voice vote
-
అవిశ్వాసంపై బాబు ప్రభుత్వం దాటవేత
హైదరాబాద్: ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై వీగిపోయినట్టు స్పీకర్ ప్రకటించారు. అవిశ్వాస తీర్మానంపై తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని, దానిపై ఓటింగ్ జరగాలని ప్రతిపక్షం పట్టుబట్టినప్పటికీ స్పీకర్ అవకాశం ఇవ్వలేదు. సభలో వాయిస్ ను కోరుతూ తీర్మానాన్ని చదివిన స్పీకర్ ఆ తర్వాత మూజువాణి ఓటుతో తీర్మానం వీగిపోయినట్టు ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై సోమవారం అసెంబ్లీలో చర్చకు చేపట్టగా, రాత్రి 9.30 గంటల వరకు తీవ్ర గందరగోళం మధ్య అసెంబ్లీ సుదీర్ఘంగా సాగింది. ఆరోపణలు ప్రత్యారోపణలతో అసెంబ్లీ దద్దరిల్లింది. అధికార టీడీపీ ప్రతి సందర్భంలోనూ అసలు విషయాన్ని పక్కదారి పట్టించడానికి తీవ్ర ప్రయత్నాలు చేసింది. ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ అధికార పక్షం నుంచి ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర సభ్యులు ఎవరో ఒకరు జోక్యం చేసుకుంటూ అడ్డుపడ్డారు. జగన్ వ్యవస్థలపై చేసిన వ్యాఖ్యలను సాకుగా చేసుకుని ఎదురుదాడికి దిగారు. తాను చెప్పిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని, న్యాయవ్యవస్థలపై తనకు అపారమైన నమ్మకం ఉందని జగన్ పదే పదే చెప్పినప్పటికీ అదే విషయంలో క్షమాపణలు చెప్పాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. తన వ్యాఖ్యలపై పలు సార్లు జగన్ వివరణ ఇచ్చినప్పటికీ అధికార పక్షం పట్టించుకోలేదు. జగన్ కు మాట్లాడే అవకాశం రాకుండా చేయాలన్న లక్ష్యంతో అవిశ్వాస తీర్మానంపై చర్చను ముగించి ఓటింగ్ నకు వెళ్లాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కోరగా ప్రతిపక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తీర్మానంపై ఓటింగ్ జరగాలని పట్టుబట్టింది. పోడియం వద్ద తమ నిరసన తెలియజేస్తుండగానే స్పీకర్ తీర్మానానికి అనుకూలంగా ప్రతికూలంగా ఎవరున్నారంటూ వాయిస్ ఓటు తీసుకుని వీగిపోయినట్టు ప్రకటించారు. ఆ తర్వాత బడ్జెట్ పై సాధారణ చర్చ చేపడుతున్నట్టు ప్రకటించారు. అందుకు వైఎస్సార్ కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేస్తుండగా సభను స్పీకర్ మంగళవారానికి వాయిదా వేశారు. అంతకు ముందు జగన్ తన మాటలకు వివరణ ఇస్తూ, తనను ఉద్దేశించి ఖబడ్డార్, నువ్వు మగాడివేనా, కొవ్వెక్కిందా అంటూ తీవ్రమైన మాటలు మాట్లాడుతున్నా పట్టించుకోవడం లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థ మీద తనకు విశ్వాసం, పూర్తి నమ్మకం ఉంది. ఎలాంటి తప్పు మాటలను మాట్లాడలేదన్నారు. వైఎస్ జగన్ చేసినా వ్యాఖ్యలను స్వయంగా ఆయనే రెండు సార్లు సభలో చదివి వినిపించినా టీడీపీ ఎమ్మెల్యేలు సభను ముందుకు సాగనివ్వలేదు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కలసి అధికార దుర్వినియోగంతో తనపై కేసులు పెట్టారని వైఎస్ జగన్ ఆరోపించారు. 20 నెలల కాలంలో ప్రభుత్వ అవినీతిని ఆయన సభలో ప్రస్తావించారు. ఆడియో, వీడియో రికార్డులతో ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిన ఉదంతాన్ని జగన్ ప్రస్తావించారు. దీంతో అధికార పక్షం పూర్తిగా డైలమాలో పడిపోడింది. ఈ ప్రస్తావనలను తప్పు దారి పట్టించడానికి మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుతగిలారు. ఈ దశలో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. శాసనసభా వ్యవహారాల మంత్రి కోరగా అవిశ్వాస తీర్మానంపై సభలో డివిజన్ జరగాలని ప్రతిపక్షం కోరింది. ఆ తర్వాత స్పీకర్ మూజివాణి ఓటుతో తీర్మానం వీగిపోయిందని ప్రకటించడం క్షణాల్లో జరిగిపోయింది. దానిపై ప్రతిపక్షం నిరసన వ్యక్తం చేస్తున్న దశలోనే సభను స్పీకర్ మరుసటి రోజుకు వాయిదా వేశారు. -
అవిశ్వాసంపై ప్రభుత్వం దాటవేత
హైదరాబాద్: ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్టు స్పీకర్ ప్రకటించారు. అవిశ్వాస తీర్మానంపై తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని, దానిపై ఓటింగ్ జరగాలని ప్రతిపక్షం పట్టుబట్టినప్పటికీ స్పీకర్ అవకాశం ఇవ్వలేదు. సభలో వాయిస్ ను కోరుతూ తీర్మానాన్ని చదివిన స్పీకర్ ఆ తర్వాత మూజువాణి ఓటుతో తీర్మానం వీగిపోయినట్టు ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై సోమవారం అసెంబ్లీలో చర్చకు చేపట్టగా, రాత్రి 9.30 గంటల వరకు తీవ్ర గందరగోళం మధ్య అసెంబ్లీ సుదీర్ఘంగా సాగింది. ఆరోపణలు ప్రత్యారోపణలతో అసెంబ్లీ దద్దరిల్లింది. అధికార టీడీపీ ప్రతి సందర్భంలోనూ అసలు విషయాన్ని పక్కదారి పట్టించడానికి తీవ్ర ప్రయత్నాలు చేసింది. ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ అధికార పక్షం నుంచి ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర సభ్యులు ఎవరో ఒకరు జోక్యం చేసుకుంటూ అడ్డుపడ్డారు. జగన్ వ్యవస్థలపై చేసిన వ్యాఖ్యలను సాకుగా చేసుకుని ఎదురుదాడికి దిగారు. తాను చెప్పిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని, న్యాయవ్యవస్థలపై తనకు అపారమైన నమ్మకం ఉందని జగన్ పదే పదే చెప్పినప్పటికీ అదే విషయంలో క్షమాపణలు చెప్పాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. తన వ్యాఖ్యలపై పలు సార్లు జగన్ వివరణ ఇచ్చినప్పటికీ అధికార పక్షం పట్టించుకోలేదు. జగన్ కు మాట్లాడే అవకాశం రాకుండా చేయాలన్న లక్ష్యంతో అవిశ్వాస తీర్మానంపై చర్చను ముగించి ఓటింగ్ నకు వెళ్లాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కోరగా ప్రతిపక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తీర్మానంపై ఓటింగ్ జరగాలని పట్టుబట్టింది. పోడియం వద్ద తమ నిరసన తెలియజేస్తుండగానే స్పీకర్ తీర్మానానికి అనుకూలంగా ప్రతికూలంగా ఎవరున్నారంటూ వాయిస్ ఓటు తీసుకుని వీగిపోయినట్టు ప్రకటించారు. ఆ తర్వాత బడ్జెట్ పై సాధారణ చర్చ చేపడుతున్నట్టు ప్రకటించారు. అందుకు వైఎస్సార్ కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేస్తుండగా సభను స్పీకర్ మంగళవారానికి వాయిదా వేశారు. అంతకు ముందు జగన్ తన మాటలకు వివరణ ఇస్తూ, తనను ఉద్దేశించి ఖబడ్డార్, నువ్వు మగాడివేనా, కొవ్వెక్కిందా అంటూ తీవ్రమైన మాటలు మాట్లాడుతున్నా పట్టించుకోవడం లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థ మీద తనకు విశ్వాసం, పూర్తి నమ్మకం ఉంది. ఎలాంటి తప్పు మాటలను మాట్లాడలేదన్నారు. వైఎస్ జగన్ చేసినా వ్యాఖ్యలను స్వయంగా ఆయనే రెండు సార్లు సభలో చదివి వినిపించినా టీడీపీ ఎమ్మెల్యేలు సభను ముందుకు సాగనివ్వలేదు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కలసి అధికార దుర్వినియోగంతో తనపై కేసులు పెట్టారని వైఎస్ జగన్ ఆరోపించారు. 20 నెలల కాలంలో ప్రభుత్వ అవినీతిని ఆయన సభలో ప్రస్తావించారు. ఆడియో, వీడియో రికార్డులతో ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిన ఉదంతాన్ని జగన్ ప్రస్తావించారు. దీంతో అధికార పక్షం పూర్తిగా డైలమాలో పడిపోడింది. ఈ ప్రస్తావనలను తప్పు దారి పట్టించడానికి మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుతగిలారు. ఈ దశలో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల ఈ చర్చను ఇంతటితో ముగించాలని కోరగా.. అవిశ్వాస తీర్మానంపై సభలో డివిజన్ జరగాలని ప్రతిపక్షం పట్టుపట్టింది. ఆ తర్వాత స్పీకర్ మూజివాణి ఓటుతో తీర్మానం వీగిపోయిందని ప్రకటించడం క్షణాల్లో జరిగిపోయింది. దానిపై ప్రతిపక్షం నిరసన వ్యక్తం చేస్తున్న దశలోనే సభను స్పీకర్ మరుసటి రోజుకు వాయిదా వేశారు. -
‘ఖాళీ’ చేయించే బిల్లుకు ఓకే
ప్రభుత్వ భవనాల్లో అక్రమ నివాసులకు అడ్డుకట్ట న్యూఢిల్లీ: ప్రభుత్వ భవనాల్లో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించేందుకు ఉద్దేశించిన ఒక బిల్లును లోక్‌సభ సోమవారం మూజువాణి ఓటుతో ఆమోదించింది. అయితే, ఈ బిల్లులోని నిబంధనలను సాకుగా తీసుకుని పార్లమెంటు సభ్యులను ప్రభుత్వం వేధించే అవకాశం ఉందని పలువురు సభ్యులు సభలో ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వ భవనాల్లో అక్రమం నివాసం సమస్యపై గ ట్టి చర్యలు తీసుకునేందుకు త్వరలోనే నగరాల మేయర్ల సదస్సు నిర్వహించనున్నట్టు చెప్పారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే బిల్లును రూపొందించినట్టు చెప్పారు. ఈ బిల్లు కాంగ్రెస్ తెచ్చినదే అయినప్పటికీ రాజకీయ వివేచనతోనే సభలో ప్రవేశపెడుతున్నట్టు ఆయన చెప్పారు. చర్చలో తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సౌగత రాయ్, వెంకయ్యకు మధ్య లోక్‌సభలో సంవాదం చోటుచేసుకుంది. ఎంపీలను ఖాళీ చేయించేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతిలో ఔచిత్యంలేదని, రాయ్ వ్యాఖ్యానించగా, ఈ అంశంపై నిబంధనలను అనుసరించక తప్పదని మంత్రి అన్నారు. తమకు ఎవరిపైనా కక్షలేదని, మంత్రులకు అధికారిక నివాసం కల్పించేందుకు అక్రమ నివాసులను ప్రభుత్వ భవనాలనుంచి ఖాళీచేయించవలసి వస్తోందని, బాధాకరమే అయినా, ఇది తప్పనిసరి అని వ్యాఖ్యానించారు. కాగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎమ్మెన్నార్ఈజీఏ) అమలులో ప్రభుత్వం తీరును ప్రతిపక్ష సభ్యులు పలువురు సోమవారం లోక్‌సభలో విమర్శించారు. -
బీజేపీ బలపరీక్షపై కోర్టుకు కాంగ్రెస్
ముంబై: నిబంధనలకు భిన్నంగా శాసనసభలో ఫడ్నవిస్ ప్రభుత్వం బలపరీక్షను మూజువాణి ఓటుతో గెలిచిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించనుంది. ఇందుకోసం రాజ్యాంగ నిపుణుల సలహాలను తీసుకుంటోంది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధికార ప్రతినిధి అనంత్గాడ్గిల్ బుధవారం మీడియాకు వెల్లడించారు.విశ్వాస పరీక్ష సమయంలో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనలను ఏవిధంగా ఉల్లంఘించిందనే విషయాన్ని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు గాడ్గిల్ తెలిపారు. మరోవైపు బీజేపీ ప్రభుత్వం విశ్వాస పరీక్ష సమయంలో వ్యవహరించిన తీరుకు వ్యతిరేకంగా దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని పరిశీలించిన హైకోర్టు... పిటిషనర్ విన్నపాన్ని మన్నించేందుకు నిరాకరించింది. తన పిల్‌పై తుది నిర్ణయం వెలువడేదాకా ఫడ్నవిస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా చూడాలంటూ పిటిషనర్ సంజయ్ లాఖే పాటిల్ విన్నవించాడు. అయితే అందుకు హైకోర్టు నిరాకరించింది. -
కొలీజియం వ్యవస్థకు స్వస్తి
-
సభకో నమస్కారం!
ప్రపంచం నలుమూలలా ఏం జరుగుతున్నదో తెలుసుకొనేందుకు ఆత్రంగా ఏదైనా చానెల్ చూడబోయినవారిని జీవితంపై విరక్తి కలిగే స్థితికి తీసుకెళ్లిన పార్లమెంటు సమావేశాలు ముగిశాయి. మొత్తంగా ఈ 15వ లోక్‌సభ పనితీరునూ, మరీ ముఖ్యంగా సభ చివరి సమావేశాలనూ చూసినవారికీ చట్టసభలపైనా, ప్రజాస్వామ్యంపైనా అపనమ్మకం ఏర్పడే స్థితి ఏర్పడుతుందనడంలో వింతేమీ లేదు. చేసినవన్నీ, చూసినవన్నీ మరిచిపోయి ‘ఈ లోక్‌సభ సోనియా హుందాతనం, ప్రధాని మృదుత్వంవల్ల సజావుగా సాగింద’ని బీజేపీ నేత, విపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ అంటే...అంతకు కొన్ని రోజులముందు ‘నా రాజకీయ జీవితంలో ఇలాంటి సభను చూడలేద’ని ఆ పార్టీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ వ్యాఖ్యానించారు. సమయం, సందర్భం కొన్ని అభిప్రాయాలను మార్చేస్తాయి. రాజకీయ నాయకుల విషయంలో ఇది మరీ ఎక్కువ. బహుశా ఇద్దరూ మాట్లాడిన సందర్భాలు వేర్వేరు గనుక ఇలా విరుద్ధ వ్యాఖ్యలు వెలువడినట్టున్నాయి. అయితే, ఈ లోక్‌సభ పనితీరు గురించి సామాన్యులకు నిశ్చితమైన అభిప్రాయాలు ఏర్పడి ఉన్నాయి. అవి మాత్రం ఎన్నటికీ మారవు. భవిష్యత్తులో ఇంతకన్నా దిగజారే స్థితి ఏర్పడితే తప్ప ఈ సభ మొత్తంగా నడిచిన తీరుపై మంచి అభిప్రాయం ఏర్పడే అవకాశం లేదు. సామాన్యులు ఇలాంటి నిర్ణయానికి రావడానికి కారణం ఏ ఒక్కరో అని చెప్పడానికి లేదు. సభను నడిపిన స్పీకర్‌నుంచి సభా నాయకుడిగా ఉన్న ప్రధాని, విపక్ష నేతగా ఉన్న సుష్మాస్వరాజ్ వరకూ...వివిధ పార్టీల సభ్యుల వరకూ అందరి బాధ్యతా ఇందులో ఉంది. దేశాన్నేలుతున్న యూపీఏ సర్కారుకు అసలు అందుకు అవసరమైన సాధికారత ఉన్నదో, లేదో తేలలేదు. రెండు దఫాలుగా జరిగిన ఈ ఆఖరి సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం నోటీసుల స్వీకరణపై చర్చ జరగడమే సాధ్యంకాలేదు. సభలో గందరగోళం నెలకొని ఉన్నప్పుడు ఆ తీర్మానంపై చర్చ జరగరాదన్న నిబంధన ప్రభుత్వానికి బాగా ఉపయోగపడింది. ఉపయోగపడటం కాదు...కొందరు సభ్యుల ద్వారా సర్కారే ఆ గందరగోళాన్ని సృష్టించిందని సాక్షాత్తూ ఆ పార్టీ ఎంపీలే అన్నారు. చట్టసభ మౌలిక బాధ్యతే ఏలుబడిలో ఉన్న సర్కారుకు సాధికారత ఇవ్వడం. ఆ మౌలిక బాధ్యతనే నిర్వర్తించలేని స్థితికి సభ వెళ్లిందంటే...అందుకు స్వయంగా సర్కారే పథకం వేసిందంటే అది మన ప్రజాస్వామ్యానికే అవమానకరమైన విషయం. ఎక్కడో బనానా రిపబ్లిక్లలో మాత్రమే సాధ్యంకాగలవన్నీ ఇక్కడా జరుగుతున్నాయనుకోవాలి. అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఉన్న నిబంధనేమీ బిల్లులకు లేదు. అందువల్ల వాటికి ఆమోదముద్ర పెద్ద కష్టంకాలేదు. తీవ్ర భావోద్వేగాలను రగిలించిన రాష్ట్ర విభజన విషయంలోనైనా, రూ. 18 లక్షల కోట్ల బడ్జెట్ విషయంలోనైనా గందరగోళ దృశ్యాలమధ్యే, మూజువాణి ఓటుతోనే అంతా పూర్తయిపోయింది. ముఖ్యంగా విభజన బిల్లుకు సభ ఆమోదం తీసుకునే సమయంలో లోక్‌సభ ప్రత్యక్ష ప్రసారాలు నిలిచిపోయిన తీరు పౌరులందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. అసలు అలాంటి ఆమోదం తీసుకొనేటపుడు సంబంధిత ప్రాంత ఎంపీలు సభలో ఉండేలా చూడటం కనీస బాధ్యతన్న సంగతినే విస్మరించారు. ఇదే సమస్యపై సభలో అంతకు కొన్నిరోజులముందు సభ్యులు పరస్పరం తలపడటం, పెప్పర్ స్ప్రే ప్రయోగించడంవంటివి మన పార్లమెంటును ప్రపంచంలో నవ్వులపాలయ్యేలా చేశాయి. భిన్నాభిప్రాయాలను పార్టీ వేదికల్లో పరిష్కరించలేని వివిధ పార్టీల అధినేతల అసమర్ధతే ఇందుకు కారణమని కూడా సరిపెట్టుకోలేం... ఎందుకంటే అలాంటి గలాటా సృష్టించమని ప్రోత్సహించిందే వారు. వాస్తవం ఇదికాగా... దేశం క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోగలదని తెలంగాణ బిల్లు చాటిచెప్పిందని ప్రధాని మన్మోహన్ ఎలా అనగలిగారో అంతుపట్టని విషయం. ఆ మాటలు ఆత్మ వంచన, జనవంచన కూడా అవుతాయి. ఈ లోక్‌సభ అయిదేళ్ల కాలంలోనూ 326 బిల్లులను పరిశీలించి 177 బిల్లులను ఆమోదించింది. ఇది గడిచిన కాలంలోని ఏ సభతో పోల్చినా తక్కువే. అయితే, కేవలం ఆమోదించిన బిల్లుల సంఖ్యను మాత్రమే పరిగణనలోకి తీసుకుని సభ పనితీరును లెక్కేయడం కూడా సబబు కాదు. ఎన్ని బిల్లులపై సమగ్ర చర్చ జరిగిందో, సభ్యులు వ్యక్తంచేసిన అభిప్రాయాల్లో ఎన్నింటికి ప్రభుత్వం విలువనిచ్చిందో చూడాలి. అలా చూసినా పాత సభలతో పోలిస్తే ఇది తీసికట్టే. అత్యంత ప్రధానమైన 18 లక్షల కోట్ల రూపాయల సాధారణ బడ్జెట్‌పైనే సరిగా చర్చ లేదంటే ఇక మిగిలినవాటి సంగతి చెప్పేదేముంది? 20 బిల్లులపై అయిదు నిమిషాల కంటే తక్కువ సమయమే చర్చ జరిగింది. సర్కారు వైఖరి కారణంగా మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లకు వీలుకల్పించే బిల్లు మురిగిపోయింది. ఈ బిల్లు ఇప్పటికే రాజ్యసభ ఆమోదంపొంది, దాన్నుంచి లోక్‌సభకు వచ్చింది. అయితే, యూపీఏ ప్రభుత్వ చేతగానితనం కారణంగా అది కాస్తా వ్యర్థమైంది. మళ్లీ కొత్త లోక్‌సభ ఏర్పడి బిల్లును ప్రవేశపెడితే తప్ప మహిళలకు కోటా సాధ్యపడదు. ఈ లోక్‌సభకు ఆటంకాలే ఆనవాయితీగా మారాయి. ప్రతి సమావేశాల సమయంలోనూ ఏదో ఒక కుంభకోణం బయటపడటం, దానిపై విచారణకు యూపీఏ సర్కారు ససేమిరా అనడం...ఫలితంగా సమావేశాలన్నీ వాయిదాల్లో గడిచిపోవడం సర్వసాధారణమైంది. 2జీ కుంభకోణం మొదలుకొని బొగ్గు కుంభకోణం వరకూ ప్రతి స్కాంపైనా ప్రభుత్వం మొండివైఖరినే అవలంబించింది. న్యాయస్థానాల జోక్యం తర్వాతే ఆయా స్కాంలపై విచారణలు మొదలయ్యాయి. మొత్తానికి ఏరకంగా చూసినా ఈ లోక్‌సభ నిరంతర అంతరాయాలతో...కనీవినీ ఎరుగని దిగ్భ్రాంతికర దృశ్యాలతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తినే మిగిల్చింది. -
మూజువాణీ ఓటుకు కారకులెవరు?
రాజ్యసభలో మూజువాణీ ఓటు తీసుకోడానికి.. తెలంగాణ బిల్లు దాంతోనే ఆమోదం పొందడానికి కారకులెవరు? కేవలం తెలుగుదేశం పార్టీకి చెందిన ఇరు ప్రాంతాల సభ్యులేనని పరోక్షంగా డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ స్పష్టం చేశారు. బిల్లుపై డివిజన్ కావాలని, ఓటింగ్ నిర్వహించాల్సిందేనని బీజేపీ తరఫున మాట్లాడిన సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు, సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి పదే పదే పట్టుబట్టారు. వారితోపాటు తృణమూల్ కాంగ్రెస్ నాయకులు కూడా బిల్లుపై ఓటింగ్ నిర్వహించి తీరాలన్నారు. చర్చకు అనుమతినిచ్చి, అన్నిరకాల వాదనలు వినిపించేందుకు మార్గం సుగమం చేసిన పీజే కురియన్.. ఓటింగుకు మాత్రం అనుమతించలేదు. సభ ఏమాత్రం అదుపులో లేదని, వెల్‌లో ఇంతమంది సభ్యులు ఉండగా ఓటింగ్ నిర్వహించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. వారిని వెనక్కి పంపించే బాధ్యత తనదొక్కడిదే కాదని, ఇతర సభ్యులు కూడా వారిని వెనక్కి రప్పించేందుకు కృషి చేయాలని పదే పదే కోరారు. ఆ సమయంలో సీనియర్ నాయకులు ఎంతగా చెప్పినా, ఇరు ప్రాంతాలకు చెందిన టీడీపీ సభ్యులు.. ముఖ్యంగా సుజనా చౌదరి, గుండు సుధారాణి తదితరులు మాత్రం అక్కడి నుంచి కదల్లేదు. ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ పదే పదే డిప్యూటీ చైర్మన్‌తో నేరుగా వాగ్వాదానికి దిగి, సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తూ ఉన్నారు. దాంతో సభ అదుపులో లేదని సాకు చూపించి.. మూజువాణీ ఓటునే రాజ్యసభలో కూడా చేపట్టారు. దీంతో అసలు బిల్లుకు ఎంతమంది అనుకూలంగా ఉన్నారో, మరెంతమంది వ్యతిరేకంగా ఉన్నారో తెలియకుండానే, ఏదో సాధారణ బిల్లులను ఆమోదించినట్లుగా ఇంత పెద్ద రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చీల్చేసేందుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును ఆమోదించి పారేశారు. అలా కాకుండా సభ అదుపులో ఉన్నట్లయితే మాత్రం కనీసం రాజ్యసభలోనైనా ఎంతోకొంత న్యాయం జరిగినట్లు ఉండేది. లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఏం చర్చ జరిగిందో, ఎలా ఓటింగ్ జరిపారో ఎవరికీ తెలియదు. ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేయడం వల్ల ఆ పరిస్థితి ఏర్పడింది. కానీ, రాజ్యసభలో మాత్రం అలా కాదు. సభలో ఏం జరుగుతోందన్నది యావద్దేశం చూస్తూనే ఉంది. కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చిరునవ్వులు చిందిస్తూ చిద్విలాసంగా కూర్చున్నారు. మౌనముని మన్మోహన్ సింగ్ ధ్యానముద్రలో ఉన్నట్లుగా కనిపించారు. జైరాం రమేష్ లాంటి వాళ్లు మాత్రం కాస్త ఉద్వేగంగా కనిపించారు. అరుణ్ జైట్లీ లాంటి బీజేపీ సీనియర్ నేతలు చర్చలో పాల్గొని కీలకాంశాలు లేవనెత్తారు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం అసలు చర్చలో పాల్గొనలేదు సరికదా.. మూజువాణీ ఓటు రావడానికి కారకులై విభజనకు చేతులారా గొడ్డలి అందించినట్లయింది!! -
చీకట్లో బిల్లుకు ఆమోదమా?
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. మూజువాణి ఓటుతో విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ప్రధాన ప్రతిపక్ష బీజేపీ మద్దతు తెలపడంతో బిల్లులో సవరణలపై సభలో ఓటింగ్ నిర్వహించింది. అయితే చీకట్లో బిల్లును ఆమోదించిన తీరుపై పలు పార్టీలు విమర్శలు గుప్పించాయి. లోక్‌సభ ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసి, గ్యాలరీ, ద్వారాలను మూసివేసి ఓటింగ్ నిర్వహించడం ఏమిటని ప్రశ్నించాయి. ఈరోజు కాంగ్రెస్ వ్యవహరించిన తీరు ఎమర్జన్సీ కన్నా దారుణంగా ఉందని దుమ్మెత్తిపోశాయి. ఎమర్జన్సీ సమయంలో మీడియాను సెన్సార్ చేశారే తప్పా, నిషేధించలేదని గుర్తుచేశాయి. అప్రజాస్వామికంగా వ్యవహరించిన కాంగ్రెస్‌ను ప్రధాన ప్రతిపక్షం బీజేపీ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశాయి. కాంగ్రెస్, బీజేపీ మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ఆరోపించాయి. దేశ ప్రజలను చీకట్లో ఉంచి బిల్లును ఆమోదించడాన్ని ప్రజాస్వామ్యవాదులు ఖండిస్తున్నారు. -
మూజువాణి ఓటుతో ఆమోదించవద్దు: బీజేపీ
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై సభలో పూర్తి స్థాయి చర్చ జరగాలని భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించరాదని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి జైరాం రమేష్ బీజేపీ అగ్రనేతలతో మంగళవారం ఉదయం ఇక్కడ సమావేశమైయ్యారు. బీజేపీ అగ్రనేతలు కొన్ని డిమాండ్లను ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ముందు ఉంచారు. కొత్త రాజధాని నిర్మాణానికి నిధులతోపాటు సీమాంధ్ర కోల్పోయే ఆదాయాన్ని ఏ విధంగా భర్తీ చేస్తారో సభా ముఖంగా ప్రకటించాలని వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. పోలవరం ముంపుకు గురయ్యే భద్రచలం డివిజన్లోని ఏడు మండలాలు సీమాంధ్రకు బదలాయించాలని కరాకండిగా చెప్పారు. సీమాంధ్రలో అత్యంత వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని బీజేపీ అగ్రనేతలు తమ డిమాండ్లలో పేర్కొన్నారు.