కేసీఆర్ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు | TPCC-to-gives-notices-for-breach-of-privilege-against-KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్ పై హక్కుల ఉల్లంఘన నోటీసు

Published Thu, Jan 5 2017 3:57 PM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM

కేసీఆర్ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు - Sakshi

కేసీఆర్ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ శాసనసభాపక్షం సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. శాసనసభను పక్కదారి పట్టిస్తున్నారని పేర్కొంటూ అసెంబ్లీ నిబంధన 168 కింద నోటీసును స్పీకర్ కు అందజేసింది. 2016 మార్చి 29 న శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్ మెంట్ పై సభను తప్పుదారి పట్టించారని ఆ నోటీసులో పేర్కొన్నారు. 2016 ఏప్రిల్ నాటికి మొత్తం ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు చెల్లిస్తామని సభకు సీఎం హామీ ఇచ్చారని ఆ నోటీసులో గుర్తు చేశారు.
 
ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు ప్రతి నెలా చెల్లింపులు చేస్తామని సభలో చెప్పారని, అయితే ఈ నెల 4 వ తేదీన ఇదే అంశంపై కేసీఆర్ సభలో మాట్లాడుతూ, వంద శాతం ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించడం సాధ్యం కాదని చెప్పారని, గతంలో చెప్పిందానికి ఇప్పుడు చెబుతున్నదానికి పొంతన లేదన్నారు. ఈ రకంగా శాసనసభను ముఖ్యమంత్రి తప్పుదారి పట్టించారని స్పీకర్ కు అందజేసిన నోటీసులో వారు పేర్కొన్నారు. ఈ నోటీసుపై టీ కాంగ్రెస్ శాసనసభా పక్షం నేత కె. జానారెడ్డి ఎమ్మెల్యేలు జి. చిన్నారెడ్డి, జీవన్ రెడ్డి, సంపత్ కుమార్, ఎన్ పద్మావతీ రెడ్డి, వంశీచంద్ రెడ్డి తదితరులు సంతకాలు చేశారు.                   
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement