సామాన్యుడి అసమాన్య గెలుపు | Incredibly Win of a common man | Sakshi
Sakshi News home page

సామాన్యుడి అసమాన్య గెలుపు

Published Wed, Feb 11 2015 2:06 AM | Last Updated on Sat, Sep 2 2017 9:06 PM

సామాన్యుడి అసమాన్య గెలుపు

సామాన్యుడి అసమాన్య గెలుపు

దేశ రాజధాని దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ సృష్టించిన ప్రభంజనంతో కర్నూలులో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. పూర్తి స్థాయి ఫలితాలు వెలువడిన వెంటనే ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి బాణ సంచా కాల్చారు. అభిమానులు స్వీట్లు  పంచిపెట్టారు. రాజ్‌విహార్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.                                                   

కర్నూలు జిల్లా పరిషత్/ఓల్డ్‌సిటి/ రాజవిహార్/అగ్రికల్చర్ : దేశ రాజధాని ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ సృష్టించిన ప్రభంజనంతో కర్నూలులో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. పూర్తి స్థాయి ఫలితాలు వెలువడిన వెంటనే ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి బాణ సంచా పేల్చడంతో పాటు స్వీట్లు పంచిపెట్టారు. స్థానిక రాజ్‌విహార్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆ పార్టీ ప్రతినిధి పీబీవీ సుబ్బయ్య మాట్లాడుతూ తమ పార్టీపై సామాన్య ప్రజలు ఉంచిన నమ్మకానికి ప్రతీక ఈ కనీవినీ ఎరుగని విజయమని తెలిపారు.

అవినీతి నిర్మూలనలో కేవలం 49 రోజుల్లోనే దిల్లీ ప్రజలతో పాటు దేశ ప్రజల నమ్మకాన్ని పొందిందని తెలిపారు. త్వరలో జరగనున్న కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సత్తా చాటనుందని చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్‌కు అపూర్వమైన విజయాన్ని ఇచ్చిన దిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రతినిధులు రజనీకాంత్, సురేంద్రనాథరెడ్డి, మధు, ఇంతియాజ్, న్యాయవాది సోమశంకర యాదవ్, సలీమ్ అహ్మద్, అబ్దుల్ రహీమ్‌లు తదితరులు పాల్గొన్నారు.

ఇంటెలెక్చువల్స్ కలెక్టివ్ సంస్థ ఆధ్వర్యంలో...

ఇంటెలెక్చువల్స్ కలెక్టివ్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద బాణాసంచా పేల్చి విజయోత్సవం నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు ఖదీరుల్లా మాట్లాడుతూ వివిధ సంస్థల సర్వేలు, రాజకీయ విశ్లేషకులు విస్మయం చెందే విధంగా ఆప్ సాధించిన ఈ విజయం భారతదేశంలోని ప్రజాస్వామ్య లౌకికవాద విజయంగా భావించవచ్చన్నారు. భారతదేశ ప్రజలు లౌకికవాదం వైపు ఉన్నారని, అవినీతి రహిత ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాన్ని భారతీయులు బలంగా ఆకాంక్షిస్తున్నారని కేజ్రీవాల్ విజయం నిరూపించిందన్నారు. ప్యాడ్స్ సంస్థ జాతీయ కన్వీనర్ శ్రీనివాసరావు, జిల్లా కన్వీనర్ బాలన్న, అజయ్‌కుమార్, రోషన్ అలీ, వారిస్, మోజెస్, ముస్తఫా, జయన్న, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement