ఢిల్లీ: మణిపూర్ అంశంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముందుకు సాగటం లేదు. ఈ తరుణంలో అంతరాయాలు లేకుండా సభలు సజావుగా సాగేందుకు విపక్ష కూటమి ‘ఇండియా’ ఓ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. మధ్యే మార్గ పరిష్కారంతో కేంద్రాన్ని సంప్రదించినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తన ట్విటర్ అకౌంట్ ద్వారా తెలియజేశారు.
అంతరాయాన్ని ఛేదించడానికి, రాజ్యసభలో మణిపూర్‌పై చర్చ జరగడానికి ఇండియా కూటమి పార్టీలు ఆ సభా నాయకుడికి మధ్యే మార్గం పరిష్కారాన్ని అందించాయి. మోదీ ప్రభుత్వం అందుకు అంగీకరిస్తుందని ఆశిస్తున్నా అంటూ ట్వీట్ చేశారాయన. దీంతో ఆ ప్రతిపాదన ఏమై ఉంటుందా? అనే ఆసక్తి నెలకొంది.
INDIA parties have offered a middle path solution to the Leader of the House to break the logjam and get a discussion on Manipur going in an uninterrupted manner in the Rajya Sabha. Hope the Modi government agrees.
— Jairam Ramesh (@Jairam_Ramesh) August 3, 2023
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా.. సభలు పట్టుమని పూట సరిగ్గా నడిచిన దాఖలాలు లేవు. మణిపూర్ అంశంపై రూల్ నెంబర్ 267 ద్వారా సుదీర్ఘ చర్చకు పట్టుబడుతూ.. ప్రధాని మోదీ మణిపూర్ శాంతిభద్రతలపై ప్రసంగించాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే.. కేంద్రం మాత్రం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ప్రసంగిస్తారని, అదీ రూల్ నెంబర్ 176 ప్రకారం స్వల్ప కాలిక చర్చకే సిద్ధమని కరాకండిగా చెబుతోంది. దీంతో పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాల నిరసనల హోరు కొనసాగుతుంది. అధికార పార్టీ తరపు నుంచి ఫ్లోర్ లీడర్లు.. విపక్ష నేతలతో చర్చలు జరుపుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇండియా కూటమి ఒక అడుగు వెనక్కి వేసి మధ్యే మార్గ పరిష్కారంతో ముందుకు రావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment