‘స్టాలిన్.. అది నీ మూర్ఖత్వానికి నిదర్శనం’ | How stupid can you become MK Stalin Slams BJP | Sakshi
Sakshi News home page

‘స్టాలిన్.. అది నీ మూర్ఖత్వానికి నిదర్శనం’

Published Thu, Mar 13 2025 5:18 PM | Last Updated on Thu, Mar 13 2025 5:33 PM

How stupid can you become MK Stalin Slams BJP

చెన్నై:  తమిళనాడు ప్రభుత్వం రూపాయి సింబల్ ను మార్చడంపై ఆ రాష్ట్ర బీజేపీ తీవ్రంగా మండిపడింది. అది మూర్ఖపు చర్య అంటూ అభివర్ణించారు తమిళనాడు బీజేపీ చీఫ్ కె. అన్నామలై. భారత మొత్తం తమ కరెన్సీలో 'Rs' అని ఉంటే 'Ru' అని తమిళనాడు ప్రభుత్వం మార్చడం అతి తెలివి తక్కువ పని అంటూ ధ్వజమెత్తారు. దీన్ని మూర్ఖపు చర్య కాకపోతే ఇంకేమనాలి అని ఆయన ప్రశ్నించారు అసలు స్టాలిన్ ఎలా సీఎం అయ్యారో అంటూ విమర్శలు గుప్పించారు.

కాగా, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం 2025 - 26 బడ్జెట్‌లో సాధారణ రూపాయి చిహ్నానికి బదులుగా.. తమిళ చిహ్నంతో భర్తీ చేయడం వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ఇప్పటికే జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తున్న తమిళనాడు ప్రభుత్వం.. తాజాగా ఈ  సంచలన నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.  రూపాయి సింబల్ ను మార్చడమే కాకుండా ‘రు’ అని ఆ సింబల్ పై పేర్కొనడమే వివాదాన్ని మరింత పెంచింది.

తమిళనాడుపై హిందీ భాష రుద్దుతారా?
తాము ఎంతో గౌరవించే తమిళభాషపై బలవంతంగా హిందీ భాషను రుద్దుతున్నారని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విమర్శించారు.  తమిళనాడులో హిందీ భాషను తీసుకొస్తే తమిళనాడు ఎడ్యుకేషన్ సిస్టం అంతా సర్వనాశనం అవుతుందని మండిపడ్డారు. వారి తీసుకొచ్చే ఎడ్ముకేషన్ పాలసీ.. అది ఎడ్యుకేషన్ పాలసీ కాదు..  కుంకుమ, పసుపు పాలసీ.  ఇది భారత్ ను అభివృద్ధి చేయడం కోసం తెచ్చిన పాలసీ ఎంతమాత్రం కాదు.  కేవలం హిందీని అభివృద్ధి చేయడం కోసం తీసుకొచ్చిన పాలసీ.’ అని ధ్వజమెత్తారు స్టాలిన్.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement