
భట్టివి అసందర్భ వ్యాఖ్యలు: కొప్పుల
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ వాయిదాపై కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క అసందర్భమైన వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. సభలో అన్ని పార్టీల సభ్యుల దృష్టికి తీసుకువెళ్లి, వారి అభి ప్రాయాలు తెలుసుకున్న తర్వాతనే ఒక గంట ముందుగా సభను వాయిదా వేశామని తెలిపారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత కొప్పుల మీడియా పాయింట్‌లో మాట్లా డారు. చర్చలో పాల్గొనే శక్తి లేని కాంగ్రెస్, ఒక గంట ముందుగా సభను వాయిదా వేస్తే ప్రభుత్వం పారిపోయిం దని అనడం అవివేకమని తెలిపారు.
అందరి అవ సరాల మేరకే సభను వాయిదా వేశామని, కాంగ్రెస్ సభ్యులు చిన్నారెడ్డి, జీవన్‌రెడ్డి, సంపత్‌లకు ఈ విషయం తెలుసన్నారు. కాంగ్రెస్ హయాంలో రోజులకు రోజులు సభను వాయిదా వేసిన విషయాన్ని భట్టి మరిచిపోయారా అని ప్రశ్నించారు. సభలో మాట్లాడే సత్తా లేకే భట్టి అన్యాయంగా బయట మాట్లాడుతున్నారని విమర్శించారు. శుక్రవారం టీఎస్ ఐపాస్ పైనే చర్చ సాగుతుందని, కాంగ్రెస్ సభ్యులకు దిమ్మతిరిగే సమాధానం ఇస్తామన్నారు.