రాహుల్-కేజ్రీవాల్ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ మరో ప్రాంతీయ పార్టీతో పొత్తుకి ప్రయత్నాలు మొదలుపెట్టింది. 2019లో లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీతో కలిసి ఎన్నికల్లో పోటీచేసేందుకు మంతనాలు చేస్తోంది. దానిలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర జైరామ్ రమేష్, మరో సీనియర్ నేత అజయ్ మాకేన్‌లు ఆప్ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో చర్చలు జరిపినట్టు సమాచారం. ఏడు లోకసభ స్థానాల్లో ఆప్ ఐదు సీట్లలో పోటీ చేసి కాంగ్రెస్‌కి రెండు సీట్లు ఇవ్వడానికి అంగీకరించినట్లు, కాంగ్రెస్ మాత్రం మూడు సీట్లలో పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రెండు పార్టీల మధ్య పొత్తు ఏవిధంగా ఉంటుందో వేచి చూడాలి.
ఇటీవల కేజ్రీవాల్ ఓ సమావేశంలో మాట్లాడుతూ మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై ప్రసంశల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. మన్మోహన్ లాంటి విద్యావేత్తని దేశ ప్రధానిగా కోల్పోయామని, ప్రధానమంత్రి అయనలా చదవుకున్న వ్యక్తి అయ్యి ఉండాలని కేజ్రీవాల్ వ్యాఖ్యానించించారు. కాంగ్రెస్‌కు దగ్గర కావడానికే కేజ్రీవాల్ ఇలా మాట్లాడారని రాజకీయ వర్గాల అభిప్రాయం. ఇదిలా ఉండగా కాంగ్రెస్- ఆప్ కలిసి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తాయి అన్న వార్తలను అజమ్ మాకేనే తీవ్రంగా ఖండించారు. ఆ వార్తల్లో నిజంలేదని, తాము ఎన్నికల పొత్తుపై కేజ్రీవాల్‌తో చర్చలు జరపలేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment