pada yatra
-
ఏం పీకావని నీ పాదయాత్రకు రావాలి: కేశినేని నాని
-
ఏలూరు: లోకేష్ యాత్రలో రెచ్చిపోయిన టీడీపీ రౌడీలు
సాక్షి, ఏలూరు: లోకేష్ పాదయాత్రలో టీడీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. తుక్కులూరులో విధ్వంసానికి యత్నించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్ల దగ్గర రెచ్చగొట్టే చర్యలకు దిగిన టీడీపీ శ్రేణులు.. వైఎస్సార్సీపీ నేత విజయ్ ఇంటిపై రాళ్లు రువ్వారు. దీంతో ఇంటి అద్దాలు ధ్వంసం కాగా, వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. టీడీపీ అరాచకాలను చిత్రీకరిస్తున్న మీడియాపై కూడా దాడులకు తెగబడ్డారు. మీడియా ప్రతినిధుల ఫోన్లను సైతం లోకేష్ యువగళం టీమ్ లాక్కొంది. అడ్డుగా వెళ్లిన రూరల్ కానిస్టేబుల్‌పై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. చదవండి: ఆర్జీవీ థర్డ్ గ్రేడ్ అంటూ లోకేశ్ వ్యాఖ్యలు.. రివర్స్ కౌంటర్ ఇచ్చిన వర్మ -
ఆ సభ సక్సెస్‌కు కారణం ఇదే.. మంచిర్యాలలో జై కొట్టించింది వారే..
మంచిర్యాలలో నిర్వహించిన జై భారత్ సత్యాగ్రహ సభ కోసం సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు కొన్ని కలిసివచ్చాయి. సభను ప్లాన్ చేయడం నుంచి సక్సెస్ ఫుల్‌గా జరిగే వరకు భట్టి విక్రమార్కకు అండగా నిలిచింది ఓ టీం. వారెవరో కాదు దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానుల బృందం. వైఎస్సార్‌ను అత్యంత అభిమానించే వారిలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఒకరు. ఎంతంటే దేవుడి ఫోటోల మధ్య లో వైఎస్సార్ ఫోటో పెట్టి పూజించేంత అభిమానం భట్టికి ఉంది. దీనికి కారణం భట్టి రాజకీయాల్లో ఎదగడానికి అన్ని రకాలుగా సపోర్ట్ చేసింది వైఎస్సారే. ఇటు వైఎస్సార్ అభిమానులకు కూడా భట్టి అంటే అంతే ఇష్టం. భట్టి పాదయాత్ర తలపెట్టినప్పుడు అన్ని తామై వెఎస్సార్ అభిమానులే చూసుకుంటున్నారు. జై భారత్ సత్యాగ్రహా సభ సక్సెస్ వెనక కూడా వైఎస్సార్ అభిమానులే బ్యాకప్ వర్క్ చేశారన్న టాక్ ఉంది. అందులో ముందు చెప్పుకోవాల్సిన పేరు ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల సభ కు అన్ని తానై ఏర్పాట్లు చేసారు ప్రేమ్ సాగర్ రావు. ఇదే జాబితాలో మరో ఇద్దరు శ్రీధర్ బాబు , జీవన్ రెడ్డి. వీరిద్దరూ మంచిర్యాలలోనే ఉండి సభ సక్సెస్ కోసం కృషి చేసారు. సీఏల్పీ నేతగా ఉన్నప్పుడు వైఎస్సార్ ప్రజా క్షేత్రంలోకి వెళ్లి తన పాదయాత్ర ద్వారా ఎంతో మంది ప్రజలను కలిశారు, వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. నేన్నునానంటూ భరోసా ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. రెండు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ను గెలిపించి ముఖ్యమంత్రి అయ్యారు డాక్టర్ వైఎస్సార్. ఇప్పుడు సీఏల్పీ నేతగా ఉన్న భట్టి కూడా వైఎస్సార్ బాటలోనే పాదయాత్ర ద్వారా ప్రజాక్షేత్రంలోకి దిగారు. వైఎస్సార్ సెంటిమెంట్ వైఎస్సార్ అభిమానిగా తనకు కలసి వస్తుందని ఆశిస్తున్నారు సీఏల్పీ నేత భట్టి. పొలిటికల్ ఎడిటర్, సాక్షి వెబ్‌డెస్క్ చదవండి: కాంగ్రెస్‌లో సరికొత్త ముసలం.. సచిన్ పైలట్‌కు కోపం ఎందుకు వచ్చింది? -
ఐరన్ లెగ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లోకేశ్
సాక్షి, అమరావతి: నారా లోకేశ్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ అపశకునాలేనని, దుర్ఘటనలేనని, ఆ పాదం మహిమ అలాంటిదని, ఆయన ‘ఐరన్‌లెగ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ అని అంతా భావిస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ చెప్పారు. అలాంటి పాదంతో లోకేశ్ చేసే పాదయాత్రలు జనావళికి ప్రమాదకరమని అన్నారు. ఆయన పాదయాత్ర బలియాత్రగా మారిందని తెలిపారు. నాగార్జున యాదవ్ గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లోకేశ్ పాదయాత్ర టీడీపీకి పాడెయాత్రగా మారిపోయిందన్నారు. లోకేశ్‌ను క్రేన్లతో లేపాలని చంద్రబాబు, ఎల్లో మీడియా ఎంత ప్రయత్నించినా విఫలమై చతికిలపడుతున్నారన్నారు. తోలుమందం లోకేశ్ సభ్యత, సంస్కారాలు మరచిపోయి సీఎం జగన్‌ని నోటికొచ్చినట్లు దూషిస్తున్నాడని, తాము కూడా చంద్రబాబును తిట్టగలమని, కాకపోతే తమ నాయకుడు వైఎస్ జగన్ సభ్యత, సంస్కారం నేర్పించారని చెప్పారు. సీఎంజగన్‌ని వారు ఒక మాటంటే.. తాము వారిని నాలుగంటామని హెచ్చరించారు. లోకేశ్ ఒళ్లు, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని అన్నారు. పాదయాత్రకు జనం రాలేదని బాబు బాధ పడుతున్నారని, లోకేశ్ బూతులు వినడానికి జనం రావాలా... అని ప్రశ్నించారు. సమర్థుడైన కొడుకుంటే ఏ తండ్రయినా పవన్ కళ్యాణ్‌పై ఎందుకు ఆధారపడతారని అన్నారు. ఉత్తరకుమారుడికి ప్రగల్భాలు ఎక్కువ, లోకేశ్‌కు ఉడత ఊపులు ఎక్కువ అని ప్రజలు నవ్వుతున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా లోకేశ్ బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. చదవండి: ‘అచ్చెన్నా.. లోకేష్ బాబు కోసం జనాలు రెడీ.. నాలుగు రోజులకు బుక్ చేశా’ -
చిత్తూరు: లోకేష్ యాత్రలో టీడీపీ నేతల ఓవరాక్షన్
సాక్షి, చిత్తూరు: నారా లోకేష్ యాత్రలో టీడీపీ నేతలు ఓవరాక్షన్ చేశారు. బంగారుపాలెంలో నడిరోడ్డుపై లోకేష్ ప్రసంగించే యత్నం చేశారు. అభ్యంతరం తెలిపిన పోలీసులను టీడీపీ కార్యకర్తలు దూషించారు. పోలీసులు సర్దిచెబుతున్నా టీడీపీ నేతలు గొడవకు దిగారు. నడిరోడ్డుపై ప్రసంగాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసులకు రెచ్చగొట్టే విధంగా టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. అనుమతి తీసుకోకుండా సభలు నిర్వహించకూడదని పోలీసులు సూచించారు. చదవండి: ఏపీఎఫ్డీసీ ఛైర్మన్‌గా పోసాని బాధ్యతలు.. ఆయన ఏమన్నారంటే? -
లోకేష్ పాదయాత్రకు ఎందుకింత హైప్.. ‘ఈనాడు’ భయం అదేనా?
తెలుగుదేశం మాజీ మంత్రి, శాసనమండలి సభ్యుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ పాదయాత్రకు విపరీతమైన హైప్ సృష్టించడానికి టీడీపీకి మద్దతు ఇచ్చే ఈనాడు మీడియా చాలా కష్టపడుతోంది. సాధారణంగా పాదయాత్ర ఆరంభం అయిన తర్వాత వచ్చే స్పందనను బట్టి మీడియా తగురీతిలో కవరేజీ ఇస్తుంటుంది. లేదా పార్టీ పరంగా ఈ సందర్భంగా జరిగే యాక్టివిటిని కవర్ చేయవచ్చు. కాని ఈనాడు మీడియా తనకు, తాను ఒక భారీ కథనం రాస్తూ లోకేష్ యువగళాన్ని నొక్కేస్తారా! అంటూ ప్రశ్నించింది. నిజానికి ఏ నాయకుడికి అయినా పాదయాత్ర చేసుకునే హక్కు ఉంటుంది. దానిని ఎవరూ కాదనజాలరు. ప్రభుత్వం కూడా అభ్యంతరం చెప్పదు. కాని అదే సమయంలో ఒక ప్రముఖుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవలసిన బాధ్యత పోలీసు యంత్రాంగంపై ఉంటుంది. ప్రతి చిన్న,పెద్ద విషయానికి ఏపీ ప్రభుత్వాన్ని ఆడిపోసుకునే పనిలో ఉన్న ఈనాడు మీడియా దీనిని కూడా వివాదాస్పదం చేయాలని యత్నిస్తోంది. దీనివల్ల లోకేష్‌కు ఒక నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఆయన పాదయాత్రకు ఆశించిన రెస్సాన్స్ రాదేమోనని భయపడి ఈనాడు ఇంతగా హైప్ ఇస్తోందేమోనన్న భావన కలగవచ్చు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి నిర్దిష్ట ప్రశ్నలు వేసి తగు వివరాలు కోరారు. వాటిలో వేటికైనా జవాబు ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఆ విషయం తెలియచేయవచ్చు. లేదా మరికొంత సమయం కోరవచ్చు. ఇప్పటికే ఆ పార్టీ నేత వర్ల రామయ్య ఒక ప్రకటన చేస్తూ గతంలో పాదయాత్రలకు పోలీసులు ఇన్ని వివరాలు కోరారా అని అడిగారు. దానికి పోలీసు ఉన్నతాధికారులు సమాధానం చెబుతారు ఇక్కడ విశేషం ఏమిటంటే కుప్పం నుంచి ఆరంభం అయ్యే పాదయాత్రకు పోలీసులు వివరాలు అడగడం, వాటిని స్థానిక నేతలు అందించడం జరిగింది. 22 వాహనాల శ్రేణి లోకేష్‌తో పాటు ఉంటుందని తెలిపారు. అంతేకాక ఆ వాహనాలను నడిపే డ్రైవర్ల జాబితా కూడా అందచేశారట. ఈ విషయం కూడా ఈనాడులోనే వచ్చింది. మరి అలాంటప్పుడు యువగళాన్ని అణచివేస్తున్నది ఎక్కడ? టీడీపీ నేతలు ఎవరూ ఈ స్థాయిలో ఆందోళన చెందలేదు. కాని ఈనాడు మాత్రం టీడీపీ నేతలు అనుకుంటున్నారనుకుంటూ తన సొంత పైత్యం అంతటిని జోడించి ఓ పెద్ద స్టోరీని వండి వార్చింది. ఎవరైనా నాయకుడికి ప్రచారం చేయదలిస్తే ఇది ఒక టెక్నీక్. ఆ నాయకుడికి విపరీతమైన స్పందన వచ్చేస్తోందని, దానిని అడ్డుకునేందుకు పోలీసులు కుట్ర పన్నుతున్నారని ప్రచారం చేయడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించే యత్నం చేస్తుంటారు. ఈనాడు కూడా అలాగే తంటాలు పడినట్లు అనిపిస్తుంది. గతంలో విపక్షనేతగా ఉన్నప్పుడు జగన్ పాదయాత్ర అప్పుడు అనుమతులు అవసరం లేదని ఆ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి అన్నారని కోట్ చేశారు. ఆయన ఏమన్నారో కాని, అప్పట్లో మరో నేత బొత్స సత్యారాయణ ఆద్వర్యంలో ఒకటికి ,రెండుసార్లు డిజిపి ఆఫీస్ కు వెళ్లి అనుమతులు కోరిన విషయాన్ని మాత్రం ఈనాడు విస్మరిస్తూ ప్రజలకు అర్ధ సత్యాలనే చేరవేస్తోంది. కొద్ది కాలం క్రితమే కందుకూరులో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సభలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది, గుంటూరులో చంద్రన్న కానుకల పంపిణీ సందర్భంలో మరో ముగ్గురు మరణించిన సంగతి తెలిసిందే. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం జిఓ 1 తెస్తే ప్రభుత్వం ప్రతిపక్షాల ర్యాలీలను అడ్డుకోవడానికే ఈ ఉత్తర్వు అని ఈనాడు ప్రచారం చేసింది. అంతే తప్ప పదకుండు మంది చనిపోవడంపై ఏ మాత్రం బాధపడినట్లు కనిపించలేదు. ఇప్పుడు లోకేష్ పాదయాత్రలో ఇలాంటివి ఏవైనా జరిగితే ఎవరు బాధ్యత వహించాలి?. పోలీసులు ఎక్కువ మందిని భద్రత కోసం నియమిస్తే, ప్రజలను రానివ్వకుండా అడ్డుకోవడానికే ఇలా చేశారని విమర్శిస్తున్నారు. కాస్త తక్కువ మందిని పెడితే భద్రతను విస్మరించారని రాస్తున్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు మాదిరే డబుల్ టాక్ చేస్తున్న టీడీపీ మీడియాను ఎదుర్కోవడమే పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. ఇప్పటికే లోకేష్ పాదయాత్రకు వైసీపీ భయపడిపోతోందని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. వారికంటే ఎక్కువగా ఈనాడు, తదితర టీడీపీ మీడియా సంస్థలు భుజాన వేసుకుని అదే పనిలో ఉన్నాయి. నిజానికి ఎవరి పాదయాత్రకు అయినా భయపడవలసిన పని లేదు. ఇంతవరకు లోకేష్ తన ఎజెండా ఏమిటో చెప్పలేదు. కాని ఈనాడు మాత్రం వైసీపీ అరాచక పాలనకు వ్యతిరేకంగా పాదయాత్ర చేస్తున్నట్లు రాస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్‌ల గురించి వ్యతిరేకించే పరిస్థితి లేకపోవడంతో కొత్త ఆలోచనలు చేస్తున్నారు. అరాచకపాలన అని, శాంతి భద్రతలు లోపించాయని, ఉన్నవి, లేనివి కలిపి అబద్దాలను సృష్టించే యత్నంలో ఉన్నారు. లోకేష్ ఇలాంటి మీడియాను నమ్మి యాత్రలు చేస్తే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లే అన్న సంగతి తర్వాతకాలంలో కాని తెలియదు. ప్రస్తుతం ఆయన ప్రచారార్భాటం కోరుకుంటారు కనుక అంతా పచ్చగానే కనిపిస్తుంది. లోకేష్ కుప్పం నుంచి పాదయాత్ర ఆరంభించడం ద్వారా అక్కడ కూడా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం అయి ఉండవచ్చు. తన తండ్రి చంద్రబాబు నాయుడు ఏడుసార్లుగా ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో గత స్థానిక ఎన్నికలలో టీడీపీకి పెద్ద షాక్ తగిలింది. దానిని కూడా దృష్టిలో పెట్టుకుని ఉండవచ్చు. చంద్రబాబు నాయుడు ఓకే అంటే భవిష్యత్తులో ఆయన కూడా ఇక్కడ నుంచి పోటీచేస్తారేమో తెలియదు. ఏది ఏమైనా లోకేష్ పాదయాత్రలో ప్రతి విషయాన్ని వివాదాస్పదం చేయడానికి టీడీపీ మీడియా విశ్వయత్నం చేస్తుంది. తద్వారా ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్నదే వారి లక్ష్యం అని వేరే చెప్పనవసరం లేదు. కనుక తస్మాత్ జాగ్రత్త! -హితైషి -
‘బోగస్ ప్రాజెక్టుకు కేంద్రం అవార్డులా?’
జోగిపేట (ఆంధోల్): మిషన్ భగీరథ బోగస్ ప్రాజెక్టు అని, ఈ పథకానికి కేంద్రం అవార్డు ఇవ్వడం సిగ్గుచేటని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా జోగిపేటలో నిర్వహించిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు. ఈ ప్రాజెక్టును రూ.40 వేల కోట్లతో చేపట్టగా పెద్దమొత్తంలో కమీషన్లు తిన్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్‌కు ఎందుకు అవార్డులిస్తోందని ఆమె ప్రశ్నించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన రూ.100 కోట్ల సంక్షేమ నిధి ఏమైందని షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నా.. దళిత ఎమ్మెల్యేగా ఉన్న క్రాంతికిరణ్ ఏనాడూ ప్రశ్నించలేదని షర్మిల విమర్శించారు. నేరెళ్ల, మరియమ్మ ఘటనలపై ఈ ఎమ్మెల్యే నోరు మెదపలేదని మండిపడ్డారు. ఆయన చంటి క్రాంతికిరణ్ కాదని, కంత్రీ కిరణ్ అని షరి్మల ఎద్దేవాచేశారు. చదవండి: సాగరహారంపై ‘పిట్ట పోరు’.. కేటీఆర్–రేవంత్‌ల మాటల యుద్ధం -
రాహుల్ గాంధీకి భారీ షాక్.. ‘భారత్ జోడో యాత్ర’పై పిటిషన్!
తిరువనంతపురం: కాంగ్రెస్ పార్టీని తిరిగి గాడినపెట్టేందుకు ‘భారత్ జోడో యాత్ర’ పేరిట పాదయాత్ర చేపట్టారు రాహుల్ గాంధీ. కొద్ది రోజులుగా కేరళలో యాత్రకు మంచి స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీకి షాక్ తగిలింది. భారత్ జోడో యాత్ర వల్ల రాష్ట్రంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని, నియంత్రించాలంటూ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కేరళలో ఈనెల 11వ తేదీన మొదలైన యాత్ర 18 రోజుల పాటు సాగనుంది. భారత్ జోడో యాత్రను రోడ్డుకు ఒకేవైపు ఉండేలా రెగ్యూలేట్ చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు పిటిషనర్, న్యాయవాది కే విజయన్. యాత్రను రోడ్డుకు ఒకవైపు అనుమతించి, రెండోవైపు ట్రాఫిక్ వెళ్లేలా చూడాలన్నారు. భారత్ జోడో యాత్ర కారణంగా ఇటీవల జాతీయ రహదారిని నాలుగు గంటల పాటు మూసివేశారని, దాంతో సామాన్య ప్రాయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే.. ఈ యాత్ర కోసం భారీగా పోలీసులను మోహరించారని, ఆ ఖర్చు మొత్తం కాంగ్రెస్ పార్టీ బరించాలని, ప్రజల సొమ్మును వినియోగించకుండా చూడాలని కోరారు. కేరళ ప్రజా రహదారుల చట్టం 2011ను ఈ యాత్ర ఉల్లంఘిస్తోందని సూచించారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిపే అవకాశాలు ఉన్నాయి. ఇదీ చదవండి: దేశ ప్రజల్లో బీజేపీ విద్వేషాన్ని వ్యాపింపజేస్తోంది: రాహుల్ -
మునుగోడు పాదయాత్రకు రేవంత్‌రెడ్డి దూరం
సాక్షి, హైదరాబాద్: మునుగోడులో పాదయాత్రకు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి దూరంగా ఉన్నారు. కరోనా లక్షణాలతో ఆయన సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లారు. కరోనా పరీక్షకు శాంపిల్స్‌ను పంపించారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నారాయణపురం నుంచి చౌటప్పల్ వరకు కాంగ్రెస్ పాదయాత్ర చేపట్టింది. ఇది ఇలా ఉండగా, చండూరు సభలో అద్దంకి దయాకర్.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై చేసిన పరుష వ్యాఖ్యలు నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే తనకు గౌరవం ఉందన్నారు. తెలంగాణ సాధనలో ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పారు. క్రమశిక్షణను ఉల్లంఘించిన దయాకర్‌పై చర్యలు ఉంటాయన్నారు. కాగా, మునుగోడు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడులో ఉప ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి. దీంతో అన్ని పార్టీలు ఉప ఎన్నికల కసరత్తును ప్రారంభించాయి. చదవండి: రేవంత్ బహిరంగ క్షమాపణపై కోమటిరెడ్డి రియాక్షన్ ఏంటంటే.. -
నవంబర్‌లో ‘ప్రజాసంగ్రామ యాత్ర’
సాక్షి, హైదరాబాద్: రెండో దశ ‘ప్రజాసంగ్రామ యాత్ర’కు రాష్ట్ర బీజేపీ సన్నద్ధమవుతోంది. వచ్చే నెల 10 తర్వాత నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పాదయాత్రకు సంబంధించి జాతీయ నాయకత్వం నుంచి ఆమోదం లభించినట్లు సమాచారం. ఏర్పాట్లకు సంబంధించి వివిధ కమిటీల పునర్ వ్యవస్థీకరణ, మొత్తం యాత్రలో ఉండగలిగే నేతలు, ప్రజల దృష్టిని ఆకర్షించేలా వినూత్న కార్యక్రమాల రూపకల్పనపై పార్టీపరంగా కసరత్తు ఊపందుకుంది. నవంబర్‌లో జరిగే పార్లమెంటు సమావేశాలను దృష్టిలో ఉంచుకుని పాదయాత్ర షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ఆగస్టు 28 నుంచి అక్టోబర్ 2 వరకు తొలిదశ పాదయాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 17న ‘హైదరాబాద్ విమోచన దినోత్సవం’ సందర్భంగా నిర్మల్ సభా వేదికగా తెలంగాణలో మొత్తం ఐదు విడతల్లో ప్రజాసంగ్రామ యా త్ర చేపట్టనున్నట్లు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల వరకు సన్నద్ధంగా.. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమ యం ఉన్నందున అప్పటిదాకా పాదయాత్ర, ఇతర కార్యక్రమాల రూపంలో పార్టీ అధ్యక్షుడు మొదలు కుని వివిధ స్థాయిల నేతలు, కార్యకర్తలు, అను బంధ విభాగాలు భాగస్వాములయ్యేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. తొలిదశ పాదయాత్రలో కీలకంగా వ్యవహరించిన ముఖ్యనేతలు ఇటీవల ఢిల్లీ వెళ్లి జాతీయ నాయకత్వానికి ఆయా అంశాలను వివరించి, రెండోదశ యాత్రకు సూత్రప్రాయ అంగీకారం తీసుకున్నారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలోని పాదయాత్ర పర్యవేక్షకులు పలు సూచనలు చేసినట్లు సమాచారం. తొలిదశ లోటుపాట్లను అధిగమిస్తూ.. తొలిదశ పాదయాత్రలోని లోటుపాట్లు అధిగమించేలా కార్యాచరణ రూపొందించుకోవాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. మొదటిదశ పాదయాత్ర జరిగిన తీరుపై జాతీయపార్టీ తరఫున పర్యవేక్షించిన ఆరుగురు సభ్యుల సాంకేతిక బృందం పార్టీ నాయకత్వానికి నివేదిక సమర్పించింది. తొలివిడత యాత్రకు స్పందన బాగానే ఉన్నా రెండోదశ మరింత విస్తృతంగా చేపట్టేలా పలు సూచనలు చేసింది. గ్రామీణ ప్రాంత ప్రజలను కలుసుకుని, సమస్యలు తెలుసుకుని, బీజేపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందనే దానిపై స్పష్టతనిస్తూ సాగాలని సూచించింది. యాత్ర సాగుతున్న రూట్లోని నియోజకవర్గాల్లోని పార్టీ కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని, ఈ సందర్భంగా ఇతర పార్టీల ముఖ్యమైన నేతలను చేర్చుకునేందుకు ప్రాధాన్యమివ్వా లని సూచనలు చేసినట్లు సమాచారం. -
పార్టీ శ్రేణులకు ఓ ప్రేరణ ‘ప్రజా సంగ్రామయాత్ర’
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండిసంజయ్ 36 రోజుల పాటు నిర్వహించిన తొలివిడత ‘ప్రజాసంగ్రామయాత్ర’పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఓ ప్రేరణగా నిలుస్తుందని పాదయాత్ర ప్రముఖ్, ఇన్చార్జి డా.గంగిడి మనోహర్‌రెడ్డి చెప్పారు. తొలివిడత అనుభవం, ప్రజల నుంచి వచ్చిన స్పందన చూశాక రెండో, మూడో విడత యాత్రను కూడా సునాయాసంగా పూర్తిచేయగలమనే నమ్మకం కలిగిందన్నారు. భవిష్యత్‌లో బీజేపీ వివిధ రాష్ట్రాల్లో చేపట్టే పాదయాత్రలకు ఇదొక ‘రోల్ మోడల్’గా నిలిచిపోతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తొలివిడత పాదయాత్ర ముగిసిన సందర్భంగా ఇందులో పూర్తిస్థాయిలో నిమగ్నమై, ఏర్పాట్లు మొదలుకుని, యాత్ర నిర్వహణలో మమేకమైన మనోహర్‌రెడ్డి ‘సాక్షి’తో పంచుకున్న అనుభవాలు ఆయన మాటల్లోనే.. ఊహించిన దాని కంటే బాగా... ‘‘ఈ పాదయాత్ర ఊహించిన దానికంటే కూడా బాగా జరిగింది. ఇంత పెద్దసంఖ్యలో కార్యకర్తలు పాల్గొంటారని అనుకోలేదు. హైదరాబాద్ వరకే స్పందన ఉంటుంది ఆ తర్వాత ఉండదనుకున్నాం. కానీ, వివిధ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లోనూ మంచి స్పందన వ్యక్తమైంది. మరో రెండున్నరేళ్ల తర్వాతే అసెంబ్లీ ఎన్నికలుండగా ఇప్పుడు పాదయాత్ర చేపట్టడం సరైనదికాదేమోనని చాలామంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఐతే పాదయాత్రకు కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజల నుంచి వచ్చిన స్పందన చూశాక ఇప్పుడు చేయడమే మంచిదైందని భావిస్తున్నాం. ప్రభుత్వ అప్రజాస్వామిక, నియంతృత్వ విధానాలను గట్టిగా వ్యతిరేకించే సరైన పార్టీ, నాయకుడు వచ్చారనే భావన ప్రజల్లో కలిగింది. ప్రతికూల పరిస్థితుల్లో కొనసాగించాం భారీవర్షాలు, ఆ వెంటే ఎండలు ఇలా ప్రతికూల పరిస్థితుల్లో ఈ యాత్రను ప్రారంభించాం. పార్టీ జాతీయ నాయకత్వం, ముఖ్యనేతలు ఏ పాదయాత్రలోనూ ఈ స్థాయిలో భాగస్వాములు కాలేదు. పాదయాత్రలో పాల్గొనేందుకే తాను నిర్మల్‌కు వచ్చానంటూ కేంద్రహోంమంత్రి అమిత్‌షా ప్రకటించడం కేడర్‌లో, నాయకుల్లో కొత్త ఉత్సాహాన్ని కలిగించింది. సమస్యల తీవ్రత తెలిసొచ్చింది ప్రజాసంగ్రామయాత్ర ద్వారా టీఆర్ఎస్పై, స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులపై ఉన్న ప్రజా వ్యతిరేకత, ఆగ్రహం బయటపడింది. రాష్ట్రంలో నిరుద్యోగసమస్య తీవ్రత తెలిసొచ్చింది. ఉన్నత చదువులు చదివినా, తగిన విద్యార్హతలు ఉన్నా ఉద్యోగాలు రాకపోవడం, గత ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి ఇప్పటికీ నెరవేరకపోవడంపై యువతలో తీవ్రస్థాయిలో కోపోద్రేకాలు వ్యక్తమవుతున్నాయి. రైతన్న తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురైన తీరును పాదయాత్రలో దగ్గర నుంచి చూడగలిగాం. రుణమాఫీ కాకపోవడం, పేదలకు డబుల్ బెడ్రూంలు అందకపోవడం, కరోనా సమయంలో అన్నీ అమ్ముకుని చికిత్స చేయించుకోవాల్సి వచ్చిందనే ఆవేదన వివిధ వర్గాల్లో వెల్లడైంది. టీఆర్ఎస్ విమర్శలే యాత్ర విజయానికి కొలమానం బీజేపీ ఎక్కడుందని గతంలో ప్రశ్నించిన టీఆర్ఎస్ ముఖ్యనేతలు పాదయాత్ర సాగిన 36 రోజులూ మాపై విమర్శలు సంధించారు. దీనిని బట్టి మా యాత్ర ఆశించిన స్థాయి కంటే ఎక్కువగానే విజయవంతమైందని భావిస్తున్నాం. -
నేటి నుంచే ‘జంగ్ సైరన్’
సాక్షి, హైదరాబాద్: ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ మరో ఉద్యమానికి సిద్ధమైంది. రాష్ట్రంలోని విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై పోరాటానికి నేడు శ్రీకారం చుడుతోంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లోని రాజీవ్ చౌరస్తా నుంచి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం 65 రోజులపాటు సాగనుంది. ‘విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్’పేరుతో డిసెంబర్ 9 వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు. రాష్ట్రంలోని బడుగు, బలహీన, దళిత, గిరిజన, మైనార్టీ, ఆదివాసీ విద్యార్థులందరికీ కార్పొరేట్‌స్థాయిలో విద్యను అందించాలని, రూ.4 వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలని, ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3,016 నిరుద్యోగ భృతి చెల్లించాలని, వెంటనే ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు జారీ చేయాలనే ప్రధాన డిమాండ్లతో ఈ ఉద్యమాన్ని చేపడుతున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కార్యక్రమంలో భాగంగా మండల, ఉమ్మడి జిల్లాల స్థాయిలో యూత్‌కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టనున్నాయి. అదేవిధంగా పాలమూరు, మహాత్మాగాంధీ, కాకతీయ, శాతవాహన తదితర విశ్వవిద్యాలయాల విద్యార్థులతో కలిసి సదస్సులు నిర్వహిస్తారు. వీటికి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితోపాటు ఇతర నేతలు హాజరవుతారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదినమైన డిసెంబర్ 9న పరేడ్‌గ్రౌండ్‌లో ముగింపు కార్యక్రమాన్ని లక్షలాది మంది నిరుద్యోగులతో భారీ ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ వచ్చేలా ప్రణాళిక రూపొందించారు. ప్రభుత్వ మెడలు వంచాలి: రేవంత్ రెడ్డి ‘జంగ్ సైరన్’గురించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన జరిగిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ స్ఫూర్తిని టీఆర్ఎస్ మంటగలిపిందన్నారు. ఏడున్నరేళ్లుగా ఉద్యోగాలు భర్తీ చేయకుండా తెలంగాణ యువతతో చెలగాటమాడుతున్న ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలని వ్యాఖ్యానించారు. పేద విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన చేపడుతున్న ఈ ఆందోళనకు అందరూ మద్దతుగా నిలిచి ప్రభుత్వం మెడలు వంచాలని పిలుపునిచ్చారు. పోస్టర్ ఆవిష్కరణ జంగ్ సైరన్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం గాంధీభవన్‌లో యూత్‌కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నేతలు ఆవిష్కరించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల్లేవని యూత్‌కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల కల్పన లేక విద్యార్థులు, నిరుద్యోగులు ఆత్మహత్యల పాలవుతున్నారన్నారు. -
కేసీఆర్‌ను గద్దె దించేదాకా భాష మార్చుకోను: బండి
సాక్షి, సిద్దిపేట: ‘సీఎం కేసీఆర్ ఢిల్లీకి పోయి చేసేదేమీ లేదు. ప్రధాని మోదీ వద్ద వంగివంగి దండాలు పెడుతడు. బయటకొచ్చి ఫోజులు కొడుతుండు. కేసీఆర్‌ను గద్దె దించే దాక నా భాష మార్చుకోను’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర 32వ రోజు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లెపల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా రైతులను పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బెజ్జంకి సభలో సంజయ్ మాట్లాడుతూ ధాన్యం కొనబోమని కేంద్రం, మోదీ ఏమైనా ఫోన్ చేసి చెప్పారా.. అని ప్రశ్నించారు. పండించిన ప్రతి గింజనూ కొంటామన్న కేసీఆర్ ఇప్పుడు నేపాన్ని కేంద్రంపై నెడుతున్నారని మండిపడ్డారు. రైతులు ఎవరూ భయపడొద్దని, ప్రతి గింజనూ కేసీఆర్ చేత కొనిపిస్తామని భరోసా ఇచ్చారు. ‘ప్రభుత్వానికి బండి సంజయ్ అంబాసిడర్ అని కేటీఆర్ అంటున్నడు, అయితే, ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు బ్రాండ్ అంబాసిడర్‌ను నేనే’అని అన్నారు. బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ రాజ్‌కుమార్ చౌహాన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇక్కడ బీజేపీ, కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, ఢిల్లీకి వెళ్లి వంగి వంగి కేసీఆర్ దండాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, నేతలు తుల ఉమ, దూది శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. కాగా, హుజూ రాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. బండి సంజయ్ ప్రజా సంగ్రామయాత్రను హుస్నాబాద్‌లో ముగించాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయించింది. అక్టోబర్ 2న హుస్నాబాద్‌లో భారీ బహిరంగసభ నిర్వహిస్తారు. దీనికి కేంద్రమంత్రి స్మృతీఇరాని, ఇతర ముఖ్యనేతలు హాజరుకానున్నారు. -
ముందుగానే అభ్యర్థుల ప్రకటన!
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం కావడం, ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కోవడంలో భాగంగా ముందుగానే కొన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించాలని బీజేపీ నాయకత్వం భావిస్తోందా? పార్టీ నాయకులు, కేడర్‌లో ఎన్నికల జోష్‌ను నింపేందుకు దశల వారీగా అభ్యర్థులను ఖరారు చేయాలని నిర్ణయించిందా? అంటే అవుననే సమాధానమే ముఖ్యనేతల నుంచి వస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తొలిదశ ‘ప్రజా సంగ్రామయాత్ర’ముగింపు సందర్భంగా దాదాపు పదిసీట్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నట్టు సమాచారం. చార్మినార్ నుంచి ప్రారంభమైన ఈ తొలిదశ పాదయాత్ర వివిధ జిల్లాల్లోని 22 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాలను కవర్ చేస్తూ అక్టోబర్ 2న హుజూరాబాద్‌లో ముగియనుంది. కొన్ని స్థానాలపై కసరత్తు పూర్తి! ఇప్పటివరకు సంజయ్ యాత్ర సాగిన ప్రాంతాల్లోని వివాద రహిత స్థానాలు, ముఖ్యనేతల నియోజకవర్గాలతో కూడిన పది సీట్ల ముందస్తు జాబితాను జాతీయ నాయకత్వం అనుమతితో ప్రకటించే అవకాశాలున్నట్టు పార్టీ ముఖ్యనేతల సమాచారం. ఆయా నియోజకవర్గాల్లో నేతలకున్న పట్టు, పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ, సామాజిక వర్గాల వారీగా ఉన్న ఓట్లు, తదితర అంశాల ప్రాతిపదికన సీట్లు, అభ్యర్థుల పేర్లపై కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగానే సమయమున్నా ఇప్పటినుంచే స్పష్టతనిస్తే పోటీచేసే అభ్యర్థులతో పాటు, కార్యకర్తలు పూర్తిస్థాయిలో అంకిత భావంతో పనిచేసేందుకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొదటి దశ పాదయాత్రలో పార్టీ నాయకులు, కార్యకర్తలు చురుకుగా పాల్గొనడంతో పాటు, ఈ యాత్ర విజయవంతానికి జరిపిన కృషి ప్రాతిపదికన ఈ ఎంపిక జరిగినట్టుగా చెబుతున్నారు. వచ్చే ఎన్నికల వరకు మరో నాలుగు విడతల్లో పాదయాత్ర కొనసాగనున్నందున, ఇకముందు యాత్ర సాగే రూట్లలో పార్టీ యంత్రాంగం పూర్తిస్థాయిలో సమాయత్తం అయ్యేందుకు ముందస్తు అభ్యర్థుల ప్రకటన దోహదపడుతుందని భావిస్తున్నారు. 2న రోడ్ షోకు స్మృతీ ఇరానీ వచ్చేనెల 2న హుజూరాబాద్‌లో పాదయాత్ర ముగింపు సందర్భంగా రోడ్ షో నిర్వహించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. తొలుత ఇక్కడ బహిరంగ సభ నిర్వహించి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ముఖ్యఅతిథిగా ఆహ్వానించాలని భావించారు. అయితే సెప్టెంబర్ 17న నిర్మల్‌లో అమిత్‌షా సభ నిర్వహించినందున, 15 రోజుల వ్యవధిలోనే మరో బహిరంగ సభ కంటే ఉప ఎన్నికల ప్రచారానికి ఉపయోగపడేలా రోడ్ షో నిర్వహణకు మొగ్గుచూపారు. మరో ముఖ్యమైన సందర్భంలో నడ్డా రాష్ట్ర పర్యటనకు రానున్నందున, పాదయాత్ర ముగింపు సభా కార్యక్రమంలో మార్పు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో 2న కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ నియోజకవర్గాలకు ముందే.. చార్మినార్ శ్రీభాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయం నుంచి బండి సంజయ్ పాదయాత్రను ప్రారంభించినందున.. ముందుగా అభ్యర్థులను ప్రకటించే నియోజకవర్గాల జాబితాలో ఈ కింది స్థానాలు ఉండొచ్చునని భావిస్తున్నారు. చార్మినార్, నాంపల్లి, కార్వాన్ (అమర్‌సింగ్), గోషామహల్ (రాజాసింగ్ సిట్టింగ్ స్థానం), వికారాబాద్ (మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్), ఆందోల్ (మాజీమంత్రి బాబూమోహన్), నరసాపూర్, దుబ్బాక (సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్‌రావు), ఎల్లారెడ్డి (మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి), హుజూరాబాద్ (మాజీ మంత్రి ఈటల రాజేందర్). -
రైతు సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వం
చేవెళ్ల: రాష్ట్రంలో రైతు సమస్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని, రైతులకు ఏదో చేశామని ప్రచారం చేసుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. చేవెళ్ల మండలంలో గురువారం 6వ రోజు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగింది. చేవెళ్లలో రాత్రి బస చేసిన ఆయన ఉదయం 11.30 గంటలకు యాత్రను ప్రారంభించారు. చేవెళ్ల మీదుగా దామరగిద్ద, మీర్జాగూడ, బస్తేపూర్, ఖానాపూర్ ఆలూరు మీదుగా రాత్రికి వికారాబాద్ జిల్లా చిట్టెంపల్లికి చేరుకున్నారు. బండి సంజయ్ గురువారం ఎలాంటి సభలు లేకుండా యాత్ర మాత్రమే సాగించారు. ఈ సందర్భంగా దారి వెంట రైతుల సమస్యలు విన్న ఆయన మాట్లాడుతూ, రైతులకు ఎంతో చేశామని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం నిజానికి ఏమీ చేయలేదన్నారు. రుణమాఫీ అతీగతీ లేదని, సబ్సిడీపై యూరియా అందిస్తామని మాట తప్పిందన్నారు. ఈ యాత్రలో భాగంగా పొలాల్లో పనిచేసుకుంటున్న వివిధ గ్రామాల రైతుల వద్దకు వెళ్లిన సంజయ్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మండలంలోని దామరగిద్ద సమీపంలోని టమాటా రైతుల వద్దకు వెళ్లి ధరల విషయం ప్రశ్నించారు. అధిక వర్షాలతో చేతికి వచ్చిన పంటలు నష్టపోతున్నామని, అరకొర పంటలు వచ్చినా వాటికి మార్కెట్లో ఆశించిన ధరలు లేక నష్టాలు వస్తున్నాయని రైతులు సంజయ్‌తో ఆవేదన వ్యక్తం చేశారు. మీర్జాగూడ సమీపంలోని ఒక పొలంలో బండి సంజయ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావులు నాగలి పట్టి పొలం దున్నారు. రుణమాఫీ రాలేదని, సబ్సిడీపై రైతులకు వచ్చే పనిముట్లు ఇవ్వటం లేదని పలువురు రైతులు వివరించారు. మండలంలోని దామరగిద్ద, మిర్జాగూడ, బస్తేపూర్, ఖానాపూర్‌లలో పలువురు యువకులు బీజేపీలో చేరగా, వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబో యేది బీజేపీ ప్రభుత్వమేనని, అది చూసే టీఆర్ఎస్ నాయకులకు భయం పట్టుకుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. బండి సంజయ్ యాత్రకు వస్తున్న అపూర్వ స్పందన చూసి టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులకు మతిపోతోందని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లాలో సంజయ్‌కి ఘన స్వాగతం పూడూరు: బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర గురువారం రాత్రి వికారాబాద్ జిల్లాలో ప్రవేశించింది. పూడూరు మండలంలోని అంగడిచిట్టంపల్లి గేటు వద్దకు చేరుకోగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సదానంద్‌రెడ్డి, ఇతర నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంగడిచిట్టంపల్లి గ్రామ నాయకులు ఏర్పాటు చేసిన జెండాను బండి సంజయ్ ఆవిష్కరించారు. ధరణి కాటన్ మిల్లులో బండి రాత్రికి బస చేయనున్నారు. -
పకడ్బందీ వ్యూహంతో.. కమలం ‘మిషన్ తెలంగాణ’
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అధినాయకత్వం రాష్ట్రంపై స్పెషల్ ఫోకస్ పెట్టి ‘మిషన్ తెలంగాణ’తో ముందుకు సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో అధికార సాధనే ధ్యేయంగా పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేస్తోంది. అధికార టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కనుసన్నల్లో వ్యూహరచన చేస్తోంది. టీఆర్ఎస్ను ఎదుర్కొనే స్థాయి, బలం ఇతర విపక్ష పార్టీలకు లేకపోవడంతో ఆ ఖాళీని సమర్థవంతంగా పూరించి ఏౖక ప్రత్యామ్నాయం బీజేపీనే అన్న భావన ప్రజల్లో ఏర్పడేలా దూకుడుగా కార్యాచరణ చేపడుతోంది. ప్రభుత్వ హామీల అమల్లో వైఫల్యాలతో పాటు బడుగు, బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను హైలైట్ చేసి వారు బీజేపీ వైపు మొగ్గేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సర్కార్‌పై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత, అసంతృప్తిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకునేలా దీనిని అమలు చేస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను గెలిపించుకోవడం ద్వారా టీఆర్ఎస్ పతనానికి శ్రీకారం చుట్టాలని అధినాయకత్వం దిశానిర్దేశం చేసింది. పాదయాత్రతో కీలక మలుపునకు... పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపడుతున్న ‘ప్రజా సంగ్రామ యాత్ర’ను ముఖ్యమైన సాధనంగా వాడుకోవాలని పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయించింది. ఈ పాదయాత్ర ద్వారా పార్టీ బలోపేతంతోపాటు, ప్రభుత్వం ఏయే రంగాల్లో విఫలమైందో అంశాల వారీగా ఎండగట్టి ప్రజా మద్దతును కూడగట్టాలని భావిస్తోంది. ఇందుకోసం అమిత్ షా పర్యవేక్షణలో పనిచేసే ఆరుగురు సభ్యుల బృందం రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి ఇప్పటికే పనిచేయడం మొదలుపెట్టింది. ఈ బృందం ‘ప్రజా సంగ్రామ యాత్ర’వెంటే సాగుతూ ఎప్పటికప్పుడు అమిత్ షా, నడ్డాలకు నివేదికలు పంపుతోంది. అన్ని స్థాయిల్లోని నాయకులు ఈ యాత్రలో ఎంతమేరకు భాగస్వాములవుతున్నారు.. కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నెలకొనేందుకు ఏం చేయాలి తదితర అంశాలను విశ్లేషిస్తోంది. రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయిలో మీడియాను ఆకర్షించేందుకు కార్యక్రమాలు చేపట్టేలా, సామాజిక మాధ్యమాల్లో ప్రాధాన్యం సంతరించుకున్న అంశాలపై చర్చలు నిర్వహించేలా వ్యూహరచన చేస్తోంది. 6 రోజుల యాత్రపై సంతృప్తి గతంలో వివిధ అంశాలపై యాత్రలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించినా పార్టీ అధ్యక్షుడు పాల్గొంటున్న పాదయాత్ర ఇదే మొదటిది కావడంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. ఆరు రోజులుగా సాగుతున్న సంజయ్ యాత్రకు కేడర్, ప్రజల నుంచి మంచి స్పందన వచ్చినట్లు జాతీయ నాయకత్వం అంచనా వేస్తోంది. ఈ యాత్రలో పాల్గొంటామంటూ ఇప్పటికే లక్ష మందికి పైగా కార్యకర్తలు నమోదు చేసుకున్నారని రాష్ట్ర పార్టీ ముఖ్యనేత ‘సాక్షి’కి తెలిపారు. చార్మినార్ వద్ద పాదయాత్ర ప్రారంభ సభ అంచనాలకు మించి విజయవంతం కావడంతోపాటు కార్యకర్తల్లో కొత్త జోష్ నింపిందనే అభిప్రాయాన్ని అధినాయకత్వం వ్యక్తం చేసింది. రెట్టించిన ఉత్సాహంతో మిగిలిన యాత్రను కూడా పూర్తిచేయాలని చెప్పింది. యాత్ర టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా సాగుతోందని, టీఆర్ఎస్–ఎంఐఎం దోస్తీని ఎండగట్టడం, సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచనను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడాన్ని ఎత్తిచూపడం, నిజాం ఆస్తులు స్వాధీనం చేసుకుంటామంటూ చేసిన ప్రసంగాల ద్వారా హిందూ ఓటు బ్యాంక్‌ను తమ వైపు తిప్పుకోవాలనే వ్యూహం విజయవంతం అవుతుందనే ధీమాను ముఖ్యనేతలు వ్యక్తంచేశారు. రాష్ట్రానికి ముఖ్యనేతలు సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్‌లో పార్టీ నిర్వహించే బహిరంగసభలో అమిత్ షా, అక్టోబర్ 2న పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొననున్నారు. వికారాబాద్‌లో నిర్వహించే సభలో మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఆ తర్వాత జరగనున్న కార్యక్రమాల్లో ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం రమణ్‌సింగ్, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య, ఇతర ముఖ్యనేతలు పాల్గొంటారు. యాత్ర సందర్భంగా జిల్లాల్లో జరిగే కార్యక్రమాల్లో బీజేపీపాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు కూడా పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. -
నిజాం ఆస్తులు ప్రజలకే..
సాక్షి, హైదరాబాద్/లంగర్‌హౌస్: ‘బీజేపీ అధికారంలోకి వస్తే నిజాం ఆస్తులు, భూములను స్వా ధీనం చేసుకుంటాం’అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. పరాధీనంలో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకుని వాటిని తిరిగి ప్రజలకు అప్పగిస్తామని స్పష్టం చేశారు. ‘ప్రజా సంగ్రామ యాత్ర మూడోరోజైన సోమవారం సాయంత్రం ఆరెమైసమ్మ ఆలయం వద్ద నిర్వహించిన సభలో ప్రజలనుద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. ‘భాగ్యలక్ష్మీ అమ్మ వారి సాక్షిగా ఎంఐఎం అడ్డాను బద్దలు కొట్టిన సత్తా బీజేపీ కార్యకర్తలదే. పాతబస్తీనే కాదు.. వాళ్లు సవాల్ చేస్తే ఏ బస్తీకైనా వచ్చి కాషాయ జెండా ఎగరేస్తాం. టీఆర్ఎస్కు ఆ దమ్ము ఉందా? దేశద్రోహుల పార్టీ ఎంఐఎంతో కేసీఆర్ దోస్తీ చేస్తున్నా రు. కేసీఆర్ పాతబస్తీకి రావాలంటే ఎంఐఎం పర్మిషన్ తీసుకోవాలి. రాబోయే ఎన్నికల తరువాత దేశద్రోహుల పార్టీని తరిమికొడతాం. భాగ్యనగర్ అమ్మవారి పేరుతోనే భాగ్యనగర్ పేరొచ్చింది. గొల్ల కురుమల కొండ గొల్లకొండనే... అది గోల్కొండ కాదు. నిజాం స్థలాలు, ఆస్తులన్నీ కూడా మావే. హిందువుల స్థలాలను ఆక్రమించుకుని నిజాం ఆస్తులుగా చెప్పుకుంటున్నారు’అని అన్నారు. కుటుంబం చేతిలో తెలంగాణ తల్లి బందీ తెలంగాణ ఇచ్చిన వీరుడు సర్దార్ పటేల్ ముందు మోకరిల్లిన పార్టీ బీజేపీ అని, తెలంగాణ ప్రజల మానప్రాణాలను దోచుకుని హింసించిన నిజాం రాజు ముందు మోకరిల్లిన పార్టీ టీఆర్ఎస్దని బండి సంజయ్ ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏనాడూ ఎంఐఎం సమర్థించలేదన్నారు. తెలంగాణ తల్లి ఒక కుటుంబం చేతిలో బందీ అయ్యిందని, విముక్తి చేసేందుకు బీజేపీ పోరాడుతుందని చెప్పారు. 111 జీవో పరిధిలోనే కేసీఆర్‌కు, ఆయన కొడుకు, కూతురుకు సామ్రాజ్యాలున్నాయని ఆరోపించారు. బీజేపీ ఏ మతానికీ, వర్గానికీ వ్యతిరేకం కాదని, కానీ హిందూ మతాన్ని కించపరిస్తే మాత్రం ఊరుకోదన్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్ మాట్లాడుతూ.. ఒవైసీ సోదరులపై మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఎంఐఎం నేతలను పాకిస్తాన్ పంపిస్తామని అన్నారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ల కాళ్లు పట్టుకోవటం ఎంఐఎంకు అలవాటైందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, కర్ణాటక ఎంపీ, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఇన్చార్జి మునుస్వామి, ఎస్సీ మోర్చా జాతీయ ఇన్చార్జి లాల్ సింగ్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాలికి గాయం: ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా రాత్రి లంగర్ హౌస్ వద్ద బండి సంజయ్‌ను కలిసేందుకు కార్యకర్తలు పోటీపడటంతో తోపులాట జరిగింది. ఈక్రమంలో ఆయన కిందపడిపోవడంతో కాలికి గాయమైంది. కాలికి కట్టుకట్టుకుని సోమవారం బాపూఘాట్ నుంచి యాత్రను కొనసాగించారు. టిప్పుఖాన్ బ్రిడ్జ్ మీదుగా.. ఆరె మైసమ్మ, అప్పా జంక్షన్, అజీజ్ నగర్ క్రాస్‌రోడ్డు మీదుగా హిమాయత్ సాగర్‌కు చేరుకున్నారు. యాత్ర రాజేందర్‌నగర్ నియోజకవర్గంలోకి చేరుకోగా మైలార్దేవరపల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గుర్రాలు, ఒంటెలతో ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా బోనాలు, మంగళహారతులతో నీరాజనం పలికారు. ‘డబుల్’ ఇళ్ల లెక్క చెప్పండి: బండి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఎన్ని డబుల్ బెడ్రూం ఇళ్లు కడతామన్నారు.. ఎన్ని పూర్తి చేశారు.. లబ్ధిదారుల జాబితాతో సహా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. తాను పాల్గొన్న పట్టణాభివృద్ధి కమిటీ భేటీలో రాష్ట్ర ముఖ్య కార్యదర్శి వెల్లడించిన వివరాల ప్రకారం.. 8,000 ఇళ్లు మాత్రమే కట్టినట్లు స్పష్టమౌతోందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం పేరును టీఆర్ఎస్ సర్కార్ మార్చేసిందని, కేంద్రం ఇచ్చిన నిధులతోనే డబుల్ బెడ్రూం ఇళ్లు కడుతున్నారని చెప్పారు. ప్రధాని మోదీకి మంచి పేరు వస్తుందనే పథకం పేరును మార్చేశారన్నారు. సోమవారం మూడో రోజు ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించి, హైదరాబాద్ బాపూఘాట్ సమీపంలో సంజయ్ మీడియాతో మాట్లాడారు. కాంట్రాక్టర్ల కమీషన్ కోసమే డబుల్బెడ్రూం ఇళ్లు కడుతున్నారని, వాటి నాణ్యతను ఇప్పటివరకు సీఎం కేసీఆర్ పరిశీలించలేదని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు 2 లక్షలకు పైగా, జీహెచ్ఎంసీలో 1.40 లక్షల ఇళ్లు మంజూరు చేసిందని ఈ ఇళ్లు ఎక్కడ కట్టారో చెప్పాలని ప్రశ్నించారు. వీటి నిర్మాణానికి కేంద్రం ఇప్పటివరకు రూ.3,500 కోట్లు విడుదల చేయగా, కేసీఆర్ సర్కార్ రూ.2,285 కోట్లు ఉపయోగించుకుందని చెప్పారు. ఇవిగాక జీహెచ్ఎంసీలో వివిధ పథకాల అమలుకు మోదీ ప్రభుత్వం రూ.1,287 కోట్లు మంజూరు చేసిందని సంజయ్ వివరించారు. ఆయుష్మాన్ భారత్ అమలేదీ.. హైదరాబాద్ శివారు భోజగుట్టలో టీఆర్ఎస్, ఎంఐఎం నేతలు ఆక్రమించుకున్న 40 ఎకరాల స్థలంతో పాటు ఇతర చోట్ల పీఎంఏవై కింద ఇళ్లు కట్టించి ఇవ్వాలని సూచించారు. అలాగే రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. కోవిడ్ కష్టకాలంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేసి ఉంటే వైద్యచికిత్స ఖర్చుల నుంచి పేదలకు ఉపశమనం లభించి ఉండేదన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ నాయకులు మోకాళ్ల యాత్ర చేయకతప్పదని బండి హెచ్చరించారు. -
బహిరంగ చర్చకు సిద్ధమా..? మంత్రి కొప్పుల ఈశ్వర్ సవాల్
సాక్షి, కరీంనగర్: బండి సంజయ్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బండి సంజయ్ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టే బండి సంజయ్, రేవంత్‌రెడ్డిలు వారి పార్టీలకు అధ్యక్షులు అయ్యారన్నారు. సంక్షేమ ఫలాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ మంత్రి సవాల్ విసిరారు. అధికారం కోసం బీజేపీ పాకులాడుతుందని ఆయన దుయ్యబట్టారు. రేవంత్‌రెడ్డి ఏం మాట్లాడతారో ఆయనకు కూడా తెలియదని నిప్పులు చెరిగారు. గతంలో తెలంగాణ కోసం తాము రాజీనామా చేస్తే.. బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పదవులు ముఖ్యం అయ్యాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. ఇవీ చదవండి: క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ పదవికి కోదండరెడ్డి రాజీనామా మన బడి నాడు-నేడు: టీచర్‌గా మారిన ఎమ్మెల్యే రోజా -
‘ప్రజాసంగ్రామ యాత్ర’ ఒక ఆయుధం
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ కుటుంబ, అవినీతి పాలనపై అన్నివర్గాలు విసిగివేసారి ఉన్నందున టీఆర్ఎస్ సర్కార్‌ను గద్దె దించేందుకు ‘ప్రజాసంగ్రామ యాత్ర’ను ఒక ఆయుధంగా ఉపయోగించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఈ యాత్ర సంజయ్ ఒక్కడిదే కాదని, యావత్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, యంత్రాంగానిదని అన్నారు. శుక్రవారం పార్టీ జిల్లాల అధికార ప్రతినిధులు, సోషల్ మీడియా ప్రతినిధులు, మీడియా బాధ్యులు, జిల్లా యాత్రా ప్రముఖ్‌లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇన్‌చార్జీలతో శుక్రవారంరాత్రి పొద్దుపోయే వరకు వేర్వేరుగా నిర్వహించిన వర్క్‌షాపులు, సమావేశాల్లో సంజయ్ మాట్లాడారు. పాదయాత్ర ద్వారా కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను రాష్ట్రం నలుమూలాల ప్రజలకు చేరవేసేందుకు సోషల్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలను సమర్థవంతంగా ఉపయోగించుకోలన్నారు. ఇన్నాళ్లూ కార్యకర్తలు లాఠీచార్జీ, జైలుశిక్షలు వంటి కష్టాలను అనుభవించారని, ఇకనుంచి అధికారం చేజిక్కించుకునేందుకు ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మీడియా కోఆర్డినేటర్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్.ప్రకాశ్‌రెడ్డి, సీనియర్ నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, మంత్రి శ్రీనివాసులు, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, సీనియర్ జర్నలిస్ట్ సాయి, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రేపట్నుంచి కిషన్‌రెడ్డి ‘జన ఆశీర్వాద యాత్ర’
సాక్షి, హైదరాబాద్: కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఈ నెల 19, 20, 21 తేదీల్లో ‘జన ఆశీర్వాద యాత్ర’ చేపడుతున్నారని బీజేపీ ప్రధాన కార్యదర్శి, పాదయాత్ర ఇన్చార్జి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు. మోదీ ప్రభుత్వం వివిధ వర్గాల ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రజల ఆశీర్వాదాలను తీసుకునేందుకు ఈ యాత్ర చేపడుతున్నామన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బుధవారం రాత్రి కిషన్‌రెడ్డి తిరుమల చేరుకుని గురువారం ఉదయం వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారని, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకుని కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారని తెలిపారు. గురువారం సాయంత్రం 4 గంటలకు కోదాడ తిరుమలాపురం చేరుకుంటారని చెప్పారు. యాత్ర 12 జిల్లాలు, 7 లోక్‌సభ, 18 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 384 కి.మీ. మేర సాగుతుందన్నారు. -
అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి చర్యలు
సాక్షి, పల్లంపేట: ఐదు వందల సంవత్సరాల క్రితం తిరుమలకు అన్నమయ్య నడిచిన కాలిబాటను అభివృద్ధి చేసి భక్తులకు సులువైన మార్గం ఏర్పాటుకు త్వరలో చర్యలు చేపడతామని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వెల్లడించారు. కాలిబాట మార్గం అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా సుముఖంగా ఉన్నారని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి చేపట్టిన తిరుమల మహా పాదయాత్రలో శనివారం ఆయన పాల్గొన్నారు. వైఎస్సార్ జిల్లా పల్లంపేట మండలం అప్పయ్యరాజు పేట వద్ద ఆకేపాటి పాదయాత్ర చేరుకున్న క్రమంలో డిప్యూటీ సీఎం.. ఆకేపాటిని కలిసి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల మహా పాదయాత్రలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. 17 వ సారి మహా పాదయాత్ర చేపట్టిన ఆకేపాటి దంపతులకు ఏడుకొండల స్వామి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కడప పార్లమెంటరీ అధ్యక్షుడు సురేష్ బాబు ఆకాంక్షించారు. -
డల్లాస్‌లో జగన్ అభిమానుల పాదయాత్ర
డల్లాస్ : వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర వెయ్యి కిలోమీటర్లు చేరుకున్న సందర్భంగా డల్లాస్‌లోని వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు ఆదివారం భారీ ర్యాలీగా పాదయాత్రను చేపట్టారు. దాదాపు 300మంది ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ సాయంత్రం నాలుగు గంటలకు ఇర్విన్లోని గాంధీ పార్క్ వద్ద మొదలై మళ్లీ మూడు గంటల తరువాత అక్కడికే చేరుకుని ముగించారు. నినాదాలతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. ఈ ర్యాలీని శ్రీధర్ కొరసపాటి, రమణ్ రెడ్డి క్రిష్టపాటి, రమణ పుట్లుర్, సుబ్బారెడ్డి కొడూరు, క్రిష్ణ మోహన్, మధు మల్లు, రితుమల్ రెడ్డి, సునిల్ దేవిరెడ్డి, రవీంద్ర, రామిరెడ్డి బూచిపుడి, భాస్కర్ గండికోట, చందు రెడ్డి, యశ్వంత్ రెడ్డి కలిసి నిర్వహించారు. -
ప్రజాసంకల్పయాత్రకు మద్దతుగా ఆస్ట్రేలియాలో పాదయాత్ర
-
ఇది ‘ప్రజా సంకల్పం’
-
సడలని సంకల్పం మనది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర చరిత్రలోనే ఇన్ని వేల కిలోమీటర్లు, ఇన్ని నెలల పాటు జరగబోయే పాదయాత్ర ‘ప్రజా సంకల్పం’ కాబోతోందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. తన పాదయాత్రకు అవరోధాలు సృష్టించేందుకు ఎలా ప్రయత్నిస్తున్నారో అందరూ చూస్తున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు శాడిస్టిక్‌గా సీబీఐ, ఈడీని వాడుకోవడం కూడా చూస్తున్నామన్నారు. గురువారం పార్టీ నేతల విçస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను కోర్టుకు వెళ్లినప్పుడల్లా చూస్తూ ఉంటాను... అక్కడ చాలా మంది కోర్టుకు హాజరు కానే కారు. హాజరు నుంచి మినహాయింపు పొంది రాకుండా ఉంటారు. కానీ నా విషయంలో ఇంకా ట్రయల్ కూడా మొదలు కాలేదు. ఇంకా డిశ్చార్జి స్థాయిలోనే ఉంది. అయినా కూడా నా ఒక్కడి విషయంలోనే కఠినంగా వ్యవహరిస్తున్నారు. నా విషయం వచ్చేటప్పటికి సీబీఐ లేచి నిలబడుతోంది... ఈడీ లేచి నిలబడుతోంది. కఠినంగా వ్యవహరిస్తోంది... నేనేదో పరుగెత్తి పోతున్నట్లు... దేశమే విడిచి పోతున్నట్లు... వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు.. సీబీఐ, ఈడీల ద్వారా ఒత్తిడి తెచ్చి అడ్డుకుంటున్నారు. యాత్ర జరగకూడదనే కుయుక్తులు పన్నుతున్నారు. కానీ మన సంకల్పం చాలా గట్టిది. కోర్టు ఆదేశాల ప్రకారం ఎక్కడైతే యాత్ర ఆగుతుందో... అక్కడి నుంచి వచ్చి కోర్టుకు హాజరై ఆ తరువాత మళ్లీ ఆగిన చోట నుంచే మొదలు పెడదాం. సడలని సంకల్పంతో యాత్రను పూర్తి చేస్తాం. ప్రజలు ఆశీర్వదిస్తారు... పై నుంచి దేవుడు చూస్తున్నాడు..’ అని జగన్ పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై నాపై వేసిన కేసులవి.... ‘నా మీద కేసులు ఎపుడొచ్చాయి...? దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నంత వరకూ నాపై కేసులు లేనే లేవు. ఆయన చనిపోయిన తరువాత నేను సోనియాగాంధీని ఎదిరించి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాతనే కక్ష సాధింపుతో కేసులు వేశారు. కాంగ్రెస్–టీడీపీ రెండూ కలసి కుమ్మక్కై నాపై వేసిన కేసులవి. చంద్రబాబు ఏకంగా అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడేందుకు ఎలా విప్ జారీ చేసి అవిశ్వాసం నెగ్గకుండా కాపాడారో ప్రజలంతా చూశారు. తెలంగాణలో ఎమ్మెల్యేను నల్లధనంతో కొనుగోలు చేస్తూ ఆడియో టేపుల సాక్షిగా అడ్డంగా దొరికి పోయినా కేసుల్లేకుండా దేశంలో కొనసాగుతున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు’ అని జగన్ తెలిపారు. ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది: మాజీ జడ్జి క్రిష్టప్ప ప్రజాదరణ కలిగిన ప్రతిపక్ష నేత, జనంలోకి వెళ్లి సమస్యలను తెలుసుకోవాల్సిన వ్యక్తికి కోర్టు హాజరు నుంచి మినహాయింపు రాక పోవడం ప్రజాస్వామ్యంలో తలదించుకోవాల్సిన విషయమని జిల్లా కోర్టు మాజీ జడ్జి, పార్టీ ప్రధాన కార్యదర్శి మారక్కగారి క్రిష్టప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతటి కరుడుగట్టిన నేరస్థుడికైనా, డెకాయిట్కైనా సీఆర్పీసీ 205 ప్రకారం కోర్టు హాజరు నుంచి మినహాయింపు లభిస్తుందని, అలాంటి ఒక ప్రజాదరణ గల నేతకు అనుమతి లభించక పోవడం పట్ల ప్రజలంతా చర్చించుకుంటున్నారన్నారు. న్యాయవర్గాల్లో, మేధావి వర్గంలో జగన్‌కు మినహాయింపు లభించని విషయంపై విస్తృతంగా చర్చ జరుగుతోందన్నారు. రాష్ట్రంలో కేసులు ఎదుర్కొంటూ కోర్టుకు హాజరు కాకుండా 205 సీఆర్పీసీ కింద మినహాయింపు పొందిన టీడీపీ నేతల వివరాలను జిల్లాల వారీగా సేకరించాలని సూచించారు. చంద్రబాబునాయుడుపై అనంతపురం జిల్లా రాయదుర్గం కోర్టులో ఒక కేసుందని చెప్పారు. జగన్‌పై అన్యాయంగా కక్ష సాధిస్తున్న తీరును చూసి తట్టుకోలేకే తాను పదవీ విరమణ చేశాక వైఎస్సార్ సీపీలో చేరానని వివరించారు. జగన్‌ను తొక్కాలని చూస్తున్నారని, అయితే ఆయన్ను ఎంత తొక్కితే అంత పైకి లేస్తాడని వ్యాఖ్యానించారు. -
ఇది ‘ప్రజా సంకల్పం’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు తాను నవంబర్ 6వ తేదీ నుంచి చేపట్టనున్న ‘ప్రజా సంక ల్పం’ పాదయాత్రలో మొత్తం మీద రెండు కోట్ల మందికి చేరువ కావడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నానని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఈ పాదయాత్రకు ‘ప్రజా సంకల్పం’ అని పేరు పెడుతున్నట్లు ఆయన పార్టీ శ్రేణుల కరతాళధ్వనుల మధ్య ప్రకటిం చారు. 3,000 కిలోమీటర్ల తన యాత్రలో దారి పొడవునా 45 లక్షల మందిని ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. హైద రాబాద్ ఎమ్మెల్యే కాలనీలోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో గురువారం జరిగిన వైఎస్సార్సీపీ విస్తృత సమావేశంలో పాద యాత్ర ప్రాధాన్యతను జగన్ వివరించారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 180 రోజుల పాటు 125 నియోజకవర్గాల్లో మూడువేల కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగుతుందని చెప్పారు. పాదయాత్ర సంద ర్భంగా దారి వెంబడి ఐదువేల చోట్ల ప్రజల తో సమావేశం అవుతామని, 180 సంఘాల తో ప్రత్యేక సమావేశాలు ఉంటాయని, 125 నియోజకవర్గాల్లో భారీ జనసందోహంతో బహిరంగ సభలు ఉంటాయని వివరించారు. 20 వేల మంది పార్టీ కార్యకర్తలను కలుసుకోవడంతో పాటు, 10 వేల గ్రామాలు, నివాసిత ప్రాంతాల గుండా పాదయాత్ర కొనసాగుతుందన్నారు. పాదయాత్ర జరుగు తున్నపుడు ఇతర జిల్లాల్లో చేపట్టాల్సిన 120 రోజుల కార్యక్రమాన్ని సమర్థవంతంగా, నాణ్యతతో (క్వాలిటీతో) నిర్వహించడం ఎంత అవసరమో జగన్ నొక్కి చెప్పారు. ఎన్నికలు వచ్చే ఏడాది అక్టోబర్ నెలలోనే జరుగుతాయనే సంకేతాలు స్పష్టంగా వెలువడుతున్నందున ప్రతిష్టగా తీసుకుని ‘రచ్చబండ– పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, మరింతగా ప్రజలతో మమేకం కావాలని సూచించారు. పాదయాత్ర సుమారు ఆరేడు నెలలు జరుగుతుందన్నారు. ఇప్పటి అంచనా ప్రకారం తన యాత్రలో శీతాకాలం, మండు వేసవి, మళ్లీ వర్షాకాలం మొదలయ్యే వరకూ కొనసాగుతుందని, అది జూలై 10వ తేదీ వరకూ ఉంటుందని, అంతకుమించి పొడిగిం చరాదని భావిస్తున్నామని తెలిపారు. పాద యాత్ర జరుగుతున్న సమయంలో మిగిలిన నియోజకవర్గాల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న దానిపై ఇదివరకే పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఇతర సీనియర్ నేతలతో సమావేశం నిర్వ హించామని.. వారి సలహాలను, సూచనలను క్రోడీకరించి ఈ ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. పాద యాత్ర, రచ్చబండ–పల్లె నిద్ర కార్యక్రమా లపై ప్రత్యేకంగా తయారు చేసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో వివరాలను నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్ యాదవ్ వివరించారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల సమన్వయకర్తలు, జిల్లా ఇంచార్జిలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, అధికార ప్రతినిధులు, పార్టీ నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రత్యేక హోదాపై చైతన్యం ప్రత్యేక హోదా సాధన పార్టీ లక్ష్యమని జగన్ పార్టీ నాయకులకు స్పష్టంచేశారు. రచ్చబండ, పల్లె నిద్రల కార్యక్రమాల్లో ప్రత్యేక హోదా అంశంపై ప్రజల్లో చైతన్యం నింపేలా నాయ కులు కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చా రు. హోదాకు మద్దతుగా 50 లక్షలకు పైగా సంతకాలు సేకరించాలని ఆదేశించారు. 1,400కు పైగా కాలేజీల్లో విద్యార్థుల మద్దతు తీసుకోవడం, వారిలో చైతన్యాన్ని నింపేలా నాయకులు దృష్టిపెట్టాలని సూచించారు. దీని పై ఒక షెడ్యూల్ ఖరారు చేశామని నాయకు లు, దాన్ని అనుసరించాలని కోరారు. సంస్థాగతంగా భారీ మార్పులు పార్టీని బలోపేతం చేసే దిశగా సంస్థాగతంగా భారీ మార్పులు ఉండబోతున్నాయని జగన్ వెల్లడించా రు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే 25 లోక్‌సభ నియోజకవర్గాలను 25 జిల్లాలుగా ప్రకటించబోతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే జిల్లా అధ్యక్షుల వ్యవస్థ స్థానంలో పార్లమెం టు నియోజకవర్గాల ప్రాతి పదికగా పార్టీ అధ్యక్ష బాధ్యతలు కష్టపడి పనిచేసే వారికి అప్పగించబోతు న్నామని తెలిపారు. ప్రజా సంకల్పం పాద యాత్ర పూర్తయ్యే నాటికి రాష్ట్రంలో చంద్రబాబు పునాదులు కదిలిపో వాలని, అందుకు మన మంతా కష్టపడి పని చేయాలని విజ్ఞప్తి చేస్తు న్నానని జగన్ అన్నపుడు సభలో చప్పట్లు మారుమోగాయి. రచ్చబండ–పల్లె నిద్ర పాదయాత్ర జరుగుతున్న నియోజకవర్గం మినహా మిగిలిన నియోజకవర్గాల్లో పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాల ప్రణాళికను కూడా జగన్ వివరించారు. నవంబర్ 11వ తేదీ నుంచి ప్రారంభమయ్యే రచ్చబండ–పల్లెనిద్ర కార్యక్రమం 120 రోజులపాటు 175 నియోజకవర్గాల్లో జరుగుతుందని, నియోజకవర్గాల్లో 80 శాతం ప్రజలను కలుసుకునేలా రచ్చబండ, పల్లె నిద్ర కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. లక్షలాది మంది బూత్ కమిటీ సభ్యులను బలోపేతం చేయడం, సమస్యలను గుర్తించడం, వాటి పరిష్కారాలపై ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించడం ప్రధాన ఉద్దేశాలని తెలిపారు. రచ్చబండలో గ్రామ సమస్యలను తెలుసుకుని, వాటిపై అవగాహన పెంచుకోవాలని పార్టీ నాయకులకు సూచించారు. ప్రతి సమస్యను పార్టీ నాయకులు నోట్ చేసుకోవాలని ఆదేశించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికీ స్థానికంగా ప్రజల నుంచి వచ్చే సమస్యలను క్రోడీకరించడం, అందులోనే వాటికి పరిష్కార అంశాలతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక మేనిఫెస్టోను ప్రకటిద్దామని చెప్పారు. తన పాదయాత్ర ముగిశాక బస్సు యాత్రలో వీటిని విడుదల చేస్తామన్నారు. ఈ మేనిఫెస్టోను అమలు చేసే బాధ్యతను తానే తీసుకుంటానని హామీనిచ్చారు. పార్టీ ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాలు మేనిఫెస్టో కాదని, ఈ నవరత్నాలపై ప్రజల నుంచి, నిపుణుల నుంచి, వివిధ సామాజిక వర్గాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి మరింత మెరుగ్గా రూపొందించి ఆ తర్వాత మేనిఫెస్టోలో చేరుస్తామని స్పష్టంచేశారు. మనమంతా ఒకే కుటుంబం... అది వైఎస్సార్ కుటుంబం మనమంతా ఒకే కుటుంబం– అది వైఎస్సార్ కుటుంబం అనే నినాదంతోనే ప్రజలకు మన సందేశం వినిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్ యాదవ్ పార్టీ శ్రేణులను కోరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సూచన మేరకు ఆయన గురువారం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో జగన్ పాదయాత్ర, రచ్చబండ– పల్లె నిద్ర కార్యక్రమాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను వివరించారు. ప్రధానంగా ప్రజల కష్టాలను అర్థం చేసుకున్నామని, వాటిపై తమ గళాన్ని వినిపిస్తామని పార్టీ నేతలు భరోసా ఇవ్వాలన్నారు. వైఎస్సార్సీపీ అందరి పార్టీ, దీనికి కుల, మత భేదాలు లేవు, అందరమూ సంక్షేమం కోసం పాటుపడదామనే ఐక్యత కనిపించాలని చెప్పారు. మనమంతా ఒకే కుటుంబం, ప్రజావాణి, ఇది అందరి పార్టీ, అభ్యున్నత ఆంధ్రప్రదేశ్ వైపు అనే అంశాలపైనే మన సందేశం ఉండాలన్నారు. పాదయాత్ర దారి వెంబడి సమావేశాలు, పార్టీ కార్యకర్తలతో సమావేశాలు, ప్రభావిత సంఘాల సమావేశాలు, భారీ బహిరంగ సభలు, విభిన్నమైన కార్యక్రమాలు, జెండా ఆవిష్కరణ– చిరస్మరణీయమైన ముద్ర వేసే అంశాలు వంటి వివరాలను ఆయన వెల్లడించారు. వివిధ స్థాయిల్లో కమిటీలు చేయాల్సిన పనులు, కో–ఆర్డినేటర్లు పాటించాల్సిన మార్గదర్శకాలను ఆయన వివరించారు. పాదయాత్ర కీలక అంశాలు ►పాదయాత్ర దారి వెంబడి విస్తృతంగా సమావేశాలు ►పార్టీ కార్యకర్తల సమావేశాలు ►ప్రభావిత సంఘాల సమావేశాలు ►భారీ బహిరంగ సభలు.. విభిన్నమైన కార్యక్రమాలు ►చిరస్మరణీయమైన ముద్ర: జెండా, విగ్రహావిష్కరణ రచ్చబండ ముఖ్యాంశాలు ►నియోజకవర్గానికి కనీసం 30 కీలక గ్రామాల్లో రచ్చబండ నిర్వహణ ► ప్రత్యేక హోదా కోసం సంతకాల సేకరణ ►కీలకమైన సామాజికవర్గాల ముఖ్యనేతలతో సమావేశం ►బూత్ కమిటీలను బలపరచడం ►గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమం ► పల్లెనిద్ర ►కళాశాలల్లో విద్యార్థులతో సమావేశాలు -
నీవు నడిచిన దారి.. మరచితివా బాబూ!
కోడుమూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్రలో భాగంగా కోడుమూరు నియోజకవర్గంలో పర్యటించి నేటికి ఐదేళ్లు పూర్తవుతోంది. పాదయాత్ర సందర్భంగా ఆయన ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదు. 2012 అక్టోబరు 2వతేదీన అనంతపురం జిల్లాలోని హిందూపురం నుంచి పాదయాత్రను ప్రారంభించి కర్నూలు జిల్లాలోనూ పర్యటించారు. ఆ ఏడాది అక్టోబరు 20న కోడుమూరు నియోజకవర్గంలోని సి.బెళగల్ మండలం కంబదహాల్ గ్రామానికి చేరుకున్నారు. అక్కడి నుంచి సి.బెళగల్ మీదుగా గూడూరు, మునుగాల, మల్లాపురం, కొత్తకోట, సుంకేసుల మీదుగా తెలంగాణ ప్రాంతానికి వెళ్లారు. సి.బెళగల్ చెరువుకు ఎత్తిపోతల పథకాన్ని తీసుకొస్తానని, గూడూరు బుడగలవాని చెరువును సమ్మర్‌స్టోరేజీ ట్యాంకుగా నిర్మిస్తానని, గూడూరులో 30పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. మునుగాల, మల్లాపురం, కొత్తకోటకు వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉంది. పాదయాత్ర సమయంలో చంద్రబాబు ఈ రోడ్డుపై నడవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. మోకాటిలోతు ఎగుడుదిగుడు గుంతల్లో నడవలేక అవస్థ పడ్డారు. ముఖ్యమంత్రి అయిన నెలరోజుల్లోపే ఈ రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలుస్తానని అప్పట్లో ఆయన హామీ ఇచ్చారు. 10కిలోమీటర్ల ఈ రోడ్డు నిర్మాణం కోసం ఎమ్మెల్యే మణిగాంధీ దాదాపు రూ.12కోట్లతో ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయారు. అయినప్పటికీ సీఎం పట్టించుకోలేదు. కొత్తకోట గ్రామంలో 10వతరగతి విద్యార్థులు దాదాపు 150మంది చదువుతున్నారు. గూడూరు పోలీస్‌స్టేషన్‌లో భద్రపరిచే 10వతరగతి పరీక్షా పత్రాలను తీసుకుపోయి కొత్తకోటలో నిర్ణీత సమయానికి అందజేయాలంటే సమయం సరిపోవడం లేదని ఏకంగా పరీక్షా కేంద్రాన్నే రద్దు చేశారు. ఇంతటి ఇబ్బందులు ఎదురవుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. -
పదమూడేళ్ల ప్రజా ప్రస్థానం
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానం పేరుతో సాహసోపేతమైన పాదయాత్రకు శ్రీకారం చుట్టి శనివారం నాటికి సరిగ్గా పదమూడేళ్లు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కరవు, కాటకాలతో ప్రజలు అల్లాడుతున్నప్పుడు... నిరాశ, నిస్పృహలతో రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నప్పుడు... తమను ఆదుకునే వారేరని ప్రజలు ఎదురుచూస్తున్న దయనీయ పరిస్థితుల్లో నేనున్నానంటూ ప్రతిపక్ష నేతగా రాజశేఖరరెడ్డి 2003 ఏప్రిల్ 9న సాహసోపేతమైన పాదయాత్రకు నడుం బిగించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రారంభించి జూన్ 15 న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు అప్రతిహతంగా కొనసాగించారు. నడి వేసవిలో 40 డిగ్రీల ఎండను సైతం లెక్కచేయకుండా 68 రోజుల పాటు 11 జిల్లాల్లో 56 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకొచ్చే 690 గ్రామాల ప్రజలను పలకరిస్తూ ఇచ్చాపురం వరకు 1475 కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తి చేశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన ఈ యాత్రకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వైఎస్ఆర్ స్వల్ప అస్వస్థతకు గురైనా వెంటనే కోలుకుని పాదయాత్రను కొనసాగించారు. ముఖ్యమంత్రి అయ్యాక రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్సులు, డ్వాక్రా సంఘాలకు పావలా వడ్డీకి రుణాలు, జలయజ్ఞం, రాజీవ్ ఉద్యోగశ్రీ తదితర పథకాలను ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. -
అన్న అమ్ములపొదిలో...
రాజకీయ కురుక్షేత్రంలో శల్యసారథ్యాలు, ధ్రుతరాష్ట్ర కౌగిళ్లు, పద్మవ్యూహాలు, అధర్మ యుద్ధాలు, కుట్రలు, కుతంత్రాలను ఛేదించుకుంటూ అన్నయ్య యుద్ధం చేస్తున్నాడు. తెలుగు జాతి కీర్తికోసం, తెలుగువారి ఆత్మగౌరవం కోసం, తెలుగింటి సంరక్షణకోసం వెన్ను చూపించకుండా, వెన్నుపోట్లను బేఖాతరు చేస్తూ, అవిశ్రాంతంగా పోరాడుతున్నాడు. ఆ అన్నయ్య అమ్ముల పొదిలో భక్తిశ్రద్ధలతో ఒక బాణం సంసిద్ధంగా నిరీక్షిస్తోంది. జగనన్న బాణం... అన్న ఆజ్ఞకోసం సన్నద్ధంగా ఉంది. - ప్రియదర్శిని రామ్ రామ్: అక్టోబర్ 18, 2012 మీరు మీ పాదయాత్ర మొదలుపెట్టారు.. ఆ పాదయాత్రలో మీరు చూసిన అభిమానం చాలా బరువైన అభిమానం. అన్నివైపులా పోలికలు ఉండుంటాయి. నాన్నలాగ ఉన్నారని, అన్నలాగ ఉన్నారని, అన్న కోసం వచ్చారని... అలాంటి బరువును మోస్తూ నడుస్తున్నప్పుడు ఎంత కష్టమనిపించింది? షర్మిల: ఆలోచిస్తే... నాన్న చేసిన పాదయాత్రను మళ్లీ నేను చేయగలగడం ఒక అదృష్టం.. గౌరవంగా భావిస్తున్నాను. కానీ రెండింటికీ పోలిక... ఏమో... ఎందుకంటే... నాన్న పాదయాత్ర చాలా కష్టంగా సాగింది. నాన్న పాదయాత్ర మండే ఎండల్లో రోజుకు 20 నుంచి 24 కిలోమీటర్ల వరకు చేశారు... నిజంగానే చాలా కష్టపడ్డారు. అది నేను చూశాను. నా పాదయాత్ర అంత కష్టంగా సాగలేదు. రామ్: మీరు కూడా అలాంటి మండే ఎండల్లోనే నడిచారు కదా... షర్మిల: లేదు.. ఎండాకాలం కొంత సమయమే.. రోజుకు మరీ ఎక్కువ అంటే 18 కిలోమీటర్లు నడిచాను. నా దృష్టిలో నాన్న పాదయాత్ర అసలైంది... ఒరిజినల్... అండ్ ద ఒరిజనల్ ఈజ్ ద మాస్టర్‌పీస్. మైన్ వజ్ జస్ట్ ఎ రెప్లికా.. నాది ఒట్టి కాపీయే. రామ్: ప్రజల ఆదరణ..? షర్మిల: నా పాదయాత్రలో నన్ను నాన్నతోనో, అన్నతోనో పోల్చారని నేను అనుకోను. నాకలా అనిపించలేదు. నాలో నాన్నను, అన్నను వెతుక్కున్నారని అనిపించింది. చాలాసార్లు ప్రజలు పడుతున్న కష్టాలు చూసి కళ్లల్లో నుంచి నీళ్లు వచ్చాయి. ఇంకొన్నిసార్లు... మీ నాన్న ఆరోగ్యశ్రీ వల్ల నా భర్త బతికాడనో లేక మీ నాన్న ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల నా కూతురు చదువుకుందనో లేక మా కుటుంబానికి అప్పులు తీరాయనో ఎవరైనా చెబితే... చాలా సంతోషమనిపించేది.. నాన్న గుర్తొచ్చి వెంటనే ఏడుపొచ్చేది.. ఎన్నో జ్ఞాపకాలు నాకు జీవితాంతం గుర్తుండిపోయేవి. రామ్: వైఎస్ రాజశేఖరరెడ్డిగారు మహా వృక్షంలాంటి వారు. ఆ వృక్షం కింద చాలామంది వాళ్ల జీవితాలను బాగుచేసుకున్నారు. ఆ మహావృక్షం వాలిపోయింది. ఆ లోటు రాష్ట్రంలో అందరికీ తెలిసిందే. కానీ అదే ప్రజలు మీకు ఆ లోటు తెలియకుండా ఉండడానికి సర్వప్రయత్నాలు చేశారు. మిమ్మల్ని గుండెల్లో హత్తుకుని పెట్టుకున్నారు. ఒక ఎలక్షన్ ఉందంటే, వాళ్లు గెలిచినంత గొప్పగా మిమ్మల్ని గెలిపించుకున్నారు. వీధిలో ఒక మీటింగ్. ఒక బహిరంగ సభ... ఏదైనా కానీ.. అందరూ వచ్చేసేవారు. మీ నాన్న దగ్గర పదవులు పొంది రాజకీయంగా ఎదిగి గొప్పవాళ్లుగా తెలిసిన పెద్దలు విశ్వాసఘాతుకానికి ఎన్నోసార్లు ఒడిగట్టారు. పేదల ప్రేమ చూశాక, వీళ్ల విశ్వాస ఘాతుకం చూస్తున్నప్పుడు ఏమనిపిస్తోంది? షర్మిల: నిజంగానే మీరు చెప్పినట్లు ప్రజలైతే, రాజన్న కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకున్నారు. మనస్ఫూర్తిగా తమ సొంత కుటుంబమన్నట్లు అక్కున చేర్చుకున్నారు. ఎక్కడికిపోయినా, ఎప్పుడు పోయినా, ‘‘అమ్మా నువ్వు భయపడొద్దు, మేం మీకున్నామమ్మా’’ అని ధైర్యం చెప్పారు. ఈ రాష్ట్ర ప్రజలకు రాజన్న కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. మీరు చెప్పినట్లు, నాన్న వల్ల పదవులు అనుభవిస్తున్న వాళ్లు మా గుండెల మీద తన్నారు. అయినా లోకంతీరు ఇంతేలే అనుకున్నాం. కానీ ఏ పార్టీకైతే నాన్న 30 ఏళ్లు సేవచేశారో, అదే పార్టీ నాన్నను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. అదే పార్టీ నాన్నకున్న మంచిపేరును నాశనం చేసే ప్రయత్నం చేసింది. అదిమట్టుకు భరించలేకపోయాం. దానికి ఈ రోజువరకు అన్న, అందరం చాలా బాధపడుతున్నాం. కానీ, దేవుడే మా ధైర్యం, ప్రజలే మా బలం. రామ్: మీరు మాట్లాడుతుంటే.. నాకు ఒక విషయం గుర్తుకొస్తోంది. రెండేళ్ల తర్వాత అనుకుంటా... మీ అన్నయ్య, మీ నాన్నగారి సమాధి దగ్గర కూర్చొని మీ నాన్నకు నివాళులర్పించారు. ఆయన్ను చూస్తుంటే.. ఆయన మనసులో ఒక ప్రశాంతత కనిపించింది. ఇంకో కోణంలో చూస్తే ఏదో తెలియని దీక్ష కనపడింది.. ఇంకో కోణంలో చూస్తే ఏదో సున్నితమైన బాధ కనిపించింది. మేమైనా దూరం నుంచి చూస్తాం జగన్మోహన్రెడ్డిని. మిమ్మల్ని చెల్లెలు కంటే కూడా ఒక కూతురులా చూసుకుంటారు జగన్మోహన్రెడ్డి. ఆయన మనసులో మీకు ఏం కనపడింది? ప్రశాంతత కనపడిందా? తుఫాన్ కనపడిందా? తుఫాన్ కంటే ముందుండే ప్రశాంతత కనపడిందా? షర్మిల: అన్న అక్కడ కూర్చున్నప్పుడు మా కుటుంబానికి జరిగిన అన్యాయం, అవమానం కనబడ్డాయి. కానీ అన్న అలాంటివాడు కాదు. ఏ కోపం ఉంచుకోడు. ఏ ద్వేషం ఉంచుకోడు. మనసులో బాధ అనిపించినా, మనసులో ఎంత కష్టంగా ఉన్నా, దేవునికే వదిలేస్తాడు. దేవుని దగ్గరే పెడతాడు. అన్న అక్కడ కూర్చున్నప్పుడు తప్పకుండా... ఒక ఆలోచనైతే అన్నకు వచ్చి ఉంటుంది... నాన్న నాకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు. వీళ్ల బాధ్యత నాది. నాన్న లేని లోటు వీళ్లకు కనిపించకుండా, నన్ను వాడుకో, నన్ను ఆశీర్వదించు నాన్నా... అని ఆ క్షణంలో ప్రార్థన చేసి ఉంటాడు. తనకు జరిగిన అన్యాయానికి మా కుటుంబం 16 నెలలు చాలా చాలా బాధపడ్డాం. కానీ అన్న ఆ క్షణంలో అది అనుకుని ఉండడు... అన్న అక్కడ కూర్చున్నప్పుడు. కుట్రలు పన్ని, స్వార్థం కోసం మా రాష్ట్రాన్ని, మా జాతిని విడదీయాలనుకుంటున్నారు. మా జాతిని అవమానిస్తున్నారు. ఇది అడ్డుకునేందుకు నాకు శక్తినివ్వు దేవా! నాకు సహాయం చెయ్యి నాన్నా! అని అనుకుని ఉంటాడు.., అని నాకు అనిపిస్తోంది. నాకు తెలుసు.. దట్స్ హిమ్. రామ్: కుట్రలన్నింటినీ చూసేశారు. ఇప్పుడు విభజన కుట్ర కూడా చూస్తున్నారు. ఇంత పెద్ద తుఫాను అక్కడ జరుగుతుంటే, మీరు దూరంగా ఇక్కడి నుంచి ఆ ప్రక్రియను చూస్తున్నారు. ఏమనిపిస్తోంది? షర్మిల: నాకే కాదు.. మూడో మనిషి ఎవరు చూసినా... పక్క రాష్ట్రం వాళ్లు మన రాష్ట్రాన్ని చూసినా... జాలిపడి బాధపడే స్థితిలో మనం ఉన్నాం. నాన్న మన రాష్ట్రాన్ని... దేశానికే ఒక అన్నపూర్ణగా చేయాలని, దేశంలోనే నెంబర్‌వన్‌గా ఉంచాలని అనుకుంటే, కుక్కలు చింపిన విస్తరిలా చేశారు... అధికార పక్షం, ప్రతిపక్షం కలిసి, చేసింది సరిపోలేదన్నట్లు, వాళ్ల స్వార్థం కోసం మన రాష్ట్రాన్ని విడదీయాలని చూస్తోంది కాంగ్రెస్ పార్టీ. దానికి మద్దతు పలుకుతున్నారు చంద్రబాబుగారు. ఇది మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. ఇది మన ఖర్మ. ఇలాంటి వాళ్లు నాయకులుగా ఉండడం మన ఖర్మ. నాన్న ఉన్నప్పుడు విభజన అనే గొడ్డలికి ఎదురుగా నిల్చొని ఒక్కడిగా అడ్డుకున్నాడు. మన రాష్ట్రం, మన జాతి ఒక్కటిగా ఉంటేనే మనకు బలం. కనుక మన రాష్ట్రాన్ని చీలిపోకుండా దేవుడు కాపాడతాడని నా నమ్మకం. త్వరలో ఎలక్షన్లు వస్తాయి. 182 అసెంబ్లీ స్థానాలను వైఎస్సార్సీపీ గెలుచుకుంటుందని, సమైక్యాంధ్రప్రదేశ్‌కు జగనన్న ముఖ్యమంత్రి అవుతాడని నా నమ్మకం. దేవుని మీద నా నమ్మకం. రామ్: ఈ నంబరేంటి 182? షర్మిల: నా నమ్మకం... రామ్: కడప పార్లమెంట్ స్థానం నుంచి నిలబడాలని మీరు బాగా ఉత్సాహంగా ఉన్నారని, పార్టీ నాయకత్వం దీనికి ఒప్పుకోవడం లేదని, అందుకే మీకు, మీ అన్నయ్య జగన్‌కు మధ్య మనస్పర్థలు వచ్చాయని అందరూ చెప్తున్నారు. ఈ విషయం ఎంతవరకు నిజం? మీరెందుకు ఖండించలేదు? షర్మిల: నేను ఏదో తప్పు చేసినట్టు వివరణ ఇచ్చుకోవాలన్న అవసరం నాకు అనిపించలేదు. కానీ మీరు అన్నట్లు... నేను కడప సీటు కావాలనుకుంటున్నానని, అది అన్న ఇవ్వడం లేదని, నాకు అన్నకు విభేదాలున్నాయని మన ఎల్లో మీడియా, ఎల్లో పార్టీ నాయకులు ఇప్పటికి చాలా కాలంగా ప్రచారం చేస్తున్నారు. దీనికి సమాధానం చెప్తేనే మంచిదేమో. కడప లోక్‌సభ సీటు అవినాశ్‌కు ఇవ్వాలని, ఎప్పుడో డిసైడైపోయింది. అవినాశ్ ఎవరు? మా చిన్నాన్న కొడుకు. అంటే నాకు తమ్ముడు. నేను ఎప్పుడూ కడప సీటు గురించి ఆలోచన చేయలేదు. అది కావాలని అనుకోలేదు. కడప సీటు నాకు ఇమ్మని ఎప్పుడూ ఎవరినీ అడగలేదు. రామ్: నిప్పు లేకుండానే పొగ అంటే ఇదేనేమో! షర్మిల: కచ్చితంగా అదే. ఇక నా విషయానికి వస్తే... నేను నిలబడాలనే అనుకుంటే., ఒక కడప ఎందుకు నిలబడాలి? దేవుని దయవల్ల, నాన్న లెగసీ వల్ల, అన్న కోసం చేసిన పాదయాత్ర వల్ల, ప్రజల అభిమానం, ఆశీస్సుల వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ నుంచి నిలబడినా... నేను గెలుస్తానన్న నమ్మకం చాలామందికి ఉంది. నేను కడప సీటు మాత్రమే కావాలనుకుంటున్నాను అన్నదాంట్లో లాజిక్ ఏముంది? కేవలం దురుద్దేశంతో అన్నను చెడుగా చూపాలని పనిగట్టుకుంది... మన ఎల్లో గ్యాంగ్. అందుకని ఈ తప్పుడు ప్రచారాలు. వీళ్లకు నిజాలతో పనిలేదు, వీళ్ల అబద్ధాల వల్ల ఇంకొకరి మనసు బాధపడుతుందన్న ఆలోచన లేదు. దేవుడు చూస్తున్నాడన్న స్పృహ అంతకంటే లేదు. వీళ్లకు కావాల్సిందల్లా వీళ్ల స్వార్థం. అన్న రాకముందు పొలిటికల్‌గా బాగా యాక్టివ్‌గా ఉన్నానని, పార్టీ ఆఫీసుకు కూడా వెళ్లానని, అన్న వచ్చిన తర్వాత కనిపించడం మానేశానని అంటున్నారు. అన్న లేనప్పుడు నేను పొలిటికల్‌గా యాక్టివ్‌గా ఉన్నానంటే.. అప్పుడు ఆ అవసరం ఉంది కనుక ఉన్నాను.. అప్పుడు పాదయాత్ర అవసరమైంది కనుక అది చేశాను. ఇప్పుడు అన్న వచ్చాడు. అన్న చాలా బాగా చూసుకుంటున్నాడు.. ఇప్పుడు నా అవసరం లేదు. అవసరమైనప్పడు నేను ఉన్నాను. అవసరం వస్తే మళ్లీ ఉంటాను. కానీ అవసరం లేనప్పుడు నేను ఉన్నాను అంటే, అది అనవసరంగా ఉన్నట్లు అవుతుంది కదా! నాన్నను చూడ్డానికి ఇడుపులపాయకు అన్న వెళ్లాక ఒంటరిగా వెళ్లాను. చాలామంది మనుషులుంటారు. నాకు వ్యక్తిగతంగా నాన్న దగ్గర ఒంటరిగా కూర్చోవడమే ఇష్టం. అదేమైనా నేరమా? మా నాన్న దగ్గరకు నేను ఎలా వెళ్లాలి? ఎలా కూర్చోవాలి? అన్నది కూడా ఈ ఎల్లో గ్యాంగే నిర్ణయిస్తుందా? ఏమిటండీ ఇది? ఐయామ్ ఎ ప్రైవేట్ పర్సన్. నా గురించి ఇంత చర్చ అవసరమా? ఇన్ని అబద్ధాలు అవసరమా? నాకు అన్నకు ఏ విభేదాలూ లేవు. ఏ మనస్ఫర్థలూ లేవు, రావు. అన్నకు నన్ను తన పెద్ద కూతురుగా చూసుకునేంత పెద్దమనసు దేవుడిచ్చాడు. నాన్న, అమ్మ తర్వాత ఈ ప్రపంచంలో నా మేలు కోరేవారిలో అన్న మొదటివాడు. పాదయాత్ర చేసినన్ని రోజులూ ప్రతిరోజూ నా కోసం చాలా బాధపడ్డాడు. పాప ఎలా ఉందో, ఎలా చేస్తుందో, ఎండలో ఎలా నడుస్తుందో, రోజూ 14 కిలోమీటర్ల కంటే ఎక్కువ పెట్టొద్దండీ.. ఎండలుంటే పన్నెండే పెట్టండి.. పదే చేయండి.. అని పదే పదే చెప్పి పంపించేవాడు. అన్న ఈజ్ వెరీ ప్రొటెక్టివ్ అబౌట్ మి. నా మీద ఈగ కూడా వాలనీయడు. నాక్కూడా అన్నంటే ప్రాణం. అన్నకు ఇబ్బంది కలిగించేది నేను ఎప్పటికీ ఏదీ చేయను. అసలు నాన్న, అమ్మ మమ్మల్ని ఎలా పెంచారో, ఎంత బాండెడ్‌గా పెంచారో... ఈ అబద్ధాలు ప్రచారం చేస్తున్నవారికి మామూలు భాషలో విడమర్చి చెప్పినా అర్థం చేసుకునేటంత మనసులు వీరికి లేవేమో అనిపిస్తోంది. మమ్మల్నే కాదు... అనిల్, వదిన కూడా... నలుగురం చాలా బాగుంటాం. అన్నకు నా గురించి బాగా తెలుసు. నేను ఏదైనా చేయాలనుకుంటే, ఎంత కమిటెడ్‌గా చేస్తానో తెలుసు. నేను గనుక నోరు తెరిచి.. ‘అన్నా నాకు రాజకీయాల్లోకి రావాలనుంది. నాకు ఈ సీటు ఇయ్యన్నా’ అంటే.. కాదంటాడా.. అఫ్కోర్స్ నాట్. దట్స్ ఆల్సో ఎ ఫ్యాక్ట్. నిజానికి అన్నే నాతో అన్నాడు... పాలిటిక్స్‌లోకి వస్తానంటే, వై నాట్ పాపా... మన పార్టీకి వ్యూహాత్మకంగా మంచి చర్య అవుతుందని అన్నాడు. ఇంకో మాట కూడా అన్నాడు.. నువ్వు వస్తానంటే.. రామునికి లక్ష్మణుడు తోడు ఉన్నట్లే. అది చాలా గ్రేట్ కాంప్లిమెంట్.. నాకు రామాయణం గురించి, మహాభారతం గురించి పెద్దగా తెలియదు.. కానీ అది చాలా గ్రేట్కాంప్లిమెంట్ అని మాత్రం తెలుసు. రామ్: కడప కాదంటున్నారు... మరి రాజకీయాలు ఎక్కడి నుంచి.. వేర్ డు యు వాంట్ టు స్టార్ట్ యువర్ పొలిటికల్ లైఫ్? షర్మిల: (నవ్వుతూ) కడప నుంచి నిల్చోనని అనుకున్నానని తప్ప... ఇంకెక్కడి నుంచైనా నిలబడతానని ఎప్పుడన్నాను... రామ్: ఎక్కడ నిలబడినా కూడా ఆంధ్రరాష్ట్రంలో ఉన్న అభిమానం వల్ల మీరు గెలుస్తారని ప్రజలే చెప్పారని మీరంటున్నారు కదా.. షర్మిల: నేను ఎక్కడి నుంచి నిల్చున్నా... గెలుస్తానన్న నమ్మకం ఉందని చెప్పాను గాని... నిల్చుంటున్నానని ఎప్పుడన్నాను? రామ్: మీలాంటి వాళ్లు రాజకీయాల నుంచి దూరంగా ఉంటే, సేవాగుణం ఉన్నవాళ్లు, రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలనుకునేవాళ్లు, వాళ్లకు మీరు ఎలాంటి సిగ్నల్ పంపిస్తారు. మీ కుటుంబం సాధారణంగా ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే ఎంకరేజ్ చేసే కుటుంబం. షర్మిల: మనిషికి మనిషి సేవ చేయడం ఒక్క రాజకీయాల వల్లే అవుతుందని నేను అనుకోను. మనిషికి మనిషి ఎన్నోరకాలుగా చేయవచ్చు. సేవ అందుకునే వాడికి సేవ చేస్తున్నవారు ఎవరో తెలియకుండా చేయడం ఉన్నతమైన సేవ అంటారు. కేవలం గొప్పలు చెప్పుకోవడానికి మాత్రమే సేవలు చేస్తే.,, సేవాభావమే చచ్చిపోతుందని అంటారు. కాబట్టి ఒక అపరిచితుడిలా అజ్ఞాతంలో ఉండీ సేవ చేయొచ్చు లేదా స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా సేవ చేయొచ్చు. నాన్న రాజకీయాల్లోకి రాక ముందే ఒక డాక్టర్‌గా ఉచితంగా సేవచేశారు. నాన్న మొదలుపెట్టిన హాస్పిటల్, కాలేజెస్, స్కూల్స్... ఈరోజు వరకు కూడా కొనసాగుతున్నాయి. అమ్మ అయితే నాన్న ముఖ్యమంత్రి అయినరోజు నుంచి రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలని, ప్రతి ప్రాజెక్టు, ప్రతి ప్రోగ్రాం, ప్రతి స్కీమూ రాష్ట్ర ప్రజలకు సక్రమంగా చేరాలని, రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ప్రతిపూటా ప్రార్థించేవారు. సేవ చేయడానికి పదవే ఉండనవసరం లేదు.. డబ్బే ఉండనవసరం లేదు. సేవ చేయడానికి అన్నింటికంటే ముఖ్యమైంది, కావాల్సినది పెద్ద మనసు. రామ్: సేవ చేయాలన్న ఆకాంక్ష అంత గొప్పగా ఉన్నప్పుడు, రాజకీయాల్లోకే రావచ్చు కదా. ఇప్పుడు చేస్తున్న సేవ కంటే గొప్పగా చేయొచ్చు కదా. షర్మిల: అదే కదా నాన్న చేసింది. అదే కదా అన్న ఎంచుకున్నది. ఓదార్పుయాత్ర చేసినప్పుడు అన్న ప్రజలను చాలా దగ్గరగా చూశారు. సామాన్యుల ఇళ్లలో, పూరి గుడిసెల్లో గంటల తరబడి ఎన్నో వందల కుటుంబాలతో గడిపారు. వాళ్ల జీవితాలను దగ్గరగా చూశారు. వారి జీవితాలను అర్థం చేసుకున్నారు. కనుకనే అన్నకు రాజకీయాల్లో కొనసాగాలన్న దీక్ష పెరిగింది. నాన్న పోయాక అంతా శూన్యంలా అనిపించేది. అంతా నిస్తేజంగా ఉండేది. జీవితం మన కోసం కాకుండా, ప్రజల కోసం జీవించడంలో ఇంకా ఎక్కువ ఆనందం ఉందని, అర్థం ఉందన్న ఆలోచన అన్నకు ఓదార్పులోనే కలిగింది. కనుకనే ఈ రోజు రాజకీయాలు అంత ఫోకస్డ్గా, అంత చిత్తశుద్ధితో, అంత నిజాయితీతో చేయగలుగుతున్నాడు. సో యెస్.. పాలిటిక్స్ ఈజ్ ఎ గుడ్‌లైన్. రామ్: మళ్లీ జగనన్నయ్య రాజకీయ ప్రస్థానం గురించే మాట్లాడారు.. మీ విషయాన్ని మాత్రం చాలా చాకచక్యంగా దాటేస్తున్నారు.. రాజకీయాల్లో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా మేనేజ్ చేయగలుగుతున్నారంటే.. రాజకీయాల్లో మీరు మంచి పట్టు సాధించినట్టే.. మరి రాజకీయాలను ఎందుకు కాదనుకుంటున్నారు? ఆదరణ లేక కాదు.. ఆలోచన లేక కాదు.. అభిమానం లేక కాదు.. వై వుడ్ యు నాట్ వాంట్ టు బి ఇన్పాలిటిక్స్? షర్మిల: నాకు ఊహ తెలిసినప్పటి నుంచి రాజకీయాలే నాన్నను మా నుంచి దూరం చేస్తున్నాయని... రాజకీయాల వల్లే నాన్న మాతో లేడు... అన్న భావన నాకు చాలా కాలం ఉండేది. కనుక ఆ సబ్జెక్ట్ అంటేనే నచ్చేది కాదు. నేను ఎప్పుడైనా రూమ్‌లోకి అడుగుపెడితే, ‘పాప వచ్చేసింది, పాలిటిక్స్ ప్యాకప్’ అనేవారు నాన్న. అంత అయిష్టం ఉండేది నాకు. కానీ నాన్న చాలా మంచి రాజకీయ నాయకుడిగా, చాలా గొప్ప స్టేట్స్‌మన్‌గా నిలిచిపోయాడు. అన్న కూడా మంచి రాజకీయ నాయకుడిగా చరిత్ర సృష్టించే ఒక నాయకుడిగా మిగిలిపోతాడన్న నమ్మకం నాకుంది. కోట్లమంది ప్రజలకు, పేదలకు ఎవరూ ఊహించనంత గొప్ప మేలు చేస్తాడన్న నమ్మకం నాకుంది. నాకు అన్న మనసు తెలుసు. అన్న సామర్థ్యమూ తెలుసు. ఇది తప్పకుండా జరుగుతుంది. ఇందులో నాకు ఏ మాత్రమూ అనుమానం లేదు. అంతేకాకుండా, రాజకీయాలంటే ఒక పార్ట్‌టైమ్ ప్రొఫెషన్లాంటిది కాదు. అప్పుడప్పుడు వెళ్లి, అప్పుడప్పుడు చూసుకొనేదీ కాదు. రాజకీయాలంటే... పదిమందిని నీ కింద పెట్టుకుని జీతమిచ్చి చేసే వ్యాపారంలాంటిది కూడా కాదు. రాజకీయమంటే ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఈ టైమ్ ఆ టైమ్ అని తేడా లేకుండా అందుబాటులో ఉండడం. రాజకీయాలంటే... వారి ప్రతి సమస్యా తీర్చే ప్రయత్నం చేయడం. రాజకీయాలంటే ఇట్స్ ఎ గ్రేట్ కమిట్మెంట్. ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్రామిస్. వాట్ యు ఆర్ మేకింగ్ టు గాడ్ అండ్ టు ద పీపుల్. ఇట్స్ ఎ టైమ్ డిమాండింగ్ ప్రొఫెషన్. అంత టైమ్ నేను ఇవ్వలేనేమో... నాకు ఒక బాబు, ఒక పాప... అంజలి అండ్ రాజా. మా పెద్దమ్మకు కూతురు లేదని నేను తనను కూడా అమ్మా అని పిలుస్తాను. పెద్దమ్మ.. నా కూతురుతో అన్నారట.. ‘జిల్లీ, అమ్మ ఎంపీ అయితే బాగుంటుందని చాలామంది అంటున్నారు’ అని! ‘లేదు అమ్మమ్మా... అమ్మ పాలిటిక్స్‌లోకి వెళితే.. ఇక ఫ్యామిలీ లైఫ్ చచ్చిపోతుంది’ అందట జిల్లీ. అది నిజమని నేను అనడం లేదు. కానీ నా పిల్లలకు అర్థం చేసుకునేటంత వయసు రాలేదేమో అని నా అభిప్రాయం. రామ్: మీ మాటల్లో వైఎస్ రాజశేఖరరెడ్డిగారి మంచితనం కనపడుతుంది. వారు మీతో పాటు పంచుకున్న కుటుంబ విలువలు కనపడుతున్నాయి. ఇవన్నీ వింటుంటే ఇంకో ప్రశ్న అడగబుద్ధేస్తుంది... రాజకీయాల్లో ఉంటే అభద్రతాభావం, అల్పత్వం. మీకు గుర్తుందో లేదో... మీరు పాదయాత్రకు వెళ్లిన వెంటనే అభిమానాలు వెల్లువెత్తాయి. చాలామంది వచ్చి మిమ్మల్ని కలవడం.. చాలా సక్సెస్‌ఫుల్‌గా సాగింది. అది చూసి వెంటనే కొన్ని రాజకీయ పార్టీలు మీ మీద, మీ భర్త అనిల్‌గారి మీద ఏవేవో సందేహాలు, అనుమానాలు సృష్టించారు. అందుకే మీరు ఈ రాజకీయాల్లోకి రావడంలేదేమోనని అనుమానం! షర్మిల: మీడియాకు అనుమానం కొత్తకాదు. మాకు నమ్మకం కొత్త కాదు. ప్రజలకు మా మీద ఉన్న నమ్మకం కొత్త కాదు.. రామ్: నీచ రాజకీయాలు చూసి, అలాంటి బురద రాజకీయాల్లో కాలు పెట్టడానికి సందేహిస్తున్నారా? షర్మిల: నిజమే. రాజకీయాల్లో చాలా బురద ఉంది. కానీ బురదలోనే కమలం వికసిస్తుందంటారు. మేం మాట పడ్డాం... అంటే, ఒక మంచి పని చేస్తూ మాటపడ్డాం. ఫర్వాలేదు.. నాకు, అనిల్‌కు ఏ బాధా లేదు. మా మీద పడిన బురదను ప్రజలు తమ అభిమానంతో కడిగేశారు. బురద కాదు కారణం... బురదకు భయపడి కాదు రాజకీయాల్లోకి అడుగుపెట్టంది. రాజకీయాలు నాట్ మై కప్ ఆఫ్ టీ. మీరు ఎన్నిసార్లు ఎలా తిప్పి తిప్పి అడిగినా నా సమాధానం అంతే. రామ్:పార్లమెంటుకు వెళ్లనంటున్నారు, అసెంబ్లీకి రానంటున్నారు. మీ భవిష్య ప్రణాళిక ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? షర్మిల: ఎక్కడికి రానన్నా... ఎక్కడికి పోనన్నా... కర్తవ్యం పిలిచినప్పుడు బాధ్యతగా పనిచేస్తాను. మాటిస్తున్నాను... నేను జగనన్న బాణాన్ని. జగనన్న వదిలినప్పుడు ఎక్కడికైనా దూసుకుపోతాను, ఎందాకైనా దూసుకుపోతాను. నాన్న ఆశయాల కోసం, అన్న కోసం జాన్ భీ హాజర్ హై! రామ్: మీకు, జగనన్నకు మధ్యలో మనస్పర్థలు వచ్చాయన్న ప్రచారం జరుగుతున్న సమయంలో నాకు ఒక విషయం గుర్తొచ్చింది... అప్పుడే మీరు పాదయాత్రకు వెళతానంటే జగనన్న ఒప్పుకున్నారు. అప్పుడు భారతమ్మ జగనన్నతో జైల్లో అడిగారట - ‘అందరూ మీకు, షర్మిలమ్మకు మధ్య ఏవో మనస్పర్థలు తెచ్చి కుటుంబాన్ని రెండుగా చీల్చేస్తారని అంటున్నారు. పాపను పాదయాత్రకు పంపిస్తే అలా జరుగుతుందంటున్నారు. ఏం చేద్దాం జగన్?’ అని! అప్పుడు జగనన్న చెప్పారట - ‘నేను నా చెల్లెల్ని నమ్మలేని రోజు రాజకీయాలనే వదులుకుంటాను. నాకు నా చెల్లెలు కంటే రాజకీయాలు గొప్పవి కావు’ అని! దానిపై మీ స్పందన... షర్మిల: థాంక్ గాడ్.. అంత మంచి అన్నను ఇచ్చినందుకు. విశ్వాసం, నమ్మకం లేనిదే మానవ సంబంధాలే లేవంటారు. మాది రక్త సంబంధం... థాంక్ గాడ్... పూర్తి ఇంటర్వ్యూ ఈరోజు ఉదయం 10 గంటలకు సాక్షి టీవీలో... -
సమైక్య శంఖారావం సభ ఎలా పెడతారు ? : చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: గత ఏడాది అక్టోబర్ 2వ తేదీ నుంచి తాను చేసిన పాదయాత్ర ఫలాలు అందేసమయానికి తనను రాజకీయంగా దెబ్బతీయడానికే కాంగ్రెస్ పార్టీ రాష్టవ్రిభజన నిర్ణయం తీసుకుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. మంగళవారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిని నిందించడానికే ఎక్కువ సమయం కేటాయించారు. సమైక్య శంఖారావం పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ హైదరాబాద్‌లో ఎలా సభ పెడుతుందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కు కావడం వల్లే జగన్మోహన్రెడ్డికి బెయిల్ వచ్చిందన్నారు. జగన్ తాను సెక్యులరిస్ట అని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. వైఎస్సార్సీపీ, ఎంఐఎం, సీపీఎం మాత్రమే సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నాయని జగన్మోహన్రెడ్డి చెబుతున్నారని, అయితే ఈ విషయంలో ఆయన ఎన్నో టర్నలు తీసుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో సీట్లు సాధించకపోతే ఆ పార్టీకి మనుగడ ఉండదన్నారు. కేంద్రంలో నోట్ తయారు కాకముందు అసెంబ్లీని సమావేశపరిచి సమైక్య తీర్మానం చేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు, జగన్మోహన్రెడ్డి గవర్నర్‌కు వినతిపత్రం అందచేశారని గుర్తుచేస్తూ అసెంబ్లీ సమావేశ పరిస్తే ఏమవుతుందో చెప్పలేదన్నారు. సమైక్యవాదం కోసం తానొక్కడినే పోరాడుతున్నట్లు జగన్ చెబుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మధ్య మధ్యలో ఒక విలేకరుల సమావేశానికి పరిమితం అవుతున్నారని తెలిపారు. వీరెవరికి తనను విమర్శించే అర్హత లేదన్నారు. రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయాలనీ, జేఏసీలను, భాగస్వాములను పిలిచి చర్చలు జరపాలని తాను విజ్ఞప్తి చేసినా కేంద్రం పట్టించుకోలేదని చంద్రబాబు మండిపడ్డారు. కాగా, ఈ విలేకరుల సమావేశానికి సాక్షి ని అనుమతించలేదు. వివిధ రూపాల్లో సేకరించిన సమాచారం మేరకు ఈ వార్తను ఇస్తున్నాం. సాక్షి ని అనుమతించి ఉంటే ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేది. మీరు సీమాంధ్రలో చేపట్టబోయే ఆత్మగౌరవ యాత్రలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరతారా? కోరరా? సూటిగా సమాధానం చెప్పండి? సమైక్యంగా ఉంచాలని కోరుతూ జేఏసీ తీర్మానం చేసి మీ వద్దకొస్తే సంతకం చేస్తారా? చేయరా? అవిశ్వాస తీర్మానం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోకుండా కాపాడినందుకు ఐఎంజీ, ఎమ్మార్ లాంటి కుంభకోణాల్లో మీపై విచారణ జరగడం లేదన్న విమర్శలున్నాయి. మీరేమంటారు? కేబినెట్ నోట్ రాకముందే రాష్ట్ర అసెంబ్లీని తక్షణం సమావేశపరిచి సమైక్యం కోసం తీర్మానం చేసి పంపాలన్న జగన్మోహన్రెడ్డి ప్రతిపాదన మీకు రుచించినట్టు లేదు. సమస్య ప్రధానమైనప్పుడు మీరే అందుకు చొరవ తీసుకుంటే మిగతా పార్టీలు కలిసొస్తాయి కదా? మీరే ఎందుకు ఆ పని చేయరు? ఏ టర్న, బీ టర్న, పీ టర్న అంటూ ఇలా ఇంకెన్ని టర్నలు తీసుకుంటారని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు కదా? ఇంతకూ మీ పార్టీ వైఖరేదో చెప్పి అందరి నోళ్లు మూయించొచ్చు కదా? -
మహానేత వైఎస్ఆర్కు నివాళి
-
నాలుగేళ్లైనా మానని గాయం
-
వై.ఎస్.హయాంలో అభివృద్ధి బాటలో పయనించిన రాష్ట్రం
-
నేడు మహానేత వైఎస్ఆర్ నాలుగో వర్ధంతి
-
నేడు మహానేత నాలుగో వర్ధంతి
ప్రజల్ని కుటుంబసభ్యులుగా పరిగణించిన విలక్షణనేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడడమే పదవికి సార్థకతగా భావించిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర సాగించి ప్రజల బాగోగు లను అధ్యయనం చేసిన తన పాలనాకాలంలో అన్ని వర్గాలకూ మేలు చేసే ఎన్నో పథకాలను అమలు చేశారు. ఆరోగ్యశ్రీ, వృద్ధాప్య పింఛన్లు, ఫీజు రీ యింబర్స్‌మెంట్, గృహనిర్మాణం, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వంటి పథకాలతో విలక్షణనేతగా, సంక్షేమ ప్రదాతగా ఖ్యాతినొం దారు. చరిత్రలోనే అరుదైన రీతిలో జలయజ్ఞం పేరిట ఎన్నో ప్రాజెక్టుల నిర్మాణానికి సంకల్పించారు. రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా రూపొందించాలని అనుకున్నారు. మహిళల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారు. అందుకే భౌతి కంగా ఈ లోకం నుంచి నిష్ర్కమించినా కోట్లాది హృదయాల్లో దైవసమానునిగా కొలువుదీరారు. హెలికాప్టర్ ప్రమాదం లో మరణించి నాలుగేళ్లయినా నిష్కల్మషమైన నవ్వుతో కూడిన ఆయన మోము జనం మనోఫలకాలపై చెక్కుచెదరకుం డా ఉంది. సోమవారం రాష్ట్రమంతటా మహానేత వైఎస్ నాలుగో వర్ధంతిని ఘనంగా జరుపుకొనేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. వివిధ వర్గాల ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అనేక ప్రాంతాల్లో వైఎస్ విగ్రహాలకు నివాళులు అర్పించడంతో పాటు అన్నవస్త్రదానాల వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయనున్నారు. వైఎస్ పథకాలతో లబ్ధి పొందినవారంతా ఆయన లేని లోటును జ్ఞప్తికి తెచ్చుకుంటూ అనేక చోట్ల వైఎస్ ఫొటోలు పెట్టుకుని కార్యక్రమాల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు.