కలెక్టరేట్, న్యూస్‌లైన్ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో జిల్లా దేశంలోనే మొదటిస్థానంలో నిలవడంతో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్ చేతుల మీదుగా ఆదివారం కలెక్టర్ అహ్మద్‌బాబు పురస్కారాన్ని అందుకున్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవనంలో జరిగిన తొమ్మిదో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దివస్ సందర్భంగా జాతీయ అవార్డు అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో దేశంలోని ఐదుగురు ఉపాధి కూలీలకు అవకాశం కల్పించగా, జిల్లాలోని నార్నూర్ మండలం గుంజాల గ్రామానికి చెందిన పెందూర్ జంగు మాట్లాడారు. రోజుకు రూ.150 సంపాదిస్తున్నానని, రూ.60 వేలతో తన చెల్లి పెళ్లి చేశానని, 10 మేకలు కొనుగోలు చేసి ఇప్పుడు 15 మేలకు ఎదిగాయన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ వినయ్‌కృష్ణారెడ్డి, అదనపు పీడీ గణేష్ రాథోడ్, ఏపీవో పాల్గొన్నారు.
‘ఉపాధి’ పురస్కారం
Published Mon, Feb 3 2014 3:27 AM | Last Updated on Sat, Sep 2 2017 3:17 AM
Advertisement
Advertisement