బీజేపీ, ఈసీపై సీఎం స్టాలిన్‌ సంచలన ఆరోపణ! | Tamil Nadu CM MK Stalin Sensational Comments On BJP And EC | Sakshi
Sakshi News home page

బీజేపీ, ఈసీపై సీఎం స్టాలిన్‌ సంచలన ఆరోపణ!

Published Mon, Dec 23 2024 4:57 PM | Last Updated on Mon, Dec 23 2024 5:10 PM

  Tamil Nadu CM MK Stalin Sensational Comments On BJP And EC

చెన్నై: కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం కారణంగా ప్రజాస్వామ్యం తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటోందన్నారు. అలాగే, రాజ్యాంగం ప్రాథమిక లక్షణాలను కేంద్రం నాశనం చేస్తోందని కామెంట్స్‌ చేశారు.

తమిళనాడు సీఎం స్టాలిన్‌ ట్విట్టర​్‌ వేదికగా కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఈ సందర్బంగా స్టాలిన్‌.. కేంద్రం ఎన్నికల నియమావళికి నిర్లక్ష్యపూరిత సవరణ చేసింది. ఎన్నికల పారదర్శకతను దెబ్బతీసే నిర్ణయాలు తీసుకుంటోంది. కేంద్రం నిర్ణయాలతో ప్రజాస్వామ్యం తీవ్ర ముప్పును ఎదుర్కొంటోంది. ఎన్నికల నియమావళిలోని సెక్షన్ 93(2)(ఎ) సవరణతో ఎన్నికల్లో ఆందోళన కలుగుతోందన్నారు.

అలాగే, ఎన్నికల బూత్‌లోని సీసీటీవీ ఫుటేజీని సమకూర్చాలని పంజాబ్, హర్యానా హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం సీసీటీవీ ఫుటేజీతో సహా ఎన్నికల పత్రాలను బహిరంగంగా తనిఖీ చేయకుండా ఈ సవరణను తీసుకొచ్చింది. రాజ్యాంగం ప్రాథమిక లక్షణాలలో ఒక దానిని బీజేపీ నాశనం చేసింది. ఇటీవల హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఆందోళన నెలకొంది. భారత ఎన్నికల సంఘం మోదీ ప్రభుత్వ ఒత్తిడికి లొంగిపోయింది. ఎన్నికల సంఘం తీరు దిగ్భ్రాంతికరం’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement