తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించే ‘కలైజ్ఞర్ నినైవు కలైతురై విత్తగర్’ పురస్కారాలను ప్రకటించింది. 2023 సంవత్సరానికి గాను ఈ అవార్డుకు గాన కోకిల పి.సుశీల, ప్రొఫెసర్, రచయిత, కవి మహ్మద్ మెహతాలను అక్కడి ప్రభుత్వం ఎంపిక చేసింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి జయంతి సందర్భంగా ఏటా జూన్ 3న ‘కలైజ్ఞర్ నినైవు కలైతురై విత్తగర్’ పురస్కారాన్ని అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో తమిళ సినీ రంగంలో విశిష్ట సేవలు అందించినవారిని సత్కరించే క్రమంలో పి. సుశీల పేరును ప్రభుత్వం ఎంపిక చేసింది.
ఇదీ చదవండి: ఆ క్రెడిట్ అంతా హీరోలకేనా.. హీరోయిన్లకు ఇవ్వరా: మాళవిక మోహన్
‘కలైజ్ఞర్ నినైవు కలైతురై విత్తగర్’ (కరుణానిధి స్మారక కళారంగ మాంత్రికులు) పురస్కారాన్ని గాయని పి. సుశీలకు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రదానం చేశారు. చెన్నైలోని సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమెకు పురస్కారంతో పాటు రూ.10లక్షల బ్యాంకు చెక్, జ్ఞాపికను స్టాలిన్ అందజేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో జన్మించిన పి. సుశీల తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో 25 వేలకు పైగా పాటలు పాడారు. దీంతో ఆమెను గౌరవించే విధంగా ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. క్వీన్ ఆఫ్ మెలోడి, గాన కోకిలగా కొనియాడుతున్న ఆమెను ఇలా సత్కరించినందుకు సంతోషంగా ఉందని అభిమానులు తెలుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment