రాష్ట్రంలో ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు తాను నవంబర్ 6వ తేదీ నుంచి చేపట్టనున్న ‘ప్రజా సంక ల్పం’ పాదయాత్రలో మొత్తం మీద రెండు కోట్ల మందికి చేరువ కావడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నానని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వెల్లడించారు. ఈ పాదయాత్రకు ‘ప్రజా సంకల్పం’ అని పేరు పెడుతున్నట్లు ఆయన పార్టీ శ్రేణుల కరతాళధ్వనుల మధ్య ప్రకటిం చారు. 3,000 కిలోమీటర్ల తన యాత్రలో దారి పొడవునా 45 లక్షల మందిని ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం ఉంటుందన్నారు.