చేయి విడువలేదు.. | Continuous arm .. | Sakshi
Sakshi News home page

చేయి విడువలేదు..

Published Tue, Sep 9 2014 11:42 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

చేయి విడువలేదు.. - Sakshi

చేయి విడువలేదు..

 సాక్షి, న్యూఢిల్లీ:
 అక్రమ మార్గాల ద్వారా ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీని అడ్డుకునేందుకు తాము అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది. కాషాయ పార్టీని నిలువరించేందుకు కాంగ్రెస్, జనతాదళ్ (యు) పార్టీలతో పాటు బీజేపీలోని కొంతమంది నిజాయితీపరులైన ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో చెప్పారు. తమ పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలను బీజేపీ సంప్రదించిందని, అవసరమైన పక్షంలో మరిన్ని టేపులు బయటపెడతామని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఓ స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియో కేజ్రీవాల్ సోమవారం బయటపెట్టిన సంగతి తెల్సిందే. బీజేపీ ఢిల్లీ శాఖ ఉపాధ్యక్షుడు షేర్‌సింగ్ డాగర్ సంగం విహార్ నియోజకవర్గ ఆప్ ఎమ్మెల్యే దినేష్ మొహనియాకు లంచం ఇవ్వజూపిన దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. తాము అన్ని పార్టీల ఎమ్మెల్యేలతో టచ్‌లో ఉన్నామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. స్వతంత్ర అభ్యర్థి రాంబీర్ షోకీన్ (ముండ్కా), జేడీ(యూ) ఎమ్మెల్యే షోయబ్ ఇక్బాల్, ఆప్ బహిష్కృత సభ్యుడు వినోద్‌కుమార్ బిన్నీతో పాటు కాంగ్రెస్, బీజేపీలోని నిజాయితీపరులైన ఎమ్మెల్యేలను సంప్రదిస్తున్నామని తెలిపారు. తాము ప్రభుతాన్ని ఏర్పాటు చేయడానికే ఇవన్నీ చేయడం లేదని, కేవలం బీజేపీని అక్రమ మార్గాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు.
 బీజేపీ కోసం ఎల్జీ తాపత్రయం
 ప్రభుత్వం ఏర్పాటు కోసం సుప్రీంకోర్టు కేంద్రానికి నెల రోజుల గడువు ఇవ్వడంతో ఆమ్ ఆద్మీ పార్టీ కొంత నిరాశకు గురైంది. సుప్రీంకోర్టులో తమ పిటిషన్‌పై విచారణ వాయిదా పడడంతో ఆమ్ ఆద్మీ పార్టీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌పై ఆరోపణలు గుప్పించింది. న్యాయస్థానంపై తమకు నమ్మకం ఉంది కానీ లెప్టినెంట్ గవర్నర్‌పై లేదని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. నజీబ్‌జంగ్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి ఆరోపించారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు తగిన సంఖ్యాబలం లేదంటూ  బీజేపీ డిసెంబర్‌లో లెప్టినెంట్ గవర్నర్‌కు రాసిన లేఖ ఇంకా ఆయన వద్దనే ఉందని చెప్పారు. బీజేపీ ఆ లేఖను ఉపసంహరించుకోలేదని, అటువంటప్పుడు ఎల్జీ ఏ ఆధారంతో బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలనుకుంటున్నారని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఎల్జీ బీజేపీ కోసం బ్యాటింగ్ చేస్తున్నారని కేజ్రీవాల్ సుప్రీంకోర్టు ఎదుట విమర్శించారు. ఆ తరువాత విలేకరుల సమావేశంలో,  ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించేందుకు అనుమతించాలని కోరుతూ ఎల్జీ రాష్ట్రపతికి రాసిన లేఖ ప్రతిని ఆయన అందించారు. బుధవారం ఉదయం తొమ్మిదిన్నరకు తాము లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలిసి తమ స్టింగ్ సాక్షి, న్యూఢిల్లీ:
 అక్రమ మార్గాల ద్వారా ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీని అడ్డుకునేందుకు తాము అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది. కాషాయ పార్టీని నిలువరించేందుకు కాంగ్రెస్, జనతాదళ్ (యు) పార్టీలతో పాటు బీజేపీలోని కొంతమంది నిజాయితీపరులైన ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో చెప్పారు. తమ పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలను బీజేపీ సంప్రదించిందని, అవసరమైన పక్షంలో మరిన్ని టేపులు బయటపెడతామని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఓ స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియో కేజ్రీవాల్ సోమవారం బయటపెట్టిన సంగతి తెల్సిందే. బీజేపీ ఢిల్లీ శాఖ ఉపాధ్యక్షుడు షేర్‌సింగ్ డాగర్ సంగం విహార్ నియోజకవర్గ ఆప్ ఎమ్మెల్యే దినేష్ మొహనియాకు లంచం ఇవ్వజూపిన దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. తాము అన్ని పార్టీల ఎమ్మెల్యేలతో టచ్‌లో ఉన్నామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. స్వతంత్ర అభ్యర్థి రాంబీర్ షోకీన్ (ముండ్కా), జేడీ(యూ) ఎమ్మెల్యే షోయబ్ ఇక్బాల్, ఆప్ బహిష్కృత సభ్యుడు వినోద్‌కుమార్ బిన్నీతో పాటు కాంగ్రెస్, బీజేపీలోని నిజాయితీపరులైన ఎమ్మెల్యేలను సంప్రదిస్తున్నామని తెలిపారు. తాము ప్రభుతాన్ని ఏర్పాటు చేయడానికే ఇవన్నీ చేయడం లేదని, కేవలం బీజేపీని అక్రమ మార్గాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు.
 బీజేపీ కోసం ఎల్జీ తాపత్రయం
 ప్రభుత్వం ఏర్పాటు కోసం సుప్రీంకోర్టు కేంద్రానికి నెల రోజుల గడువు ఇవ్వడంతో ఆమ్ ఆద్మీ పార్టీ కొంత నిరాశకు గురైంది. సుప్రీంకోర్టులో తమ పిటిషన్‌పై విచారణ వాయిదా పడడంతో ఆమ్ ఆద్మీ పార్టీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌పై ఆరోపణలు గుప్పించింది. న్యాయస్థానంపై తమకు నమ్మకం ఉంది కానీ లెప్టినెంట్ గవర్నర్‌పై లేదని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. నజీబ్‌జంగ్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి ఆరోపించారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు తగిన సంఖ్యాబలం లేదంటూ  బీజేపీ డిసెంబర్‌లో లెప్టినెంట్ గవర్నర్‌కు రాసిన లేఖ ఇంకా ఆయన వద్దనే ఉందని చెప్పారు. బీజేపీ ఆ లేఖను ఉపసంహరించుకోలేదని, అటువంటప్పుడు ఎల్జీ ఏ ఆధారంతో బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలనుకుంటున్నారని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఎల్జీ బీజేపీ కోసం బ్యాటింగ్ చేస్తున్నారని కేజ్రీవాల్ సుప్రీంకోర్టు ఎదుట విమర్శించారు. ఆ తరువాత విలేకరుల సమావేశంలో,  ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించేందుకు అనుమతించాలని కోరుతూ ఎల్జీ రాష్ట్రపతికి రాసిన లేఖ ప్రతిని ఆయన అందించారు. బుధవారం ఉదయం తొమ్మిదిన్నరకు తాము లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలిసి తమ స్టింగ్ ఠ5వ పేజీ తరువాయి
 ఆపరేషన్ సీడీని సమర్పించనున్నట్లు చెప్పారు. సీడీ చూసిన తరువాత ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీకి ఆహ్వానించకూడదంటూ ఎల్జీ తన లేఖలో సవరణలు చేయాలని ఆయన సూచించారు. స్టింగ్ ఆపరేషన్ సీడీని తాము రాష్ట్రపతికి కూడా పంపుతామని ఆయన చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా తాము ఉద్యమం లేవదీస్తామని, సీడీని ప్రజలకు చూపించి బీజేపీ ద్వంద్వైవె ఖరిని ప్రజల ముందుంచుతామని ఆయన చెప్పారు.
 ఎన్నికలలలో పోటీచేసి సత్తా చూపాలని బీజేపీకి సవాలు విసిరారు. కేంద్రంలో సర్కారు ఏర్పాటుచేసి, ఢిల్లీలో ఏడింటికి ఏడు స్థానాలు గెలిచిన  బీజేపీ అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేసేందకు ఎందుకు భయపడుతోందని ఆయన ప్రశ్నించారు. ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం లేదని, మళ్లీ ఎన్నికలు జరగాలని కోరుతోందని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపైనే పూర్తిగా దృష్టిని కేంద్రీకరించాలని నిర్ణయించిన ఆప్ రాజధాని నగరంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతే ప్రజలకు మరింత దూరమవుతానని ఆందోళన చెందుతోంది.    
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement