ఆ స‌భ స‌క్సెస్‌కు కారణం ఇదే.. మంచిర్యాలలో జై కొట్టించింది వారే.. | Clp Leader Bhatti Vikramarka Jai Bharat Satyagraha Sabha Success Reason | Sakshi
Sakshi News home page

ఆ స‌భ స‌క్సెస్‌కు కారణం ఇదే.. మంచిర్యాలలో జై కొట్టించింది వారే

Published Sat, Apr 15 2023 1:23 PM | Last Updated on Sat, Apr 15 2023 1:46 PM

Clp Leader Bhatti Vikramarka Jai Bharat Satyagraha Sabha Success Reason - Sakshi

మంచిర్యాలలో నిర్వహించిన జై భార‌త్ స‌త్యాగ్ర‌హ స‌భ కోసం సీఎల్‌పీ నేత భ‌ట్టి విక్ర‌మార్కకు కొన్ని కలిసివచ్చాయి. సభను ప్లాన్‌ చేయడం నుంచి సక్సెస్‌ ఫుల్‌గా జరిగే వరకు భట్టి విక్రమార్కకు అండగా నిలిచింది ఓ టీం. వారెవరో కాదు దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్‌ రాజశేఖరరెడ్డి అభిమానుల బృందం. వైఎస్సార్‌ను అత్యంత అభిమానించే వారిలో  సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క ఒక‌రు. ఎంతంటే దేవుడి ఫోటోల మ‌ధ్య లో వైఎస్సార్ ఫోటో పెట్టి పూజించేంత అభిమానం భ‌ట్టికి ఉంది. దీనికి కార‌ణం భ‌ట్టి రాజ‌కీయాల్లో ఎదగడానికి అన్ని ర‌కాలుగా స‌పోర్ట్‌ చేసింది వైఎస్సారే.

ఇటు వైఎస్సార్‌ అభిమానులకు కూడా భ‌ట్టి అంటే అంతే ఇష్టం. భట్టి పాద‌యాత్ర‌ తలపెట్టినప్పుడు అన్ని తామై వెఎస్సార్ అభిమానులే చూసుకుంటున్నారు. జై భార‌త్ స‌త్యాగ్ర‌హా స‌భ స‌క్సెస్ వెనక కూడా వైఎస్సార్ అభిమానులే బ్యాక‌ప్ వ‌ర్క్ చేశారన్న టాక్ ఉంది. అందులో ముందు చెప్పుకోవాల్సిన పేరు ప్రేమ్ సాగ‌ర్ రావు. మంచిర్యాల స‌భ కు అన్ని తానై ఏర్పాట్లు చేసారు ప్రేమ్ సాగ‌ర్ రావు. ఇదే జాబితాలో మ‌రో ఇద్దరు శ్రీధ‌ర్ బాబు , జీవ‌న్ రెడ్డి. వీరిద్దరూ మంచిర్యాలలోనే ఉండి స‌భ స‌క్సెస్ కోసం కృషి  చేసారు.

సీఏల్పీ నేతగా ఉన్నప్పుడు వైఎస్సార్ ప్రజా క్షేత్రంలోకి వెళ్లి తన పాదయాత్ర ద్వారా ఎంతో మంది ప్రజలను కలిశారు, వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. నేన్నునానంటూ భరోసా ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. రెండు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ను గెలిపించి ముఖ్యమంత్రి అయ్యారు డాక్టర్‌ వైఎస్సార్‌. ఇప్పుడు సీఏల్పీ నేతగా ఉన్న భట్టి కూడా వైఎస్సార్ బాటలోనే పాదయాత్ర ద్వారా ప్రజాక్షేత్రంలోకి దిగారు. వైఎస్సార్ సెంటిమెంట్ వైఎస్సార్ అభిమానిగా తనకు కలసి వస్తుందని ఆశిస్తున్నారు సీఏల్పీ నేత భట్టి.
పొలిటికల్ ఎడిటర్, సాక్షి వెబ్‌డెస్క్‌

చదవండి: కాంగ్రెస్‌లో సరికొత్త ముసలం.. సచిన్‌ పైలట్‌కు కోపం ఎందుకు వచ్చింది?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement