ఢిల్లీ: భారత దేశంలోని భిన్నత్వంపై శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఆయిన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే దుమారం రేపాయి. ‘భారత దేశంలోని భిన్నత్వం గురించి శ్యామ్ పిట్రోడా అటువంటి వ్యాఖ్యలు చేయటం చాలా దృరదృష్టం. ఆమోదించదగినవి కావు. ఆయన చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు’అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు.
The analogies drawn by Mr. Sam Pitroda in a podcast to illustrate India's diversity are most unfortunate and unacceptable. The Indian National Congress completely dissociates itself from these analogies.
— Jairam Ramesh (@Jairam_Ramesh) May 8, 2024
‘భారత్‌లో భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది. తూర్పు వైపు ఉన్న ప్రజలు చైనా వారిని పోలి ఉంటారు. దక్షిణం వైపు ఉన్న ప్రజలు అరబ్ వారిలా ఉంటారు. ఉత్తర దిక్కు వాళ్లు అయితే నల్లగా లేదా తెల్లగా ఉంటారు. దక్షిణ భారతంలోని ప్రజలు అఫ్రికా వారిలా కనిపిస్తారు’అని శ్యామ్ పిట్రోడా ఓ ఇంటర్వ్యూలో భారత్‌లో భిన్నత్వం గురించి మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు జాత్యహంకారంతో కూడినవి బీజేపీ నేతలు మండిపడ్డారు.
ఈ వ్యవహారంపై ప్రధాని మోదీ సైతం స్పందించారు. తెలంగాణలోని వరంగల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ మాట్లాడారు. ‘ శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. శరీర వర్ణం పేరుతో దేశ ప్రజలను ఎవరైనా అగౌరవ పరిస్తే.. ఎట్టిపరిస్థితుల్లో సహించబోము. మోదీ ఇలాంటి వాటిని అస్సలు సహించరు’అని మోదీ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment