చండీఘర్: దేశంలో లోక్‌సభ ఎన్నికల ప్రచార హోరు జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ అక్కడి బీజేపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
హర్యానాలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. బీజేపీ మెజారిటీని కోల్పోయింది, రాష్ట్రపతి పాలనకు ఇది సరైన సమయం అని జైరాం రమేష్ అన్నారు. ఇటీవల ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ మద్దతును ఉపసంహరించుకోవడంతో హర్యానా ప్రభుత్వం స్పష్టంగా మెజారిటీని కోల్పోయిందని అన్నారు. ఢిల్లీలో బీజేపీ రోజులు పోయినట్లే.. హర్యానాలో కూడా బీజేపీ ప్రభుత్వం కనుమరుగయ్యే రోజులు దగ్గర పడుతున్నట్లు జైరాం రమేష్ అన్నారు.
రాష్ట్రంలో తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు. ఇదే విషయాన్ని గవర్నర్‌కు లిఖితపూర్వకంగా రాసిన లేఖలో ప్రస్తావించారు.
మే7న ఎమ్మెల్యేలు సోంబీర్ సంగ్వాన్, రణధీర్ గొల్లెన్, ధరంపాల్ గొండర్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకోవడం వల్ల.. బీజేపీకి తమ మద్దతు ఇవ్వబోమని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల మధ్య, ఖట్టర్ స్థానంలో నయాబ్ సైనీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలల్లోనే ఈ పరిణామం చోటుచేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment