kejrewal
-
కేజ్రీవాల్ ‘కీ’ స్టెప్.. రాజ్యసభకు హర్భజన్ సింగ్‌తో మరో నలుగురు.. ఎవరంటే..?
ఛండీగఢ్: జాతీయ పార్టీలకు షాకిస్తూ పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తోంది పంజాజ్ భగవంత్ మాన్ సర్కార్. ఇప్పటికే ఉద్యోగాల భర్తీ, మంత్రులకు టార్గెట్ ఇచ్చిన ఆప్ ప్రభుత్వం మరో సంచలన ప్రకటన చేసింది. ఐదుగురు విభిన్న వర్గాలకు చెందిన వ్యక్తులను రాజసభ్యకు నామినేట్ చేస్తూ దేశ రాజకీయాలను ఆకర్షించింది. సోమవారం పంజాబ్ రాష్ట్రం నుంచి ఐదుగురిని రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. పంజాబ్ నుంచి ఐదుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియడంతో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఐదుగురు నూతన సభ్యులను రాజ్యసభకు నామినేట్ చేసింది. ఆప్ అభ్యర్థులుగా ఢిల్లీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా, క్రికెటర్ హర్భజన్ సింగ్, ఢిల్లీ ఐఐటి ప్రొఫెసర్ సందీప్ పాఠక్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (ఎల్‌పియు) వ్యవస్థాపకుడు, ఛాన్సలర్ అశోక్ మిట్టల్, పారిశ్రామికవేత్త సంజీవ్ అరోరాలను రాజ్యసభకు నామినేట్ చేసింది. నామినేషన్ దాఖలుకు సోమవారం చివరి రోజు కాగా మార్చి 31న ఎన్నికలు జరగనున్నాయి. ఇదిలా ఉండగా.. ఢిల్లీలోని రాజేందర్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్న రాఘవ్ చద్దా.. అతిచిన్న వయసులో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. అంతేకాకుండా చద్దా.. పంజాబ్ ఆప్ పార్టీ ఇంచార్జ్‌గా, ఆప్ జాతీయ అధికార ప్రతినిధిగా కూడా పనిచేస్తున్నారు. భారత మాజీ క్రికెటర్, స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ అందరికీ తెలిసిన వ్యక్తి. ఢిల్లీ ఐఐటి ప్రొఫెసర్ సందీప్ పాఠక్ చాలా కాలంగా ఆప్‌తో కలిసి పనిచేస్తున్నారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు పాఠక్ అత్యంత సన్నిహితుడు. ఎన్నికల వ్యూహాల రచించడంతో కీలక పాత్ర పోషించారు. ఇక, విద్యా రంగంలో చేస్తున్న సేవలను గుర్తించిన ఆప్.. పంజాబ్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఛాన్సలర్ అశోక్ మిట్టల్‌ను తమ పార్టీ తరఫున రాజ్యసభకు నామినేట్ చేసింది. ప్రముఖ పారిశ్రామికవేత్త సంజీవ్ అరోరాకు కూడా ఆప్ అవకాశం ఇచ్చింది. Meet AAP's 5 new Rajya Sabha MPs 🥳 1. Ashok Mittal 2. Harbhajan Singh 3. Raghav Chadha 4. Sandeep Pathak 5. Sanjeev Arora pic.twitter.com/wlRuemaajc — AAP (@AamAadmiParty) March 21, 2022 -
ఢిల్లీలో మరోసారి లాక్డౌన్ పొడిగింపు
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి లాక్డౌన్ పొడిగించారు. ఈ నెల 17 వరకు మరో వారం పాటు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. రేపటి (సోమవారం) నుంచి ఢిల్లీలో వారం పాటు మెట్రో సర్వీసులు రద్దు చేసున్నట్లు ఆయన ప్రకటించారు. లాక్డౌన్ సత్ఫలితాలు ఇస్తోందని కేజ్రీవాల్ అన్నారు. పాజిటివ్ రేటు 35 నుంచి 23 శాతానికి తగ్గిందని సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. దేశంలో కరోనా వైరస్ రెండో వేవ్ తీవ్రరూపంలో వ్యాపిస్తోంది. కరోనా కట్టడి చర్యలు తీసుకుంటున్నా ఏమాత్రం ఫలితం ఉండడం లేదు. దీంతో విధిలేక చివరి అస్త్రంగా రాష్ట్రాలు లాక్డౌన్ విధిస్తున్నాయి. కరోనా గొలుసు తెంపేందుకు లాక్‌డౌనే పరిష్కారమని రాష్ట్రాలు భావిస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఏకంగా 14 రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్డౌన్ అమల్లో ఉంది. మొదట మహారాష్ట్రతో మొదలైన లాక్డౌన్ అనంతరం ఢిల్లీ, కర్ణాటక విధించగా తాజాగా తమిళనాడు కూడా విధించింది. కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 4,03,738 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. చదవండి: దేశంలో పంజా విసురుతున్న మ్యూకోర్మైకోసిస్ కరోనా సంక్షోభంపై టాస్క్‌ఫోర్స్ -
ఆప్‌తో పొత్తుకి కాంగ్రెస్ సై?
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ మరో ప్రాంతీయ పార్టీతో పొత్తుకి ప్రయత్నాలు మొదలుపెట్టింది. 2019లో లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీతో కలిసి ఎన్నికల్లో పోటీచేసేందుకు మంతనాలు చేస్తోంది. దానిలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర జైరామ్ రమేష్, మరో సీనియర్ నేత అజయ్ మాకేన్‌లు ఆప్ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో చర్చలు జరిపినట్టు సమాచారం. ఏడు లోకసభ స్థానాల్లో ఆప్ ఐదు సీట్లలో పోటీ చేసి కాంగ్రెస్‌కి రెండు సీట్లు ఇవ్వడానికి అంగీకరించినట్లు, కాంగ్రెస్ మాత్రం మూడు సీట్లలో పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రెండు పార్టీల మధ్య పొత్తు ఏవిధంగా ఉంటుందో వేచి చూడాలి. ఇటీవల కేజ్రీవాల్ ఓ సమావేశంలో మాట్లాడుతూ మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై ప్రసంశల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. మన్మోహన్ లాంటి విద్యావేత్తని దేశ ప్రధానిగా కోల్పోయామని, ప్రధానమంత్రి అయనలా చదవుకున్న వ్యక్తి అయ్యి ఉండాలని కేజ్రీవాల్ వ్యాఖ్యానించించారు. కాంగ్రెస్‌కు దగ్గర కావడానికే కేజ్రీవాల్ ఇలా మాట్లాడారని రాజకీయ వర్గాల అభిప్రాయం. ఇదిలా ఉండగా కాంగ్రెస్- ఆప్ కలిసి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తాయి అన్న వార్తలను అజమ్ మాకేనే తీవ్రంగా ఖండించారు. ఆ వార్తల్లో నిజంలేదని, తాము ఎన్నికల పొత్తుపై కేజ్రీవాల్‌తో చర్చలు జరపలేదని తెలిపారు. -
సామాన్యుడి అసమాన్య గెలుపు
దేశ రాజధాని దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ సృష్టించిన ప్రభంజనంతో కర్నూలులో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. పూర్తి స్థాయి ఫలితాలు వెలువడిన వెంటనే ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి బాణ సంచా కాల్చారు. అభిమానులు స్వీట్లు పంచిపెట్టారు. రాజ్‌విహార్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కర్నూలు జిల్లా పరిషత్/ఓల్డ్‌సిటి/ రాజవిహార్/అగ్రికల్చర్ : దేశ రాజధాని ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ సృష్టించిన ప్రభంజనంతో కర్నూలులో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. పూర్తి స్థాయి ఫలితాలు వెలువడిన వెంటనే ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి బాణ సంచా పేల్చడంతో పాటు స్వీట్లు పంచిపెట్టారు. స్థానిక రాజ్‌విహార్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ ప్రతినిధి పీబీవీ సుబ్బయ్య మాట్లాడుతూ తమ పార్టీపై సామాన్య ప్రజలు ఉంచిన నమ్మకానికి ప్రతీక ఈ కనీవినీ ఎరుగని విజయమని తెలిపారు. అవినీతి నిర్మూలనలో కేవలం 49 రోజుల్లోనే దిల్లీ ప్రజలతో పాటు దేశ ప్రజల నమ్మకాన్ని పొందిందని తెలిపారు. త్వరలో జరగనున్న కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సత్తా చాటనుందని చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్‌కు అపూర్వమైన విజయాన్ని ఇచ్చిన దిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రతినిధులు రజనీకాంత్, సురేంద్రనాథరెడ్డి, మధు, ఇంతియాజ్, న్యాయవాది సోమశంకర యాదవ్, సలీమ్ అహ్మద్, అబ్దుల్ రహీమ్‌లు తదితరులు పాల్గొన్నారు. ఇంటెలెక్చువల్స్ కలెక్టివ్ సంస్థ ఆధ్వర్యంలో... ఇంటెలెక్చువల్స్ కలెక్టివ్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద బాణాసంచా పేల్చి విజయోత్సవం నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు ఖదీరుల్లా మాట్లాడుతూ వివిధ సంస్థల సర్వేలు, రాజకీయ విశ్లేషకులు విస్మయం చెందే విధంగా ఆప్ సాధించిన ఈ విజయం భారతదేశంలోని ప్రజాస్వామ్య లౌకికవాద విజయంగా భావించవచ్చన్నారు. భారతదేశ ప్రజలు లౌకికవాదం వైపు ఉన్నారని, అవినీతి రహిత ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాన్ని భారతీయులు బలంగా ఆకాంక్షిస్తున్నారని కేజ్రీవాల్ విజయం నిరూపించిందన్నారు. ప్యాడ్స్ సంస్థ జాతీయ కన్వీనర్ శ్రీనివాసరావు, జిల్లా కన్వీనర్ బాలన్న, అజయ్‌కుమార్, రోషన్ అలీ, వారిస్, మోజెస్, ముస్తఫా, జయన్న, తదితరులు పాల్గొన్నారు. -
చేయి విడువలేదు..
సాక్షి, న్యూఢిల్లీ: అక్రమ మార్గాల ద్వారా ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీని అడ్డుకునేందుకు తాము అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది. కాషాయ పార్టీని నిలువరించేందుకు కాంగ్రెస్, జనతాదళ్ (యు) పార్టీలతో పాటు బీజేపీలోని కొంతమంది నిజాయితీపరులైన ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో చెప్పారు. తమ పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలను బీజేపీ సంప్రదించిందని, అవసరమైన పక్షంలో మరిన్ని టేపులు బయటపెడతామని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఓ స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియో కేజ్రీవాల్ సోమవారం బయటపెట్టిన సంగతి తెల్సిందే. బీజేపీ ఢిల్లీ శాఖ ఉపాధ్యక్షుడు షేర్సింగ్ డాగర్ సంగం విహార్ నియోజకవర్గ ఆప్ ఎమ్మెల్యే దినేష్ మొహనియాకు లంచం ఇవ్వజూపిన దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. తాము అన్ని పార్టీల ఎమ్మెల్యేలతో టచ్‌లో ఉన్నామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. స్వతంత్ర అభ్యర్థి రాంబీర్ షోకీన్ (ముండ్కా), జేడీ(యూ) ఎమ్మెల్యే షోయబ్ ఇక్బాల్, ఆప్ బహిష్కృత సభ్యుడు వినోద్‌కుమార్ బిన్నీతో పాటు కాంగ్రెస్, బీజేపీలోని నిజాయితీపరులైన ఎమ్మెల్యేలను సంప్రదిస్తున్నామని తెలిపారు. తాము ప్రభుతాన్ని ఏర్పాటు చేయడానికే ఇవన్నీ చేయడం లేదని, కేవలం బీజేపీని అక్రమ మార్గాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. బీజేపీ కోసం ఎల్జీ తాపత్రయం ప్రభుత్వం ఏర్పాటు కోసం సుప్రీంకోర్టు కేంద్రానికి నెల రోజుల గడువు ఇవ్వడంతో ఆమ్ ఆద్మీ పార్టీ కొంత నిరాశకు గురైంది. సుప్రీంకోర్టులో తమ పిటిషన్‌పై విచారణ వాయిదా పడడంతో ఆమ్ ఆద్మీ పార్టీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌పై ఆరోపణలు గుప్పించింది. న్యాయస్థానంపై తమకు నమ్మకం ఉంది కానీ లెప్టినెంట్ గవర్నర్‌పై లేదని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. నజీబ్‌జంగ్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి ఆరోపించారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు తగిన సంఖ్యాబలం లేదంటూ బీజేపీ డిసెంబర్లో లెప్టినెంట్ గవర్నర్‌కు రాసిన లేఖ ఇంకా ఆయన వద్దనే ఉందని చెప్పారు. బీజేపీ ఆ లేఖను ఉపసంహరించుకోలేదని, అటువంటప్పుడు ఎల్జీ ఏ ఆధారంతో బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలనుకుంటున్నారని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఎల్జీ బీజేపీ కోసం బ్యాటింగ్ చేస్తున్నారని కేజ్రీవాల్ సుప్రీంకోర్టు ఎదుట విమర్శించారు. ఆ తరువాత విలేకరుల సమావేశంలో, ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించేందుకు అనుమతించాలని కోరుతూ ఎల్జీ రాష్ట్రపతికి రాసిన లేఖ ప్రతిని ఆయన అందించారు. బుధవారం ఉదయం తొమ్మిదిన్నరకు తాము లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలిసి తమ స్టింగ్ సాక్షి, న్యూఢిల్లీ: అక్రమ మార్గాల ద్వారా ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీని అడ్డుకునేందుకు తాము అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది. కాషాయ పార్టీని నిలువరించేందుకు కాంగ్రెస్, జనతాదళ్ (యు) పార్టీలతో పాటు బీజేపీలోని కొంతమంది నిజాయితీపరులైన ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో చెప్పారు. తమ పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలను బీజేపీ సంప్రదించిందని, అవసరమైన పక్షంలో మరిన్ని టేపులు బయటపెడతామని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఓ స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియో కేజ్రీవాల్ సోమవారం బయటపెట్టిన సంగతి తెల్సిందే. బీజేపీ ఢిల్లీ శాఖ ఉపాధ్యక్షుడు షేర్సింగ్ డాగర్ సంగం విహార్ నియోజకవర్గ ఆప్ ఎమ్మెల్యే దినేష్ మొహనియాకు లంచం ఇవ్వజూపిన దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. తాము అన్ని పార్టీల ఎమ్మెల్యేలతో టచ్‌లో ఉన్నామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. స్వతంత్ర అభ్యర్థి రాంబీర్ షోకీన్ (ముండ్కా), జేడీ(యూ) ఎమ్మెల్యే షోయబ్ ఇక్బాల్, ఆప్ బహిష్కృత సభ్యుడు వినోద్‌కుమార్ బిన్నీతో పాటు కాంగ్రెస్, బీజేపీలోని నిజాయితీపరులైన ఎమ్మెల్యేలను సంప్రదిస్తున్నామని తెలిపారు. తాము ప్రభుతాన్ని ఏర్పాటు చేయడానికే ఇవన్నీ చేయడం లేదని, కేవలం బీజేపీని అక్రమ మార్గాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. బీజేపీ కోసం ఎల్జీ తాపత్రయం ప్రభుత్వం ఏర్పాటు కోసం సుప్రీంకోర్టు కేంద్రానికి నెల రోజుల గడువు ఇవ్వడంతో ఆమ్ ఆద్మీ పార్టీ కొంత నిరాశకు గురైంది. సుప్రీంకోర్టులో తమ పిటిషన్‌పై విచారణ వాయిదా పడడంతో ఆమ్ ఆద్మీ పార్టీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌పై ఆరోపణలు గుప్పించింది. న్యాయస్థానంపై తమకు నమ్మకం ఉంది కానీ లెప్టినెంట్ గవర్నర్‌పై లేదని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. నజీబ్‌జంగ్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి ఆరోపించారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు తగిన సంఖ్యాబలం లేదంటూ బీజేపీ డిసెంబర్లో లెప్టినెంట్ గవర్నర్‌కు రాసిన లేఖ ఇంకా ఆయన వద్దనే ఉందని చెప్పారు. బీజేపీ ఆ లేఖను ఉపసంహరించుకోలేదని, అటువంటప్పుడు ఎల్జీ ఏ ఆధారంతో బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలనుకుంటున్నారని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఎల్జీ బీజేపీ కోసం బ్యాటింగ్ చేస్తున్నారని కేజ్రీవాల్ సుప్రీంకోర్టు ఎదుట విమర్శించారు. ఆ తరువాత విలేకరుల సమావేశంలో, ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించేందుకు అనుమతించాలని కోరుతూ ఎల్జీ రాష్ట్రపతికి రాసిన లేఖ ప్రతిని ఆయన అందించారు. బుధవారం ఉదయం తొమ్మిదిన్నరకు తాము లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలిసి తమ స్టింగ్ ఠ5వ పేజీ తరువాయి ఆపరేషన్ సీడీని సమర్పించనున్నట్లు చెప్పారు. సీడీ చూసిన తరువాత ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీకి ఆహ్వానించకూడదంటూ ఎల్జీ తన లేఖలో సవరణలు చేయాలని ఆయన సూచించారు. స్టింగ్ ఆపరేషన్ సీడీని తాము రాష్ట్రపతికి కూడా పంపుతామని ఆయన చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా తాము ఉద్యమం లేవదీస్తామని, సీడీని ప్రజలకు చూపించి బీజేపీ ద్వంద్వైవె ఖరిని ప్రజల ముందుంచుతామని ఆయన చెప్పారు. ఎన్నికలలలో పోటీచేసి సత్తా చూపాలని బీజేపీకి సవాలు విసిరారు. కేంద్రంలో సర్కారు ఏర్పాటుచేసి, ఢిల్లీలో ఏడింటికి ఏడు స్థానాలు గెలిచిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేసేందకు ఎందుకు భయపడుతోందని ఆయన ప్రశ్నించారు. ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం లేదని, మళ్లీ ఎన్నికలు జరగాలని కోరుతోందని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపైనే పూర్తిగా దృష్టిని కేంద్రీకరించాలని నిర్ణయించిన ఆప్ రాజధాని నగరంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతే ప్రజలకు మరింత దూరమవుతానని ఆందోళన చెందుతోంది.