లబ్ధిదారులకు వాహనాలు అందజేస్తున్న కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలోని దాదాపు 17 లక్షల కుటుంబాలకు దళితబంధు పథకం అందుతుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం కరీంనగర్‌లోని అంబేద్కర్ మైదానంలో 393 మంది దళితబంధు లబ్ధిదారులకు 202 వాహనాల (202 యూనిట్లుగా, 76 హార్వెస్టర్లు, 12 జేసీబీలు, 15 డీసీఎం వ్యాన్‌లు, 10 వరినాటు యంత్రాలు, 4 టిప్పర్లు, 3 మినీ బస్సులు, 2 టాటా హిటాచీ ఎక్స్‌కెవేటర్లు, 1 మహీంద్రా స్కార్పియో, 79 గూడ్స్ వాహనాలు)ను మంత్రి గంగుల కమలాకర్‌తో కలసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతీ దళితుడు లక్షాధికారి కావాలన్న కేసీఆర్ సంకల్పానికి ఈ పథకం నిదర్శనమన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా రూ.38 కోట్లకుపైగా విలువైన వాహనాలను కానుకగా ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్, ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment