కాంగ్రెస్‌పై ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే కాం గ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కొప్పుల కాంగ్రెస్ నేతల తీరును ఎండగట్టారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్నిరంగాల్లోనూ విఫలమైందన్న కాంగ్రెస్ నేతలు ఉత్తమ కుమార్, షబ్బీర్ అలీ వ్యాఖ్యలకు కొప్పుల ఘాటుగా సమాధానమిచ్చారు. ఏడాదిన్నర కాలంగా దేశంలో, ఏరాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని, ఆ ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేన న్నారు. ఇకనైనా కాంగ్రెస్ నేతలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని కొప్పుల హితవు పలికారు.
అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు
Published Sat, Jan 2 2016 7:45 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM
Advertisement
Advertisement