బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు | Independent MLAs Withdraw Support BJP in Haryana | Sakshi
Sakshi News home page

బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు

Published Tue, May 7 2024 7:13 PM | Last Updated on Tue, May 7 2024 7:45 PM

Independent MLAs Withdraw Support BJP in Haryana

హర్యానా: లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. హర్యానాలో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మంగళవారం తమ మద్దతును ఉపసంహరించుకున్నట్లు పేర్కొన్నారు.

ఎమ్మెల్యేలు సోంబీర్ సంగ్వాన్, రణధీర్ గొల్లెన్, ధరంపాల్ గొండర్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకోవడం వల్ల.. బీజేపీకి తమ మద్దతు ఇవ్వబోమని పేర్కొన్నారు.

హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్ సమక్షంలో రోహ్‌తక్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ఈ విషయాన్ని ప్రకటించారు. రైతుల సమస్యలతో పాటు, ఇతర సమస్యలపై పోరాటడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వారు స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement