కేసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎస్. జైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు.
హైదరాబాద్: సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎస్. జైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ గురించి సోనియా గాంధీతో జైపాల్ రెడ్డి ఎప్పుడైనా చర్చించారా అని ప్రశ్నించారు. ఉద్యమ సమయంతో రాజీనామా చేయకుండా కాంగ్రెస్ నేతలు పారిపోయారని, ఆ విషయం జైపాల్ రెడ్డికి తెలియదా అని నిలదీశారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ చేసిన ఉపవాస దీక్ష ఒట్టి బూటకం అని జైపాల్ రెడ్డి ఆరోపించారు.
ఉద్యోగాల భర్తీపై తెలంగాణ జేఏసీ విషప్రచారం చేస్తోందని కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.