రాష్ట్ర విభజన అనంతరం ఇక్కడి రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్న కేంద్రమంద్రి జైరాం రమేష్ జిల్లాలో ఎన్నికల వేళ పర్యటించడం పట్ల రాజకీయ పరిశీలకులు పలు ఊహాగానాలు చేస్తున్నారు. వర్గాలతో ఇక్కట్లు పడుతున్న ‘పెద్దలను’ ఒకే బాటన నడిపించడం, ఎల‘క్షణాలకు’ అవసరమైన ‘ఇంధనాన్ని’ సమకూర్చడం అసలు ఆంతర్యమని తెలుస్తోంది. ‘సార్వత్రిక’ బరిలో కాంగ్రెస్ అభ్యర్థులకు గెలుపు బాట దిశగా పథనిర్దేశం చేసినట్లు సమాచారం.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : అభ్యర్థులు ప్రచార బాట వేళ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కేంద్ర మంత్రి జైరాం రమేశ్, ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు మంగళవారం జిల్లాలో పర్యటించడం చర్చనీయాంశమైంది. నామినేషన్ల పర్వం ముగిసినా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్ర చారం పట్టాలకెక్కక పోవడంతో స్వయంగా ఏఐసీసీ రంగంలోకి దిగినట్లు సమాచారం. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలెవరూ ప్రచారం, పార్టీలో అంతర్గత విషయాలపై దృష్టి సారించే పరిస్థితి కని పించడం లేదు.
పీసీసీ ముఖ్యులు పొన్నాల లక్ష్మ య్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ సొంత నియోజకవర్గాలకే పరిమితమవడంతో జిల్లా వైపు తొంగి చూసే పరిస్థితి కనిపించడం లేదు. పార్టీ నేతలను అంతర్గతంగా సమన్వయం చేసే నాథుడు లేకపోవడంతో అసంతృప్తులు ఒక్కరొక్కరుగా పా ర్టీని వీడుతున్నారు. మరికొందరు అలక వహించి అధికారిక అభ్యర్థులకు సహకరించడం లేదు. టికెట్ దక్కించుకునేందుకు ఉత్సాహం చూపిన నేతలు ద్వితీయ శ్రేణి నాయకులు, కేడర్‌ను ఏకతాటిపై నడిపేందుకు తంటాలు పడుతున్నారు. నామినేషన్ల పర్వం ముగిసి నాలుగు రోజులైనా ఎన్నికల ప్రచారం ఊపందుకోవడం లేదు. నిధుల సమీకరణ పేరిట టికెట్ దక్కించుకున్న అభ్యర్థులు పార్టీ నేతలకు, కేడర్‌కు అందుబాటులో ఉండటం లేదు.
దీంతో పార్టీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న కార్యకర్తలకు సమాధానం చెప్పేవారు కూడా కరువయ్యారు. జిల్లాలో పార్టీ పరిస్థితిపై అధిష్టానానికి సంకేతాలు అందడంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా జైరాం రమేశ్, కొప్పుల రాజు రంగంలోకి దిగినట్లు సమాచారం.పార్టీ టికెట్ దక్కించుకున్న అభ్యర్థులు సొంతంగా నిధులు సమకూర్చుకోవడంతో పాటు పార్టీ అందించే సాయం కోసం ఎదురుచూస్తున్నారు. మం గళవారం జిల్లాలో పర్యటించిన జైరాం రమే శ్, కొప్పుల రాజు పార్టీ అభ్యర్థుల ఆర్దిక పరిస్థితి, ఎంపీ అభ్యర్థులతో సమన్వయం వంటి అంశాలపైఆరా తీసినట్లు సమాచారం.
అయితే ఓకేనా...!
Published Wed, Apr 16 2014 2:25 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement