ప్రధాని నరేంద్ర మోదీ జర్మన్ నియంత హిట్లర్ మంత్రి జోసెఫ్ గోబెల్స్‌ను స్ఫూర్తిగా తీసుకున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆరోపించారు.
లోక్‌సభ ఎన్నికలపై ఓ ఛానల్ ఇంటర్వ్యూ జైరాం రమేష్ మాట్లాడూత.. రాజకీయ శాస్త్రంలో ఎంఏ పూర్తి చేసిన మోదీ ప్రచార విలువల గురించి జోసెఫ్ గోబెల్స్ గురించి చదివి, ఆయన నుండి ప్రేరణ పొంది ఉండి ఉంటారని ఎద్దేవా చేశారు.
‘మీరు ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి, దానిని పునరావృతం చేస్తూ ఉంటే, చివరికి ప్రజలు దానిని విశ్వసిస్తారు’ అని గోబెల్స్ పేర్కొన్నారని జైరాం గుర్తు చేశారు.
ప్రైవేటు ఆస్తులను సర్వే చేసి, స్వాధీనం చేసుకుంటామని కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో బెదిరిస్తున్నదని మోదీ చేసిన వ్యాఖ్యలపై జైరాం మాట్లాడుతూ.. మోదీ కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, ఆయన అసత్యాలు ప్రచారం చేసినంత కాలం సత్యం నశించి పోతుందని అన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ న్యాయ పత్రంలో వారసత్వపు పన్ను గురించి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి ప్రస్తావన లేదు. కానీ బీజేపీ మాత్రం వారసత్వపు పన్ను గురించి మరోలా ప్రచారం చేస్తోందని జైరాం రమేష్ ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment