చెన్నై: ఎన్డీఏ, ఇండియా కూటమి త్వరలో జరగనున్న ఎన్నికల్లో గెలుపు సాధించడమే లక్ష్యంగా పోటీ పడుతున్నాయి. ఈ తరుణంలో డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ జీఎస్‌టీని పేదల 'దోపిడీ'గా అభివర్ణించి కీలక వ్యాఖ్యలు చేశారు.
హోటల్ నుంచి టూ వీలర్ రిపేర్ వరకు అన్నింటిపైనా జీఎస్‌టీ? ఒక మధ్యతరగతి కుటుంబం ఎంజాయ్ చేయడానికి హోటల్‌కి వెళితే బిల్లులో జీఎస్టీని చూసి 'గబ్బర్ సింగ్ టాక్స్' అని బాధపడుతున్నారు. భవిష్యత్తులో సెల్ఫీ తీసుకున్నా జీఎస్‌టీ పడుతుందా? అని తన ఎక్స్ (ట్విటర్) వేదికగా ప్రశ్నించారు.
1.45 లక్షల కోట్ల కార్పొరేట్ పన్ను మాఫీ బీజేపీ పేదల పట్ల కరుణ చూపలేదా? మొత్తం జీఎస్‌టీలో 64 శాతం అట్టడుగువర్గాల నుంచి సమకూరుతోంది. 33 శాతం మధ్యతరగతి ప్రజల నుంచి, కేవలం 3 శాతం సంపన్నుల నుంచి జీఎస్‌టీ సమకూరుతోందని ఎంకే స్టాలిన్ అన్నారు. పేదలను దోపిడీ చేసే ఈ వ్యవస్థను మార్చాలంటే #Vote4INDIA! అంటూ ట్వీట్ చేశారు.
GST: வரி அல்ல… வழிப்பறி!
— M.K.Stalin (@mkstalin) April 15, 2024
“தன் பிணத்தின் மீதுதான் ஜி.எஸ்.டி.யை அமல்படுத்த முடியும்” என்று முதலமைச்சராக எதிர்த்த திரு. நரேந்திர மோடி, பிரதமரானதும், “ஜி.எஸ்.டி பொருளாதாரச் சுதந்திரம்’’ என்று ‘ஒரே நாடு ஒரே வரி’ கொண்டு வந்தார்.
பேச நா இரண்டுடையாய் போற்றி!
ஹோட்டல் முதல் டூ வீலர்… pic.twitter.com/Nnk1YTMw3q
Comments
Please login to add a commentAdd a comment