Parliament Monsoon Session Updates: Speaker Displeasure Both Sides - Sakshi
Sakshi News home page

అప్పటివరకు లోక్‌సభలో అడుగుపెట్టను.. అధికార-విపక్షాల తీరుపై స్పీకర్‌ అసంతృప్తి ప్రకటన

Published Wed, Aug 2 2023 2:28 PM | Last Updated on Wed, Aug 2 2023 4:33 PM

parliament monsoon session Updates Speaker Displeasure Both Sides - Sakshi

ఢిల్లీ: మణిపూర్‌ అంశంతో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముందుకు సాగడం లేదు. ఈ తరుణంలో ఇవాళ(బుధవారం) కూడా ఆందోళనలు కొనసాగాయి. అయితే లోక్‌సభ జరుగుతున్న తీరుపై స్పీకర్‌ ఓం బిర్లా ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యుల ప్రవర్తనలో మార్పు వచ్చేంత వరకు తాను సభలో అడుగుపెట్టబోనంటూ ప్రకటించారాయన. 

ఓవైపు అధికార పక్షం, మరోవైపు విపక్ష సభ్యులపైనా స్పీకర్‌ ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ కార్యకలాపాలు జరగకుండా ఇరు పక్షాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారాయన. ఈ క్రమంలో ఇవాళ్టి సెషన్‌కు సైతం ఆయన హాజరు కాలేదు. అధ్యక్ష స్థానంలో మరొకరు బాధ్యతలు నిర్వహించారు కూడా. అయితే.. ఎంపీలు సభ గౌరవానికి అనుగుణంగా నడుచుకున్నప్పుడే తాను తిరిగి సభలో అడుగుపెడతానంటూ ప్రకటించారాయన.

ఇక మణిపూర్‌ నినాదాల నడమే ఇవాళ్టి లోక్‌సభ జరగలేదు. రేపటికి సభ వాయిదా పడింది. మణిపూర్‌ అంశంపై సుదీర్ఘ చర్చ జరగాలనిRule 267.. ప్రధాని మోదీ మాట్లాడాలని విపక్ష సభ్యులు డిమాండ్‌ చేస్తుండగా..  స్వల్పకాలిక చర్చతోRule 176 సరిపెడతామని, అదీ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మాట్లాడతారంటూ కేంద్రం చెబుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement