సంగీతాన్ని నవరసాల్లో నాట్యం చేయించే రారాజు ఇళయరాజా. సంగీతానికి రాళ్లను కరిగించే శక్తి ఉంటుందంటారు. ఇళయరాజా సంగీతంలో అంత మాధుర్యం ఉంటుంది. 80 వసంతాల ఇళయరాజా నేటికీ సంగీత రారాజుగానే కొనసాగుతున్నారు. శుక్రవారం ఆయన 80వ పుట్టినరోజు. ఇది సంగీతానికే జన్మదినం అన్నంతగా సంగీత ప్రియులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఈ సంగీత జ్ఞానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వయంగా ఇళయరాజా ఇంటికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు అందించి శాలువాతో సత్కరించారు.
స్టాలిన్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో.. తొలిపొద్దు మధురంగా మారడానికి, ప్రయాణాలు సుఖవంతం కావడానికి, ఆనందమయం కావడానికి, కష్టాలు గాలిలో కలిసిపోవడానికి, రాత్రులు ప్రశాంతమయం కావడానికి కారణం సంగీత జ్ఞాని ఇళయరాజానే. ఆయన మన హృదయాలను రంజింపజేస్తున్నారు. తమిళ చిత్ర సీమకు మాత్రమే కాకుండా సంగీత ప్రపంచానికే ఆయన ఒక విప్లవం. అందుకే కరుణానిధి ఆయనను సంగీత జ్ఞాని అని కొనియాడారు. ఆయన సంగీతానికి మైమరచిపోయే అభిమానుల్లో ఒకరినైన నేను ఆ గొప్ప కళాకారుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపడానికి ఆనందిస్తున్నాను.
మా హృదయాల్లో కోట కట్టి, జెండా నాటిన మీరు ఎప్పటికీ రాజానే, శతాధిక వసంతాలు దాటిన ఇళయరాజానే‘ అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. నటుడు కమల్ హాసన్ సైతం ఇళయారాజాకు ట్విటర్‌లో విష్ చేశారు. ‘సినీ సంగీతం 8 దశాబ్దాలు అధిగమించి సంతోషంగా కొనసాగుతోంది. ఇళయరాజా అనే ఐదు అక్షరాలు భారతీయ సినీ సంగీతంలో అపూర్వస్వరాలు అనేంతగా తన సంగీత సింహాసనాన్ని ఏర్పరచుకున్న తన ప్రియమైన, అన్నయ్య ఇళయరాజాకు హ్యాప్ బర్త్‌డే' అని పేర్కొన్నారు.
చదవండి: విషమంగా పంచ్ ప్రసాద్ ఆరోగ్యం
Comments
Please login to add a commentAdd a comment