మూజువాణి ఓటుతో ఆమోదించవద్దు: బీజేపీ
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై సభలో పూర్తి స్థాయి చర్చ జరగాలని భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించరాదని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి జైరాం రమేష్ బీజేపీ అగ్రనేతలతో మంగళవారం ఉదయం ఇక్కడ సమావేశమైయ్యారు. బీజేపీ అగ్రనేతలు కొన్ని డిమాండ్లను ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ముందు ఉంచారు. కొత్త రాజధాని నిర్మాణానికి నిధులతోపాటు సీమాంధ్ర కోల్పోయే ఆదాయాన్ని ఏ విధంగా భర్తీ చేస్తారో సభా ముఖంగా ప్రకటించాలని వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
పోలవరం ముంపుకు గురయ్యే భద్రచలం డివిజన్లోని ఏడు మండలాలు సీమాంధ్రకు బదలాయించాలని కరాకండిగా చెప్పారు. సీమాంధ్రలో అత్యంత వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని బీజేపీ అగ్రనేతలు తమ డిమాండ్లలో పేర్కొన్నారు.