
సాక్షి, కరీంనగర్: బండి సంజయ్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బండి సంజయ్ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టే బండి సంజయ్, రేవంత్‌రెడ్డిలు వారి పార్టీలకు అధ్యక్షులు అయ్యారన్నారు. సంక్షేమ ఫలాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ మంత్రి సవాల్ విసిరారు.
అధికారం కోసం బీజేపీ పాకులాడుతుందని ఆయన దుయ్యబట్టారు. రేవంత్‌రెడ్డి ఏం మాట్లాడతారో ఆయనకు కూడా తెలియదని నిప్పులు చెరిగారు. గతంలో తెలంగాణ కోసం తాము రాజీనామా చేస్తే.. బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పదవులు ముఖ్యం అయ్యాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు.
ఇవీ చదవండి:
క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ పదవికి కోదండరెడ్డి రాజీనామా
Comments
Please login to add a commentAdd a comment