
హైదరాబాద్ పై గవర్నర్ పాలన అవసరం: జైరాం రమేష్
ఢిల్లీ: హైదరాబాద్ నగరంపై గవర్నర్ పాలన అవసరమని, దీనిపై అనవసర రాద్దాంతం చేయొద్దని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు కేంద్ర మంత్రి జైరాం రమేష్ సూచించారు. కేసీఆర్ తో భేటీలో జైరాం రమేష్ పలు విషయాలను చర్చించారు. హైదరాబాద్ కు గవర్నర్ పాలన అవసరమవుతుందని, దీనిపై ఎటువంటి గందరగోళం సృష్టించవద్దని కేసీఆర్ కు జైరాం రమేష్ విజ్ఞప్తి చేశారు. ఏపీ భవన్ ఆంధ్రప్రదేశ్ కే చెందుతుందని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి మరో కేంద్రాన్ని కేటాయిస్తామని కేసీఆర్ కు హామీ ఇచ్చారు. ఈ భేటీలో బిల్లులో సవరణలపై కేసీఆర్ చర్చించారు.
సాధ్యమైనంత త్వరగా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని కేసీఆర్ విజ్ఞప్తి చేయగా.. బిల్లు ఆమోదం పొందాలంటే పట్టువిడుపులుండాలని జైరాం రమేష్ తెలిపారు. జనాభా ప్రాతిపదికనే పింఛన్లు, జీతాలుంటాయని ఆయన పేర్కొన్నారు.