
సాక్షి, చైన్నె: మణిపూర్‌లో మహిళపై లైంగిక దాడుల ఘటన తన హృదయాన్ని గాయపరిచిందని సీఎం స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు. దారుణ పరిస్థితులు ఆ రాష్ట్రంలో ఉండటం మరింత వేదనకు గురి చేస్తోందన్నారు. వివరాలు.. మణిపూర్‌లో రెండు సామాజిక వర్గాల మధ్య రెండు నెలలకు పైగా జరుగుతున్న వివాదంతో ఆ రాష్ట్రం తగల బడుతున్న విషయం తెలిసింది.
ఈ పరిస్థితుల్లో ఓ సామాజిక వర్గానికి చెందిన మహిళపై మరో సామాజిక వర్గం చెందిన వారు లైంగిక దాడులకు పాల్పడటం, ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసిన వీడియో గురువారం వెలుగులోకి వచ్చి దేశాన్ని కుదిపి వేస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై సీఎం స్టాలిన్ స్పందిస్తూ, ఇలాంటి ఘటనలు చూస్తే, మానవత్వం మచ్చుకై నా ఆ రాష్ట్రంలో కనిపించకుండా పోయినట్టుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను అందరూ వ్యతిరేకించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
మరణశిక్ష విధించాలి..
ఈ వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు, నటి కుష్భు మాట్లాడుతూ, ఈ ఘటనను రాజకీయ కోణంలో కాకుండా, మహిళలకు జరిగిన తీవ్ర అన్యాయంగా తాను చూస్తున్నానని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్ విచారణ చేపట్టిందన్నారు. ఏ ఒక్కరినీ ఈ వ్యవహారంలో విడిచి పెట్టకూడదని, అందరికీ మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి మాట్లాడుతూ, మణిపూర్‌లో మహిళలు ఏవిధంగా దాడులకు గురి అవుతున్నారో వీడియో రూపంలో వెలుగులోకి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
లైంగిక దాడులు తన హృదయాన్ని ద్రవింప చేస్తున్నాయన్నారు. ఇప్పుడు మణిపూర్ తగల బడుతోందని, తదుపరి ఇలాంటి పరిణామాలు ఇతర రాష్ట్రాలకు పాకే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రధాని మోదీ నోరు మెదపాలని డిమాండ్ చేశా రు. అన్నాడీఎంకే నేత జయకుమార్ మాట్లాడు తూ, తాజా వీడియోలో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని స్పష్టం అవుతోందన్నారు. అక్కడి ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేంద్రం తక్షణం అక్కడి ప్రజలకు భద్రత కల్పించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment