తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై ప్రశంసలు తెలుపుతూ వెలసిన పోస్టర్లు ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏమైందంటే.. ఈ పోస్టర్‌లలో ఎంకే స్టాలిన్ చిత్రంపై ‘బ్రైడ్ ఆఫ్ తమిళనాడు’ అని రాసి ఉండటమే.
‘బ్రైడ్ ఆఫ్ తమిళనాడు’
టైమ్స్ నౌ ప్రకారం, ‘ప్రైడ్ ఆఫ్ తమిళనాడు’ అనే పదాలతో పోస్టర్‌ను ముద్రించాలని ప్లాన్ చేశారు. అయితే, అక్షర దోషంతో అది ‘బ్రైడ్ ఆఫ్ తమిళనాడు’ గా మారి సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఇంతకీ ఈ పోస్టర్‌ను ఎవరు వేశారు? ఎక్కడ పెట్టారు? అనేది తెలియరాలేదు. అయితే, ఈ పోస్టర్ ఉన్న వీడియోను తీసిన పలువురు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పటి వరకు ఆ వీడియోని 1.2లక్షల మంది వీక్షించారు.
"Bride of Tamil Nadu" 🤣🤣🤣🤣🤣🤣🤣 pic.twitter.com/6HunaWC3Lw
— Facts (@BefittingFacts) March 4, 2024
ఇదిలా ఉంటే తమిళనాడులోని కులశేఖ పట్టణంలో నిర్మిస్తోన్న ఇస్రో లాంచ్‌ప్యాడ్‌ను ఉద్దేశించి డీఎంకే మంత్రి అనిత ఆర్ రాధాక్రిష్ణన్ ప్రకటన ఇచ్చారు. అందులో ప్రధాని మోదీ, సీఎం స్టాలిన్ ఫోటోలతో పాటు వెనకవైపున రాకెట్‌పై చైనా జెండా ఉండటం వివాదానికి కేంద్ర బిందువయ్యారు.
మాండరిన్‌లో శుభాకాంక్షలు
మార్చి 1న బీజేపీ మాండరిన్‌లో ముఖ్యమంత్రి స్టాలిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. మాండరిన్ ఆయనకు నచ్చిన భాష అంటూ విష్ చేసి, విమర్శించింది. మాండరిన్.. చైనా అధికారిక భాష. దీనిపై తమిళనాడు సీఎం స్టాలిన్ వివరణ ఇచ్చారు. ప్రకటనలో తప్పిదం దొర్లింది. దాని వెనుక దురుద్దేశం లేదు. భారత్‌పై ప్రేమ ఉంది అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment