చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో మరో 70 మందికి పైగా గాయపడ్డారు. కడలూరు జిల్లా నెల్లికుప్పం సమీపంలోని పట్టంబాక్కం వద్ద సోమవారం ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కడలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కడలూరు-పన్రుటి మధ్య రెండు ప్రైవేట్ బస్సులు పరస్పరం ఢీకొన్నాయి. ముందుగా ఒక బస్సు టైరు పగిలిపోవడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులు నజ్జునుజ్జుయినట్లు తెలుస్తోంది. ఘటనపై స్పందించిన సీఎం స్టాలిన్.. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన ఒక్కొక్కరికి రూ. 50 వేలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: అమర్‌నాథ్ యాత్రికులకు శుభవార్త.. హోటళ్లు అడ్వాన్స్ బుకింగ్ చేస్తే..
Comments
Please login to add a commentAdd a comment