకుడి ఎంపీ కనిమొళి, ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ప్రసంగం పూర్తి పాఠం చదవని గవర్నర్
రాష్ట్ర అసెంబ్లీ వేదికగా సోమవారం మరోమారు ప్రభుత్వం – గవర్నర్ మధ్య వివాదం భగ్గుమంది. ప్రభుత్వం సిద్ధం చేసి ఇచ్చిన ప్రసంగ పాఠాన్ని చదివేందుకు గవర్నర్ ఆర్ఎన్ రవి నిరాకరించారు. తొలుత తమిళంలో మాట్లాడుతూ అందరికీ ఆహ్వానం పలికిన ఆయన తర్వాత తనకు కేటాయించిన కూర్చీలో మౌనంగా కూర్చుండిపోయారు. దీంతో గవర్నర్ తరపున ఈ ప్రసంగం తమిళ తర్జుమా పాఠాన్ని స్పీకర్ అప్పావు సభకు వినిపించారు. ఇది ముగియగానే సభ నుంచి ఆర్ఎన్ రవి హఠాత్తుగా లేచి బయటకు వెళ్లి పోయారు. కాగా జాతీయ గీతం ఆలపించేందుకు ముందుగానే గవర్నర్ సభ నుంచి వెళ్లి పోవడం వివాదానికి దారి తీసింది. సాక్షి, చైన్నె: సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి – గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్లిన విషయం తెలిసిందే. గత ఏడాది అసెంబ్లీలో ప్రభుత్వ ప్రసంగాన్ని పక్కన పెట్టి, అందులో కొత్త అంశాలను గవర్నర్ చేర్చడం రచ్చకెక్కింది. ఇలాంటి పరిస్థితి ఈ ఏడాది పునరావృతం కాకుండా ముందుగానే గవర్నర్‌కు ప్రసంగంలోని అంశాలను ప్రభుత్వం పంపించింది. దీంతో కొత్త ఏడాదిలో తొలి సమావేశం వివాదాలకు ఆస్కారం లేకుండా గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమవుతుందని అందరూ భావించారు. అయితే సోమవారం అసెంబ్లీలో ఇందుకు భిన్నంగా పరిస్థితులు నెలకొన్నాయి. మరోమారు గవర్నర్ సభ నుంచి వాకౌట్ చేసినట్లుగా అర్ధాంతరంగా వెళ్లి పోవడం వివాదానికి దారి తీసింది. తొలి సమావేశం.. సెయింట్ జార్జ్ కోటలోని అసెంబ్లీ భవనంలో ఉదయం కొత్త ఏడాదిలో తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన గవర్నర్ ఆర్ఎన్ రవిని స్పీకర్ అప్పావు, అసెంబ్లీ కార్యదర్శి శ్రీనివాసన్ ఆహ్వానించారు. అసెంబ్లీ ఆవరణలో భద్రతా సిబ్బంది వద్ద గౌరవ వందనం స్వీకరించి, జాతీయ గీతం ముగియగానే సభలోకి గవర్నర్ అడుగు పెట్టారు. ఆయనకు సభలో సీఎం స్టాలిన్ మొదలు అందరు సభ్యులు లేచి నిలబడి ఆహ్వానం పలికారు. తమిళనాడు సభ నిబంధనలకు అనుగుణంగా తొలుత తమిళ తల్లి గీతం ఆలపించారు. ముందుగా జాతీయ గీతం ఆలపించాలన్న ప్రస్తావనను గవర్నర్ ఈ సమయంలో తీసుకొచ్చినట్లు సమాచారం. సభ నిబంధనలకు అనుగుణంగా తొలుత తమిళ తల్లి గీతం, చివర్లో జాతీయ గీతం ఆలపించడం జరుగుతుందని ఆయనకు స్పీకర్ అప్పావు వివరణ ఇచ్చినట్లు తెలిసిందే. తమిళ తల్లి గీతం తదుపరి గవర్నర్ ఆర్ఎన్ రవి తమిళంలో మాట్లాడుతూ అందరినీ ఆహ్వానించారు. ప్రభుత్వం సిద్ధం చేసి ఇచ్చిన ప్రసంగ పాఠాన్ని పక్కన పెట్టి కొన్ని వ్యాఖ్యలు చేసినానంతరం తనకు కేటాయించిన సీట్లో మౌనంగా కూర్చున్నారు. దీంతో గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రసంగ పాఠం తమిళ తర్జుమాను స్పీకర్ అప్పావు సభకు వినిపించారు. హఠాత్తుగా లేచి వెళ్లి పోయిన గవర్నర్ గవర్నర్ ప్రసంగాన్ని స్పీకర్ అప్పావు వివరిస్తూ రెండున్నర సంవత్సరాల డీఎంకే ప్రభుత్వ ప్రగతి, రికార్డులను, ప్రజాకర్షణ కార్యక్రమాలు, ప్రజా రంజక పాలన, ద్రవిడ మోడల్ గురింతి ప్రస్తావించారు. పుదుమై పెన్, కలైంజ్ఞర్ మగళిర్ తిట్టం, బడుల్లో అల్పాహార పథకం గురించి వివరిస్తూ దేశానికే ఇవి ఆదర్శంగా మారినట్లు పేర్కొన్నారు. నేరాల కట్టడిలో రాజీ లేదని, తమిళనాడు శాంతివనంగా ఉందని పేర్కొంటూ, పౌర చట్టాన్ని తమిళనాడులోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా జనగణనతో పాటు కుల గణనకు చర్యలు తీసుకోవాలని ప్రధానికి విజ్ఞిప్తి చేశారు. కచ్చదీవులలో తమిళ జాలర్లకు భద్రతకు చర్యలు తీసుకుంటామని, కావేరి తీరంలో మేఘదాతులో కర్ణాటక డ్యాం నిర్మాణ ప్రయత్నాలకు అడ్డుకుని తీరుతామని ప్రకటించారు. గ్లోబెల్ ఇన్వెస్టర్స్ మీట్, తాగునీటి పథకాలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఎగుమతులు, వైద్య రంగంలోనే కాదు క్రీడా రంగంలోనూ తమిళ ఖ్యాతిని చాటే విధంగా వ్యాఖ్యలు చేశారు. దివ్యాంగులకు పింఛన్‌ను రూ. 2 వేలు చేసినట్లు, స్వయం సహాక బృందాలకు రుణాలు తదితర అంశాలను ప్రస్తావిస్తూ, కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ వల్ల తమిళనాడుకు రూ. 20 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రకటించారు. మెట్రో ఫేజ్– 2 పనులకు నిధులు, అనుమతులు కరువయ్యాయని పేర్కొంటూ, గత ఏడాది చివర్లో తమిళనాట వరద విలయం గురించి ప్రస్తావించారు. తమిళనాడును ఆదుకునేందుకు కేంద్రం ముందుకు రాలేదని, కనీస నిధులు కూడా కేటాయించాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎం కేర్ నిధిలో వృథాగా ఉన్న నగదులో రూ.50 వేల కోట్లను తమిళనాడుకు ఇప్పించేందుకు గవర్నర్ ప్రత్యేక చొరవ చూపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రసంగం ముగింపు సమయంలో గాడ్సే అంటూ అప్పావు ఏదో వ్యాఖ్యలు చేయగానే గవర్నర్ హఠాత్తుగా తన సీట్లో నుంచి లేచి వాకౌట్ చేస్తున్న తరహాలో బయటకు వెళ్లి పోయారు. జాతీయ గీతాన్ని ఆలపించే ముందే గవర్నర్ హఠాత్తుగా సభ నుంచి బయటకు వెళ్లడం వివాదానికి దారి తీసింది. అదే సమయంలో సీనియర్ మంత్రి దురై మురుగన్ సభలో ఓ తీర్మానం ప్రవేశ పెట్టారు. ప్రభుత్వం సిద్ధం చేసి ఇచ్చిన గవర్నర్ ప్రసంగంలోని అంశాలను మాత్రమే సభా రికార్డులలో పొందు పరుస్తున్నట్లు, మిగిలినవన్నీ తొలగిస్తున్నట్లు ప్రకటించారు. గవర్నర్ సభ నుంచి వెళ్లి పోవడం విచారకరమని న్యాయ శాఖమంత్రి రఘుపతి విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని అగౌరవ పరిచే విధంగా గవర్నర్ వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంకే మిత్రపక్ష పార్టీల నేతలు, ఎమ్మెల్యేలు గవర్నర్ చర్యలను తీవ్రంగా ఖండించారు. నిబంధనలను విస్మరించిన గవర్నర్ ఈ సమావేశానంతరం స్పీకర్ అప్పావు నేతృత్వంలో సభా వ్యవహారాల కమిటీ భేటీ అయ్యింది. ఇందులో సభలో చర్చించాల్సిన అంశాలను, సభ నిర్వహణ తేదీలు, చర్చల వివరాలు, బడ్జెట్ దాఖలుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను స్పీకర్ అప్పావు మీడియాకు వివరించారు. 7 రోజుల పాటు సభ జరుగుతుందని ప్రకటించారు. 13వ తేదీ సంతాప తీర్మానాలు, 14, 15 తేదీలలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు, చర్చ, 16, 17, 18 తేదీలు సెలవు అని వివరించారు. ఈ నెల 19వ తేదీ ఆర్థిక బడ్జెట్, 20 వ్యవసాయ బడ్జెట్ దాఖలు చేయడం జరుగుతుందన్నారు. 21వ తేదీన ఆదాయ, వ్యయాలకు సంబంధించిన నివేదిక దాఖలు, 22న ఆర్థిక, వ్యవసాయ బడ్జెట్‌పై చర్చతో సభ ముగియనున్నట్లు వివరించారు. రోజూ సభ ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతుందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా గవర్నర్ అసెంబ్లీలో వ్యవహరించారని ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. గవర్నర్‌ను ఆహ్వానించిన క్రమంలోనే అసెంబ్లీ ఆవరణలో జాతీయ గీతం ఆలపించడం జరిగిందన్నారు. అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా జాతీయ గీతం ముందుగా ఆలపించాలని గవర్నర్ తనను కోరినట్లు, నిబంధనలు మార్చలేమని తాను స్పష్టం చేశానని వివరించారు. ప్రసంగం చదవకుండా గవర్నర్ మౌనంగా కూర్చోవడం శోచనీయమని, అసెంబ్లీని, ప్రజాస్వామ్యాన్ని అగౌరవ పరిచే విధంగా నిబంధనలకు విరుద్ధంగా ఆయన నడుచుకున్నారని విమర్శించారు. ఇదిలా ఉండగా అసెంబ్లీలో జైలు శిక్షతో అనర్హత వేటుకు గురైన మంత్రి పొన్ముడి సీటును మార్చకుండా, అలాగే ఉంచడం గమనార్హం. పస లేని ప్రసంగం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రధాన ప్రతి పక్ష నేత పళణిస్వామి మీడియాతో మాట్లాడుతూ, గవర్నర్ ప్రసంగాన్ని స్పీకర్ అప్పావు చదవి వినిపించారని గుర్తు చేస్తూ.. ఇందులో ఏమాత్రం పస లేదన్నారు. రుచి, శుచి లేని అంశాలే ఇందులో ఉన్నట్టు, ఇది పాచి పోయిన(కుళ్లిన) ప్రసంగంగా ఎద్దేవా చేశారు. ప్రభుత్వం – గవర్నర్ – స్పీకర్ మధ్య గొడవలకే అసెంబ్లీ వేదికగా మారిందని విమర్శించారు. తన ప్రసంగానికి ముందుగా జాతీయ గీతం ఆలపించాలని గవర్నర్ కోరినట్టు, ఇందుకు స్పీకర్ నిరాకరించడంతోనే ఆయన ప్రభుత్వ ప్రసంగాన్ని బహిష్కరించినట్లు వివరించారు. ప్రజలకు ఈ ప్రసంగం ద్వారా ఒరిగిందేమీ లేదని పేర్కొన్నారు. కొత్త పథకాలకు చోటు లేకున్నా, సొంత డబ్బాను మాత్రం ఈ పాలకులు ఈ ప్రసంగం ద్వారా బాగానే వాయించుకున్నారని ఎద్దేవా చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో అన్నాడీఎంకే ప్రవేశపెట్టిన ప్రాజెక్టులు, భవనాలకు ప్రస్తుతం రిబ్బన్ కట్టింగ్లు చేసుకుని తన ఘనత గా చెప్పుకుంటున్నారని విమర్శించారు. సమర్థించిన బీజేపీ గవర్నర్ అసెంబ్లీలో హుందాగా వ్యవహరించారని, నిబంధనలకు అనుగుణంగానే సభలో కూర్చున్నట్లు బీజేపీ శాసన సభా పక్ష నేత నయనార్ నాగేంద్రన్ తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్పీకర్ అప్పావు సభలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడమే కాకుండా, ఆయన చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలతో సభ నుంచి హఠాత్తుగా గవర్నర్ బయటకు వెళ్లి పోయారని వివరించారు. స్పీకర్ ప్రసంగాన్ని పూర్తి చేసే వరకు గవర్నర్ సభలోనే ఉన్నారని పేర్కొంటూ, తమిళ తల్లి గీతం, జాతీయ గతం వ్యవహారంలో అసెంబ్లీ నిబంధనలను తాము గౌరవిస్తున్నామన్నారు. స్పీకర్ తీరుతోనే సభలో గవర్నర్ మౌనంగా కూర్చున్నారని, చివరకు ఆయన బయటకు వెళ్లేంత పరిస్థితిని తీసుకొచ్చారని మండిపడ్డారు. -
Pooranam: చదువుల తల్లీ నీకు వందనం
కొందరు సంపాదించింది దాచుకుంటారు. కొందరు కొద్దిగా పంచుతారు. మరికొందరు ప్రతిదీ సమాజహితం కోసం ధారబోస్తారు. పేద పిల్లల స్కూల్ కోసం 7 కోట్ల విలువైన భూమిని దానం చేసింది తమిళనాడుకు చెందిన పూరణం. గత నెలలో మొదటిసారి ఆ పని చేస్తే ఇప్పుడు మరో 3 కోట్ల రూపాయల విలువైన భూమిని దానం చేసింది. సామాన్య క్లర్క్‌గా పని చేసే పూరణం ఎందరికో స్ఫూర్తి కావాలి. ప్రభుత్వం అన్నీ చేయాలని కోరుకోవడం సరికాదు. సమాజం తన వంతు బాధ్యత వహించాలి. ప్రజాప్రయోజన కార్యక్రమాలలో తన వంతు చేయూతనివ్వాలి. విమర్శించే వేయినోళ్ల కంటే సాయం చేసే రెండు చేతులు మిన్న అని నిరూపించింది తమిళనాడు మధురైకు చెందిన 52 సంవత్సరాల పూరణం అలియాస్ ఆయి అమ్మాళ్. ఆమె ఒక నెల వ్యవధిలో దాదాపు పది కోట్ల రూపాయల విలువైన భూమిని పేద పిల్లల చదువు కోసం దానం చేసింది. కెనెరా బ్యాంక్ క్లర్క్ మదురైలో కెనెరా బ్యాంక్‌లో క్లర్క్‌గా పని చేసే పూరణంలో పెళ్లయిన కొద్దిరోజులకే భర్తను కోల్పోయింది. మానవతా దృక్పథంతో అతని ఉద్యోగం ఆమెకు ఇచ్చారు. నెలల బిడ్డగా ఉన్న కుమార్తెను చూసుకుంటూ, కొత్తగా వచ్చిన ఉద్యోగం చేస్తూ జీవితంలో ఎన్నో కష్టాలు పడింది. కుమార్తె భవిష్యత్తు కోసం ఆమె కొని పెట్టిన స్థలాలు ఖరీదైనవిగా మారాయి. హటాత్ సంఘటన పూరణం కుమార్తె జనని రెండేళ్ల క్రితం అనారోగ్య కారణాలతో మరణించింది. జననికి సమాజ సేవ చాలా ఇష్టం. అంతేకాదు పేదపిల్లల చదువుకు కృషి చేసేది. ఒక్కగానొక్క కూతురు మరణించడంతో కూతురు ఆశించిన విద్యావ్యాప్తికి తాను నడుం బిగించింది పూరణం. తన సొంతవూరు కొడిక్కులంలోని 1.52 ఎకరాల స్థలాన్ని ఆ ఊరి స్కూలును హైస్కూల్‌గా అప్‌గ్రేడ్ చేసి భవంతి కట్టేందుకు మొన్నటి జనవరి 5న దానం చేసింది. మదురై చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌కు పట్టా అప్పజెప్పింది. దాంతో ఆమెకు రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రశంసలు దక్కాయి. ముఖ్యమంత్రి స్టాలిన్ మొన్నటి రిపబ్లిక్ డే రోజున ఆమెను సన్మానించాడు. అయితే రెండు రోజుల క్రితం పూరణం తనకున్న మరో 91 సెంట్ల భూమిని కూడా మరో స్కూల్ భవంతి నిర్మించేందుకు అప్పజెప్పింది. ఈ రెండు స్థలాల విలువ నేడు మార్కెట్లో పది కోట్లు ఉంటాయి. ‘బదులుగా నాకేమి వద్దు. ఆ స్కూల్ భవంతులకు నా కుమార్తె పేరు పెట్టండి చాలు’ అని కోరిందామె. ‘పల్లెటూరి పిల్లల చదువుల్లో వెలుగు రావాలంటే వారు బాగా చదువుకోవడమే మార్గం. పల్లెల్లో హైస్కూళ్లు చాలా అవసరం’ అందామె. -
Tamil Nadu: రాముడి పేరుతో పూజలు వద్దు.. సీతారామన్ సీరియస్
ఢిల్లీ: అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం సర్వాంగసుందరంగా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో బాలరాముడు భక్తజనానికి దర్శనం ఇవ్వనున్నాడు. మరోవైపు.. రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా తమిళనాడు ఆలయాల్లో రాముడి పూజలను రాష్ట్ర ప్రభుత్వం అనుమతించకపోవడం రాజకీయం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యం స్టాలిన్ సర్కార్‌పై కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సీరియస్ అయ్యారు. వివరాల ప్రకారం.. రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా తమిళనాడు ఆలయాల్లో రాముడి పూజలను రాష్ట్ర ప్రభుత్వం అనుమతించకపోవడాన్ని నిర్మలా సీతారామన్ తప్పుబట్టారు. ఈ క్రమంలోనే తమిళనాడు ప్రభుత్వ నిర్ణయం హిందూ వ్యతిరేక చర్యగా ఆమె అభివర్ణించారు. జనవరి 22న రామ మందిరంలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం లైవ్ టెలికాస్ట్నూ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిందని నిర్మల తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. TN govt has banned watching live telecast of #AyodhaRamMandir programmes of 22 Jan 24. In TN there are over 200 temples for Shri Ram. In HR&CE managed temples no puja/bhajan/prasadam/annadanam in the name of Shri Ram is allowed. Police are stopping privately held temples also… pic.twitter.com/G3tNuO97xS — Nirmala Sitharaman (@nsitharaman) January 21, 2024 ఇదిలా ఉండగా.. నిర్మలా సీతారామన్ ప్రకటనను దేవాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు తోసిపుచ్చారు. తమిళనాడు ఆలయాల్లో రాముడి పూజలు, అన్నదాన కార్యక్రమాలపై ఎలాంటి నిషేధం లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఇక తమిళనాడులో 200కుపైగా రామాలయాలు ఉన్నాయి. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో శ్రీరాముడి పేరుతో ఎలాంటి పూజలు, భజన, ప్రసాదం, అన్నదానం నిర్వహించరాదని ప్రభుత్వం పేర్కొంది. ప్రైవేట్ నిర్వహకుల చేతిలో ఉన్న ఆలయాల్లోనూ ఎలాంటి ఈవెంట్స్ చేపట్టరాదని అధికారులు కట్టడి చేశారు. ప్రైవేట్ వ్యక్తులకు చెందిన ఆలయాల్లోనూ ఎలాంటి ఈవెంట్లు నిర్వహించరాదని పోలీసులు ఆంక్షలు విధించడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో, ఈ విషయం పొలిటికల్‌గా చర్చనీయాంశంగా మారింది. -
మళ్లీ రెచ్చిపోయిన సింగర్ చిన్మయి.. తమిళనాడు సీఎంపైనే విమర్శలు!
ప్రముఖ సింగర్ చిన్మయి మరోసారి తన రెచ్చిపోయింది. తనని లైంగికంగా వేధించి, కెరీర్ సర్వనాశనం అయ్యేలా చేసిన వ్యక్తిపై, అతడితో పాటు ఉన్న కమల్ హాసన్, పి.చిదంబరం, సీఎం స్టాలిన్ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సింగర్ చిన్మయి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. (ఇదీ చదవండి: ఎంగేజ్మెంట్ చేసుకున్న 'దసరా' విలన్.. అమ్మాయి ఎవరో తెలుసా?) అసలేం జరిగింది? ప్రముఖ తమిళ రచయిత వైరముత్తు రాసిన 'మహా కవితై' పుస్తకావిష్కరణ తాజాగా చెన్నైలో జరిగింది. దీనికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి.చిదంబరం, స్టార్ హీరో కమల్‌హాసన్ తదితరులు హాజరయ్యారు. 'నన్ను వేధింపులకు గురిచేసిన వ్యక్తితో కలిసి తమిళనాడుకు చెందిన కొందరు ప్రముఖులు వేదికపై ఉన్నారు. అతడి గురించి బయటకు చెప్పిన నేను మాత్రం నిషేధానికి గురయ్యాను. కొన్నేళ్లపాటు నా వృత్తి జీవితాన్ని కోల్పోయాను. నా కోరిక నెరవేరేవరకు ప్రార్ధించడం మినహా నేను చేసేది ఏమీలేదు' అని చిన్మయి ట్వీట్స్ చేసింది. అసలేంటి గొడవ? సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ అయిన చిన్మయి.. 2018లో రైటర్ వైరముత్తుపై ఆరోపణలు చేసింది. తనని ఈయన లైంగికంగా వేధించాడని బయటపెట్టింది. మీటూ ఉద్యమం జరుగుతున్న సమయంలో చిన్మయి ఈ ఆరోపణలు చేసింది. ఈమెతో పాటు పలువురు కూడా వైరముత్తు నిజస్వరూపాన్ని బయటపెట్టారు. అయితే వైరముత్తుపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. తమిళ ఇండస్ట్రీలో చిన్మయిపై నిషేధం విధించారు. దీంతో అప్పటినుంచి వైరముత్తపై చిన్మయి ఎప్పటికప్పుడు విరుచుకపడుతూనే ఉంది. ఇప్పుడు కూడా అలానే వైరముత్తుకి సపోర్ట్ చేస్తున్న స్టాలిన్, కమల్ తదితరులపై కూడా విమర్శలు చేసింది. (ఇదీ చదవండి: న్యూ ఇయర్ స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 25 సినిమాలు) Some of the most powerful men in Tamilnadu platforming my molester whilst I got banned - years of my career lost. May the entire ecosystem that promotes and supports sex offenders whilst incarcerating honest people who speak up start getting destroyed from this very moment,… https://t.co/J7HcqJYAcV — Chinmayi Sripaada (@Chinmayi) January 1, 2024 Thodangi? yevangalta nyayathukku poganum? Ivangaltaya? Just check the number of politicians with Vairamuthu alone. How does one get justice in this ecosystem? https://t.co/0ubXKXZq7e pic.twitter.com/xjnVZL0xwb — Chinmayi Sripaada (@Chinmayi) January 1, 2024 -
విజయకాంత్ మృతి పట్ల మోదీ, స్టాలిన్ ఏమన్నారంటే..
దేశీయ ముర్పోక్కు ద్రావిడ కళగం (డీఎండీకే) వ్యవస్థాపకుడు విజయకాంత్ మృతి పట్ల ప్రధాని మోదీతో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంతాపం తెలిపారు. స్టాలిన్ సంతాప సందేశంలో, 'మా ప్రియ మిత్రుడు - నేషనల్ ప్రోగ్రెసివ్ ద్రావిడ సంఘం కెప్టెన్ విజయకాంత్ మరణ వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతితో పాటు ఎంతో బాధను కలిగించింది. మంచి మనసున్న మిత్రుడు విజయకాంత్ సినీ పరిశ్రమలోనూ, ప్రజా జీవితంలోనూ తన కఠోర శ్రమతో ఎన్నో విజయాలను అందుకుని ప్రజల పక్షాన నిలబడ్డారు. నటుడిగా, నటీనటుల సంఘం అధ్యక్షుడిగా, రాజకీయ పార్టీ నాయకుడిగా, శాసనసభ్యుడిగా, ప్రతిపక్ష నేతగా.. ఏ పని చేపట్టినా దానికే పూర్తిగా అంకితమై తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ ఆదరించారు. కుటుంబ స్నేహితుడిగా నాకు సుపరిచితుడు. అని స్టాలిన్ తెలిపారు. కొద్దిరోజుల నుంచి విజయకాంత్ తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి సమయంలో ఆయనకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో వెంటిలేటర్ సాయంతో చికిత్స పొందుతుండగా ఈరోజు (డిసెంబర్ 28) ఉదయం మృతి చెందాడు. విజయ్ కాంత్ మృతికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులతో పాటు పలువురు ప్రముఖుల సంతాపం తెలుపుతున్నారు. నేడు తమిళనాడు లోని అన్ని థియేటర్స్‌ను క్లోజ్ చేస్తున్నారు. అన్ని షో లు రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ కాంత్ నటించిన చివరి సినిమా మధుర విరన్ (2018)లో విడుదలైంది. ఆయన తమిళ చిత్రాల్లో మాత్రమే నటించడం విశేషం. ప్రధాని నరేంద్ర మోదీ: విజయకాంత్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. విజయకాంత్‌ను తమిళ సినిమా లెజెండ్ అంటూ మోదీ వ్యాఖ్యానించారు. అతని నటన లక్షల మంది హృదయాలను తాకింది. ఆపై రాజకీయ నాయకుడిగా, అతను తమిళనాడు రాజకీయాల్లో శాశ్వత ప్రభావాన్ని చూపారు. ప్రజా సేవలో ఉంటూ చాలా ఏళ్లుగా పోరాడారు. అతని మరణం తమిళనాట రాజకీయాల్లో పూడ్చడం కష్టతరమైనది.' అని మోదీ తన ఎక్స్ పేజీలో పోస్ట్ చేశారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై: 'అనారోగ్య సమస్యల కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డీఎండీకే అధినేత నా సోదరుడు కెప్టెన్ విజయకాంత్ మృతి చెందారని తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. నేడు ఒక మంచి నటుడిని, మంచి రాజకీయ నేతను కోల్పోయాం. ఆయన నాకు మంచి సోదరుడు.' అని తమిళిసై తెలిపారు. కమల్ హాసన్: నా సోదరుడు, డీఎండీకే అధ్యక్షుడు, విలక్షణ నటుడు విజయకాంత్ మరణవార్త ఎంతో తీవ్ర విషాదాన్ని నింపింది. తమిళనాడు రాజకీయాల్లో ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. రాజకీయాల్లో ఎంతో ధైర్యంగా ఆయన రానించారు. సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిన విప్లవ కళాకారుడు. తమిళనాట ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎన్టీఆర్: విజయకాంత్‌గారి మరణ వార్త ఎంతో బాధాకరం. సినిమా, రాజకీమాల్లో ఆయనొక పవర్‌హౌస్. సినీ పరిశ్రమ ఒక మంచి నటుడితో పాటు మనసున్న రాజకీయనాయకుడిని కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా.. చిరంజీవి: మన ‘పురట్చి కలైంగర్’, ‘కెప్టెన్’ విజయకాంత్ ఇక లేరని తెలిసి గుండె తరుక్కుపోయింది. అయనొక మంచి వ్యక్తిత్వంతో పాటు తెలివైన రాజకీయ నాయకుడు. అయన ఎప్పుడూ స్ట్రెయిట్ తెలుగు చిత్రాలలో నటించనప్పటికీ, ఇక్కడ కూడా ఆయనకు విపరీతమైన ప్రజాదరణతో పాటు ప్రేమను పొందాడు. మన ప్రియమైన ‘కెప్టెన్’ చాలా త్వరగా మనల్ని విడిచిపెట్టి తిరిగిరాని శూన్యాన్ని మిగిల్చాడు! ఆయన అభిమానులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక సానుభూతి. అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా.. మంచు విష్ణు: విజయకాంత్ గారు లేరని వార్త జీర్ణించుకోలేకపోతున్నా. ఆయన సినిమాలు చూస్తూనే నా బాల్యం అంతా గడిచింది. ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ నాలో గుర్తుండిపోతాయి. ఆయన ఎంతో అభిమానంతో మాట్లాడుతారు. రంగం ఏదైనా సరే ఆయన నిజమైన నాయకుడని మంచు విష్ణు తెలిపారు. సంతాపం తెలిపిన తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి విజయకాంత్ మృతి పట్ల తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి సంతాపం తెలిపింది. తెలుగు చిత్రసీమతో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి గౌరవ కార్యదర్శులు కె.ఎల్. దామోదర్ ప్రసాద్, టి. ప్రసన్న కుమార్ గుర్తుచేసుకున్నారు. ఆయన మరణం కుటుంబానికి అలాగే భారతీయ చలనచిత్ర పరిశ్రమకు తీరనిలోటని వారు తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని వారు ప్రార్థిస్తూ ఒక లేఖను విడుదల చేశారు. Extremely saddened by the passing away of Thiru Vijayakanth Ji. A legend of the Tamil film world, his charismatic performances captured the hearts of millions. As a political leader, he was deeply committed to public service, leaving a lasting impact on Tamil Nadu’s political… pic.twitter.com/di0ZUfUVWo — Narendra Modi (@narendramodi) December 28, 2023 உடல் நலக்குறைவால் மருத்துவமனையில் சிகிச்சை பெற்று வந்த தேமுதிக தலைவர்,சகோதரர் கேப்டன் திரு.விஜயகாந்த் அவர்கள் உயிரிழந்த செய்தியறிந்து மிகவும் மனவேதனை அடைந்தேன். நல்ல திரைப்படக்கலைஞர்.... நல்ல அரசியல் தலைவர்.... நல்ல மனிதர்.... நல்ல சகோதரர்.... ஒட்டுமொத்தமாக ஒரு நல்லவரை நாம்… pic.twitter.com/oPVTWZ1uRD — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) December 28, 2023 Heartbroken to know that our ‘Puratchi Kalingar’, ‘Captain’ Vijayakanth is no more. He was a wonderful human being, Hero of the Masses,a multi faceted personality and an astute politician. Though he never acted in straight Telugu films, he is hugely popular and loved by the… pic.twitter.com/r0N4olxFrL — Chiranjeevi Konidela (@KChiruTweets) December 28, 2023 -
Tamil Nadu: గవర్నర్ వెనక్కి పంపిన బిల్లులకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం
తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య రగులుతున్న వివాదం మరింత ముదురుతోంది. అసెంబ్లీ తీర్మానించిన బిల్లులను గవర్నర్ ఆమోదించడంలో జాప్యం చేస్తున్నారంటూ స్టాలిన్ ప్రభుత్వం ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో సర్కార్ వర్సెస్ గరర్నర్ మధ్య వైరం తారాస్థాయికి చేరింది. తాజాగా గవర్నర్‌కు వ్యతిరేకంగా సీఎం స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమైన తమిళనాడు అసెంబ్లీ.. గతంలో తీర్మానించిన 10 బిల్లులను మరోసారి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇటీవల రాష్ట్ర అసెంబ్లీ తీర్మానించిన 10 బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ వెనక్కి పంపిన నేపథ్యంలో ఆర్ఎన్ రవి చర్యపై తమిళనాడు ప్రభుత్వం శనివారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించింది. అయితే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు అన్న డీఎంకే, బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. బిల్లులపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో స్టాలిన్ మాట్లాడుతూ గవర్నర్‌పై నిప్పులు చెరిగారు. ప్రజాప్రతినిధులతో కూడిన అసెంబ్లీ తీర్మానించిన బిల్లులకు ఆమోదం తెలపడం గవర్నర్ బాధ్యత అని తెలిపారు. అయనకు ఏవైనా సందేహాలు ఉంటే దానిని ప్రభుత్వానికి తెలియజేయవచ్చని సూచించారు. గతంలో గవర్నర్ కొన్ని బిల్లులపై ప్రశ్నలు లేవనెత్తినప్పుడు రాష్ట్రం వెంటనే స్పందించించి వివరణ ఇచ్చిందని గుర్తు చేశారు. గవర్నర్ కోరిన వివరణను ప్రభుత్వం ఇవ్వని సందర్భం ఎప్పుడూ లేదని ప్రస్తవించారు. గవర్నర్ వద్ద 12 బిల్లులు పెండింగులో ఉన్నామని, ఎలాంటి కారణం చెప్పకుండా బిల్లులను నిలిపివేయడం తమిళనాడు ప్రజలను అవమానించడం, రాష్ట్ర అసెంబ్లీని అవమానించారని దుయ్యబట్టారు. చదవండి: వరల్డ్‌కప్ ఫైనల్.. క్రికెట్ అభిమానులకు భారతీయ రైల్వే శుభవార్త గవర్నర్ ప్రజలకు, ప్రజాస్వామ్యానికి, చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని స్టాలిన్ మండిపడ్డారు. గవర్నర్‌గా నియమితులైన వ్యక్తి రాష్ట్ర సంక్షేమం కోసం పని చేయాలని, ప్రభుత్వానికి అండగా ఉండాలని సూచించారు. అలా కాకుండా రాష్ట్ర పథకాలను ఎలా నిలిపివేయాలనే దాని గురించే గవర్నర్ ఆలోచిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది అప్రజాస్వామికం, ప్రజావ్యతిరేకమని విమర్శించారు. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లను అడ్డం పెట్టుకొని కేంద్రం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి కారణాలు చెప్పకుండా గవర్నర్ తిప్పి పంపిన 10 బిల్లులను మరోసారి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. తాజాగా ఆమోదం పొందిన బిల్లులలో 2020, 2023లో అసెంబ్లీ తీర్మానించిన రెండేసి బిల్లులు ఉండగా.. మరో ఆరు బిల్లులు 2022లోనే ఆమోదించినవి ఉన్నాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వైస్ ఛాన్సలర్ల నియామకంలో గవర్నర్ అధికారాలను తగ్గించేలా తీసుకొచ్చిన తీర్మానం, వ్యవసాయం, ఉన్నత విద్య వంటి అంశాలకు చెందినవి ఉన్నాయి. . ఇదిలా ఉండగా అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపడంలో గవర్నర్ జాప్యం చేస్తున్నారంటూ తమిళనాడు ప్రభుత్వం ఇటీవల సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. బిల్లుల విషయంలో గవర్నర్లు వ్యవహరంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నర్లు నిప్పుతో చెలగాటం ఆడుతున్నారని.. వారికి ఆత్మపరిశీలన అవసరమని పేర్కొంది. ఇది తీవ్ర ఆందోళనకరమైన అంశమని పేర్కొంది. అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులపై నిర్దేశిత సమయంలో నిర్ణయం తీసుకోవాలని గవర్నర్లను ఆదేశించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరిచి గత బిల్లులను ఆమోదించడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
కామ్రేడ్ శంకరయ్య కన్నుమూత.. నేరుగా ఆస్పత్రికి వెళ్లిన సీఎం స్టాలిన్
శతాధిక స్వాంతంత్య్ర సమరయోఢుడు, తమళనాడుకు చెందిన సీపీఎం సీనియర్ నేత ఎన్.శంకరయ్య(102) బుధవారం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో చైన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన ఆయన అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. విషయం తెలిసిన వెంటనే తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్కే స్టాలిన్ నేరుగా ఆస్పత్రికి వచ్చి ఎన్. శంకరయ్య పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఎన్. శంకరయ్య పార్థివ దేహాన్ని ఆయన నివాసానికి తీసుకెళ్లే ముందు అభిమానుల సందర్శనార్థం సీపీఎం కార్యాలయానికి తరలించనున్నారు. ఎన్. శంకరయ్య కన్నుమూత గురించి తెలియజేస్తూ తమిళనాడు సీపీఎం సోషల్ మీడియా ‘ఎక్స్’(ట్విటర్)లో పోస్ట్ చేసింది. కామ్రేడ్ శంకరయ్య భౌతికంగా మనకు దూరమైనా చరిత్ర ఉన్నంత వరకూ ఆయన మనతోనే ఉంటారని పేర్కొంది. స్వాంతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర అత్యంత సీనియర్ నాయకుడు, స్వాంతంత్య్ర సమరయోధుడిగా పేరొందిన ఎన్.శంకరయ్య భారత స్వాంతంత్య్ర ఉద్యమంలో చరుకైన పాత్ర పోషించారు. ఎన్నో విద్యార్థి ఉద్యమాలను నడిపించారు. 1995 నుంచి 2002 వరకు సీపీఎం తమిళనాడు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. తన రాజకీయ ప్రస్థానంలో మధురై వెస్ట్, మధురై ఈస్ట్ నియోజకవర్గాల నుంచి తమిళనాడు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. தோழர் என்.எஸ். மறைவு! #CPIM மாநிலச் செயலாளர் தோழர் கே.பாலகிருஷ்ணன், தமிழ்நாடு முதல்வர் மு.க.ஸ்டாலின் ஆகியோர் நேரில் அஞ்சலி செலுத்தினர். #ComradeNS #NSankaraiah #FreedomFighter #CommunistLeader #CPIMLeader More: https://t.co/46hnp062DE pic.twitter.com/h8lPadt4Pp — CPIM Tamilnadu (@tncpim) November 15, 2023 -
గవర్నర్‌పై కోర్టుకెక్కిన తమిళనాడు సర్కార్
చెన్నై/ఢిల్లీ: తమిళనాడు అధికార డీఎంకే ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య కొనసాగుతున్న విభేదాలు తారాస్థాయికి చేరినట్టు కనిపిస్తోంది. క్లియరెన్స్ కోసం పంపిన బిల్లుల ఆమోదాన్ని ఉద్దేశపూర్వకంగానే గవర్నర్ ఆర్ఎన్ రవి జాప్యం చేస్తున్నారనిఆరోపిస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నిర్దిష్ట గడువులోగా బిల్లులను ఆమోదించేలా లేదా పరిష్కరించేలా గవర్నర్‌ను ఆదేశించాలని ప్రభుత్వం కోర్టును కోరింది. అలా గత కొన్ని నెలలుగా సాగుతున్న మాటల యుద్ధం ఇపుడు కోర్టుకు చేరింది. రాష్ట్ర అసెంబ్లీ పంపుతున్న బిల్లులు, ఉత్తర్వులను గవర్నర్ రవి కావాలనే అడ్డుకుంటున్నారని, సకాలంలో ఆమోదించడం లేదని ప్రభుత్వం ఆరోపించింది. 54 మంది ఖైదీల ముందస్తు విడుదలకు సంబంధించిన పన్నెండు బిల్లులు, నాలుగు ప్రాసిక్యూషన్ ఆంక్షలు, ఫైళ్లు ప్రస్తుతం గవర్నర్ ముందు పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. ప్రజల అభీష్టాన్ని దెబ్బతీస్తూ రాజ్యాంగ అధికారాన్ని గవర్నర్ దుర్వినియోగం చేస్తున్నారని మండిపడింది. కాగా తమిళనాడు పేరును ‘తమిళగం’ అని మార్చాలంటూ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి చేసిన ఈ ఏడాది జనరిలో చేసిన వ్యాఖ్యలు తమిళనాట ప్రకంపనలు రేపాయి. అది మొదలు ఎంకే స్టాలిన్ ప్రభుత్వానికి, గవర్నర్‌కి మధ్య విభేదాలు రగులుతూ ఉన్నాయి పాలనా వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం చేసుకోవడమేంటని ప్రభుత్వం గట్టిగా ప్రశ్నిస్తోంది. అటు గవర్నర్ కూడా రాజ్యాంగం ఇచ్చిన హక్కుల మేరకు తన బాధ్యతలు నిర్వర్తించే అధికారం ఉందని వాదించారు.ఈ పరిణామాల నేపథ్యంలో ఒక సమయంలో అసెంబ్లీ నుంచి గవర్నర్ రవి వాకౌట్ చేసిన ఘటన సంచలనమైంది. -
ఇండియా కూటమి రాకతో
సాక్షి, చెన్నై: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారం చేపట్టి పార్లమెంట్ ఆమోదం పొందిన 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును అమల్లోకి తీసుకు రావడం తథ్యం అని ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆ పార్టీ మహిళా విభాగం నేతృత్వంలో చెన్నై వైఎంసీఏ మైదానంలో మహిళా హక్కు మహానాడు శనివారం రాత్రి జరిగింది. డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన, డీఎంకే ఎంపీ కనిమొళి నేతృత్వంలో జరిగిన ఈ మహానాడుకు ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ హాజరయ్యారు. ఆమె ప్రసంగిస్తూ, దేశంలో మహిళలు వివిధ రంగాలలో పురోగమిస్తున్నారని అన్నారు. మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం కావాలనే కాంక్షతో ఆది నుంచి కాంగ్రెస్ పొరాడుతున్నట్లు పేర్కొన్నారు. ఒక మహిళ చదువుకుంటే, ఆ కుటుంబమే చదువుకున్నట్లని వ్యాఖ్యానించారు. మహిళా నాయకత్వం విస్తృతం, మహిళ చేతికి అధికారంలోకి వస్తే దేశం బలోపేతం అవుతుందన్న కాంక్షతో గతంలోనే 33 శాతం రిజర్వేషన్ బిల్లును రాజ్యసభలో ప్రవేశ పెట్టామన్నారు. యూపీఏ హయాంలోనే ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందినా, ఏకాభిప్రాయం కుదరక పార్లమెంట్లో చట్టం ఆమోదం పొందలేక పోయినట్లు గుర్తుచేశారు. ఇప్పుడు ఆ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిందని గుర్తు చేస్తూ, దీనిని ఎప్పుడు అమలు చేస్తారో అన్నది స్పష్టం చేయడం లేదన్నారు. రేపు చేస్తారా..? ఎల్లుండి చేస్తారా..? ఏడాది తర్వాత చేస్తారా..? రెండేళ్ల తర్వాత చేస్తారా...? అని ప్రశి్నస్తూ, ఈ బిల్లు అమలు అన్నది రానున్న ఇండియా కూటమి ద్వారానే సాధ్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ఈ చట్టం కోసం కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేసిందని గుర్తుచేస్తూ, ఇండియా కూటమి రాకతో ఈ చట్టం అమల్లోకి రావడం తథ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాం«ధీ, జమ్మూకశీ్మర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, బిహార్ ఆహార శాఖ మంత్రి లేషి సింగ్, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ప్రధాన కార్యదర్శి అన్నీ రాజా, తృణమూల్ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి సుష్మితా దేవ్, ఢిల్లీ డిప్యూటీ స్పీకర్ రాఖీ తదితరులు పాల్గొన్నారు. -
తమిళనాట రసవత్తర రాజకీయం.. అన్నాడీఎంకే కీలక ప్రకటన
చెన్నై: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇటీవలే ఎన్డీయేకు గుడ్ బై చెప్పిన అన్నాడీఎంకే తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. వచ్చే పార్లమెంటు ఎన్నికల కోసం కొత్త కూటమిని ఏర్పాటు చేస్తామని అన్నాడీఎంకే వెల్లడించింది. ఈ క్రమంలో తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే, బీజేపీ పార్టీపై అన్నాడీఎంకే నేతలు ఘాటు విమర్శలు చేశారు. 2024 ఎన్నికల నాటికి కొత్త కూటమి.. అయితే, తమిళనాడులోకి క్రిష్ణగిరిలో అన్నాడీఎంకే నేత మునుస్వామి మీడియాతో మాట్లాడుతూ.. తమిళనాడు సీఎం స్టాలిన్, ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్ చెబుతున్నట్టు తాము బీజేపీతో తాము కూటమిలో లేమని స్పష్టం చేశారు. మేం బీజేపీతో పొత్తు తెంచుకుంటే ఎలా ఉంటుందో వారికి తెలుసు. అందుకే భయంతో వారు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీతో నాలుగేళ్ల బంధాన్ని తెంచుకున్నట్టు తెలిపారు. పళానిస్వామి సారథ్యంలో కొత్త కూటమిని ఏర్పాటు చేసి నాయకత్వం వహిస్తామన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం కొత్త కూటమిని ఏర్పాటు చేస్తామన్నారు. అన్నామలైపై కీలక ప్రకటన.. ఇదే సమయంలో తాము తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నమలైని పదవి నుంచి తొలగించాలని కోరలేదని స్పష్టం చేశారు. అన్నాడీఎంకే వంటి పెద్ద పార్టీ ఒక పార్టీని వారి రాష్ట్ర అధ్యక్షుడిని తొలగించాలని కోరుతుందని అనుకోవడం చిన్నపిల్లల మనస్తత్వం. మేం అలాంటి పొరపాటు ఎప్పుడూ చేయం. వేరే పార్టీ ఎలా పని చేయాలో చెప్పే అనాగరిక నేతలం మేం కాము. అన్నాడీఎంకే అలాంటి పార్టీ కాదని వివరణ ఇచ్చారు. మరోవైపు.. అన్నాడీఎంకే సీనియర్ నేత జయకుమార్ మీడియాతో మాట్లాడుతూ, పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఇకపై కార్యక్రమాలను విస్తృతం చేస్తామన్నారు. కొత్త కూటమి విషయంగా ఎన్నికల సమయంలో నిర్ణయం ఉంటుందని, తమ ప్రధాన కార్యదర్శి పళణిస్వామి అన్ని విషయాలను త్వరలో ప్రకటిస్తారన్నారు. స్పీడ్ పెంచిన పళణిస్వామి.. ఇదిలా ఉండగా.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టిన అనంతరం పళణి స్వామి పార్టీలో మార్పులు చేర్పులకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఖాళీగా ఉన్న ఆరు జిల్లాలకు కొత్త కార్యదర్శులను బుధవారం నియమించారు. మరికొన్ని జిల్లాల కార్యదర్శులలో స్వల్ప మార్పులు చేశా రు. అనుబంధ విభాగాలకు కార్యదర్శులను నియమించారు. ఈ మేరకు కన్యాకుమారి జిల్లా కార్యదర్శిగా మాజీ మంత్రి దళవాయి సుందరం, తిరుచ్చి మహానగర కార్యదర్శిగా మాజీ డిప్యూటీ మేయర్ శ్రీనివాసన్, పెరంబలూరు జిల్లా కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే తమిళ్ సెల్వం, తంజావూరు తూర్పు కుంబకోణం కార్యదర్శి రామనాథన్, తంజావూరు సెంట్రల్ జిల్లా కార్యదర్శిగా శరవణన్, తేని జిల్లా (తూర్పు) కార్యదర్శిగా రామర్, (పశ్చిమం) జక్కయ్యన్ను నియమించారు. అలాగే, రాణి పేట, తిరువణ్ణామలై, తిరునల్వేలి, తదితర మరికొన్ని జిల్లాలలో కార్యదర్శులు మార్పు జరిగింది. అయితే, ఒక జిల్లా నుంచి మరోజిల్లాకు కార్యదర్శుల పోస్టులను బదిలీ చేసే రీతిలో నియామకాలు జరిగాయి. అన్నామలైకి ఢిల్లీ నుంచి పిలుపు.. ఇదిలా ఉండగా, అన్నాడీఎంకే తమను పక్కన పెట్టిన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకు ఢిల్లీ నుంచి పిలుపురావడం గమనార్హం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో అన్నామలై భేటీలో ఎలాంటి అంశాలు చర్చకు రానున్నాయో వేచి చూడాల్సిందే. అదే సమయంలో ఈ భేటీ తర్వాత తమను టార్గెట్ చేసి ఐటీ, ఈడీ దాడులకు బీజేపీ సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నట్లు కొందరు అన్నాడీఎంకే సీనియర్లు పేర్కొంటుండడం గమనార్హం. ఇది కూడా చదవండి: మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తతలు.. రంగంలోకి సీనియర్ ఐపీఎస్.. ఎవరీ రాకేష్ బల్వాల్! -
బీజేపీ ప్రభుత్వ అవినీతిని బయటపెట్టండి : స్టాలిన్
చెన్నై: ప్రత్యేక పార్లమెంట్ సెషన్ల సందర్బంగా బీజేపీ ప్రభుత్వ అవినీతిని బట్టబయలు చెయ్యాలని డీఎంకే పార్టీ శ్రేణులను కోరారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. కాగ్ నివేదిక ఆధారంగా కేంద్ర బీజీపీ ప్రభుత్వం సుమారు రూ.7.50 లక్షల కోట్లు అవినీతికి పాల్పడిందని అవినీతితో పాటు మణిపూర్‌లో జరిగిన మారణకాండ గురించి కూడా ప్రస్తావించాలని డీఎంకే నేతలను కోరారు. తొమ్మిదేళ్లలో చాలా పెంచేశారు.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ మరోసారి కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమి గెలుపు కోసం పార్టీ శ్రేణులు మరింత కష్టపడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం 2014 నుంచి 2023 వ్యవధిలో పెట్రోల్ ధరలను విపరీతంగా పెంచి ప్రజలపై భారాన్ని పెంచేసిందన్నారు. 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు భారతదేశ రుణభారం రూ.55 లక్షల కోట్లు ఉండగా బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ రుణభారం రూ.155 లక్షల కోట్లకు చేరిందన్నారు. ముసుగు తొలగించండి.. కాగ్ నివేదిక ఆధారంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆయా ప్రభుత్వ పధకాల అమల్లో రూ.7.5 కోట్ల అవినీతికి పాల్పడిందని, ఆధారాలతో సహా వారి అవినీతిని బయట పెట్టాలని పార్టీ సభ్యులను కోరారు స్టాలిన్. బీజేపీ అవినీతికి ముసుగు వేసిందని ఆ ముసుగును ఎలాగైనా తొలగించాలని అన్నారు. బీజేపీ అమలు చేస్తోన్న ఒకే జీఎస్టీ విధానం రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని అన్నారు. జాతీయ విద్యా విధానం తమిళనాడులో విద్యా వ్యవస్థ పురోగతిపై ప్రభావం చూపిందన్నారు. అవినీతి అంతా ఇక్కడే.. స్టాలిన్ వ్యాఖ్యలపై తమిళనాడు రాష్ట్ర బీజేపీ వైస్ ప్రెసిడెంట్ నారాయణ తిరుపతి మాట్లాడుతూ బీజేపీ హయాంలో ఎల్పీజీ గ్యాస్ వినియోగదారుల సంఖ్య 14 కోట్లు నుంచి 34 కోట్లకి పెరిగిందని అందుకు తగ్గట్టుగానే ధర కూడా పెరుగుతూ వచ్చిందని ఇక కాగ్ నివేదికలో ఏదైనా అవినీతి ఉందంటే అది రాష్ట్ర ప్రభుత్వ హయాంలో జరిగినదేనని అన్నారు. ఇది కూడా చదవండి: ఇండియా కూటమిపై సీఎం ఏక్నాథ్ షిండే సెటైర్లు -
ఉదయనిధి వ్యాఖ్యల దుమారంపై మౌనం వీడిన సీఎం స్టాలిన్..
డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన దర్శంపై చేసిన వ్యాఖ్యల దుమారంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తొలిసారి స్పందించారు. ఉదయనిధి ఏం మాట్లాడారో తెలుసుకోకుండా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కామెంట్ చేయడం సరికాదని అన్నారు. కాగా సనాతన ధర్మాన్ని వ్యతికించడమే కాకుండా నిర్మూలించాలని మంత్రి ఉదయనిధి ఇటీవల ఓ సమావేశంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మంత్రిపై హిందూ సంఘాలు, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు.. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడటాన్ని ఆపేది లేదని ఉదయనిధి స్టాలిన్ మరోసారి స్పష్టం చేశారు. కుల వివక్ష లేకుండా అందరికీ అన్నీ దక్కాలన్నదే ద్రావిడ మోడల్ ఉద్దేశమని ఈ సందర్భంగా తెలిపారు. ఈ వ్యవహారంలో తనపై ఎలాంటి కేసులు వేసినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. దీంతో బీజేపీ, డీఎంకే మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతోంది. Hon'ble Minister @UdhayStalin didn't call for 'genocide' as distorted by BJP, but only spoke against discrimination. Disheartening to see the 'responsible' Hon'ble Prime Minister, Union Ministers and BJP Chief Ministers ignore facts and driven on fake narratives despite having… pic.twitter.com/F9yrdGjxqo — M.K.Stalin (@mkstalin) September 7, 2023 ప్రధాని మాటలు నిరుత్సాహపరిచాయి తాజాగా కొడుకు మాటల దుమారంపై తండ్రి స్టాలిన్ స్పందిస్తూ.. బీజేపీ వక్రీకరించినట్లు 'జాతి నిర్మూలన'కు మంత్రి పిలుపునివ్వలేదని కేవలం వివక్షకు వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడారని స్పష్టం చేశారు.వాస్తవాలను ధృవీకరించడానికి అన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ.. బాధ్యత కలిగిన ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు వాస్తవాలను విస్మరిండం, నకిలీ వార్తలను ప్రచారం చేయడం బాధ కలిగించిందన్నారు. తప్పుగా ప్రచారం చేస్తున్నారు సనాతన ధర్మం విషయంలో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై తప్పుగా విమర్శిస్తున్నారని స్టాలిన్ పేర్కొన్నారు. అణచివేత సూత్రాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు బీజేపీ అనుకూల శక్తులు అతని(ఉదయనిధి) వైఖరిని సహించలేకపోతున్నాయని మండిపడ్డారు. అందుకే ‘సనాతన ఆలోచనలు గల వ్యక్తులను నరమేధం చేయాలని ఉదయనిధి పిలుపునిచ్చాడంటూ తప్పుగా ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. బీజేపీ పెంచి పోషిస్తున్న ఓ వర్గం సోషల్ మీడియా గ్రూపు ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ అబద్ధాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తోందని విమర్శించారు. స్వామిజీపై ఏం చర్యలు తీసుకున్నారు? ఉధయనిధిన తల నరికి తీసుకువస్తే రూ. 10 కోట్లు ఇస్తామంటూ ఉత్తర్‌ప్రదేశ్ అయోధ్యకు చెందిన ఓ స్వామీజీ చేసిన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్టాలిన్ ఘాటుగా స్పందిస్తూ ఇలాంటి ప్రకటన చేసిన స్వామిపై ఏం చర్యలు తీసుకున్నారని యూపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అదే ఉదయనిధిపై అయితే కేసులు పెట్టారని అన్నారు. కేంద్ర కేబినెట్ భేటీలో ఉదయనిధి వ్యాఖ్యలను సమర్థంగా తిప్పికొట్టాలని ప్రధాని మోదీ చెప్పినట్లు మీడియా ద్వారా తెలిసిందని.. ఇది చాలా నిరాశ పరిచిందన్నారు. డీఎంకే ప్రతిష్టను దిగజార్చలని చూస్తే.. ‘ఏదైనా ఆరోపణలను, నివేదికను ధృవీకరించడానికి ప్రధాన మంత్రికి అన్ని అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. మరి ఉదయనిధిపై ప్రచారమవుతున్న అబద్ధాల గురించి ప్రధానికి తెలియదా, లేక తెలిసి అలా చేస్తున్నారా?. సనాతన వివక్షత పట్ల బీజేకిపీ అసలు పట్టింపు లేదు. ఒకవేళ డీఎంకే పార్టీ ప్రతిష్టను దిగజార్చాలని బీజేపీ ప్రయత్నిస్తే.. వారు ఆ ఊబిలో మునిగిపోతారు. కొందరు వ్యక్తులు ఇప్పటికీ ఆధ్యాత్మిక వేదికలపై మహిళలను కించపరుస్తారు, మహిళలు కొన్ని పని చేయకూడదు. వితంతువులు పునర్వివాహం చేసుకోకూడదని వాదిస్తున్నారు. మానవ జాతిలో సగానికి పైగా ఉన్న స్త్రీలపై అణచివేతను కొనసాగించడానికి వారు 'సనాతన' అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. అలాంటి అణచివేత సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాత్రమే ఉదయనిధి మాట్లాడాడు. ఆ సిద్ధాంతాలపై ఆధారపడిన పద్ధతులను నిర్మూలించాలని పిలుపునిచ్చారు’అని స్టాలిన్ తన కొడుకు వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. -
ఉదయనిధి వ్యాఖ్యల దుమారం.. స్టాలిన్ ఏమన్నారంటే..
సాక్షి, చెన్నై: తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చిన మంత్రి.. దానిని సమూలంగా నిర్మూలించాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ, హిందూ సంఘాల ఆందోళన తమిళనాడులో హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. సోషల్ మీడియా వేదికల్లోనూ ఉదయనిధిపై విమర్శలు గుప్పిస్తున్నాయి. గతంలో ఉదయనిధి చర్చ్, స్వామిజీ వద్దకు వెళ్లిన ఫోటోలు షేర్ చేస్తూ.. దీనికి సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు తమిళనాడు గవర్నర్‌ను బీజేపీ నేతలు కలిశారు. ఉదయనిధిపై క్రిమినల్ కేసులు పెట్టాలని గవర్నర్‌కు వినతి చేశారు. స్టాలిన్ వీడియోతో బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. మంత్రికి మద్దతుగా ప్రకాశ్ రాజ్ ఇక ఉదయనిధికి మద్దతుగా నటుడు ప్రకాశ్ రాజ్ నిలిచారు. సనాతన పార్లమెంట్ భవిష్యత్తు ఇలా ఉంటుందా అంటూ మోదీ స్వామీజీల పోటో షేర్ చేశారు. తాజాగా కొడుకు వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. ఉదయనిధి సనాతన ధర్మం వ్యాఖ్యలను సీఎం సమర్థిస్తూ బీజేపీపై విరుచుకుపడ్డారు. తన కుమారుడు చెప్పిన దాంట్లో అక్షరం ముక్క తప్పులేదని అన్నారు. ఉద్యోగాలు, ద్రవ్యోల్బణంపై మోదీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. చదవండి: Karnataka: బీజేపీ నేతలకు డీకే గాలం! బీజేపీ హయాంలో దేశం నాశనం.. తన పాడ్‌కాస్ట్ ‘స్పీకింగ్ ఫర్ ఇండియా’లో స్టాలిన్ మాట్లాడుతూ.. బీజేపీ తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మతాన్ని ఆయుధంగా వాడుతోందని మండిపడ్డారు. ప్రజల మతపరమైన భావాలను రెచ్చగొట్టి.. ఆ మంటల వెచ్చదనంలో బీజేపీ చలికాచుకోవాలని చూస్తోందని విమర్శించారు. భారత నిర్మాణాన్ని, దేశ ఐక్యతను నాశనం చేయాలని ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. ఇప్పుడు ఆపకపోతే ఎవరూ రక్షించలేరు 2002లో గుజరాత్ అల్లర్లు బీజేపీ హింస, ద్వేషానికి బీజాలు వేసిందన్నారు. ఇటీవల ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్, హర్యానాలో చెలరేగిన హింసాత్మక ఘర్షణలు వేలాది మంది అమయాక ప్రజల ప్రాణాలను, ఆస్తులను బలితీసుకుందని మండిపడ్డారు. ఇప్పటికైనా దీనిని అరికట్టకపోతే.. దేశాన్ని, భారతీయులను ఎవరూ రక్షించలేరని ఎంకే స్టాలిన్ హెచ్చరించారు. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన సీఎం పోడ్కాస్ట్ ఎపిసోడ్లో.. ఎన్నికలకు ముందు బీజేపీ ఇచ్చిన ఏ హామీని గత తొమ్మిదేళ్లలో నెరవేర్చలేదని స్టాలిన్ పేర్కొన్నారు. ప్రజలందరి ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.15 లక్షలు జమ కాలేదని, రైతుల ఆదాయాలు రెండింతలు కాలేదని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు కానీ జరగలేదని ముఖ్యమంత్రి బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారతదేశం మొత్తం మణిపూర్, హర్యానాగా మారకుండా నిరోధించడానికి ఇండియా కూటమి తప్పక గెలవాలన్నారు. చదవండి: జీ 20 సదస్సుకు జిన్‌పింగ్ గైర్హాజరు.. స్పందించిన బైడెన్ ఉదయనిధి స్టాలిన్ ఏమన్నారంటే.. ‘తమిళనాడు ప్రొగ్రెసివ్ రైటర్స్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ శనివారం ‘సనాతన నిర్మూలన’ పేరుతో నిర్వహించిన సమావేశంలో ఉదయనిధి స్టాలిన్ హాజరై ప్రసంగించారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని, దీనిని కేవలం వ్యతిరేకించడమే కకుండా.. పూర్తిగా తొలగించాలని వ్యాఖ్యానించారు. అది తిరోగమన సంస్కృతి అని.. ప్రజలను కులాలు పేరిట విభజించిందని పేర్కొన్నారు. సమానత్వానికి, మహిళా సాధికారతకు సనాతన ధర్మం వ్యతిరేకతమని అన్నారు. -
చూస్తూ ఉండండి..సనాతన ధర్మమే గెలుస్తుంది : అమిత్ షా
జైపూర్: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. జైపూర్‌లో 'పరివర్తన యాత్ర' ప్రారంభోత్సవంలో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా తీవ్ర స్థాయిలో స్పందించారు. త్వరలో రాజస్థాన్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దుంగార్పూర్ వేదికగా 'పరివర్తన యాత్ర'ను ప్రారంభించిన కేంద్ర మంత్రి అమిత్ షా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టే అర్ధమవుతుంది ఇండియా కూటమి హిందూత్వాన్ని వ్యతిరేకమని.. ఇది ఒకరకంగా హిందూత్వ వారసత్వంపై దాడి చేయడమేనని.. స్టాలిన్ తనయుడు చేసిన వ్యాఖ్యలు ఇండియా కూటమి ఓటు బ్యాంక్ రాజకీయాలకు, బుజ్జగింపు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. డీఎంకే నాయకుడి కుమారుడు.. కాంగ్రెస్ నేత కుమారుడు మారణహోమానికి పిలుపునిస్తున్నారని అన్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా గతంలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలను చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఆనాడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ రాడికల్ హిందూ సంస్థలు లష్కర్-ఏ-తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల కంటే ప్రమాదమని అన్నారు. మీ హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా ఇది హిందూ ఉగ్రవాదమని అన్నారు. కానీ ఈనాడు సనాతన ధర్మం ప్రజల మనుసును గెలుచుకుందని మళ్ళీ మోదీ అధికారంలోకి వస్తే సనాతన పరిపాలన వస్తుందని వారు ఆశాభావంతో ఉన్నారని అన్నారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఏళ్ళు అడ్డుకుందని.. మా హయాంలోనే రామ మందిరం నిర్మాణ పనులు మొదలయ్యాయని జనవరికల్లా మందిర నిర్మాణం పూర్తవుతుందని దాన్ని అడ్డుకోవడం కాంగ్రెస్ వల్ల కాదని అన్నారు. ఇక ఈరోజు ప్రారంభమైన 'పరివర్తన యాత్ర' 19 రోజుల పాటు 2500 కి.మీ కొనసాగుతుందని.. మొత్తం 52 నియోజకవర్గాల్లో 152 చిన్న సభలు.. 54 భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నామని.. అవినీతిలో పీకల్లోతు కూరుకుపోయిన అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని అన్నారు. అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ మాట్లాడుతూ ఉదయనిధి వ్యాఖ్యలను సమర్ధించడమే కాదు సనాతన ధర్మం మతం పేరిట ప్రాంతం పేరిట ప్రజలను వేరు చేసే సిద్ధాంతమని అన్నారు. ఉదయనిధి స్టాలిన్ కూడా అమిత్ షా వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ నేను చెప్పిందాంట్లో తప్పేమీ లేదని.. ఒక్క మాట కూడా వెనక్కి తీసుకోబోవడం లేదని స్పష్టం చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించడమంటే మానవత్వాన్ని, సమానత్వాన్ని కాపాడటమేనని అన్నారు. సనాతన ధర్మం వలన అణగారిన వర్గాల తరపునే నేను ఆ మాటలన్నానని తెలిపారు. మాజీ మంత్రి పి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం కూడా ఉదయ నిధి స్టాలిన్ వ్యాఖ్యలను సమర్ధిస్తూ.. కులం దేశానికి శాపమని అన్నారు. చెన్నైలో రైటర్ల సదస్సులో మాట్లాడుతూ స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చారు. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించలేమని నిర్మూలించడం ఒక్కటే మార్గమని అన్నారు. ఇది కూడా చదవండి: జమిలీ ఎన్నికలపై స్పందించిన రాహుల్.. ఏమన్నారంటే? -
సీఎం స్టాలిన్ కుమారుడు వివాదాస్పద వ్యాఖ్యలు..
చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా, కరోనాలతో పోల్చారు. దానిని వ్యతిరేకించడమే కాదు.. సమూలంగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు. సనాతన నిర్మూలన సదస్సులో మాట్లాడుతూ.. సనాతన ధర్మం సామాజిక న్యాయం, సమానత్వానికి విరుద్ధమని అన్నారు. 'కొన్నింటిని వ్యతిరేకించలేం. నిర్మూలించాల్సిందే. డెంగ్యూ, మలేరియా, కరోనాలను వ్యతిరేకించలేం. సనాతన అనేది సంస్కృత పదం. సామాజిక, సమానత్వానికి విరుద్ధం. నిర్మూలించాల్సిందే.' అని యువజన, క్రీడా అభివృద్ధి మంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు. 'సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై బీజెపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ విరుచుకుపడ్డారు. సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్న 80 శాతం జనాభా మారణహోమానికి ఉదయనిధి స్టాలిన్ పిలుపునిచ్చారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌కు చాలాకాలంగా మిత్ర పక్షంగా ఉంటోంది డీఎంకే. ముంబయి మీటింగ్‌లో ఇండియా కూటమి ఇదే నిర్ణయించిందా..? ' అని ప్రశ్నించారు. Udhayanidhi Stalin’s hate speech with Hindi subtitles. Rahul Gandhi speaks of ‘मोहब्बत की दुकान’ but Congress ally DMK’s scion talks about eradicating Sanatana Dharma. Congress’s silence is support for this genocidal call… I.N.D.I Alliance, true to its name, if given an… https://t.co/hfTVBBxHQ5 pic.twitter.com/ymMY04f983 — Amit Malviya (@amitmalviya) September 2, 2023 ఉదయనిధి స్టాలిన్ తన మాటలను సమర్ధించుకున్నారు. మారణహోమానికి పిలుపునివ్వలేదని అన్నారు. బలహాన వర్గాల పక్షాన తాను మాట్లాడినట్లు చెప్పారు. సనాతన ధర్మం కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజల పక్షాన మాట్లాడినట్లు పేర్కొన్నారు. I never called for the genocide of people who are following Sanatan Dharma. Sanatan Dharma is a principle that divides people in the name of caste and religion. Uprooting Sanatan Dharma is upholding humanity and human equality. I stand firmly by every word I have spoken. I spoke… https://t.co/Q31uVNdZVb — Udhay (@Udhaystalin) September 2, 2023 'ఎలాంటి న్యాయపరమైన సవాలునైనా ఎదుర్కొనేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. కాషాయ బెదిరింపులకు మేము భయపడము. పెరియార్, అన్నా, కలైంజ్ఞర్ అనుచరులమైన మేము సామాజిక న్యాయాన్ని నిలబెట్టడానికి, సమానత్వ సమాజాన్ని స్థాపించడానికి ఎప్పటికీ పోరాడుతాము.' అని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. Bring it on. I am ready to face any legal challenge. We will not be cowed down by such usual saffron threats. We, the followers of Periyar, Anna, and Kalaignar, would fight forever to uphold social justice and establish an egalitarian society under the able guidance of our… https://t.co/nSkevWgCdW — Udhay (@Udhaystalin) September 2, 2023 ఇదీ చదవండి: ఈడీ కస్టడీకి జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ నరేష్ గోయల్ -
‘మేధావి’కి ఘన స్వాగతం
చెన్నై: ప్రపంచకప్ చెస్ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఫైనల్ వరకు చేరిన భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద తన స్వస్థలం చెన్నై చేరుకున్నాడు. ప్రతిష్టాత్మక చదరంగ వేదికపై తనదైన ముద్ర వేసి తిరిగొచ్చిన ఈ 18 ఏళ్ల కుర్రాడిని సొంత నగరం ఆత్మీయంగా అక్కున చేర్చుకుంది. అతనికి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఒకవైపు ఆత్మీయులు, సన్నిహితులు ఆనందంగా తమవాడికి వెల్కమ్ చెప్పగా, మరోవైపు తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆ రాష్ట్ర సాంప్రదాయ నృత్యాలు కరగట్టం, ఒయిలట్టంలతో విమానాశ్రయం బయట కళాకారులు ప్రజ్ఞానందకు స్వాగతం పలికారు. పూలు, శాలువాలు, పుష్పగుచ్చాలతో మిత్రులు, అభిమానులు ప్రజ్ఞను ముంచెత్తారు. ‘నాకు లభించిన ఈ స్వాగతం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను’ అంటూ జాతీయ పతాకాన్ని చేతిలో ప్రదర్శిస్తూ ప్రజ్ఞానంద వ్యాఖ్యానించాడు. అతని తల్లి నాగలక్ష్మి కూడా తన ఆనందాన్ని దాచుకోలేకపోయింది. అనంతరం ప్రజ్ఞానంద, అతని తల్లిదండ్రులు నాగలక్ష్మి, రమేశ్‌బాబులను తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, క్రీడా శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ సన్మానించారు. ఈ సందర్భంగా ప్రజ్ఞానందకు జ్ఞాపికతోపాటు రూ. 30 లక్షలు నగదు పురస్కారం అందజేశారు. అజర్‌బైజాన్‌లోని బాకులో జరిగిన ‘ఫిడే’ వరల్డ్ కప్ ఫైనల్లో వరల్డ్ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్ చేతిలో ఓడిన ప్రజ్ఞానంద రన్నరప్‌గా నిలిచాడు. -
కశ్మీర్ ఫైల్స్‌కు జాతీయ సమైక్యత అవార్డా?.. తప్పు పట్టిన సీఎం
కేంద్ర ప్రభుత్వం గురువారం 69వ సినీ జాతీయ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసారి తెలుగు చిత్ర పరిశ్రమ అత్యధిక అవార్డులను కై వసం చేసుకుంది. అదేవిధంగా తమిళ చిత్ర పరిశ్రమ ఆశాజనకమైన అవార్డులను గెలుచుకుంది. నటుడు కమల్ హాసన్ వంటి పలువురు సినీ ప్రముఖులు దక్షిణాది చిత్ర పరిశ్రమ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి ఈ అవార్డులు చిహ్నంగా పేర్కొన్నారు. అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ జాతీయ ఉత్తమ అవార్డులకు ఎంపికైన చిత్రాలకు, దర్శక నిర్మాతలకు ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. అందులో కశ్మీర్ ఫైల్స్ చిత్రానికి నర్గీస్‌దత్ పేరుతో జాతీయ సమైక్యత అవార్డును ప్రకటించడాన్ని తప్పుపట్టారు. పలు విధాలుగా వివాదాలను ఎదుర్కొన్న కశ్మీర్ ఫైల్స్ లాంటి చిత్రాలకు ఇలాంటి అవార్డులకు ప్రకటించడం దేశ సమైక్యతను దెబ్బ తీస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇకపోతే ఉత్తమ చిత్రంగా రాకెట్రీ:ది నంబి ఎఫెక్ట్‌ను ప్రకటించగా.. ప్రాంతీయ భాషలో ఉత్తమ చిత్రంగా ఉప్పెనకు జాతీయ అవార్డు అనౌన్స్ చేశారు. ఉత్తమ నటుడిగా పుష్ప:పార్ట్ 1 సినిమాకు అల్లు అర్జున్, ఉత్తమ నటిగా గంగూబాయి కతియావాడి సినిమాకుగానూ ఆలియా భట్, మిమీ చిత్రానికిగానూ కృతి సనన్ ఎంపికయ్యారు. #69thNationalFilmAwards -இல் தமிழில் சிறந்த படமாகத் தேர்வாகியிருக்கும் #கடைசிவிவசாயி படக்குழுவினருக்கு என் பாராட்டுகள்! @VijaySethuOffl #Manikandan #நல்லாண்டி மேலும், #இரவின்நிழல் படத்தில் ‘மாயவா சாயவா’ பாடலுக்காகச் சிறந்த பின்னணிப் பாடகி விருதை வென்றுள்ள @shreyaghoshal,… pic.twitter.com/Bc2veRY5gs — M.K.Stalin (@mkstalin) August 24, 2023 జాతీయ అవార్డుల పూర్తి జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి చదవండి: అమ్మా, నాన్న పెళ్లి చేసుకోమంటున్నారు.. కానీ: విజయ్ దేవరకొండ -
తగ్గేదేలేదు!
సాక్షి, చైన్నె: రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్రవి, సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరు పతాక స్థాయికి చేరింది. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన 13 ముసాయిదాలు రాజ్‌భవన్ ఇప్పటికే తుంగలో తొక్కింది. మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీ వ్యవహారంలో అత్యుత్సాహాన్ని గవర్నర్ ప్రదర్శించారు. అదే సమయంలో గుట్కా తదితర కేసుల విచారణకు అనుమతి కోరుతూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదిక విషయంలో అన్నాడీఎంకే మాజీ మంత్రులకు అభయం కల్పించే విధంగా గవర్నర్ కొత్త మెలికలు పెట్టారు. ప్రభుత్వం నుంచి పంపించే ప్రతి నివేదికను కొద్ది రోజులు పెండింగ్‌లో పెట్టడం, తర్వాత వెనక్కి పంపించడం ఆయనకు పరిపాటిగా మారింది. ఈ పరిణామాలు డీఎంకే పాలకుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ఇప్పటికే గవర్నర్‌ను ఓ రాజకీయ నాయకుడిగా చిత్రీకరిస్తూ డీఎంకే మంత్రులు, కూటమి పార్టీలు సవాళ్లను విసిరే పనిలో పడ్డాయి. దమ్ముంటే పదవికి రాజీనామా చేసి రాజకీయంగా ఢీ కొట్టేందుకు సిద్ధం కావాలనే హెచ్చరికలు చేస్తూ వస్తున్నాయి. ఆదివారం నీట్ వ్యవహారంలో గవర్నర్ తీరుకు వ్యతిరేకంగా అధికార పక్షానికి చెందిన అనుబంధ విభాగాలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు హోరెత్తించాయి. ఇందులో మంత్రి ఉదయ నిధి స్టాలిన్‌తో పాటు మరికొందరు గవర్నర్‌ను ఏక వచనంతో పిలుస్తూ, తీవ్రవిమర్శలు, ఆరోపణలు, హెచ్చరికలు, సవాళ్లు చేశారు. అయితే, వీటన్నింటికి తాను భయ పడబోనని , ఇంకా చెప్పాలంటే తగ్గేదేలేదు అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంగళవారం గవర్నర్ ఆర్ఎన్రవి దూకుడు పెంచడం గమనార్హం. టీఎన్పీఎస్సీపై పీఠముడి.. రాష్ట్రంలో గత ఏడాది కాలంగా ఖాళీగా ఉన్న టీఎన్పీఎస్సీ చైర్మన్ పదవిని భర్తీ చేయడానికి జూన్‌లో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. చైర్మన్ పదవిలో అప్పటి డీజీపీ శైలేంద్రబాబును నియమించేందుకు నిర్ణయించారు. పదవీ విరమణ చేయగానే ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించి గౌరవించే విధంగా సీఎం స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. శైలేంద్రబాబుతో పాటు మరో 8 మంది సభ్యుల నియామకానికి ఆమోద ముద్ర వేయాలని రాజ్‌భవన్‌కు పంపించిన సిఫార్సును రెండు నెలలుగా పట్టించుకోలేదు. ఈక్రమంలో ఎట్టకేలకు మంగళవారం ఈ నివేదికకు వ్యతిరేకంగా గవర్నర్ స్పందించారు. చైర్మన్, సభ్యుల నియామకంపై అనేక ప్రశ్నలు సంధించారు. ఎంపికకు ముందుగా బహిరంగ ప్రకటన ఇచ్చారా..? సుప్రీంకోర్టు ఉత్తర్వులను అనుసరించారా..? అని ప్రశ్నలు సంధించారు. అలాగే అనేక నిబంధనలను ఉల్లంఘనలను ఎత్తి చూపుతూ నివేదికను వెనక్కి పంపించారు. ఈ ఘటన డీఎంకే పాలకులకు పుండు మీద కారం చల్లినట్లుగా మారింది. ఏదేని నివేదిక, ఫైల్స్‌ను ఆమోదం కోసం పంపిస్తే కొన్ని నెలలు, లేదా సంవత్సరం కాలానికి పైగా పెండింగ్‌లో పెట్టడం..తర్వాత వెనక్కు పంపించడం ఈ గవర్నర్‌కు పరిపాటిగా మారిందని డీఎంకే నేత ఆర్ఎస్ భారతి మండి పడ్డారు. అదే సమయంలో టీఎన్పీఎస్సీ ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉన్న దృష్ట్యా, గవర్నర్‌కు వివరణ ఇవ్వడమా..? లేదా, తన అధికారాలను ప్రయోగించి నేరుగా సీఎం ఏదైనా నిర్ణయం తీసుకుంటారా? అన్న చర్చ జోరందుకుంది. అదే సమయంలో గవర్నర్ మరో అడుగు ముందుకు వేసి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖకు వ్యతిరేకంగా విద్యాసంస్థలకు లేఖలు రాయడం రచ్చకెక్కింది. స్టేట్ సిలబస్ అమలుచెయొద్దని వర్సిటీలకు ఆదేశాలు ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, స్వయంప్రతిపత్తిహోదా కలిగిన విద్యా సంస్థలు, వర్సిటీల పరిధిలోని కళాశాలలో ఒకే రకమైన సిలబస్ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం గత నెల ఆదేశాలు ఇచ్చింది. దీనికి వ్యతిరేకంగా వర్సిటీలకు, విద్యా సంస్థలకు గవర్నర్ ప్రత్యేక ఆదేశాలతో లేఖ పంపించడం చర్చకు దారి తీసింది. తమిళనాడు ఉన్నత విద్యలో జనరల్ సిలబస్‌కు ఆస్కారం లేదని వివరించారు. అనేక విద్యా సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై వచ్చిన సమాచారం, ఫిర్యాదులు, వివరాల మేరకు జనరల్ సిలబస్ అమలును ఖండిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం విద్యా వ్యవస్థ స్వతంత్రతకు తీవ్ర నష్టం కలిగించడమే కాకుండా, విద్యాప్రమాణాలను తగ్గిస్తాయని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ఉన్నత విద్యా పరంగా పార్లమెంట్లో చేసిన చట్టం మేరకు అనేక అంశాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నట్లు వివరించారు. ఇక యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జనరల్ సిలబస్ తీసుకొచ్చిందని, దీనిని అమలు చేయవద్దని అన్ని విద్యా సంస్థలను గవర్నర్ ఆదేశించడం గమనార్హం. అలాగే మద్రాసు పేరును గతంలోనే ప్రభుత్వం చైన్నెగా మార్చేసింది. దీంతో అప్పటి నుంచి చైన్నె డేగా అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే, చైన్నె డే అని కాకుండా, మద్రాసు డే అని పేర్కొంటూ గవర్నర్ మంగళవారం శుభాకాంక్షల తెలియజేస్తూ లేఖ విడుదల చేయడాన్ని తమిళాభిమానులు వ్యతిరేకిస్తున్నారు. -
‘నీట్’ నుంచి మినహాయించేదాకా ఉద్యమిస్తాం
చెన్నై: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్) నుంచి తమిళనాడును మినహాయించేదాకా తమ ఉద్యమం ఆగదని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తేల్చిచెప్పారు. ‘నీట్’ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అధికార డీఎంకే నేతృత్వంలో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలను, ఆందోళనలు నిర్వహించారు. నిరాహార దీక్షలు సైత చేపట్టారు. నీట్ రద్దు అనేది రాజకీయపరమైన డిమాండ్ కాదని, అందిరికీ సమాన అవకాశాలు లభించాలన్నదే తమ ఉద్దేశమని స్టాలిన్ చెప్పారు. ఈ పరీక్ష నుంచి తమిళనాడు మినహాయించేలా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని వెల్లడించారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటి ఎదుట ధర్నా చేస్తామని పేర్కొన్నారు. ఈ ధర్నాలో పాల్గొనాలని విపక్ష ఏఐఏడీఎంకేకు స్టాలిన్ సూచించారు. అయితే, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే నీట్‌ను తీసుకొచ్చానని ఏఐఏడీఎంకే నేత, మాజీ సీఎం పళనిస్వామి గుర్తుచేశారు. -
తండ్రీకొడుకుల్ని బలిగొన్న నీట్.. స్టాలిన్ ఆవేదన
చెన్నై: ఎంబీబీఎస్ చదవాలనే కలను చెరిపేసిన నీట్ పరీక్ష.. 19 ఏళ్ల ఓ విద్యార్థిని బలవన్మరణం వైపు అడుగులేయించింది. కొడుకు లేదనే బాధ తట్టుకోలేని ఆ తండ్రి సైతం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమిళనాడు నుంచి మరో నీట్ మరణం నమోదుకాగా.. ఆవేదన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పనిలో పనిగా గవర్నర్ ఆర్ఎన్ రవికి చురకలు అంటించారు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీ ఎదుగుదలకు ఆటంకంగా ఉన్న నీట్ పరీక్షను ఎట్టి పరిస్థితుల్లో రద్దు అయ్యి తీరుతుంది. అందుకోసం ప్రభుత్వం న్యాయపరమైన మార్గం ద్వారా ప్రయత్నాలు చేస్తోందని అని సీఎం స్టాలిన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమిళనాట నీట్ పరీక్ష కారణంగా విద్యార్థులు చనిపోతుండడం తెలిసిందే. ఈ క్రమంలో నీట్ రద్దు కోసం జ్యూడిషియల్ కమిటీ ద్వారా తమ వంతు ప్రయత్నాలు సైతం చేసింది స్టాలిన్ ప్రభుత్వం. నీట్ రద్దు కోసం అసెంబ్లీ తీర్మానం ద్వారా బిల్లును(anti Neet Bill) తీసుకురాగా.. గవర్నర్ ఆర్ఎన్ రవి మాత్రం దానిని ఆమోదించడం లేదు. నీట్ పరీక్ష జరిగాల్సిందేనని గవర్నర్ రవి తన అభిప్రాయం చెబుతున్నారు. ఈ క్రమంలో.. స్టాలిన్ ఇవాళ్టి ప్రకటనలోనూ నీట్ హద్దులు రానున్న కొన్నినెలల్లో బద్దలై తీరతాయని పేర్కొన్నారు. సంతకం చేయను అని ఎవరైతే అంటున్నారో.. రాజకీయ మార్పులు చోటుచేసుకుంటే వాళ్లు ఎలాగూ కనిపించకుండా పోతారు. అప్పుడు అన్నిమార్గాలు సుగమం అవుతాయి అని తన ప్రకటనలో పేర్కొన్నారాయన. చెన్నైకి చెందిన జగదీశ్వరన్ (19) అనే విద్యార్థి రెండుసార్లు నీట్ రాసినా అర్హత సాధించలేదు. దీంతో శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొడుకు మరణం తట్టుకోలేక తండ్రి సెల్వశేఖర్ సైతం సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ తండ్రీకొడుకుల మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన స్టాలిన్.. ఇవే చివరి నీట్ మరణాలు కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పంద్రాగస్టు తేనీటి విందు బహిష్కరణ నీట్ వ్యతిరేక బిల్లు విషయంలో గవర్నర్ చేస్తున్న తాత్సారం, నీట్ జరిగి తీరాలనే మొండిపట్టును తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ క్రమంలో పంద్రాగస్టుకు గవర్నర్ ఆర్ఎన్రవి ఇస్తున్న తేనీటి విందును బహిష్కరిస్తున్నట్లు సీఎం స్టాలిన్ స్వయంగా ప్రకటించారు. మరోవైపు బాధిత కుటుంబాన్ని ఆ రాష్ట్ర మంత్రి ఉదయ్‌నిధి స్టాలిన్ పరామర్శించారు. குறைந்த மதிப்பெண்(160) பெற்ற என்னால் MBBS 25 லட்சம் பணம் கட்டி படிக்க முடிகிறது 400 மதிப்பெண் எடுத்த நண்பர் ஜெகதீசனால் MBBS சேர முடியவில்லை. - மறைந்த மாணவர் ஜெகதீசனின் நண்பர் ஃபயாஸ்தின்.#NEET #BanNeet pic.twitter.com/6ooI0y5H4E — Raj ✨ (@thisisRaj_) August 14, 2023 -
కేంద్రంపై సీఎం స్టాలిన్ సీరియస్.. కారణం ఇదే..
చెన్నై: హిందీ విషయంలో కేంద్రం వర్సెస్ తమిళనాడు అన్నట్టుగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కేంద్రం భారత్‌లో నేర సంబంధిత న్యాయ వ్యవస్థలో కీలక మార్పులకు సిద్దమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ చట్టాలను వేరే కొత్త చట్టాలతో భర్తీ చేయనుంది. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య బిల్లను అమిత్ షా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఇక, ఈ బిల్లులపై తమిళనాడు అధికార పార్టీ డీఎంకే సంచలన కామెంట్స్ చేసింది. ఇక, కేంద్రం బిల్లులకు హిందీ పేర్లు పెట్టడం పట్ల డీఎంకే అభ్యంతరం వ్యక్తపరిచింది. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ.. కేంద్రం తెచ్చిన మూడు బిల్లులకు హిందీ పేర్లు పెట్టడం భాషా సామ్రాజ్యవాదమని మండిపడ్డారు. ఇది సమైక్య భారత దేశ మూలాలను కించపరచడమే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో తమిళంపై కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో తమిళం అనే పదాన్ని పలకడానికి బీజేపీకి, ప్రధాని మోదీకి హక్కు లేదన్నారు. డీకాలనైజేషన్ పేరుతో రీకాలనైజేషన్ చేస్తున్నారని విమర్శించారు. ఇది కచ్చితంగా తమ గుర్తింపును వెనక్కి నెట్టే ప్రయత్నమేనని తీవ్ర ఆరోపణలు చేశారు. మరోవైపు.. కేంద్రం తెచ్చిన బిల్లులపై పార్లమెంట్లో డీఎం ఎంపీ విల్సన్ సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు. సభలో విల్సన్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం హిందీని దేశమంతటికీ రుద్దుతోందన్నారు. ఈ మూడు బిల్లుల పేర్లను ఇంగ్లిష్‌లోకి మార్చాలని డిమాండ్ చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. దీంతో, డీఎంకే నేతల వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇది కూడా చదవండి: 'మణిపూర్ సమస్యకు సర్జికల్ స్ట్రైక్ ఒక్కటే మార్గం..' -
State Govt: వృద్ధాప్య పింఛన్ రూ. 1200కు పెంపు..
సాక్షి, చైన్నె: రాష్ట్రంలో వృద్ధాప్య, ఆదరణ లేని వారికి అందజేస్తున్న పింఛన్ మొత్తాన్ని పెంచుతూ రాష్ట్ర మంత్రివర్గం శనివారం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై లబ్ధిదారులకు నెలకు రూ. 1200 పెన్షన్ అందజేయనున్నారు. అలాగే మణిపూర్‌లో అల్లర్ల నేపథ్యంలో అక్కడున్న తమిళుల జాడ కోసం ఆరా తీశారు. తమిళులకు అండగా నిలబడే విధంగా ప్రత్యేక బృందాన్ని మణిపూర్‌కు పంపించేందుకు కసరత్తు చేపట్టారు. వివరాలు.. రాష్ట్రమంత్రి వర్గం శనివారం ఉదయం సచివాలయంలో జరిగింది. సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి దురై మురుగన్, పొన్ముడి, నెహ్రూ, తంగం తెన్న రసు, ఎంఆర్కే పన్నీరు సెల్వం, ఐ. పెరియస్వామి, ఏవీ వేలు, కేకేఎస్ఎస్ఆర్ రామ చంద్రన్, ఉదయ నిధి స్టాలిన్, శేఖర్‌బాబు, ఎం. సుబ్రమణియన్, గీతా జీవన్ , కయల్ వెలి సెల్వరాజ్ తదితర మంత్రులు హాజరయ్యారు. సీఎస్ శివదాస్ మీన సమావేశ ముఖ్య ఉద్దేశాన్ని మంత్రులకు వివరించారు. ఆగస్టు నుంచి.. కేబినెట్ సమావేశానంతరం ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు మీడియాతో మాట్లాడుతూ, కేబినెట్లో చర్చించిన కొన్ని ముఖ్య అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో పలు పథకాలు అమల్లో ఉన్నాయని గుర్తు చేస్తూ, వాటి గురించి సమీక్షించామన్నారు. ప్రత్యేక ప్రతిభావంతులు, దివ్యాంగులు, వృద్ధులు, ఆదరణ లేని వారు, వితంతువులు, భర్త వదిలి పెట్టడంతో ఒంటరిగా ఉన్న మహిళలు, 50 ఏళ్లు అవుతున్నా ఇంత వరకు వివాహం చేసుకోని వారు అంటూ పలు రకాల పింఛన్లు అందజేస్తున్నామని గుర్తుచేశారు. ఈ ఫించన్లను 1962 నుంచి అమలు చేస్తున్నామని, అప్పట్లో నెలకు రూ. 20 అందజేయగా ప్రస్తుతం రూ. 1000కు చేరినట్టు పేర్కొన్నారు. ఇటీవల ప్రత్యేక ప్రతిభావంతులు, దివ్యాంగులకు రూ. 1000గా ఉన్న పింఛన్‌ను రూ. 500 పెంచి రూ. 1500 చేశామన్నారు. రాష్ట్రంలో 35,55,857 మంది వివిధ రకాల పింఛన్లను అందుకుంటున్నారని వివరించారు. కొత్త పెన్షన్ ఆగస్టు నుంచి అందజేస్తామన్నారు. ఇక ప్రత్యేక ప్రతిభావంతులకు, దివ్యాంగులకు వచ్చే ఏడాది జనవరి నుంచి పెంచిన పింఛన్ పంపిణీ చేస్తామన్నారు. ప్రస్తుతం పింఛన్ కోసం 74 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం వృద్ధాప్య, ఆదరణ లేని తదితర వారికి అందజేస్తున్న ఫించన్‌ను రూ. 1000 నుంచి రూ. 1200గా పెంచుతూ కెబినెట్లో ఆమోద ముద్ర వేసినట్లు వివరించారు. ఈ పెంపు కారణంగా ఏడాదికి ప్రభుత్వంపై రూ. 845.91 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. కార్మికుల సంక్షేమం పరిధిలోని 1.34 లక్షల మంది భవన నిర్మాణ పరిధిలోని వారికి సైతం ఈ పింఛన్ పెంపు వర్తిస్తుందని ప్రకటించారు. కలైంజ్ఞర్ మహిళల హక్కు పథకం లబ్ధిదారుల ఎంపికలో భాగంగా సోమవారం నుంచి రాష్ట్రంలో 36 వేల శిబిరాలు నిర్వహించనున్నామన్నారు. ఈ శిబిరాలను చైన్నెలో సీఎం స్టాలిన్ ప్రారంభిస్తారన్నారు. ఇప్పటి వరకు 80 లక్షల మందికి దరఖాస్తులు, టోకెన్లను అందజేశామన్నారు. పలు అంశాలపై సుదీర్ఘ చర్చ.. రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు, మంత్రులను గురి పెట్టి ఈడీ చేపడుతున్న దాడులు, గవర్నర్ ఆర్ఎన్ రవి తీరు, మహిళకు రూ. 1000 నగదు పంపిణీ పథకం దరఖాస్తుల అందజేత, శాఖల వారీగా జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల తీరు తెన్నులను సీఎం సమీక్షించినట్లు తెలిసింది. అలాగే కొత్త పరిశ్రమలకు అనుమతులు, రాష్ట్రంలోకి పెట్టుబడులు, పలు ఒప్పందాలు, తదితర అంశాల గురించి చర్చ జరిగినట్లు సమాచారం. ప్రధానంగా మణిపూర్ వ్యవహారం గురించి సమీక్షించినట్టు తెలిసింది. మణిపూర్‌లో ఇరు సామాజిక వర్గాల మధ్య నెలకొన్న అల్లర్ల నేపథ్యంలో అక్కడున్న తమిళుల క్షేమం గురించి సమీక్షించారు. 10 వేల మంది తమిళులు మణిపూర్‌లో ఉన్నట్టు గుర్తించి వారి జాడ కోసం ఆరా తీశారు. అలాగే వారిని కలిసి భద్రతకు భరోసా ఇవ్వడం లేదా, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిచేందుకు వీలుగా ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. ఈ బృందాన్ని మణిపూర్‌కు పంపించాలని నిర్ణయించారు. అలాగే వృద్ధులకు ఆదరణ లేని వారికి, ప్రత్యేక ప్రతిభావంతులకు అందజేస్తున్న పింఛన్ పెంపు అంశాల గురించి సమీక్షించారు. -
నా హృదయం ముక్కలైంది!
సాక్షి, చైన్నె: మణిపూర్‌లో మహిళపై లైంగిక దాడుల ఘటన తన హృదయాన్ని గాయపరిచిందని సీఎం స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు. దారుణ పరిస్థితులు ఆ రాష్ట్రంలో ఉండటం మరింత వేదనకు గురి చేస్తోందన్నారు. వివరాలు.. మణిపూర్‌లో రెండు సామాజిక వర్గాల మధ్య రెండు నెలలకు పైగా జరుగుతున్న వివాదంతో ఆ రాష్ట్రం తగల బడుతున్న విషయం తెలిసింది. ఈ పరిస్థితుల్లో ఓ సామాజిక వర్గానికి చెందిన మహిళపై మరో సామాజిక వర్గం చెందిన వారు లైంగిక దాడులకు పాల్పడటం, ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసిన వీడియో గురువారం వెలుగులోకి వచ్చి దేశాన్ని కుదిపి వేస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై సీఎం స్టాలిన్ స్పందిస్తూ, ఇలాంటి ఘటనలు చూస్తే, మానవత్వం మచ్చుకై నా ఆ రాష్ట్రంలో కనిపించకుండా పోయినట్టుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను అందరూ వ్యతిరేకించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరణశిక్ష విధించాలి.. ఈ వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు, నటి కుష్భు మాట్లాడుతూ, ఈ ఘటనను రాజకీయ కోణంలో కాకుండా, మహిళలకు జరిగిన తీవ్ర అన్యాయంగా తాను చూస్తున్నానని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్ విచారణ చేపట్టిందన్నారు. ఏ ఒక్కరినీ ఈ వ్యవహారంలో విడిచి పెట్టకూడదని, అందరికీ మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి మాట్లాడుతూ, మణిపూర్‌లో మహిళలు ఏవిధంగా దాడులకు గురి అవుతున్నారో వీడియో రూపంలో వెలుగులోకి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. లైంగిక దాడులు తన హృదయాన్ని ద్రవింప చేస్తున్నాయన్నారు. ఇప్పుడు మణిపూర్ తగల బడుతోందని, తదుపరి ఇలాంటి పరిణామాలు ఇతర రాష్ట్రాలకు పాకే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రధాని మోదీ నోరు మెదపాలని డిమాండ్ చేశా రు. అన్నాడీఎంకే నేత జయకుమార్ మాట్లాడు తూ, తాజా వీడియోలో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని స్పష్టం అవుతోందన్నారు. అక్కడి ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేంద్రం తక్షణం అక్కడి ప్రజలకు భద్రత కల్పించాలని కోరారు. -
Tamilnadu: ఢిల్లీలో చక్రం తిప్పే తమిళ తంబి ఎవరో..?
డీఎంకే అధ్యక్షుడు, సీఎంగా ఎంకే స్టాలిన్, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎంగా పళణిస్వామి జాతీయ రాజకీయాల్లో రాణించడమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇందుకోసం రానున్న లోక్‌సభ ఎన్నికలను ఈ ఇద్దరూ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ భేటీలో పళణి స్వామికి ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ పక్కనే కూర్చునే అవకాశం రావడం అన్నాడీఎంకే వర్గాల్లో అమితానందాన్ని నింపింది. ఇక బెంగళూరులో జరిగిన ఐ.ఎన్.డి.ఐ.ఎ భేటీలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ పక్కనే కూర్చోవడంతో పాటు జాతీయ స్థాయి ప్రతిపక్షాల కూటమిలో స్టాలిన్‌కు సముచిత స్థానం దక్కడం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో ఎవరు చక్రం తిప్పుతారనే చర్చ జోరందుకుంది. సాక్షి, చైన్నె: జాతీయ రాజకీయాల్లో తమిళనాడు పాత్ర ఎప్పుడూ కీలకంగానే ఉంటున్నాయి. దివంగత నేతలు కామరాజర్, అన్నాదురై, ఎంజీఆర్ వంటి వారు జాతీయ రాజకీయాలలో రాణించిన వారే. అయితే, జాతీయ రాజకీయాలను శాసించిన ఘనత మాత్రం దివంగత డీఎంకే అధినేత, కలైంజ్ఞర్ కరుణానిధి, మాజీ సీఎం జయలలితలకే దక్కింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని అప్పట్లో కుప్ప కూలడంలో జయలలిత కీలక పాత్రే పోషించారు. ఇక, యూపీఏ అధికారంలోకి రావడంతో పాటు, ఆ కేబినెట్లలో అత్యధిక స్థానాలను దక్కించుకుని జాతీయ స్థాయిలో తమిళ ఖ్యాతిని చాటిన నేత మాత్రం కరుణానిధి. ప్రస్తుతం ఈ ఇద్దరు నేతలూ జీవించి లేరు. జయలలిత మరణంతో అన్నాడీఎంకే ముక్కలు కావడం ,నాయకత్వ లోటు నెలకొనడం వంటి పరిణామాలలో ఆ పార్టీని తన గుప్పెట్లోకి తీసుకుని బల నిరూపణలో పళణి స్వామి సఫలీకృతులు అవుతున్నారు. అదే సమయంలో కరుణానిధి మరణంతో డీఎంకే అధ్యక్ష పగ్గాలు చేపట్టి గత లోక్‌సభ ఎన్నికల్లో తన సత్తాను స్టాలిన్ చాటుకున్నారు. అలాగే 2021 అసెంబ్లీ ఎన్నికలలో గెలుపుతో రాష్ట్ర అధికార పగ్గాలు చేపట్టిన స్టాలిన్ తాజాగా జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషించే దిశగా వ్యూహాలకు పదును పెట్టారు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన రాష్ట్రానికి చెందిన ఇద్దరు మహానాయకులు ప్రస్తుతం జీవించి లేకున్నా, ఆ పార్టీల బలాన్ని అస్త్రంగా చేసుకుని ఢిల్లీ పెద్దలు స్టాలిన్, పన్నీరు సెల్వంకు ఎన్డీఏ, ఇండియా కూటముల్లో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం విశేషం. పళణికి మోదీ అభయం.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పళణి స్వామి రాజకీయ వ్యూహాలకు పదును పెట్టమే కాకుండా, తన బలాన్ని చాటే ప్రయత్నాలను విస్తృతం చేశారు. ఈ సమయంలో ఎన్డీఏ కూటమిలోని అన్నాడీఎంకేకు కేంద్ర ప్రభుత్వ ప్రధాన్యం ఇవ్వడమే కాకుండా, ఢిల్లీలో జరిగిన సమావేశానికి తనను ఆహ్వానించడం పళణి స్వామిలో మరింత ఉత్సాహాన్ని నింపింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పక్కనే కూర్చోవడమే కాకుండా, సమావేశానికి హాజరైన నేతలందరినీ కలిసి తన ఉనికి చాటుకునే విధంగా పళణి జోరు పెంచడం గమనార్హం. ఈ సమావేశం ముగించుకుని బుధవారం చైన్నెకు చేరుకున్న పళణిలో మరింత ఉత్సాహం తొణికిసలాడడం.. ప్రత్యర్థి పన్నీరు సెల్వాన్ని మరింత షాక్‌కు గురి చేసింది. రానున్న ఎన్నికల ద్వారా జాతీయ స్థాయిలో సత్తాచాటాలంటే అత్యధిక ఎంపీ స్థానాల కైవసం చేసుకోవాలని పళణి భావిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో కూటమికి నేతృత్వం వహించి అన్నాడీఎంకేకు పెద్ద దిక్కుగా తన బలాన్ని చాటుకోవాల్సిన అవసరం ఉంది. ఇక, రాష్ట్రంలో అన్నాడీఎంకే నేతృత్వంలోనే కూటమి ఉంటుందని పళణి స్పష్టం చేయడం విశేషం. జాతీయ స్థాయిలో తాము ఎన్డీఏతోనే ఉంటామని, రాష్ట్రానికి వచ్చేసరికి అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక అవినీతికి కేరాఫ్ అడ్రస్సుగా మారిన డీఎంకేకు మున్ముందు అన్నీ ఓటములే ఎదురుకానున్నాయంటూ ఆయన పేర్కొనడం గమనార్హం. తిరుగులేని స్టాలిన్.. స్టాలిన్‌కు జాతీయస్థాయి నేతలతో ఎప్పటి నుంచో పరిచయాలు, సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కరుణానిధి ప్రతినిధిగా అప్పట్లో ఆయన అనేక పార్టీల నేతలను కలిసిన సందర్భాలు ఉన్నాయి. ఇది ప్రస్తుతం జాతీయ రాజకీయాలలో రాణించే ప్రయత్నాలకు కలిసి వస్తోంది. దేశంలో కాంగ్రెస్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న పార్టీ డీఎంకే. ఇది వరకు కాంగ్రెస్ కూటమిలో కీలకంగా ఉన్న డీఎంకే, ప్రస్తుతం రెండు రోజుల సమావేశానంతరం బెంగళూరు వేదికగా కొత్తగా ఆవిర్భవించిన ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ (ఐఎన్డీఐఏ–ఇండియా)లోనూ అదే ఊపును కొనసాగించే వ్యూహాలకు పదును పెట్టింది. బెంగళూరులో రెండు రోజుల పాటు జరిగిన సమావేశంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ పక్కనే కూర్చోవడమే కాకుండా, సోనియా, మమత, నితీష్‌కుమార్ , శరద్ పవార్, కేజ్రీవాల్ వంటి నేతలతో స్టాలిన్ కలిసి పోవడం గమనార్హం. తన ప్రసంగంలోనూ జాతీయ స్థాయి అంశాలను పదే పదేస్టాలిన్ ప్రస్తావించడాన్ని బట్టి మున్ముందు ఢిల్లీలో తన తండ్రి, దివంగత నేత కరుణానిధి తరహాలో చక్రం తిప్పేందుకు స్టాలిన్ ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో ఆయన ఏ మేరకు సఫలీకృతులు అవు తారో 2024 వరకు వేచి చూడాల్సిందే. ఈ ఎన్నికల్లో పుదుచ్చేరితో పాటుగా తమిళనాడులోని 40 స్థానాలను కై వశం చేసుకుని జాతీయ స్థాయిలో తన బలాన్ని చాటేందుకు స్టాలిన్ సిద్ధమవుతున్నారు. ఇందుకు అద్దం పట్టే విధంగా ఆయన రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న అన్నా డీఎంకే, బీజేపీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. ఢిల్లీ సమావేశంలో పళణి స్వామిని మోదీ తన పక్కన కూర్చోబెట్టుకున్న అంశాన్ని ప్రస్తావిస్తూ, ఇకపై వారికి అవినీతి గురించి మాట్లాడే అర్హత ఉందా..? ఇదే హాస్యాస్పదం అని స్టాలిన్ చమత్కరించడం గమనార్హం. -
నియంత్రించాం.. నష్టపోతున్నాం: స్టాలిన్
చెన్నై: దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణతో ఆయా రాష్ట్రాలు నియోజకవర్గాలను కోల్పోతున్నాయని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. స్టాలిన్ తాజాగా ‘ది వీక్’ వార్తాసంస్థతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘ దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలుచేస్తూ దేశానికి మేలుచేస్తున్నాయి. కానీ అదేసమయంలో ఈ ప్రాంతంలో జనాభా క్షీణించడంతో నియోజకవర్గాల సంఖ్య తగ్గుతోంది. ఈ పరిణామం దక్షిణాది రాష్ట్రాలకు పెద్ద నష్టం. ఉత్తరాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ పథకాలను సరిగా అమలుచేయలేక చేతులెత్తేశాయి. అయినాసరే ఎక్కువ లోక్‌సభ స్థానాలను దక్కించుకోనున్నాయి. తమకు ఓటు వేయని దక్షిణాది రాష్ట్రాలపై పగ తీర్చుకునేందుకు ఈ ‘జనాభా ప్రాతిపదికన సీట్లు’ విధానాన్ని అమలుచేయాలని బీజేపీ భావిస్తోంది. ఈసారి ఎన్నికల్లో గెలిస్తే దీనిని అమలుచేసేందుకు బీజేపీ ఉవి్వళ్లూరుతోంది. అయినాసరే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీల మధ్య బేదాభిప్రాయాలు తుడిచిపెట్టుకుపోతాయి. ప్రతిపక్షానికి ఏకైక నిర్వచనంగా కాంగ్రెస్ అవతరిస్తుంది. దేశానికి సరికొత్త నమ్మకంగా రాహుల్ గాంధీ నిలిచారు’ అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. -
సమాఖ్య స్ఫూర్తికి తిలోదకాలు!
రాష్ట్రాల అధికారాలను కేంద్ర పాలక వర్గ పార్టీలు మింగేయడం, ఎన్నడూ లేని విధంగా గవర్నర్ల అధికారాలకు కొమ్ములు మొలవడం బాబూ రాజేంద్ర ప్రసాద్ దేశాధ్యక్షుడిగా ఉన్నంతవరకూ మనం ఎరగం! ఆ తర్వాతి పాలక వర్గాల ఇష్టానుసార పరిపాలనకు ఉత్తరప్రదేశ్‌కు పార్లమెంటులో అత్యధికంగా ఉన్న 80 స్థానాలు ఆసరా అయి, దేశ రాజకీయాల్ని శాసిస్తూ దక్షిణాది రాష్ట్రాల్ని శాసింపజూస్తూ వస్తున్నాయి. ఆ ధోరణిలో భాగమే తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వాన్ని శాసించే విధంగా అక్కడి గవర్నర్ రాష్ట్ర మంత్రుల్ని బర్తరఫ్ చేయడానికి సాహసించడం! మరీ విచిత్రమైన విషయం.. వలసపాలనలో గవర్నర్లుగా పనిచేసిన వారు చలాయించిన అధికారాలకు, స్వతంత్ర భారతంలో గవర్నర్ల అధికారాలకు మధ్య భేదాన్ని కూడా గ్రహించలేనంతగా దృష్టి లోపంతో ఉన్నారు నేటి పాలకులు. ఒకనాడు తమదంటూ ‘చిరునామా’ కూడా లేక పరాయి పంచల్లో బతుకుతోన్న తెలుగువారిని వెన్ను తట్టి వేల సంవత్సరాల తెలుగు భాషా, సాంస్కృతిక మూలాలను గుర్తు చేసి వారిలో చైతన్యం నింపిన మహా నాయకులెందరో! ఆ నాయకులలో ఆచరణశీలురు, ఉద్యమస్ఫూర్తి ప్రదాతలు అయిన పొట్టి శ్రీరాములు, ఎన్.టి. రామారావు ముఖ్యులు. ఆంధ్రోద్యమ ఉద్ధృతిలో ఈ ఇరువురి ప్రవేశం ఉత్తరోత్తర భారతదేశ ఫెడరల్ స్ఫూర్తికే తలమానికంగా నిలిచింది. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినవారిలో 112మంది కన్నడిగులు కాగా, కన్నడ తెలుగువారు 69మంది! ఈ విశిష్టతను వెల్లడిస్తూ ఒక కన్నడ తెలుగు మిత్రుడు ఒక లేఖను విడుదల చేశారు. దాని సారాంశం – ‘‘ఆంధ్ర, తెలంగాణాలు మట్టుకే తెలుగు తావులు కావు. తెలుగు నేల ఎంత పెద్దదంటే, విందెమల నుండి వానమాముల వరకూ, వంగ కడలి నుండి పడమటి కనుమల దాకా పరుచుకున్నది తెలుగు నేల. ఈ నేలను కొన్ని కోట్ల మంది తెలుగువారితో పాటు కన్నడిగులు, తమిళులు, ఒరియా, మరాఠీ, గోండీ వాళ్లూ పంచుకుని ఉన్నారు. ఈ క్రమంలో తెలుగు ‘నుడి’ అన్నది భాషా సంబంధమైన నుడికారాలు, నానుడుల సంపదలో బాగా నష్టపోయింది. తెలుగు జాతికి గల ఈ సంపదను గుర్తించాల్సింది బయటి వాళ్లు కాదు, తెలుగు వాళ్లమైన మనమే’’నని కన్నడ – తెలుగు సోదరులు జ్ఞాపకం చేయవలసి వచ్చింది! తెలుగు జాతికి గల అటువంటి సంపద గుర్తింపునకు ఉద్యమరూపంలో స్ఫూర్తిదాయకంగా నిలిచిన వారు పదహారణాల ఆంధ్రులైన పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్. దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం వచ్చిందని అందరూ సంబరపడుతున్న వేళ .. ఆ ముహూర్తాన్ని ముమ్మూర్తులా అనుభవించడానికి నోచుకోనిది పరాయి పంచన జీవిస్తున్న మహోన్నత చారిత్రక, సాంస్కృతిక చరిత్ర గల ఆంధ్రులేనన్న సంగతి మరచిపోరాని ఘట్టం! నాటి చీకటి రోజుల నుంచి ఆంధ్రులను చైతన్యంలోకి, ఆచరణలో తీసుకురావడంలో పొట్టి శ్రీరాములు, ఎన్టీ రామారావుల పాత్ర అనుపమానం! అలాగే, అడుగడుగునా కేంద్ర పాలకులపైన రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆధారపడే పాలకవర్గ సంస్కృతిని రాష్ట్రాలు చేధించేటట్టు చేసిన ఖ్యాతి ఎన్టీఆర్‌ది! కేంద్ర రాష్ట్ర సంబంధాలు కేవలం ఫెడరల్ సంబంధాలే గాని, కేంద్ర పాలకులకుల యుక్తులపై ఆధారపడేవి కావని చాటి చెప్పి రాష్ట్రాల ఫెడరల్ స్ఫూర్తికి దోహదం చేశారాయన. అలా పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్‌ల దూరదృష్టి ఫలితమే నేడు దేశంలోని పలు కాంగ్రెస్, బీజేపీ పాలకుల కుయుక్తులకు అడ్డుకట్టలు వేయడానికి అవకాశమిస్తోంది! రాష్ట్రాల అధికారాలను కేంద్ర పాలక వర్గ పార్టీలు మింగేయడం, ఎన్నడూ లేని విధంగా గవర్నర్ల అధికారాలకు కొమ్ములు మొలవడం డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ దేశాధ్యక్షుడిగా ఉన్నంతవరకూ మనం ఎరగం! ఆ తర్వాత కాంగ్రెస్, బీజేపీ పాలక వర్గాల ఇష్టానుసార పరిపాలనకు ఉత్తరప్రదేశ్‌కు పార్లమెంటులో అత్యధికంగా ఉన్న 80 స్థానాలు ఆసరా అయి, దేశ రాజకీయాల్ని శాసిస్తూ దక్షిణాది రాష్ట్రాల్ని శాసించజూస్తూ వస్తున్నాయి. కనుకనే తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వాన్ని శాసించే విధంగా అక్కడి గవర్నర్ మంత్రుల్ని బర్తరఫ్ చేయడానికి సాహసించడం! రాజ్యాంగ నియమాలను త్రోసిరాజని పలువురు గవర్నర్లు వ్యవహరిస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణలు... మణిపూర్, త్రిపురలు! చివరికి, ఆదివాసీలు అటవీ భూముల్ని సాగు చేసుకుని బతికే హక్కును చట్టరీత్యా సుప్రీంకోర్టు ఏనాడో (1996 లోనే) అనుమతించి రక్షణ కల్పించినా, ఆ చట్టంలోని పలు రక్షణ నిబంధనలను సవరింపజేసి ఆ భూముల్ని అధికార పక్ష మోతుబరులు అనుభవించడానికి వీలు కల్పించేలా పాలకులు తాము ‘బ్రూట్’ మెజారిటీ అనుభవిస్తున్న పార్లమెంటు ఆమోదం కోసం పంపడం జరిగింది! అలాగే ఢిల్లీ చుట్టూ రాష్ట్రాల పాలకుల్ని తిప్పించాలనుకునే ‘సంస్కృతి’కి కాంగ్రెస్, బీజేపీ పాలకులు అలవాటు పడ్డారు. ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాలలోని కొన్ని ప్రతిపక్ష పాలకులూ ఢిల్లీకి సలాం కొడుతున్నారు! రాజ్యాంగ ఫెడరల్ స్వభావానికి విరుద్ధమైన కేంద్ర పాలకుల ధోరణికి మరొక తిరుగులేని ఉదాహరణ... 2002లో గుజరాత్ ప్రభుత్వం ప్రజలపై అమలు జరుపుతున్న దమనకాండను నిరసిస్తూ ఉద్యమించిన నేరానికి తీస్తా సెతల్వాడ్‌ను అరెస్టు చేసి, జైలు పాలు చేసి సుప్రీంకోర్టు ఆమెకు కల్పించిన వెసులుబాటును సహితం పనిగట్టుకుని ఏళ్ల తరబడిగా వ్యతిరేకిస్తూ ఉండటం! శ్రీమతి సెతల్వాడ్ మహిళ అయినందున సి.ఆర్.పి.సి 437 నిబంధన ప్రకారం అందవలసిన సౌకర్యాలు ఆమెకు అందాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా ప్రస్తుత పాలకులు ఆమెపై వేధింపులు మానలేదు. అంతేగాదు, మరీ విచిత్రమైన విషయం.. వలస పాలనలో గవర్నర్లుగా పనిచేసిన వారు చలాయించిన అధికారాలకూ, స్వతంత్ర భారతంలో గవర్నర్ల అధికారాలకూ మధ్య భేదాన్ని కూడా గ్రహించలేనంతగా దృష్టి లోపంతో ఉన్నారు నేటి పాలకులు. కనుకనే స్వతంత్ర భారత లోక్‌సభకు సెక్రటరీ జనరల్‌గా పనిచేసిన పి.డి.టి. ఆచార్య బ్రిటిష్ వలస పాలనలోని గవర్నర్ల పాత్రకూ, స్వతంత్ర భారత రాష్ట్రాల్లోని గవర్నర్ల పాత్రకూ స్వభావంలోనే పొసగదని తేల్చేశారు. అనేక కేసుల్లో స్వతంత్ర భారత సుప్రీంకోర్టు, స్వతంత్ర భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం లేదా ఆమోదం మేరకే రాష్ట్ర గవర్నర్లు నడుచుకోవాలని 1974 నాటి అనేక కేసులలో ఏడుగురు న్యాయమూర్తులు గల సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది! (షంషేర్ సింగ్ – స్టేట్ ఆఫ్ పంజాబ్). ఈ నేపథ్యంలోనే తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి సొంత నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధ ప్రకటనలూ తమ వద్ద చెల్లవని ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ బాహుటంగానే ఖండించాల్సి వచ్చింది. ప్రజాస్వామ్యానికి, మతాతీత, సామాజిక న్యాయ వ్యవస్థకు, సమాఖ్య (ఫెడరల్) వ్యవస్థకు, లౌకిక రాజ్యాంగానికే డి.ఎం.కె కట్టుబడి ఉంటుందని స్టాలిన్ స్పష్టం చేశారు. ఎప్పుడైతే ఒక దేశం, ఒక పాలకుడు, ఒకే ప్రభుత్వం, ఒకే ఎన్నిక తన లక్ష్యమని ప్రధాని ప్రకటించారో ఆ రోజునే దేశ భవిష్యత్తుకు రానున్న ప్రమాదాన్ని చెప్పకనే చెప్పినట్టయింది. అయితే ఈలోగా సామాజిక స్పృహ కలిగిన డి.వై చంద్రచూడ్ లాంటి న్యాయమూర్తి సుప్రీంకోర్టును 2025 చివరి వరకూ అధిష్ఠిస్తారన్న ‘చేదు నిజాన్ని’ తాను భరించాల్సి వస్తుందని ప్రధాని బహుశా అనుకొని ఉండరు! అసలు విషాదం అంతా అందులోనే దాగి ఉంది! ఎందుకంటే– ఓ మహా కవి అననే అన్నాడు గదా... ‘‘చిటికెడు పేరు కోసం నీతిని నిలువునా చీల్చేస్తుంది స్వార్థం మూరెడు గద్దె కోసం జాతి పరువునే ఆరవేస్తుంది స్వార్థం!’’ ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.i -
సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని కోయంబత్తూరు డీఐజీ ఆత్మహత్య
చెన్నై: తమిళనాడులో సీనియర్ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నారు. సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని కోయంబత్తూరుకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫోలీస్ (డీఐజీ) విజయ్ కుమార్ ప్రాణాలు విడిచారు. కోయంబత్తూరులోని డీఐజీ అధికారిక నివాసంలో శుక్రవారం ఈ సంఘటన వెలుగు చూసింది. తీవ్ర మానసిక ఒత్తిడితోనే విజయ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అయితే ఆయన మృతికి గల కారణలపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా 45 ఏళ్ల విజయ్ కుమార్ రేస్ కోర్స్ సమీపంలోని రెడ్ ఫీల్డ్స్‌లోని క్వార్టర్స్‌లో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. శుక్రవారం ఉదయం 6.15 గంటల ప్రాంతంలో డీఐజీ విజయకుమార్ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గన్ పేలిన శబ్దం విన్న ఆయన ఇంటి భద్రతా సిబ్బంది.. వెంటనే సీనియర్ అధికారులను అప్రమత్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కోయంబత్తూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అయితే విజయకుమార్ తీవ్ర డిప్రెషన్లో ఉన్నారని, నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన కౌన్సిలింగ్ కూడా తీసుకుంటున్నారని, అతన్ని కుటుంబాన్ని కొన్ని రోజుల క్రితమే చెన్నై నుంచి కోయంబత్తూరుకు తీసుకొచ్చినట్లు పేర్కొన్నాయి. చదవండి: గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురు కాగా విజయ్ కుమార్ 2009 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన పోలీస్ అధికారి. ఈ ఏడాది జనవరిలో కోయంబత్తూరు రేంజ్ డీఐజీగా బాధ్యతలు స్వీకరించారు. అంతకముందు ముందు కాంచీపురం, కడలూరు, నాగపట్నం, తిరువారూర్లకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా(ఎస్పీ) అన్నానగర్ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేశారు. డీఐజీ ఆత్మహత్యపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. హోంమంత్రిత్వ శాఖ అధిపతి అయిన సీఎం.. ట్విటర్లో స్పందిస్తూ ‘ పోలీస్ అధికారి విజయకుమార్ అకాల మరణ వార్త విని దిగ్భ్రాంతి గురయ్యాను. ఆయన ఆత్మహత్య చేసుకోవడం బాధ కలిగించింది. జిల్లా ఎస్పీతోపాటు హా వివిధ హోదాల్లో పనిచేసిన విజయ్ కుమార్ మరణం తమిళనాడు పోలీస్ శాఖకు తీరని నష్టం. అతని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.’అని పేర్కొన్నారు. ఉన్నది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ముఖ్యమంత్రి సలహానే కీలకం
ముఖ్యమంత్రి సలహా లేకుండా ఒక మంత్రిని తొలగించే అధికారం గవర్నర్‌కు ఉందా అనేది కీలకమైన ప్రశ్న. భారత గణతంత్రంలోని గవర్నర్లకు, బ్రిటిష్ కాలంనాటి గవర్నర్ల లాగా మంత్రులను ఎంపిక చేసే అధికారం లేదు. ఆర్టికల్ 164ను రూపొందిస్తున్నప్పుడు, ఒక మంత్రిని ఎంపికచేసే, ఏకపక్షంగా తొలగించే వలసకాల గవర్నర్ అధికారాలను తొలగించారు. సీఎం సిఫార్సు చేసిన వ్యక్తిని మాత్రమే గవర్నర్ నియమించగలరని ఈ నిబంధన స్పష్టం చేస్తోంది. కాబట్టి, ముఖ్యమంత్రి సలహా లేకుండా ఒక మంత్రిని తొలగించే అధికారం గవర్నర్‌కు లేదనేది స్పష్టం. ముఖ్యమంత్రి సలహా లేకుండా సిట్టింగ్ మంత్రిని తొలగించడం ద్వారా తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి రాజ్యాంగపరంగా అరు దైన సాహసోపేత ప్రయోగం చేశారు. వాస్తవానికి, ఆదేశం జారీ చేసిన కొన్ని గంటల్లో, ఆయన దానిని నిలిపివేశారు. అయినా ఈ చర్య రాజకీయ వర్గాల్లో కలకలం రేపడంతో పాటు రాజ్యాంగవేత్తలను దిగ్భ్రాంతికి గురి చేసింది. అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకోవాలంటూ కేంద్ర హోంశాఖ సూచించిందని అనంతరం గవర్నర్ వెల్లడించారు. దేశంలోని అత్యున్నత న్యాయ అధికారిని సంప్రదించకుండా, ముఖ్యమంత్రి తప్పనిసరి సలహా లేకుండా, అసెంబ్లీలో పూర్తి మెజా రిటీ ఉన్న ప్రభుత్వ మంత్రిని తొలగించాలనే అపూర్వమైన ఉత్తర్వు జారీ చేయడం విస్మయం కలిగిస్తోంది. ముఖ్యమంత్రి సలహా లేకుండా మంత్రిని తొలగించే అధికారం గవర్నర్‌కు ఉందా అనేది కీలకమైన ప్రశ్న. ఆర్టికల్ 164 ప్రకారం, సీఎం సలహా మేరకు మంత్రులను గవర్నర్ నియమిస్తారు. సీఎం సిఫార్సు చేసిన వ్యక్తిని మాత్రమే గవర్నర్ నియమించగలరని ఈ నిబంధన స్పష్టం చేస్తోంది. తన మంత్రులను ఎంపిక చేయడం లేదా తొలగించడం పూర్తిగా సీఎం ప్రత్యేకాధికారం. ఒక మంత్రిని వద్దనుకుంటే, తదనుగుణంగా గవర్నర్‌కు సలహా ఇస్తాడు. పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని అనుసరించే అన్ని దేశాల్లోనూ ఇదే వాడుకగా ఉంటోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164, ‘గవర్నర్ సంతుష్టి (ప్లెజర్)తో ఉన్నంతకాలం మంత్రులు తమ బాధ్యతలు నిర్వహిస్తారు’ అని చెబుతోంది. ఇది ఒక మంత్రి మనుగడ పూర్తిగా గవర్నర్ ఇష్టా నిష్టాలపై ఆధారపడి ఉందనీ, ఏ మంత్రి పట్ల అయినా గవర్నర్ తన సంతుష్టిని ఉపసంహరించుకోవచ్చనీ అభిప్రాయాన్ని కలిగించవచ్చు. ‘గవర్నర్ సంతుష్టి’ అనేది ఇక్కడ కీలకమైన అంశం. దాని నిజమైన భావాన్ని అర్థం చేసుకోవాలంటే, మనం భారత ప్రభుత్వ చట్టం, 1935లోని సెక్షన్ 51కి వెళ్లాలి. సెక్షన్ 51లోని సబ్‌సెక్షన్ (1) ప్రకారం, గవర్నర్ తన విచక్షణ మేరకే మంత్రులను పదవుల్లోకి ఎన్ను కోవాలి. అదేవిధంగా సెక్షన్ 51లోని సబ్–సెక్షన్ (5) మంత్రుల ఎంపికకు, తొలగింపునకు సంబంధించి గవర్నర్ తన విధిని విచక్ష ణతో అమలు చేయాలని చెబుతోంది. ఆ విధంగా, భారత ప్రభుత్వ చట్టం, 1935లోని సెక్షన్ 51, మంత్రులను ఎన్నుకోవడానికీ, వారిని తొలగించడానికీ గవర్నర్‌కు విచక్షణాధికారాలను అందిస్తోంది. సంతుష్ట సిద్ధాంతం ఇక్కడ పూర్తిగా పనిచేస్తోంది. భారత ప్రభుత్వ చట్టంలోని నిబంధనలను మన రాజ్యాంగం పెద్ద ఎత్తున పునరుత్పాదన చేసిందనేది అందరికీ తెలిసిన విషయమే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 163, 164లో సెక్షన్ 51 గణనీయంగా పునరుత్పాదన అయింది. అటువంటి నిబంధనలో సంతుష్ట సిద్ధాంతం ఒకటి. కానీ రాజ్యాంగ నిర్మాతలు దీనికి సంబంధించి కీలకమైన మార్పు చేశారు. ఆర్టికల్ 164ను రూపొందిస్తున్నప్పుడు, వారు ఒక మంత్రిని ఎంపికచేసే, ఏకపక్షంగా తొలగించే వలసకాల గవర్నర్ అధికారాలను తొలగించారు. అంటే భారత గణతంత్రంలోని గవ ర్నర్లకు, బ్రిటిష్ కాలంనాటి గవర్నర్ల లాగా మంత్రులను ఎంపిక చేసే అధికారం లేదు. పైగా ముఖ్యమంత్రి సలహా లేకుండా మంత్రిని తొల గించే విచక్షణాధికారం గవర్నర్‌కు లేనప్పుడు సంతుష్ట సిద్ధాంతం దాని బలాన్ని కోల్పోతుంది. పైగా రాష్ట్ర కార్యనిర్వాహక అధిపతి అయిన ముఖ్యమంత్రి నుండి సలహా వచ్చినప్పుడు దాన్ని నిర్వర్తించడం లాంఛనప్రాయంగా మారుతుంది. కాబట్టి, ముఖ్యమంత్రి సలహా లేకుండా ఒక మంత్రిని తొలగించే అధికారం గవర్నర్‌కు లేదని స్పష్టంగా నిర్ధారించవచ్చు. గవర్నర్ తీసుకునే అలాంటి చర్య రాజ్యాంగ వ్యవస్థపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో కూడా మనం తీవ్రంగా పరిగణించాలి. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని ప్రమాణం చేసిన గవర్నర్, మంత్రులను ఇష్టానుసారంగా తొలగించడం ద్వారా రాజ్యాంగ వ్యవస్థను అస్థిరపరిచే ప్రమాదం ఉంది. స్వతంత్రంగా అమలు చేయగల కార్యనిర్వాహక అధికారం గవర్నర్‌కు లేదని గుర్తుంచుకోవాలి. ఆర్టికల్ 153 ప్రకారం, రాజ్యాంగంలో పేర్కొన్న విచక్షణ విధులు మినహా, అతని అన్ని విధులు మంత్రిమండలి సహాయం, సలహాపై మాత్రమే నిర్వహించబడతాయి. 1974 నాటి శంశేర్ సింగ్ కేసులో, ఎన్ను కోబడిన ప్రభుత్వానికి సంబంధించినంతవరకు గవర్నర్ అధికారాలకు సంబంధించిన చట్టాన్ని సుప్రీంకోర్టు స్పష్టంగా నిర్దేశించింది. తదుపరి నిర్ణయాలన్నీ దానిని పునరుద్ఘాటించాయి. కాబట్టి, మన రాజ్యాంగ వ్యవస్థలో గవర్నర్ స్థానంపై చట్టం స్థిరపడింది. అలాగే, మంత్రిని నియమించడం లేదా తొలగించడంలో గవర్నర్‌కు విచక్షణాధికారం లేదని ఆర్టికల్ 164 స్పష్టం చేసింది. రెండూ సీఎం పరిధిలోనే ఉన్నాయి. గవర్నర్‌పై కాకుండా సీఎం విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే మంత్రులు క్యాబినెట్లో ఉండగలరు. గవర్నర్ అత్యున్నత రాజ్యాంగ కార్యనిర్వాహకుడు. ఆయన ఆదర్శప్రాయమైన నిష్పాక్షికతతో వ్యవహరించాలి. క్రియాశీల రాజకీయ నాయకులను గవర్నర్లుగా నియమించకూడదని రాజ్యాంగ అసెంబ్లీలో కొంతమంది సభ్యుల నుండి డిమాండ్ వచ్చింది. అటువంటి సూచనలు ఆ సమయంలో తీసుకోనప్పటికీ, రాజకీయ నాయకులు లేదా మాజీ అధికారులు రాజ్‌భవన్ లో పని చేసిన సమయంలో ప్రశంసనీయంగా పనిచేశారు. ఈ మహోన్నతమైన, ముఖ్యమైన రాజ్యాంగ పదవిని స్వీకరించే స్త్రీ పురుషులకు ఉంటున్న అనుకూలత, అర్హతల గురించి భారతీయ సమాజం చర్చను ప్రారంభించాల్సిన సమయం ఇది. మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని రాష్ట్రాల్లో రాజ కీయాల కేంద్రం మెల్లగా రాజ్ భవన్ వైపు మొగ్గుతోంది. ఇది కచ్చితంగా సానుకూలమైన ఆలోచన మాత్రం కాదు. పి.డి.టి. ఆచారి వ్యాసకర్త లోక్‌సభ మాజీ కార్యదర్శి (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
TN: మంత్రి డిస్మిస్‌పై వెనక్కి తగ్గిన గవర్నర్!
చెన్నై: తమిళనాట బుధవారం అర్ధరాత్రి దాకా పొలిటికల్ హైడ్రామా సాగింది. గవర్నర్ ఆర్ఎన్ రవి వివాదాస్పద నిర్ణయంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అవినీతి ఆరోపణల కేసులో అరెస్టయిన మంత్రి వీ సెంథిల్ బాలాజీని.. మంత్రి వర్గం నుంచి తొలగించడం, అదీ సీఎం స్టాలిన్‌ను సంప్రదించకుండానే నిర్ణయం తీసుకోవడం గురించి తెలిసిందే. ఈ వ్యవహారంపై డీఎంకే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. క్యాష్ ఫర్ జాబ్స్, మనీల్యాండరింగ్ లాంటి తీవ్రమైన అవినీతి ఆరోపణల కేసుల నేపథ్యంలో మంత్రివర్గం నుంచి మంత్రిని సెంథిల్‌ను తొలగిస్తున్నట్లు.. అందుకోసం గవర్నర్ ఆర్ఎన్ రవి తన విచక్షణ అధికారం ఉపయోగించినట్లు రాజ్‌భవన్ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే.. ఈ నిర్ణయంపై డీఎంకే ప్రభుత్వం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన న్యాయ నిపుణుల సలహా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అర్ధరాత్రి అటార్నీ జనరల్‌తో భేటీ అయిన గవర్నర్ ఆర్ఎన్ రవి.. ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని నిలుపుదల చేసినట్లు సమాచారం. దీంతో బాలాజీ ప్రస్తుతానికి మంత్రిగానే కొనసాగనున్నారు. ఇదిలా ఉంటే.. బాలాజీని మంత్రివర్గం నుంచి తొలగిస్తూ గవర్నర్ జారీ చేసిన ఆదేశాలపై స్టాలిన్ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం. అంతకు ముందు ఈ పరిణామంపై ముఖ్యమంత్రి స్టాలిన్ మీడియాతో మాట్లడారు. గవర్నర్‌పై ధ్వజమెత్తిన ఆయన.. తన మంత్రివర్గంలోని వ్యక్తిని తొలగించే హక్కు గవర్నర్‌కు ఉండదని మండిపడ్డారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని న్యాయపరంగానే దీనిని ఎదుర్కొంటుందని తెలిపారు. న్యాయ నిపుణులతో చర్చించేందుకు గానూ సీనియర్ నేతలను ఆహ్వానించారాయన. శుక్రవారం ఉదయం ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం. మరోవైపు బుధవారం బాలాజీ జ్యూడీషియల్ కస్టడీని జులై 12వ తేదీ వరకు పొడిగించింది స్థానిక కోర్టు. మనీల్యాండరింగ్ ఆరోపణలకు సంబంధించి ఆయన్ని ఈడీ అరెస్ట్ చేసింది. ఆయన చేతిలో ఉన్న శాఖలను ఇది వరకే మరో ఇద్దరు మంత్రులకు సీఎం స్టాలిన్ అందజేయగా.. మంత్రిత్వ శాఖ మంత్రిగా ప్రస్తుతం సెంథిల్ కొనసాగుతుండడం గమనార్హం. -
మామన్నన్కు ముఖ్యమంత్రి ప్రశంసలు
కోలీవుడ్‌లో 'మామన్నన్' సినిమా జూన్ 29న విడుదలైంది. ఈ చిత్రంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రశంసలు కురిపించారు. ఉదయనిది స్టాలిన్ కథానాయకుడిగా నటించి రెడ్ జెయింట్ మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. నటి కీర్తిసురేష్ నాయకిగా నటించిన ఇందులో వడివేలు ముఖ్యపాత్రలు పోషించారు. పరియేరుమ్ పెరుమాళ్, కర్ణన్ చిత్రాల ఫేమ్ మారిసెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య గురువారం తెరపైకి వచ్చింది. (ఇదీ చదవండి: రామ్ చరణ్-ఉపాసన కూతురి పేరు ఫైనల్ చేసేశారు) కాగా చిత్రంపై నటుడు కమలహాసన్, ధనుష్ వంటి ప్రముఖులు చిత్రాన్ని చూసి ఎంతగానో ప్రశంసిస్తూ ట్విట్టర్లో పేర్కొన్నారు. మామన్నన్ చిత్రాన్ని గురువారం ఉదయం చైన్నెలోని ఒక ప్రివ్యూ థియేటర్లో ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. దీని గురించి చిత్ర దర్శకుడు మారిసెల్వరాజ్ ట్విటర్లో పేర్కొంటూ మామన్నన్ చిత్రాన్ని చూసిన ముఖ్యమంత్రి చాలా బాగుందంటూ ప్రశంసించారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతతో కూడిన ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా మామన్నన్ చిత్రాన్ని ప్రశంసించిన కమలహాసన్, ధనుష్‌లను ఉదయనిధి స్టాలిన్ ట్విటర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. (ఇదీ చదవండి: కెమెరాల ముందు 30 సెకన్ల పాటు లిప్‌లాక్.. బుర్ర పనిచేస్తుందా?) -
మంత్రిపై అవినీతి ఆరోపణలు.. డిస్మిస్ చేసిన గవర్నర్
చెన్నై: తమిళనాడులో మరోసారి ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఆవినీతి ఆరోపణల నేపథ్యంతో అరెస్ట్ అయిన మంత్రి సెంథిల్ బాలాజీని మంత్రి పదవి నుంచి తొలగించారు ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి. ఈ మేరకు గురువారం రాజ్‌భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ‘జాబ్స్ పర్ క్యాష్, మనీలాండరింగ్‌తో సహా అనేక అవినీతి కేసుల్లో మంత్రి సెంథిల్ బాలాజీ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సెంథిల్‌ను గవర్నర్ మంత్రివర్గం నుంచి ఆయన్ను తొలగించారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయి’ అని రాజ్ భవన్ ప్రకటనలో పేర్కొంది. కాగా జూన్ 14న తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్ శాఖల మంత్రి వి. సెంథిల్ బాలాజీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. చెన్నైలోని మంత్రి అధికారిక నివాసాలు, కార్యాలయాల్లో 18 గంటలపాటు సోదాలు, విచారణ అనంతరం అదుపులోకి తీసుకుంది. ఈ సమయంలో గుండెపోటు రావడంతో ఆయనకు శస్త్ర చికిత్స అనివార్యమైంది. కావేరి ఆస్పత్రిలో డాక్టర్ ఏఆర్ రఘురాం బృందం ఐదు గంటల పాటు శ్రమించి సెంథిల్ బాలాజీకి బైపాస్ సర్జరీ విజయవంతం చేశారు. ప్రస్తుతం ఆయన ఈడీ దర్యాప్తు చేస్తున్న క్రిమినల్ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. దివంగత సీఎం జయలలిత హయాంలో(2011-2016) రవాణా శాఖ మంత్రిగా ఉన్న సెంథిల్ బాలాజీపై లంచాలు తీసుకుని ఉద్యోగాలిచ్చినట్లు (క్యాష్ పర్ జాబ్స్) కుంభకోణం కేసు ఉంది. ఇందులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. చదవండి: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు.. ఆ రోజే వరంగల్‌కు రాక సెంథిల్ బాలాజీ రాజకీయ ప్రస్థానం బాలాజీ 2006 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ తరపున కరూర్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2011లో కరూర్ నుంచి ఎమ్మెల్యేగా మళ్లీ గెలిచి దివంగత జె. జయలలిత నేతృత్వంలోని ఏఐఏడీఎంకే ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. 2015లో జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ కుటుంబ సభ్యుడితో విభేదాలు రావడంతో కేబినెట్ నుంచి తొలగించారు. 2016 ఎన్నికల్లో అరవకురిచ్చి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ అన్నాడీఎంకే ప్రభుత్వంలో కేబినెట్ హోదా లభించలేదు. 2017లో అనర్హత వేటు అన్నాడీఎంకేలో చీలిక తర్వాత బాలాజీ శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌కు మద్దతు తెలిపాడు. 2017లో ముఖ్యమంత్రిని మార్చాలంటూ అప్పటి గవర్నర్‌కు పిటిషన్ అందించినందుకు.. అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు వేసిన 18 మంది ఎమ్మెల్యేల్లో ఆయన ఒకరు. బాలాజీ 2018లో డీఎంకేలో చేరి అరవకురిచ్చి నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. మళ్లీ 2019లో అదే నియోజకవర్గం నుంచి, 2021లో కరూర్ నుంచి గెలిచారు. సీఎంకు సన్నిహిత వ్యక్తిగా బాలాజీ ముఖ్యమంత్రి స్టాలిన్‌కు సన్నిహిత వ్యక్తిగా పేరుగాంచడంతో మంత్రి బాధ్యతలు అప్పగించారు. ఇటీవల అన్నాడీఎంకే నుంచి మారినప్పటికీ అతనికి ముఖ్యమైన శాఖలను కేటాయించాడు. అనంతరం బాలాజీపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. డీఎంకే-కాంగ్రెస్ కూటమి అభ్యర్థి గెలుపొందిన ఈరోడ్ ఈస్ట్ ఉప ఎన్నిక సందర్భంగా ఓటర్లకు నగదు పంపిణీ చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. టెండర్ల కేటాయింపులో కూడా అవకతవకలు జరిగాయని బార్ యజమానులు ఆయనపై ఆరోపణలు గుప్పించారు. కొంతమంది బార్ యజమానులు అతని పేరు మీద నెలవారీ రక్షణ డబ్బును డిమాండ్ చేశారని కూడా ఆరోపించారు. -
ఇక జాతీయ రాజకీయాలు!
సాక్షి, చైన్నె: లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా జాతీయస్థాయి రాజకీయాలపై డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ ప్రత్యేక దృష్టిపెట్టారు. బిహార్‌లోని పాట్నా లో జాతీయ రాజకీయచట్రంలో తాము కీలకపాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్న సంకేతాన్ని ఇచ్చారు. ఇందుకు తగ్గట్టుగానే గురువారం రాత్రి, శుక్రవారం డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ పాట్నాలో బిజీబిజీ అయ్యారు. బీహార్ సీఎం నితీష్‌కుమార్, మాజీ సీఎం లాలుప్రసాద్ యాదవ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ముఖ్యనేతలతో పలకరింపులతో బీజేపీకి వ్యతిరేకంగా తన తీవ్రగళాన్ని స్టాలిన్ వినిపించినట్టు డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. మొదటి నుంచి డీఎంకే అధ్యక్షుడు సీఎం స్టాలిన్ కేంద్రంలోని బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా తన స్వరాన్ని పెంచుతున్న విషయం తెలిసిందే. గవర్నర్ ద్వారా తన ప్రభుత్వాన్ని కేంద్రం ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు చేయడాన్ని, తమను బెదిరించి దారిలోకి తెచ్చుకునే విధంగా కేంద్రం సాగిస్తున్న పరిణామాలను స్టాలిన్ తీవ్రంగానే పరిగణించారు. కేంద్రం చర్యలను వ్యతిరేకించడమే కాకుండా, సమయం దొరికినప్పుడల్లా తీవ్ర స్వరంతో హెచ్చరికలు సైతం చేస్తున్నారు. ఈ పరిస్థితులో బిహార్ సీఎం నితీష్‌కుమార్ నేతృత్వంలో ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యే విధంగా పాట్నా వేదికగా శుక్రవారం జరిగిన సమావేశం ద్వారా దివంగత డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి గతంలో అనుసరించిన ఫార్ములాతో జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. తాము కీలకపాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నామని చాటే ప్రయత్నం చేశారు. తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలోని 40 స్థానాలను తాము కై వసం చేసుకుంటామన్న ధీమాను వ్యక్తం చేయడం విశేషం ఒక రోజు ముందుగానే.. ఈ సమావేశం నిమిత్తం గురువారమే పాట్నాకు సీఎం స్టాలిన్ వెళ్లారు. అదే రోజు రాత్రి ఆయన సీఎం నితీష్‌కుమార్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కొన్ని గంటల పాటు రాజకీయ అంశాలపై ఈ భేటీ జరిగినట్టు డీఎంకే వర్గాలు పేర్కొన్నాయి. అలాగే, మాజీ సీఎం లాలుప్రసాద్ యాదవ్‌తో కూడా భేటీ అయ్యారు. ఈసందర్భంగా దివంగత నేత కరుణానిధితో తనకు ఉన్న అనుబంధం గురించి లాలు వ్యాఖ్యలు చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్‌తో పాటు పలువురు ముఖ్యప్రముఖులను శుక్రవారం స్టాలిన్ కలిశారు. బిహార్‌లోని పలువురు తమిళ అధికారులు స్టాలిన్‌ను కలవడం విశేషం. అనంతరం జరిగిన లౌకిక వాద పార్టీల నేతల సమావేశంలో బీజేపీకి వ్యతిరేకంగా స్టాలిన్ తన ఆగ్రహాన్ని తీవ్రంగానే వ్యక్తం చేసినట్టు డీఎంకే వర్గాలు పేర్కొన్నాయి. అందరూ ఐక్యతతో ముందుకు వెళ్తే, బీజేపీని ఓడించడం ఖాయం అన్న ధీమాను స్టాలిన్ వ్యక్తం చేయడం విశేషం. సమావేశానికి హాజరైన అన్ని పార్టీల నేతలు, పలు రాష్ట్రాల సీఎంలతో స్టాలిన్ ప్రత్యేకంగా కలవడమే కాకుండా జాతీయ రాజకీయాలలో డీఎంకే మరింత చురుగ్గా పాల్గొనబోతోందన్న సంకేతాన్ని ఇవ్వడం గమనార్హం. నమ్మకం ఉంది.. పాట్నా పర్యటన ముగించుకుని రాత్రి చైన్నెకు చేరుకున్న సీఎం స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలన్నీ ఏకం కావడం ఓ నమ్మకాన్ని కలిగించిందన్నారు. బీజేపీని ఓడించి తీరాలన్న సంకల్పంతో అన్ని పార్టీలు ఉన్నట్టు వివరించారు. దేశాన్ని, ప్రజల్ని రక్షించాలంటే ఐక్యతతో, ఒకే గళంతో అందరూ ముందుకెళ్లాల్సిన తరుణం ఇదేనని వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల అనంతరం కూటమి కన్నా, ముందుగానే కూటమిని తేల్చడం మంచిదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. 2024లో బీజేపీని ఓడించి తీరుతామన్న నమ్మకం తనకు ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు అందరం ఏకం కావడం నమ్మకాన్ని పెంచిందని వ్యాఖ్యలు చేశారు. -
తమిళనాడులో ఘోర ప్రమాదం.. 70 మందికి గాయాలు.
చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో మరో 70 మందికి పైగా గాయపడ్డారు. కడలూరు జిల్లా నెల్లికుప్పం సమీపంలోని పట్టంబాక్కం వద్ద సోమవారం ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కడలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కడలూరు-పన్రుటి మధ్య రెండు ప్రైవేట్ బస్సులు పరస్పరం ఢీకొన్నాయి. ముందుగా ఒక బస్సు టైరు పగిలిపోవడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులు నజ్జునుజ్జుయినట్లు తెలుస్తోంది. ఘటనపై స్పందించిన సీఎం స్టాలిన్.. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన ఒక్కొక్కరికి రూ. 50 వేలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త.. హోటళ్లు అడ్వాన్స్ బుకింగ్ చేస్తే.. -
బీజేపీ శవపేటికకు చివరి మేకు అదే..కేంద్రానికి స్టాలిన్ హెచ్చరికలు..
తమిళనాడు:ప్రతిపక్షాలతో బీజేపీ ఎన్నికల్లో పోరాడటంలేదని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ఎన్నికల్లో పోరాడి బీజేపీని ఓడిస్తామని హెచ్చరించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని కేంద్రం ప్రభుత్వంపై డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలియన్స్ నిరసన సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం స్టాలిన్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అసత్య ప్రచారాలతో బీజేపీ సృష్టించుకున్న ఇమేజ్ను దెబ్బతీస్తామని అన్నారు. 'బీజేపీకి ఓటమి కళ్ల ముందు కనిపిస్తుంది. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలపై దురహంకార చర్యలకు పాల్పడుతోంది. ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వడమే బీజేపీ శవపేటికకు చివరి మేకు అవుతుంది' అని స్టాలిన్ అన్నారు. మనీ లాండరింగ్ కేసులో తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు నిరసనలు తెలుపుతూ సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలియన్స్ సమావేశం నిర్వహించింది. ఇదీ చదవండి:ముందస్తును కొట్టిపారేయలేం: నితీశ్ -
ప్లాట్ఫారం నాయకుడిలా మాట్లాడకండి.. నోరు జాగ్రత్త!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తన కేబినెట్ మంత్రి సెంథిల్ బాలాజీ అరెస్టు వ్యవహారంలో బీజేపీ పార్టీపై చేసిన విమర్శలకు రాష్ట్ర బీజేపీ నాయకుడు అన్నామలై కాస్త ఘాటుగానే స్పందించారు. ఈ సందర్బంగా స్టాలిన్ ముఖ్యమంత్రిలా కాకుండా ఒక ప్లాట్ఫారం స్పీకర్ లా మాట్లాడుతున్నారని అన్నారు. తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ అరెస్టు తర్వాత తమిళనాట రాజకీయాలు వేడెక్కాయి. ఈ అంశం ద్వారా తమ పార్టీకి మైలేజీ పెంచుకునే ప్రయత్నంలో ఉంది బీజేపీ. మాస్ వార్నింగ్.. మనీ లాండరింగ్ కేసులో మంత్రి అరెస్టు నేపథ్యంలో రాష్ట్రంలో సీబీఐకి ఎంట్రీని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో ముఖ్యమంత్రి స్టాలిన్ బీజేపీ పార్టీని విమర్శిస్తూ.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఈ తరహా ఈడీ వేధింపులకు గురిచేసినంత మాత్రాన మేము భయపడేది లేదు. మాక్కూడా రాజకీయాలు చేయడం తెలుసు. ఇది బెదింపు కాదు.. హెచ్చరిస్తున్నా.. " అంటూ చేసిన వ్యాఖ్యలకు తమిళనాడు బీజేపీ అధినేత అన్నామలై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆ మాటలేంటి? అన్నామలై మాట్లాడుతూ.. గౌరవనీయులైన స్టాలిన్ గారు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీరు ఇలా మాట్లాడటం తగదు. 30 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి కూడా ఒక ప్లాట్ ఫారం స్థాయి నాయకుడిలా మాట్లాడుతున్నారు. అదికూడా ఇప్పటివరకు ఐదు పార్టీలు మారి అనేక అక్రమాలకు పాల్పడిన అవినీతిపరుడిని కాపాడటానికి ఇలా మాట్లాడటం దురదృష్టకరం అన్నారు. ఒకప్పుడు స్వయంగా మీరే ఈ బాలాజీ అవినీతిపరుడని ఆరోపణలు చేసి సీబీఐ ఎంక్వైరీ కూడా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మీరే ఆయన్ను కాపాడటానికి ప్రయత్నిస్తుంటే చాలా విడ్డూరంగా ఉందన్నారు. మీరు మీ చుట్టుపక్కల ఉన్నవాళ్లకు మాత్రమే కాదు, 8.5 కోట్ల మందికి ముఖ్యమంత్రి. అనవసర భయాందోళనలను పక్కనపెట్టి కాస్త విచక్షణతో మాట్లాడమని ఈ సందర్భంగా హితవు పలికారు. ఇది కూడా చదవండి: గవర్నర్ Vs సీఎం స్టాలిన్:సెంథిల్ బాలాజీ అంశంలో మరో వివాదం.. -
తన భర్త నుంచి కాపాడాలంటూ సీఎం స్టాలిన్‌ని కోరిన నటి
కోలీవుడ్‌లో ప్రముఖ బుల్లితెర నటి దివ్య.. తన భర్త అర్ణవ్ నుంచి కాపాడాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను అభ్యర్థించింది. అక్కడ ప్రసారం అయ్యే 'సెవ్వంతి' సీరియల్‌తో నటి దివ్య ఫేమస్ అయింది. గతేడాది బుల్లితెర నటుడు అయిన అర్ణవ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. గర్భందాల్చిన సమయంలో తన కడుపుపై అర్ణవ్ తన్నాడని, మానసికంగా హింసించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అర్ణవ్ బెయిల్‌పై విడుదల అయ్యాడు. మరో ఇద్దరు మహిళలను ఆర్నవ్ మోసం చేశాడు? అర్ణవ్ ఇద్దరు మహిళలను మోసం చేశాడంటూ దివ్య ఆడియో విడుదల చేసింది. వారిద్దరిని కూడా పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని తెలిపింది. బెయిల్‌పై విడుదల అయిన అర్ణవ్ తన మనుషులు, లాయర్లతో వచ్చి గొడవ పడ్డాడని దివ్య సంచలన ఆరోపణ చేసింది. అర్దరాత్రి ఒక్కసారిగా 15 మందితో తన ఇంటి తలుపు తట్టాడని తెలిపింది. వారందరూ తనను తోసుకుంటూ ఇంట్లోకి చొరబడ్డారని చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: సినిమా రంగంలోనే డ్రగ్స్ ఎందుకు?) అతను బెయిల్‌పై ఉన్నాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఆమె ఇలా ఫిర్యాదు చేసింది. 'ప్రస్తుతం అర్ణవ్ షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్నాడు. ఈ సమయంలో అతను నా ఇంటికి రాకూడదు. నన్ను బెదిరించి, నా పాపను చంపడానికి ప్రయత్నించాడు. నేను ఎక్కడికి వెళ్తున్నానో అతనికి అన్నీ తెలుసు.. అందుకోసం ఒక వ్యక్తిని గూఢచారిగా పెట్టుకున్నాడు. ఎప్పటికైనా నన్ను చంపేస్తాడు. నా ఇంట్లో ఇద్దరు వృద్ధులు కూడా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో అతను మా ఇంటికి వచ్చి బెదిరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతుంది. ఆయనపై చర్యలు తీసుకునేలా చూడాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాను’ అని దివ్య కన్నీరు పెట్టుకుంది. (ఇదీ చదవండి: Drugs Case: కేపీ చౌదరి ఫోన్ లిస్ట్‌లో సినీ ప్రముఖల లిస్ట్) -
బాలాజీని విమర్శించిన స్టాలిన్.. పాత వీడియో పోస్ట్ చేసిన అన్నామలై
చెన్నై: దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ రాజకీయ ప్రతీకార చర్యలకు బీజేపీ దిగుతోంది. విపక్షాలు మొదటి నుంచి బీజేపీపై చేస్తున్న ప్రధాన ఆరోపణ ఇదే. అందుకు తగ్గట్లుగా తాజాగా తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడం.. తదనంతర నాటకీయ పరిణామాలపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ క్రమంలో బీజేపీ కౌంటర్‌కు దిగింది. బాలాజీని ఆస్పత్రికి వెళ్లి మరీ పరామర్శించిన స్టాలిన్.. ఆయన్ని బాధితుడిగా పేర్కొనడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఓ వీడియో పోస్ట్ చేశాడు. గతంలో బాలాజీ అవినీతి విమర్శలు స్టాలిన్ చేసిన సందర్భాన్ని ఆయన గుర్తు చేశారు. తద్వారా స్వరం ఎందుకు మారిందంటూ స్టాలిన్‌ను నిలదీశాడు అన్నామలై. గతంలో క్యాష్ ఫర్ జాబ్ స్కామ్‌లో సెంథిల్ బాలాజీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఆ టైంలో ఆయన డీఎంకేలో లేరు. అన్నాడీఎంకే ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. స్టాలిన్ సహా డీఎంకే కీలక నేతలంతా బాలాజీని అవినీతిపరుడంటూ ఏకిపారేశారు ఆ టైంలో. ఇదే అన్నామలై సదరు వీడియో ద్వారా గుర్తు చేశాడు. కరూర్జిల్లాలో ఓ మంత్రి ఉన్నాడు. ఆయన పేరు సెంథిల్ బాలాజీ. కేబినెట్ ఇప్పటిదాకా 15సార్లు పునర్వ్యవస్థీకరణ అయ్యింది. కానీ, సెంథిల్‌ను మాత్రం కేబినెట్లో అలాగే కొనసాగించారు. ఆయనొక జూనియర్ మంత్రి. సీనియర్లను పక్కనపెట్టి మరీ ఆయన కొనసాగిస్తూ వస్తున్నారు. జయలలిత జైల్లో ఉన్న టైంలో.. ఆయన పేరు సీఎం పదవికి కూడా వినిపించింది. ఆయన, ఆయన సోదరుడు ఇద్దరూ జిల్లాను దోచుకునేందుకే ఉన్నారు.. ఇవీ స్టాలిన్ ఆ వీడియోలో చెప్పిన మాటలు. అయితే ఆ తర్వాత అన్నాడీఎంకేలో నెలకొన్న అంతర్గత సంక్షోభంతో పార్టీని వీడి.. 2018లో సెంథిల్ బాలాజీ డీఎంకేలో చేరారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని మంత్రి సెంథిల్ బాలాజీ చెప్పిన తర్వాత కూడా ఛాతిలో నొప్పి వచ్చేలా చిత్రహింసలకు గురిచేసిన ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఏం సాధించాలనుకుంటోంది. కేసుకు అవసరమైన చట్టపరమైన విధానాలను ఉల్లంఘిస్తూ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మానవత్వం లేని విధంగా వ్యవహరించడం అవసరమా? బీజేపీ బెదరింపులకు డీఎంకే భయపడదు. 2024 ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు అంటూ సెంథిల్‌ను కలిశాక ఓ ట్వీట్ చేశారు స్టాలిన్. ఇదిలా ఉంటే.. చెన్నై, కోయంబత్తూరు ఇల్లు, ఇతర ప్రాంతాల్లో 18 గంటల తనిఖీలు నిర్వహించిన అనంతరం ఆయన్ని అర్ధరాత్రి అరెస్ట్ చేసింది ఈడీ. 2011-15 మధ్య అన్నాడీఎంకే ప్రభుత్వంలో రవాణా శాఖా మంత్రిగా ఉన్న టైంలో ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించిన వ్యవహారంలో మనీలాండరింగ్ ఆరోపణల ఆధారంగా దర్యాప్తు చేసి ఈ అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది ఈడీ. అయితే అరెస్ట్ సమయంలో ఆయన ఛాతీ నొప్పితో కుప్పకూలి స్పృహ కోల్పోవడంతో చెన్నైలోని ఓ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే.. ఆయనకు బైపాస్ సర్జరీ అవసరమని వైద్యులు ఇప్పటికే ప్రకటించారు కూడా. விசாரணைக்கு முழு ஒத்துழைப்பு தருகிறேன் என்று சொன்ன பிறகும் அமைச்சர் செந்தில் பாலாஜிக்கு நெஞ்சு வலி ஏற்படும் வகையில் சித்ரவதை கொடுத்த அமலாக்கத்துறையின் நோக்கம் என்ன? வழக்கிற்குத் தேவையான சட்ட நடைமுறைகளை மீறி மனிதநேயமற்ற முறையில் அமலாக்கத்துறை அதிகாரிகள் நடந்து கொண்டிருப்பது… pic.twitter.com/D2EIs5vvWN — M.K.Stalin (@mkstalin) June 14, 2023 A gentle reminder to Thiru @mkstalin on what he spoke a few years back about the #CashForJobScam tainted Thiru Senthil Balaji. Are you going to refute this, Thiru @mkstalin? Why are you playing victim card today? https://t.co/ybFUtqrFov pic.twitter.com/c1YeCyhvFn — K.Annamalai (@annamalai_k) June 14, 2023 Netaji used to say “tum mujhe khoon do main tumhe Azadi doonga” These parties say “tum mujhe cash do main tumhe job doonga” The U turn of Stalin ji on corruption & cash-4-job scam isn’t surprising for those who have mastered art of 2G,3G corruption! https://t.co/fgIAqfpUof — Shehzad Jai Hind (@Shehzad_Ind) June 14, 2023 ఇదీ చదవండి: తమిళనాడు మంత్రి అరెస్ట్ సమయంలో జరిగింది ఇదే! -
Video: తమిళనాడు మంత్రి అరెస్ట్.. కుప్పకూలిన బాలాజీ
చెన్నై: తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్ శాఖల మంత్రి వి. సెంథిల్ బాలాజీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ కేసులో బుధవారం తెల్లవారుజామున మంత్రిని అదుపులోకి తీసుకుంది. చెన్నైలోని మంత్రి అధికారిక నివాసంలో 18 గంటలపాటు విచారించిన అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది. విచారణ అనంతరం బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో అరెస్ట్ చేస్తుండగా.. ఆ సమయంలో బాలాజీ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఛాతీ నొప్పి రావడంతో ఆయన్ను చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. మంత్రి కన్నీరు ఈడీ అధికారులు మంత్రిని అదుపులోకి తీసుకునే సమయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆసుపత్రి వెలుపల సైతం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. డీఎంకే అభిమానులు ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండగా.. వాహనంలో మంత్రి కన్నీరు పెట్టుకోవడం కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. #WATCH | Tamil Nadu Electricity Minister V Senthil Balaji breaks down as ED officials took him into custody in connection with a money laundering case and brought him to Omandurar Government in Chennai for medical examination pic.twitter.com/aATSM9DQpu — ANI (@ANI) June 13, 2023 అనంతరం మంత్రులు ఉదయనిధి స్టాలిన్, ఎం సుబ్రమణియన్, ఈవీ వేలు ఆసుపత్రిని సందర్శించారు. సెంథిల్ బాలాజీ అపస్మారక స్థితిలో ఉన్నారని, ఐసీయూలో పరిశీలనలో ఉన్నారని మంత్రి శేఖర్ బాబు తెలిపారు. మరోవైపు సెంథిల్ బాలాజీ అరెస్టు గురించి తమ కుటుంబ సభ్యులకు ఈడీ అధికారులు కనీసం సమాచారం ఇవ్వలేదని డీఎంకే రాజ్యసభ ఎంపీ, సీనియర్ న్యాయవాది ఎలాంగో విమర్శించారు. మంత్రి అరెస్ట్ నేపథ్యంలో ఒమందూరర్ ప్రభుత్వ ఎస్టేట్ వద్ద అదనపు బలగాలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను మోహరించారు. మంత్రిని పరామర్శించిన సీఎం అరెస్ట్ అయిన తర్వాత బాలాజీని కలిసేందుకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆస్పత్రికి చేరుకున్నారు. చికిత్స పొందుతున్న మంత్రిని పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. దర్యాప్తు సంస్థకు సహకరించినప్పటికీ, సెంథిల్ బాలాజీపై అధికారులు ఒత్తిడి తీసుకొచ్చారని, అందువల్లే ఛాతీ నొప్పి వచ్చిందని సీఎం పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆస్పత్రి బయట ఉన్న డీఎంకే కార్యకర్తలు గవర్నర్ ఆర్ఎన్ రవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా సెంథిల్‌బాలాజీకి చెందిన పలుప్రాంతాల్లో మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు జరిపిన విషయం తెలిసిందే. చెన్నైలోని ఆయన నివాసాలు, కార్యాలయాలు, సచివాలయంలోని చాంబర్, కరూర్, కోయంబత్తూరు, ఈరోడ్‌లోని ఆయన సన్నిహితుల నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు 18 గంటలపాటు సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా వారికి సీఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్ బలగాలు బందోబస్తు కల్పించారు. సీఎం స్టాలిన్ సీరియస్ అయితే, సచివాలయంలో ఎలాంటి అనుమతులు పొందకుండా ఈడీ సోదాలు నిర్వహించడంపై డీఎంకే ప్రభుత్వం సీరియస్ అయింది. దీనిని సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడవటంగా సీఎం స్టాలిన్ అభివర్ణించారు. తాను అడిగిన ప్రశ్నలకు సమాధాన చెప్పలేక దొడ్డి దారిన వచ్చి మరీ దాడిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై బుధవారం మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. ‘రాజకీయంగా ఎదుర్కోలేని బీజేపీ, బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోంది. వీటికి మేం భయపడం. ఈ విషయం వారే గ్రహించే సమయం దగ్గరపడింది’అని ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక ప్రకటనలో తెలిపారు. దివంగత సీఎం జయలలిత హయాంలో(2011-2016) రవాణా శాఖ మంత్రిగా ఉన్న సెంథిల్ బాలాజీపై లంచాలు తీసుకుని ఉద్యోగాలిచ్చినట్లు (క్యాష్ పర్ జాబ్స్) కుంభకోణం కేసు ఉంది. ఇందులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఐటీ.. తరువాత ఈడీ మంత్రి సెంథిల్ బాలాజీని టార్గెట్చేస్తూ గత నెలలోనూ ఆయన సోదరుడు, మిత్రులు, సన్నిహితులు, ఎక్సైజ్, విద్యుత్ శాఖల కాంట్రాక్టర్లపై ఐటీ సోదాలు వారం రోజుల పాటు సాగాయి .చైన్నె, కోయంబత్తూరు,కరూర్, ఈరోడ్లలోని 40 చోట్ల నాలుగైదు రోజులుగా సోదాలు జరిగాయి. ఈ సోదాల సమయంలో డీఎంకే వర్గాలు, సెంథిల్‌బాలాజీ మద్దతుదారులు తిరగబడడంతో ఐటీ అధికారులు బెంబేలెత్తిపోయారు. అయితే, అన్ని చోట్ల సోదాలు జరిగినా, మంత్రి నివాసాన్ని మాత్రం ఐటీ వర్గాలు వదలిపెట్టాయి. ఈ సోదాలు ముగిసిన పది రోజుల తర్వాత మరోసారి సెంథిల్‌బాలాజీని ఈడీ అధికారులు టార్గెట్ చేశారు. -
అమిత్ షాకు సీఎం స్టాలిన్ చురకలు
చెన్నై: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చురకలు అంటించారు. ప్రధాని మోదీపై ఎందుకంత కోపంతో ఉన్నారంటూ అమిత్ షాను ఉద్దేశించి వెటకారంగా ప్రశ్నించారాయన. ఆదివారం తమిళనాడు బీజేపీ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఆ భేటీలో పార్టీ కోసం కష్టపడాలని.. భవిష్యత్తులో తమిళనాడుకు చెందిన ఎవరైనా ప్రధాని అయ్యేలా కృషి చేయాలంటూ కార్యకర్తలను ఉద్దేశించి పిలుపు ఇచ్చినట్లు కథనాలు వెలువడ్డాయి. దీనిపై సేలంలో ఇవాళ సీఎం స్టాలిన్ స్పందించారు. ఆయన(షాను ఉద్దేశించి..) తన కార్యకర్తలకు ఇచ్చిన సలహాను స్వాగతిస్తున్నా. కానీ, మోదీ మీద ఆయన ఎందుకంత కోపంగా ఉన్నారో తెలియడం లేదు అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఒక తమిళ వ్యక్తి ప్రధాని కావాలనే ఆలోచనే బీజేపీకి ఉంటే.. తమిళిసై సౌందరరాజన్ (తెలంగాణ గవర్నర్), ఎల్ మురుగన్ (కేంద్ర మంత్రి) లాంటి వాళ్లు ఉన్నారు కదా. వాళ్లకు ప్రధానమంత్రి అభ్యర్థులుగా అవకాశం వస్తుందని భావిస్తున్నాను అంటూ వ్యాఖ్యానించారు సీఎం స్టాలిన్. ఇక ఇదే సమావేశంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలపైనా స్టాలిన్ స్పందించారు. గతంలో తమిళనాడు నుంచి ఇద్దరు రాజకీయ ప్రముఖులను ప్రధానులు కాకుండా డీఎంకే అడ్డుకుందని షా వ్యాఖ్యానించినట్లు ప్రచారం బయటకు వచ్చింది. ఆ వాదనను ఖండించిన స్టాలిన్.. షా గనుక బయట ఆ ప్రకటన చేస్తే దానికి డీఎంకే సమూలంగా వివరణ ఇస్తుందంటూ ప్రకటించారు. అలాగే.. నిధుల విషయంలో తమిళనాడుపట్ల కేంద్రం ప్రదర్శిస్తున్న వైఖరిపైనా స్టాలిన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: పవార్‌పై అలిగాడా? ఆయన చెప్పడా? -
ఇళయారాజా బర్త్‌డే.. ఇంటికి వెళ్లి మరీ విష్ చేసిన తమిళనాడు సీఎం
సంగీతాన్ని నవరసాల్లో నాట్యం చేయించే రారాజు ఇళయరాజా. సంగీతానికి రాళ్లను కరిగించే శక్తి ఉంటుందంటారు. ఇళయరాజా సంగీతంలో అంత మాధుర్యం ఉంటుంది. 80 వసంతాల ఇళయరాజా నేటికీ సంగీత రారాజుగానే కొనసాగుతున్నారు. శుక్రవారం ఆయన 80వ పుట్టినరోజు. ఇది సంగీతానికే జన్మదినం అన్నంతగా సంగీత ప్రియులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఈ సంగీత జ్ఞానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వయంగా ఇళయరాజా ఇంటికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు అందించి శాలువాతో సత్కరించారు. స్టాలిన్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో.. తొలిపొద్దు మధురంగా మారడానికి, ప్రయాణాలు సుఖవంతం కావడానికి, ఆనందమయం కావడానికి, కష్టాలు గాలిలో కలిసిపోవడానికి, రాత్రులు ప్రశాంతమయం కావడానికి కారణం సంగీత జ్ఞాని ఇళయరాజానే. ఆయన మన హృదయాలను రంజింపజేస్తున్నారు. తమిళ చిత్ర సీమకు మాత్రమే కాకుండా సంగీత ప్రపంచానికే ఆయన ఒక విప్లవం. అందుకే కరుణానిధి ఆయనను సంగీత జ్ఞాని అని కొనియాడారు. ఆయన సంగీతానికి మైమరచిపోయే అభిమానుల్లో ఒకరినైన నేను ఆ గొప్ప కళాకారుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపడానికి ఆనందిస్తున్నాను. మా హృదయాల్లో కోట కట్టి, జెండా నాటిన మీరు ఎప్పటికీ రాజానే, శతాధిక వసంతాలు దాటిన ఇళయరాజానే‘ అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. నటుడు కమల్ హాసన్ సైతం ఇళయారాజాకు ట్విటర్లో విష్ చేశారు. ‘సినీ సంగీతం 8 దశాబ్దాలు అధిగమించి సంతోషంగా కొనసాగుతోంది. ఇళయరాజా అనే ఐదు అక్షరాలు భారతీయ సినీ సంగీతంలో అపూర్వస్వరాలు అనేంతగా తన సంగీత సింహాసనాన్ని ఏర్పరచుకున్న తన ప్రియమైన, అన్నయ్య ఇళయరాజాకు హ్యాప్ బర్త్‌డే' అని పేర్కొన్నారు. చదవండి: విషమంగా పంచ్ ప్రసాద్ ఆరోగ్యం -
జపాన్ బుల్లెట్ ట్రైయిన్‌లో స్టాలిన్..భారత్‌లో కూడా..
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు సింగపూర్, జపాన్ రెండు దేశాల్లో అధికారికగా పర్యటించనున్న తెలిసిందే. ఈ క్రమంలో జపాన్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదివారం రాజధాని టోక్యోకి చేరుకోవడానికి బుల్లెట్ రైలులో ప్రయాణించారు. అందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేశారు. ఆ బుల్లెట్ ట్రైయిన్ జపాన్‌కు 500 కిలో మీటర్ల దూరంలో ఉన్న టోక్యోకు వెళ్లారు. స్టాలిన్ ట్విట్టర్ వేదికగా..ఇది భారతీయ పౌరులకు ఎంతో ప్రయోజనకారిగా ఉంటుందని ట్విట్టర్లో పేర్కొన్నారు. బుల్లెట్ ట్రైయిన్‌కి సమానమైన డిజైన్‌లో వేగం, నాణ్యతలలో లోపం లేని రైలు భారతదేశంలో కూడా అందుబాటులోకి రావాలన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు ఈ రైలు ద్వారా ప్రయోజనం పొందాలే ప్రయాణం సులభతరం చేయాలన్నారు. ஒசாகா நகரிலிருந்து டோக்கியோவுக்கு #BulletTrain-இல் பயணம் செய்கிறேன். ஏறத்தாழ 500 கி.மீ தூரத்தை இரண்டரை மணிநேரத்திற்குள் அடைந்துவிடுவோம். உருவமைப்பில் மட்டுமல்லாமல் வேகத்திலும் தரத்திலும் #BulletTrain-களுக்கு இணையான இரயில் சேவை நமது இந்தியாவிலும் பயன்பாட்டுக்கு வர வேண்டும்; ஏழை -… pic.twitter.com/bwxb7vGL8z — M.K.Stalin (@mkstalin) May 28, 2023 (చదవండి: కొత్త పార్లమెంట్ భవనంపై లాలు యాదవ్ పార్టీ వివాదాస్పద ట్వీట్) -
కృతిక ఉదయ నిధి ఆస్తుల అటాచ్?
సాక్షి, చెన్నై: సీఎం ఎంకే స్టాలిన్ కోడలు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సతీమణి కృతిక ఉదయ నిధికి సంబంధించిన రూ. 36.3 కోట్లు విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం అటాచ్ చేసినట్లు తెలిసింది. ఇటీవల ఉదయ నిధి సన్నిహితుల నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ, ఈడీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో లభించిన ఆధారాల మేరకు ఉదయ నిధి సేవా ట్రస్ట్‌కు సంబంధించిన నిర్వాహణ బాధ్యతల్లో ఉన్న కృతికను ఈడీ టార్గెట్ చేసినట్లు సమాచారం. ఆమె పేరిట ఉన్న స్థిర, చర ఆస్తులను ఈడీ అటాచ్ చేయడంతో పాటు ఆమె పేరిట బ్యాంక్‌లో ఉన్న రూ. 34 లక్షల నగదును సీజ్ చేసింది. -
కాంగ్రెస్, ప్రతిపక్షాల బల ప్రదర్శనగా ‘సిద్ధూ’ ప్రమాణ స్వీకారం
సాక్షి, బెంగళూరు: కంఠీరవ స్టేడియం వేదికగా కర్ణాటక కేబినెట్ శనివారం ప్రమాణ స్వీకారం చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీనియర్ నేత సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. సిద్ధరామయ్యతో గవర్నర్ థావర్ చంద్ గేహ్లాట్ ప్రమాణ స్వీకారం చేయించారు. కర్ణాటక డిప్యూటీ సీఎంగా కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ప్రమాణం చేశారు. వీరితోపాటు ఎనిమిది మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్, ప్రతిపక్షాల బల ప్రదర్శనగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకార వేదిక నిలిచింది. ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు బీజేపీ వ్యతిరేక పక్షాలు హాజరయ్యాయి. దేశంలోని విపక్షాల నేతలందరూ కదిలొచ్చి తమ ఐక్యతను ప్రదర్శించారు.ఒక వేదికపై విపక్షాలన్నీ కలిసి రావడం 2014 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ కార్యక్రమానికి 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. విపక్షాల మద్దతుతో వచ్చే ఎన్నికల్లో కర్ణాటక రోల్ మోడల్‌గా గెలవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఈ సభతో 2024 సార్వత్రిక ఎన్నికలకు విపక్షాలతో కలిసి వస్తామని కాంగ్రెస్ సూచనప్రాయంగా బయటపెట్టింది. #WATCH | Opposition leaders display their show of unity at the swearing-in ceremony of the newly-elected Karnataka government, in Bengaluru. pic.twitter.com/H1pNMeoeEC — ANI (@ANI) May 20, 2023 హాజరైన ప్రముఖులు వీళ్లే.. ►తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్, హిమాచల్ ప్రదేశ్ సుఖ్వీందర్ సింగ్, బిహార్ సీఎం నితీష్ కుమార్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బిహార్ సీఎం నితీష్ హాజరు ►తేజస్వీ యాదవ్, మెహబూబా ముఫ్తీ, ఏచూరి సీతారం, డీ రాజా, శరద్ పవార్, ఫారుఖ్ అబ్ధుల్లా ► కమల్ హాసన్, శివరాజ్ కుమార్. చదవండి: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం.. 8 మంది మంత్రులు వీళ్లే తొలి కేబినెట్ బేటీ: రాహుల్ గాంధీ మరో రెండు గంటల్లో కర్ణాటక తొలి కేబినెట్ సమావేశం జరగనున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. కర్ణాటక ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ప్రజలను ఉద్దేశించి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మాట్లాడారు. ‘ప్రజలకు స్వచ్ఛమైన, అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందిస్తాం. ఎన్నికలకు ముందు మేం ఏం చెప్పామో అవే చేస్తాం. 5 వాగ్దానాలు చేశాం. ఈ కేబినేట్ భేటీలో ఈ 5 హామీలు చట్టంగా మారుతాయి’ అని తెలిపారు. #WATCH | We made 5 promises to you. I had said we don't make false promises. We do what we say. In 1-2 hours, the first cabinet meeting of the Karnataka govt will happen and in that meeting these 5 promises will become law: Congress leader Rahul Gandhi pic.twitter.com/hhsancnayq — ANI (@ANI) May 20, 2023 -
పరిశ్రమల శాఖ మంత్రిగా రాజ
సాక్షి, చైన్నె: డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈనెల 7వ తేదీతో రెండేళ్లు పూర్తయిన విషయం తెలిసిందే. ప్రజా పాలన మూడో వసంతంలోకి అడుగు పెట్టిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రి వర్గంలో భారీ మార్పులు చేపట్టాలని సీఎం స్టాలిన్ నిర్ణయించారు. దీంతో పలువురు మంత్రుల పదవులు ఊడినట్లే అనే చర్చ జోరందుకుంది. అయితే పాడి పరిశ్రమల శాఖ మంత్రి నాజర్‌కు మాత్రమే ఉద్వాసన పలికారు. డీఎంకే సీనియర్ నేత టీఆర్ బాలు వారసుడు టీఆర్బీ రాజకు కొత్తగా మంత్రి వర్గంలో చోటు కల్పించారు. వేడుకగా ప్రమాణ స్వీకారం.. గురువారం ఉదయం గిండిలోని రాజ్‌భవన్‌లో మంత్రిగా టీఆర్బీ రాజతో గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా గవర్నర్ రవికి సీఎం స్టాలిన్ పుష్పగుచ్ఛాలను అందజేశారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీఆర్బీ రాజ సీఎం స్టాలిన్ ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. టీఆర్బీ రాజకు మంత్రి పదవి దక్కడంతో మన్నార్‌కుడిలోని ఆయన మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. తిరువారూర్ జిల్లాకు ఇంతవరకు మంత్రి లేరు. ఆ లోటు టీఆర్బీ రాజ రూపంలో సీఎం స్టాలిన్ భర్తీ చేయడాన్ని ఆహ్వానిస్తూ అక్కడి డీఎంకే శ్రేణులు స్వీట్లు పంచి.. బాణసంచా పేల్చుతూ ఆనందాన్ని పంచుకున్నారు. కాగా, తన కుమారుడు రాజకు మంత్రి పదవి దక్కడంతో డీఎంకే పార్లమెంటరీ నేత టీఆర్ బాలు ఆనందం వ్యక్తం చేశారు. మంత్రిగా రాజ ఉత్తమ సేవలు అందిస్తారన్నారు. సీఎం స్టాలిన్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, మరింత నమ్మకాన్ని పెంపొందించుకునే విధంగా పని తీరు ఉంటుందని ధీమా వ్యక్తంచేశారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం మంత్రులు అందరూ సీఎం స్టాలిన్, గవర్నర్ ఆర్ఎన్రవితో కలిసి గ్రూప్ ఫొటో తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. తదుపరి జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి వర్గం మార్పుకు గురించి సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. పీటీఆర్ చేజారిన ఆర్థికశాఖ ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు, టీఆర్బీ రాజకు శాఖను కేటాయిస్తూ సీఎం స్టాలిన్ చేసిన సిఫారసులకు గవర్నర్ రవి ఆమోద ముద్ర వేశారు. సీఎం స్టాలిన్, ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశించి ఆర్థిక మంత్రి పళణి వేల్ త్యాగరాజన్(పీటీఆర్) వివాదాస్పద వ్యాఖ్యలు, అవినీతి ఆరోపణలు చేసినట్లుగా ఓ ఆడియో ఇటీవల వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు పదవీ గండం తప్పదనే చర్చ జరిగింది. అయితే ఆయనకు ఉద్వాసన పలకలేదు. ఆయన శాఖలో మాత్రం మార్పు చేశారు. ఆర్థిక శాఖ నుంచి ఆయన్ని తప్పించి ఐటీ శాఖకు మార్చారు. ఈ శాఖను తనకు కేటాయించడాన్ని ఆహ్వానిస్తూ, సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ పీటీఆర్ ట్వీట్ చేశారు. పలువురి మంత్రుల శాఖల్లో మార్పు కొత్త మంత్రి టీఆర్బీ రాజకు పరిశ్రమల శాఖను కేటాయించారు. ఇది వరకు ఈ శాఖ తంగం తెన్నరసు చేతిలో ఉండేది. 2024 జనవరిలో పెట్టుబడిదారుల మహానాడు చైన్నె వేదికగా జరగనుంది. ఇందుకోసం ప్రపంచ దేశాలలో పర్యటించి పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు సీఎం స్టాలిన్ సిద్ధమయ్యారు. ఆయనతో పాటు టీఆర్బీ రాజ కూడా విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. వచ్చి రాగానే రాష్ట్రంలో ప్రస్తుతం కీలకంగా ఉన్న పరిశ్రమల శాఖ టీఆర్బీ ఖాతాలో పడడం గమనార్హం. ఇక ఆర్థిక శాఖను తంగం తెన్నరసుకు అప్పగించారు. రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఆర్థిక శాఖకు తంగం తెన్నరసు పూర్తి స్థాయిలో అర్హుడు అని పలువురు సీనియర్ మంత్రులు సైతం కితాబు ఇవ్వడం విశేషం. సమాచార శాఖ మంత్రి ఎంపీ స్వామినాథన్‌కు అదనంగా తమిళాభివృద్ధి శాఖను కేటాయించారు. ఇది వరకు ఐటీ శాఖ మంత్రిగా ఉన్న టి. మనో తంగరాజ్కు ప్రస్తుతం పాడి పరిశ్రమల శాఖను అప్పగించారు. శాఖల కేటాయింపు తర్వాత మంత్రులు టీఆర్బీ రాజ, పీటీఆర్, తంగం తెన్నరసు, ఎంపీ స్వామినాథన్, మనో తంగరాజ్ సీఎం స్టాలిన్‌ను సచివాలయంలో కలిసి.. ఆశీస్సులు అందుకున్నారు. -
కేబినెట్లో కొత్త ముఖాలకు చోటు
సాక్షి, చైన్నె: రాష్ట్ర కేబినెట్లో మార్పులకు వేళైంది. సీఎం స్టాలిన్ తన మంత్రి వర్గంలో మార్పులకు సంబంధించిన తాజా జాబితాను సిద్ధం చేసినట్లు సచివాలయంలో చర్చ జోరందుకుంది. నలుగురు మంత్రులకు ఉద్వాసన పలికి, వారి స్థానంలో కొత్త ముఖాలకు అవకాశం కల్పించబోతున్నట్లు తెలుస్తోంది. వివరాలు.. రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయ్యింది. ఆదివారం మూడో వసంతంలోకి అడుగు పెట్టింది. గత కొంత కాలంగా పలువురు మంత్రుల పనితీరుపై సీఎం స్టాలిన్ అసంతృప్తితో ఉన్నట్లు ఇప్పటికే సంకేతాలు వెలువడ్డాయి. వీరిలో కొందరిక ఉద్వాసన పలకడం, మరికొందరికి శాఖల్లో మార్పులు చేసే విధంగా కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం మార్పుల జాబితా సిద్ధమైనట్లు తెలిసింది. బుధవారం ఈ జాబితా బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ జాబితాలో ఆర్థిక మంత్రి పళణి వేల్ త్యాగరాజన్, అటవీ శాఖ మంత్రి రామచంద్రన్‌తో పాటు మరో ఇద్దరు మంత్రుల పేర్లు గల్లంతయ్యే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. -
త్వరలో స్టాలిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ! ఆ మంత్రి ఔట్
తమిళనాడు ముఖ్య మంత్రి ఎంకే స్టాలిన్ త్వరలో కేబినేట్ మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నారని అధికారికి వర్గాలు పేర్కొన్నాయి. ఆయన ఈ నెలాఖరులో విదేశాలకు వెళ్లనున్నందున మరో రెండు వారాల్లోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగవచ్చనని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అదీగాక రాష్ట్ర మంత్రివర్గంలో 53 మంది మంత్రులు ఉన్నారు. ఇది రాష్ట్రంలోని మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యలో 15% గరిష్టానికి చేరుకుంది. ఐతే దీనిలో ఈసారి కొత్త వారికి అవకాశం ఇవ్వోచ్చని, కొందర్ని నిష్క్రమించమని కోరే అవకాశం ఉందని సమాచారం. పనితీరు సరిగా లేని కనీసం ఇద్దరు మంత్రులను రాజీనామా చేయమని చెప్పే అవకాశం ఉందంటూ జోరుగా ఊహాగానాలు ఊపందుకున్నాయి. అందులో రాష్ట్ర ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్ ఉండే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి స్టాలిన్, అతని కుటంబంపై ఆర్థిక మంత్రి చేసిన ఆరోపణలకు సంబంధించి ఆడియో క్లిప్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్థికమంత్రి త్యాగరాజన్‌పై వేటుపడే అవకాశం ఉందని భావిస్తున్నారు నేతలు. కాగా, గతవారమే ముఖ్యమంత్రి స్టాలిన్ ఆ ఆడియో ఫైళ్లను చౌక రాజకీయాలుగా కొట్టిపారేశారు. ఆర్థిక మంత్రి త్యాగరాజన్ మాత్రం ఆ వ్యాఖ్యలను ఖండించారు. అయితే మంత్రివర్గ వ్యవస్థీకరణలో ఈసారి డీఎంకే ఎమ్మెల్యే టీరా్బీ రాజా, శంకరన్ కోవిల్ వంటి ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చే అవకాశం ఉందని పలువురు నాయకులు చెబుతుండటం గమనార్హం. (చదవండి: రెజ్లర్ల నిరసనలో పాల్గొనేందుకు తరలి వస్తున్న రైతులు..బారికేడ్లను చేధించి..) -
Tamil Nadu: ద్రవిడ మోడల్‌కు కాలం చెల్లింది.. గవర్నర్ తీవ్ర వ్యాఖ్యలు
సాక్షి, చైన్నె : ఏదీ శాంతి వనం..? ఎక్కడ భద్రత అంటూ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు అధికార డీఎంకేలో ఆగ్రహాన్ని రేపింది. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవర్నర్ మళ్లీ ప్రభుత్వంతో ఢీ కొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాలు.. ఆది నుంచి డీఎంకే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా గవర్నర్ ఆర్ఎన్ రవి వ్యవహిస్తున్నారనే ఆరోపణలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో గవర్నర్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో రెండు సార్లు డీఎంకే పాలకులు తీర్మానం చేశారు. అసెంబ్లీ ఆమోదించిన అనేక తీర్మానాలను గవర్నర్ మళ్లీ పక్కన పెట్టే పనిలో పడ్డారు. ఇందులో సిద్ధ వైద్య వర్సిటీ ఏర్పాటు తదితర అంశాలు ఉన్నాయి. డీఎంకే పాలకులపై పరోక్షంగా తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో చర్చల్లో ఉంటూ వస్తున్న గవర్నర్ ఈ సారి ఆంగ్ల మీడియా వేదికగా విమర్శలు ఎక్కువ పెట్టడం డీఎంకే పాలకులకు పుండు మీద కారం చల్లినట్లయ్యింది. వర్సిటీ నిబంధనలకు విరుద్ధంగా.. ఓ ఆంగ్ల మీడియాకు గవర్నర్ ఆర్ఎన్ రవి ఇచ్చిన ఇంటర్వ్యూలోని అంశాలు గురువారం వెలుగులోకి వచ్చాయి. ఇందులో ఆయన రాజ్ భవన్‌కు నిధుల కేటాయింపులు, ముసాయిదాల ఆమోదంలో జాప్యం, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘన, శాంతి భద్రతల వ్యవహారం, ద్రవిడ మోడల్ పాలనపై విమర్శలు గుప్పించే విధంగా వ్యాఖ్యలు చేశారు. విద్యా ముసాయిదాలపై గవర్నర్ స్పందిస్తూ, విద్య అన్నది జనరల్ కేటగిరీ జాబితాలో ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే, వర్సిటీలకు సంబంధించి ప్రభుత్వం పంపించిన ముసాయిదాలన్నీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు ఆరోపించారు. విద్యకు ప్రత్యేక అధికారం ఉందని, ఇందులో రాజకీయం జోక్యం తగదని గవర్నర్ స్పష్టం చేశారు. వీసీల నియామకం బిల్లు నుంచి సిద్ధ వర్సిటీ ముసాయిదా వరకు నిబంధనలకు అనుగుణంగా లేని కారణంగానే వాటిని పెండింగ్‌లో పెట్టినట్లు పేర్కొనడం గమనార్హం. నిధులపై రాద్ధాంతం తగదు రాజ్ భవన్‌కు నిధుల కేటాయింపు, ఖర్చుల గురించి స్పందిస్తూ, రాజ్ భవన్ కేటాయించిన మొత్తం దుర్వినియోగమైనట్లు ప్రభుత్వం పేర్కొనడం శోచనీయమన్నారు. గవర్నర్‌కు కేటాయించిన నిధులు, ఖర్చులను ఎవ్వరూ కట్టడి చేయలేరని, ఇది గవర్నర్ వ్యక్తిగత నిర్ణయాలకు అనుగుణంగా ఉంటుందన్నారు. ఇక అక్షయ పాత్ర నిర్వహణ అంశం గతంలో పూర్తిగా గవర్నర్ పరిధిలో ఉందని, తద్వారా అక్షయ పాత్ర పేద విద్యార్థుల కడుపు నింపిందని ఆర్ఎన్ రవి వివరించారు. కాలం చెల్లింది.. ద్రవిడ మోడల్ పాలన గురించి స్పందిస్తూ, ఇది కాలం చెల్లిన సిద్ధాంతమని గవర్నర్ వ్యాఖ్యానించారు. శాంతి భద్రతల గురించి స్పందిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత వివాదానికి ఆజ్యం పోశాయి. అసెంబ్లీ వేదికగా రాష్ట్రం శాంతివనంగా ఉండటం వంటి అంశాలను తాను ప్రాస్తవించక పోవడాన్ని గుర్తు చేస్తూ గవర్నర్ కొన్ని వ్యాఖ్యల తూటాలు పేల్చారు. రాష్ట్రంలో ఏదీ శాంతి, ఎక్కడ భద్రతా.. అంటూ గవర్నర్ ఎదురు ప్రశ్నలు వేయడం గమనార్హం. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై నిషేధం అనంతరం అనేక చోట్ల జరిగిన పెట్రో బాంబు దాడులు, కోవై పేలుడు ఘటన, కళ్లకురిచ్చి అలర్లు, తిరుచ్చి డీఎంలో వార్, మహిళా పోలీసులకు బెదిరింపులు, ఇసుక మాఫియా చేతిలో వీఏఓ హత్య వంటి అంశాలను ప్రస్తావిస్తూ గవర్నర్‌పై ప్రశ్నలను సంధించడం గమనార్హం. ఈ పరిణామాలను డీఎంకే నేతలు తీవ్రంగానే పరిగణించారు. ఎదురు దాడికి సిద్ధమయ్యే విధంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఇదే విషయంగా స్పీకర్ అప్పావును ప్రశ్నించగా, అసెంబ్లీ వ్యవహారాలను బహిరంగంగా చర్చించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఈ వ్యవహారాన్ని సీఎం స్టాలిన్ నిశితంగా పరిశీలిస్తున్నారని సరైన సమయంలో స్పందిస్తారన్నారు. అదే సమయంలో గవర్నర్ వ్యాఖ్యలను అస్త్రంగా చేసుకుని డీఎంకే వర్గాలు పోరుబాటకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిసింది. -
దిగజారుడు నేతలకు పబ్లిసిటీ ఇవ్వం!.. అన్నామలైపై సీఎం పరోక్ష విమర్శలు
సాక్షి, చైన్నె: దిగజారుడు రాజకీయాలు చేసే వారికి ఫ్రీ పబ్లిసిటీ ఇవ్వదలచుకోలేదని పరోక్షంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైను ఉద్దేశించి సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. తానుప్రజా సేవలో బిజీగా ఉన్నానని, అనాగరిక రాజకీయాలు చేసే వాళ్లను పట్టించుకోనని స్పష్టం చేశారు. మీలో ఒకడిని.. పేరిట సామాజిక మాధ్యమాల వేదికగా తనకు వచ్చే ప్రశ్నలకు సీఎం ఎంకే స్టాలిన్ సమాధానాలు ఇస్తూ వస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం పలువురు సంధించిన అనేక ప్రశ్నలకు సీఎం జవాబిచ్చారు. ఈ సారి సమాధానాలు ఇవ్వడంలో కొంత జాప్యం జరిగిందని పేర్కొంటూ, రెండేళ్ల పాలనలో అమల్లోకి తెచ్చిన కీలక పథకాలను, వాటి తీరు తెన్నులను వివరించారు. ప్రాజెక్టులు ఊపందుకుంటున్నాయని, అన్ని రంగాలలో తమిళనాడును నెంబర్ –1 చేయడమే లక్ష్యంగా దూసుకుపోతున్నామని ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు. సామాజిక న్యాయ రాజధాని.. తమిళనాడు స్వరం భారతదేశ వ్యాప్తంగా మారుమోగిందని, సామాజిక న్యాయానికి తమిళనాడు రాజధానిగా మారిందని పేర్కొన్నారు. రాష్ట్ర స్వయం ప్రతిపత్తి హక్కుల విషయంలో తగ్గేదే లేదన్నారు. రెండేళ్ల పాలన పూర్తిస్థాయి సంతృప్తిని కలిగించినట్లు పేర్కొన్నారు. ఈ కాలంలో మూడు వంతులకు పైగా హామీలను నెరవేర్చినట్లు వివరించారు. పదేళ్ల అన్నాడీఎంకే పాలన రూపంలో రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా దిగజారిందని, దీనిని తాము మళ్లీ నిలబెట్టే ప్రయత్నంలో విజయవంత మయ్యామన్నారు. అమిత్ షాపై ఆగ్రహం బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలో ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తాం.. అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరిని సంతృప్తి పరిచేందుకు మరొకరిపై ద్వేషం పెంచడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఈ దేశంలో హిందూ, ముస్లింలు సోదర భావంతో మెలుగుతున్నారని పేర్కొన్నారు. ద్వేష పూరిత రాజకీయాల వైపుగా బీజేపీ ముందుకెళ్తోందని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధంగా హోంమంత్రి చేసిన వ్యాఖ్యలను ప్రజలు నిశితంగానే గమనిస్తున్నారని పేర్కొన్నారు. చౌకబారు విమర్శలను పట్టించుకోం.. ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్ చేసిన వ్యాఖ్యలుగా పేర్కొంటూ సామాజిక మాధ్యమాలలలో జరుగుతున్న ఆడియో ప్రచారం గురించి సీఎం స్పందించారు. ఇప్పటికే మంత్రి రెండు సార్లు ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజా సేవలో తాను బిజీగా ఉన్నానని, చౌక బారు విమర్శలు, ఆరోపణల గురించి పట్టించుకోదలచుకో లేదన్నారు. అన్నామలైను ఉద్దేశించే ఈ00 వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. ఇక దివంగత నేత కరుణానిధి శత జయంతి వేడుకలను ఈ ఏడాది పొడవున బ్రహ్మాండంగా నిర్వహిస్తామన్నారు. ఈ వేడుకలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనుండడం ఆనందంగా ఉందన్నారు. ప్రజల విజ్ఞప్తులను అర్థం చేసుకోవడం, వారి గళానికి గౌరవం ఇచ్చే విధంగా ముందుకెళ్లడం తన అభిమతంగా పేర్కొన్నారు. అన్నాడీఎంకే పాలనలో ఏం జరిగిందో ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. అవినీతికి పాల్పడిన వారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని, అవినీతి కేసుల్లో అందరినీ కచ్చితంగా కోర్టు బోనులో నిలబెడుతామన్నారు. -
పని వేళల పెంపుపై సర్వత్రా నిరసన
సాక్షి, చైన్నె: ప్రైవేటు సంస్థల్లో పని వేళలు 8 గంటల నుంచి 12 గంటలకు పొడిగిస్తూ అసెంబ్లీ వేదికగా తీసుకొచ్చిన చట్టం వివాదానికి దారి తీసింది. దీనిని వ్యతిరేకిస్తూ డీఎంకే మిత్ర పక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి. ఆ పార్టీల అనుబంధ కార్మిక సంఘాలు శనివారం రాష్ట్రంలో పలు చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. వివరాలు.. ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలలో పని వేళలను 12 గంటలుగా నిర్ణయిస్తూ అసెంబ్లీ వేదికగా శుక్రవారం చట్టం ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయాన్ని డీఎంకే మిత్ర పక్ష పార్టీలు అసెంబ్లీ వేదికగా ఈ చట్టానికి వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించాయి. దీనిని పట్టించుకోని పాలకులు చట్టాన్ని ఆమోదించారు. ఈ చట్టం కారణంగా కార్మికులకు పని భారం పెరగనుందని, ఉప సంహరించుకోవాలని నినాదిస్తూ డీఎంకే మిత్ర పక్షాలకు చెందిన సీఐటీయూ, ఏఐటీయూసీ, తదితర కార్మిక సంఘాలు శనివారం పలు చోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. మదురై, తిరునల్వేలి, రామనాథపురంలో నిరసనలు హోరెత్తాయి. రామేశ్వరం అగ్ని తీర్థంలోకి దిగి మరీ తమ నిరసనను కార్మిక సంఘాలు వ్యక్తం చేశాయి. ప్రభుత్వం ఈ చట్టాన్ని ఉపసంహరించుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఉధృతం అవుతాయన్న హెచ్చరించారు. ఇక ఈ చట్టాన్ని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి తీవ్రంగా వ్యతిరేకించారు. కార్మికుల జీవితాలతో చెలాగాటాలు వద్దు అని హెచ్చరించారు. గతంలో కేంద్రం ఇచ్చిన ఈ ఆదేశాలను తాము అమలు చేయడానికి ప్రయత్నిస్తే తీవ్రంగా వ్యతిరేకించిన డీఎంకే, ఇప్పుడు దీనిని అమలు చేయడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, ఈ చట్టం వివాదానికి దారి తీయడం, కార్మికుల్లో నెలకొన్న ఆందోళనను నివృత్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 24వ తేదీ అన్ని కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించి, ఈ చట్టం గురించి వివరించనున్నారు. -
డీఎంకే మిత్రుల్లో ‘పని’ చిచ్చు
సాక్షి, చైన్నె: డీఎంకే మిత్రపక్షాలలో ప్రైవేటు సంస్థలలో పని వేళల పొడిగింపు వ్యవహారం చిచ్చు రేపింది. ప్రైవేటు సంస్థలలో 8 గంటలకు బదులుగా 12 గంటల పని వేళలు అన్న ప్రభుత్వ నిర్ణయాన్ని మిత్రపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. డీఎంకే అధ్యక్షుడు, సీఎం ఎంకే స్టాలిన్ నిర్ణయానికి అనుగుణంగా గత కొన్నేళ్ల పాటు మిత్ర పక్షాలైన కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకే పార్టీలు అడుగులు వేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే, అసెంబ్లీ వేదికగా మిత్ర పక్షాలు తమ కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న డీఎంకే ప్రభుత్వ నిర్ణయాన్ని శుక్రవారం తీవ్రంగా వ్యతిరేకించాయి. మంత్రులు సీవీ గణేషన్, తంగం తెన్నరసు సభలో ఓ ముసాయిదా ప్రవేశపెట్టారు. ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలలో ఇక 8 గంటలకు బదులుగా 12 గంటల పనివేళలు నిర్ణయిస్తున్నామని ఆ తీర్మానంలో వివరించారు. దీనిని సభలో ఉన్న కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకే డీఎంకే మిత్రపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. 8 గంటల పనివేళలను 12 గంటలుగా నిర్ణయించడం కార్మికులతో చెలాగాటం ఆడినట్టేనని, ఈ ప్రయత్నాన్ని వీడాలని డిమాండ్ చేశాయి. ఇందుకు మంత్రులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా, ఆ పార్టీలు అంగీకరించ లేదు. దీంతో సభలో ఆ తీర్మానాన్ని డీఎంకే మెజారిటీ సభ్యుల నిర్ణయంతో ఆమోదించారు. అయితే, డీఎంకే మిత్రపక్షాలు మాత్రం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సభలో నినదించడం గమనార్హం. అనంతరం వెలుపల మంత్రులు మీడియాకు ఈ చట్టం గురించి వివరించారు. ఇది బలవంతం కాదని, ఆయా సంస్థలు, అక్కడి సిబ్బంది నిర్ణయం మేరకు అమల్లో ఉంటుందని వివరించారు. పని వేళలను పొడిగించడం ద్వారా రాష్ట్రంలోకి పెట్టుబడుల వరద మరింతగా పెరగనున్నాయని, లక్షలాది మందికి ఉపాధి దక్కబోతోందని వివరించారు. 12 గంటల పని వేళ అనేది పరిశ్రమల యాజమాన్యం, కార్మికుల పరస్పరం అంగీకారం మేరకు అమలు అవుతుందని, ఇందులో బలవంతం లేదని స్పష్టం చేశారు. ఏదేని సంస్థ, పరిశ్రమల బలవంతంగా 12 గంటలు పనిచేయాలని ఒత్తిడి తెచ్చిన పక్షంలో ఆసంస్థలపై చర్యలు తీసుకునేలా ఈ చట్టంలో అంశాలను పొందుపరిచినట్టు వివరించారు. ఈ చట్టం ఎలక్ట్రానిక్ ఆధారిత, క్లస్టర్ ఎలక్ట్రానిక్స్, నాన్ లెదర్ పరిశ్రమలకు ఉపయోగకరంగా ఉంటుందని, ఇక్కడ కార్మికులు అధిక గంటలు పనిచేస్తున్నారని వివరించారు. ఈ చట్టం ఆధారంగా కార్మికులకు అదనపు పని వేళలకు తగ్గ ప్రయోజనాలు కూడా ఉంటాయని వివరించారు. -
40 స్థానాల్లోనూ గెలుపే లక్ష్యం
సాక్షి, చైన్నె : లోక్‌సభ ఎన్నికల్లో పుదుచ్చేరితో పాటు రాష్ట్రంలోని 40 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా.. కార్యక్ర మాలపై దృష్టి పెట్టాలని నియోజకవర్గ పర్యవేక్షకులకు డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో క్లీన్ స్వీపే లక్ష్యంగా స్టాలిన్ వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. ఇందుకోసం రాష్ట్రంలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లు, పర్యవేక్షకులను నియమించి కార్యక్రమాలను విస్తృతం చేయాలని నిర్ణయించారు. వీరితో శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యా రు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి. సభ్యత్వ నమోదు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని వివరించారు. పుదుచ్చేరితో పాటు రాష్ట్రంలోని 40 స్థానాల్ని కై వసం చేసుకునే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆయన ఆదేశించారు. అలాగే ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటి ముంగిటకు చేరే విధంగా ప్రత్యేక కార్యక్రమాలను విస్తృతం చేయాలని సూచించారు. -
విషాదం: నదిలో స్నానానికి వెళ్లి నలుగురు విద్యార్థుల మృతి.. సీఎం దిగ్భ్రాంతి
సాక్షి, చైన్నె: సేలం సమీపంలోని కావేరి నదిలోకి గురువారం సాయంత్రం స్నానానికి వెళ్లి నలుగురు విద్యార్థులు మరణించారు. ఈ ఘటనపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివరాలు.. సేలం జిల్లా మేట్టూరు సమీపంలోని సంగ గిరిలో ఉన్న ఓ ప్రైవేటు కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులు 10 మంది మధ్యాహ్నం కళాశాలకు డుమ్మా కొట్టి బయటకు వచ్చేశారు. వీరంతా ఎడపాడి సమీపంలోని కల్ వడంగం వద్ద కావేరి నదిలో స్నానానికి వెళ్లారు. మిత్రులందరూ ఆడుకుంటూ ఆనందంతో స్నానం చేస్తుండగా మణి కంఠన్ అనే విద్యార్థి బురద ప్రాంతంలో కూరుకు పోయాడు. అతడిని రక్షించేందుకు ప్రయత్నించి మరో ముగ్గురు మిత్రులు గల్లంతయ్యారు. మిగిలిన వారు ఆందోళనతో ఒడ్డుకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు , గజ ఈతగాళ్లు ఆ పరిసరాలలో గాలించారు. అయితే, నలుగురు విద్యార్థులను మృతదేహాలుగా బయటకు తీశారు. మరణించిన వారిలో పిమణి కుమారుడు మణి కంఠన్(20), సెల్వం కుమారుడు ముత్తుస్వామి(20), మరో మణికంఠన్(20), పాండియరాజన్(20)గా గుర్తించారు. విద్యార్థుల మరణ సమాచారంతో సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తలా రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనపై ప్రధాన ప్రతిపక్ష నేత, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిపళణి స్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
రిజర్వేషన్లపై శాసనసభలో రచ్చరచ్చ! సీఎం హామీతో శాంతించిన వైనం
సాక్షి, చైన్నె: వన్నియర్లకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో ప్రత్యేకంగా 10.5 శాతం స్థానిక కోటా రిజర్వేషన్‌ను గత అన్నాడీఎంకే ప్రభుత్వ అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. 2021 అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆగమేఘాలపై చట్టం తీసుకురావడం, గవర్నర్ ఆమోదించడం చక చకా జరిగిపోయాయి. అయితే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లు 10.5 శాతం రిజర్వేషన్‌ను ప్రశ్నార్థకం చేశాయి. తొలుత మధురై ధర్మాసనం ఈ రిజర్వేషన్లను రద్దు చేసింది. నిబంధనలను పాటించకుండా ఆగమేఘాలపై తెచ్చిన ఈ రిజర్వేషన్ చెల్లదని సుప్రీం కోర్టు సైతం తీర్పు ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ వేదికగా ఈ రిజర్వేషన్ అమలు విషయంపై చర్చకు పీఎంకే పట్టుబట్టింది. నువ్వా..నేనా..? పీఎంకే శాసన సభా పక్ష నేత జీకే మణి సభలో రిజర్వేషన్ల అంశంపై ప్రసంగించారు. ఆయన చేసిన ఓ వ్యాఖ్యపై స్పీకర్ అప్పావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ వివాదాలకు వేదిక ఇది కాదని ఆయన మందలించారు. అయినా, జీకే మణి తగ్గక పోవడంతో సభలో వివాదం చోటు చేసుకుంది. సీనియర్ మంత్రి దురై మురుగన్ స్పందిస్తూ, వన్నియర్ల సామాజిక వర్గం డీఎంకేలోనే అధికంగా ఉన్నారని పేర్కొంటూ, చిత్తశుద్ధితోనే తాము పనిచేస్తున్నామని విరుచుకు పడ్డారు. అలాంటప్పుడు ఈ రిజర్వేషన్ల వ్యవహారంలో నియమించిన కమిషన్‌కు ఆరు నెలలు గడువు ఎందుకు పెంచారని జీకే మణి ప్రశ్నించారు. అదే సమయంలో తమిళర్ వాల్వురిమై కట్చి ఎమ్మెల్యే వేల్ మురుగన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో సభా రికార్డుల నుంచి తొలగించాలనే నినాదాలు మిన్నంటాయి. అన్నాడీఎంకే సభ్యుడు కేపీ మునుస్వామి మాట్లాడుతూ, తమ హయాంలోనే ఈ రిజర్వేషన్ తీసుకొచ్చామని, విద్యా, ఉద్యోగ అవకాశాలలో ఆ సామాజిక వర్గం యువతకు సమన్యాయం చేయాలని పట్టుబట్టారు. చివరగా సీఎం స్టాలిన్ స్పందిస్తూ, తాము అధికారంలోకి వచ్చినానంతరం కూడా ఈ రిజర్వేషన్‌ను అమలు చేశామని, అయితే కోర్టు రూపంలో దీనికి బ్రేక్ పడిందన్నారు. ఈ చట్టాన్ని అమలు చేయడం కోసం తాము కోర్టులో బలమైన వాదనలు వినిపించామన్నారు. అయితే అత్యవసరంగా, ఆగమేఘాలపై , ఏ సమయంలో.. ఎందుకు ఈ చట్టం తీసుకు రావాల్సి వచ్చిందో అనే విషయం పీఎంకే వర్గాలకే బాగా తెలుసునని, అందుకే కోర్టు చెక్ పెట్టిందని పేర్కొన్నారు. కమిషన్ విజ్ఞప్తి మేరకు గడువు పొడిగించామని, అంతలోపు కమిషన్ నివేదిక సమర్పిస్తుందని భావిస్తున్నామన్నారు. చివరకు సీఎం హామీతో సభలో వివాదం ముగిసింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత సెల్వ పెరుంతొగై, కొంగు నాడు మక్కల్ దేశీయ కట్చి ఎమ్మెల్యే ఈశ్వరన్, వీసీకే బాలాజీ ప్రసంగించారు. బీజేపీ వాకౌట్.. సభలో ఐపీఎల్ వ్యవహారం బుధవారం చర్చకు వచ్చిన విషయం తెలిసిందే. ఈసమయంలో క్రీడల మంత్రి ఉదయ నిధి స్టాలిన్ ప్రసంగిస్తూ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆయన తనయుడి గురించి వ్యాఖ్యలు చేసినట్టు సామాజిక మాధ్యమాలలో ఓ వార్త వైరల్‌గా మారింది. ఇది గురువారం సభలో ప్రస్తావనకు వచ్చింది. అమిత్ షా పేరును ఉచ్చరించాల్సిన అవసరం ఉదయ నిధికి ఎందుకు వచ్చిందో వివరణ ఇవ్వాలని, ఆయన వ్యాఖ్యలను సభా రికార్డుల నుంచి తొలగించాలని బీజేపీ సభ్యులు పట్టుబట్టారు. ఇందుకు సీఎం స్టాలిన్ ఇచ్చిన సమాధానంతో ఏకీభవించని బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు సభలో అటవీ, పర్యావరణ, వెనుకబడిన తరగతుల శాఖలకు నిధు ల కేటాయింపులు చర్చ సుదీర్ఘ చర్చ సాగింది. నల్ల మాస్కులతో సభకు... సభకు అన్నాడీఎంకే సభ్యులు అందరూ నల్ల మాస్క్‌లు ధరించి వచ్చారు. ప్రసంగించే సమయంలో మాస్క్‌లు తొలగించగా, ఆ తర్వాత మాస్క్‌లు వేసుకుని కనిపించారు. ఈ విషయంగా సీనియర్ మంత్రి దురై మురుగన్ స్పందిస్తూ, సభకు ఎలా రావాలో అనే నిబంధనలు తెలిసిన ప్రధాన ప్రతిపక్షం, ఇప్పుడు ఎందుకు ఈ రకంగా వచ్చారని..? ప్రశ్నించారు. తొలుత అన్నాడీఎంకే సభ్యులు స్పందించనప్పటికీ చివరకు, ఆ పార్టీ విప్ ఎస్పీ వేలుమణి పేర్కొంటూ, తమ గళాన్ని నొక్కేస్తున్నారని, తమ ప్రసంగాలు, విజ్ఞప్తులు, డిమాండ్లు బయటకు తెలియజేయకుండా అడ్డుకుంటున్నారని, అందుకే ఇలా నిరసన వ్యక్తం చేశామని వెల్లడించారు. -
సుప్రీంకోర్టులో సీఎం స్టాలిన్‌కు షాక్.. ఆర్ఎస్ఎస్ ర్యాలీకి లైన్ క్లియర్..
న్యూఢిల్లీ: తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ ర్యాలీలకు అనుమతి ఇస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం సవాల్ చేయగా.. సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. హైకోర్టు తీర్పును సమర్థించింది. తమిళనాడు వ్యాప్తంగా రూట్ మార్చ్‌లు నిర్వహించాలనుకున్న ఆర్ఎస్ఎస్కు స్టాలిన్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఈ ర్యాలీలపై నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) దాడులకు పాల్పడే అవకాశం ఉందని, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని కారణంగా పేర్కొంది. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆర్ఎస్ఎస్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. పిబ్రవరి 10న ర్యాలీలకు అనుమతి ఇస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును స్టాలిన్ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. అక్కడ కూడా నిరాశే ఎదురైంది. సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం ఇచ్చిన తీర్పుతో తమిళనాడు వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించేందుకు ఆర్ఎస్ఎస్ సిద్ధమవుతోంది. చదవండి: జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే.. ఓ రాజకీయ పార్టీకి ఎలాంటి అర్హతలుండాలి? -
చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో మరో కొత్త టర్మినల్
చెన్నై: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.1,260 కోట్లతో నిర్మించిన నూతన ఇంటిగ్రేటెడ్ టర్మినల్ భవంతి(ఫేజ్–1)ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వం ఉట్టిపడేలా అద్భుత రీతిలో ఈ టర్మినల్‌కు తుదిరూపునిచ్చారు. ‘ సంవత్సరానికి 2.3 కోట్ల మంది ప్రయాణికుల సామర్థ్యమున్న ఎయిర్పోర్ట్ నూతన టర్మినల్ ఏర్పాటుతో ఇక మీదట ప్రతి సంవత్సరం మూడు కోట్ల మంది ప్రయాణికుల రాకపోకల సామర్థ్యాన్ని సంతరించుకుంటుంది’ అని ప్రభుత్వం పేర్కొంది. తమిళనాడు సంప్రదాయాల్లో ఒకటైన కొల్లం(రంగోళీ), విశేష ప్రాచుర్యం పొందిన పురాతన ఆలయాలు, భరతనాట్యం, రాష్ట్రంలోని ప్రకృతి సోయగాలు, వారసత్వంగా వస్తున్న స్థానిక చీరలు ఇలా తమిళనాడుకే ప్రత్యేకమైన విశిష్టతల మేళవింపుగా భిన్న డిజైన్లతో నూతన టర్మినల్‌ను సర్వాంగ సుందరంగా నిర్మించారు. నూతన టర్మినల్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీతోపాటు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా పాల్గొన్నారు. దీంతోపాటు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్లో జరిగిన కార్యక్రమంలో చెన్నై–కోయంబత్తూరు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. ‘అద్భుత నగరాలకు అనుసంధానించిన వందేభారత్‌కు కృతజ్ఞతలు’ అని ఈ సందర్భంగా మోదీ ట్వీట్‌చేశారు. కొత్త రైలురాకతో రెండు నగరాల మధ్య ప్రయాణకాలం గంటకుపైగా తగ్గనుంది. రాష్ట్ర రాజధాని, పారిశ్రామిక పట్టణం మధ్య ప్రయాణించే అత్యంత వేగవంతమైన రైలు ఇదే కావడం విశేషం. సేలం, ఈరోడ్, తిరుపూర్‌లలోనూ ఈ రైలు ఆగుతుంది. బుధవారం మినహా అన్ని వారాల్లో ఈ రైలు రాకపోకలు కొనసాగుతాయి. వివేకానంద హౌజ్‌ను సందర్శించిన మోదీ చెన్నై పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ నగరంలోని వివేకానంద హౌజ్‌ను దర్శించారు. 1897లో స్వామి వివేకానంద ఈ భవంతిలోనే తొమ్మిదిరోజులు బస చేశారు. రామకృష్ణ మఠ్ 125వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో మోదీ మాట్లాడారు. ‘ రామకృష్ణమఠ్ అంటే నాకెంతో గౌరవం. నా జీవితంలో ఈ మఠం అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించింది. పాశ్చాత్య దేశాలకు పయనంకాకముందు వివేకానందుడు బసచేసిన ఈ భవంతిని దర్శించడం నాకు దక్కిన ఒక మంచి అవకాశం. ఇక్కడ ధ్యానం చేయడం ప్రత్యేకమైన అనుభవం. ఇది నాకెంతో ప్రేరణను, కొండంత బలాన్ని ఇస్తోంది. ఆధునిక సాంకేతికత సాయంతో పురాతనమైన నాటి గొప్ప ఆలోచనలు నేడు ముందు తరాలకు అందుతుండటం చాలా సంతోషదాయకం’ అని మోదీ అన్నారు. ఈ సందర్భంగా వివేకానంద విగ్రహానికి మోదీ ఘన నివాళులర్పించారు. -
ఉమ్మడి గళం వినిపిద్దాం
చెన్నై/న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దె దించేందుకు ఉమ్మడిగా పోరాడాల్సిందేనని డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుండబద్దలు కొట్టారు. విపక్ష పార్టీలు కూటమి కట్టకుండా విడిగా పోటీ చేస్తే ఎలాంటి లాభం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో మళ్లీ సామాజిక న్యాయం, సమైక్యత, సోదరభావం, సమానత్వం సాధించాలంటే విపక్ష పార్టీలన్నీ ఉమ్మడిగా పోరాడాలని పిలుపునిచ్చారు. డీఎంకే ఆధ్వర్యంలో ఆన్లైన్ వేదికగా హైబ్రిడ్మోడ్లో సోమవారం తొలి ‘సామాజిక న్యాయ సదస్సు’ జరిగింది. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, నేషనల్ కాన్ఫెరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, తృణమూల్ కాంగ్రెస్ నేత డిరెక్ ఒబ్రియన్, ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్, ఎన్సీపీ, ఐయూఎంఎల్, బీఆర్ఎస్, ఎండీఎంకే, ఆర్ఎస్పీ, ఎల్ఎస్పీ, వీసీకే తదితర పార్టీల నేతలు పాల్గొని ప్రసంగించారు. అన్ని పార్టీలను ఏకతాటి మీదకు తేవడం అత్యంత ప్రధానమైన విషయమని స్టాలిన్ అన్నారు. ‘‘ఇది కొన్ని రాష్ట్రాలకే పరిమితం కాకూడదు. దేశవ్యాప్తంగా సాకారం కావాలి. అందరం కలసి పోరాడదాం’’ అని పిలుపునిచ్చారు. ‘‘కేంద్రం ఏ హేతుబద్ద ప్రమాణాల ఆధారంగా 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటా అమలుచేస్తోంది? ఇది సామాజిక న్యాయం అనిపించుకోదు’’ అన్నారు. దేశవ్యాప్త కులగణన: తేజస్వి వెనకబడిన కులాలకు రిజర్వేషన్ ఫలాలు దక్కాలంటే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాల్సిందేనని తేజస్వీ యాదవ్ స్పష్టం చేశారు. ‘‘బిహార్‌లో మహాఘట్బంధన్ సర్కార్ ఈ దిశగా ఇప్పటికే అడుగేసింది. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో ఓబీసీలకు అదనపు రిజర్వేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. కానీ గవర్నర్లు మోకాలడ్డుతున్నారు’ అని ఆరోపించారు. సామాజిక న్యాయ రాజకీయాలతో బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కొందామని అన్నారు. దేశవ్యాప్త కులగణన డిమాండ్‌కు విపక్ష నేతలంతా మద్దతు పలికారు. విడివిడిగా ఎలాంటి లాభం ఉండదు: డీఎంకే చీఫ్ స్టాలిన్ ‘సామాజిక న్యాయ’ తొలి సదస్సులో పాల్గొన్న విపక్ష నేతలు -
సోమవారం చెన్నైలో విపక్షాల భేటీ
న్యూఢిల్లీ: దేశంలో సామాజిక న్యాయం అమలు తీరుతెన్నులపై చర్చించడానికి కాంగ్రెస్‌తోపాటు 20 ప్రతిపక్ష పార్టీల నేతలు సోమవారం తమిళనాడు రాజధాని చెన్నైలో భేటీ కానున్నారు. డీఎంకే చీఫ్ స్టాలిన్ ఈ సమావేశం నిర్వహించనున్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) చీఫ్ హేమంత్ సోరెన్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఎస్పీ చీఫ్ అఖిలేశ్‌యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, బీఆర్ఎస్ నాయకుడు కె.కేశవరావు, సీపీఎం నేత సీతారాం ఏచూరి, సీపీఐ నాయకుడు డి.రాజా, ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యనేత సంజయ్ సింగ్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి డెరెక్ ఓ బ్రియన్ తదితరులు పాల్గొంటారు. మరికొన్ని పార్టీల నుంచి ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది రాజకీయ సమావేశం కాదని, సామాజిక అంశంపై చర్చించడానికి జరుగుతున్న భేటీ అని విపక్ష నేతలు వెల్లడించారు. -
స్టాలిన్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పి
చెన్నై: తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వానికి కొత్త తలనొప్పి వచ్చిపడింది. సోషల్ మీడియాలో.. మరీ ముఖ్యంగా అక్కడి ప్రజలు బాగా యాక్టివ్‌గా ఉండే ట్విటర్లోనే ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం ఎడాపెడా సాగుతోంది. అందునా తమిళ చిత్రాల ఫన్నీ వీడియోలతో రూపొందుతున్న మీమ్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కట్టడికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోగా.. అణచివేతకు దిగుతోందంటూ ప్రభుత్వంపైనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తమిళనాడు బడ్జెట్‌కు సంబంధించిన ఓ మీమ్ విపరీతంగా ట్రెండ్ అయ్యింది. బడ్జెట్ 2023-24లోభాగంగా మహిళలకు(ప్రత్యేకించి గృహిణులకు) నెలవారీ సహాయ పథకం ఏడువేల కోట్ల రూపాయలను కేటాయించింది స్టాలిన్ ప్రభుత్వం. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి నెలవారీగా ఒక్కో మహిళకు వెయ్యి రూపాయలు అందించనుంది ప్రభుత్వం. అయితే ఈ కేటాయింపులపై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. ఎన్నికల మేనిఫెస్టోలో.. 2.2 కోట్ల రేషన్ కార్డు హోల్డర్లకు సాయం అందిస్తామన్న హామీని డీఎంకే ప్రభుత్వం, ఆ హామీని నెరవేర్చకుండా తాజా పథకంతో చిల్లర విసురుతోందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో.. సోషల్ మీడియాలో మీమ్స్‌ను వైరల్ చేస్తున్నారు. తాజాగా.. వాయిస్ ఆఫ్ సవుక్కు అనే ట్విటర్ పేజీ అడ్మిన్‌ను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా పథకాన్ని వెటకారం చేస్తూ.. హాస్యద్వయం గౌండమణి, సెంథిల్లు ఉన్న ఓ వీడియోను ఎడిట్ చేశాడు ఆ పేజీ అడ్మిన్ ప్రదీప్. అందులో ఒకరిని స్టాలిన్‌గా మరొకరిని ఆర్థిక మంత్రిగా చూపించాడు. దీంతో.. ఈ వీడియోను నేరంగా పరిగణించిన పోలీసులు ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద అతన్ని అరెస్ట్ చేశారు. Sources : Pradheep one of the admins of @voiceofsavukku has been arrested in Cr No 52/2023 under sections 153, 505 (1) (b) and 509 IT Act for this video meme. pic.twitter.com/dT7LcsLorF — Savukku Shankar (@Veera284) March 22, 2023 తమిళనాడులో రాజకీయ వేడిని పుట్టించిన ఈ మీమ్-అరెస్ట్ పరిణామంపై అధికార, ప్రతిపక్షాలు పోటాపోటీగా విమర్శించుకుంటున్నాయి. బీజేపీ, అన్నాడీఎంకేలు అరెస్ట్‌ను ఖండిస్తున్నాయి. పార్టీల నేతలేకాదు.. ఉద్యమకారులు, హక్కుల సాధన సమితిలు, నెటిజన్లు.. #ArrestMeToo_Stalin పేరుతో హ్యాష్ ట్యాగ్‌ను వైరల్ చేస్తున్నారు. అయితే.. ఈ ఒక్క ఘటనే కాదు. ఆమధ్య స్టాలిన్ తనయుడు ఉదయ్‌నిధి స్టాలిన్‌కు క్రీడామంత్రిత్వ శాఖను అప్పగించడంపైనా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ నడిచింది. తాజాగా.. తమిళనాడు పోలీసులు, బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసేందుకు గుజరాత్ దాకా వెళ్లిన పరిణామంపైనా స్టాలిన్‌ను, ఆయన తండ్రి దివంగత కరుణానిధిని కలిపి మరీ ట్రోల్ చేశారు నెటిజన్లు.